
సియోల్:దేశంలో ఎమర్జెన్సీ విధించినందుకు దక్షిణ కొరియా అధ్యక్షుడు పశ్చాత్తాపపడ్డారు. ‘తల వంచి అడుగుతున్నాను. నన్ను క్షమించండి..మరోసారి దేశంలో ఎమర్జెన్సీ విధించను’అని యూన్ సుక్ యోల్ దేశ ప్రజలను విజ్ఞప్తి చేశారు. మార్షల్ లా విధించి ప్రజల్లో భయాందోళనలు సృష్టించానని యోల్ తన తప్పు ఒప్పుకున్నారు.
ప్రభుత్వ పెద్దగా ఉన్న బాధ్యతతోనే ఎమర్జెన్సీ విధించానని వివరణ ఇచ్చుకున్నారు. ఎమర్జెన్సీ విధించినందుకు న్యాయపరమైన విచారణ ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇక నుంచి దేశ భవిష్యత్తు, తన భవిష్యత్తు తన పార్టీ నిర్ణయానికి వదిలేస్తున్నాన్నారు. దేశాన్ని పాలన విషయాన్ని తనపార్టీ, ప్రభుత్వం చూసుకుంటాయని తెలిపారు.
ఇలాంటి తప్పు మరోసారి చేయనని యోల్ స్పష్టం చేశారు. యోల్‌పై మోపిన అభిశంసన తీర్మానంపై శనివారం దక్షిణ కొరియా పార్లమెంట్‌లో ఓటింగ్ జరగనుంది. ఈ ఓటింగ్‌కు ముందు శనివారం(డిసెంబర్ 7) ఓ టెలివిజన్ ఛానల్‌లో ప్రసంగిస్తూ బహిరంగ క్షమాపణ కోరడం గమనార్హం.
ఇదీ చదవండి: నియంతకు పరాభవం