ఈ భూమ్మీద ఎన్నో రకాల విష జంతువులు ఉన్నాయి.విషపూరీతమైనవి అంటే ముందుగా గుర్తొచ్చేవి పాములు. అయితే విషపూరిత కప్పల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అదేంటి కప్పలు కూడా అంత ప్రమాదకరమా అని ఆలోచిస్తున్నారా? అవును.. అలాంటి విషపూరితమైన కప్పలు కూడా ఉన్నాయి. చూడటానికి అందంగా కనిపించే ఈ కప్పలు యమ డేంజర్. వీటిని గోల్డెన్ పాయిజన్ కప్పలు అని అంటారు. వీటికి ఒళ్లంతా విషమే. ఆఖరికి ఈ కప్పలను ముట్టుకున్నా శరీరం విషపూరితమవుతుంది.
► ఈ పాయిజన్ కప్పలు కొలంబియాలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. సాధారణంగా రెండు అంగుళాలు లేదా కాస్త పెద్దగా ఉండే ఈ కప్పలో పదిమందిని చంపేంత విషం ఇందులో ఉంటుంది. శతాబ్దాలుగా కొలంబియాలోని వేటగాళ్ళు తమ ఎరను పట్టుకోవడానికి ఈ రకమైన కప్ప విషాన్ని ఉపయోగిస్తారట.
► ఈ కప్పలను తాకినా ప్రాణాలు పోతాయట. పొరపాటున వీటిని టచ్ చేసినా చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కప్పల విషం నేరుగా చర్మంపై పడినా పల్స్ రేటు వెంటనే పడిపోయి మనిషి చనిపోయే ప్రమాదం ఉంది.
► ఈ కప్పలు పసుపు, నారింజ లేదా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ప్రదేశాన్ని బట్టి అవి వాటి రంగులను మార్చుకుంటాయి.
► ఒళ్లంతా విషాన్ని నింపుకున్న ఈ కప్పలను వైద్య రంగంలో ఉపయోగించేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. దీనిలోని విషాన్ని కొన్ని కెమికల్ పద్దతులను ఉపయోగించి పెయిన్ కిల్లర్స్‌ను తయారు చేసేందుకు రీసెర్చ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment