ఇలాంటి కప్పల ఫైట్‌ మీరు చూసుండరు! | 10 Inch Bullfrogs Rare Battle In South Africa | Sakshi
Sakshi News home page

అరుదైన మగ కప్పల భీకర పోరు 

Published Thu, Sep 24 2020 1:53 PM | Last Updated on Thu, Sep 24 2020 2:01 PM

10 Inch Bullfrogs Rare Battle In South Africa - Sakshi

కప్పల భీకర పోరు

కేప్‌టౌన్‌ : స్థలం మీద ఆధిపత్యం, ఆడ కప్పలను ఆకర్షించటం కోసం రెండు మగ కప్పలు పోరుకు దిగాయి. సినిమాలో హీరో, విలన్‌ కొట్టుకున్నట్లు భీకరంగా దెబ్బలాడుకున్నాయి. ఈ సంఘటన సౌత్‌ ఆఫ్రికాలోని పోలోక్‌వానేలో  చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం పోలోక్‌వానేలోని ఓ చిన్న నీటి కుంట దగ్గర పది అంగుళాల పొడవున్న రెండు బుల్‌ ఫ్రాగ్స్‌ దెబ్బలాడటం మొదలుపెట్టాయి. ఓ కప్ప మరో కప్పను కిందపడేసి నీళ్లలోకి నొక్కిపడేసింది. ఆ తర్వాత రెండూ గాల్లోకి ఎగురుతూ, పల్టీలు కొట్టుకుంటూ యుద్ధం చేశాయి. ( వాటి దెబ్బకు పిక్‌నిక్‌ హర్రర్‌ సినిమా అయ్యింది! )


తెమ్‌జిన్‌ జాన్సన్‌ అనే ఫొటోగ్రాఫర్‌ ఈ దృశ్యాలను తన కెమెరాతో క్లిక్‌ మనిపించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి యుద్ధాలు సంవత్సరానికి ఒకసారి జరుగుతుంటాయి. ముఖ్యంగా ఆ నీటి కుంటపై ఆధిపత్యం చెలాయించటానికి, ఆడ కప్పలను ఆకర్షించటానికి ఇలా చేస్తుంటాయి. బలమైన మగ కప్పలు ప్రత్యర్థిని పళ్లతో ఎత్తి పడేస్తాయి. ఇక గెలిచిన కప్ప ఓ ప్రత్యేక ధ్వని చేస్తూ తన విజయాన్ని చాటి చెప్పుకుంటుంద’’ని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement