అత్యంత విషపూరితమైన 11 పాములను నోట్లో కుక్కి.. బాబోయ్‌! | Man Pressed 11 Dangerous Poisonous Snakes In His Mouth Worlds Dangerous Stunt | Sakshi
Sakshi News home page

Most Dangerous Stunt: ‘మేము గిన్నిస్‌ రికార్డులో నీ పేరు నమోదు చేయం! నిన్ను చూసి మరొకరు చేస్తే..?’

Published Sat, Dec 4 2021 6:35 PM | Last Updated on Sat, Dec 4 2021 9:09 PM

Man Pressed 11 Dangerous Poisonous Snakes In His Mouth Worlds Dangerous Stunt - Sakshi

జాకీ బిబ్బీ

Dangerous Stunt Of Guinness Records: రికార్డులను బద్దలు కొట్టాలని ఈ జిందగీలో ఎవరికి ఉండదు! ఐతే.. ఇతను చేసిన విన్యాసం ముందు అవన్నీ దిగదుడుపేనని అంటున్నారు నెటిజన్లు.. పాపం! అంతటి ప్రమాదకరమైన స్టంట్‌ చేసినా ‘మేము గిన్నిస్‌ రికార్డులో నీ పేరు నమోదు చేయం’ తేల్చిచెప్పారా అధి​కారులు! ఏం చేశాడో మీరే చూడండి..

అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన జాకీ బిబ్బీ ఏకంగా 11 అత్యంత విషపూరితమైన పాములను నోట్లో కుక్కుకుని ప్రపంచంలోనే సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. 2010లో కూడా ఇటువంటి ఫీటే చేసి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. ఐతే ఇప్పుడు తాజాగా ఆ రికార్డును బ్రేక్‌ చేసి మరొకమారు రికార్డును తిరగరాయాలని అనుకున్నాడు. కానీ అందుకు గిన్నిస్‌ బుక్‌ అధికారులు ససేమిరా అన్నారు. దీనిని సంబంధించిన ఫొటోను గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అధికారిక ఫేస్‌బుక్‌లో చూడొచ్చు. ఒక నివేదిక ప్రకారం.. జాకీ ఈ పాములన్నీంటినీ నోట్లో కుక్కుకోవడానికి చేతులను ఉపయోగించలేదట. నోటితోనే వాటిని నేరుగా పట్టుకున్నాడట.

అర్థమైందా.. ఇదెంతటి ప్రమాదకరమైన స్టంటో! వాటిల్లో ఏ ఒక్కపాము కరచినా అతని ప్రాణాలు పోగొట్టుకునేవాడు. తెలిసి.. తెలిసి ఈ విన్యాసం చేశాడితడు. ఐతే గిన్నిస్‌ అధికారులు అందుకు భిన్నంగా ఆలోచించారు. ‘ఇకపై ఈ రికార్డును అస్సలు పర్యవేక్షించడం లేదు. ఎందుకంటే.. చాలా మంది ప్రజలు అలాంటి రికార్డు కోసం తమ జీవితాలతో ఆటలాడుకునే ప్రమాదం ఉంది. మరొకరు ఈ స్టంట్‌ చేయాలని కోరుకోవడంలేదని’ తేల్చిచెప్పారు. నిజమే కదా! సరదా ప్రాణాలను తీసేంతగా ఉండకూడదు..

చదవండి: వింత నమ్మకం.. ఐదేళ్ల కొడుకును గొడ్డలితో 7 ముక్కలుగా నరికి..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement