సియోల్: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు దేశంలో ఎమర్జెన్సీ విధించాలంటూ సిఫారసు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఆయన్ను ప్రశ్నించిన అధికారులు గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే, కిమ్ తనకుతానుగానే సియోల్ విచారణాధికారి కార్యాలయానికి వెళ్లారని, ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు అరెస్ట్ చేశారని మీడియా అంటోంది. కిమ్ కార్యాలయంతోపాటు నివాసంలోనూ తనిఖీలు చేపట్టారని చెబుతున్నారు.
ఎమర్జెన్సీ విధింపునకు దారి తీసిన పరిస్థితులపై కిమ్‌పై విచారణ కోసం 62 మంది సభ్యుల దర్యాప్తు బృందం ఏర్పాటైందని సీనియర్ ప్రాసిక్యూటర్ పార్క్ సె–హ్యూన్ వెల్లడించారు. గత వారం స్వల్ప కాల ఎమర్జెన్సీని, ఆ తర్వాత పార్లమెంట్ తొలగించడం తెలిసిందే. ఈ పరిణామానికి సంబంధించిన తొలి అరెస్ట్ ఇది. అధ్యక్షుడు యూన్‌పై శనివారం ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం అధికార పక్ష సభ్యుల గైర్హాజరుతో వీగిపోయింది. అయినప్పటికీ, త్వరలోనే మరోసారి అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రతిపక్షాలు అంటున్నాయి. మొత్తం పరిణామాలకు కేంద్ర బిందువుగా భావిస్తున్న కిమ్ మంత్రి పదవికి గురువారమే రాజీనామా చేశారు.
ఇదీ చదవండి: దక్షిణ కొరియా అధ్యక్షుడికి ఉపశమనం
Comments
Please login to add a commentAdd a comment