నాగారం: సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని మాచిరెడ్డిపల్లి గ్రామ చెరువులో బుధవారం జాలర్లు చేపల వేటకు వెళ్లగా.. నాగారానికి చెందిన వీరగాని రమేశ్‌కు 12 కేజీల బరువున్న అరుదైన ‘ఎర్ర చందనం’ రకం చేప లభ్యమైంది. అయితే దీనిపై జిల్లా మత్స్యశాఖ అధికారిణి సౌజన్యను వివరణ కోరగా.. ఎర్ర చందనం చేపలు తెలంగాణ ప్రాంతంలో అరుదుగా లభిస్తాయని, దీని శాస్త్రీయ నామం హైపోప్తాలమిటిస్ అని తెలిపారు.
జోరువానతో కప్పల బెకబెక
వరంగల్ రూరల్: వానాకాలం రావడంతో అన్నదాతలకే కాదు సకల జీవరాశికి పండుగ వచ్చేసినట్లే. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం భారీ వర్షం కురవడంతో ఖిలా వరంగల్ కోట పరిసరాల ప్రాంతాల్లో నిలిచిన నీటిలో పసుపుపచ్చ రంగు కప్పలు కనిపించాయి. వీటిని స్థానికులు ఆసక్తిగా చూశారు.
చదవండి: ప్రజల జీవితాలతో చెలగాటమాడతారా?
Comments
Please login to add a commentAdd a comment