సాక్షి,ఆత్మకూరు(వరంగల్): తండ్రి మందలిస్తాడేమోనని భయపడి పురుగుల మందుతాగి ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని తిరుమలగిరి శివారులో చోటుచేసుకుంది. వివరాలు.. శాయంపేట మండలం ఆరెపల్లికి చెందిన నాగలగాని రవి కుమారుడు భరత్(17) ధర్మసాగర్ మండలం కరుణాపురంలో నడుస్తున్న మహాత్మాజ్యోతిరావుపూలే జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ ప్రథమసంవత్సరం చదువుతున్నాడు.
ఆదివారం కళాశాలలో బయటకు వెళ్లి గుట్కాలు కొనుగోలు చేసి కళాశాల లోపలికి తీసుకువస్తుండగా వాచ్‌మన్ చూసి ఫొటోతీసి ప్రిన్సిపాల్‌కు పంపాడు. ప్రిన్సిపాల్ విద్యార్థి తండ్రి రవికి ఫోన్‌చేసి చెప్పగా కాలేజీకి వచ్చి మాట్లాడుతానని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తండ్రి వస్తే ఏమి జరుగుతుందోనని భయపడి అదేరోజు పారిపోయి మండలంలోని తిరుమలగిరిలోని వ్యవసాయ బావి వద్దకు వచ్చి అక్కడ ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
అక్కడి నుంచి సోమవారం ఉదయం తెల్లవారు జామున శాయంపేట మండలంలోని ఆరెపల్లిలోని ఇంటికి వచ్చి వాంతులు చేసుకోగా గమనించిన తండ్రి కుటుంబసభ్యులు విషయం తెలుసుకుని చికిత్స నిమిత్తం పరకాలలోని ఓప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి తండ్రి రవి ఫిర్యాదు మేరకు ఆత్మకూరు సీఐ గణేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కానిస్టేబల్ జైరాజ్ సూచనమేరకు విద్యార్థి నేత్రాలను దానం చేశారు.
చదవండి: Vellore Jewellery Store Heist: వేలూరు జోస్ ఆలుక్కాస్ జ్యువెలరీ షాపుకు కన్నం వేసిన దొంగ అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment