సియోల్: దక్షిణ కొరియాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. దేశంలో ఎమర్జెన్సీ విధించడానికి సంబంధించిన విషయాలను సేకరించేందుకు పోలీసులు తనిఖీలు చేపట్టినట్టు కొరియన్ టైమ్స్ తెలిపింది.
వివరాల ప్రకారం.. ఇటీవల దక్షిణ కొరియాలో అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. అనంతరం, దేశవ్యాప్తంగా రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ క్రమంలో ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్టు యూన్ మరో ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు యూన్‌పై దక్షిణ కొరియా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే అధ్యక్ష కార్యాలయంలో.. నేడు సియోల్ మెట్రోపాలిటన్ పోలీసులు, నేషనల్ అసెంబ్లీ పోలీస్ గార్డ్స్ సోదాలు చేశారు. అయితే, అధ్యక్ష కార్యాలయంపై పోలీసులు సోదాలు చేసిన సమయంలో యూన్ ఆఫీసులో లేరని కొరియన్ టైమ్స్ వెల్లడించింది.
ఇక, అంతకుముందు.. అంతకుముందు డిసెంబర్ 9న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించారు. ఆయనపై దర్యాప్తు ప్రారంభించినందుకు గానూ అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. మరోవైపు.. ఎమర్జెన్సీ ప్రకటనలో మాజీ రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్ పాత్ర ఉందనే ఆనుమానంతో ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
చదవండి: ఐసిస్ ఉగ్రభూతం మళ్లీ విజృంభిస్తుందా?
ఇక, మార్షల్ లా ప్రకటన నేపథ్యంలో అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, కిమ్ యోంగ్ హ్యూన్‌లను పదవుల నుంచి తప్పించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలోనే హ్యూన్‌ను పదవి నుంచి తప్పిస్తున్నట్లు దేశాధ్యక్షుడే ప్రకటించారు. ఆయన స్థానంలో చోయ్ బ్యూంగ్ హ్యూక్‌ను నియమించారు.
South Korean police raided President Yoon Suk Yeol's office and police headquarters on Wednesday as part of an investigation into the brief imposition of martial law, the Yonhap news agency reported.
Raids were also carried out at the offices of the Seoul Metropolitan Police. pic.twitter.com/G5yLytJWJy— VIVERO del bosque (@viverodelbosque) December 11, 2024
Comments
Please login to add a commentAdd a comment