
మృతి చెందిన చేపలను చూపిస్తున్న మత్య్సకారులు
రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని వెల్ది బుడమాయి చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేశారు. దీంతో రూ.లక్షకు పైగా విలువైన చేపలు మృత్యువాత పడ్డాయని ముదిరాజ్ కులస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ చెరువులో ముదిరాజ్ కులస్తులు చేపలు పడుతూ జీవనం సాగిస్తుండగా, శుక్రవారం ఉదయాన్నే వందలాదిగా చేపలు చనిపోయి ఒడ్డుకు వస్తుండడాన్ని గుర్తించారు.
ఈ సందర్భంగా ముదిరాజ్ కుల పెద్ద ఆళ్ల కొమురయ్య మాట్లాడుతూ చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలపడంతో రూ.లక్షకు పైగా విలువైన చేపలు మృత్యువాత పడ్డాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చెరువు చైర్మన్ ఆళ్ల గట్టయ్యతో పాటు కావాటి దానయ్య, కావాటి నాగరాజు, రాజు, లింగరాజు, బోయిని కృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment