
ఈ కప్ప నాట్యం చేస్తుంది..
దక్షిణ భారత్‌లోని పశ్చిమ కనుమల్లో కనుగొన్న ఫ్రాగ్ జాతికి చెందిన కప్ప ఇది. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ప్రొఫెసర్ సత్యభామ దాస్ బిజూ బృందం 12 ఏళ్లు పరిశోధించి ఈ కప్ప జాతిను గుర్తించింది. దీంతో ఇప్పటిదాకా దేశంలో 24 డ్యాన్సింగ్ ఫ్రాగ్ జాతులు ఉన్నాయని నిర్ధారణ అయింది. సంతానోత్పత్తి సమయంలో ఆడ కప్పలను ఆకర్షించేందుకు మగ కప్పలు నాట్యం చేసినట్లుగా కాళ్లతో రకరకాల విన్యాసాలు చేస్తాయట. అందుకే వీటికి డ్యాన్సింగ్ ఫ్రాగ్స్ అని పేరుపెట్టారు. మానవ కార్యకలాపాల వల్ల వీటి ఆవాసాలు ధ్వంసమై ముప్పును ఎదుర్కొంటున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.