నెతన్యాహుకు శస్త్ర చికిత్స..డాక్టర్ల కీలక ప్రకటన | Israel Primeminister Netanyahu Underwent Surgery | Sakshi
Sakshi News home page

నెతన్యాహుకు శస్త్ర చికిత్స..డాక్టర్ల కీలక ప్రకటన

Published Mon, Dec 30 2024 9:59 AM | Last Updated on Mon, Dec 30 2024 10:46 AM

Israel Primeminister Netanyahu Underwent Surgery

టెల్‌అవీవ్‌:ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు(75)  మూత్రనా‌ళ ఇన్ఫెక్షన్‌కు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ విషయాన్ని జెరూసలెంలోని హడస్సా మెడికల్‌ సెంటర్‌ వైద్యులు వెల్లడించారు. సర్జరీ విజయవంతంగా జరిగిందని, నెతన్యాహుకు క్యాన్సర్‌ సోకలేదని తెలిపారు. నెతన్యాహు అండర్‌గ్రౌండ్‌ చికిత్సా కేంద్రంలో కోలుకుంటున్నారని ఆయన కార్యాలయం వెల్లడించింది.

ఈ అండర్‌గ్రౌండ్‌ చికిత్సా కేంద్రం మిసైల్‌ దాడుల నుంచి నెతన్యాహుకు రక్షణ కల్పిస్తుంది. నెతన్యాహుకు సర్జరీ కారణంగా ఇజ్రాయెల్‌ న్యాయశాఖ మంత్రి యారివ్‌లెవిన్‌ ప్రస్తుతం దేశ తాత్కిలిక ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు.

నెతన్యాహు కోలుకోవడానికి మరికొన్ని వారాలు పడుతుందని అధికారులు తెలిపారు. ఓ వైపు హమాస్‌తో కాల్పుల విరమణచర్చలు మరోవైపు యెమెన్‌ నుంచి హౌతి రెబెల్స్‌ దాడులు చేస్తున్న నేపథ్యంలో నెతన్యాహు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండడం అక్కడి ప్రజల్లో కొంతమేర ఆందోళన కలిగిస్తోంది.

ఇదీ చదవండి: ఇంజినీర్‌ సుచిర్‌ బాలాజీ మృతి.. మస్క్‌ కీలక ట్వీట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement