poisonous Creatures
-
భూమిపై అత్యంత విషపూరిత జంతువులు ఫోటో గ్యాలరీ
-
ఈ బుజ్జి పక్షులు ఎంత ప్రమాదకరమో తెలుసా..?
-
గోదావరి పరీవాహక ప్రాంతంలో విజృంభిస్తున్న డెంగీ, విషజ్వరాలు
ఈ చిత్రంలో కనిపిస్తున్న ఊరి పేరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని ప్రేమ్‌నగర్. ఈ గ్రామ జనాభా 300 మంది కాగా, వీరిలో 50 మందికిపైగా జ్వరాలతో బాధపడుతున్నారు. మూడు నెలల క్రితం ఇక్కడ 30 మంది జ్వరాల బారిన పడగా, గ్రామానికి చెందిన యువకుడు అవినాష్ రెండు రోజుల క్రితం చనిపోయాడు. ఇదే గ్రామంలో తీవ్ర జ్వరంబారిన పడిన ఒకే కుటుంబానికి చెందిన రాంసింగ్, ఓంసింగ్, శారన్భాయ్లను కుటుంబసభ్యులు బుధవారం మెరుగైన వైద్యానికి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడా గ్రామం జ్వరాలతో విలవిల్లాడుతోంది. సాక్షిప్రతినిధి, వరంగల్: జూలై ,ఆగస్టు మాసాల్లో కురిసిన ఎడతెరపి లేని వర్షాలు గోదావరి పరీవాహక ఏజెన్సీ పల్లెలను కుదిపేశాయి. ఇప్పుడా ప్రాంతాలను విషజ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మొదలు భద్రాద్రి కొత్తగూడెం వరకు అనేక గ్రామాలు డెంగీ, మలేరియాల వలయంలో బిక్కుబిక్కుమంటున్నాయి. ఎంజీఎం ఆస్పత్రి పూర్వ వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పేషెంట్లతో కిటకిటలాడుతోంది. ఆయా జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులు జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. ఇప్పటికే ఎనిమిదిమంది వృద్ధులు, మహిళలు, బాలురు మృత్యువాత పడగా, 15 నుంచి 25 రోజులైనా తగ్గని జ్వరాలతో జనం ఆందోళన చెందుతున్నారు. ఇంటింటా జ్వరపీడితులే... వర్షాలు, వరదలతో అతలాకుతలమైన జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు.. ఇప్పుడు డెంగీ, మలేరియా, విషజ్వరాలతో విలవిలలాడుతున్నాయి. మహా ముత్తారం, గణపురం, తాడిచర్ల, రేగొండ, కాటారం, మొగుళ్లపల్లి పీహెచ్‌సీల్లో రోజుకు 150 నుంచి 250 మంది ఔట్పేòÙంట్లుగా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం, మంగపేట, వాజేడు, ఏటూరునాగారం మండలాల్లోని పల్లెలు మంచం పట్టాయి. జిల్లాలో గత జనవరి నుంచి 51 మలేరియా, 18 డెంగీ కేసులు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లా మంథని, కమాన్‌పూర్, రామగిరి, ముత్తారం తదితర మండలాల్లోని 39 గ్రామాల్లో డెంగీ, విషజ్వరాలు జనాలను జడిపిస్తున్నాయి. ముత్తారం మండలంలో బేగంపేటకు చెందిన ఓ మహిళ మృతి చెందగా... డెంగీ బాధితుల సంఖ్య 89కి చేరినట్టు అధికారులు ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు, దంతాలపల్లి, మరిపెడ, కొత్తగూడ, గంగారం, కేసముద్రం, గార్ల తదితర మండలాల్లో డెంగీ, విషజ్వరాలు జడలు విప్పాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా, డెంగీ, విషజ్వరాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు మలేరియా 162, డెంగీ 273, విషజ్వరాలు 2,35,835 కేసులు నమోదయ్యాయి. ఈ ఫొటోలో ఉన్న బాబు పేరు వర్షిత్‌కుమార్. ములుగు జిల్లా మంగపేట. రెండు రోజులనుంచి ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంటున్నాడు. మలేరియా పాజిటివ్ వచి్చంది. రక్తం చాలా తక్కువ ఉందని వైద్యులు ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. తల్లి రమ్య పక్కనే ఉంటూ సపర్యలు చేస్తోంది. వారం రోజులుగా జ్వరం తగ్గడం లేదు మాది ములుగు జిల్లా మంగపేట మండలం రమణక్కపేట. నేను మూడు నెలల గర్భవతిని. వారం రోజుల నుంచి జ్వరం వస్తోంది. తగ్గకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చా. చాలా నీరసంగా ఉంటోంది. – సరిత, రమణక్కపేట, ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు ఇద్దరు మహిళలు, డెంగీతో ఆరు నెలల పాప మృతి వాజేడు/కన్నాయిగూడెం: ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు మరణ మృదంగం మోగిస్తున్నాయి. రెండు రోజుల్లోనే ఐదుగురు చనిపోయారు. బుధవారం ఇద్దరు చనిపోగా, గురువారం మరో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఆరు నెలల పాప ఉండడం గమనార్హం. ములుగు జిల్లా వాజేడు మండలం మొట్లగూడెం గ్రామానికి చెందిన కుర్సం రజని (35), ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్‌లో నివాసి మనీష (30) విషజ్వరంతో మృతిచెందారు. వాజేడు మండల పరిధిలోని దేవాదుల గ్రామానికి చెందిన ఆరు నెలల పాప కూడా డెంగీ జ్వరంతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. -
ఈ కప్పలు మనుషుల్ని చంపేస్తాయని మీకు తెలుసా?
ఈ భూమ్మీద ఎన్నో రకాల విష జంతువులు ఉన్నాయి.విషపూరీతమైనవి అంటే ముందుగా గుర్తొచ్చేవి పాములు. అయితే విషపూరిత కప్పల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అదేంటి కప్పలు కూడా అంత ప్రమాదకరమా అని ఆలోచిస్తున్నారా? అవును.. అలాంటి విషపూరితమైన కప్పలు కూడా ఉన్నాయి. చూడటానికి అందంగా కనిపించే ఈ కప్పలు యమ డేంజర్. వీటిని గోల్డెన్ పాయిజన్ కప్పలు అని అంటారు. వీటికి ఒళ్లంతా విషమే. ఆఖరికి ఈ కప్పలను ముట్టుకున్నా శరీరం విషపూరితమవుతుంది. ► ఈ పాయిజన్ కప్పలు కొలంబియాలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. సాధారణంగా రెండు అంగుళాలు లేదా కాస్త పెద్దగా ఉండే ఈ కప్పలో పదిమందిని చంపేంత విషం ఇందులో ఉంటుంది. శతాబ్దాలుగా కొలంబియాలోని వేటగాళ్ళు తమ ఎరను పట్టుకోవడానికి ఈ రకమైన కప్ప విషాన్ని ఉపయోగిస్తారట. ► ఈ కప్పలను తాకినా ప్రాణాలు పోతాయట. పొరపాటున వీటిని టచ్ చేసినా చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కప్పల విషం నేరుగా చర్మంపై పడినా పల్స్ రేటు వెంటనే పడిపోయి మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. ► ఈ కప్పలు పసుపు, నారింజ లేదా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ప్రదేశాన్ని బట్టి అవి వాటి రంగులను మార్చుకుంటాయి. ► ఒళ్లంతా విషాన్ని నింపుకున్న ఈ కప్పలను వైద్య రంగంలో ఉపయోగించేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. దీనిలోని విషాన్ని కొన్ని కెమికల్ పద్దతులను ఉపయోగించి పెయిన్ కిల్లర్స్‌ను తయారు చేసేందుకు రీసెర్చ్ చేస్తున్నారు. -
మాకు బతకాలని ఉండదా!.. కనపడితే ఖతం చేస్తున్నారు
సాక్షి ,భామిని(పార్వతిపురం మన్యం): సరీసృపాల్లో సర్పజాతిపై అవగాహన లోపంతో అవి అంతరించి పోయే దుస్థితి ఏర్పడింది. హైందవ సంప్రదాయంలో పవిత్ర స్థానం గల సర్పాలకు పూజలు, నోములు చేస్తున్న చోటే అవగాహన లోపంతో వాటిని అంతం చేసే సంస్కృతి సాగుతోంది. దెబ్బ తిన్న పాము పగ పడుతుందనే అభూత కల్పన, పాము కాటు వేస్తే విష ప్రభావంతో మరణిస్తామనే భయంతో వాటిని హతమారుస్తున్నారు. గ్రామస్తుల చేతిలో హతమైన భారీ కొండచిలువ పంట కాపాడే పాములు రైతు పండించే పంటలో నలభై శాతం స్వాహా చేస్తున్న ఎలు కలు, పందికొక్కుల నివారణ లో కీలక పాత్ర ధారి పాముకు మనుగడ కష్టమైపోతోంది. పర్యావరణ పరిరక్షణలో కీలకంగా, భూ సారాన్ని కాపాడే ముఖ్యమైన జీవిగా గుర్తింపు పొందినా వాటికి తగిన రక్షణ కరువవుతోందని పర్యావరణ హితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రిమి సంహారక మందుల ప్రభావం ప్రధానంగా వ్యవసాయ రంగంలో వినియోగించే క్రిమి సంహారక మందుల ప్రభావం, ఆదునిక యంత్రాల వాడకంలో పుట్టలు, తుప్పలు, దిబ్బలు లేకుండా, భూమిలో బొరియలు లేకుండా చేయడంతో పాముల సంచారం కష్టమైంది. విష సర్పాలు తక్కువ.. మన చుట్టూ తిరుగుతున్న పాములలో 80 శాతం విషంలేని సాధారణ సర్పాలే ఉన్నాయి. విçషపూరితమైనవి, ప్రాణాంతకం కలిగించేవి కొద్దిగానే ఉన్నాయి. నాలుగు రకాలైన తాచుపాము(నాగుపాము),రక్తపింజర,కట్లపాము, పొడపాములను విషసర్పా లుగా గుర్తించారు. పాము కాటుకు గురైన వ్యక్తుల్లో అత్యధికంగా భయంతోనే ఎక్కువ మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పాములపై అవగాహన అవసరం విద్యార్థి స్థాయి నుంచి పాములపై అవగాహన కల్పించాలి. అన్ని పాములు ప్రమాదరం కావని తెలియజేయాలి. పాము పగ పడుతుందనే మూఢ నమ్మకాలు విడిచి పెట్టేలా చైతన్యం కల్పించాలి. స్నేక్స్ ఫ్రెండ్లీ సొసైటీలు ఏర్పాటు కావాలి. అన్ని పాములను హరించడం తగదు. కొట్టి చంపకుండా, పట్టి దూరంగా విడిచిపెట్టాలి. అవి అంతరించకుండా చూడాలి. పాములన్నీ విషసర్పాలు కావు పాములన్నీ విషసర్పాలు కావు. అన్ని పాములకు విషం ఉండదు. పాము కాటు వేస్తే చనిపోతామనే భయం వీడాలి. ప్రమాదవశాత్తు పాముకాటుకు గురైనా భయపడవద్దు. అందుబాటులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకురండి. విషాన్ని నివారించే ఏంటీస్నేక్ వీనమ్(ఏఎస్వీ) మందులు అందుబాటులో ఉన్నాయి. పాముకాటు పడిన తరువాత గాయాన్ని కడగవద్దు. పాము వేసిన గాట్లు గుర్తించి విషప్రభావం లెక్కించి ఏఎస్‌వీలు వేస్తాం. – డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు,డిప్యూటీ డీఎంహెచ్ఓ,సీతంపేట పాము కనిపిస్తే సమాచారం ఇవ్వండి పాములు కనిపిస్తే సమాచారం ఇవ్వండి. సర్ప జాతుల సంరక్షణకు స్నేక్ రెస్క్యూ టీం తరలి వస్తుంది. ప్రాణాపాయం లేకుండా పట్టుకుని అడవుల్లో విడిచి పెడతాం.అటవీశాఖాధికారుల సహకారంతో గ్రీన్ మెర్సీ సంస్థ ఉచితంగా సేవలు అందిస్తుంది.సర్పజాతులను చంపవద్దు. ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుంది.హెల్ప్‌లైన్ నంబర్ 9848414658కు తెలియ పర్చండి. పాములను చంపడం చట్టరీత్యానేరం.1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం మేరకు కఠిన శిక్షలు తప్పవు. – కేవీ రమణమూర్తి, సీఈఓ, గ్రీన్‌మెర్సీ వన్యప్రాణ సంరక్షణ గస్తీ బృందం చదవండి: Gujarat Riots: గుజరాత్ అల్లర్ల వెనుక షాకింగ్ నిజాలు.. మోదీని గద్దె దింపేందుకే కాంగ్రెస్ ప్లాన్! -
ఆ దుర్మార్గులు ఎంత పని చేశారు.. ఒకే కుటుంబంలో తొమ్మిది మందిని..
ముంబై: మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ కేసుకి సంబంధించిన దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో ఇది ఆత్మహత్య కాదని హత్యగా గుర్తించారు. వారిది ఆత్మహత్య కాదు హత్య.. సాంగ్లీ జిల్లాలోని మైసల్ గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు తమ కుటుంబాలతో కలిసి జీవిస్తున్నారు. వారి కుటుంబాల్లో మొత్తం తొమ్మిది మంది ఉండేవారు. ఈ నెల 20న కుటుంబంలోని 9 మంది ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం రావడంతో పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మొదటగా.. అన్నదమ్ములకు అప్పులు ఎక్కువ ఉండడంతో, వాటిని తీర్చడం కష్టంగా భావించి వేరే దారి లేక కుటుంబంతో సహా వారు ఆత్మహత్యకు పాల్పడ్డారని తేలింది. కానీ ఈ వ్యవహారంపై పోలీసులకు ఎక్కడో అనుమానం రావడంతో ఈ కేసుని మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే షాకింగ్ విషయాలు వెలువడ్డాయి! ఆ కుటుంబ సభ్యులకు ఆత్మహత్య కాదని, విషం ఇచ్చి వారిని చంపేశారని గుర్తించారు. గుప్త నిధుల కోసం ధీరజ్ చంద్రకాంత్, అబ్బాస్ మహ్మద్ అలీ అనే ఇద్దరు మాంత్రికులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు దర్తాప్తులో తేలింది. కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి మరేదైన కోణం కూడా దాగుందా అని పోలీసులు భావిస్తున్నారు. -
రష్యా బిలియనీర్‌పై విష ప్రయోగం.. శాంతి చర్చల్లో అలా జరిగిందా..?
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న క్రమంలో మంగళవారం మరోసారి రెండు దేశాల మధ్య ఇస్తాంబుల్ వేదికగా శాంతి చర్చలు జరుగునున్నాయి. కాగా, గత రెండు వారాలుగా జరుగుతున్న శాంతి చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా అంతకు ముందకు శాంతి చర్చల్లో పాల్గొన్న సభ్యులపై విష ప్రయోగం జరిగినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్, బిల్లింగ్ క్యాట్ తన నివేదికలో పేర్కొన్నాయి. రెండు దేశాల మధ్య చర్చల్లో పాల్గొన్న రష్యా బిలియనీర్ రోమన్ అబ్రమోవిచ్, ఉక్రెయిన్‌కు చెందిన సంధానకర్తలపై విష ప్రయోగం జరిగినట్టు పేర్కొంది. ఈ క్రమంలో అబ్రమోవిచ్, ఉక్రెయిన్‌కు చెందిన ఇద్దరు సీనియర్ సభ్యులు ప్రభావితమయ్యారని వాల్ స్ట్రీట్ జర్నల్ తన నివేదికలో తెలిపింది. రష్యా బిలియనీర్ రోమన్ అబ్రమోవిచ్, ఉక్రేనియన్ శాంతి సంధానకర్తల మధ్య ఉక్రెయిన్‌లోని కీవ్‌లో జరిగిన సమావేశం తర్వాత అనుమానాస్పద విషపు లక్షణాలను ఎదుర్కొన్నారని వాల్ స్ట్రీట్ జర్నల్, పరిశోధనాత్మక అవుట్లెట్ బెల్లింగ్‌క్యాట్ సోమవారం ఓ నివేదికలో పేర్కొన్నాయి. వారి నివేదక ప్రకారం.. విష ప్రయోగం జరిగిన అనంతరం అబ్రమోవిచ్, సంధానకర్తల చర్మంపై దద్దర్లు రావడం, కళ్లు ఎర్రబడటం, స్వల్ప అనారోగ్యానికి గురైనట్టు వెల్లడించింది. కాగా, ప్రస్తుతం వారు కోలుకున్నారని, వారి ఆరోగ్యం మెరుగుపడిందని నివేదిక వెలువరించింది. ఈ ఘటనపై నెదర్లాండ్‌కు చెందిన బిల్లింగ్ క్యాట్ పరిశోధన సంస్థ.. వారిపై కెమికల్ వెపన్తో విష ప్రయోగం జరిగినట్టు పేర్కొంది. అయితే, తక్కువ డోసేజ్‌లో ఈ ప్రయోగం జరగడంతో ప్రమాదమేమీ జరగలేదని తెలిపింది. అలాగే, కేవలం వారిని బెదిరించేందుకే ఇలా విష ప్రయోగం జరిగినట్టు స్సష్టం చేసింది. ఇదిలా ఉండగా.. ఈ నివేదికపై ఇప్పటి వరకు రష్యా స్పందించకపోవడం గమనార్హం. మరోవైపు.. ఈ నివేదికను ఉక్రేనియన్కు చెందిన శాంతి చర్చల సంధానకర్తలు కొట్టి పాటేశారు. ఈ సందర్బంగా రుస్టెమ్ ఉమెరోవ్ మాట్లాడుతూ.. ధృవీకరించని సమాచారాన్ని ప్రజలు విశ్వసించవద్దని కోరారు. Bellingcat can confirm that three members of the delegation attending the peace talks between Ukraine and Russia on the night of 3 to 4 March 2022 experienced symptoms consistent with poisoning with chemical weapons. One of victims was Russian entrepreneur Roman Abramovich. https://t.co/DJaZ4CoL8J — Bellingcat (@bellingcat) March 28, 2022 -
డేంజర్, యమ డేంజర్! ఈ కప్పలు నిలువెల్లా విషం కక్కుతాయ్!
సాధారణంగా పల్లెల్లో ఊ అంటే కాళ్ల కిందకొచ్చేసే కప్పలంటే భలే బాధ.. చిరాకూనూ. అలికిడి చేసినా, అరచినా.. అడ్డం వచ్చినా కాళ్లతో చప్పుడు చేసి, ఉష్ ఉష్ అంటూ బెదిరించి తరిమేస్తాం. అలాంటి కప్పలు విషం జిమ్ముతాయి అంటే బెంబేలెత్తాల్సిందేగా? అవును నిజం.. ఈ కప్పలు నిలువెల్లా విషాన్ని కక్కుతాయట. పాయిజన్ డార్ట్ ఫ్రాగ్ జాతికి చెందిన ఈ కప్పలు.. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన జీవులు. మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలోని వర్షారణ్య ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయివి. ఒంటి నిండా రంగులతో పాటు విషాన్నీ నింపుకుని తిరుగుతాయి. ఒక కప్పలోని విషంతో 20 వేల ఎలుకలను చంపొచ్చంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కప్పను మనం ముట్టుకోగానే విషం ఎక్కదు. నోట్లో పెట్టుకుంటేనో.. కళ్లు, ముక్కుకు తగిలితేనో లేదా ఏదైనా గాయం ఉన్నచోట ఈ కప్ప విషం అంటితేనో.. ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ విషం వల్ల రక్తనాళాలు కుచించుకుపోవడం, పక్షవాతం, కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంది. పాయిజన్ డార్ట్ కప్పల్లో రెండు వందలకు పైగా జాతులు ఉన్నాయి. వీటి పరిమాణం 6 సెంటీమీటర్ల కంటే తక్కువే. ఇవి కీటకాలను, చెదపురుగుల్ని, సాలెపురుగుల్ని, ఈగల్ని, చీమల్ని, దోమల్ని తమ రంగులతో ఆకర్షించి, పొడవాటి నాలుకతో విషం జిమ్మి.. చంపి తింటాయి.ఇవి ఎక్కువగా ముదురు ఎరుపు, నీలం, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. వీటికి దృశ్యసామర్థ్యం కూడా ఎక్కువే. పది సంవత్సరాలకు మించి జీవిస్తాయి. ఆ పరిసరాల్లో జీవించే గిరిజనులు వారి బాణాలకు ఈ కప్ప విషాన్ని పూసి వేటకు వెళ్తుంటారు. -
ప్రాణ భయంతో వణికిపోతున్న పుతిన్!.. ఏం చేశాడో తెలుసా?
ఉక్రెయిన్‌పై దాడి చేసి యావత్ ప్రపంచాన్ని వణికించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా భయపడుతున్నారు! తనకు ఎవరైనా విషం పెట్టి హత్య చేసే కుట్రలు పన్నతున్నారేమోనని పుతిన్ ఆందోళన పడుతున్నాడట. అందుకే దాదాపు వెయ్యి మంది వ్యక్తిగత సిబ్బందిని తొలగించారని సమాచారం. తొలగించబడిన ఉద్యోగులలో అంగరక్షకులు, వంటవాళ్లు, లాండ్రీలు, వ్యక్తిగత కార్యదర్శులు ఉన్నారు. అయితే ఈ ఉద్యోగులందుర్నీ ఇటీవలే తొలగించారు. వీరి స్థానంలో క్షుణ్ణంగా విచారణ చేసి కొత్తవారిని నియమించారు. పుతిన్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 24న రష్యా సైన్య ఉక్రెయిన్‌పై రోజుల తరబడి యుద్ధం కొనసాగిస్తోంది. దక్షిణ కరోలినాకు చెందిన యుఎస్ చట్టసభ సభ్యుడు లిండ్సే గ్రాహం కూడా రష్యా అధ్యక్షుడి హత్యకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పైగా గ్రాహం.. పుతిన్‌ను నియంత అయిన అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చిన సంగతి తెలిసిందే. యుద్ధం ముగియాలంటే ఒకరిని చంపడమే మార్గమని అన్నారు. పుతిన్‌పై విష ప్రయోగం చేసే సాహసం ఏ విదేశీ ప్రభుత్వమూ చేయదని అది కేవలం రష్యా అధ్యక్ష కార్యాలయం లోపల నుంచే జరుగుతుందంటూ కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. దీంతో పుతిన్ తనను ఎవరైనా హత్య చేస్తారన్న భయంతోనే వ్యక్తిగత సిబ్బందిని తొలగిస్తున్నాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదీ గాక రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్నప్పటి నుంచి పుతిన్‌కి శత్రువులు ఎక్కువయ్యారు. పైగా అమెరికాతోపాటు పలు పాశ్చాత్య దేశాలు కఠినమైన ఆంక్షలు విధించాయి. మరోవైపు స్వదేశంలోనూ పుతిన్‌పై వ్యతిరేకత ఎక్కువైంది. పైగా ఈ యుద్ధం కారణంగా పుతిన్‌కి వ్యతిరేకంగా చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా రష్యన్లు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: పుతిన్‌తో చర్చలు విఫలమైతే.. మూడో ప్రపంచ యుద్ధమే!: జెలెన్స్కీ) -
విషం పెట్టి ఆ గుర్రాలను చంపేశారు!
పత్తికొండ (కర్నూలు): పంటలు నాశనం చేస్తున్నాయని కర్ణాటక ప్రాంత రైతులు గుర్రాలకు విషం పెట్టి చంపేసినట్లు తేలింది. మండల పరిధిలోని పందికోన అటవీ ప్రాంతంలో ఏడు గుర్రాల కళేబరాలు బుధవారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసులు దూదేకొండ గ్రామానికి చెందిన మల్లికార్జునను అదుపులోకి తీసుకుని కర్ణాటక పోలీసు స్టేషన్, ఆ గ్రామసర్పంచ్‌ను విచారించగా వాస్తవాలు వెలుగు చూశాయి. సీఐ ఆదినారాయణరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంఘటన స్థలం పరిశీలన మేరకు కళేబరాలను ట్రాక్టర్ ద్వారా తీసుకొచ్చి పడేసినట్లుగా తెలిసిందన్నారు. ఈకోణంలో దూదేకొండ మల్లికార్జునను విచారించాం. రాయచూరు జిల్లాలోని కంపిలి కొట్టాలలో గత కొన్ని నెలల కింద పొలాల్లో పడి గుర్రాలు తమ పంటలను పాడుచేస్తుండటంతో అక్కడి ప్రాంత రైతులు గుర్రాలకు విషాహారాన్ని ఇచ్చినట్లు తెలిసింది. దూదేకొండకు చెందిన మల్లికార్జున తరచూ ఆ ప్రాంతం నుంచి తీసుకొచ్చిన గుర్రాలను స్వామి గుర్రాలుగా దర్గాలకు ఇస్తుంటారు. ఆ విషయం తెలియని దూదేకొండ వాసి గుర్రాలను ఎప్పటిలాగానే వాహనంలో ఇక్కడికి తీసుకొస్తుండగా మార్గమధ్యలో మూడు గుర్రాలు మృత్యువాత పడ్డాయి. మిగిలిన నాలుగు సైతం పత్తికొండకు చేరేలోగా మృతి చెందాయ. దీంతో వాటిని పందికోన అటవీప్రాంతానికి తెచ్చి పడేశారు. పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగుచూశాయి. పంచాయతీ సిబ్బంది సాయంతో గుర్రాలను పూడ్చిపెట్టినట్లు సీఐ తెలిపారు. చదవండి: (మద్యం మత్తులో యువతి కారుతో బీభత్సం.. సెకన్ల వ్యవధిలోనే) -
గుట్కాలు కొన్న విషయం ప్రిన్సిపాల్‌కి తెలియడంతో.. ఏం జరుగుతుందోనని భయపడి..
సాక్షి,ఆత్మకూరు(వరంగల్): తండ్రి మందలిస్తాడేమోనని భయపడి పురుగుల మందుతాగి ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని తిరుమలగిరి శివారులో చోటుచేసుకుంది. వివరాలు.. శాయంపేట మండలం ఆరెపల్లికి చెందిన నాగలగాని రవి కుమారుడు భరత్(17) ధర్మసాగర్ మండలం కరుణాపురంలో నడుస్తున్న మహాత్మాజ్యోతిరావుపూలే జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ ప్రథమసంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం కళాశాలలో బయటకు వెళ్లి గుట్కాలు కొనుగోలు చేసి కళాశాల లోపలికి తీసుకువస్తుండగా వాచ్‌మన్ చూసి ఫొటోతీసి ప్రిన్సిపాల్‌కు పంపాడు. ప్రిన్సిపాల్ విద్యార్థి తండ్రి రవికి ఫోన్‌చేసి చెప్పగా కాలేజీకి వచ్చి మాట్లాడుతానని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తండ్రి వస్తే ఏమి జరుగుతుందోనని భయపడి అదేరోజు పారిపోయి మండలంలోని తిరుమలగిరిలోని వ్యవసాయ బావి వద్దకు వచ్చి అక్కడ ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి సోమవారం ఉదయం తెల్లవారు జామున శాయంపేట మండలంలోని ఆరెపల్లిలోని ఇంటికి వచ్చి వాంతులు చేసుకోగా గమనించిన తండ్రి కుటుంబసభ్యులు విషయం తెలుసుకుని చికిత్స నిమిత్తం పరకాలలోని ఓప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి తండ్రి రవి ఫిర్యాదు మేరకు ఆత్మకూరు సీఐ గణేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కానిస్టేబల్ జైరాజ్ సూచనమేరకు విద్యార్థి నేత్రాలను దానం చేశారు. చదవండి: Vellore Jewellery Store Heist: వేలూరు జోస్ ఆలుక్కాస్ జ్యువెలరీ షాపుకు కన్నం వేసిన దొంగ అరెస్ట్ -
కూల్‌డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్థి
సాక్షి,వరంగల్: కూల్‌డ్రింక్ అనుకుని పురుగులమందు తాగి ఓ విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని మరికాల పంచాయతీ తోగుబోరు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పూనెం సురేష్(11) అనే విద్యార్థి గురువారం ఉదయం ఇంట్లో కూల్‌డ్రింక్ సీసాలో పురుగుల మందు ఉందని తెలియక కూల్‌డ్రింక్ తాగాడు. అనంతరం వాంతులు చేసుకుంటుండగా గమనించిన కుటుంబ సభ్యులు సురేష్‌ను వె ంకటాపురం వైద్యశాలకు తరలించి చి కిత్స నిర్వహించే లోపే మృతి చె ందా డని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. లాంగ్ డ్రైవ్‌కు వెళ్దామని చెప్పి.. -
అత్యంత విషపూరితమైన 11 పాములను నోట్లో కుక్కి.. బాబోయ్!
Dangerous Stunt Of Guinness Records: రికార్డులను బద్దలు కొట్టాలని ఈ జిందగీలో ఎవరికి ఉండదు! ఐతే.. ఇతను చేసిన విన్యాసం ముందు అవన్నీ దిగదుడుపేనని అంటున్నారు నెటిజన్లు.. పాపం! అంతటి ప్రమాదకరమైన స్టంట్ చేసినా ‘మేము గిన్నిస్ రికార్డులో నీ పేరు నమోదు చేయం’ తేల్చిచెప్పారా అధికారులు! ఏం చేశాడో మీరే చూడండి.. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన జాకీ బిబ్బీ ఏకంగా 11 అత్యంత విషపూరితమైన పాములను నోట్లో కుక్కుకుని ప్రపంచంలోనే సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. 2010లో కూడా ఇటువంటి ఫీటే చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. ఐతే ఇప్పుడు తాజాగా ఆ రికార్డును బ్రేక్ చేసి మరొకమారు రికార్డును తిరగరాయాలని అనుకున్నాడు. కానీ అందుకు గిన్నిస్ బుక్ అధికారులు ససేమిరా అన్నారు. దీనిని సంబంధించిన ఫొటోను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారిక ఫేస్బుక్లో చూడొచ్చు. ఒక నివేదిక ప్రకారం.. జాకీ ఈ పాములన్నీంటినీ నోట్లో కుక్కుకోవడానికి చేతులను ఉపయోగించలేదట. నోటితోనే వాటిని నేరుగా పట్టుకున్నాడట. అర్థమైందా.. ఇదెంతటి ప్రమాదకరమైన స్టంటో! వాటిల్లో ఏ ఒక్కపాము కరచినా అతని ప్రాణాలు పోగొట్టుకునేవాడు. తెలిసి.. తెలిసి ఈ విన్యాసం చేశాడితడు. ఐతే గిన్నిస్ అధికారులు అందుకు భిన్నంగా ఆలోచించారు. ‘ఇకపై ఈ రికార్డును అస్సలు పర్యవేక్షించడం లేదు. ఎందుకంటే.. చాలా మంది ప్రజలు అలాంటి రికార్డు కోసం తమ జీవితాలతో ఆటలాడుకునే ప్రమాదం ఉంది. మరొకరు ఈ స్టంట్ చేయాలని కోరుకోవడంలేదని’ తేల్చిచెప్పారు. నిజమే కదా! సరదా ప్రాణాలను తీసేంతగా ఉండకూడదు.. చదవండి: వింత నమ్మకం.. ఐదేళ్ల కొడుకును గొడ్డలితో 7 ముక్కలుగా నరికి..! -
అదొక అందమైన తోట.. ముచ్చటపడి ఏది ముట్టుకున్నా ప్రాణాలకు ముప్పే..
సువిశాలమైన ఉద్యానవనాల్లో విహరించడం ఒక అద్భుతమైన అనుభూతి. తోటల్లో తిరుగుతూ ఉంటే, ప్రకృతికి దగ్గరగా సంచరిస్తున్నట్లుంటుంది. తోటల్లోని మొక్కలకు పూచే పువ్వులను చూస్తే పూజ కోసమో, సరదాగా తలలో తురుముకోవడం కోసమో కోయాలనిపిస్తుంది. తోటల్లోని చెట్లకు కాసే కాయలను, పండే పండ్లను కోసుకు తినాలనిపిస్తుంది. ప్రభుత్వాల అధీనంలో ఉండే కొన్ని తోటల్లో పూలు, పండ్లు కోయడంపై ఆంక్షలుంటాయి. ముచ్చటగా పెంచుకునే ప్రైవేటు తోటల్లో అలాంటి ఆంక్షలేమీ ఉండవు. మనసుకు నచ్చిన మొక్కలను పెంచుకోవచ్చు. వాటికి పూసిన పూలు, కాసిన కాయలు యథేచ్ఛగా కోసుకోవచ్చు. కానీ, బ్రిటన్‌లోని ఆ తోటలో పూలు, కాయలు కోసుకోవడం సంగతి అటుంచితే, అక్కడి మొక్కలను తాకినా ప్రమాదమే! తాకితే శిక్షలు ఏవైనా పడతాయని కాదు గానీ, అవి అత్యంత విషపూరితమైనవి. ప్రపంచంలోని అత్యంత అరుదైన, విషపూరితమైన వృక్షజాతులన్నీ ఈ తోటలో కనిపిస్తాయి. ఈ తోట బ్రిటన్‌లో నార్త్అంబర్లాండ్లోని ఆన్విక్ కేసిల్‌లో ఉంది. ఈ తోటకు ఏర్పాటు చేసిన నల్లని ఇనుప ప్రవేశ ద్వారంపైన ప్రమాద సంకేతాలుగా పుర్రె, ఎముకల గుర్తులు కనిపిస్తాయి. తోట లోపల కూడా ఇలాంటి ప్రమాద సంకేతాలు దాదాపు అడుగడుగునా కనిపిస్తాయి. నిపుణులైన గైడ్ల పర్యవేక్షణలో మాత్రమే సందర్శకులు దీని లోపలకు వెళ్లవలసి ఉంటుంది. నిపుణుల పర్యవేక్షణ లేకుండా యథేచ్ఛగా వెళితే, లేనిపోని అనర్థాలు తప్పకపోవచ్చు. ఈ తోటలోని మొక్కలు, పొదలు, చెట్లు, వాటికి పూసే రంగు రంగుల పూలు, కాయలు, పండ్లు కళ్లను కట్టిపడేస్తాయి. అలాగని, వాటిని తాకడానికి ప్రయత్నించినా, మొక్కలకు పూసే పూలను కోయకుండానే, వాటిని వాసన చూసేందుకు ప్రయత్నించినా ఎలాంటి ప్రమాదం వాటిల్లుతుందో ఊహించడం కష్టం. గైడ్ల సూచనల మేరకు సురక్షితమైన దూరంలో నిలుచుని వీటిని చూడటమే అన్నివిధాలా క్షేమం. నార్త్అంబర్లాండ్ డ్యూషెస్ జేన్ పెర్సీ 2005లో ఈ తోటను ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశంలో పదకొండో శతాబ్దినాటి కేసిల్ శిథిలావస్థకు చేరుకోవడంతో దానిని పునరుద్ధరించి, ప్రపంచంలోని అరుదైన విషపు మొక్కలను ఏరికోరి తీసుకొచ్చి ఈ తోటను పెంచారు. ఇందులోని విషపు మొక్కలు కొన్ని ఔషధాల తయారీకి ఉపయోగపడతాయి. అందుకే ‘మీ ప్రాణాలు తీసేసే మొక్కలే మీ ప్రాణాలను కాపాడతాయి’ అంటారు పెర్సీ. ఈ తోటలో బెల్లడోనా, పాయిజన్ ఐవీ, హెన్బేన్, జెయింట్ హాగ్వీడ్ సహా వందలాది విషపు మొక్కలు ఉన్నాయి. వీటిలో కొన్నింటి పూల వాసన చూస్తే కళ్లు బైర్లు కమ్మడం, వాంతులవడం వంటి లక్షణాలు మొదలవుతాయి. కొన్ని మొక్కలను తాకితే చాలు ఒళ్లంతా దద్దుర్లు రేగి, చర్మం మంట పెడుతుంది. కొన్నింటి కాయలు, పళ్లు తింటే మైకం కమ్ముకు రావడమే కాకుండా, ప్రాణాంతక పరిస్థితులు సైతం ఎదురవుతాయి. ఈ తోటలోని మొక్కలు ప్రకృతిలోని జీవవైవిధ్యానికి అద్దంపడతాయి. చదవండి: ఆరుగురు కూతుళ్లు అందరూ డాక్టర్లు -
సిగ్గెక్కువ.. కానీ, కాటేస్తే వందమంది ఖతం!
ఈ భూమ్మీద సమస్త జీవరాశుల్లో సర్పాలు ఉన్నాయి. కానీ, మనుషుల భయాలు, అపోహలతో వాటి జనాభా తగ్గిపోతూ వస్తోంది. ఇది ఎంతవరకు సరైందన్నది పక్కనపెడితే.. చాలామందిలో చెడును చెప్పడానికి ‘పాములాంటోడు’ అని వర్ణిస్తుంటారు. కానీ, అవి అంత ప్రమాదకరమైనవి మాత్రం కావు. ఈ భూమ్మీద దాదాపు 4 వేల జాతుల దాకా పాములు ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్తగా కనుగొంటూ పోతున్నారు. ఈ మొత్తంలో 650కి(25 శాతం) పైగా జాతులు మాత్రమే విషపూరితమైనవని సైంటిస్టులు ఇప్పటిదాకా(జులై 7 రిపోర్ట్ ప్రకారం) గుర్తించారు. అందులోనూ 200 జాతుల(10 శాతం) పాముల నుంచి మాత్రమే మనిషికి ముప్పు ఉంటోందని తేల్చారు. కానీ, అవేం పట్టించుకోకుండా కనిపిస్తే చంపేస్తూ.. వాటి జనాభాను తగ్గించేస్తున్నారు. అందుకే వాటి పరిరక్షణ కోసం, పాములన్నీ ప్రమాదకరమైనవి కాదని జనాల్లో అవగాహన కల్పించాలని.. అందుకోసం ఓ రోజు ఉండాలని జులై 16న వరల్డ్ స్నేక్ డే ను నిర్వహిస్తున్నారు కొందరు(స్నేక్ సొసైటీలు). ప్రతీ ఏడాది ఇదే థీమ్‌తో ముందుకు సాగుతున్నారు. వాసన కోసం నాలిక పాములకు చూపు సామర్థ్యం చాలా తక్కువ. చెవుల్లేకున్నా వినికిడి శక్తి కూడా పరిమితంగానే ఉంటుంది. పాము కింది దడవలో ఉన్న ఎముకలు శబ్దతరంగాలను పసిగడతాయి. కానీ, వాసన విషయంలో మాత్రం గొప్ప సామర్థ్యం కలిగి ఉంటాయి. అవి నాలుకతోనే వాసనను పసిగడతాయి. అందుకే ఎప్పుడూ అవి నాలికను అలా బయటకు ఆడిస్తుంటాయి. అత్యంత విషపూరితమైనవి విషానికి ప్రాథమిక కొలమానం ఎల్డీ 50. లెథాల్ డోస్ 50 పర్సంట్ టెస్ట్ అని పిలుస్తారు దీన్ని. ఈ పద్దతిలో పాముల విషాన్ని పరిశీలించే.. అత్యంత విషపూరితమైన ప్రమాదకరమైన పాముల జాబితాను సిద్ధం చేస్తుంది ఇంటర్నేషనల్ స్నేక్ సొసైటీ. ఈస్ట్రన్ బ్రౌన్ స్నేక్.. ఆస్ట్రేలియాలో కనిపించే అత్యంత ప్రమాదకరమైన పాము జాతి. దీని విషం నిమిషాల్లో మనిషిలో అంతర్గతంగా రక్త స్రావం అయ్యేలా చేస్తుంది. కిడ్నీలను పాడు చేస్తుంది. ఒక్కోసారి మెదడుకు చేరి పక్షవాతాన్ని కలగజేస్తుంది. చివరికి రక్తం గడ్డకట్టేలా చేసి మనిషి ప్రాణం తీస్తుంది. టైగర్ స్నేక్ ఎలాపిడ్ జాతికి చెందిన టైగర్ స్నేక్ పాములు కూడా ఆస్ట్రేలియా గడ్డపైనే కనిపిస్తాయి. ఒంటిపై ఉండే మచ్చల కారణంగా వాటికి టైగర్ స్నేక్ అనే పేరొచ్చింది. నివాస ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తూ.. అరగంటలో మనిషి మరణానికి కారణం అవుతుంటాయి. టైగర్స్నేక్స్ విషం నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపెడుతుంది. కండరాల్లో రక్తం గడ్డ కట్టేలా చేస్తుంది. కోబ్రా తరహాలో పడగ విప్పి.. భయపెడుతుంది. ఇన్‌ల్యాండ్ టైపాన్ ఈ భూమ్మీద అత్యంత విషపూరితమైన పాము ఇది(అనధికారికంగా). వంద గ్రాముల విషంతో వంద మందిని చంపగలిగే సామర్థ్యం ఉన్న పాము ఇది. వంద గ్రాముల విషాన్ని ఒకే కాటుతో దింపగలదు ఇది. కానీ, ఎల్డీ50 ప్రకారం(త్వరగా ప్రాణం తీసే లెక్కప్రకారం).. లిస్ట్ వల్ల మూడో ప్లేస్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ విషం ప్రభావంతో గంటలో ప్రాణం పోవడం ఖాయం. ఇవి జనారణ్యానికి దూరంగా ఏకాంతంగా బతుకుతాయి. ఈ పాముకి ‘సిగ్గు’ ఎక్కువ అని అంటుంటారు. మనుషులను చూస్తే.. ఇవి వేగంగా పాక్కుంటూ వెళ్లి ఓ మూల దాక్కుంటాయి. అలా ఈ డేంజర్ స్నేక్కు ‘సిగ్గున్న పాము’గా ముద్దు పేరు వచ్చింది. రస్సెల్స్ వైపర్ ఆసియాలో అత్యంత ప్రమాదకరమైన పాము జాతిగా పేరుంది రస్సెల్స్ వైపర్‌కి. అంతేకాదు ఎక్కువ మరణాలకు కారణమైన జాతి కూడా ఇదే. దీనిని గుర్తించడం కూడా చాలా తేలిక. భయంతో ఉన్నప్పుడు అది గట్టిగా శబ్దం చేస్తుంటుంది. కాటు వేసిన మరుక్షణం నుంచే విషం శరీరంలోకి ఎక్కేస్తుంటుంది. ఒక్క రస్సెల్స్ వైపర్ గక్కే విషంతో లక్షా యాభై వేల ఎలుకలను చంపొచ్చనేది సైంటిస్టుల మాట. బ్లూ క్రాయిట్ ఆసియాలో ప్రమాదకరమైన పాముల్లో దీని పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంటుంది. దీని విషయం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపెడుతుంది. చికిత్స అందినా సగం మంది చనిపోతుంటారు. అంత ప్రమాదకరమైంది ఈ పాము విషం. ఇవి విషపూరితమైన పాముల్నే ఆహారంగా తీసుకుంటాయి. జనసంచారానికి దూరంగా పగటి పూట పచ్చిక బయళ్లలో, అడవుల్లో స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి ఇవి. బూమ్స్లాంగ్ క్లౌబ్రిడ్ కుటుంబంలో అత్యంత విషపూరితమైన పాము జాతి ఇది. రంగు రంగుల్లో ఉంటాయి ఇవి. విషం అంత విషపూరితమైనది కాకపోయినా.. రక్తస్రావం కారణంగా ప్రాణం పోతుంటుంది. అందుకే ప్రమాదకరమైన పాముల లిస్ట్‌లో చేర్చారు. అయితే ఇవి మనుషులు కనిపిస్తే.. దూరంగా వెళ్లిపోతుంటాయి. ఇవి దాడులు చేసే సందర్భాలు చాలా తక్కువ. చెట్ల మీద ఉంటూ పక్షుల్ని, పురుగులని తింటాయి. మోజావే రాటెల్స్నేక్ అమెరికా నుంచి పాము జాతుల్లో అత్యంత విషపూరితమైన లిస్ట్‌లో ఫస్ట్ కనిపించేది ఇదే. రక్తం, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపెడుతుంది దీని విషం. నైరుతి అమెరికా పప్రాంతంలో ఎక్కువ మరణాలు సంభవించేది ఈ పాముల వల్లే. స్టిలెట్టో స్నేక్ పరిణామంలో చిన్నగా ఉండి, కలుగుల్లో దాక్కునే పాము ఇది. కానీ, విషపూరితమైంది. అయితే అదృషవశాత్తూ ఇది ఎక్కువ విషాన్ని కక్కదు. కానీ, దీని విషం ఎంత ప్రమాదకరమంటే.. కణజాలాన్ని దెబ్బ తీయడంతో పాటు గుండె పనితీరును స్తంభింపజేస్తుంది. అంతేకాదు వీటిని పట్టడం కూడా అంత ఈజీ కాదు. కోరలు కూడా విచిత్రంగా వంగి ఉంటాయి. కాబట్టి, నేరుగా కాకుండా వంగి మరీ కాటు వేస్తుంది స్టిలెట్టో. సా స్కేల్డ్ వైపర్ ఇది అంత విషపూరితమైన పాము కాదు. కానీ, ప్రమాదకరమైన జాతిలో ఒకటి. భారత్ తో సహా చాలా దేశాల్లో ఇవి కనిపిస్తుంటాయి. చిన్నసైజులో ఉన్నప్పటికీ అగ్రెసివ్‌గా ఇవి దాడులు చేస్తాయి. వైపర్ జాతి పాముల్లాగే రక్తం గడ్డకట్టించి చంపుతాయి. అయితే విరుగుడు వెంటనే ఇవ్వకపోతే బతకడం కష్టం. ఇసుకలో దాక్కుని వేటాడుతుంటాయి. ఒకవేళ దగ్గరగా వెళ్లాలని ప్రయత్నిస్తే.. గట్టిగా శబ్ధం చేస్తూ భయపెడుతుంటాయి. కింగ్ కోబ్రా విషానికి బ్రాండ్ అంబాసిడర్ ఈ జాతి. అత్యంత పొడవైన విషపూరితమైన పాము కింగ్ కోబ్రా. పైన చెప్పుకున్నంత రేంజ్లో వీటిలో విషం లేకపోయినా.. ఎక్కువ పరిమాణంలో విషం చిమ్మడం, కాటు వేయడంతో పాటు రూపంతోనే భయపెట్టేస్తుంటాయివి. ఇక ఆడ పాము గూడుకట్టి గుడ్లు పెట్టాక.. మగపాముతో కలిసి కాపలా కాస్తుంటుంది. వీటితో పాటు కోస్టల్ టైపాన్, బాండెడ్ క్రాయిట్, కామన్ డెత్ ఆడర్, సముద్రంలో ఉండే బీక్డ్ సీ స్నేక్, ఆఫ్రికన్ డేంజరస్ స్నేక్ జాతి ‘బ్లాక్ మాంబా’, చైనీస్ కోపర్హెడ్, సౌత్ అమెరికన బుష్‌మాస్టర్, ఫర్ డె డాన్స్, బెల్చర్స్ సీ స్నేక్, బ్లూ మలయన్ కోరల్ స్నేక్.. ఆ తర్వాతి స్థానాలో ఉన్నాయి. ఇక వీటితో పాటు విషం లేని బుక్స్నేక్(నార్త్ అమెరికా, అమెరికా), కొండ చిలువ జాతికి చెందిన పాములు, జెనస్ యూనెక్టస్కు చెందిన వాటర్ బోస్(అనకొండ) కూడా ఈ భూమ్మీద ఉన్నాయి. అదృష్టం అంటే దీనిదే.. చాలాకాలం కిందట వైరల్ అయిన వీడియో ఇది How could we dedicate #WorldSnakeDay to anything else? 🐍#PlanetEarth2 pic.twitter.com/B4YxSxqmvm — BBC Earth (@BBCEarth) July 16, 2018 "I'm asking you to respect these creatures, because they have a right to be on Earth, the same way we do." We know many of you may be scared of snakes but it's #WorldSnakeDay, so we asked the 'Snake Man of Lagos' - Dr Mark Ofua - why it's so important we protect them. 🐍 pic.twitter.com/DgWc12NvoS — BBC News Africa (@BBCAfrica) July 16, 2019 -
చెరువులో విషప్రయోగం.. లక్షల్లో చేపలు మృత్యువాత
రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని వెల్ది బుడమాయి చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేశారు. దీంతో రూ.లక్షకు పైగా విలువైన చేపలు మృత్యువాత పడ్డాయని ముదిరాజ్ కులస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ చెరువులో ముదిరాజ్ కులస్తులు చేపలు పడుతూ జీవనం సాగిస్తుండగా, శుక్రవారం ఉదయాన్నే వందలాదిగా చేపలు చనిపోయి ఒడ్డుకు వస్తుండడాన్ని గుర్తించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ కుల పెద్ద ఆళ్ల కొమురయ్య మాట్లాడుతూ చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలపడంతో రూ.లక్షకు పైగా విలువైన చేపలు మృత్యువాత పడ్డాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చెరువు చైర్మన్ ఆళ్ల గట్టయ్యతో పాటు కావాటి దానయ్య, కావాటి నాగరాజు, రాజు, లింగరాజు, బోయిని కృష్ణ పాల్గొన్నారు. -
నాపై విష ప్రయోగం జరిగింది : ఇస్రో శాస్త్రవేత్త
బెంగుళూరు : భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త తపన్ మిశ్రా సంచలన ఆరోపణలు చేశారు. మూడేళ్ల క్రితం తనపై విష ప్రయోగం జరిగిందని ఫేస్బుక్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇస్రోలో కలకలం రేపుతున్నాయి. 2017 మే 23న ఇస్రో ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ ప్రమోషన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న తనను చంపేందుకు కుట్ర జరిగినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ‘సుదీర్ఘ కాలం దాచి ఉంచిన రహస్యం’ పేరిట ఫేస్బుక్లో మిశ్రా చేసిన పోస్టు సంచలనం రేకెత్తిస్తుంది. ఆరోజు తాను తీసుకున్న దోశ, చట్నీలో విషపూరిత రసాయనాన్ని కలిపారని తెలిపారు. ఈ విష ప్రయోగం జరిగిన తర్వాత శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డానని, చర్మంపై ఆసాధారణ దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్తో చర్మం పెచ్చులుగా ఊడిపోయిందని చెప్పారు. (ప్రణబ్ ఆత్మకథలో సంచలన విషయాలు ) గూఢచర్యంలో భాగంగానే తనపై ఈ కుట్ర జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అందువల్లే ఓ ప్రముఖ రాడార్ ఆధారిత ప్రాజెక్టుకు సీనియర్ శాస్త్రవేత్తగా ఉన్న నన్ను తొలిగించేందుకే ఈ దాడి చేసి ఉంటారని తెలిపారు. ఈ కుట్రపై కేంద్ర హోంశాఖ అధికారులు తనను ముందే హెచ్చరించారని, ఓ సహోద్యోగి కూడా దీనిపై ముందే తనను అలర్ట్ చేసినట్లు మిశ్రా అన్నారు. వీరి వల్లే వైద్యులకు చికిత్స అందించడం సులువైందని, లేదంటే విష ప్రయోగం జరిగిన రెండు, మూడు గంటల్లోనే తాను చనిపోయి ఉండేవాడినని చెప్పారు. ఈ చీకటి నిజాన్ని బయటికి బహిర్గతం చేయవద్దంటూ ఇప్పటికీ తనకు వందలాది మెయిల్స్ వస్తున్నాయని మిశ్రా అన్నారు. అంతేకాకుండా గత రెండేళ్లుగా తాను ఉంటున్న క్వార్టర్స్‌లోకి క్రమం తప్పకుండా కోబ్రా, క్రైట్ వంటి విషపూరిత పాములు కనిపించాయని చెప్పరు. సెక్యురిటీ సిబ్బంది వల్ల అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. ఇప్పటికీ ఈ విషయం బయటకు రాకుండా కొందరు బెదిరింపులకు దిగుతున్నారని, మానసిక వికలాంగుడైన తన కుమారుడిని లక్క్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు.జూలై 19, 2019న యుఎస్ విశ్వవిద్యాలయంలోని ప్రవాస ప్రొఫెసర్ కూడా క్విట్ ప్రోకో పద్ధతికి తనతో బేరం ఆడాడని, ఈ విషయం బయటకు రాకుండా చూస్తే తన కుమారుడికి ఓ ప్రముఖ కాలేజీలో అడ్మిషన్ కూడా ఇప్పిస్తానని మభ్యపెట్టాడని ఆరోపించారు. అయితే వీటికీ తాను బెదరలేదుని, గతేడాది సెప్టెంబర్‌లోనూ తనపై మరోసారి విష ప్రయోగం చేయాలని విఫలయత్నం చేసినట్లు మిశ్రా పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇప్పటికైనా కేంద్రం దర్యాప్తు చేయాల్సిందిగా తపన్ మిశ్రా అభ్యర్థించారు. గత కొన్నాళ్లుగా డైరెక్టర్లతో చర్చించినా ఫలితం లేదని, దీని వెనుక దాగున్న కుట్రదారులెవరో ప్రభుత్వమే దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టాలని విఙ్ఞన్తి చేశారు. స్పేస్ అప్లికేషన్ సెంటర్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించిన తపన్ మిశశ్రా ప్రస్తుతం ఇస్రోలో సీనియర్ సలహాదారుగా పనిచేస్తున్నారు. జనవరి చివర్లో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే కాగా తపన్ మిశ్రా ఆరోపణలపై ఇస్రో ఇంకా స్పందించలేదు. (దేశంలో కొత్త విపత్తు ) -
షాకింగ్ : ట్రంప్‌కు విరుగుడు లేని విషం
వాషింగ్టన్ : కీలకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై గుర్తుతెలియని వ్యక్తులు విష ప్రయోగానికి కుట్రలు పన్నారు. ఈ మేరకు శనివారం రాత్రి అధ్యక్షుడి అధికార నివాసమైన వైట్‌హౌస్‌కు విషంతో కూడిన ఓ పార్సిల్‌ను పంపారు. దీనిపై దేశ అత్యున్నత ఫెడరల్ దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ)తో పాటు మరికొన్ని బృందాలు విచారణ చేపడుతున్నాయి. పార్సిల్లో ఉన్నది రిసిన్ అనే అత్యంత విషపూరితమైన పదార్థంగా గుర్తించారు. ఇది అత్యంత ప్రమాదకరమైన పదార్థమని, దానిని స్పీకరించిన 36 నుంచి 72 గంటలలోపు మనిషి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నట్లు వైద్యులు భావిస్తున్నారు. అయితే దీనికి ఇంత వరకు విరుగుడు కనిపెట్టకపోవడం గమనార్హం. (గుడ్‌న్యూస్ : టిక్‌టాక్ బ్యాన్పై వెనక్కి..!) అయితే ఆ విషపు పార్సిల్ కెనడా నుంచి వచ్చినట్లు వైట్‌హౌస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో ఇలాంటి విష పదార్థాలతో కూడిన పార్సిల్స్ వైట్‌హౌస్‌కు వచ్చాయని గత అధికారులు గుర్తుచేశారు. ఈ కేసులో దోషులగా తేలిన వారికి స్థానిక కోర్టు కఠిన శిక్షను సైతం ఖరారు చేసింది. అయితే అధ్యక్ష ఎన్నికల ముందు ఇలాంటి ప్రయోగం జరగడం అధికారులను కలవరపెడుతోంది. తాజా ఘటనతో ట్రంప్ భద్రతా బృందం మరింత అప్రమత్తమైంది. (చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టే దిశగా..) -
పుతిన్ ప్రత్యర్థిపై విష ప్రయోగం!
మాస్కో: రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఇటీవల కాలంలో బలమైన ప్రత్యర్థిగా మారారు అలెక్సీ నావల్నీ. ప్రస్తుతం ఆయన కోమాలో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. 44 ఏళ్ల నావల్నీపై విషప్రయోగం జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. ఆయన సైబీరియా నుంచి మాస్కోకి తిరిగివస్తుండగా, మార్గమధ్యంలో విమానంలో బాత్రూంకి వెళ్లి అపస్మారకస్థితిలో కింద పడిపోయారు. దీంతో ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని ఓమ్స్క్ నగరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను నావల్నీ ప్రతినిధి కిరా యార్మిష్ ట్విటర్ ద్వారా తెలిపారు. నావల్నీ ఉదయం బోర్డింగ్ సమయంలో ఎయిర్ పోర్టులో టీ తాగారని, అది తప్ప మరేమీ తీసుకోలేదని చెప్పారు. టీలోనే విషం కలిపి వుంటారని అనుమానం వ్యక్తం చేశారు. విమానంలోకి ఎక్కిన తరువాత ఆయనకు చెమటలు పట్టాయని, తనని మాట్లాడుతూ ఉండమని కోరారని, తద్వారా అపస్మారక స్థితిలోకి వెళ్లకుండా ఉండొచ్చని చెప్పారని కిరా యార్మిష్ తెలిపారు. తరువాత బాత్రూంకి వెళ్లి కిందపడిపోయారని వెల్లడించారు. రష్యా ఆఫ్ ద ఫ్యూచర్ రాజకీయ పక్షానికి చెందిన అలెక్సీ నావల్నీ అవినీతి వ్యతిరేక ఉద్యమాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల్లో బలమైన నేతగా ఎదిగారు. ఆయన ఏకంగా అధ్యక్షుడు పుతిన్ పైనే అవినీతి ఆరోపణలు చేస్తూ పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. ఆయనపై పలుమార్లు దాడులు కూడా జరిగాయి. దీనికి ముందు కూడా ఒకసారి ఆయనపై విష ప్రయోగం జరిగింది. ఈ విష ప్రయోగం అధ్యక్షుడు పుతిన్ చేయించి వుంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: పాక్ కుయుక్తులు: కశ్మీర్‌పై డ్రాగన్‌తో మంతనాలు -
ప్రాణం తీసిన విషవాయువు
అనంతగిరి: పసుపు నిల్వకు వినియోగించే గుళికల వాసనతో అస్వస్థతకు గురై ఓ విద్యార్థి మృతి చెందాడు. ఇదే ఇన్ఫెక్షన్తో బాలుడి తల్లి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్తులు, స్థానికుల వివరాల ప్రకారం వికారాబాద్‌లోని బీటీఎస్ కాలనీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రభాకర్‌రెడ్డి, భార్య అమ్రేషా, కూతురు, కుమారుడితో కలిసి ఉంటున్నారు. రంజిత్‌రెడ్డి భృంగీ స్కూల్లో 9వ తరగతి చదువుతుండేవాడు. ఈయన స్వగ్రామం వికారాబాద్ మండలం పీలారం. గ్రామంలో గతేడాది సాగు చేసిన పసుపు పంటను వికారాబాద్‌లోని ఇంట్లో నిల్వ ఉంచాడు. పసుపు పాడవకుండా గుళికలు కలిపాడు. ప్రభాకర్ రెడ్డి మంగళవారం పంచాయతీ ఎన్నికల విధులకు వెళ్లాడు. రాత్రి ఇంటికి కూడా రాలేదు. అయితే ఇంట్లో భార్య అమ్రేషా, కుమారుడు రంజిత్‌రెడ్డి ఉన్నారు. పసుపు నిల్వకు సంచుల్లో మందు గుళికలు వేశారు. గుళికలు వేసిన సంచులకు మూతసరిగా కట్టలేదు. దీంతో ఆ గుళికల వాసన ఇళ్లంతా వ్యాపించింది. ఈ మందు భోజనంలో కలిసిపోయింది. ఈ విషయం తెలియక తల్లీకొడుకులు సాయంత్రం భోజనం చేశారు. దీంతో మంగళవారం రాత్రంతా ఇద్దరు వాంతులు, విరేచనాల బారిన పడ్డారు. అలాగే సృహతప్పి పడిపోయారు. బుధవారం ఉదయం 9 గంటలైనా ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడాన్ని గమనించి స్థానికులు తలుపు కొట్టారు. నీరసంగా ఉన్న అమ్రేషా తలుపు తీసి జరిగిన విషయం చెప్పింది. వారు వెంటనే అమ్రేషాతో పాటు కుమారుడు రంజిత్‌రెడ్డిని వికారాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. రంజిత్‌రెడ్డి మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అమ్రేషా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. కాగా ప్రభాకర్‌రెడ్డి ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం వెళ్లగా ఘటన తెలియడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ ఘటనతో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. -
హరుడికే అమ్మ అయిన అమ్మవ్వ
పూర్వం బెజ్జ మహాదేవి అనే భక్తురాలు ఉండేది. ఆమె ఒకనాడు ఇలా అనుకుంది. ‘శివునికి అందరూ ఉన్నారు. కానీ అమ్మానాన్నా మాత్రం లేరు. చచ్చిపోయారో ఏమో పాపం. మా అమ్మ పోతే నాకెంత దుఃఖమో, ఆయనకూ అంత బాధే ఉండాలి. తల్లి వుంటే శివుణ్ణి సన్యాసి కానివ్వదు. తల్లి వుంటే తల జడలు కట్టనివ్వదు. అమ్మ వుంటే విషం తాగనిస్తుందా? అలా తోళ్లు కట్టుకొని తిరగనిస్తుందా? పాములు మెడలో వేసుకుని, వంటికి బూడిద పూసుకుని తిరుగుతుంటే చూస్తూ ఊరుకుంటుందా? తల్లి వుంటే శివునికి తిరిపమెత్తుకు తిరిగే కర్మమెందుకు పడుతుంది? అనాథలా వల్లకాటిలో ఎందుకు తిరిగేవాడాయన?’ దాంతో ఆమెకు శివుడి మీద మాతృత్వ భావన కలిగింది. ‘అమ్మానాన్నలు లేని ఆ శివయ్యకి ఇక నుంచి అమ్మయినా, నాన్నయినా నేనే’ అని అనుకుంది. బెజ్జమహాదేవి శివలింగ మూర్తిని కాళ్లపై పడుకోబెట్టి నీళ్లు పోసి తుడిచి వస్త్రాలు చుట్టి భస్మం పెట్టి, కాటుక బెట్టి పాలిచ్చి పెంచసాగింది. ఆమె ముగ్ధ భక్తికి శివుడు మెచ్చి అన్ని ఉపచారాలూ స్వీకరించసాగాడు. ఒకనాడు ఆమెను పరీక్షింపదలచి పాలు తాగడం మానివేశాడు. బెజ్జ మహాదేవి దానికి భయపడిపోయింది. ‘అయ్యో బిడ్డడికి అంగిట్ల ముల్లయింది’ అని ఏడ్చింది. అడ్డమైన ప్రతి భక్తుడి ఇంటికి తిరిగి ఏది పెడితే అది తిని వస్తావు. ఎక్కడ గొంతునొచ్చిందో ఏమోనని పుత్రవాత్సల్యం చూపిస్తూనే ఆయనకు కలిగిన కష్టానికి కుమిలిపోయింది. శివుడు పాలు, వెన్నా ఏమీ ముట్టకపోయేసరికల్లా ‘ఇక మాటలతో పనిలేదు బిడ్డా! నీ బాధ చూస్తూ నేను బతికి ఉండి మాత్రం ఏమి లాభం?’ అని తల నరుక్కోడానికి సిద్ధపడింది. ఆమె అవ్యాజ ప్రేమానురాగాలకు, నిష్కల్మష భక్తికి ఉబ్బు శంకరుడు మరింతగా ఉబ్బిపోయాడు. వెంటనే ఆమె ముందు ప్రత్యక్షమై ‘వరాలు కోరుకో’మన్నాడు. అప్పుడు బెజ్జ మహాదేవి ‘‘కన్న ప్రేమకంటే ఈ పెంచిన ప్రేమయే గొప్పది. నీవు నా కొడుకువు. నీ ముఖాన్నే శాశ్వతంగా చూస్తూ ఉండేటట్టు అనుగ్రహించు’’ అంది. శివుడందుకు సంతోషించి ఆమెకు నిత్యత్వాన్ని ప్రసాదించాడు. శివునికి తల్లి అయిన కారణంగా ఆమె అమ్మవ్వ అనే పేర ప్రసిద్ధురాలైంది. భగవంతుడిని అదివ్వు, ఇదివ్వు అని కోరుకునేవారే కానీ, ఆయనకు అమ్మానాన్నా అయి, ఆలనాపాలనా చూసేవారెవరుంటా రు? అసలంతటి నిష్కల్మషమైన భక్తి ఎవరికి ఉంటుంది? అందుకే శివుడు ఆమెను అమ్మలా ఆదరించాడు. నాన్నలా తన గుండెలో నిలుపుకున్నాడు. భక్తి అంటే అలా ఉండాలి. – డి.వి.ఆర్. -
ముట్టుకుంటే మటాషే!
కొన్ని జీవులు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. చూడగానే మనసును ఆకట్టుకుంటాయి! ఒకసారి చేతిలోకి తీసుకొని వాటితో సరదాగా ఆడుకోవాలనిపిస్తుంది. అలాగని వాటిని మనం ముట్టుకున్నామంటే మటాషే! వినడానికి వింతగా ఉన్నప్పటికీ ఇది నిజంగా నిజం! కావాలంటే చదివి మీరే తెలుసుకోండి! షాక్ కొట్టే ఈల్! చేపే కదా అని ముట్టుకుంటే షాక్ కొట్టేస్తుంది! ఇది ఇక్కడ కనిపించే చేప గురించి చేప్పే మాట! దీన్ని ఎలక్టిక్ర్ ఈల్ అంటారు. దీన్ని ముట్టుకుంటే గట్టి షాక్ తగులుతుంది. దాదాపు ఆరు వందల ఓల్టుల దాకా కరెంటును ఉత్పత్తి చేస్తుంది. దక్షిణ అమెరికాలోని అమేజాన్, ఓరినోకో ప్రాంతాలకి చెందిన చెరువుల్లో, నదుల్లో బతుకుతుంది. కేవలం చేపలనే కాక, కొన్ని ఉభయచరాలని, పక్షులని కూడా భక్షిస్తుంది. ఇవి శ్వాస మీద బతికే జంతువులు. కనుక నీట్లోంచి బయటికి తరచు వచ్చి గాలి పీల్చుకోవాల్సి వస్తుంది. వీటి కంటి చూపు మందంగా ఉంటుంది. విమానాలు, ఓడలు రాడార్ సంకేతాలతో లక్ష్యాల దూరాలు తెలుసుకున్నట్టు, గబ్బిలాలు శబ్దతరంగాలతో చుట్టూ ఉన్న వస్తువుల దూరాలు తెలుసుకున్నట్టు, ఈ జలచరం విద్యుత్ ప్రవాహాన్ని వెలువరించి అది పరిసరాలలో విస్తరించే తీరును బట్టి చుట్టూ ఉండే వస్తువుల స్థానాలని నిర్ణయిస్తుంది. ఈ ప్రక్రియనే ‘విద్యుత్ స్థాన నిర్ణయం’ అంటారు. సగటు ఎలక్టిక్ర్ ఈల్ పొడవు ఎనిమిది అడుగుల దాకా ఉంటుంది. బరువు 20 కిలోల వరకు ఉండొచ్చు. సగటు ఆయుర్దాయం 15 ఏళ్లు. పొడవుగా, పాము లాంటి శరీరంతో ఉంటుంది. నిలువెల్లా గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. దీని దెబ్బకి మనుషుల ప్రాణాలు పోయిన సంఘటనలు అరుదే అయినా ఇది కొట్టే షాక్ వల్ల మనుషుల ప్రాణాలకి ప్రమాదం లేకపోలేదు. దీని షాక్ తగిలి గుండె ఆగిపోవడం, శ్వాస నిలిచిపోవడం వంటివి జరిగి, స్థాణువైన మ నుషులు ఈదలేక నీట మునిగిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఒళ్లంతా విషమే! నారింజ, నలుపు రంగుల్లో ఈ పక్షి.. చూడటానికి చాలా అందంగా ఉంది కదూ! మధురంగా పాడుతుంది కూడా. అలాగని పట్టుకుందామనిపిస్తోందా? ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే! చెట్టు కొమ్మ మీద ఉంటే చూసి ఆనందించడమే మంచిది. పట్టుకున్నారో ప్రమాదమే. ఎందుకంటే దాన్ని తాకితే చాలు, దాని ఈకలు, శరీరంపై ఉండే విషం ఎక్కేస్తుంది. తోటి జీవులకే కాదు, మనుషులకి కూడా అది ప్రమాదమే. ఒళ్లంతా తిమ్మిరి పట్టడం, తల తిరగడం వంటిలక్షణాలు కలిగి ఒకోసారి పక్షవాతం రావడం, మరణించడం కూడా జరిగే ప్రమాదముంది. అందుకే ఇది ప్రపంచంలో ఉన్న పక్షులన్నింటిలో విషపూరితమైనదిగా పేరు తెచ్చుకుంది. తోక నుంచి ముక్కు దాకా ఎక్కడ తాకినా అంతా విషమయమే. న్యూగినియా అడవుల్లో కనిపించే ఈ పక్షి పేరు పితోహి. చర్మం, ఈకలపై ఒకరకమైన విషరసాయనం ఉంటుంది. ఇదే దానికి రక్షణ కవచం కూడా. పాములు, ఇతర జంతువుల నుండి రక్షించుకోడానికి ఉపయోగపడుతుంది. విచిత్రమేమిటంటే ఈ విషం దాని శరీరంలో ఉత్పత్తి కాదు. అది తినే ఆహారం ద్వారా ఏర్పడుతుంది. ఇవి ఎక్కువగా కోరెసైన్ అనే కీటకాలను ఆరగిస్తూ ఉంటాయి. వాటిలో ఉండే విషాన్నే దీని చర్మం, ఈకలు స్రవిస్తూ ఉంటాయి. జీవులన్నింటిలో అత్యంత ప్రమాదకరమైన జీవిగా ‘పాయిజన్ డాట్ కప్ప’ని పేర్కొంటారు. దాని శరీరంపై ఉండే విషరసాయనమే దీనిపై కూడా ఉంటుందని కనుగొన్నారు. న్యూగినియా గిరిజనులకు వీటి గురించి ముందే తెలుసు. వీటిని వాళ్లు ‘గార్బేజ్ బర్డ్స్’ అంటారు. అంటే చెత్త పక్షులన్నమాట. వీటి శరీరం నుంచి దుర్వాసన వస్తుంటుంది. అందుకే ఆ పేరు. వీటిలో ఆరు జాతులుంటే, మూడు విషపూరితమైనవే. అంతా ఇంతా కాదు! చిత్రంలో కప్పను చూశారా. చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది కదూ! పేరు గోల్డెన్ డాట్ ఫ్రాగ్. కానీ దాని గురించి చెప్పాల్సిన మరో నిజం ఒకటుంది. దాని చర్మంపై రంగులతో పాటు విషాన్ని కూడా నింపుకొని ఉంటుందట.! ప్రపంచంలోనే అత్యంత విషపూరిత జీవిగా పేరుగాంచింది. ఈ కప్పలో ఉన్న విషంతో 20 వేల ఎలుకలను చంపొచ్చొట! అయితే మనం దీన్ని ముట్టుకోగానే విషం ఎక్కదు. నోట్లో పెట్టుకుంటోనో, కళ్లు, ముక్కు లాంటి చోట్ల లేదా ఏదైనా గాయం తగిలిన చోట్ల ఈ కప్ప విషం తగిలితే ప్రభావం ఉంటుంది. ఈ విషం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోవటం, పక్షవాతం రావటం, కొన్ని సందర్భాలో చనిపోవటం కూడా జరుగుతుంది. పాయిజన్ డాట్ కప్పల్లో 200 రకాలు ఉన్నాయి. వీటి పరిమాణం ఒకటి నుంచి ఆరు సెంటీమీటర్లు ఉంటుంది. రంగులతో ఆకర్షించడమే కాదు. విషంతో వేటాడి ఇతర కీటకాలనూ చంపేయ గలవు. ఇవి ఎక్కువగా ముదురు ఎరుపు, నీలం, పసుపు, లేదా ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. వీటి చర్మంపై ఉండే గ్రంధుల ద్వారా విషం విడుదలవుతుంది. సమీపంలో ఉన్న ఇతర కీటకాలపై ఆ విషాన్ని వెదజల్లి చంపుతాయి. వీటికి దష్టి సామర్థ్యం కూడా ఎక్కువే. పది సంవత్సరాలకు మించి జీవిస్తాయి. దక్షిణ అమెరికా వర్షారణ్య ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. అక్కడి గిరిజనులు వాళ్ల బాణాలకు ఈ కప్ప విషం పూసి శత్రువులను చంపేందుకు ప్రయత్నిస్తారు.