త్వరలో ద.కొరియా అధ్యక్షుడి అరెస్టు..? | South Korea President May Face Arrest Soon | Sakshi
Sakshi News home page

త్వరలో ద.కొరియా అధ్యక్షుడి అరెస్టు..?

Published Mon, Dec 30 2024 12:06 PM | Last Updated on Mon, Dec 30 2024 12:18 PM

South Korea President May Face Arrest Soon

సియోల్‌:ఎమర్జెన్సీ వివాదం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ను వెంటాడుతోంది. ఇప్పటికే అభిశంసనను ఎదుర్కొంటున్న యోల్‌కు అరెస్టు ముప్పు పొంచి ఉంది. యోల్‌ను అదుపులోకి తీసుకునేందుకు అనుమతివ్వాలని పోలీసులు ఇప్పటికే కోర్టును కోరినట్లు సమాచారం.

కోర్టు అంగీకరిస్తే త్వరలోనే యోల్‌ను అరెస్ట్‌ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. యోల్ ఇటీవల దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించడం వివాదాస్పదమైంది. ప్రస్తుతం ఈ కేసులో అధ్యక్షుడిని పోలీసులు,రక్షణ మంత్రిత్వశాఖ,అవినీతి నిరోధక శాఖల అధికారులతో కూడిన సంయుక్త బృందం విచారిస్తోంది. 

ఇప్పటికే మూడుసార్లు పిలిచినప్పటికీ యోల్‌ విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు కోర్టును అరెస్ట్‌ వారెంట్‌ కోరారని సమాచారం. విచారణలో నేరం రుజువైతే ఆయనకు జీవిత ఖైదు లేదా మరణశిక్షవిధించే అవకాశం ఉంది. కాగా, ఇటీవల అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ దేశంలో మార్షల్‌లా విధించినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. 

తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో యోల్‌ తన అధ్యక్ష అధికారాలను, ప్రధానమంత్రికి అప్పగించాల్సి ఉంటుంది. తీర్మానం కాపీని పార్లమెంట్‌ రాజ్యాంగ కోర్టుకు పంపుతుంది. యూన్‌ భవితవ్యాన్ని రాజ్యాంగ కోర్టు 180 రోజుల్లోపు తేలుస్తుంది.

ఇదీ చదవండి: నెతన్యాహుకు శస్త్ర చికిత్స..డాక్టర్ల కీలక ప్రకటన

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement