ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా.. జపాన్‌ మహిళ! | Tomiko Itika Is The Oldest Japanese Woman In The World | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా.. జపాన్‌ మహిళ!

Published Fri, Aug 23 2024 10:44 AM | Last Updated on Fri, Aug 23 2024 10:46 AM

Tomiko Itika Is The Oldest Japanese Woman In The World

జపాన్‌కు చెందిన 116 ఏళ్ల టొమికో ఇటుకా ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా నిలిచారు. ఆమె గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకున్నట్లు అమెరికాకు చెందిన జెరోంటాలజీ రీసెర్చ్‌ గ్రూప్‌ బుధవారం ప్రకటించింది. ఇంతకీ ఆమె పుట్టిందెప్పుడో తెలుసా? రైట్‌ బ్రదర్స్‌ ఐరోపా, అమెరికాల్లో తొలిసారిగా విమానాలను ప్రారంభించిన 1908లో. అదే ఏడాది ఈఫిల్‌ టవర్‌ నుంచి తొలి సుదూర రేడియో సందేశం పంపించారు. ఇటుకా జపాన్‌లోని నగరమైన అషియా నివాసి.

ఆమె 70వ ఏట జపాన్‌లోని 3,067 మీటర్ల ఎత్తయిన ఒంటాకే పర్వతాన్ని రెండుసార్లు అధిరోహించారు. అది కూడా బూట్లు ధరించకుండా స్నీకర్స్‌తో ఎక్కి గైడ్‌నే ఆశ్చర్యపరిచారు. 100 ఏళ్ల వయసులో ఆషియా మందిరంలోని అతి పొడవైన రాతి మెట్లెక్కారు. ఇప్పటిదాకా అత్యంత వృద్ధురాలిగా ఉన్న స్పెయిన్‌కు చెందిన మరియా బ్రాన్యాస్‌ మొరెరా (117) మంగళవారం కన్నుమూయడంతో ఇటుకాకు రికార్డు దక్కింది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం బతికిన వ్యక్తి ఫ్రెంచ్‌ మహిళ జీన్‌ లూయిస్‌ కాల్మెంట్‌. ఆమె 122 ఏళ్ల 164 రోజులు జీవించి 1997లో మరణించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement