సాక్షి, వరంగల్: వరంగల్‌లో దయ్యం చేపలు దర్శనం ఇచ్చాయి. నగరంలోని ఫోర్ట్ వరంగల్ అగర్త చెరువులో చేపల వేటకు వెళ్లిన కిషోర్‌కు అరుదైన చేపలు వలకు చిక్కాయి. నీళ్లలో ఉంటే చకచకా ఈదే చేపలు నీటి నుంచి బయటికి తీస్తే కదలలేని స్థితిలో ఉంటున్నాయి. వీటిని బంగ్లాదేశ్‌లో ఎక్కువగా ఉండే క్యాట్ ఫిష్ సంతతికి చెందిన చేపలుగా భావిస్తున్నారు. ఈ చేపలను దెయ్యం(డెవిల్ ), సక్కెర్ చేప, విమానం చేప అని పిలుస్తారు. ఈ రకం చేపలు తినడానికి ఉపయోగపడవని అంటున్నారు. వింత చేపలను స్థానికులు ఆసక్తిగా చూస్తున్నారు.
చదవండి: (కన్న పిల్లలు కళ్ల ముందే చనిపోతే ఆ తల్లి భరించలేకపోయింది..)
Comments
Please login to add a commentAdd a comment