సియోల్: దక్షిణ కొరియాలో రాజకీయంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎమర్జెన్సీ విధించిన కొన్ని గంటల్లో దాన్ని ఉపసంహరించుకున్నట్టు మరో ప్రకటన చేశారు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్. దీంతో, ఎమర్జెన్సీ ప్రకటించిన ఆరు గంట్లలోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.
స్థానిక కాలమానం ప్రకారం తెల్లావారుజామున 4:30 గంటలను అధ్యక్షుడు యూన్ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘అత్యవసర పరిస్థితిని ఎత్తివేయాలని జాతీయ అసెంబ్లీ నుండి డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాము. మార్షల్ లా కార్యకలాపాల కోసం జాతీయ అసెంబ్లీ అభ్యర్థనను అంగీకరిస్తాము. కేబినెట్ సమావేశం ద్వారా ఎమర్జెన్సీని ఎత్తివేస్తాము అని ప్రకటించారు.
South Korean President Yoon Suk Yeol said he will rescind his martial law decree, giving in to the parliament’s opposition just hours after his dramatic move imposing it that shook markets and surprised other world leaders.
Listen to the story or get the full story in the 1st… pic.twitter.com/aKAvMczxqD— Bangkok Post (@BangkokPostNews) December 4, 2024
అంతకుముందు.. అధ్యక్షుడి నిర్ణయాన్ని ఖండిస్తూ జాతీయ అసెంబ్లీ అర్ధరాత్రి సెషన్‌లో దక్షిణ కొరియా ఎంపీలు మార్షల్ లా విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా ఓటు వేశారు. 300 మంది చట్ట సభ్యుల్లో అధికార, ప్రతిపక్ష నేతలు 190 మంది ఎమర్జెన్సీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీంతో, నాటకీయ పరిణామాల మధ్య ఎమర్జెన్సీని ఉపసంహరించుకుంటున్నట్టు అధ్యక్షుడు తెలిపారు.
ఈ క్రమంలో, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే అభిశంసనను ఎదుర్కోవాలని డెమోక్రటిక్ పార్టీ సవాల్ చేసింది. మరోవైపు.. దక్షిణ కొరియాలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్నామని పేర్కొన్న అమెరికా పేర్కొంది.
ఎమర్జెన్సీ విధించిన అనంతరం.. దకక్షిణ కొరియాలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్ష నేతలను ఆర్మీ.. అరెస్ట్ ప్రయత్నం చేసింది. దీంతో, తీవ్ర ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది. ఇక, దాదాపు ఐదు దశాబ్దాలలో దక్షిణ కొరియా ఎమర్జన్సీని విధించడం ఇదే మొదటిసారి. కొరియాలో చివరిసారిగా 1980లో ఎమర్జెన్సీ లాను ప్రయోగించారు.
🚨BREAKING - The moment South Korean Special Forces stormed the interior of the Parliament building pic.twitter.com/EhGEu2xzPW
— Gabriela Iglesias🇺🇲 (@iglesias_gabby) December 4, 2024
ఇదిలా ఉండగా.. మంగళవారం సాయంత్రం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దేశంలో సైనిక పాలన విధిస్తూ ప్రకటన చేశారు. టీవీ చానెల్ ద్వారా ఈ ప్రకటన చేసిన యూన్.. ఉత్తర కొరియా దాడుల భయం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఈ క్రమంలో ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిపక్షాలు దేశానికి ద్రోహం చేశాయి. ఉత్తర కొరియాతో అవి చేతులు కలిపాయి. ఆ దేశం కోసమే పని చేస్తున్నాయవి. గత కొంతకాలంగా పార్లమెంట్‌ను విపక్షాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. తమ కుట్రలో భాగంగానే ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. వాటిని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నాం. దేశ భద్రత కోసమే అత్యవసర సైనిక పాలన నిర్ణయం అని ప్రకటించారు.
SHOCK VIDEO: South Korean Army Blocks National Assembly After Martial Law Declared By Yoon Suk Yeol pic.twitter.com/4krlonyiQ9
— Alex Dickerson (@wangzai266687) December 4, 2024
పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత
సైనిక పాలన విధింపు ప్రకటనను వ్యతిరేకిస్తూ చట్ట సభ్యులు, భారీ ఎత్తున జనం పార్లమెంట్ వద్ద గుమిగూడారు. వాళ్లను లోపలికి వెళ్లనివ్వకుండా భద్రతా బలగాలు అడ్డుకుంటున్నాయి. 2022లో పీపుల్ పవర్ పార్టీ తరఫున యూన్ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రతిపక్షాల వైఖరితో ఆయన ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది కోసం బడ్జెట్ రూపకల్పన విషయంలో ప్రధాన ప్రతిపక్షం డెమోక్రటిక్ పార్టీని ఏకతాటిపైకి తెచ్చుకోలేకపోతున్నారు. ఇంకోవైపు.. అధ్యక్షుడి భార్య, ఆయన పేషీలో ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వాటిపై విచారణకు ప్రతిపక్షాలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment