కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న క్రమంలో మంగళవారం మరోసారి రెండు దేశాల మధ్య ఇస్తాంబుల్ వేదికగా శాంతి చర్చలు జరుగునున్నాయి. కాగా, గత రెండు వారాలుగా జరుగుతున్న శాంతి చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా అంతకు ముందకు శాంతి చర్చల్లో పాల్గొన్న సభ్యులపై విష ప్రయోగం జరిగినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్, బిల్లింగ్ క్యాట్ తన నివేదికలో పేర్కొన్నాయి.
రెండు దేశాల మధ్య చర్చల్లో పాల్గొన్న రష్యా బిలియనీర్ రోమన్ అబ్రమోవిచ్, ఉక్రెయిన్‌కు చెందిన సంధానకర్తలపై విష ప్రయోగం జరిగినట్టు పేర్కొంది. ఈ క్రమంలో అబ్రమోవిచ్, ఉక్రెయిన్‌కు చెందిన ఇద్దరు సీనియర్ సభ్యులు ప్రభావితమయ్యారని వాల్ స్ట్రీట్ జర్నల్ తన నివేదికలో తెలిపింది.
రష్యా బిలియనీర్ రోమన్ అబ్రమోవిచ్, ఉక్రేనియన్ శాంతి సంధానకర్తల మధ్య ఉక్రెయిన్‌లోని కీవ్‌లో జరిగిన సమావేశం తర్వాత అనుమానాస్పద విషపు లక్షణాలను ఎదుర్కొన్నారని వాల్ స్ట్రీట్ జర్నల్, పరిశోధనాత్మక అవుట్‌లెట్ బెల్లింగ్‌క్యాట్ సోమవారం ఓ నివేదికలో పేర్కొన్నాయి. వారి నివేదక ప్రకారం.. విష ప్రయోగం జరిగిన అనంతరం అబ్రమోవిచ్, సంధానకర్తల చర్మంపై దద్దర్లు రావడం, కళ్లు ఎర్రబడటం, స్వల్ప అనారోగ్యానికి గురైనట్టు వెల్లడించింది. కాగా, ప్రస్తుతం వారు కోలుకున్నారని, వారి ఆరోగ్యం మెరుగుపడిందని నివేదిక వెలువరించింది.
ఈ ఘటనపై నెదర్లాండ్‌కు చెందిన బిల్లింగ్ క్యాట్ పరిశోధన సంస్థ.. వారిపై కెమికల్ వెపన్‌తో విష ప్రయోగం జరిగినట్టు పేర్కొంది. అయితే, తక్కువ డోసేజ్‌లో ఈ ప్రయోగం జరగడంతో ప్రమాదమేమీ జరగలేదని తెలిపింది. అలాగే, కేవలం వారిని బెదిరించేందుకే ఇలా విష ప్రయోగం జరిగినట్టు స్సష్టం చేసింది. ఇదిలా ఉండగా.. ఈ నివేదికపై ఇప్పటి వరకు రష్యా స్పందించకపోవడం గమనార్హం. మరోవైపు.. ఈ నివేదికను ఉక్రేనియన్‌కు చెందిన శాంతి చర్చల సంధానకర్తలు కొట్టి పాటేశారు. ఈ సందర్బంగా రుస్టెమ్ ఉమెరోవ్ మాట్లాడుతూ.. ధృవీకరించని సమాచారాన్ని ప్రజలు విశ్వసించవద్దని కోరారు.
Bellingcat can confirm that three members of the delegation attending the peace talks between Ukraine and Russia on the night of 3 to 4 March 2022 experienced symptoms consistent with poisoning with chemical weapons. One of victims was Russian entrepreneur Roman Abramovich. https://t.co/DJaZ4CoL8J
— Bellingcat (@bellingcat) March 28, 2022
Comments
Please login to add a commentAdd a comment