frog
-
బీరు సీసాలో కప్ప.. వీడియో వైరల్
సాక్షి, నిజామాబాద్: బీరు కొనుగోలు చేయడానికి వైన్ షాపునకు వెళ్లిన ఓ వ్యక్తి షాకయ్యాడు. బీరు సీసాలో కప్ప అవశేషాలు దర్శనమిచ్చిన ఘటన ఆర్మూర్ డివిజన్లోని డొంకేశ్వర్ మండల కేంద్రంలోని ఓ వైన్ షాపులో చోటు చేసుకుంది. దీంతో వైన్ షాపు నిర్వాహకుడిని ఆ వ్యక్తి నిలదీశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆ కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది. -
బిర్యానీలో కప్ప.. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్: గచ్చిబౌలి ట్రిపుల్ఐటీలోని కదంబ మెస్‌లో విద్యార్థులకు ఇటీవల పెట్టిన బిర్యానీలో కప్ప ప్రత్యక్షమైంది. దీంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిర్యానీలో కప్ప రావడానికి మెస్ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థులు మండిపడుతున్నారు. మెస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. బిర్యానీలో కప్ప ప్రత్యక్షమైన ఫొటోను విద్యార్థులు ట్విటర్లో షేర్ చేశారు. మెస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఫుడ్‌సేఫ్టీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.Shocked and horrified! Found a frog in my friend's meal today at Kadamba Mess (IIIT Hyderabad). This is completely unacceptable and poses a serious health risk! @cfs_telangana, please take immediate action! #FoodSafety #Unhygienic #Hyderabad #IIITHyderabad pic.twitter.com/VCCKM0kuob— ram manohar (@manoharrocksss) October 17, 2024 ఇదీ చదవండి: అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్తత -
ఒక హంతకుడి బాధితులు!
పదిహేనేళ్ల క్రితం మేము మా ఫార్మ్ హౌస్ లోకి మారే సమయానికి అక్కడే ఉన్న ఒక తాటి చెట్టుని గమనించాము. అది తన పక్కనే ఉన్నపెద్ద మర్రి చెట్టుతో సూర్యరశ్మి కోసం పోటీ పడుతూండటం చూసాము. పగటి పూట ఒక నల్లంచి పక్షి ఆ తాటి ఆకుల మధ్య కట్టుకున్న తన గూటిలోకి వెళ్ళివస్తూ కనిపించేది. సాయంత్రం ఎండిన తాటి ఆకుల మధ్య విశ్రమించిన గబ్బిలాలు ఆహారం కోసం బయటకు వస్తూ కనిపించేవి.తాటి కాయలు బాగా పండి, నలుపు రంగులోకి మారి మంచి వాసన వచ్చే సమయానికి పునుగు పిల్లులు వస్తుండేవి. అవి రాత్రి సమయాల్లో పండిన తాటి కాయలను తినడం కోసం చెట్లు ఎక్కి, ఎండిన తాటి ఆకులపైకి దూకుతూ శబ్దం చేసేవి. ఒకసారి తాటి కాయలను తిన్న తరువాత క్రింద పడేస్తుంటే, ఆ కాయలు నేలపై ఉండే ఎండుటాకులకు తగిలి రాత్రి నిశబ్దానికి భంగం కలిగించేవి. ఒక్కోసారి రెండు మూడు పునుగు పిల్లులు బిగ్గరగా అరుస్తూ పోట్లాడుకుంటుంటే ఆ శబ్దానికి నిద్రాభంగం అయిన నా భర్త రోమ్ నిద్రలేచి “నోర్మూసుకో” అని నా మీద అరిసి అటు తిరిగి చక్కగా గురకపెట్టేవాడు!మంచి ఎండాకాలంలో రాత్రి వేళలో వీచే గాలి, ఆ తాటి చెట్ల ఆకులను కదిలిస్తూ భయపెట్టే శబ్దాన్ని చేసేది. కొంతమంది ఈ శబ్దాలు దెయ్యాలు చేసేవని భ్రమపడుతుండేవారు. ఉదాహరణకు ఎప్పుడైనా అర్ధరాత్రి వేళల్లో మమ్మల్ని ఇంటి వద్ద దించటానికి వచ్చే టాక్సీ డ్రైవర్లు ఆ పరిసరాలను గమనించి "ఇలాంటి చోట్ల ఉండటానికి మీకు భయంగా లేదా!" అని ఎవరికి వినపడనంత మెల్లగా మమ్మల్నిఅడిగేవారు!కొన్నిదశాబ్దాల క్రితం కొన్ని తాటి చెట్లు వరుసగా మొలకెత్తి పెద్ద చెట్లు అయ్యాయి. కొన్నాళ్లకు ఒక మర్రి చెట్టు వాటిల్లోని ఒక తాటి చెట్టుపై మొలకెత్తి పరాన్నజీవిలా బ్రతకటం మొదలుపెట్టింది. తాటి చెట్లు ఎత్తుగా ఏపుగా పెరుగుతుంటే, వాటితో పాటు మర్రి చెట్టుకూడా తన కొమ్మలను వేర్లను విస్తరిస్తూ దారిలో అడ్డు ఉన్నవాటిని తినేసేడట్లు బలంగా ఎదగడం మొదలుపెట్టింది. కొన్నేళ్ళకు ఆ మర్రి చెట్టు ధాటికి దాదాపుగా అన్ని తాటి చెట్లు చనిపోగా ఒకే ఒక్క తాటి చెట్టు మిగిలింది!కొన్నేళ్లకు ఆ మిగిలిన ఒక్క తాటి చెట్టు కూడా తన తల భాగం వంగిపోయేసరికి, పాపం ఈ చెట్టు కూడా మర్రి చెట్టుతో చేసిన పోరాటంలో ఓడిపోయింది అని మాకు అర్ధమయింది! ఆఖరికి దాని తల భాగం రాలిపోయి కేవలం కాండం మాత్రం ఒకప్పటి చెట్టుకి గుర్తుగా మిగిలిపోయింది.ఇది జరిగిన కొద్ది నెలల్లోనే రెండు బంగారు వర్ణపు వడ్రంగి పిట్టలు చనిపోయిన తాటి చెట్టు మిగిలి ఉన్న కాండాన్ని గుర్తించి వాటిపై రంధ్రాలు చెయ్యడం మొదలుపెట్టాయి. చివరికి ఆ కాండం పైభాగాన ఒక రంధ్రం చేసి గూడు కట్టాయి. కొన్ని వారాలకు ఒక రోజు మాకు తొర్ర వద్ద తల్లితండ్రి తెచ్చే ఆహారం కోసం అసహనంతో ఎదురుచూస్తున్న రెండు వడ్రంగి పిట్టల పిల్లలు కనిపించాయి!పిల్లలు పెద్దవై ఎగిరిపోయాక ఆ వడ్రంగి పిట్టల కుటుంబం ఆ తొర్రను ఖాళీ చేసి వెళ్ళిపోయి అప్పుడప్పుడు కనిపిస్తుండేవి. ఒక రెండేళ్లకు మరికొన్ని పక్షులు ఆ తొర్రలో ఆవాసం ఏర్పరుచుకున్నాయి. కొన్ని రామచిలుకలు ఆ గూటి యజమానులైన వండ్రంగి పిట్టలను తరిమేసి ఆ తొర్రను పెద్దది చేసి, దానిని నివాసానికి అనుగుణంగా చేసుకునే సమయానికి రెండు గుడ్లగూబలు వచ్చి చేరాయి. ఆ రామ చిలుకలు కొన్నిరోజులపాటు ఆ తొర్ర వద్ద ఎంత గోల చేసినప్పటికీ ఆ గుడ్లగూబలు తొణకకుండా, బెణకకుండా ఆ తొర్రను ఆక్రమించేశాయి. చిలుకలు ఎంత కష్టపడ్డప్పటికీ ఆ గుడ్లగూబలను ఏమీ చేయలేకపోయాయి. ఆ గుడ్లగూబలు కాస్త సర్దుకునే సమయానికి ఒక నల్లంచి వచ్చి ఆ గుడ్లగూబలను ఎదో చేసి మొత్తానికి ఆ తొర్ర నుంచి తరిమేసింది. “హమ్మయ్య చివరికి ఒక పక్షి ఈ తొర్రను తన ఇల్లుగా చేసుకుంటుంది” అని మేము సంబరపడేలోపలే ఒక జత గోరింకలు వచ్చి ఆ నల్లంచిని తరిమేసి ఆ గూటిలో స్థిరపడిపోయాయి!ఆ గోరింకలు కొన్నేళ్లపాటు ఆ తాటి చెట్టు తొర్రలో నివసించాయి. పక్షులే కాకుండా ఆ చనిపోయిన చెట్టు కాండం మీద కొన్నిరకాల బల్లులు, కాళ్ళ జెర్రెలు నివసించేవి. కానీ ఒక రోజు ఆ చెట్టు కాండం పడిపోవడంతో ఆ జీవులన్నీ గూడు లేనివి అయిపోయాయి! అయినప్పటికీ ఆ క్రింద పడిపోయిన కాండం మట్టిలో కలిసిపోయే లోపల కొన్ని కప్పలకు, నీటి పాములకు, పెంకు పురుగులకు, చెద పురుగులకు, బల్లి గుడ్లకు ఆశ్రయమిచ్చింది. ఇదంతా జరిగేలోపల మన మర్రి చెట్టు మా వంటింటి వ్యర్ధాల నీటి వలన బలపడి ఐదారు రెట్లు పెరిగి మహా వృక్షమైపోయింది!--జానకి లెనిన్కృష్ణమూర్తి(ఫోటోలు)(చదవండి: మలేషియా ప్రధానికి స్పెషల్ మిల్లెట్ లంచ్..మెనూలో ఏం ఉన్నాయంటే..!) -
కవ్వాల్ టైగర్‌జోన్‌లో ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్
కడెం: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ జోన్లో ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్ మంగళవారం కనిపించింది. నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ అటవీ రేంజ్ పరిధిలోని దోస్త్‌నగర్ అటవీ ప్రాంతంలో దీన్ని గుర్తించినట్లు డీఆర్వో ప్రకాశ్, ఎఫ్‌బీవో ప్రసాద్ తెలిపారు. ‘కలౌల పుల్చ్రా’అని పిలువబడే ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్ మైక్రో హాలిడే కుటుంబంలో భాగమైన ఒక చిన్న ప్రత్యేకమైన ఉభయచర జీవి అని డీఆర్వో ప్రకాశ్ చెప్పారు. గుండ్రని శరీరం విలక్షణమైన (గోధుమ, నారింజ, లేదా పసుపు) రంగు కలిగి ఉంటుందన్నారు. ఈ కప్పలు సాధారణంగా అడవుల నుంచి వ్యవసాయ భూములు, నీటి వనరుల ఉన్న చోట ఆవాసం ఏర్పచుకుంటాయని తెలిపారు. ఈ కప్పల ప్రధాన ఆహారం కీటకాలని, ఇవి రాత్రి పూట సంచరిస్తూ జిగట నాలుకతో కీటకాలను వేటాడి ఆహారంగా తీసుకుంటాయని వివరించారు. పగలు వీటిని గుర్తించడం కష్టమన్నారు. విభిన్న వన్య ప్రాణులకు నిలయమైన కవ్వాల్ టైగర్ జోన్లో ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్ కనిపించడం జీవ వైవిధ్యానికి దోహదం చేస్తుందని డీఆర్వో ప్రకాశ్ పేర్కొన్నారు. -
బతికుండగానే కప్పపై పుట్టగొడుగులు..!
సహజంగా పుట్టగొడుగులు ఎలా పెరుగుతాయో మనకు తెలిసిందే. కుళ్లిన కలపపై వచ్చు ఒకరకమైన శిలింధ్రం. ఇవి అసాధారణ జీవులు. అవి సాధారణంగా సాప్రోట్రోఫ్లు లేదా సహజీవులు. ఇవి పోషకాల సైక్లింగ్‌ను సులభతరం చేస్తాయి. సధారణంగా పుట్టగొడుగులు చనిపోయిన లేదా కుళ్లిన వాటిపై శిలింధ్రాలు పుట్టగొడుగులుగా రావడం జరగుతుంది. బతికి ఉండు జీవుల్లో పుట్టగొడుగులు రావడం అనేది అత్యంత అరుదు. కానీ ఇక్కడొక కప్ప బతికే ఉన్న ఓ బంగారు రంగు కప్ప శరీరంపై పుట్టగొడుగు మొలిచింది. ఇక్కడ కప్ప బతికే ఉంది. అయితే ఇదెలా సాధ్యమని శాస్త్రవేత్తలు షాకవ్వుతున్నారు. వివరాల్లోకెళ్దే..ఈ ఫొటోలోని కప్పను బాగా పరిశీలిస్తే మీకు కప్ప మీద ఒక పుట్టగొడుగు కనిపిస్తుంది. ఇది ఒక రకమైన బోనెట్ మష్రూమ్. పుచ్చిపోతున్న దశలో ఉన్న కలపపైన, లేదా జంతువుల పేడపైన పెరుగుతుంది. అయితే ఇంకా సజీవంగానే ఉన్న కప్ప శరీరంపై కనిపించడం ఇదే మొదటిసారి. దీన్ని ఈ మధ్యనే కర్ణాటక పశ్చిమ కనుమల్లోని కర్కాలలో గుర్తించారు. దీనిపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు ఈ కప్పను ‘రావుస్ ఇంటర్మీడియట్ గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాగ్’ (హైలార్నా ఇంటర్మీడియా)గా గుర్తించారు. పైగా ఆ కప్ప ఎడమ వైపు నుంచి పుట్టగొడుగు పెరుగుతూ ఉన్నప్పటికీ కప్ప సజీవంగా, చురుకుగా ఉంది. దీంతో వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ పరిశోధకులతో సహా శాస్త్రవేత్తలంతా అయోమయంలో పడ్డారు. సజీవంగా ఉన్న కప్ప శరీరంపై పుట్టగొడుగులు ఎలా పెరుగుతాయో తెలుసుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తునే ఉన్నారు. ఇది ఒక రకమైన వ్యాధి వల్ల కావచ్చునని అనుకుంటున్నా.. అందుకు బలమైన ఆధారాలేవీ ఇప్పటివరకు దొరకలేదు. (చదవండి: గడ్డకట్టే చలిలో మెడిటేషన్ చేస్తున్న యోగి!) -
హాస్టల్ భోజనంలో చచ్చిన కప్ప.. షాకైన విద్యార్థి
రెస్టారెంట్, హోట్సల్, హాస్టల్స్, ఇలా ప్రతిచోట సర్వ్ చేస్తున్న భోజనంలో కీటకాలు, పురుగు దర్వనమిస్తుండటం కలవరం రేపుతోంది. భోజనంలో బల్లులు, ఎలుకలు, బొద్దింకలు, కప్పలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఒడిశాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. భువనేశ్వర్‌లోని కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ టెక్నాలజీ(కేఐఐటీ) హాస్టల్ భోజనంలో ఓ విద్యార్థికి చచ్చిన కప్ప ప్రత్యక్షమైంది. కేఐఐటీ భువనేశ్వర్ విద్యార్థి ఆర్యన్ష్ హాస్టల్లో భోజనం చేస్తుండగా పేరుగన్నంలో కప్ప కనిపించింది. దీంతో ఖంగుతున్న విద్యార్థి వెంటనే ఆ ఆహారాన్ని పడవేశాడు. తనకు ఎదురైన అనుభవాన్ని విద్యార్థి సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్(ట్విటర్)లో షేర్ చేస్తూ విద్యాసంస్థల్లో పరిస్థిని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చదవండి: డిసెంబర్లోనే అయోధ్య ఎయిర్పోర్ట్ సేవలు! This is KIT Bhubaneswar, ranked ~42 among engineering colleges in India, where parents pay approx 17.5 lakhs to get their child an engineering degree. This is the food being served at the college hostel. Then we wonder why students from India migrate to other countries for… pic.twitter.com/QmPaz4mD82 — Aaraynsh (@aaraynsh) September 23, 2023 ‘ఇది దేశంలోనే ఇంజనీరింగ్ కళాశాలలో 47వ ర్యాంక్ కలిగిన కేఐటీ భువనేశ్వర్ కాలేజ్. ఇక్కడ ఓ విద్యార్థి తమ డిగ్రీని పూర్తి చేసేందుకు తల్లిదండ్రులు దాదాపు 17.50 లక్షలు ఖర్చు చేస్తున్నారు. అంత డబ్బులు తీసుకుని కాలేజీ హాస్టల్లో ఇలాంటి ఆహారాన్ని అందిస్తున్నారు. మెరుగైన విద్య, సౌకర్యాల కోసం ఇండియా నుంచి విదేశాలకు ఎందుకు విద్యార్థులు వలస వెళ్తున్నారో మాకు ఇప్పుడు అర్థమవతుంది’ అని ఆహారంలో కప్ప కనపడిన ఫోటోను షేర్ చేశాడు. ఆర్యాన్ష్ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. కేఐఐటీ కళాశాల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోస్టు చేసిన కొన్ని గంటలకే స్పందించిన కళాశాల యాజమాన్యం మెస్ కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. హాస్టల్లో అందిస్తున్న ఆహారం పూర్తిగా అపరిశుభ్రంగా ఉందని, భోజనంపై విద్యార్థులు అసంతృప్తి చెందారని ఇనిస్టిట్యూట్ పేర్కొంది. కిచెన్, స్టోర్, వంట సరుకులు పరిశుశ్రంగా ఉంచుకోవాలని, ఆహారం తయారు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తూ.. పనిష్మెంట్గా ఓ రోజు పేమెంట్‌ను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. So, this is the value of human life. The hostel where the frog was served, at Bhubaneswar University, in an attempt to do damage control, decided to deduct only one day's payment from the mess provider company! Just wow. pic.twitter.com/2BSDhUwI8I — Aaraynsh (@aaraynsh) September 24, 2023 అయితే కేవలం ఒక్క రోజు పేమెంట్‌ను మాత్రమే కట్ చేస్తూ తమ వర్సిటీ స్పందించిన తీరుపై ఆర్యాన్ష్ మండిపడ్డాడు. వర్సిటీ పరువును కాపాడుకోవడానికే ఈ చర్య తీసుకుందని, మనిషి జీవితానికి ఉండే విలులు ఇదేనని అసహనం వ్యక్తం చేశాడు. -
ఇన్ని చిరుకప్పలు ఎక్కడి నుంచి
అమెరికాలోని కాలిఫోర్నియాలోగల స్టాక్టన్లో వేలకొద్దీ చిరుకప్పులు ఒక రోడ్డును దాటుతున్నాయి. ఇది చిరు కప్పల సామూహిక వలసగా కనిపించింది. ఒక మైలు పొడవునా విస్తరించిన ఈ రోడ్డు పొడవునా చిరు కప్పలు ఉండటాన్ని చూసినవారు తెగ ఆశ్చర్యపోతున్నారు. విమానాశ్రయం నుండి ఇంటికి కారులో వెళుతున్న ఈ ప్రాంతానికి చెందిన మేరీ హులెట్ రోడ్డుపై ఎదో కదులుతున్నట్లు కనిపించడంతో ముందునున్న కార్లు ఆగిపోవడాన్ని తాను గమనించానని తెలిపింది. రోడ్డుపై దృష్టి కేంద్రీకరించినప్పుడు కప్పల సైన్యం రహదారికి అడ్డుగా ఉందని గ్రహించానని ఆమె పేర్కొంది. ఇవి రహదారిని దాటడాన్ని గమనించానని ఒక వార్తా సంస్థకు ఆమె తెలిపింది. ఈ విధంగా కప్పల వలసలను చూసిన జీవశాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు. సిల్వర్ అవెన్యూలో ఎస్ కర్వ్స్ అని పిలిచే ప్రాంతంలో ఈ చిరు కప్పలు కనిపించాయి. వైల్డ్‌లైఫ్ రిసోర్సెస్ సెంట్రల్ రీజియన్‌లోని ఉటా విభాగానికి చెందిన ఆక్వాటిక్స్ మేనేజర్ క్రిస్ క్రోకెట్ మాట్లాడుతూ ఈ కప్పలను గ్రేట్ బేసిన్ స్పాడెఫుట్ టోడ్స్ అని అంటారన్నారు. అవి చుట్టుపక్కల ఉన్న కొండలకు వలస వెళ్లాలని నిర్ణయించుకున్నాయని తెలిపారు. కాగా కొన్ని కార్లు ఆ చిరు కప్పల మీదుగా వెళ్లడంతో చాలా చిరుకప్పలు చనిపోయాయి. అయితే స్థానికులు ఈ కప్పలను కాపాడేందుకు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: హవ్వ.. గన్ను కొనడం ఇంత సులభమా? Witnesses describe seeing a 'biblical' mass migration of toads over a mile long pic.twitter.com/ii0HUn8DD4 — CNN (@CNN) July 24, 2023 -
చూసే కన్ను బట్టి అర్థం మారుతుంది..ట్రై చేయండి అదేంటో!
ఈ ఇమేజ్ చూస్తే కేవలం కప్ప మాత్రమే కనిపిస్తోంది కదూ. కానీ సరిగా చూస్తే ఇంకొకటి కూడా కనిపిస్తుంది. ఇది కేవలం మీ ఐక్యూకి మాత్రమే కాదు పరీక్ష. మీరు ఏవిధంగా ఆలోచించగలరు అనేదాన్ని కూడా తెలియజేస్తుంది. ఇలాంటి ఫజిల్స్ మనకు ఎదరయ్యే సమస్యలను ఎలా కూడా చూడాలో తెలుపుతుంది. ఈజీగా ఎలా బయటపడాలో మెదడుకు ఓ ఎక్స్ర్సైజ్లా కూడా ఉంటుంది. అసలు దీనికి మన జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు ఎలాంటి సంబంధం ఉండదు అనకండి. కొన్ని సమస్యలు మనకు ఓ పట్టాన పరిష్కారం కావు. ఏదో ఒక యాంగిల్ ఆలోచించి ఏ స్టెప్ తీసుకోలేక ఒకింత గందరగోళానకి గురవ్వుతాం. అదే ఒక సమస్యను రెండు లేదా మూడు రకాలుగా ఆలోచించగలిగితే సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. ఇక అదంతా సరే! ముందు ఈ ఫోటోలో ఇంకొక చిత్రం కూడా ఉంది ట్రై చేయండి. త్వరగా కనిపెట్టండి. ఏ మాత్రం ఆలస్యం చేయకండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు కాస్త ఓపికగా చూడండి ప్లీజ్. ఇక ఆ బొమ్మలో కనిపిస్తున్న మరో ఆకృతి (రివర్స్‌లో చూస్తే) ఏంటంటే.. ఓ గుర్రం ముఖం కనిపిస్తుంది చూడండి. చూసే కన్నుని బట్టి ఆకృతి మారుతుంది. అలాగే మన సమస్యను చూసే విధానం బట్టి మనలోని భ్రమలను భయాలు కూడా దూరం చేసుకోగలుగుతాం. (చదవండి: రెండువేల ఏళ్ల క్రితమే ఇంత అద్భుత ఆభరణమా!) -
ఈ కప్పలు మనుషుల్ని చంపేస్తాయని మీకు తెలుసా?
ఈ భూమ్మీద ఎన్నో రకాల విష జంతువులు ఉన్నాయి.విషపూరీతమైనవి అంటే ముందుగా గుర్తొచ్చేవి పాములు. అయితే విషపూరిత కప్పల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అదేంటి కప్పలు కూడా అంత ప్రమాదకరమా అని ఆలోచిస్తున్నారా? అవును.. అలాంటి విషపూరితమైన కప్పలు కూడా ఉన్నాయి. చూడటానికి అందంగా కనిపించే ఈ కప్పలు యమ డేంజర్. వీటిని గోల్డెన్ పాయిజన్ కప్పలు అని అంటారు. వీటికి ఒళ్లంతా విషమే. ఆఖరికి ఈ కప్పలను ముట్టుకున్నా శరీరం విషపూరితమవుతుంది. ► ఈ పాయిజన్ కప్పలు కొలంబియాలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. సాధారణంగా రెండు అంగుళాలు లేదా కాస్త పెద్దగా ఉండే ఈ కప్పలో పదిమందిని చంపేంత విషం ఇందులో ఉంటుంది. శతాబ్దాలుగా కొలంబియాలోని వేటగాళ్ళు తమ ఎరను పట్టుకోవడానికి ఈ రకమైన కప్ప విషాన్ని ఉపయోగిస్తారట. ► ఈ కప్పలను తాకినా ప్రాణాలు పోతాయట. పొరపాటున వీటిని టచ్ చేసినా చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కప్పల విషం నేరుగా చర్మంపై పడినా పల్స్ రేటు వెంటనే పడిపోయి మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. ► ఈ కప్పలు పసుపు, నారింజ లేదా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ప్రదేశాన్ని బట్టి అవి వాటి రంగులను మార్చుకుంటాయి. ► ఒళ్లంతా విషాన్ని నింపుకున్న ఈ కప్పలను వైద్య రంగంలో ఉపయోగించేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. దీనిలోని విషాన్ని కొన్ని కెమికల్ పద్దతులను ఉపయోగించి పెయిన్ కిల్లర్స్‌ను తయారు చేసేందుకు రీసెర్చ్ చేస్తున్నారు. -
నోరూరించే నూడుల్స్‌పై చిరు కప్పలు.. లొట్టలేసుకుంటూ తింటున్న జనం!
మనదేశంలో తయారయ్యే ఫాస్ట్‌ఫుడ్‌లలో అత్యధికంగా అమ్ముడయ్యే ఆహారం నూడుల్స్. దేశంలో ఏ మూల చూసినా నూడుల్స్ దుకాణాలు కనిపిస్తాయి. అయితే ఇటీవలికాలంలో తైవాన్‌లో నూడుల్స్‌తో రూపొందించిన ఒక డిష్ ఎంతో ఆదరణ పొందుతోంది. ప్రపంచంలో రకరకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. మనదేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లినప్పుడు అక్కడి ఆహారాలలో ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. ఆహార ప్రియులు అన్ని రకాల ఆహారాలను ఆస్వాదించేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. అటు మాంసాహారులు, ఇటు శాకాహారులు తమకు అనువైన వంటకాల కోసం వెదుకుతుంటారు. కొన్ని దేశాల్లో పురుగులు, కీటకాలు, కప్పలు ఆహారంలో భాగంగా మారిపోయాయి. కొన్ని ఆహారాలు ఎంత వింతగా ఉంటాయంటే వాటి గురించి వినగానే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి విచిత్రమైన ఒక డిష్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిరు కప్పలతో నోరూరించే నూడుల్స్.. తైవాన్‌లో ఇటీవలికాలంలో కప్పల నూడుల్స్ ఎంతో ఆదరణ పొందుతోంది. ఆహార ప్రియులు ఈ నూడుల్స్‌ను తెగ ఎంజాయ్ చేస్తూ లాగించేస్తున్నారు. నోరూరించే వేడివేడి నూడుల్స్‌పై చిరు కప్పలను ఉంచి, సర్వ్ చేయడం ఈ డిష్ ప్రత్యేకత. కప్పలను ఉడికించి, మసాలా దట్టించి.. ఆడిటీ సెంట్రల్ న్యూస్ అందించిన ఒక రిపోర్టు ప్రకారం తైవాన్‌లోని యున్‌లిన్‌లో యువాన్ రమెన్ అనే రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్లో కప్పల నూడుల్స్‌ను ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఈ డిష్ ప్రత్యేకత ఏమిటంటే గార్నిషింగ్‌లో కప్పలను వినియోగిస్తారు. ఇందుకోసం కప్పలను ముందుగా బాగా ఉడికించి, వాటికి మసాలా దట్టించి, నూనెలో దోరగా వేయిస్తారు. ఈ డిష్ పేరు ఏమిటంటే.. నూడుల్స్‌పై అప్పటికే మసాలా దట్టించి సిద్ధం చేసిన కప్పలను గార్నిషింగ్ చేస్తారు. కప్పల పైచర్మాన్ని తీయకుండానే ఇందుకోసం వినియోగిస్తారు. సోషల్ మీడియా యూజర్స్ ఈ డిష్‌కు ‘ఫ్రాగ్, ఫ్రాగ్, ఫ్రాగ్ రమెన్’ అనే పేరు పెట్టారు. ధర ఎంతంటే.. మీడియాకు అందిన సమాచారం ప్రకారం రమెన్ రెస్టారెంట్లో ఈ డిష్‌ను కేవలం మంగళవారం, బుధవారం రాత్రి డిన్నర్ సమయాలలో మాత్రమే వడ్డిస్తారు. ఈ విచిత్రమైన డిష్ ఖరీదు 8 అమెరికన్ డాలర్లు. భారత కరెన్సీలో రూ. 650. రెస్టారెంట్‌కు వెళ్లిన ఎవరైనా ఈ డిష్‌కు ఫొటో తీసుకోవాలనుకంటే 3.2 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ డిష్‌ను అక్కడి ఆహార ప్రియులు లొట్టలేసుకుంటూ తింటారు. ఇది కూడా చదవండి: చైనాలో మరో అద్భుతం: బిల్డింగ్ మధ్య నుంచి దూసుకుపోయే రైలు.. -
కస్టమర్‌కు షాకింగ్ అనుభవం.. నూడుల్స్ ఆర్డర్ చేస్తే బతికున్న కప్ప!
జపాన్ దేశంలో ఒక పేరు మోసిన రెస్టారెంట్లో ఒకాయన నూడుల్స్ ఆర్డర్ చేస్తే పాపం అతడికి నూడుల్స్‌లో కప్ప ప్రతక్షమైంది. పైగా ఆ కప్ప బతికుండటంతో ఆ పెద్దమనిషి తిన్నది కక్కలేక, మిగిలింది మింగలేక దయనీయ స్థితిలో ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. జపాన్‌కు చెందిన కైటో అనే ఓ వ్యాపారస్తుడు శుస్తిగా భోజనం చేద్దామని ఒక పెద్ద రెస్టారెంట్లోకి వెళ్లి నోరూరే స్పెషల్ థిక్ నూడుల్స్‌ను ఆర్డర్ చేశాడు. ఆ రెస్టారెంట్ వాళ్ళు ఈ ఐటెంను ఒక కప్పులో వడ్డిస్తారట. కొద్దిసేపు తర్వాత రెస్టారెంట్ బేరర్ ఓ ప్లేటులో నూడుల్స్ కప్పును తీసుకొచ్చి కైటో ముందుంచాడు. అంతేకాదు ఆ బేరర్ కైటోకు తినే ముందు ఆ కప్పును బాగా షేక్ చేసి తింటే ఆ టేస్ట్ మరింత బాగుంటుందని మరీ మరీ చెప్పడంతో కైటో ముందుగా నూడుల్స్ కప్పును బాగా షేక్ చేశాడు. ఆ తర్వాత కప్పును ఓపెన్ చేసి మెల్లగా తినటం ప్రారంభించాడు. నూడుల్స్ మహారుచిగా ఉండడంతో ఆవురావురుమంటూ లాగించేశాడు. తినటం క్లైమామ్స్‌కు వచ్చాక కప్పులో నుంచి ఒక్క కప్ప తల పైకి పెట్టి మరీ కైటోను కోపంగా చూస్తోంది. దాంతో కైటోకు కడుపంతా దేవేసినట్టైంది. అప్పటికే దాదాపుగా నూడుల్స్ తినేయటంతో చేసేదేమీ లేక రెస్టారెంట్ యాజమాన్యాన్ని నిలదీశాడు. పరువు పోతుందన్న భయంతో సదరు రెస్టారెంట్ యాజమాన్యం కైటోకు క్షమాపణ చెప్పి నష్టపరిహారాన్ని చెల్లించింది. ఆ రెస్టారెంట్ వారు క్షమాపణలు చెప్పినా కూడా కైటో తనకు ఎదురైన పరిస్థితి మరెవరికీ ఎదురు కాకూడదనే ఉద్దేశ్యంతో తన పరిస్థితి మొత్తాన్నీ వీడియోతో సహా జపానీస్ భాషలో తన ట్విట్టర్ అకౌంట్లో పొందుపరిచాడు. చదవండి: మణిపూర్‌లో అమిత్ షా పర్యటన.. వారికి రూ.10 లక్షల నష్టపరిహారం #シェイクうどん 自分が出張中に気に立っていたうどんを食べたら 何にカエル🐸 振った後に食べて最後の方まで気づかなかった お店は3時間の営業停止の後にその日の夜から営業再開、今もサラダや同じ商品を販売中 食べる前には気をつけて pic.twitter.com/pjbxuLy9F6 — 魁斗 (@kaito09061) May 22, 2023 -
కప్పను తిని అస్వస్థతకు గురైన కుటుంబం..ఆరేళ్ల చిన్నారి మృతి
కప్పను చంపి ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలకు వండి పెట్టాడు. దీంతో కుంటుంబ అంతా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యింది. ఈ ఘటన ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో చోటు చేసుకుంది. మున్నా అనే వ్యక్తి ఇంట్లోకి కప్ప వచ్చింది. అతను పాముపై ఉన్న కోపంతో కప్పను చంపి దానితో సాంబారు చేశాడు. దీన్ని కుటుంబ సభ్యులంతా తిన్నారు. కొద్ది సేపటికే వారంతా వాంతులు చేసుకుని స్ప్రుహతప్పి పడిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారులను ఆస్పత్రికి తరలించగా.. ఆరేళ్ల చిన్నారి సుమిత్ర ముండా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అంతేగాదు మరో నాలుగేళ్ల చిన్నారి మున్నీ పరిస్థితి విషమంగానే ఉంది. ఆ కూర తిన్న ఆ చిన్నారుల తండ్రి కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ మేరకు పోలీసులు ఆ చిన్నారి మృతిని అసహజ మరణంగా కేసు నమోదు చేసుకుని ఈ ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఇదిలా ఉండగా, వీఎస్ఎస్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ సంజీబ్ మిశ్రా మాట్లాడుతూ..కప్పల శరీరంలోని పరోటిడ్ గ్రంథి వాటిని వేటాడే జంతువుల నుంచి రక్షించుకోవడానికి విషాన్ని కలిగి ఉంటుంది. ఇది కప్పను తినే వారిపై ప్రభావం చూపుతుంది. అలాగే కొన్ని కప్పల చర్మం కూడా విషపూరితంగా ఉంటుందని మిశ్రా చెప్పారు. (చదవండి: పచ్చని పందిట్లో రభస..కారణం వింటే ఛీ!..అంటారు!) -
టిఫిన్‌లో కప్ప!
తెయూ (డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ బాలికల హాస్టల్లో బుధవారం ఉదయం అల్పాహారంలో భాగంగా అందించిన వెజ్ రైస్‌లో కప్ప రావడంతో విద్యార్థినులు ఆందో ళనకు గురయ్యారు. అప్పటికే పలువురు విద్యార్థినులు అల్పాహారం తిని తరగతులకు వెళ్లారు. ఈ విషయాన్ని హాస్టల్ చీఫ్ వార్డెన్ అబ్దుల్ ఖవీ, బాలికల హాస్టల్ వార్డెన్ జవేరి యా ఉజ్మా, కేర్‌టేకర్ పీరూబాయిల దృష్టికి తీసుకెళ్లారు. వెజ్‌రైస్‌లో కప్ప వచ్చిన మాట నిజమేనని.. మరోసారి తప్పు జరగకుండా జాగ్రత్త పడతామని కుక్ తెలిపారు. -
డేంజర్, యమ డేంజర్! ఈ కప్పలు నిలువెల్లా విషం కక్కుతాయ్!
సాధారణంగా పల్లెల్లో ఊ అంటే కాళ్ల కిందకొచ్చేసే కప్పలంటే భలే బాధ.. చిరాకూనూ. అలికిడి చేసినా, అరచినా.. అడ్డం వచ్చినా కాళ్లతో చప్పుడు చేసి, ఉష్ ఉష్ అంటూ బెదిరించి తరిమేస్తాం. అలాంటి కప్పలు విషం జిమ్ముతాయి అంటే బెంబేలెత్తాల్సిందేగా? అవును నిజం.. ఈ కప్పలు నిలువెల్లా విషాన్ని కక్కుతాయట. పాయిజన్ డార్ట్ ఫ్రాగ్ జాతికి చెందిన ఈ కప్పలు.. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన జీవులు. మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలోని వర్షారణ్య ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయివి. ఒంటి నిండా రంగులతో పాటు విషాన్నీ నింపుకుని తిరుగుతాయి. ఒక కప్పలోని విషంతో 20 వేల ఎలుకలను చంపొచ్చంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కప్పను మనం ముట్టుకోగానే విషం ఎక్కదు. నోట్లో పెట్టుకుంటేనో.. కళ్లు, ముక్కుకు తగిలితేనో లేదా ఏదైనా గాయం ఉన్నచోట ఈ కప్ప విషం అంటితేనో.. ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ విషం వల్ల రక్తనాళాలు కుచించుకుపోవడం, పక్షవాతం, కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంది. పాయిజన్ డార్ట్ కప్పల్లో రెండు వందలకు పైగా జాతులు ఉన్నాయి. వీటి పరిమాణం 6 సెంటీమీటర్ల కంటే తక్కువే. ఇవి కీటకాలను, చెదపురుగుల్ని, సాలెపురుగుల్ని, ఈగల్ని, చీమల్ని, దోమల్ని తమ రంగులతో ఆకర్షించి, పొడవాటి నాలుకతో విషం జిమ్మి.. చంపి తింటాయి.ఇవి ఎక్కువగా ముదురు ఎరుపు, నీలం, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. వీటికి దృశ్యసామర్థ్యం కూడా ఎక్కువే. పది సంవత్సరాలకు మించి జీవిస్తాయి. ఆ పరిసరాల్లో జీవించే గిరిజనులు వారి బాణాలకు ఈ కప్ప విషాన్ని పూసి వేటకు వెళ్తుంటారు. -
ప్రాణమున్న రోబోలు..పిల్లల్ని కనేస్తాయ్!.. ప్రయోజనం ఏంటి?
అదో చిన్న రోబో.. తనకు చెప్పినపని చేస్తుంది. అదే సమయంలో తనలాంటి మరిన్ని రోబోలనూ తయారు చేసుకుంటుంది. ఆ రోబోలు మరిన్ని రోబోలను ‘కనేస్తుంటాయి’.. రజనీకాంత్ రోబో సినిమాలో విలన్‌గా మారిన ‘చిట్టి’ తనలా రోబోలను తయారుచేసి ఫైటింగ్‌కు దిగే సీన్ గుర్తొస్తుంది కదా.. మరి అలాంటి రోబోలకు మనలా ప్రాణం కూడా ఉంటే.. వామ్మో ఇంక అంతే సంగతులు అనిపిస్తోందా? మరీ అంతపెద్ద రోబోలు కాదుగానీ.. తమలాంటి రోబోలను తయారు చేసుకోగలిగిన అతి సూక్ష్మ ‘బయో రోబో’లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ సాధారణంగా రోబోలు అంటే యంత్రాలే. ముందే నిర్దేశించిన మేరకు, మనం చెప్పిన మేరకు మన పనులన్నీ చక్కబెడతాయి. మనుషులు చేయలేని ఎన్నో కష్టమైన పనులూ చేసిపెడతాయి. కానీ శాస్త్రవేత్తలు జీవకణాలతో రోబో (బయో రోబో)లను తయారు చేయడంపై కొంతకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. అవి సజీవంగా ఉంటూనే.. మనం చెప్పినట్టు వినే, ముందే నిర్ధారించిన పనులు చేసేలా ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే మిల్లీమీటర్ కన్నా చిన్నగా ఉండే బయో రోబోలను రూపొందించారు. ‘జెనోబోట్స్’గా పిలిచే ఈ రోబోలు తమలాంటి మరిన్ని రోబోలను పునరుత్పత్తి చేసుకునేలా అభివృద్ధి చేశారు. కప్పల మూల కణాల నుంచి.. అమెరికాకు చెందిన టఫ్ట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వెర్మోంట్, హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన విస్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ‘జెనోబోట్స్’పై పరిశోధన చేస్తున్నారు. జోనోపస్ లావియెస్ అనే జాతి కప్పలకు చెందిన మూలకణాల (స్టెమ్‌సెల్స్)ను సేకరించి.. వాటిని కంప్యూటర్ సిమ్యులేషన్స్ ఆధారంగా రీప్రోగ్రామింగ్ చేసి గత ఏడాదే ‘జెనోబోట్స్’ను తయారు చేశారు. అవి సొంతంగా కదలడం, జట్టుగా కలసి పనిచేయడం, వాటికి అప్పజెప్పిన పని పూర్తిచేయడం, ఏవైనా గాయాలు అయితే సొంతంగా నయం చేసుకోవడం వంటివి చేయగలిగేవి. తాజా జెనోబోట్లు తమలాంటి మరిన్ని ప్రతిరూపాలను తయారు చేసుకునేలా ప్రోగ్రామింగ్ చేశారు. వీటికి జెనోబోట్స్ 3.0గా పేరుపెట్టారు. ఎలా ఉత్పత్తి చేసుకుంటాయి? ‘జెనోబోట్ 3.0’ రోబోలు గుండ్రంగా ఉంటాయి. కానీ ఒకవైపున ‘V’ ఆకారంలో నోరు ఉంటుంది. ఈ రోబోలు అటూఇటూ కదులుతూ ఉన్నప్పుడు.. అక్కడ చెల్లాచెదురుగా ఉన్న మూలకణాలను ఒకచోటికి చేర్చుతాయి. తర్వాత ఆ కణాలను వి ఆకారంలోని తమ నోటిలోకి తీసుకుని.. తమలాంటి రూపంలోకి మార్చి.. బయటికి వదిలేస్తాయి. కొద్దిరోజుల తర్వాత ఈ పిల్ల రోబోలు కూడా ప్రతిరూపాలను తయారు చేయగలుగుతాయి. ప్రయోజనం ఏంటి? కేవలం మిల్లీమీటర్ పరిమాణంలో ఉండే ఈ ‘జెనోబోట్ల’తో వైద్యారోగ్య రంగంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తీవ్రమైన గాయాలు, పుట్టుకతో వచ్చే లోపాలు, కేన్సర్, వయసుతోపాటు వచ్చే సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు, చికిత్స అందించేందుకు ఈ రోబోలను వినియోగించుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. ఇవి శరీరంలో దెబ్బతిన్న, కేన్సర్‌కు గురైన కణాలకు నేరుగా ఔషధాన్ని తీసుకెళ్లగలవని వివరిస్తున్నారు. ప్రమాదమేమీ లేదా? తమను తాము పునరుత్పత్తి చేసుకునే ఈ జెనోబోట్స్ ద్వారా భవిష్యత్తులో ఏమైనా ప్రమాదం వస్తే ఎలా అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ కోణంలో క్షుణ్నంగా పరిశీలించే జెనోబోట్లకు రీప్రోగ్రామింగ్ చేశామని పరిశోధనకు నేతృత్వం వహించిన టఫ్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్త మైఖేల్ లెవిన్ తెలిపారు. ఎన్ని ఉత్పత్తి కావాలి.. ఏ పని చేయాలి.. ఎలా పనిచేయాలనే అంశాలన్నింటినీ ముందే ప్రోగ్రామ్ చేసి పెడతామని వివరించారు. కంప్యూటర్ ద్వారా వాటిని ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ.. మనకు ముప్పుగా పరిణమించకుండా అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు. -
ఇడ్లీ పార్సిల్లో కప్ప కలకలం.. హోటల్ యజమానికి చూపిస్తే..
సాక్షి,తిరువొత్తియూరు(చెన్నై): తంజావూరు జిల్లా కుంభకోణం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగి తీసుకున్న ఇడ్లీ పార్సిల్లో కప్ప కళేబరం ఉండడం సంచలనం కలిగించింది. కుంభకోణం మాదాపురికి చెందిన మురుగేష్ గుండె చికిత్స విభాగంలో చికిత్స పొందుతున్నాడు. అతని బంధువు శనివారం సమీపంలోని ఒక హోటల్లో ఇడ్లీ పార్సిల్ తీసుకువెళ్లాడు. ప్యాకెట్ విప్పి చూడగా ఇడ్లీ లోపల కప్ప మృతి చెంది ఉంది. దాన్ని బంధువులు హోటల్ యజమానికి చూపించారు. హోటల్లో ఉన్న ఇడ్లీ పిండిని కింద పడేశారు. హోటల్ యజమాని హోటల్‌కు తాళం వేసి పరారయ్యాడు. ఈ దృశ్యాలను ఒక వ్యక్తి తన సెల్ ఫోన్లో వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పెట్టడంతో వైరల్ అయింది. సదస్సు విజయవంతం కొరుక్కుపేట: ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం వడపళని క్యాంపస్(చెన్నై), లింకన్ యూనివర్సి టీ కాలేజ్ మలేషియా ఆధ్వర్యంలో బిజినెస్ మేనేజ్మెంట్ (ఐసీఈఏబీఎం 2021) అంతర్జాతీయ సదస్సు విజయవంతంగా జరిగింది. ఎస్ఆర్ఎం వడపళని క్యాంపస్ సీఈటీ విభాగం డీన్ డాక్టర్ సి.వి.జయకుమార్, కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ డీన్ ప్రొఫెసర్ సుభశ్రీ నటరాజన్ నేతృత్వం వహించారు. ప్యూర్టో రికో విశ్వవిద్యాలయం యూఎస్ఏ ప్రొఫెసర్ జస్టిన్ పాల్, సీవీఆర్ డీఈచెన్నై డైరెక్టర్ వి.బాలమురుగన్, ప్రొఫెసర్ శ్యామ్ బహదూర్ మేనేజ్మెంట్ టెక్నాలజీపై ప్రసంగించారు. -
ప్రకృతే పరమౌషధం!
ఎన్నో రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి మానవాళిని కాపాడిన మందు పెన్సిలిన్.. దాని తయారీకి మూలం ఓ ఫంగస్.. ఇప్పుడు కరోనా టెస్టుల కోసం వినియోగిస్తున్న ఆర్టీపీసీఆర్ విధానంలో వాడేది ఓ బ్యాక్టీరియా.. ఇవే కాదు.. మానవాళిని పట్టిపీడిస్తున్న రోగాలు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపినదీ ప్రకృతే. అత్యంత ముఖ్యమైన ఔషధాల తయారీకి స్ఫూర్తినిచ్చినదీ ప్రకృతే.. ఇలా ప్రకృతి ఇచ్చిన కొన్ని ముఖ్యమైన మందులు, వాటి ప్రత్యేకతలేమిటో తెలుసుకుందామా.. జంతువులు, మొక్కల నుంచి.. వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల వల్లగానీ, మన జీవనశైలి వల్లగానీ ఎన్నో రకాల రోగాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వాటికి ఉపశమనం కోసం ఎన్నో ప్రయోగాలు, మరెన్నో పరిశోధనలతో మందులు తయారు చేస్తుంటారు. ఒక్కోసారి కొన్నిరకాల జంతువులు, చెట్లలోని రసాయనాల సమ్మేళనాలు నేరుగా రోగాలు, ఆరోగ్య సమస్యలకు ఔషధాలుగా పనిచేస్తుంటాయి. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగానో, అనుకోకుండానో అలాంటి వాటిని గుర్తించి.. మానవాళికి అందుబాటులోకి తెచ్చారు. మధుమేహానికి మందు ఇచ్చి.. గిలా మాన్స్టర్.. నలుపు, నారింజ రంగుల్లో ఉండే ఒక రకమైన పెద్దసైజు బల్లి. అమెరికా, మెక్సికో దేశాల్లో ఉండే ఈ బల్లి లాలాజలంలో ఎక్సెండిన్–4 అనే హార్మోన్ ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టైప్–2 మధుమేహం చికిత్సలో వాడుతున్న ఎక్సెనటైడ్ ఔషధానికి మూలం ఆ హార్మోనే. టైప్–2 మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి, పేషెంట్లు బరువు తగ్గడానికి ఈ హార్మోన్ తోడ్పడుతుందని నార్త్ కరోలినా వర్సిటీ శాస్త్రవేత్తలు 2007లో గుర్తించారు. దానిని ప్రస్తుతం కృత్రిమంగా తయారు చేస్తున్నారు. కరోనాను గుర్తిస్తున్నది ఇదే.. థర్మస్ అక్వాటికస్ బ్యాక్టీరియా.. 1969లో అమెరికాలోని ప్రఖ్యాత ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లో దీనిని గుర్తించారు. ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకుని ప్రొటీన్ల పునరుత్పత్తి చేయగల సామర్థ్యం ఈ బ్యాక్టీరియాకు ఉంది. దీనిని ఆర్టీపీసీఆర్ టెస్టులో ఉపయోగించినప్పుడు.. సంబంధిత వైరస్ల ప్రొటీన్లను గుర్తించడానికి వీలవుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో దీనిని విస్తృతంగా వినియోగిస్తున్నారు. హా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) లెక్కల ప్రకారం.. ఇండియా, అమెరికా, బ్రిటన్, ఇటలీ, టర్కీ ఈ ఐదు దేశాల్లోనే ఏడాది మే చివరినాటికి ఏకంగా 100 కోట్ల కరోనా టెస్టులు చేశారు. ఫంగస్‌పై పోరు నుంచి.. కేన్సర్ చికిత్సకు.. పాక్లిటాక్సెల్.. కేన్సర్ చికిత్సలో ఉపయోగించే అత్యంత కీలకమైన ఔషధం. పసిఫిక్ యూ అనే చెట్టు బెరడులో లభించే ఈ రసాయన మిశ్రమాన్ని 1971లోనే గుర్తించారు. అది కేన్సర్లపై సమర్థవంతంగా పనిచేస్తుందని 2015లో జరిగిన పరిశోధనల్లో తేల్చారు. దాదాపు అన్నిరకాల కేన్సర్లకు చేసే కెమోథెరపీ చికిత్సలో ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన అత్యవసర మందుల జాబితాలో ఈ పాక్లిటాక్సెల్ ఔషధం కూడా ఉండటం గమనార్హం. నిజానికి పసిఫిక్ యూ చెట్లు ఈ రసాయన సమ్మేళనాన్ని ఎందుకు ఉత్పత్తి చేస్తాయో తెలుసా.. తమపై ఫంగస్‌లు పెరిగి తెగుళ్లు కలిగించకుండా ఉండటం కోసమే. వాటి ఇమ్యూనిటీ మనకు ఔషధంగా మారింది. సూక్ష్మజీవులను నాశనం చేసే కప్ప మాగేనిన్.. ఆఫ్రికన్ క్లాడ్ రకం కప్ప చర్మంలో ఉండే ఓ ప్రత్యేకమైన ప్రొటీన్. చాలా రకాల బ్యాక్టీరియాలు, ఫంగస్‌లు, ఇతర సూక్ష్మజీవులను నాశనం చేయగల సామర్థ్యం దీని సొంతం. కొన్నేళ్ల కింద ఆ కప్పలపై పరిశోధనలు చేస్తున్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. వాటి శరీరంపై గాయాలైనా ఇన్ఫెక్షన్లు పెద్దగా సోకడం లేదని గుర్తించారు. దానికి కారణం ఏమిటని పరిశోధించి ‘మాగేనిన్’ ప్రొటీన్‌ను గుర్తించారు. ఇది సూక్ష్మజీవుల పైపొరను ధ్వంసం చేస్తోందని తేల్చారు. అయితే ఈ ప్రొటీన్‌ను మానవ వినియోగానికి అనుగుణంగా మార్చడం, వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడంపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. మరెన్నో మందులు.. ►జ్వరం, నొప్పులతోపాటు మరెన్నో అనారోగ్య లక్షణాలకు ఉపశమనంగా వాడే ఆస్పిరిన్ అనే మందు విల్లో చెట్ల బెరడు, ఆకుల్లో ఉంటుంది. వందల ఏళ్లుగా ప్రజలు దానిని వాడుతూ వచ్చారు. 1850వ దశకంలో ఆస్పిరిన్‌ను కృత్రిమంగా తయారుచేశారు. ►మలేరియాకు మందుగా వినియోగించే క్వినైన్ అనే ఔషధం సింకోనా చెట్ల బెరడు నుంచి వస్తుంది. వందల ఏళ్లుగా దాన్ని వినియోగిస్తున్నారు. 1940వ దశకంలో శాస్త్రవేత్తలు క్వినైన్‌ను కృత్రిమంగా తయారు చేశారు. ►రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే ‘స్టాటిన్స్’ను పలు రకాల ఫంగస్ల నుంచి విడుదలయ్యే రసాయనాల నుంచి అభివృద్ధి చేశారు. లక్షల కోట్ల విలువ! మనం పండించే, పెంచే చెట్లు, జంతువులు వంటివి కాకుండా.. సహజ ప్రకృతి నుంచి మనం ఏటా లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను వాడేసుకుంటున్నాం. ప్రపంచ వన్యప్రాణి నిధి (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) అంచనాల ప్రకారం.. భూమ్మీద ఉన్న ప్రకృతిని రూపాయల్లో లెక్కిస్తే.. 92.5 కోట్ల కోట్లు (125 ట్రిలియన్ డాలర్లు) విలువ ఉంటుంది. ప్రకృతిని సంరక్షించుకోకపోవడం వల్ల ప్రస్తుతం ఏటా రూ.35.4 లక్షల కోట్లు (479 బిలియన్ డాలర్లు) నష్టపోతున్నామని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ హెచ్చరించింది. -
Photo Stories: అరుదైన ‘ఎర్ర చందనం’ చేప
నాగారం: సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని మాచిరెడ్డిపల్లి గ్రామ చెరువులో బుధవారం జాలర్లు చేపల వేటకు వెళ్లగా.. నాగారానికి చెందిన వీరగాని రమేశ్‌కు 12 కేజీల బరువున్న అరుదైన ‘ఎర్ర చందనం’ రకం చేప లభ్యమైంది. అయితే దీనిపై జిల్లా మత్స్యశాఖ అధికారిణి సౌజన్యను వివరణ కోరగా.. ఎర్ర చందనం చేపలు తెలంగాణ ప్రాంతంలో అరుదుగా లభిస్తాయని, దీని శాస్త్రీయ నామం హైపోప్తాలమిటిస్ అని తెలిపారు. జోరువానతో కప్పల బెకబెక వరంగల్ రూరల్: వానాకాలం రావడంతో అన్నదాతలకే కాదు సకల జీవరాశికి పండుగ వచ్చేసినట్లే. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం భారీ వర్షం కురవడంతో ఖిలా వరంగల్ కోట పరిసరాల ప్రాంతాల్లో నిలిచిన నీటిలో పసుపుపచ్చ రంగు కప్పలు కనిపించాయి. వీటిని స్థానికులు ఆసక్తిగా చూశారు. చదవండి: ప్రజల జీవితాలతో చెలగాటమాడతారా? -
పెళ్లికి వెళ్లిన అతిథులు.. ఊహించని పని చేసి వచ్చారు
భోఫాల్: లాక్డౌన్ నిబంధనలను పక్కన పెట్టి ఓ వివాహ వేడుకకు హాజరైన అతిథులకు పోలీసులు వింత శిక్ష విధించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ భింద్ జిల్లాలోని జరిగింది. వివరాల ప్రకారం.. ఉమరి గ్రామంలో ఓ పెళ్లి వేడుకకు సుమారు 300 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులను రావడాన్ని గమనించి చాలామంది పారిపోయారు గానీ అందులో 17 మంది మాత్రం దొరికిపోయారు. ఇక పోలీసులకు దొరికిన వారికి శిక్షగా నడిరోడ్డుపై కప్ప గంతులు వేయించారు. అనంతరం లాక్డౌన్ ఆంక్షలు పూర్తి అయ్యే వరకు ఇటువంటి ఉల్లంఘన చేయకూడదని వాళ్లని హెచ్చరించి వదిలేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌వీడియోలో వైరల్‌గా మారి హల్చల్ చేస్తోంది. చదవండి: కోడి గుడ్ల కోసం.. ఛీ ఇదేం పాడు పని పోలీసు In Bhind "Baaratis" were made to do ‘Frog Jump’ for violating #CovidIndia-19 restrictions. The wedding was being organized, in violation of the lockdown restriction enforced in Bhind @ndtv @ndtvindia @GargiRawat @manishndtv pic.twitter.com/QftxjTsFvL— Anurag Dwary (@Anurag_Dwary) May 20, 2021 -
జనాలతో కప్ప గంతులు వేయించిన పోలీసులు.. ఎందుకంటే!
భోపాల్: కరోనా తీవ్రరూపం దాల్చుతుండటంతో మహమ్మారి కట్టడికి పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. రాత్రి కర్ఫ్యూ, పాక్షిక లాక్డౌన్ వంటి చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ కొంతమంది ప్రభత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో లాక్‌డైన్ ఆంక్షలను అతిక్రమించిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే కోవిడ్ కర్ఫ్యూను బేఖాతారు చేసిన వారికి గుణపాఠం చెప్పేందుకు మధ్యప్రదేశ్ అధికారులు వినూత్నంగా రీతిలో శిక్ష విధించారు. ఇండోర్ జిల్లాలోని డెబల్పూర్‌లోని పోలీసులు కోవిడ్ కర్ఫ్యూ సందర్భంగా వీధుల్లో తిరుగుతున్న వారిని రోడ్డుపై కప్ప గంతులు వేయించారు. దీనికితోడు డప్పు చప్పుళ్లు నడుమ వారిని గ్రామంలో కొంతదూరం పరిగెత్తేలా చేశారు. పరిమితికి మించి ఆదివారం సాయంత్రం పెళ్లి నుంచి బైక్, కార్లలో వెళుతుండగా పోలీసులు వీరిని గుర్తించి ఈ శిక్ష వేశారు. ఇలా చేయడం వల్ల ఇతర వ్యక్తులు కోవిడ్ రూల్స్ ఉల్లంఘించకుండా ఉంటుందని ఆ ప్రాంత తహసీల్దార్ జబరంగ్ బహదూర్ పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కాగా ఇప్పటికే కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డిపాల్పూర్‌లో కరనా కర్ఫ్యూ విధించారు. వీటిని ఉల్లంఘించిన వారిపై జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుటోంది. ఇక ఆదివారం మధ్యప్రదేశ్‌లో 12,662 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 94 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 5,88,368కు చేరుకున్నాయి. మరణాల సంఖ్య 5,812 కు చేరుకుంది. చదవండి: కరోనా అలర్ట్: దేశంలో 2 కోట్లు దాటిన కేసులు In Indore district's Depalpur, tehsildar makes people roaming on the streets during the #COVID19 curfew to do frog jumps. yr jeh sarkari nokar bne ha kya... jeh log to behave ese kr rha jaise raja bn gae ho... #COVIDisAirborne #CovidIndia #CoronaPandemic #CoronaCurfew pic.twitter.com/iebAZZcbaH — rockey singh (@rockeys03560226) May 3, 2021 -
వేడి వేడి ఉల్లి పకోడిలో కప్ప
సాక్షి, కుప్పం(చిత్తూరు) : ఉల్లి పకోడీలో కప్ప ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? కానీ.. ఇది నిజం. కుప్పం పట్టణం రాజీవ్ కాలనీలోని ఓ దుకాణంలో సోమవారం రాత్రి ఓ వినియోగదారుడు ఉల్లిపకోడీ కొనుగోలు చేశాడు. ఇంటికెళ్లి తింటుండగా పిండితో కలిసి మాడిపోయిన కప్ప చేతికి వచ్చింది. ఆ కుటుంబం మొత్తం ఒక్కసారి ఉలిక్కి పడింది. ఉదయం పకోడి ప్యాకెట్ తీసుకువెళ్లి దుకాణదారున్ని ప్రశ్నిస్తే తప్పు జరిగిందని సమాధానం ఇచ్చాడు. తమ కుటుంబానికి ఎలాంటి హానీ జరగలేదని, ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే పరిస్థితి ఏంటని వినియోగదారుడు వాపోయాడు. మాంసపు దుకాణాలపై శానిటరీ అధికారుల దాడులు మదనపల్లె : మున్సిపల్ శానిటరీ అధికారులు మంగళవారం పట్టణంలోని పలు మాంసం దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. నిల్వ ఉంచిన, కుళ్లిపోయి పురుగులు పట్టిన మాంసాన్ని గుర్తించారు. వాసన వస్తున్న వాటిని రిఫ్రిజిరేటర్లో నిల్వచేసి సాయంత్రం వేళల్లో కబాబ్, చికెన్‌పకోడి చేసి విక్రయాలు చేస్తున్నట్లు నిర్ధారించారు. పట్టణంలో మొత్తం 47 దుకాణాల్లో తనిఖీలు నిర్వహించగా 19 షాపుల్లో కుళ్లిన మాంసం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. 19 కిలోల చికెన్, 7 కిలోల మటన్‌ను సీజ్ చేశారు. దుకాణదారులపై కేసులు నమోదు చేసి రూ.7,800 జరిమానా వసూలు చేశారు. నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో మాంసం దుకాణాలపై దాడులు నిర్వహించినట్లు చెప్పారు. పట్టణంలోని హోటళ్లలో సైతం తనిఖీ చేస్తామన్నారు. చికెన్, మటన్ దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, బహిరంగంగా మాంసాన్ని ప్రదర్శనకు ఉంచేటప్పుడు వాటిపై దుమ్ము పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వార్డు సచివాలయ శానిటరీ, ఎన్విరాన్మెంటల్ అధికారులు ప్రతిరోజు మాంసం దుకాణాలను తనిఖీ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. దాడుల్లో సచివాలయ సిబ్బంది జుబేర్, రాజారెడ్డి, సతీష్, రవీంద్రనాయక్ పాల్గొన్నారు. (చదవండి: పక్షుల కిలకిల.. మెరుగైన జీవవైవిధ్యం) -
ఇలాంటి కప్పల ఫైట్ మీరు చూసుండరు!
కేప్‌టౌన్ : స్థలం మీద ఆధిపత్యం, ఆడ కప్పలను ఆకర్షించటం కోసం రెండు మగ కప్పలు పోరుకు దిగాయి. సినిమాలో హీరో, విలన్ కొట్టుకున్నట్లు భీకరంగా దెబ్బలాడుకున్నాయి. ఈ సంఘటన సౌత్ ఆఫ్రికాలోని పోలోక్వానేలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం పోలోక్వానేలోని ఓ చిన్న నీటి కుంట దగ్గర పది అంగుళాల పొడవున్న రెండు బుల్ ఫ్రాగ్స్ దెబ్బలాడటం మొదలుపెట్టాయి. ఓ కప్ప మరో కప్పను కిందపడేసి నీళ్లలోకి నొక్కిపడేసింది. ఆ తర్వాత రెండూ గాల్లోకి ఎగురుతూ, పల్టీలు కొట్టుకుంటూ యుద్ధం చేశాయి. ( వాటి దెబ్బకు పిక్నిక్ హర్రర్ సినిమా అయ్యింది! ) తెమ్జిన్ జాన్సన్ అనే ఫొటోగ్రాఫర్ ఈ దృశ్యాలను తన కెమెరాతో క్లిక్ మనిపించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి యుద్ధాలు సంవత్సరానికి ఒకసారి జరుగుతుంటాయి. ముఖ్యంగా ఆ నీటి కుంటపై ఆధిపత్యం చెలాయించటానికి, ఆడ కప్పలను ఆకర్షించటానికి ఇలా చేస్తుంటాయి. బలమైన మగ కప్పలు ప్రత్యర్థిని పళ్లతో ఎత్తి పడేస్తాయి. ఇక గెలిచిన కప్ప ఓ ప్రత్యేక ధ్వని చేస్తూ తన విజయాన్ని చాటి చెప్పుకుంటుంద’’ని పేర్కొన్నారు. -
కప్ప మిణుగురును మింగితే : వైరల్ వీడియో
సాక్షి, ముంబై: సోషల్ మీడియా అనేకవింతలకు విశేషాలకు నెలవు. ఆటవిడుపుగా, అసక్తికరంగా ఉండే ఇలాంటి వీడియోలు నెటిజనులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. తాజాగా ఎపుడూ చూడని ఒక వింత వీడియో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఒక కప్ప మిణుగురును మింగితే.. ఎలా ఉంటుంది.. ఆ మిణుగురు పురుగు కప్ప పొట్టలో మిణుకు మిణుకుమంటూ కనిపిస్తే..ఎలాంటి ఉంటుంది. సరిగ్గా ఇలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 14 సెకన్ల వీడియోను నేచర్ ఈజ్ లిట్ ట్వీట్ చేసిన తర్వాత సంచలనంగా మారిపోయింది. 60.8 లక్షల కంటే ఎక్కువ వ్యూలు, 4.3 వేల లైక్‌లను సంపాదించింది. దీనికి మించిన యూజర్లు కామెంట్లు, పిట్ట కథలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఒక ట్విటర్ యూజర్ మాయ ఏంజెల్‌తో పోలుస్తూ.. మనలో ఉన్న వెలుగును ఎవరూ చంపలేరు అంటూ ఒకరు, బీకన్ లైటు వెలుగుతున్న విమానంలా ఉందని మరొకరు కామెంట్ చేశారు. When a frog eats a firefly pic.twitter.com/31m6ZcurWP — Nature is Lit🔥 (@NaturelsLit) September 10, 2020 "Nothing can dim the light that shines from within." Maya Angelou 😉 — gabrielle (@drgabrielnn) September 10, 2020 it's like an airplane with it's beacon light — Thank You, Messi. (@RifqiAthallah13) September 11, 2020 -
కోడి పిల్లలు అనుకుంటే పొరపాటే..
భోపాల్: కప్ప అంటే సాధారణంగా ఆకుపచ్చ వర్ణంలో ఉంటుందని మనందరికి తెలిసిన విషయమే. కానీ పసుపు రంగులో ఉన్న కప్పలను ఎప్పుడైనా చూశారా. అది కూడా భారీ సంఖ్యలో. లేదు కదా అయితే ఈ వీడియో చూడండి. పదుల సంఖ్యలో పసుప పచ్చ వర్ణంలో ఉన్న కప్పలు వాన నీటిలో ఆడుతున్న దృశ్యాలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. సడెన్‌గా చూస్తే.. కోడిపిల్లల్లా అనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ వద్ద ఈ అరుదైన దృశ్యం కనిపించింది. దీన్ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్లో షేర్ చేశారు. ‘మీరు ఎప్పుడైనా పసుపు పచ్చ వర్ణంలో ఉన్న కప్పలను చూశారా. అయితే ఇప్పుడు చూడండి. ఇండియన్ బుల్ ఫ్రాగ్ జాతికి చెందిన ఈ పసుపు రంగు కప్పలు నర్సింగ్‌పూర్‌లో కనిపించాయి. ఆడ కప్పలను ఆకర్షించడం కోసం ఇవి ఇలా పసుపు రంగులోకి మారతాయి. వాన నీటిలో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయో చూడండి’ అంటూ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. అయితే ఈ కప్పలు ఎప్పుడు ఇంత ప్రకాశవంతమైన పసుపు రంగులో ఉండవు. కేవలం సంతానోత్పత్తి కాలంలో అది కూడా వర్షాకాలంలో మాత్రమే ఆడకప్పలను ఆకర్షించడానికి ఇలా పూర్తిగా పసుపు వర్ణంలోకి మారతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. -
కప్పలు ఇలా కూడా ఉంటాయా..!