![Arrest Warrant Issued On South Korea President](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/31/s.korea_.jpg.webp?itok=TpP06AEw)
సియోల్:సౌత్‌కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు అక్కడి కోర్టు షాక్ ఇచ్చింది. ఎమర్జెన్సీ విధించిన కేసులో యోల్‌ను అరెస్టు చేసేందుకు వారెంట్ జారీ చేసింది. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు వారెంట్ జారీ చేయాల్సిందిగా దర్యాప్తు అధికారులు తాజాగా కోర్టును కోరారు.
పోలీసుల విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది. దీంతో యోల్‌ను త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యోల్ డిసెంబర్3న దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించడం సంచలనం రేపింది. ప్రస్తుతం ఈ కేసులో అధ్యక్షుడిని పోలీసులు,రక్షణ మంత్రిత్వశాఖ,అవినీతి నిరోధక శాఖల అధికారులతో కూడిన సంయుక్త బృందం విచారిస్తోంది.
ఇప్పటికే ఈ కేసులో మూడుసార్లు పిలిచినప్పటికీ యోల్ విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు కోర్టును అరెస్ట్ వారెంట్ కోరారని సమాచారం. విచారణలో నేరం రుజువైతే ఆయనకు జీవిత ఖైదు లేదా మరణశిక్షవిధించే అవకాశం ఉంది. మరోవైపు దేశంలో మార్షల్‌లా విధించినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి.
తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో యోల్ తన అధ్యక్ష అధికారాలను, ప్రధానమంత్రికి అప్పగించాల్సి ఉంటుంది. తీర్మానం కాపీని పార్లమెంట్ రాజ్యాంగ కోర్టుకు పంపుతుంది. యోల్ భవితవ్యాన్ని రాజ్యాంగ కోర్టు 180 రోజుల్లోపు తేలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment