ghost
-
దెయ్యం పట్టింది.. వదిలిస్తా..
యాదాద్రి భువనగిరి జిల్లా: అనారోగ్యా నికి గురైన చిన్నారికి.. దెయ్యం పట్టింది.. వదిలిస్తా.. అంటూ ఒక భూతవైద్యు డు చేసిన పూజలతో.. ఆమె అపస్మారక స్థితికి వెళ్లింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మటంలంక గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలివి. గ్రామానికి చెందిన ఒక చిన్నారి అనారోగ్యంగా ఉండడంతో.. ఆమె తల్లిదండ్రులు మూడు రోజుల క్రితం ఇల్లెందు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. కాగా, వారికి తారసపడిన ఒక భూత వైద్యుడు ఆస్పత్రికి అవసరం లేదని, తాను నయం చేస్తానని నమ్మించాడు. ఓ మేకను బలిచ్చి, భూతాలను కట్టడి చేస్తానని పూజలు చేశాడు. రెండు రోజులు గడుస్తున్నా పాప ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో కుటుంబసభ్యులు భూత వైద్యుడిని నిలదీశారు. అతను చేతులెత్తేయడంతో వెంటనే ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్య ఖర్చులు భరించలేక.. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగానే ఉందని, భూత వైద్యుడి మాటలు నమ్మి సకాలంలో చికిత్స అందక అపస్మారక స్థితికి చేరిందని వైద్యులు స్పష్టం చేశారు. కాగా, ఈ ఘటనపై ఎస్ఐ రాజమౌళి స్పందిస్తూ భూత వైద్యం పేరుతో ఎవరైనా వస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
దయ్యాల కోసం అద్దె చెల్లించడమా..!
అక్కడ దయ్యాలు, భూతాలు ఉన్నాయంటే ఆ వైపు కూడా వెళ్లరు చాలామంది. అలాంటిది ఓ వ్యక్తి కేవలం దయ్యాల కోసమే అద్దె చెల్లించాడు. ఈజిప్టులోని కైరో వెలుపల అతి పురాతనమైన మూడు పిరమిడ్లు ఉన్నాయి. వీటిని ఈజిప్ట్ ప్రభుత్వం అద్దెకిస్తోంది. వాటిల్లో ఒకటి, అతిపెద్దది, గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా. అక్కడ దాదాపు మూడువేలకు పైగా దయ్యాలు, భూతాలు ఉన్నాయని చాలామంది అంటుంటారు. ఇప్పుడు ఆ దయ్యాలను చూడటానికే ప్రముఖ యూట్యూబర్ జేమ్స్ డొనాల్డ్సన్ (మిస్టర్ బీస్ట్), వాటిని వంద గంటలకు అద్దెకు తీసుకున్నాడు. ‘బియాండ్ ది రికార్డ్స్’ పేరుతో భయంకర ప్రదేశాల్లోకి వెళ్లి, అక్కడ జరిగే విచిత్రమైన సంఘటనల వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. ఇప్పుడు తన భారీ అన్వేషణ కోసం ఈజిప్ట్‌లోని ఈ పిరమిడ్లను ఎంచుకున్నాడు.మరో వింత..ఈ విమానంలో ప్రయాణించాల్సిన పనిలేదు.. ‘ఈ వంద గంటల్లో స్నేహితులతో కలసి అక్కడ ఉండే అన్ని గదులు, సమాధులను చూసి, అక్కడే నిద్రించాలన్నది నా ప్లాన్. ఇందుకోసం, అవసరమైన అన్ని వస్తువులతో పాటు, పారానార్మల్ యాక్టివిటీ డివైజ్, ఇతర పరికరాలను తీసుకెళ్తున్నా’ అని చెప్పాడు. కొంతమంది ఇది సాధ్యం కాదని కొట్టి పారేస్తుంటే, తను మాత్రం త్వరలోనే వీడియోతో సమాధానం చెబుతానంటున్నాడు. భూమి నుంచి దూరంగా వెళ్లకుండా విమానంలో స్పెండ్ చేయడం గురించి విన్నారా..?. ఆ ఆలోచనే వెరైటీగా ఉంది కదూ..!. అలాంటి కోరిక ఉంటే వెంటనే ఉత్తర అమెరికాలో అలాస్కాకి వచ్చేయండి. శీతాకాలపు మంచు అందాల తోపాటు విమానంలో గడిపే అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి అదేంటో తెలుసుకుందామా..!ఆ వీడియోలో 1950ల నాటి విమానం(Airplane) వింటేజ్ డీసీ-6 విమానం విలక్షణమైన విమానహౌస్(Airplane House)గా రూపాంతరం చెందింది. ఇది ఒకప్పుడూ మారుమూల అలాస్కా(Alaska) గ్రామాలకు ఇంధనం, సామాగ్రిని సరఫరా చేసేది. ఇందులో రెండు బెడ్ రూమ్‌లు, ఒక బాత్రూమ్తో కూడిన వెకేషనల్ రెంటల్ హౌస్‌గా మార్చారు. చుట్టూ మంచుతో కప్పబడి ఉండే ప్రకృతి దృశ్యం మధ్యలో ప్రత్యేకమైన విమాన ఇల్లులో అందమైన అనుభూతి.ఇలా సర్వీస్ అయిపోయిన విమానాలను అందమైన టూరిస్ట్ రెంటల్ హౌస్‌లుగా తీర్చిదిద్ది పర్యాటకాన్ని ప్రోత్సహించొచ్చు అనే ఐడియా బాగుంది కదూ..!. చూడటానికి ఇది ప్రయాణించకుండానే విమానంలో గడిపే ఓ గొప్ప అనుభూతిని పర్యాటకులకు అందిస్తోంది. చెప్పాలంటే భూమి నుంచి దూరంగా వెళ్లకుండానే విమానంలో గడిపే ఫీలింగ్ ఇది. (చదవండి: మంచు దుప్పటిలో విలక్షణమైన ఇల్లు..ఒక్క రాత్రికి ఎంతో తెలుసా...!) -
బిగ్‌బాస్ హౌస్‌లో దెయ్యం.. భయంతో వణికిపోయిన హౌస్మేట్స్!
తెలుగులో బిగ్‌బాస్ ప్రస్తుతం ఎనిమిదో వారం నడుస్తోంది. గతవారంలోనే మణికంఠ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇకపోతే సోమ, మంగళ వారాల్లో నామినేషన్స్ గొడవలతో ఓ రేంజ్లో సాగింది. ఈ వారంలో ఈ వారం నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా తాజాగా ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజైంది. నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో ఇక టాస్కుల గోల మొదలు కానుంది. అయితే ఈ సారి హౌస్‌లో ఊహించని సంఘటన జరిగింది. హౌస్‌మేట్స్‌ను నిద్రపోకుండా చేసేలా పెద్ద స్కెచ్ వేశారు. ముగ్గురు కలిసి హౌస్‌మేట్స్‌ను వణికించేశారు. అదేంటో తెలుసుకుందాం.హౌస్‌లో ఉన్న గంగవ్వ అర్ధరాత్రి కేకలు వేస్తూ కనిపించింది. దీంతో అందరూ ఒక్కసారిగా లేచి బయటకు పరిగెత్తారు. ఇంతకీ ఏం జరుగుతోంది అంటూ అంతా భయపడిపోయారు. గంగవ్వను చూసిన హౌస్మేట్స్ ఓ రేంజ్లో వణికిపోయారు. ఆ తర్వాత అవ్వను ధైర్యంతో మెల్లగా గదిలోకి తీసుకెళ్లిన టేస్టీ తేజ తన బెడ్‌పై నిద్రపుచ్చారు. ఆ తర్వాత అంతా కలిసి దెయ్యం పట్టిందేమో అంటూ చర్చ మొదలెట్టేశారు. నాకైతే నిద్ర కూడా రావడం లేదంటూ రోహిణి, హరితేజ తెగ చర్చించుకున్నారు.అయితే ఆ తర్వాత ఫ్రాంక్ అని తెలిసిపోయింది. టేస్టీ తేజ, ముక్కు అవినాశ్, గంగవ్వ ముగ్గురు కలిసి మాట్లాడుకుని ఫ్రాంక్ చేశారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా వీళ్లు ముగ్గురు కలిసి ఇదంతా చేసినట్లు తెలుస్తోంది. ఇంకా హౌస్‌లో ఏం జరిగిందో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూడాల్సిందే. -
#Ghost : విజయ్ ‘ది గోట్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
దయ్యాల పండుగ..! ఒక రకంగా ఇది..?
దయ్యాల పండుగ (ఘోస్ట్ ఫెస్టివల్), ఆకలి దయ్యాల పండుగ (హంగ్రీ ఘోస్ట్ ఫెస్టివల్) అని ఈ పండుగకు పేరు వచ్చినా, ఒకరకంగా ఇది పెద్దల పండుగ. ఆసియా దేశాల్లోని బౌద్ధ మతస్థులు, తావో మతస్థులు ఈ పండుగను తమ తమ సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకొంటారు. బౌద్ధులు దీనిని ‘యులాన్పెన్’ పండుగ అని, తావో మతస్థులు ‘ఝోంగ్యువాన్’ పండుగ అని పిలుచుకుంటారు. చైనా కేలండర్ ప్రకారం ఏడో నెలలోని పదిహేనో రోజు వచ్చే ఈ పండుగను తైవాన్‌లో ‘పుడు’ అని, ‘పున్యాన్’ అని పిలుస్తారు. నిజానికి చైనా కేలండర్లోని ఏడో నెల అంతటినీ పెద్దల మాసంగా ‘ఘోస్ట్ మంత్’గా పాటిస్తారు.ఈ నెల అంతా మరణించిన పెద్దల ఆత్మసంతృప్తి కోసం రకరకాల ఆచారాలను పాటిస్తారు. పండుగ రోజున పెద్దల సమాధుల వద్ద అగరొత్తులు వెలిగిస్తారు. అలాగే, ‘జోస్ పేపర్’ అనే సుగంధభరితమైన కాగితాలను, దుస్తులు, మొక్కల పీచు వంటివి నింపి కాగితాలతో తయారు చేసిన ‘పాపీర్ మేష్’ అనే భారీ బొమ్మలను దహనం చేస్తారు. టాంగ్ వంశస్థుల పాలనాకాలంలో ఈ పండుగ జరుపుకోవడం మొదలైనట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బౌద్ధులు, తావో మతస్థులతో పాటు చైనాలోని వివిధ గిరిజన తెగలకు చెందిన వారు కూడా ఈ పండుగను తమ తమ పద్ధతుల్లో జరుపుకొంటారు.ఈ పండుగ రోజున తమ తమ కుటుంబాల్లో మరణించిన పెద్దలకు నచ్చిన ఆహార పదార్థాలను, పానీయాలను వారికి నైవేద్యంగా పెడతారు. బంధు మిత్రులతో కలసి విందు భోజనాలను ఆరగిస్తారు. నరకంలో చిక్కుకుపోయిన పెద్దల ఆత్మలు ఆకలితో బాధపడుతుంటాయనే భావనతో వారికి ఆకలి తీరేలా భారీగా నైవేద్యాలు పెడతారు. తావో మతస్థులు ఈ పండుగ రోజున నరకంలో బాధలు పడే తమ పూర్వీకుల పాపాలు నశించాలనే ఉద్దేశంతో ‘జోస్ పేపర్’తో తయారు చేసిన నరక లోకపు డబ్బును (హెల్ బ్యాంక్ నోట్స్) తగులబెడతారు.అలాగే, పెద్దల పాప విమోచనం కోసం ఈ పండుగ రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సంప్రదాయ వేషధారణలు ధరించి, సంగీత నృత్యాలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. కొన్నిచోట్ల రంగస్థల వేదికలపై పరలోక పరిస్థితులను కళ్లకు కట్టే నాటకాలను ప్రదర్శిస్తారు. బౌద్ధులు, తావో మతస్థులు ఎక్కువగా ఉండే లావోస్, తైవాన్, వియత్నాం, కంబోడియా, మలేసియా, ఇండోనేసియా, నేపాల్, శ్రీలంక దేశాల్లోనూ ఈ పండుగను జరుపుకొంటారు. -
దేవుళ్ల పండగ అంటే తెలుసు..! మరి దెయ్యాల పండగ?
దేవుళ్లకు పండగలు చేసుకోవడం ఎక్కడైనా మామూలే! దయ్యాల పండగ మాత్రం థాయ్‌లాండ్‌కు మాత్రమే ప్రత్యేకం. ఏటా జూన్ నెలలో మూడు రోజుల పాటు జరిగే ఈ పండగలో జనాలు దయ్యాల బొమ్మలను చిత్రించిన ముసుగులను ధరించి, వీథుల్లోకి వచ్చి, సంప్రదాయ నృత్య గానాలతో భారీ ఊరేగింపులు జరుపుతారు. దయ్యాల ముసుగులను వెదురుతోను, పలచని కలపతోను తయారు చేస్తారు. పెద్దపెద్ద ముక్కులు, చెవులతో తయారుచేసే ఈ ముసుగులు వినోదభరితంగా ఉంటాయి.థాయ్‌లాండ్‌లోని లోయీ ప్రావిన్స్ డాన్సాయ్ పట్టణంలో ఈ వేడుకలను తిలకించడానికి దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ‘ఫి టా ఖోన్ ఘోస్ట్ ఫెస్టివల్’గా పిలుచుకునే ఈ మూడు రోజుల పండుగ మొత్తం కార్యక్రమాన్ని ‘బున్ లువాంగ్’ అంటారు. ఇందులో భాగంగా మున్ నది అవతారంగా భావించే బౌద్ధ సన్యాసి ఫ్రా ఉపాకుత్ ఆత్మశక్తిని ఆహ్వానించి, ప్రజల రక్షణ కోసం ప్రార్థనలు జరుపుతారు. ఈ ఏడాది జూన్ 7 నుంచి 9 వరకు డాన్సాయ్ పట్టణంలో ఈ దయ్యాల పండగ సంప్రదాయ రీతిలో అట్టహాసంగా జరుగుతోంది.‘ఫి టా ఖోన్’ పండగ నేపథ్యానికి సంబంధించిన గాథ బౌద్ధ జాతక కథల్లో ఉంది. దీనికి సంబంధించిన జాతక కథ ప్రకారం.. బుద్ధుడు తన ఒకానొక పూర్వ జన్మలో యువరాజుగా పుట్టాడట. ప్రజల బాగోగులను స్వయంగా తెలుసుకోవడానికి దేశాటనకు వెళ్లాడట. ఎన్నాళ్లు గడిచినా రాజధానికి తిరిగి రాకపోవడంతో అతడు మరణించి ఉంటాడని భావించిన రాజబంధువులు సంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారట.ఆ యువరాజు ఆత్మను ఆహ్వానించడానికి ఈ వేడుకను జరుపుకోవడం అప్పటి నుంచి సంప్రదాయంగా మారిందట. మొదటిరోజు దయ్యాల ముసుగులు ధరించి ఊరేగింపులు జరిపే వేషదారులు సందర్శకులను కట్టెలతో భయపెడుతుంటారు. రెండోరోజు తారాజువ్వలను ఎగరేస్తారు. మూడోరోజు స్థానిక బౌద్ధ ఆలయానికి చేరుకుంటారు. ముగింపు కార్యక్రమంలో ఆలయంలోని బౌద్ధ సన్యాసులు శాంతి ప్రార్థనలు చేస్తారు.ఇవి చదవండి: పిల్లలూ గుర్తుందా!? వేసవి సెలవులు అయిపోవచ్చాయి..! -
గేమింగ్.. 'రక్షకుడు' వచ్చాడు!
యాక్షన్–అడ్వెంచర్ గేమ్ ‘ఘోస్ట్ ఆఫ్ సుషిమ’ విడుదల అయింది. థర్డ్–పర్సన్ పర్స్పెక్టివ్ నుంచి ఆడే గేమ్ ఇది. సుషిమ ద్వీపాన్ని రక్షించడానికి రంగంలోకి దిగిన ‘సకాయ్’ అనే సమురాయ్‌ని ప్లేయర్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అకీరా కురోసావా సినిమాలు, కామిక్ బుక్ సిరీస్ ‘ఉసాగి యోజింటో’ ప్రేరణతో ఈ గేమ్‌ను రూపొందించారు.గేమ్ ల్యాండ్‌స్కేప్, మినిమలిస్టిక్ ఆర్ట్ స్టైల్‌ను యాక్షన్–అడ్వెంచర్ గేమ్ ‘షాడో ఆఫ్ ది కొలోసస్’ ప్రభావంతో చేశారు. గేమ్‌లోని లొకేషన్లు ‘పర్ఫెక్ట్ ఫొటోగ్రాఫర్స్ డ్రీమ్స్’ అనిపించేలా అందంగా ఉంటాయి. ఇలన్ ఎస్కేరి, షిగేర్ ఉమేలయాషి ఈ గేమ్ సౌండ్ ట్రాక్‌ను అద్భుతంగా కం΄ోజ్ చేశారు.‘చారిత్రకంగా, సాంస్కృతికంగా ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాం’ అని మేకర్స్ చెబుతున్నారు.జానర్: యాక్షన్–అడ్వెంచర్మోడ్స్: సింగిల్–ప్లేయర్, మల్టీప్లేయర్ప్లాట్ఫామ్స్: ప్లేస్టేషన్ 4, ప్లే స్టేషన్ 5, విండోస్.ఇవి చదవండి: అరుదైన ప్రతిభ.. అక్షత! -
Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
దెయ్యాల వివాహ సంప్రదాయం గురించి విన్నారా!. ఏంటిదీ ఈ రోజుల్లోనా అనుకోకుండా కొన్ని చోట్ల దీన్ని పాటిస్తున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఏకంగా ఆ వివాహతంతు గురించి మ్యాట్రిమోనియల్ సైటల్లోనే ప్రకటన ఇచ్చింది ఓ కుటుంబం. అది విని అందరూ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఆ ప్రకటన ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..సోషల్ మీడియాలో ఓ వినియోగదారుడు 2022లో ఈ ట్వీట్ గురించి ఎక్స్‌లో రాసుకొచ్చాడు. తాను అలాంటి వివాహానికి హాజరయ్యానని చెప్పుకొచ్చాడు. ఇది మీకు పనికిరాని విషయంగా అనిపించొచ్చు. కానీ ఇలాంటివి ఈ రోజుల్లో కూడా ఉన్నాయా? ఇలాంటి సంప్రదాయల్ని పాటిస్తున్నారా అనే విషయం గురించి తెలియజేయడం కోసం ఇది షేర్ చేస్తున్నట్లు తెలిపాడు. ఇలాంటి సంప్రదాయాలు భారత్‌లో ఎక్కువగా కేరళ, కర్ణాటకలో నిర్వహిస్తుంటారు. అలానే ఓ కేరళ కుటుంబం ఏకంగా 30 సంవత్సరాల క్రితం చనిపోయిన వధువు తగిన వరుడు కావాలంటూ ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో ప్రకటన ఇచ్చింది. ఆ తర్వాత చనిపోయిన వరుడు కుటుంబం ఆచూకి లభించగానే..చాలా ఏళ్ల క్రితం చనిపోయిన ఆ వధువరులిద్దరికి వివాహతంతు జరిపి ఇరుకుటుంబ సభ్యులు ఒకరింటికి ఒకరు వెళ్లి భోజనాలు చేసి వచ్చారు. ముఖ్యంగా ఇలా కడుపులో శిశువుతో చనిపోయిన మహిళకి, యుక్త వయసు రాకుండానే చనిపోయిన పిల్లలకు ఇలాంటి తంతు జరిపిస్తారట. ఇలా చేస్తే తమ కుటుంబం సుఖసంతోషాలతో వృద్ధిలో ఉంటుందనేది పెద్దల నమ్మకం. వాళ్ల దృష్టిలో పిల్లల తమను విడిచిపెట్టిపోలేదని ఆత్మల రూపంలో తమ వెంటే ఉన్నారని భావించి ఇలా చేస్తుంటారు. విచిత్రం ఏంటంటే ఇప్పటికీ దీన్ని పాటించడం విశేషం.(చదవండి: రోల్స్ రాయిస్ కార్లతో వీధులు ఊడిపించిన భారతీయ రాజు! ఎందుకో తెలుసా) -
దేశంలో పెరిగిపోతున్న ఘోస్ట్ మాల్స్.. ఏంటివి?
దేశంలోని ప్రధాన నగరాల్లో ఘోస్ట్ షాపింగ్ మాల్స్ పెరిగిపోతున్నాయి. 40 శాతం కంటే ఎక్కువగా ఖాళీలు ఉండే షాపింగ్ మాల్స్‌ను ఘోస్ట్ మాల్స్ అంటారు. అటువంటి మాల్స్ సంఖ్యలో గణనీయమైన పెరుగుదలను నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక, 'థింక్ ఇండియా థింక్ రిటైల్ 2024' సూచిస్తోంది.నివేదిక ప్రకారం.. ఘోస్ట్ షాపింగ్ మాల్స్ సంఖ్య 2023లో 64కి పెరిగింది. ఇది 2022లో 57గా ఉండేది. ఇది రిటైల్ రంగంలో ఒడిదుడుకుల ధోరణిని ప్రతిబింబిస్తోంది. 2023లో మొత్తం 13.3 మిలియన్ చదరపు అడుగుల స్థూల లీజు విస్తీర్ణంలో 64 షాపింగ్ మాల్స్.. 'ఘోస్ట్ షాపింగ్ సెంటర్స్'గా వర్గీకరించినట్లు నివేదిక వెల్లడించింది. ఇది గత సంవత్సరంతో పోల్చితే విస్తీర్ణంలో 58 శాతం పెరుగుదలను సూచిస్తుంది.నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) ఢిల్లీలో ఘోస్ట్ షాపింగ్ మాల్స్ సంఖ్య అత్యధికంగా ఉంది. ఆ తర్వాత ముంబై, బెంగళూరు ఉన్నాయి. అయితే హైదరాబాద్‌లో మాత్రం ఘోస్ట్ షాపింగ్ సెంటర్ స్టాక్‌లో 19 శాతం క్షీణత నమోదు కావడం విశేషం.విలువపై ప్రభావం:ఘోస్ట్ షాపింగ్ సెంటర్ల పెరుగుదల కారణంగా 2023లో దాదాపు రూ. 6,700 కోట్లు లేదా 798 మిలియన్ డాలర్ల విలువను కోల్పోవచ్చని నైట్ ఫ్రాంక్ అంచనా వేసింది. ఇది రిటైల్ రంగంపై గణనీయమైన ఆర్థిక ప్రభావాన్ని సూచిస్తుంది. భూ యజమానులు, డెవలపర్లు ఎదుర్కొంటున్న సవాళ్లను తెలియజేస్తోంది.దుకాణదారులకు మెరుగైన రిటైల్ అనుభవం ప్రాముఖ్యతను నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ నొక్కి చెప్పారు. "గ్రేడ్ ఏ మాల్స్ ముఖ్యంగా రాణించాయి, బలమైన ఆక్యుపెన్సీ, ఫుట్ ట్రాఫిక్, కన్వర్షన్ రేట్లను సాధిస్తున్నాయి. తద్వారా తమ వినియోగదారులకు విలువను అందిస్తున్నాయి" అన్నారు.మరోవైపు దేశవ్యప్తంగా 8 కొత్త రిటైల్ కేంద్రాలను చేర్చినప్పటికీ, 2023లో 16 షాపింగ్ కేంద్రాలు మూసివేయడంతో, టైర్1 నగరాల్లో మొత్తం షాపింగ్ కేంద్రాల సంఖ్య 263కి తగ్గింది. డెవలపర్లు నివాస లేదా వాణిజ్యపరమైన అభివృద్ధిని చేపట్టడం వంటి వివిధ కారణాల వల్ల ఖాళీగా ఉండే, ఆదాయం లేని షాపింగ్ కేంద్రాలను కూల్చివేశారు. కొన్నింటిని శాశ్వతంగా మూసివేశారు. -
Patna High Court: భార్యను భూతం.. పిశాచి అనడం క్రూరత్వం కాదు
పట్నా: వైవాహిక జీవితం విఫలమైన సందర్భంలో ఒక భర్త తన భార్యను భూతం, పిశాచి అంటూ దూషించడం క్రూరత్వం కాదని పట్నా హైకోర్టు తేల్చిచెప్పింది. తననుంచి విడాకులు తీసుకున్న మహిళ ఫిర్యాదుపై కిందికోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆమె మాజీ భర్త దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. జార్ఖండ్‌లోని బొకారోకు చెందిన నరేశ్కుమార్గుప్తాకు 1993లో బిహార్‌లోని నవదా పట్టణానికి చెందిన మహిళతో వివాహం జరిగింది. అదనపు కట్నం కింద కారు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తన భర్త, అతడి తండ్రి సహదేవ్ గుప్తా కలిసి తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ ఆమె 1994లో నవదాలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తండ్రీకుమారులపై కేసు నమోదైంది. వారిద్దరి విజ్ఞప్తి మేరకు ఈ కేసు నలందా జిల్లాకు బదిలీ అయ్యింది. నరేశ్‌కుమార్ గుప్తా, సహదేవ్ గుప్తాకు 2008లో నలందా కోర్టు ఏడాదిపాటు కఠిన కారాగార శిక్ష విధించింది. దీనిని వ్యతిరేకిస్తూ వారిద్దరూ అదనపు సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. వారి అప్పీల్‌ను పదేళ్ల తర్వాత కోర్టు తిరస్కరించడంతో పట్నా హైకోర్టుకు వెళ్లారు. ఇంతలో జార్ఖండ్ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. 21వ శతాబ్దంలో ఒక మహిళను ఆమె అత్తింటివారు భూతం, పిశాచి అంటూ ఘోరంగా దూషించడం దారుణమని విడాకులు తీసుకున్న మహిళ తరపున ఆమె లాయర్ వాదించారు. ఇది ముమ్మాటికీ క్రూరత్వమేనని, తండ్రీ కుమారులను కఠినంగా శిక్షించాలని కోరారు. అందుకు జస్టిస్ బిబేక్ చౌదరి నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం నిరాకరించింది. విఫలమైన వివాహ బంధాల్లో దంపతులు పరస్పరం దూషించుకొనే సందర్భాలు చాలా వస్తుంటాయని అభిప్రాయపడింది. భర్త తన భార్యను భూతం, పిశాచి అంటూ దూషించడం క్రూరత్వం కిందికి రాదని తేల్చిచెప్పింది. పైగా సదరు మహిళ నిర్దిష్టంగా ఏ ఒక్కరిపైనా ఆరోపణలు చేయలేదని పేర్కొంది. కింది కోర్టులు ఇచ్చిన తీర్పులను కొట్టివేసింది. -
జాబ్ మార్కెట్లో ఇప్పుడిదే ట్రెండ్.. ఉద్యోగుల్ని మోసం చేస్తున్న కంపెనీలు
ప్రపంచ వ్యాప్తంగా ఓ వైపు కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు. మరోవైపు పెరిగిపోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగం. ఫలితంగా జాబ్ మార్కెట్ కఠిన పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఈ తరుణంలో అదే జాబ్ మార్కెట్లో ‘గోస్ట్ జాబ్స్’ ట్రెండ్ మొదలైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్ థ్రెడ్ యూజర్, హెచ్ఆర్ విభాగంలో పనిచేసే మౌరీన్ క్లాఫ్ అనే మహిళా ఉద్యోగి జాబ్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్ గురించి షేర్ చేశారు. ఇంతకీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న గోస్ట్ జాబ్స్ ఏంటో తెలుసా? గోస్ట్ జాబ్స్ ట్రెండ్ గోస్ట్ జాబ్స్ ట్రెండ్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే..ఓ టెక్ కంపెనీలో సంబంధిత విభాగాల్లో పనిచేసేందుకు ఉద్యోగులు కావాలి. ఇందుకోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. అప్లయ్ చేసుకోవచ్చంటూ సదరు కంపెనీ హైరింగ్ కేటగిరిలో సమాచారం ఇస్తుంది. పనిలో పనిగా అందులో ఓపెన్ అనే ఆప్షన్ ఉంచుతుంది. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేసి కంపెనీకి కావాల్సిన అర్హతులు ఉన్న అభ్యర్ధులు జాబ్స్ కోసం అప్లయ్ చేస్తుంటారు. అసలు కథ అక్కడే మొదలవుతుంది. రోజులు, నెలలు గడుస్తున్నా ఉద్యోగాలకు అప్లయ్ చేస్తున్నా ఇంటర్వ్యూ కాల్ రాదు. కానీ కంపెనీ వెబ్సైట్ హైరింగ్ కేటగిరిలో ఉద్యోగులు కావాలనే సంకేతం ఇస్తూ ఓపెన్ అనే ఆప్షన్‌ను అలాగే ఉంచుతుంది. ఇదిగో ఇప్పుడు ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి ఆయా కంపెనీలు. దీన్ని గోస్ట్ జాబ్స్ అని పిలుస్తున్నారు. ఘోస్ట్ జాబ్ అంటే ఏమిటి? ఘోస్ట్ జాబ్స్ అంటే తమ సంస్థలో ఖాళీలు ఉన్నాయి. జాబ్స్ కోసం అప్లయ్ చేసుకోవచ్చంటూ ప్రకటనలు ఇస్తాయి. కానీ ఉద్యోగుల్ని నియమించుకోవు. దీనికి కారణం కంపెనీని బట్టి ఉంటుంది. అయితే ఎక్కువ శాతం కంపెనీలు ఉద్యోగుల్ని నియమించుకునేందుకు తమ వద్ద నిధులు లేకపోవడం, టాలెంట్ ఉన్న అభ్యర్ధుల్ని గుర్తించేందుకు ఇలా చేస్తాయి. లేదంటే ఈ ఓపెన్ జాబ్‌లు త్వరలో ఖాళీ అవుతున్న ఉద్యోగాలకు ముందుగానే కొత్త వారిని ఎంపిక చేసుకునేందుకు ఇలా చేసేందుకు అవకాశం ఉందంటూ పలు నివేదికలు చెబుతున్నాయి. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఏం చెబుతోంది హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అధ్యయనం ప్రకారం.. కరోనా కష్టాలంలో చేస్తున్న ఉద్యోగులకు రాజీనామాలు చేసే సంఖ్య పెరగడం, ఆర్ధిక అనిశ్చితి కారణంగా ఘోస్ట్ జాబ్స్ ఉద్యోగాల సంఖ్య పెరిగినట్లు అంచనా. అంతేకాదు భవిష్యత్‌పై స్పష్టత లేని కంపెనీలు ఇలా ఘోస్ట్ జాబ్స్‌లో ఉద్యోగుల్ని నియమించుకోవడం ఓ కారణమని అధ్యయనం తెలిపింది. ఉద్యోగం నిజమా? కాదా? అని తేల్చేదెలా? ఓ కంపెనీ ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చినప్పుడు అవి నిజమా? కాదా? అని తెలుసుకునేందుకు పలు అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఘోస్ట్ జాబ్స్‌లో ఉద్యోగులు చేయాల్సి విధులు, ఇతర జీతభత్యాల గురించి అస్పష్టంగా ఉంటుంది. ఒక అభ్యర్థి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వారాలు లేదా నెలల తరబడి ఎలాంటి స్పందన ఉండదు. దీన్ని ఘోస్ట్ జాబ్స్ అని అర్ధం చేసుకోవాలి. లేదంటే తమ కంపెనీలో ఉద్యోగం ఉందని, అదే జాబ్స్ రోల్ ఎక్కువ కాలం ఉంచితే దాన్ని ఘోస్ట్ జాబ్‌గా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. -
విలాసవంతమైన భవనం కట్టడం డ్రీమ్!..సడెన్‌గా మర్డర్ కేసులో..
అలికిడిలేని ఇళ్ల చుట్టూ హడలెత్తించే కథలల్లుకోవడం కొత్తేం కాదు. అందుకే చాలా పాడుబడిన భవనాలు ఇప్పటికీ మిస్టరీలుగా ప్రపంచాన్ని వణికిస్తుంటాయి. థాయ్‌లండ్ రాజధాని బ్యాంకాక్‌లో 49 అంతస్తులతో అసంపూర్ణంగా మిగిలిపోయిన ‘ఘోస్ట్ టవర్’ కూడా అలాంటిదే! దీని అసలు పేరు సాథోర్న్ యూనిక్ టవర్. ఇదొక దయ్యాల భవనంగా 1997 నుంచి 2014 వరకూ పుకార్లతో షికార్లు చేసింది. ఈ భవంతిలోని 43వ అంతస్తులో 2014 డిసెంబర్ 5న స్వీడిష్ టూరిస్ట్ మృతదేహం..ఈ పుకార్లకు సాక్ష్యాన్నిచ్చింది. 2014లో.. అప్పటికే 17 ఏళ్లుగా మూసే ఉంటున్న ఈ టవర్‌లో.. స్వీడిష్ టూరిస్ట్ ఉరి తాడుకు వేలాడటం స్థానికులను హడలెత్తించింది. ప్రపంచ మీడియాను కదిలించింది. నథాపత్ అనే 33 ఏళ్ల ఫొటోగ్రాఫర్.. మొదటగా ఈ భవనంలో స్వీడిష్ టూరిస్ట్ మృతదేహాన్ని గుర్తించాడు. 30 ఏళ్ల స్వీడిష్ టూరిస్ట్ జేబులో దొరికిన డ్రైవింగ్ లైసెన్స్ సాయంతో నవంబర్ 10 థాయిలండ్కు వచ్చాడని.. అక్కడే ఓ గెస్ట్‌హౌస్‌ను అద్దెకు తీసుకున్నాడని తేలింది. మృతదేహం దొరికిన్నాటికే అతడు చనిపోయి ఐదు రోజులు అయ్యుండొచ్చని వైద్యనిపుణులు అంచనా వేశారు. కానీ మరణానికి అసలు కారణం స్పష్టం కాలేదు. అతని కలే ఈ భవనం.. 1990లో రంగ్సన్ టోర్సువాన్ అనే ప్రముఖ థాయ్ వాస్తుశిల్పి.. విలాసవంతమైన ‘కండోమినియం కాంప్లెక్స్’ కట్టాలని కలగన్నాడు. అతడు స్వయంగా డెవలపర్ కావడంతో ఆశపడినట్లే దీని నిర్మాణాన్ని అనుకున్న సమయానికి ప్రారంభించాడు. అయితే అనుకోకుండా 1993లో థాయ్ సుప్రీంకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి మర్డర్ కేసులో ఇరుక్కున్న టోర్సువాన్.. జైలుకెళ్లాల్సి వచ్చింది. ఆర్థిక కష్టాలు మొదలుకావడం, యజమాని జైల్లో ఉండటంతో 1997లోనే ఈ నిర్మాణం ఆగిపోయింది. అప్పటికే 80 శాతం పూర్తయిన ఈ టవర్.. అసంపూర్ణంగానే మూలపడింది. నాటి నుంచి నేటికీ ఆ భవనంలో ప్రేతాత్మలున్నాయని చాలామంది నమ్ముతారు. ఆ నమ్మకానికి స్వీడిష్ డెత్ మిస్టరీ మరింత బలం చేకూర్చింది. చివరికి టోర్సువాన్.. 2010లో నిర్దోషిగా బయటికి వచ్చాడు. దయ్యాలు, మూఢనమ్మకాల చుట్టూ తిరిగే కొందరు మాత్రం ఈ పాడుబడిన భవనం గురించి మాట్లాడుకునేటప్పుడు.. టోర్సువాన్ పతనానికి ఈ భవననిర్మాణమే కారణమని భావిస్తుంటారు. ఎందుకంటే ఆ స్థలంలో గతంలో శ్మశానవాటిక ఉండేదని, దాన్ని పూర్తిగా పూడ్చేసి టోర్సువాన్ ఈ టవర్ కట్టాడని చెప్పుకుంటారు. ఒకప్పుడు ఈ టవర్‌పైకి ఎక్కడానికి అడ్డదార్లను వెతికే ఔత్సాహికులు కొందరు ఇక్కడి సెక్యూరిటీ గార్డులకు లంచం ఇచ్చి మరీ లోపలికి వెళ్లి సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పెట్టేవారు. కానీ స్వీడిష్ టూరిస్ట్ మరణం తర్వాత సెక్యూరిటీ మరింత పెరిగింది. అలాగే 2015 నుంచి రంగ్సాన్ టోర్సువాన్ వారసుడు పన్సిత్ టోర్సువాన్.. టవర్‌పైకి ఎక్కి ఆన్లైన్లో ఫొటోలు షేర్ చేసేవారిపై కేసులు పెట్టడం మొదలుపెట్టాడు. దాంతో ఈ టవర్‌లోకి అడుగుపెట్టే సాహనం ఎవరూ చేయడం లేదు. ఏది ఏమైనా ఈ టవర్‌లో దయ్యాలు ఉన్నాయా? స్వీడిష్ టూరిస్ట్ ఎలా చనిపోయాడు? ఎవరైనా అతన్ని చంపి, అక్కడ ఉరితాడుకు కట్టేసి నేరం నుంచి తప్పించుకున్నారా? లేక దయ్యాలే దాడి చేశాయా? వంటివన్నీ నేటికీ మిస్టరీనే! ∙సంహిత నిమ్మన (చదవండి: అక్కడ కవి పుట్టిన రోజు ‘బర్న్స్ నైట్’ పేరుతో ఓ పండుగలా ..!) -
ప్రేతాత్మలను ప్రత్యక్షంగా చూడటానికి ఎగబడుతున్న జనాలు!
చిమ్మచీకటి వణికిస్తుంది. కానీ కొన్ని సార్లు.. ఆ చీకటిని చీల్చే వెలుతురు కూడా వణికిస్తుంది. అమాంతం ప్రత్యక్షమై.. అర్ధాంతరంగా మాయమై.. గజగజ వణికిస్తోన్న ఆ మిస్టరీ ఏంటీ? అది దక్షిణ అమెరికా, ఆర్కన్సా (Arkansas) రాష్ట్రంలో గుర్డాన్ సిటీ. చీకటిపడేవరకు ఆత్రంగా ఎదురుచూసిన.. ఓ నలుగురు చిన్నారులు నక్కి నక్కి.. పాత రైల్రోడ్ ట్రాక్ వైపు అడుగులు వేశారు. కాళ్లకు చెప్పులుంటే అలికిడి అవుతుందని ఒట్టికాళ్లతో మెల్లమెల్లగా నడుస్తూ.. ఓ బండకు ఆనుకుని ఒకరి తల మీంచి మరొకరు తల పెట్టి తొంగి తొంగి చూస్తున్నారు. చీకట్లో నల్లరాయిలా.. వాళ్లు ఎవరికీ కనిపించడం లేదు. వాళ్లకీ ఏమీ కనిపించడం లేదు.‘ఏది వచ్చిందా? ఎక్కడ నుంచి వస్తోంది? ఎలా వస్తోంది? వచ్చేసిందా?’ అనే గుసగుసలు.. వారి గుండె అలికిడి కంటే చిన్నగా వినిపిస్తున్నాయి. ‘అదిగో’ అన్న మాట ఆ నలుగురిలో ఎవరి నుంచి బయటికి వచ్చిందో తెలియదు కానీ.. కాస్త గట్టిగానే వచ్చింది. నిదానిస్తే అది వాళ్ల వైపే దూసుకొస్తోంది. అది, గుండ్రంగా, చిన్నబంతిలా మెరుస్తోంది. దగ్గరకు వచ్చేసరికి వాలీబాల్ అంత పెద్దదైపోయింది. కెవ్వుమనే కేకలతో వణుకుతూ నలుగురూ నాలుగు దిక్కులకు పరుగెత్తారు. ఆ అతీంద్రియశక్తికి ‘గుర్డాన్ లైట్’ అని పేరు పెట్టిన రిపోర్టర్స్.. ఈ మిస్టరీని ప్రపంచానికి పరిచయం చేశారు. అదో కాంతి. ఓ దీపం ప్రకాశించినట్లుగా.. మిలమిలా మెరిసిపోతుంది. అది తరుముతూ వెనుకే వస్తుంటే.. పరుగెత్తే వారికి చీకట్లో తోవ కనిపించడమే ఇక్కడ గమ్మత్తైన విషయం. సీన్ కట్ చేస్తే.. ఆ నలుగురు పిల్లలకు నాలుగు రోజులు నిద్ర లేవలేదు. అది ఆ నలుగురి అనుభవం మాత్రమే కాదు. చాలా ఏళ్లుగా గుర్డాన్ వాసుల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామందికి కలిగిన వింత అనుభవం. ఈ హడలెత్తించే కథనాలను విన్న వారంతా దీని వెనుకున్న ఉదంతాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించినవారే. అయితే పోలీస్ రికార్డుల్లో నిక్షిప్తమైన ఆ వ్యథ.. విన్నవారిని ఇంకాస్త బెదరగొడుతుంది. 1931 డిసెంబరు 10న విలియమ్ మెక్‌క్లెయిన్ అనే వ్యక్తిని తన కింద పనిచేసే 38 ఏళ్ల లూయీ మెక్‌బ్రైడ్.. గుర్డాన్ రైల్రోడ్ ట్రాక్ సమీపంలో నరికి చంపేశాడు. అయితే మొదట అనుమానితుడిగా అరెస్ట్ అయిన లూయీ.. చివరికి స్వయంగా తన నేరాన్ని అంగీకరించాడు. దాంతో కోర్టు ఉరిశిక్ష విధించింది. అక్కడితో లూయీ కథ కూడా ముగిసింది. అయితే మెక్‌క్లెయిన్ హత్య జరిగిన చోట దాదాపు పావు మైలు పొడవున రక్తపు అడుగుజాడలు ఉన్నాయని.. లూయీ దాడి నుంచి తప్పించుకోవడానికి మెక్‌క్లెయిన్ చాలా ప్రయత్నించాడని.. చేతిలో లాంతరు పట్టుకుని.. ప్రాణాలు నిలుపుకోవడానికి పరుగులు తీశాడని.. పోలీస్ క్రైమ్ రికార్డ్‌లో ఉంది. తల తెగిన కారణంగానే మరణం సంభవించిందని పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ తేల్చింది. అయితే మెక్‌క్లెయిన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు.. అతడి పిడికిలి పట్టులో లాంతరు ఉండటమే కీలకంగా మారింది. నాటి నుంచి ఆ సమీపంలో గుర్డాన్ ఘోస్ట్లీ లైట్.. స్థానికులను పరుగులెత్తిస్తోందనేది చాలామంది నమ్మకం. తెగిపడిన తన తలను వెతుక్కోవడానికే మెక్‌క్లెయిన్ ఆత్మ లాంతరు పట్టుకుని.. ఆ పరిసరాల్లోనే తిరుగుతోందనే ప్రచారం మొదలైంది. ఈ దయ్యం కాంతి.. భూమి నుంచి 3 అడుగుల ఎత్తులో ఉరకలేస్తుందని.. ముందుకు వెనక్కు కదులుతుందని, కొన్ని సార్లు పసుపు, నారింజ, నీలం, ఎరుపు రంగుల్లో కనిపిస్తోందని సాక్షులు చెప్పారు. అయితే ఇది ఏంటి అనేది మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. గుర్డాన్ నివాసి మార్తా రామీ అనే ప్రత్యక్ష సాక్షి.. ‘నేను కూడా చిన్నప్పుడు ఆ దీపాన్ని చూడటానికి రాత్రి పూట స్నేహితులతో వెళ్లాను. అది నన్ను తరమడం నాకు ఇప్పటికీ గుర్తుంది’ అని చెప్పుకొచ్చింది.ఈ లైట్ దయ్యం కాదని.. పీజో ఎలక్ట్రిక్ ప్రభావం అంటూ కొందరు వాదన లేవదీశారు. స్ఫటికాలు, సిరామిక్స్ వంటి కొన్ని పదార్థాలకు తేమగాలులు సోకినప్పుడు ఒత్తిడికి గురై.. విద్యుదుత్పత్తి జరుగుతుందని.. ఆ వెలుతురుని చూసి చాలామంది భయపడుతున్నారని వారు తేల్చేశారు.బాబ్ థాంప్సన్ అనే క్లార్క్ కౌంటీ హిస్టారికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్.. దీనిపై ఎన్నో పరిశోధనలు చేశాడు. ‘మేము ఒక రకమైన ఎర్రటి, బంగారు కాంతిని చాలాసార్లు చూశాం. అది చూడటానికి ఎవరో ఒక బేస్‌బాల్ క్యాప్‌తో ఫ్లాష్‌లైట్‌ని కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. కాసేపటికి అదృశ్యమైపోతుంది. కొన్నిసార్లు ఆ బాల్ లాంటి కాంతి.. స్వింగ్ అవుతున్నట్లుగా వలయాల్లా కనిపిస్తుంది. ఎంతటి ధైర్యవంతులైనా అది చూసి భయపడతారు’ అని చెప్పుకొచ్చారు. అయితే ప్రేతాత్మలను ప్రత్యక్షంగా చూడాలనుకునేవారు మాత్రం ఇక్కడకు ఎగబడుతూ ఉంటారు.ఇప్పటికీ చాలామంది ఆ వెలుగును చూసి జడుసుకుంటూంటారు. ఏదేమైనా ఈ కాంతికి అసలు కారణం తేలియకపోవడంతో ఈ ఘోస్ట్ లైట్ మిస్టరీగానే మిగిలిపోయింది. -సంహిత నిమ్మన -
ఆకాశంలో దెయ్యం
పెద్దగా నోరు తెరుచుకుని మీదికొస్తున్న దెయ్యంలా.. చూడగానే వామ్మో అనిపించేలా ఉందికదా! ఇది ఏ గ్రాఫిక్స్ బొమ్మనో, సరదాగా సృష్టించిన చిత్రమో కాదు.. సుదూర అంతరిక్షంలోని ఓ భారీ గెలాక్సీ (నక్షత్రాల గుంపు) ఇది. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ (జేడబ్ల్యూఎస్‌టీ) సాయంతో టెక్సాస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ గెలాక్సీని గుర్తించారు. మన విశ్వం పుట్టుక తొలినాళ్లలోనే ఈ గెలాక్సీ ఏర్పడిందని.. అది భారీగా దుమ్ము, ఇతర ఖగోళ పదార్థాలతో నిండి ఉందని వారు తెలిపారు. విసిరివేసినట్టుగా ఉన్న ఆ ఖగోళ పదార్థాల నుంచి వేలాది కొత్త నక్షత్రాలు జన్మిస్తున్నాయని.. ఈ క్రమంలో దెయ్యం ముఖం వంటి ఆకృతి ఏర్పడిందని వివరించారు. అయితే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చిత్రాలు మసకగా ఉండటంతో.. ఓ చిత్రకారుడితో మరింత స్పష్టత వచ్చేలా మార్చామని వివరించారు. -
అక్కడ ఊపిరి తీసుకున్నా ప్రమాదమే!
సోవియట్ రష్యాలో అణుప్రమాదం జరిగిన చెర్నోబిల్ పట్టణం సంగతి చాలామందికి తెలుసు. ప్రస్తుతం యుక్రెయిన్ భూభాగంలో ఉన్న చెర్నోబిల్ పట్టణంలోని అణు విద్యుత్ కేంద్రంలోని రియాక్టర్ 1986 ఏప్రిల్ 26న పేలిపోయింది. అప్పటి నుంచి ఈ పట్టణం ఎడారిగా మారింది. ఇప్పటికీ అక్కడి గాలిలో అణుధార్మిక శక్తి వ్యాపించే ఉంది. అక్కడ ఊపిరి తీసుకున్నా ప్రమాదమే! అయితే, చెర్నోబిల్‌ను తలపించే మరో పట్టణం ఆస్ట్రేలియాలో ఉంది. ఆస్ట్రేలియా పశ్చిమ ప్రాంతంలోని విటెనూమ్లో పట్టణం మరో చెర్నోబిల్‌గా పేరు పొందింది. అలాగని విటెనూమ్ అణు రియాక్టర్ పేలుడు ఏదీ సంభవించలేదు. దశాబ్దాల కిందట ఇక్కడ యాజ్బెస్టాస్ గనులు ఉండేవి. ఈ ప్రాంతంలో 1930ల నుంచి గనులు ఉన్నా, 1947 గోర్జ్ కంపెనీ ఇక్కడి గనులను స్వాధీనం చేసుకుని, గని కార్మికుల కోసం 1950లో ఈ పట్టణాన్ని నిర్మించింది. ఆ తర్వాత 1966 నాటికి గనులు మూతబడ్డాయి. గనులు మూతబడిన తర్వాత కూడా ఇక్కడ జనాలు ఉంటూ వచ్చారు. అయితే, యాజ్బెస్టాస్ ధూళి కణాలు పరిసరాల్లోని గాలిలో వ్యాపించి ఉండటంతో జనాలు తరచు ఆరోగ్య సమస్యలకు లోనయ్యేవారు. వారిలో చాలామంది క్యాన్సర్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో పశ్చిమ ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇక్కడి ప్రజలను వేరే ప్రదేశాలకు తరలించి, పట్టణాన్ని పూర్తిగా ఖాళీ చేయించింది. ఇప్పటికీ ఇక్కడి గాలిలో ప్రమాదకరమైన యాజ్బెస్టాస్ ధూళికణాలు ఉన్నాయని, ఇక్కడ ఊపిరి తీసుకున్నా ప్రమాదమేనని శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. శాస్త్రవేత్తల సూచన మేరకు ప్రభుత్వం ఈ పట్టణంలో అడుగడుగునా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసింది. జనాలు ఉన్నప్పుడు ఇక్కడ ఏర్పడిన ఇళ్లు, ప్రార్థన మందిరాలు, బడులు, హోటళ్లు వంటివన్నీ ఇప్పుడు ధూళితో నిండి బోసిగా మిగిలాయి. (చదవండి: చాయ్ తాగాలంటే కొండ ఎక్కాల్సిందే! శిఖరాగ్ర పానీయం!) -
మనుషులే లేని ఊరు.. అసలు ఎక్కడ ఉంది..?
-
యాక్షన్ ఘోస్ట్
కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ హీరోగా శ్రీని దర్శకత్వంలో రూపొందిన కన్నడ యాక్షన్ చిత్రం ‘ఘోస్ట్’. అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చనా జాయిస్, సత్య ప్రకాశ్ కీలక పాత్రల్లో నటించారు. ఎన్ . సందేశ్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 19న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభించిందని, దీంతో ఈ సినిమాను నవంబరు 4న తెలుగులోనూ విడుదల చేయనున్నట్లుగా చిత్రం యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రానికి సంగీతం: అర్జున్ జన్య. -
పోలీసు సిబ్బందిని భయపెడుతున్న దెయ్యం!
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దెయ్యం ఉందంటూ పుకార్లు సాగుతున్నాయి. దీంతో రాత్రి వేళలో నిద్రిస్తున్న సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఓపెన్ స్కూల్ పరీక్షల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే వారు సైతం కార్యాలయంలో దెయ్యం ఉన్నట్లు సిబ్బందితో తెలిపిన ట్లు సమాచారం. ఈ క్రమంలో కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి మాంత్రికుడిని తీసుకొ చ్చి అక్కడి మరుగుదొడ్లను చూపించగా.. అక్క డ దెయ్యాలున్నాయని చెప్పడంతో కొంత మంది ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. దీంతో డీఈవో విషయాన్ని జన విజ్ఞాన వేదిక దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం రాత్రి సిబ్బందితో పాటు వేదిక జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంతోష్, రవీందర్‌రెడ్డితో పాటు జిల్లా సైన్స్ అధికారి రఘురమణ రాత్రి సమయంలో కార్యాలయంలో నిద్రించారు. తమకు ఎలాంటి శబ్ధాలు వినిపించలేదని, దెయ్యం ఉన్నట్లు వస్తున్న పుకార్లు అవాస్తవమని స్పష్టం చేశారు. ఈ విషయమై డీఈవోను వివరణ కోరగా, దెయ్యాలు లేవని, కావాలనే కొంత మంది పుకార్లు చేస్తున్నారని వివరించారు. రాత్రి సమయంలో విధులు నిర్వహించడం ఇష్టం లేకనే ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. మూఢనమ్మకాలను దూరం చేసి శాస్త్రీయ దృక్పదా న్ని పెంపొందించాలి్సన విద్యాశాఖలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం చోద్యంగా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. -
అదొక శాపగ్రస్త గ్రామం! అరవై ఏళ్లుగా మనుషులే లేని ఊరు
అరవై ఏళ్లుగా మనుషులు లేని ఊరు అదొక శాపగ్రస్త గ్రామం. అరవై ఏళ్లుగా ఆ ఊళ్లో మనుషులెవరూ ఉండటం లేదు. మధ్యయుగాల నాటి ఆ ఊరి పేరు క్రాకో. ఇటలీలోని బాజిలికా ప్రాంతంలో ఉందిది. కేవోన్ నది సమీపంలో ఎత్తయిన కొండ మీద దాదాపు పద్నాలుగు శతాబ్దాల కిందట కట్టుదిట్టంగా ఈ ఊరిని నిర్మించుకున్నారు. ఆనాటి రక్షణ అవసరాల కోసం దీనిని శత్రుదుర్భేద్యంగా రూపొందించుకున్నారు. కొండను తొలిచి ఊరిలోని ఇళ్లను, ప్రార్థన స్థలాలను పూర్తిగా రాళ్లతోనే నిర్మించుకున్నారు. కొన్నిచోట్ల గుహలలో కూడా ఇళ్లను ఏర్పాటు చేసుకున్నారు. ఒకప్పుడు ఇది ‘కేవ్ సిటీ’గా పేరుపొందింది. రోమన్ చక్రవర్తి రెండో ఫ్రెడెరిక్ కాలంలో ఈ ఊరు వ్యూహాత్మక సైనిక స్థావరంగా ఉపయోగపడేది. తర్వాత పద్నాలుగో శతాబ్దిలో ప్లేగు మహమ్మారి విజృంభించడంతో ఈ ఊళ్లోని వందలాది మంది చనిపోయారు. ఇక అప్పటి నుంచి వరుసగా ఏదో ఒక ఉపద్రవం ముంచుకొస్తూనే ఉండటంతో జనాలు దీన్నొక శాపగ్రస్త గ్రామంగా భావించడం మొదలుపెట్టారు. బందిపోట్ల దాడుల్లో కొందరు ఊరి జనాలు హతమైపోయారు. కొండచరియలు కూలిన సంఘటనల్లో కొందరు మరణించారు. చివరిసారిగా 1963లో ఒక భారీ కొండచరియ విరిగిపడటంతో ఊళ్లో భారీ విధ్వంసమే జరిగింది. దాంతో మిగిలిన కొద్దిమంది జనాలు కూడా ఊరిని విడిచిపెట్టి వెళ్లిపోయారు. అయితే, ఇప్పుడిది పర్యాటక ఆకర్షణగా మారింది. ఇటలీ వచ్చే పర్యాటకుల్లో పలువురు ఈ ఊరిని ఆసక్తిగా చూసి వెళుతుంటారు. (చదవండి: 128 ఏళ్ల నాటి మమ్మీకి అంత్యక్రియలు! అదికూడా అధికారిక.) -
200 ఏళ్లనాటి జైలు ఎందుకు మూతపడింది? 800 మంది ఖైదీలు ఏం చేశారు?
మనకు తెలిసినవారు ఎవరైనా జైలుకు వెళ్లారనే వార్త వినిపిస్తే, ముందుగా మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ప్రపంచంలో 200 సంవత్సరాల క్రితం నిర్మితమైన జైలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఈ జైలులో దెయ్యాలు ఉన్నాయని స్థానికులు చెబుతుంటారు. ఈస్టర్న్ స్టేట్ పెనిటెన్షియరీ ప్రపంచంలోనే మొదటి జైలుగా పరిగణిస్తారు. ప్రమాదకరమైన ఖైదీల కోసం ఈ జైలును నిర్మించారు. జైళ్ల నిర్మాణానికి ఈ జైలు నమూనాగా నిలిచింది. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియా నగరంలో ఈ జైలు నిర్మితమయ్యింది. 1829లో నిర్మించిన ఈ జైలులో 1971 వరకు కార్యకలాపాలు కొనసాగాయి. మొదట్లో ఈ జైలును 250 మంది ఖైదీల కోసం మాత్రమే నిర్మించారు. ఐదు దశాబ్దాల్లో జైలులోని సంఖ్య 1000కు పైగా పెరిగింది. ఆ తర్వాత జైల్లో ఖైదీల కష్టాలు ఎక్కువయ్యాయి. 1900లలో ఈ జైలులో టీబీ వంటి ప్రాణాంతక వ్యాధి వ్యాపించింది. దీంతో చాలా మంది ఖైదీలు చనిపోయారు. చలికాలంలో ఈ జైలులో ఉష్ణోగ్రతలు మైనస్‌కు పడిపోవడంతో చలికి ఖైదీలు వణికిపోయేవారు. ఖైదీల సంఖ్య పెరిగిన నేపధ్యంలో జైలు అధికారులను మరిన్ని సెల్‌లను నిర్మించవలసి వచ్చింది. వీటిలో కొన్ని భూగర్భంలో నిర్మితమయ్యాయి. జైలులో 1961లో జరిగిన ఒక సంఘటన సంచలనం రేకెత్తించింది. జైలులోని 800 మందికి పైగా ఖైదీలు జైలు గార్డులు తమను హింసించారని ఆరోపిస్తూ వారిపై దాడి చేశారు. ఈ జైలులో కరుడుగట్టిన నేరస్తులు కూడా ఉండేవారు. వీరిలో చికాగో గ్యాంగ్‌స్టర్ అల్ కాపోన్ పేరు కూడా వినిపిస్తుంది. కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఈ జైలు 1971లో మూసివేశారు. అయితే 1994లో హిస్టరీ టూరిజం కోసం జైలు తిరిగి తెరిచారు. ఇప్పుడు ఈ జైలు ఆసక్తికర పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. నేటికీ ఈ జైలు నుంచి వింత శబ్దాలు వస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: మూగజీవిపై ప్రేమ అంటే ఇదే..! -
అబద్ధమని కొట్టిపారేయకండి.. దెయ్యాలతో మాట్లాడిన చిన్నారి!
దెయ్యాల కథలు సృష్టించే ప్రకంపనాలకు సాక్ష్యాలు తక్కువ. నిజమా? అబద్ధమా? అనే సంశయం నుంచి పుట్టే ఆత్రానికి.. వాదోపవాదాలు ఎక్కువ. అందుకే ‘పుట్టుకకు ముందు.. చావు తర్వాత..’ అనే ఆత్మాన్వేషణ కథలెప్పుడూ మిస్టరీలుగానే మిగిలిపోతాయి. అలాంటిదే సరిగ్గా 34 ఏళ్ల క్రితం.. ఓ నాలుగేళ్ల అమ్మాయి జీవితంలో జరిగింది. అది 1989. ఫిబ్రవరి మొదటి వారం. ఆండ్రూ వైరిక్, లీసా దంపతులు తమ నాలుగేళ్ల కూతురు హెడీతో కలసి.. కొత్తింట్లోకి అడుగుపెట్టారు. రావడం రావడమే హెడీ ఆడుకోవడానికి పరుగులు తీస్తే.. భార్యభర్తలు మాత్రం ఇల్లంతా సర్దుకునే పనిలో పడ్డారు. ఆ ఇల్లు అమెరికా, జార్జియాలోని ఎల్లెర్స్లీలో ఉంది. హెడీకి ఆ ఇల్లు బాగా నచ్చేసింది. అక్కడున్న ఓ పెద్దాయన కూడా. ఆ ఇంటికి రావడం రావడమే పెరట్లో ఉన్న ఆయనతో ఆటలాడటం మొదలుపెట్టింది. పనుల హడావిడి నుంచి తేరుకున్న హెడీ తల్లి లీసా.. ఆ పెద్దాయన సంగతులన్నీ హెడీ నోట విని షాక్ అయ్యింది. అతడి పేరు గోర్డీ అని హెడీ చెప్పింది. అసలు లీసా.. ఆ ఇంటి చుట్టు పక్కల హెడీ చెప్పిన పోలికలతో ఎవరినీ చూసింది లేదు. ‘హెడీని కిడ్నాప్ చేయడానికి ఎవరైనా నాటకం ఆడుతున్నారా?’ అనే అనుమానం లీసాని కుదురుగా ఉండనివ్వలేదు. వెంటనే భర్తకు విషయం చెప్పింది. హెడీని బయటికి పోనీకుండా జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత హెడీ ప్రవర్తనపై దృష్టిపెట్టిన లీసా.. ఆమె ఎవరితోనో మాట్లాడుతోందని.. ఆమె చేతిని ఎవరో పట్టుకుని నడుస్తున్నారని గుర్తించింది. పైగా అర్ధరాత్రులు ఊయల ఊగడం, నిద్రలో లేచి నడవడం ఇలా చాలానే చేసేది హెడీ. లీసాకి ఏం అర్థం కాలేదు. కానీ వెన్నులో కాస్త భయం మొదలైంది. హెడీకి స్నేహితులు లేకపోవడంతో అలా ఏదో ఊహించుకుని ఆడుకుంటోందని సరిపెట్టుకుంది. అయితే హెడీ.. గోర్డీతో పాటు లోన్ అనే మరో ముసలాయన పేరు చెప్పడం మొదలుపెట్టింది. లోన్ ఎడమ చేతికి రక్తంతో కట్టు ఉందని.. అతడి షర్ట్ నిండా రక్తం ఉందని చెప్పేది హెడీ. వెంటనే లీసా.. తన భర్తతో కలసి.. ‘హెడీ చెబుతున్న పేర్లతో ఎవరైనా ఉన్నారా?’ అంటూ ఆ చుట్టూ వెతకడం మొదలుపెట్టింది. లోన్, గోర్డీ ఇద్దరు కాదేమో.. ఒకే వ్యక్తి అయ్యి ఉంటాడని వాళ్లు నమ్మారు. ‘లోన్ గోర్డీ అనే పేరు ఎప్పుడైనా విన్నారా?’ అంటూ అందరినీ ఆరా తీశారు. ఆ ప్రయత్నంలోనే లోన్ గోర్డీ గురించి పక్కింట్లో ఉండే తన సోదరితో చర్చించింది లీసా. అయితే.. లీసా చెప్పింది విని లీసా సోదరి షాక్ అయ్యింది. అతడి పూర్తి పేరు జేమ్స్ ఎస్. గోర్డీ అని.. అతడు తమ ఇంటి మాజీ యజమాని అని, అతడు చనిపోయి చాలా ఏళ్లు అయ్యిందని చెప్పింది ఆమె. సాక్ష్యం కోసం తన ఇంటి దస్తావేజులు కూడా చూపించింది. అది చూడగానే లీసాకి చెమటలు పట్టేశాయి. వెంటనే ఇద్దరూ.. గోర్డీ బంధువైన కేథరీన్ లెడ్ఫోర్డ్ అనే స్థానికురాలి దగ్గరకి పరుగుతీశారు. జేమ్స్ గోర్డీ 1974లోనే మరణించాడని, అతడికి కొలంబస్లో రియల్ ఎస్టేట్ కంపెనీ ఉండేదని, చాలా సంవత్సరాలు అతను జార్జియాలో ఎల్లెర్స్లీలో ఉండే ఎల్లిసన్ మెథడిస్ట్ ^è ర్చ్‌లో సండే స్కూల్ సూపరింటెండెంట్‌గా పనిచేశాడని వివరాలిచ్చింది కేథరీన్. అచ్చం హెడీ చెప్పినట్లే.. గోర్డీ మెరిసిన జుట్టుతో.. సూట్, టై, నల్లటి బూట్లు వేసుకుని ఎప్పుడూ నీట్‌గా ఉండేవాడని నిర్ధారించింది. వెంటనే హెడీని కేథరీన్ ఇంటికి తీసుకుని వెళ్లిన లీసా.. తన పాపకి ఆ ఇంట్లోని పాత ఫొటోలన్నీ చూపించమని కోరింది. ఆశ్చర్యకరంగా ఆ ఫొటోల్లో లోన్ ఫొటోని గుర్తుపట్టింది హెడీ. ‘ఎడమ చేతికి కట్టుతో ఉన్న ముసలాయన ఇతడే’ అంటూ లోన్ ఫొటోని చూపించింది. అతడ్ని హెడీ గుర్తు పట్టగానే బిత్తరపోయింది కేథరీన్. వరుసగా లీసా, ఆండ్రూ, హెడీ, జోర్డాన్, జోయిస్ (హెడీ మేనత్త) ‘ఇతడు మా అంకుల్ లోన్’ అంది షాక్‌లో. లోన్ 20 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఇక్కడే గడిపేవాడని, అతడు 1957లో క్యాన్సర్‌తో చనిపోయాడని, అతడు ఓ ప్రమాదంలో తన ఎడమ చేతిని పోగొట్టుకున్నాడని చెప్పింది. దాంతో లీసాకి.. హెడీ మాట్లాడే గోర్డీ, లోన్లు కల్పితపాత్రలు కాదని.. వారు నిజంగా చనిపోయిన వ్యక్తులని స్పష్టమైంది. (హెడీ విషయంలో హెడీ మేనత్త జోయిస్ కూడా లీసాకు చాలా సాయం చేసింది).అలా గోర్డీ, లోన్లతో హెడీ సంభాషణ సుమారు నాలుగేళ్ల పాటు సాగింది. 1993లో హెడీ తల్లి గర్భవతి అయింది. అప్పుడొచ్చింది మరో ఆత్మ. అది చీకట్లో బొమ్మల రూపంలో కదలడం హెడీని తీవ్రంగా భయపెట్టింది. కొన్నిసార్లు ఆ ఆత్మ చేసిన హింసకు హెడీ చాలా ఏడ్చేది. అప్పుడప్పుడు హెడీ ముఖంపైన రక్తపు చార లు కనిపించేవి. 1994 ఫిబ్రవరి 3న హెడీకి జోర్డాన్ అనే చెల్లెలు పుట్టింది. 2 వారాల తర్వాత, హెడీ మరింతగా వణకసాగింది. అయితే ఆ ఆత్మ గురించి.. హెడీ తండ్రి ఆండ్రూ మొదట్లో నమ్మలేదు. కానీ కొన్ని రాత్రుల తర్వాత ఆండ్రూ కూడా ఆ ఆత్మ దాడికి గురయ్యాడు. ఆ సమయంలోనే హెడీ ఒంటి మీద గోళ్ల చారికలు తీవ్రమైన నొప్పిని కలిగించేవి. వెంటనే పారా సైకాలజిస్ట్ డాక్టర్ విలియం రోల్‌ని ఇంటికి పిలిపించింది లీసా. హెడీ చెప్పే మాటలు నిజమేనన్న నిర్ధారణకు వచ్చిన రోల్.. చనిపోయిన వారితో కమ్యూనికేట్ చేయడానికి హెడీ.. ఏదైనా రహస్యమైన శక్తిని కలిగి ఉందా? అంటూ హెడీపై ఎన్నో ప్రయోగాలు చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఏ విషయాన్నీ తేల్చలేకపోయాడు. కొన్నేళ్లకు హెడీ కుటుంబం ఆ ఇంటికి దూరంగా వెళ్లిపోయింది. ఆ తర్వాత గోర్డీ, లోన్ ఆత్మలు హెడీకి కనిపించడం మానేశాయి. కానీ ఇప్పటికీ హెడీని చీకటి బొమ్మలు, వికృత రూపాలు, జంతు ఆత్మలు భయపెడుతూనే ఉన్నాయట. హెడీకి సాధారణమైన జీవితం గడపాలనే ఆశే ఆమెని ప్రపంచానికి దూరంగా బతికేలా చేస్తోంది. కానీ హెడీకి ఆత్మలు, దుష్టశక్తులు కనిపించడం మాత్రం ఆగలేదు. దురదృష్టవశాత్తూ హెడీ తండ్రి ఆండ్రూ 45 ఏళ్ల వయసులో 2012లో మరణించాడు. అసలు హెడీ చెప్పింది నిజమేనా? అబద్ధమైతే అంత చిన్ని పిల్ల గోర్డీ, లోన్ల ఆత్మల కథలను ఎలా ఊహించగలిగింది? చనిపోయిన వారితో మాట్లాడే శక్తి హెడీకి నిజంగానే ఉందా? ఇలా వేటికీ సమాధానాల్లేవు. పైగా ఆ కుటుంబం మీడియాకి దూరంగా ఉండేందుకు ప్రయత్నించడంతో సమగ్ర సమాచారమూ దొరకలేదు. ఈ కథ ఆధారంగా ఎన్నో నవలలు, డాక్యుమెంటరీలు, సినిమాలు పుట్టుకొచ్చాయి. అయితే హెడీ చెప్పింది నిజమే అనేవాళ్లు ఎంతమందో.. అబద్ధమని కొట్టిపారేసేవాళ్లూ అంతేమంది. అందుకే ఈ కథ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. హెడీ మాటల్లో.. ఎప్పుడైతే దుష్ట ఆత్మలు కనిపించడం మొదలయ్యాయో అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి. ప్రతిరోజూ ఇలా జరగకూడదని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే నా జీవితం చాలా భిన్నంగా ఉంటుంది. నేను ఇలాంటి వాటితో పేరు పొందాలనుకోను.. ప్రజలు కొంతమంది విశ్వసిస్తారు, కానీ మరికొంత మంది మమ్మల్ని పిచ్చివాళ్లుగా భావిస్తారు. ఇప్పటికీ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి.. ధైర్యంగా ఉండటానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. ∙సంహిత నిమ్మన -
ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అక్టోబర్‌లో వచ్చేస్తున్నాడు
శివ రాజ్‌కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఘోస్ట్’. శ్రీని దర్శకత్వంలో సందేశ్ నాగరాజ్ (ఎమ్మెల్సీ) సమర్పణలో సందేశ్ ఎన్. నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 19న కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. అర్జున్ జన్య సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ మ్యూజిక్ ...’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను చెన్నై లయోలా కాలేజ్‌లో అభిమానుల సమక్షంలో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన చిత్రం ‘ఘోస్ట్’. రజనీకాంత్ ‘జైలర్’ చిత్రంలో శివరాజ్‌కుమార్ పాత్రకు వచ్చిన మంచి స్పందన ‘ఘోస్ట్’ పై మరిన్ని అంచనాలు పెంచింది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
మీకు తెలుసా? ఒక్క రాత్రిలో దెయ్యాలు ఆలయాన్ని కట్టించాయట
మన దేశంలో ఎన్నో మహిమాన్వితమైన దేవాలయాలు ఉన్నాయి. వాటి వెనుక ఎన్నో వేల ఏళ్ల చరిత్ర ఉంది, సైన్స్‌కు అందని రహస్యాలు కూడా ఉన్నాయి. అయితే ఓ ఆలయాన్ని దయ్యాలు రాత్రికి రాత్రే కట్టించాయట. అసలు దెయ్యాలు నిజంగానే ఉన్నాయా? అయినా వాటికి ఆలయం కట్టించాల్సిన పనేంటి? ఇంతకీ ఈ వింతైన ఆలయం ఎక్కడ ఉంది? దీని వెనుకున్న కథేంటి అన్నది ఈ స్టోరీలో చూసేయండి.. దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్లు దయ్యాలు కూడా ఉంటాయని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం.. మన దేశంలో కొన్ని ఆలయాలు స్వయంగా దేవతలే నిర్మించాలని విన్నాం. అదే విధంగా దెయ్యాలు కట్టించిన ఆలయాలు కూడా మనదేశంలో ఉన్నాయట. కర్ణాటకలోని దొడ్డబళాపురం-దేవనహళ్ళి మార్గం మధ్యలో వచ్చే బొమ్మావర గ్రామంలోని శివాలయాన్ని దెయ్యాలే కట్టించాయని నమ్ముతారు అక్కడి గ్రామస్తులు. సుందరేశ్వర దేవాలయంగా ఆ గుడికి పేరుంది. సాధారణంగా దేవాలయాలపై దేవుళ్ళ రాతి శిల్పాలు, ప్రతిమలు కనిపిస్తాయి. కానీ దేవాలయంలో మాత్రం రాక్షసుల నమునాలు చెక్కబడి ఉన్నాయి. సుమారు 600 సంవత్సరాల క్రితం నుంచే ఈ ఆలయం ఉందట. ఈ గ్రామంలో వందల ఏళ్ల క్రితం దెయ్యాలు తెగ భయపెట్టేవట. బయటకు రావాలంటనే జనాలు భయపడిపోయేవారట. దీంతో ఆ ఊరు ప్రజలకు ఏం చేయాలో అర్థంకాక మాంత్రికుడిని ఆశ్రయించారు. వాటిని తరిమికొట్టేందుకు మంత్ర విద్యలు నేర్చుకున్నప్పటికీ ఆయనకు సాధ్యం కాలేదు. దీంతో అక్కడ ఓ శివాలయాన్ని నిర్మిస్తే దెయ్యాలు పారిపోతాయని తెలుసుకుని ఊరి ప్రజలందరి సహకారంతో గుడి నిర్మించారు. దెయ్యాలు ఆ గుడిని నాశనం చేసేయడంతో కోపంతో ఊగిపోయిన మాంత్రికుడు మంత్రశక్తితో దెయ్యాలను వశపర్చుకొని బంధీగా చేశాడట. దీంతో బుచ్చయ్యను బతిమాలగా, కూలదోసిన ఆలయాన్ని తిరిగి కట్టివ్వాలని దెయ్యాలకు శరతు విధించాడట. మాంత్రికుడి ఆదేశంతో దిగి వచ్చిన దెయ్యాలు రాత్రికి రాత్రే దేవాలయాన్ని నిర్మించి ఇచ్చాయట. అప్పటి నుంచి దెయ్యాలు కట్టిన దేవాలయంగా ఆ ఆలయాన్ని పిలిచేవారు. ఇక కొన్నాళ్లకు ఆ ప్రాంతంలో మంచినీళ్ల బావిని తవ్వుతుంటే పెద్ద శివలింగం బయటపడిందట. అప్పట్నుంచి ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారట. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఎవరికైనా దెయ్యాలు పట్టినా ఈ ఆలయానికి తీసుకొస్తే దెయ్యం వదులుతుంది అని స్థానికుల నమ్మకం. -
నా కళ్లతో భయపెట్టాను!
‘‘మీరు గన్నుతో ఎంత మందిని భయపెట్టారో అంతకంటే ఎక్కువ మందిని నేను నా కళ్లతో భయపెట్టాను. దే కాల్ మీ ఓజీ... ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ అనే డైలాగ్‌తో ‘ఘోస్ట్’ సినిమా టీజర్ విడుదలైంది. కన్నడ హీరో శివ రాజ్‌కుమార్ నటించిన చిత్రం ‘ఘోస్ట్’. శ్రీని (బీర్బల్) దర్శకత్వంలో సందేశ్ నాగరాజ్ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మించారు. బుధవారం శివ రాజ్ కుమార్ పుట్టినరోజుని (జూలై 12) పురస్కరించుకుని ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో దసరాకి ‘ఘోస్ట్’ ప్రేక్షకుల ముందుకి రానుంది. తెలుగు నిర్మాతతో... శివ రాజ్‌కుమార్ హీరోగా తెలుగు నిర్మాత సుధీర్ చంద్ర పదిరి కన్నడంలో ఓ సినిమా నిర్మించనున్నారు. శివ రాజ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ప్రకటించారు. ఈ చిత్రానికి కార్తీక్ అద్వైత్ దర్శకత్వం వహించనున్నారు. ఎస్సీఎఫ్సీపై (సుధీర్ చంద్ర ఫిల్మ్ కంపెనీ) సుధీర్ చంద్ర పదిరి నిర్మించనున్న ఈ మూవీ క్యారెక్టర్ కాన్సెప్ట్ ΄ోస్టర్‌ని బుధవారం రిలీజ్ చేశారు. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీఎస్. -
'బిగ్ డాడీ' పేరుతో వచ్చేస్తున్న ఘోస్ట్ టీజర్
కన్నడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ హీరోగా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతోన్న చిత్రం ఘోస్ట్. కన్నడ బీర్బల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రూపొందించి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దర్శకుడు శ్రీనినే ఈ ఘోస్ట్ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన 'సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై' ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. (ఇదీ చదవండి: చెప్పు తెగుతుందంటూ.. రిపోర్టర్‌పై బేబమ్మ రియాక్షన్) యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఘోస్ట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఘోస్ట్ టీజర్‌ను బిగ్ డాడీ పేరుతో జూలై 12 న విడుదల చేయనున్నారు. బిగ్ డాడీ అనౌన్స్‌మెంట్‌ను స్ట్రైకింగ్ పోస్టర్‌తో ప్రకటించారు. శివరాజ్ కుమార్ గన్‌తో సీరియస్ లుక్‌తో వచ్చిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ‘ఘోస్ట్’ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మస్తీ, ప్రసన్న వి ఎం డైలాగ్స్ రాస్తున్నారు. కేజీఎఫ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు. (ఇదీ చదవండి: ఆ యాడ్ చేస్తే.. రూ. కోట్లలో ఇస్తామన్నారు: స్మృతి ఇరానీ) -
Real Ghost Ships Photos: భూమ్మీది టాప్ 15 దెయ్యం నౌకలు.. ఉత్త ప్రచారం మాత్రం కాదు!
-
చనిపోయిన వ్యక్తి కళ్లు, వెంట్రుకలతో బొమ్మ తయారీ.. చూసేందుకు క్యూ కడుతున్న జనం!
నేరాలు ఘోరాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో మళ్లీ ఎవరో ఎవరినో చంపి సంచిలో మూటకట్టి ఇలా పడేశారేమిటి అని అనుకుంటున్నారా.. అయితే మీరు గోనెసంచిలో కాలు వేసినట్లే. చూడ్డానికి అచ్చం మనిషిలాగే కనిపిస్తున్న ఈ బొమ్మ పేరు జార్జ్. చార్లెస్ రాస్ అనే పురావస్తు నిపుణుడు తయారు చేశాడు. ఒక గుర్తు తెలియని వ్యక్తి 1930లో చనిపోతే అతని కళ్లు, వెంట్రుకలు తీసి, ఈ బొమ్మకు అమర్చాడు. ఇతనికి దెయ్యాల భవంతి కంటే భయం పుట్టించే భవనాన్ని ఏర్పాటు చేయటం ఇష్టం. ఇందుకోసం వివిధ రకాల భయంకరమైన బొమ్మలు, వస్తువులు తయారు చేసేవాడు. వీటన్నింటినీ నాటింగ్‌హామ్‌లోని హాంటెడ్ మ్యూజియంలో ప్రదర్శించేవాడు. చార్లీ ఈ జార్జ్ బొమ్మ పెట్టగానే, రోజూ అక్కడికి వచ్చే సందర్శకులు సంఖ్య పెరిగి, చార్లీ ఫేమస్ అయ్యాడు. ఈ మధ్యనే బీబీసీ చానెల్లో ప్రసారమయ్యే ‘బార్గైన్ హంట్’కు ఆహ్వానం కూడా అందుకున్నాడు. అక్కడికి చార్లీ తను తయారు చేసిన కొన్ని బొమ్మలను తీసుకెళ్లడంతో భయంకరమైన ఈ జార్జ్ బొమ్మ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ జార్జ్ బొమ్మను చూస్తుంటే సినిమాల్లోని అనాబెల్, చూకీ బొమ్మల కంటే భయంకరంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో చాలామంది కామెంట్లు పెడుతున్నారు. -
యాక్షన్ థ్రిల్లర్‌గా 'ఘోస్ట్' .. న్యూ ఇయర్ మోషన్ పోస్టర్ అదిరింది!
కన్నడ స్టార్ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఘోస్ట్’. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘బీర్బల్’ ఫేం శ్రీని దర్శకత్వం వహిహిస్తున్నాడు. ప్రముఖ రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది. న్యూ ఇయర్ సందర్భంగా తాజాగా చిత్ర యూనిట్ ఓ మోషన్ పోస్టర్ని విడుదల చేసింది. చిత్రానికి సంబందించిన కీలక అంశాలు అన్నీ కలగలిపి థీమ్ కి తగ్గట్లు ఆసక్తి రేపేలా ఈ మోషన్ పోస్టర్ ఉంది. కార్ స్పీడో మీటర్ తో మొదలై, ఎగిరే బుల్లెట్లు, గన్ ఫైర్ అవగానే కార్ దూసుకు రావడం, మెషీన్ గన్... వీటికి తోడు అర్జున్ జన్య అందించిన పవర్ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చివరగా శివ రాజ్ వింటేజ్ లుక్ మోషన్ పోస్టర్ ను మరో స్థాయికి తీసుకెళ్ళాయి. ఈ లుక్ ఘోస్ట్ చిత్రంలో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ లో రానున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరెక్కుతున్న ఘోస్ట్ సెకండ్ షెడ్యూల్ ఇటీవలే మైసూర్ లో పూర్తి చేసుకుంది. ఈ షెడ్యుల్ లో శివరాజ్ కుమార్, జయరామ్, ప్రశాంత్ నారాయణన్ ల మీద భారీగా నిర్మించిన ప్రిజన్ ఇంటీరియర్ సెట్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మూడో షెడ్యూల్ ఫిబ్రవరి మొదటి వారంలో బెంగళూరు లో వేసిన మరో భారీ సెట్ లో ప్రారంభమవుతుంది. ఈ షెడ్యుల్ లో ఇంట్రడక్షన్, క్లైమాక్స్ సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ ఘోస్ట్ లో కీలక పాత్ర పోషిస్తుండగా ప్రశాంత్ నారాయణ్, అచ్యుత్ కుమార్, దత్తన్న, అవినాష్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. Make way for ya’ man #GHOST. Presenting you the MotionPoster of #GHOST.. shooting in progress@lordmgsrinivas @ArjunJanyaMusic@SandeshPro@baraju_SuperHit pic.twitter.com/GGLr3Caxcg — DrShivaRajkumar (@NimmaShivanna) January 1, 2023 -
శివరాజ్ కుమార్ యాక్షన్ షురూ.. ‘ఘోస్ట్’ కొత్త పోస్టర్ వైరల్
కన్నడ స్టార్ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఘోస్ట్’. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘బీర్బల్’ ఫేం శ్రీని దర్శకత్వం వహిహిస్తున్నాడు. ప్రముఖ రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది. ఇటీవల 28 రోజుల పాటు సాగిన మొదటి షెడ్యూల్లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ని తెరకెక్కించారు. ఈ షెడ్యూల్ కోసం దాదాపు ఆరు కోట్లతో అదిరిపోయే జైల్ సెట్ వేశారు. అందులోనే ఎన్నో యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన తాజా అప్డేట్ ఇప్పుడు వచ్చింది. ఈ మూవీ రెండో షెడ్యూల్‌ను త్వరలోనే ప్రారంభించబోతోన్నారట. డిసెంబర్ రెండో వారం నుండి రెండో షెడ్యుల్ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ఈ షెడ్యుల్ కోసం ప్రిజన్ బయటి లుక్ సెట్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో శివ రాజ్ కుమార్ కొత్త పోస్టర్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఈ చిత్రంలో జయరామ్, అచ్యుత్ కుమార్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
ఘోస్ట్ పేషెంట్‌తో ముచ్చటిస్తున్న సెక్యూరిటీ గార్డు: వీడియో వైరల్
ఒక ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డు ఘోస్ట్ పేషెంట్‌తో మాట్లాడుతున్న వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలోని ఘటన ఒక్కసారిగా ఆశ్చర్యంతోపాటు కాస్త గందరగోళానికి గురి చేస్తుంది. ఈ ఘటన అర్జెంటీనాలోని ఫినోచిట్టో శానిటోరియం, బ్యూనస్ ఎయిర్స్లో ఉన్న ఒక ప్రైవేట్ కేర్ సెంటర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....ఆ వీడియోలో...ఆస్పత్రి వద్ద ఉన్న ఆటోమెటిక్ డోర్లు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. ఎవరో ఎంట్రవుతున్నట్లు అనిపిస్తుంది. కానీ అక్కడ ఎవరూ ఉండరు. వెంటనే సెక్యూరిటీ గార్డు మాత్రం లేచి వచ్చి మరీ రిజిస్టర్లో పేషెంట్ ఎవరో వచ్చినట్లుగా వివరాలు నమోదు చేసుకుంటాడు. ఆ తర్వాత లోపలకి వెళ్లే దారిని వివరిస్తూ ఒక వీల్ చైర్ కూడా ఇస్తున్నట్లు కనిపించింది. ఈ ఘటన సీసీఫుటేజ్‌లో రాత్రి 3 గంటల ప్రాంతంలో రికార్డు అయ్యిందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. దీంతో నెటిజన్లంతా ఒక్కసారిగా వామ్మో ఏముందక్కడా? అంటూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. డైలీ స్టార్ అనే స్థానిక మీడియా ఈ విషయమై ఆరా తీయగా ఆ తలుపులు ప్రతి పది గంటలకోసారి ఆటోమెటిక్‌గా తెరుచకుంటాయని చెబుతున్నారు ఆస్పత్రి యజమాన్యం. పైగా ఆ రోజు ఏ పేషెంట్ వివరాలు ఆ సమయంలో రికార్డు చేయలేదని అన్నారు. దీంతో ఒక్కసారిగా అవాక్కవ్వడం స్థానికి మీడియా వంతైంది. మరికొంతమంది నెటిజన్లు మాత్రం.... ఆ సెక్యూరిటీ గార్డు కావాలనే ఇలా చేశాడు. అక్కడే ఏమి లేదు ఇదంతా సీసీఫుటేజ్‌లో రికార్డు అవుతుందనే తెలిసే ఇలా చేసి ఉంటారంటూ కామెంట్లు చేస్తున్నారు. Watch the shocking moment hospital security attends to 'ghost patient' after dying the day before pic.twitter.com/cWyPtCYzjk — Newspremises (@News_premises) November 21, 2022 (చదవండి: 'నా పేరు సరిచేయండి' మహా ప్రభో! కుక్కలా మొరుగుతూ నిరసన) -
మహిళల నరబలి ఘటన మరువక ముందే క్షుద్రపూజల కలకలం
గాంధీనగర్: కేరళలో మహిళల నరబలి ఘటన మరువక ముందే గుజరాత్లో మరో దారుణం వెలుగుచూసింది. కన్నతండ్రే క్షుద్రపూజలు చేసి 14ఏళ్ల కూతుర్ని చంపాడు. ఆమెకు గంటలపాటు నరకం చూపించి చావుకు కారణమయ్యాడు. గిర్ సోమ్‌నాథ్ జిల్లా ధవా గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. భవేశ్ అక్బరీ అనే వ్యక్తి తన కూతురికి దెయ్యం పట్టిందని అనుమానించాడు. దీంతో ఆమెకు భూతవైద్యం చేయాలని నిర్ణయించుకున్నాడు. పాత దుస్తులు ధరించమని ఇచ్చి ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. భవేశ్తో పాటు అతని సోదురుడు దిలీప్ కూడా వెళ్లాడు. ఇద్దరు కలిసి పెద్ద మంట పెట్టారు. బాలిక జుట్టుకు కట్టె కట్టి ఆ మంటల ముందు రెండు కుర్చీల మధ్యన రెండు గంటలపాటు నిల్చోబెట్టారు. చాలా సేపు ఆమెకు ఆహారం, నీరు ఏమీ ఇవ్వలేదు. దీంతో ఈ నరకం భరించలేక బాలిక కన్నుమూసింది. అయితే ఈ విషయం ఎవరికీ తెలియకుండా బాలిక మృతదేహాన్ని బ్లాంకెట్‌లో తీసుకెళ్లి తగలబెట్టారని పోలీసులు వెల్లడించారు. ఆధారాలు లేకుండా చేశారని పేర్కొన్నారు. బాలిక కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అక్బరీ కుటుంబం 6 నెలల క్రితమే సూరత్ నుంచి ఈ గ్రామానికి వచ్చిందని గ్రామస్థులు తెలిపారు. అక్బరీ గ్రామంలో ఎవరితోనూ మాట్లాడేవాడు కాదని వెల్లడించారు. చదవండి: నరబలి ఉదంతం: చంపేసి ముక్కలు చేసి తిన్నారా? -
దెయ్యం చేసిన హత్య..?
‘నీకు మతిపోయిందా? దెయ్యం హత్య చేయడం ఏమిటి?’ కసిరాడు సీఐ మహంకాళి. ‘అలా కొట్టిపారేయకండి సర్. నా మాట కాస్త వినండి. ఈ ఫైల్ చూడండి.. నా కష్టం మీకే తెలుస్తుంది! ముమ్మాటికీ అది హత్యే. అయితే ఆ పని దెయ్యం కాకుండా వేరెవరూ చేసినట్లు ఆధారాలు లేవు. విదేశాల్లో అనేక అన్సాల్వ్డ్ కేసుల విషయంలో, కొన్ని హత్యలు దెయ్యాలే చేసి ఉండవచ్చుననే అభిప్రాయాలూ ఉన్నాయి. 1999లో బోస్టన్‌లో ఇలాంటి కేసే...’ అని ఎస్సై అంబరీష్ చెప్పబోతుండగా, అడ్డుతగిలి, .. ‘ఆ పుక్కిటి పురాణాల గురించి చెప్పొద్దు. ఇప్పుడు మొదటి నుంచి వివరంగా చెప్పు’ అన్నాడు సీఐ మహంకాళి. ‘హత్యకు గురైన ముకుందం, అతని భార్య శ్రావణి, చాలా ఏళ్లుగా లండన్‌లో ఉంటూ, ఆరు నెలల కిందటే ఇండియా వచ్చారు. ముకుందం తాతగారు, వందేళ్ళ క్రితం కట్టించిన ‘వేట బంగళా’లో నివాసం ఉంటున్నారు. ఆ బంగాళాలో ముందు మనం అడుగుపెట్టేది, పెద్ద హాల్లోకి. హాల్లోంచే పైకి మెట్లున్నాయి. హాలుని ఆనుకొని, డైనింగ్ రూమ్, దాని పక్కన కిచెన్ ఉన్నాయి. పై అంతస్తులోని గదే ముకుందం, శ్రావణిల బెడ్రూమ్. అప్పటికి ఆ బంగాళా ఊరికి దూరంగా, అడవికి దగ్గరగా ఉండేది. ఇప్పుడు అక్కడంతా బాగా డెవలప్ అయిపోయింది. గత ఆరేళ్లుగా ఆ బంగాళా పోషణను చూస్తున్న రాములు, కమల అక్కడే అవుట్ హౌస్‌లో ఉంటున్నారు. గత ఏడాదిగా ఆ బంగళాలో దెయ్యం తిరుగుతున్నట్లు .. వాళ్ళు ముకుందానికి ముందుగానే చెప్పినా అతను పట్టించుకోలేదట’ వివరించాడు అంబరీష్. ‘అక్కడ దెయ్యం తిరుగుతుందని వాళ్లకు ఎలా తెలిసిందట?’ అని అడిగాడు మహంకాళి. ‘పగలు ఏ హడావిడీ ఉండేది కాదట. రాత్రుళ్లు మాత్రం లైట్లు వెలిగి ఆరుతూ ఉండడం, ఎవరో మసలుతున్నట్లు నీడ కనిపించడం, శబ్దాలు వినిపించడం జరిగేదట. నలుగురైదుగుర్ని తోడు తీసుకొని లోపలికి వెళ్లి చూస్తే, ఏమీ కనిపించేది కాదట. అలా మూడు నాలుగు సార్లు చేసి, ఆ ఇంట్లో దెయ్యం ఉందని, నిర్ధారణకు వచ్చేశారట’ అని అంబరీష్ అనగానే, ‘అంతా ట్రాష్. ఆ పనులు మనుషులు కూడా చెయ్యొచ్చు కదా?’ అన్నాడు మహంకాళి. ‘అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేయకండి. శ్రావణి స్టేట్మెంట్ కూడా వినండి మరి. ఆ ఇంట్లో దిగాక, మేడమీద పడుకున్న ఆ దంపతులకు కూడా అర్ధరాత్రి వేళ శబ్దాలు వినిపించేవట. ముకుందానికి ధైర్యం ఎక్కువే కాబట్టి, అతను కిందకువెళ్లి చూస్తే, ఎవరూ కనిపించేవారు కాదట. దిగువన, హాల్లో ఉంచిన గాగుల్స్, ఇయర్ ఫోన్స్, వాచీ, ఐపాడ్, సెల్‌ఫోన్ లాంటి కాస్టీ›్ల వస్తువులు మాయమయ్యేవట. డైనింగ్ టేబ్ల్ మీదున్న ఆహారపదార్థాలతో పాటు, ఫ్రిజ్‌లో పెట్టిన పదార్థాలు కూడా మాయమవుతూ ఉండేవట. ‘ఇదేదో దొంగల పనే’ అని భావించిన ముకుందం దంపతులు ఎంతగా గాలించినా ఏ ఆధారమూ దొరకలేదట. ఒకరాత్రి, ఆ శబ్దాల సంగతి ఏమిటో తేల్చేద్దామని, భార్య ఎంత వారించినా వినకుండా టార్చి పట్టుకొని కిందకు దిగాడట ముకుందం. చేసేదేమీ లేక ఆమె కూడా అతన్ని అనుసరించిందట. కిచెన్ లోపల శబ్దాలు గట్టిగా వినిపించేసరికి ముందుకు అడుగు వేసిన ముకుందానికి నల్లని రూపమేదో కనిపించేసరికి, జడుసుకొని గబగబా వెనక్కి పరిగెత్తాడట. వెంటనే భార్యాభర్తలిద్దరూ రూమ్‌లోకి దూరి తలుపేసుకున్నారట. కాస్సేపటికి తలుపు దగ్గర కూడా ఎవరో తచ్చాడుతున్నట్లు అనిపించేసరికి మరింత భయపడిపోయారట. అలా ప్రతిరాత్రి భయపడుతూనే గడిపారట. దుర్భేద్యమయిన ఆ ఇంట్లో ఎవరూ దూరే అవకాశమే లేదు. తలుపులు, కిటికీలు మూసి ఉన్నా, వస్తువులు ఎలా మాయమవుతున్నాయో వాళ్లకు అర్థంకాక, ‘ఇది దెయ్యం పనే అయి ఉంటుంది’ అనే నిర్ధారణకు వచ్చేసి, ‘త్వరలోనే ఇల్లు మారిపోదాం’ అనుకుంటుండగానే ఈ ఘోరం జరిగిపోయింది’ ఆపాడు అంబరీష్. ‘సరే ముకుందం మరణం గురించి వివరాలు చెప్పు’ అన్నాడు కాళి. ‘ఆరోజు ఉదయం నిద్రలేచిన శ్రావణి, పక్కనే భర్త లేకపోవడంతో, అతని కోసం గదిలోంచి బయటకు వచ్చి, హాల్లో మెట్ల దగ్గర శవమై పడున్న భర్తను చూసి కేకలు పెట్టింది. వెంటనే రాములు, కమల వచ్చి, మన స్టేషన్‌కి ఫోన్ చేశారు. ముకుందం మెట్ల మీద నుంచి జారి పడ్డాడని, అదొక యాక్సిడెంట్ అని మొదట నేనూ అనుకున్నాను. అయితే అది యాక్సిడెంట్ కాదు. దెయ్యమే మెట్లమీద నుంచి తోసేసింది. మావారికి అరవై ఏళ్ళు వచ్చినా, చాలా యాక్టివ్‌గా ఉంటారు. రోజూ ఆరేడుసార్లయినా మెట్లెక్కి దిగుతూ ఉంటారు. జారిపడే ప్రసక్తి లేదు. మా ఇంట్లో దెయ్యం ఉంది. ఇది దాని పనే’ అని వాదించింది శ్రావణి. బాగా పరిశీలించి చూస్తే, అతను మెట్లమీద నుంచి జారిపడలేదని తెలిసింది. పాతకాలపు చెక్క మెట్లమీద నుంచి జారిపడితే, పెద్ద శబ్దమే వస్తుంది. ఆ శబ్దానికి శ్రావణి లేచి ఉండేది. ముకుందానిది భారీ శరీరం కాబట్టి, చెక్కమెట్లు గానీ, రెయిలింగ్ గానీ కొద్దిగానయినా డామేజ్ అయి ఉండాలి. అదేమీ లేదు. తలపై ఎవరో గట్టిగా కొట్టడం వల్లనే చనిపోయాడని నిర్ధారణకు వచ్చాను కానీ, హంతకుడెవరనేది తెలియలేదు. ఎంత పరిశోధించినా క్లూ దొరకలేదు. అందుకే శ్రావణి చెప్పినట్లు ..’అని అంబరీష్ అంటుండగా పెద్ద పెట్టున నవ్వాడు మహంకాళి. ‘దెయ్యమే చంపింది అని నిర్ధారణ చేసేశావన్నమాట. పిచ్చోడా? నీకు శ్రావణి మీద అనుమానం రాలేదా?’ అడిగాడు కాళి. ‘ఆ కోణంలోనూ ఆలోచించాను సర్.. శ్రావణిని చూశారు కదా? సన్నగా రివటలా ఉంటుంది. ఆమె ఎలా చంపుతుంది? వేరే అవకాశాల గురించి కూడా ఆలోచించాను. హత్య వేరే ఎవరయినా చేసి ఉండొచ్చని, శ్రావణి అతనికి సహకరించి ఉండవచ్చని, ఆమే తలుపు తీసి ఉండవచ్చని, అలా లోపలికి వచ్చిన వ్యక్తి హత్య చేసి ఉండొచ్చునని ... అలా చాలా రకాలుగా ఆలోచించి, ఆ దిశలో దర్యాప్తూ చేశాను. ఆమెను అనుమానించదగ్గ ఆధారాలేవీ దొరకలేదు’ అన్నాడు అంబరీష్.. తను సేకరించిన వివరాల ఫైల్‌ను అందిస్తూ.‘వెరీ గుడ్. చాలా బాగుంది నీ పరిశోధన. కానీ దెయ్యం హత్య చేసిందంటేనే నమ్మలేకపోతున్నాను’ అన్నాడు మహంకాళి. ఎన్నో కేసులను చాకచక్యంగా సాల్వ్ చేసిన మహంకాళికి, ఈ కేసు ఒక పెద్ద సవాల్ అయింది. దెయ్యాలే హత్య చేశాయి అని తేల్చేసిన కేసుల వివరాలను అంబరీష్ అందించాక, అదే నిజమేమోనన్న అభిప్రాయమూ బలపడుతున్న సమయంలో కేసు మలుపు తిరిగింది. కారణం ముకుందం శవాన్ని పోస్ట్‌మార్టమ్ చేసిన డా. త్రివేది అసిస్టెంట్ డా. సరిత. ఆమె కోరినట్లు, ఆమెను రహస్యంగా కలిశారు సీఐ, ఎస్సైలు. ‘డాక్టర్ త్రివేది.. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌ని, మార్చి మీకు రేపు సబ్మిట్ చేయబోతున్నారు’ అనగానే.. ఇద్దరూ షాకయ్యారు. ‘వ్వాట్.. నిజమా?’ ప్రశ్నల వర్షం కురిపించాడు మహంకాళి. ‘నూటికినూరు శాతం నిజం. రెండేళ్ల నుంచి ఆయన దగ్గర పనిచేస్తున్నాను. ఎప్పుడూ ఇలా జరగలేదు. పోస్ట్‌మార్టమ్ చేస్తున్నప్పుడు నేనూ ఉన్నాను. అప్పటికి ఆ రిపోర్ట్ మార్చాలనే ఐడియా లేదనుకుంటాను. ఉన్నదున్నట్లే నాతో డిస్కస్ చేశాడు. ముకుందం మెట్లమీద నుంచి జారిపడిపోవడం వల్ల చనిపోలేదు. ఎవరో దేనితోనో తలపై కొట్టడం వల్ల మరణించాడు. కానీ, ఇవాళ తయారుచేసిన కొత్త రిపోర్టులో ‘మెట్లమీద నుంచి పడిపోవడం వల్లనే ముకుందం మరణించాడని, అతని ఒంటి మీదున్న కముకు దెబ్బలు.. మెట్లతాకిడి వల్ల తగిలాయని మార్చి రాశాడు. ఆ కొత్త రిపోర్ట్ నాకు కనబడకుండా దాచినప్పుడే నాకు అనుమానం కలిగింది. కానీ, అతనికి తెలియకుండా చాటుగా ఆ రిపోర్ట్‌ను చదివాను. ఇదే కాదు చాలా కీలకమైన విషయాన్ని కూడా దాచి పెట్టాడు’ అని చెప్పింది డా. సరిత. ఇద్దరూ ఒకేసారి ‘ఏమిటి? ఏమిటి?’అని ఆత్రుతగా ప్రశ్నించారు.‘ముకుందం పంటి మీద రక్తపు మరక కనిపించింది. దాని శాంపిల్‌ని ఫోరెన్సిక్ లాబ్‌కి పంపి, పరీక్ష చేయిస్తే, ఆ రక్తం అతనిది కాదని, వేరే ఎవరిదోనని తెలిసింది’ అని చెప్పింది ఆమె. ఆ మాట విని ఇద్దరూ నోరెళ్లబెట్టారు. ‘ఇప్పుడా విషయాన్ని దాచేసి, ఆ రిపోర్ట్ మాయం చేసేశాడు. చాలాకాలంగా అతని లైంగిక వేధింపులతో నరకం అనుభవిస్తున్నాను. ఇప్పుడు అతని పీడ వదిలిపోతుంది’ అంది కసిగా. సరితతో మరికాస్త సేపు మాట్లాడాక కేసుకు కావలసిన కొత్త విషయాలు కూడా తెలియడంతో కేసు సాల్వ్ చేయడానికి మార్గం సుగమం అయింది. వారం రోజుల తర్వాత, వేటబంగాళా ముందు పోలీసు జీపులు ఆగాయి. పోలీసులు నేరుగా కిచెన్‌లోకి వెళ్ళారు. కిచెన్‌లోని అటక వైపు చూస్తూ, ‘ఒరేయ్ నరసింహం నీ ఆట కట్టించేశాం. కిందకు దిగిరా. నీ అంతట నువ్వు వస్తే మంచిది. లేకపోతే, మా తూటాలతో అటకంతా ముక్కలు ముక్కలు అయిపోతుంది. నీకు రెండు నిమిషాల టైమ్ ఇస్తున్నాను’ హెచ్చరించాడు మహంకాళి. భయపడి, తాడు సహాయంతో కిందకు దిగాడు నరసింహం. బేడీలు వేశాడు అంబరీష్. కేసు వివరాలు తెలుసుకోవడానికి మర్నాడు స్టేషన్‌కి రమ్మని శ్రావణికి చెప్పి వెళ్ళిపోయారు పోలీసులు. మర్నాడు చెప్పడం మొదలుపెట్టాడు, మహంకాళి.. ‘మీ వారిని చంపింది, దెయ్యంలా భయపెట్టింది ఇతనే. ఈ నరసింహం పెద్ద కేడీ. కిందటేడాది జైలు నుంచి తప్పించుకుపోయి, మీ ఇంట్లో దూరాడు. ఆ రోజుల్లో కట్టిన పెద్ద అటక, పెద్ద జాగాలో ఉన్న మీ ఖాళీ బంగాళా ఇతనికి బాగా కలసి వచ్చాయి. ఇంట్లో దెయ్యాలు ఉన్నట్లు నాటకం ఆడితే, సేఫ్‌గా ఉండొచ్చు అని ప్లాన్ వేశాడు. దెయ్యాలకు భయపడి మీ బంగళాలో ఎవరూ దిగరు అనే ధీమాతో ఉన్నాడు. కానీ దెయ్యాలు, భూతాలు ట్రాష్ అనుకునే మీ దంపతులిద్దరూ ఇంట్లో దిగిపోయారు. ఎప్పటి నుంచో మీ బంగళాను కొని, పెద్ద అపార్ట్మెంట్ కట్టాలనే ఆశతో ఉన్న ‘బిల్డర్ పోతరాజు’.. బంగాళా అమ్మమని మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నాడని, భోజనం చేస్తున్నప్పుడు మీవారు మీకు చెప్పడం నరసింహం చెవిన పడింది. వీలు చూసుకొని పోతరాజుని కలసి, మిమ్మల్ని దెయ్యంలా భయపెట్టి, ఇల్లు అమ్మేసేలా చేస్తానని బేరం కుదుర్చుకున్నాడు. హత్య జరిగిన రాత్రి, సహజంగా ధైర్యవంతుడయిన ముకుందం, తెగించి కిందకు దిగివచ్చినపుడు, నరసింహం దొరికిపోయాడు. వెంటనే నరసింహం.. చేతికి దొరికిన గిన్నెతో మీవారి తల మీద కొట్టాడు. ఆయన కింద పడిపోయారు. మెట్ల దగ్గర పడేస్తే, జారి పడ్డాడని అనుకుంటారని, ఆయన్ని మెట్ల దగ్గరకు ఈడ్చుకుంటూ వస్తున్నప్పుడు ముకుందంగారికి తెలివి రావడంతో, వాడి చేతిని కొరికారు. వాడు మళ్ళీ తలమీద బలంగా కొట్టి చంపేశాడు. హత్యకు ఉపయోగించిన గిన్నెను అటక మీద దాచేశాడు. ఇవేమీ తెలియని మేము కేసును ఎలా సాల్వ్ చేయాలో తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటున్న సమయంలో మాకు కీలకమైన ఆధారం దొరికింది. ముకుందంగారి బాడీని పోస్ట్‌మార్టమ్ చేసిన డాక్టర్ త్రివేది, తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడని, అతని దగ్గర పనిచేసే జూనియర్ డాక్టర్ సరిత మాకు చెప్పింది. ముకుందంగారి పంటికి ఎవరిదో రక్తం అంటిందన్న విషయం ఒరిజినల్ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో ఉంది. హత్య జరిగాక, ఒక కొత్త వ్యక్తి త్రివేదిని కలవడానికి వచ్చేవాడని, వాళ్ళిద్దరూ రహస్యంగా మాట్లాడుకొనేవారని ఆమె చెప్పింది. ఆమె చెప్పిన గుర్తుల ఆధారంగా, బిల్డర్ పోతరాజుని పట్టుకోగలిగాం. త్రివేదిని, పోతరాజుని కస్టడీలోకి తీసుకొని, మా పద్ధతిలో విచారణ జరిపేసరికి, అన్ని విషయాలూ బయటపడ్డాయి. ముకుందంగారి పంటి మీద ఉన్నది మానవ రక్తం అని తెలిసిపోతే, ఆ హత్య దెయ్యం పనికాదని కనిపెట్టేస్తామని, ఆ రిపోర్ట్ మార్పించేశాడు పోతరాజు, త్రివేదికి డబ్బాశ చూపించి. ఎప్పుడయితే దెయ్యమే హత్య చేసిందని అందరూ నమ్మేస్తారో, అప్పుడే తన పని సులువు అయిపోతుందని మీ బంగళాను చవకగా కొట్టేసి కోట్లు సంపాదించాలనుకున్నాడు పోతరాజు. పాపం ఇప్పుడు నరసింహంతో కలసి జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు’ అంటూ ముగించాడు కాళి. -కొయిలాడ రామ్మోహన్ రావు -
సోనాల్ చౌహాన్ తో " గరం గరం ముచ్చట్లు "
-
పోలీసుల చెంతకి ‘దెయ్యం’ వీడియోలు.. ఎఫ్ఐఆర్ నమోదు
వైరల్: దెయ్యాల భయంతో ఆ ప్రాంతంలో స్థానికులు మాత్రం రాత్రిపూట వణికిపోతున్నారు. ఈ మేరకు వీడియోలు సైతం వైరల్ కావడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని రంగంలోకి దిగారు. వారణాసి(యూపీ) వీడీఏ కాలనీలోని బడీ గబీ దగ్గర తెల్ల ముసుగులో ఆకారాలు బిల్డింగ్‌ల మీద సంచరిస్తున్నట్లు వీడియోలు బయటకు వచ్చాయి. అలా మూడు వీడియోలు రావడంతో స్థానికులు భయపడిపోతున్నారు. ఈ వీడియోలు వాట్సాప్ ద్వారా పోలీసుల దాకా వెళ్లాయి. దీంతో ఆగంతకుల పనిగా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇదిలా ఉంటే.. వారణాసిలో అలాంటి ఘటనలేం జరగలేదని, అవసరమైన ప్రచారంతో ఆందోళన కలిగించొద్దని వీడియోలను వైరల్ చేస్తున్న వాళ్లను కోరారు డీసీపీ. बनारस में छतों पर एक सफेद कपड़ा पहने भूत के चलने का वीडियो तेजी से वायरल हो रहा है, चश्मदीदों ने पुलिस से जांच की मांग की है... pic.twitter.com/e8KqvvYIr0 — Banarasians (@banarasians) September 22, 2022 -
'ది ఘోస్ట్' షూటింగ్ కంప్లీట్ చేసిన నాగార్జున
అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, పుస్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా షటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా తెలియ జేసింది చిత్ర యూనిట్. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ఘోస్ట్’. ఇందులో పవర్ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్ విక్రమ్‌గా కనిపించబోతున్నారు నాగార్జున. అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ముఖేష్ జి, సంగీతం: మార్క్ కె. రాబిన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్వరరావు చల్లగుళ్ల. IT'S A WRAP for the Shoot! #Ghost 🗡 The killing machine is all set to be unleashed on October 5th... 💥💥 See you soon in a theatre near you. @iamnagarjuna @PraveenSattaru @SVCLLP @nseplofficial @sonalchauhan7 @bharattsaurabh @SonyMusicSouth pic.twitter.com/qmUMxBHzAr — Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) August 8, 2022 -
వామ్మో! ఏంటీ దెయ్యం అలా ఎలా చేస్తోంది: వైరల్ వీడియో
ఇంతవరకు ఎన్నో రకాల వీడియోలు చూశాం. కానీ దెయ్యాలకు సంబంధించిన వీడియోల్లో ఏవో వస్తువులు గాల్లో ఎగురుతున్నట్లు కనిపిస్తాయి. ఇదేదో మిస్టరీగా ఉంది కాబట్టి ఇందులో దెయ్యం ఉందని డిసైడ్ చేసేస్తాం. నిజానికి మనం ఇంతవరకు చూసిన వీడియోల్లో దెయ్యాన్ని క్లియర్‌గా చూడలేదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో దెయ్యాన్ని స్పష్టంగా చూడగలరు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే... పంట పోలాల వద్ద కాకులు వంటి వివిధ రకాల పక్షులు ఆహార ధాన్యాలను తినకుండా ఉండేందుకు దిష్టి బొమ్మలు పెడుతుంటారు. మరికొంత మంది బాగా పండిన పంటను చూస్తే ఎవరి చెడు దృష్టి పడుతోందని కూడా ఇలాంటి దిష్టి బొమ్మలు ఏర్పాటు చేస్తుంటారు. ఐతే ఈ బొమ్మలకి కాస్త గ్రాఫిక్ జోడించి... ఆ దిష్టి బొమ్మ దెయ్యాం సైకిల్ పట్టుకుని ఉన్నట్లు రూపొందించారు. గాలి వీచినప్పుడల్లా ఆ దెయ్య గాల్లో ఎగురుతూ ఆ సైకిల్ హ్యండిల్ బార్ని తిప్పుతున్నట్లు ఉంటుంది. మొదటగా చూసినప్పుడూ నిజమైన దెయ్యంలా అనిపిస్తుంది. ఆ తర్వాత కాస్త నిశితంగా చూస్తే గానీ వాస్తవం ఏంటో అర్థమవ్వదు. When an engineer designs a scarecrow pic.twitter.com/IXG2ht2CLn — figensezgin (@_figensezgin) August 5, 2022 (చదవండి: నాన్న నన్ను క్షమించండి అంటూ సెల్ఫీ వీడియో! కన్నీటి పర్యంతమవుతున్న తండ్రి) -
నేరుగా ఓటీటీలోకి రానున్న ఘోస్ట్ మూవీ!
అక్కినేని నాగార్జున హీరోగా 'గరుడవేగ' ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ఘోస్ట్. సోనాల్ చౌహాన్ కథానాయిక. నాగ్, సోనాల్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్ పాత్రల్లో కనిపించనున్నారు. అనిఖా సురేంద్రన్, గుల్ పనాగ్ ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానుందా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఘోస్ట్ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయట. ఒకవేళ ఏదైనా భారీ డీల్ కుదిరితే మాత్రం నేరుగా ఓటీటీలోకి రావడం ఖాయమని తెలుస్తోంది. ఒకవేళ ఓటీటీలు పెద్ద మొత్తంలో ఆఫర్ ఇవ్వకపోతే మాత్రం ఈ ఏడాది చివర్లో సినిమా థియేటర్లలో విడుదల కానుంది. మరి ఘోస్ట్ ఓటీటీని ఎంచుకుంటుందా? థియేటర్నా? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే! చదవండి: ఆరేళ్ల రిలేషన్.. కానీ అప్పుడే మా ప్రేమ బలపడింది మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌తో తన్నులు తినాలనుంది: అఖండ విలన్ -
ఘోస్ట్ గన్ చట్టం.. అయినా బైడెన్ వైఫల్యం
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పాతుకుపోయిన గన్ కల్చర్ తీవ్రతను టెక్సాస్ ఎలిమెంటరీ స్కూల్ కాల్పుల ఘటన మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. 2018లో ఫ్లోరిడా పార్క్‌ల్యాండ్ డగ్లస్ హైస్కూల్ ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు టెక్సాస్ ఘటన ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. టెక్సాస్ ఎలిమెంటరీ స్కూల్ కాల్పుల ఘటనలో ఇప్పటిదాకా 18 మంది చిన్నారులు, మరో ముగ్గురు మృతి చెందారు. పద్దెనిమిదేళ్ల నిందితుడిని అక్కడిక్కడే కాల్చి చంపేశాయి భద్రతా దళాలు. క్వాడ్ సదస్సు నుంచి తిరిగి అమెరికాకు చేరుకోగానే.. ఈ చేదు వార్తను వినాల్సి వచ్చింది అధ్యక్షుడు జో బైడెన్. ఘటనపై టెక్సాస్ గవర్నర్ అబ్బట్ను వివరాలు అడిగి తెలుసుకుని.. సంతాపం ప్రకటించారు. అంతేకాదు ఘటనకు సంతాపసూచకంగా 28వ తేదీ వరకు జెండా అవనతం పాటించాలని కోరారు ఆయన. మరోవైపు వైస్ ప్రెసిడెంట్ కమలాహ్యారీస్ సైతం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితితో పాటు పలు దేశాల అధినేతలు సైతం ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు ‘ఘోస్ట్ గన్’ కారణమని పోలీసులు గుర్తించారు. ఘోస్ట్ గన్స్ అంటే.. అక్రమ తుపాకుల్ని ‘ఘోస్ట్ గన్స్’గా పరిగణించొచ్చు. ఇవి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఘోస్ట్ గన్లకు లైసెన్స్ ఉండదు. అలాగే వాటికి సీరియల్ నెంబర్ ఉండవు. త్రీడీ ప్రింట్ ద్వారా కూడా వీటిని తయారు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇల్లీగల్ కావడంతో.. వీటి తయారీకి అవసరమయ్యే విడిభాగాలను కూడా అమ్మడానికి వీల్లేదు. కానీ, చట్టాల్లోని లొసుగులతో.. ఆన్లైన్లో కొందరు వీటి తయారీకి అవసరమయ్యే మెటీరియల్‌ను అమ్మేస్తున్నారు. ఉదాహరణకు.. తొమ్మిది ఎంఎం సెమీ ఆటోమేటిక్ పిస్టోల్కు సంబంధించిన విడిభాగాలను ఆన్లైన్లో కూడా కొనుగోలు చేసే వీలుండేది. అక్కడి రాష్ట్రాల(ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా) స్థానిక చట్టాల దృష్ట్యా.. ఘోస్ట్ గన్స్ కలిగి ఉండడం స్వల్ప నుంచి కఠిన నేరంగా పరిగణించబడుతోంది. స్వల్పకాలిక నుంచి కఠిన జైలు శిక్ష, జరిమానా లేదంటే షూటింగ్ లైసెన్స్ రద్దు లాంటివి శిక్షలు అమలు అవుతున్నాయి. లెక్కకు మించి.. 2021లో వివిధ నేరాల దర్యాప్తుల్లో భాగంగా.. సుమారు ఇరవై వేల ఘోస్ట్ గన్స్‌ను వివిధ దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. 2016లో దొరికిన అక్రమ ఆయుధాలతో పోలిస్తే.. ఇది పది రెట్లు ఎక్కువని వైట్‌హౌజ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా.. గన్ వయొలెన్స్ అమెరికాలో ఎంతకీ తగ్గడం లేదు. ఓ పరిశోధన సంస్థ ప్రకారం.. కేవలం ఈ ఏడాదిలో ఇప్పటివరకు 140కి పైగా కాల్పుల ఘటనలు సంభవించాయి. కేవలం న్యూయార్క్ నగరంలోనే 2019 లో 47, 2020లో 150, 2021లో 150 ఘోస్ట్ గన్స్ దొరికాయి. అయితే దేశంలో కాల్పుల ఘటనలు పేట్రేగి పోతుండడంతో బైడెన్ ప్రభుత్వం ఘోస్ట్గన్స్ కట్టడికి ఏప్రిల్‌లో ఓ ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. ఘోస్ట్ గన్స్ నిషేధ చట్టం కోసం ఏడాది సమయం తీసుకుని.. రాజకీయంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. విడి భాగాల కంపెనీల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయినా కూడా సాహసోపేతమైన అడుగు వేసింది బైడెన్ ప్రభుత్వం. ఈ చట్టం ప్రకారం.. ఘోస్ట్ గన్స్ కలిగి ఉండడం కఠినాతికఠినమైన నేరంగా కిందకు వస్తుంది. అలాగే ఘోస్ట్ గన్స్ సరఫరా, విడిభాగాలను అందించే వాళ్లకు కూడా సమాన శిక్ష పడుతుంది. ఈ భయంతోఅయినా ఈ వ్యవహారానికి చెక్ పడుతుందని భావించారు. అయినప్పటికీ చట్టం అమలులో ఘోర వైఫ్యలాన్ని చవిచూస్తోంది బైడెన్ ప్రభుత్వం. నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఘోస్ట్ గన్స్ వ్యవహారం బయటపడుతున్నాయి. యథేచ్చగా ఘోస్ట్ గన్స్ మార్కెట్లో ఇల్లీగల్‌గా అమ్ముడుపోతున్నాయి. -
లెజండరీ ఘోస్ట్ ఆఫ్ కీవ్ మృతి
అతనుయుద్ధం మొదలైన తొలిరోజే ఆరు రష్యా యుద్ధ విమానాలను కూల్చేసి గార్డియన్ ఏంజెల్‌గా ప్రశంసలు అందుకున్నాడు. వైమానిక దాడులతో రెచ్చిపోతున్న రష్యాకి దడ పుట్టేలా చేశాడు. ఎవరా పైలెట్ ఫైటర్ అని రష్యా బలగాల్లో ఒకటే ఉత్కంఠ. రష్యా బలగాలకు నిద్రపట్టకుండా చేసి సుమారు 40 యుద్ధ విమానాలకు కూల్చేశాడు ఉక్రెయిన్‌లో ఘొస్ట్ ఆఫ్ కీవ్‌గా పిలిచే యుద్ధ వీరుడు. రష్యా బలగాలను మట్టికరింపించేలా చివరి శ్వాస వరకు పోరాడాడు. war hero dies in battle after shooting down 40 Russian aircraft: ఘోస్ట్ ఆఫ్ కీవ్‌గా పిలిచే 29 ఏళ్ల స్టెపాన్ తారాబల్కా అనే ఉక్రెనియన్ ఫైటర్ పైలెట్ గత నెలలో జరిగిన యుద్ధంలో మరణించాడని వైమానికదళ అధికారులు వెల్లడించారు. అతను మిగ్ 29 ఫైలెట్లో వెళ్తున్నప్పుడూ శత్రుదళాలు జరిపిన కాల్పులో మరణించాడని తెలిపారు. అతను యుద్ధం మొదలైన తొలరోజునే ఆరు రష్యా యుద్ధ విమానాలను కూల్చి వేశాడని చెప్పారు. దీంతో అతన్ని ఉక్రెనియన్లు గార్డియన్ ఏంజెల్‌గా ప్రశంసించారు. అంతేకాదు తారాబల్కా ఘోస్ట్ ఆఫ్ కీవ్‌గా యుద్ధంలో రహస్య ఆపరేషన్లు చేపట్టి దాడులు చేస్తుంటాడని తెలిపారు. అంతేకాదు యుద్ధంలో ఇప్పటివరకు సుమారు 40 రష్యా యుద్ధ విమానాలను కూల్చాడు. దీంతో రష్యా బలగాలకు నిద్రపట్టకుండా చేసే ఒక భయంకరమైన వ్యక్తిగా మారాడు. తారాబాల్కకు మరణానంతరం యుద్ధంలో కనబర్చిన ధైర్యసాహసాలకు ఇచ్చే ఉక్రెయిన్ అత్యుత్తమ పతకం ఆర్డర్ ఆఫ్ ది గోల్డెన్ స్టార్, హీరో ఆఫ్ ఉక్రెయిన్ అనే బిరుదును అందించారు. అతనికి భార్య ఒలేనియా, ఎనిమిదేళ్ల కుమారుడు యారిక్ ఉన్నారు. తారాబల్కా పశ్చిమ ఉక్రెయిన్‌లోని కొరోలివ్కా అనే చిన్న గ్రామంలోని శ్రామిక కుటుంబంలో జన్మించారు. అతను చిన్నప్పుడూ తన గ్రామం మీదుగా ఆకాశంలో ఎగురుతున్న ఫైటర్ జెట్లు పైలట్ కావాలనుకునేవాడు. మరోవైపు ఉక్రెయిన్ ప్రభుత్వం తారాబల్కా మరణం గురించి ఎలాంటి సమంచారం ఇవ్వదని తల్లిదండ్రులు చెబుతుండటం గమనార్హం. ఉక్రెయిన్ ధైర్య సాహసాలు ప్రంపంచానికి అవగతమయ్యేలా వీరోచితంగా పోరాడి గొప్ప వీర మరణం పొందాడు. తారాబల్కా మరణించినా అతని ధైర్య సాహసాలు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతాయి. (చదవండి: రష్యా బలగాలు నాడు మా దాకా వచ్చాయి.. టైమ్ మ్యాగజైన్‌పై జెలెన్స్కీ) -
ప్రియుడితో గొడవ.. ఎనిమిదో అంతస్థు నుంచి దూకేసింది
ప్రాణ భయంతో ఎనిమిదవ అంతస్తు నుంచి దూకింది ఓ మహిళ. తుపాకీతో ప్రియుడే చంపే ప్రయత్నం చేయగా.. తప్పించుకునే క్రమంలో ఆమె అలా దూకేసింది. అయితే తీవ్ర గాయాలతో బయటపడిన ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అమెరికా వాషింగ్టన్ డీసీలో ఈ ఘటన చోటు చేసుకుంది. నార్త్‌వెస్ట్ వాషింగ్టన్‌లోని ఓ అపార్ట్మెంట్లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ జంటకు ఓ బిడ్డ కూడా ఉంది. అయితే ఆ రాత్రి ఇద్దరూ గొడవపడి.. పరిస్థితి హత్య చేసే దాకా వెళ్లిందట. కాళ్లు, చేతులు కట్టేసి మరీ ఆమెను తుపాకీతో కాల్చే యత్నం చేశాడు దుండగుడు. అయితే.. చేతులు విడిపించుకున్న ఆమె కిటికీ గుండా ఎనిమిదవ అంతస్తు నుంచి కిందకు దూకేసింది. ఇది గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. మెట్రోపాలిటిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ వివరాల ప్రకారం.. నిందితుడిని కైలీ జమల్ పామర్గా గుర్తించి.. అరెస్ట్ చేశారు. దాడి, హత్యాయత్నం కింద అతనిపై కేసు నమోదు చేశారు. ఘోస్ట్ గన్ చట్టం తెచ్చినా.. అమెరికాలో అక్రమంగా తుపాకులు కలిగి ఉండడం, ఇంట్లో తయారు చేయడం కఠిన నేరం. ఇలాంటి తుపాకుల్ని ఘోస్ట్ గన్లు అంటారు. అంటే లైసెన్స్ లేనివన్నమాట. దేశంలో కాల్పుల ఘటనలు పేట్రేగి పోతుండడంతో బైడెన్ ప్రభుత్వం ఇలాంటి వాటిని నిషేధిస్తూ ఈమధ్యే ఓ ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. చట్టం తెచ్చిన వారం తిరగక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. 2021లో వివిధ నేరాల దర్యాప్తుల్లో భాగంగా.. సుమారు ఇరవై వేల ఘోస్ట్ గన్స్‌ను వివిధ దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. 2016లో దొరికిన అక్రమ ఆయుధాలతో పోలిస్తే.. ఇది పది రెట్లు ఎక్కువని వైట్‌హౌజ్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: మనిషే.. కుక్కను కరిచాడు! -
దెయ్యం మెసేజ్‌లు పంపుతోంది!!
ఇదొక చిత్రమైన కేసు. కాలిఫోర్నియా స్టాక్టన్కు చెందిన ఓ వ్యక్తి.. దెయ్యం తన మొబైల్ నుంచి మెసేజ్‌లు పంపుతోందని, రిప్లయ్‌లు కూడా ఇస్తోందని వాదిస్తున్నాడు. నలభై ఏళ్ల ఆ వ్యక్తి తన ప్రియురాలితో ఇంగ్లండ్‌లోని యార్క్ నగరానికి టూర్‌కి వెళ్లాడు. అయితే అది హాంటెడ్ సిటీ అని, అక్కడ ఒక పబ్ దగ్గర ఫొటో తీస్తే.. దెయ్యం కనిపించిందని, అప్పటి నుంచి తనకు పారానార్మల్ యాక్టివిటీస్ (విచిత్రమైన అనుభవాలు) ఎదురవుతున్నాయని చెప్తున్నాడు. అంతేకాదు.. ఆనాటి నుంచి తన ఫోన్ నుంచి తనకు తెలియకుండానే ప్రియురాలికి సందేశాలు వెళ్తున్నాయని, ఇదంతా దెయ్యం పనే అని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఈ మేరకు పోలీసులనూ ఆశ్రయించాడు. ప్రస్తుతం అతగాడిని మానసిక వైద్యుల పర్యవేక్షణలో విచారిస్తున్నారు పోలీసులు. అయితే పారానార్మల్ యాక్టివిస్ట్‌లు ఈ కేసును ఆసక్తికరంగా గమనిస్తున్నారు. మార్చి 21వ తేదీ నుంచి ఆ వ్యక్తికి ఇలాంటి అనుభవాలు మొదలయ్యాయని ‘టీసిడె లైవ్ రిపోర్ట్స్’ ఒక కథనం ప్రచురించింది. -
కిల్లింగ్ స్టోన్: ఆ రాయిని తాకిన అందరూ చనిపోయారు.. ఈ మధ్యే..
అది జపాన్‌లోని టోక్యోకు ఉత్తరం వైపున్న టొచిగి పర్వత ప్రాంతం.. అక్కడి కొండల మధ్యలో ఓ రాయి.. ఏముందీ కొండల్లో ఉండేవి రాళ్లే కదా అంటారా.. కానీ ఇది చాలా స్పెషల్. ఇప్పుడు అప్పుడు అని కాదు.. దాదాపు వెయ్యేళ్లనాటి చరిత్ర ముడిపడి ఉన్న ఈ రాయి మాత్రం జపాన్‌లో జనాలను వణికించేస్తోంది. రాయి ఏమిటి, వణికించడం ఏమిటో తెలుసా? జపాన్ పురాణాల్లోని ఓ గాథ ఈ రాయి ఏమిటో చెప్తుంది. 1107–1123 సంవత్సరాల మధ్య జపాన్ను పాలించిన టోబా చక్రవర్తిని కొందరు కుట్ర చేసి చంపేశారు. అందులో ముఖ్యమైనది టమామో నోమీ అనే ఓ మహిళా మంత్రగత్తె. అయితే చక్రవర్తి మరణించాక ఓ యుద్ధవీరుడు టమామోను చంపేయగా.. వెంటనే ఆమె మృతదేహం ఓ పెద్ద రాయిగా మారిపోయిందట. ఆ రాయిని ఎవరు తాకినా చనిపోయేవారట. అప్పటి నుంచీ ఆ రాయిని ‘సెషో సెకి (కిల్లింగ్ స్టోన్) అని పిలవడం మొదలుపెట్టారు. మంత్రగత్తె ఆత్మ అందులోనే బందీ అయి ఉందని భావించేవారు. ఈ రాయి ఈ మధ్యే రెండుగా విరిగిపోయింది దీంతో ఆ దెయ్యపు మంత్రగత్తె బయటికి వచ్చేసిందంటూ.. అక్కడి జనాలు బెంబేలెత్తుతున్నారు. ఇది అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The Sessho-seki, a famous rock in Nasu, Japan that was said to have imprisoned the evil nine-tailed fox demoness Tamamo-no-Mae, was found broken in half. After nearly 1,000 years, the demon vixen is presumably once again on the loose. https://t.co/Fz3yRLy4qQ — Nick Kapur (@nick_kapur) March 6, 2022 వెయ్యేళ్ల తర్వాత దెయ్యం బయటికి వచ్చేసిందని కొందరు అంటుంటే.. రాయి మధ్యలోంచి ఏదో బయటికి వచ్చినట్టుగా పగిలిందంటూ మరికొందరు సాక్ష్యం చూపుతున్నారు. ఏదో కీడు జరుగుతుందేమో అంటూ ఇంకొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ రాయికి కొన్నేళ్ల కిందే పగుళ్లు వచ్చాయని, ఇటీవలి భారీ వర్షాలతో నీటి ప్రవాహం దెబ్బకు రాయి విరిగి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. చిత్రమేమిటంటే.. ఈ రాయి ఉన్న చోటు ఓ పర్యాటక ప్రాంతం. ఇన్నాళ్లూ జనం బాగానే పోటెత్తేవారు. రాయి విరిగిందని తెలిసినప్పటి నుంచి అటువైపు చూడటమే మానేశారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
పగటి పూట బొమ్మ.. రాత్రి కాగానే ‘దెయ్యం’లా హైవేపై..
దెయ్యం కథలు.. నమ్మకం ఉన్నా.. ‘ఛస్’ అని ఛీదరించుకున్నా వీటి గురించి ఆసక్తి కలగక మానదు. ఎందుకంటే ఆ కథల్లోని నేరేషన్ అలా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు చెప్పుకోబోయే యూకే ‘బెట్టీ బైపాస్’ కొంత క్యూరియాసిటీని రేకెత్తించడం ఖాయం!. ఎందుకంటే ఈ దెయ్యం ఈమధ్యే పదేళ్లు పూర్తి చేసుకుంది కాబట్టి!. బర్మింగ్హమ్-వోర్‌సెయిస్టర్ సరిహద్దు. హైవే కావడంతో వాహనాల రద్దీ ఎక్కువే!. చెక్‌పోస్ట్‌కి దగ్గర్లో ఒక శాండ్విచ్ ట్రక్ ఉంటుంది. ఆ నిర్వాహకులు ఏర్పాటు చేసిన బెంచ్ మీద కనిపించే ఒక రూపాన్ని చూసి ఎవరైనా వణికిపోతుంటారు. కారణం.. గత పదేళ్లుగా ఆ రూపం అక్కడక్కడే తిరుగుతోంది. ఆ రూపం పేరు ‘బెట్టీ’.. పక్కనే పిల్లల్ని వేసుకుని తిరిగే ఓ వీల్ ఊయల కూడా ఉంటుంది. పగలు బెంచ్ మీద కనిపించే ఆ రూపం.. రాత్రిపూట దెయ్యంగా మారుతుందనే ప్రచారం నడుస్తుంది. అందుకే ఈ దారికి కూడా ‘బెట్టీ బైపాస్’ అని పేరొచ్చింది. బిడ్డను కోల్పోయిన ఆ తల్లి దెయ్యంగా మారి.. అలా హైవేపై తిరుగుతోందని, ఎవరో ఆమెను యాక్సిడెంట్ చేసి చంపేశారని, కాదు కాదు.. ఆమె భర్తే ఆమెను చంపేశాడని.. ఇలా రకరకాల ప్రచారాలు వినిపిస్తుంటాయి. బెట్టీ మీద సింపథీ ఉన్నా.. దెయ్యం అనే ఊహ మాత్రం చాలామందిని వణికించేది. దీంతో ఈ మిస్టరీని చేధించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఏళ్లు గడుస్తున్నా.. ఆ ఘోస్ట్ లేడీ వ్యవహారాన్ని ఎవరూ తేల్చలేకపోయారు. ఈలోపు ఆ నోటా ఈ నోటా పాకి ఈ దెయ్యం కథ.. దెయ్యాల మీద అన్వేషణ చేసే వాళ్లకు, అంతర్జాతీయ మీడియా హౌజ్ దృష్టికి చేరింది. ఎవరికి వాళ్లు ఈ మిస్టరీని చేధించాలని ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో పగలబడి నవ్వుకున్నారు. కారణం.. అదొక ప్రాక్టికల్ జోక్ కాబట్టి! బెట్టీ ఒక షోకేజ్ బొమ్మ. దానిని అక్కడ తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి పేరు నిక్ హజ్బెండ్. ఆయన ఆ శాండ్విచ్ ట్రక్ యజమాని. ఓ ఛారిటీ షాప్ నుంచి ఆ షోకేజ్ బొమ్మను కొనుక్కొచ్చి.. దానికి బెట్టీ అనే పేరు పెట్టి రోజూ దానిని రకరకాల యాంగిల్స్‌లో అక్కడి బెంచ్‌ల మీద కూర్చోబెడుతున్నాడు. అలా పదేళ్లు గడిచిపోయింది. ఈలోపు హైవే మీద వెళ్లే చాలామంది.. ప్రత్యేకించి రాత్రిళ్లు ఆ బొమ్మను చూసి వణికిపోయేవాళ్లట. పైగా అది అక్కడక్కడే ఉండడం, నిక్ చెప్పిన కల్పిత కథలతో అదొక దెయ్యం అని బలంగా ఫిక్స్ అయిపోయారు. అలా బెట్టీ కథ చుట్టుపక్కల పాకేసింది. పాపం అనుకున్నారట.. ప్రాక్టికల్ జోక్స్‌తో ఇంట్లో వాళ్లను ఫూల్స్ చేసే నిక్.. జనాలందరినీ భయపెట్టాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేశాడు. అయితే పగటిపూట ఆ ఫుడ్ ట్రక్ దగ్గర ఆగిన కొందరు.. బెట్టీ గురించి అడిగినప్పుడు వాళ్లకు రకరకాల కథలు చెప్పేవాడు. ఆమె భర్త చేతిలో మోసపోయినా ఒక అనాథ అని, అందుకే బిడ్డతో అక్కడ అలా కూర్చుంటుందని(సజీవంగా ఉందని నమ్మించాడు కూడా!) చెప్పడంతో చాలామంది ‘పాపం’ అని సాయం చేసేందుకు ముందుకు వచ్చేవాళ్లట. తీరా అదొక బొమ్మ అని తెలిశాక నిక్‌ను తిట్టుకుంటూ.. సరదాగా ఫొటోలు తీసుకుని వెళ్లిపోయేవాళ్లట. కొన్నాళ్ల తర్వాత నిక్, ఆ ప్రమ్(తిప్పే ఊయల)ని మాయం చేయడంతో బిడ్డ గురించి ఆరా తీసేవాళ్లట. వాళ్లకు ఆ బిడ్డ పెరిగి.. స్కూల్‌కు వెళ్తోందని చెప్పేవాడట. ఇలా జనాలందరికీ ఒక్కో రకమైన కథ చెప్పి బురిడీ కొట్టించేవాడు ఆ ట్రక్కు యజమాని. ఒకానొక టైంలో కౌన్సిల్ ఆఫీసర్లు సైతం ఆ అనాథ మహిళకు సాయం చేయాలని ముందుకొచ్చారట. కానీ, అదొక బొమ్మ అని తెలిశాక.. నిక్కు వార్నింగ్ఇచ్చి మరీ బెట్టీతో ఫొటోలు దిగి వెళ్లిపోయారట. మొత్తానికి బెట్టీ తన కుటుంబంలో ఒక భాగం అయ్యిందని, ఆ బొమ్మకు చేసిన 20 పౌండ్ల ఖర్చు తన వ్యాపారానికి ఎంతో సాయం ఇప్పుడు చేస్తోందని సంతోషపడుతున్నాడు నిక్. మొత్తానికి పదేళ్లపాటు జనాలను బురిడీ కొట్టించాడు ఈ పెద్దాయన. -
వరంగల్‌లో అరుదైన దయ్యం చేపలు
సాక్షి, వరంగల్: వరంగల్‌లో దయ్యం చేపలు దర్శనం ఇచ్చాయి. నగరంలోని ఫోర్ట్ వరంగల్ అగర్త చెరువులో చేపల వేటకు వెళ్లిన కిషోర్‌కు అరుదైన చేపలు వలకు చిక్కాయి. నీళ్లలో ఉంటే చకచకా ఈదే చేపలు నీటి నుంచి బయటికి తీస్తే కదలలేని స్థితిలో ఉంటున్నాయి. వీటిని బంగ్లాదేశ్‌లో ఎక్కువగా ఉండే క్యాట్ ఫిష్ సంతతికి చెందిన చేపలుగా భావిస్తున్నారు. ఈ చేపలను దెయ్యం(డెవిల్ ), సక్కెర్ చేప, విమానం చేప అని పిలుస్తారు. ఈ రకం చేపలు తినడానికి ఉపయోగపడవని అంటున్నారు. వింత చేపలను స్థానికులు ఆసక్తిగా చూస్తున్నారు. చదవండి: (కన్న పిల్లలు కళ్ల ముందే చనిపోతే ఆ తల్లి భరించలేకపోయింది..) -
బార్ కొచ్చి రచ్చ చేసిన దెయ్యం.. వీడియో వైరల్
లండన్: సాధారణంగా ఈ ప్రపంచంలో దెయ్యాలకున్న క్రేజ్ ఇక మరి వేటికి ఉండదేమో. ఈ అంశంపై లెక్కకు మిక్కిలి పరిశోధనలు కూడా జరిగాయి.. జరుగుతున్నాయి. ఇక ఇంటర్నెట్లో దెయ్యాలకు సంబంధించిన వీడియోలు కోకొల్లలు. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. చూడబోతే ఇదేదో తాగుబోతు దెయ్యంలా ఉంది. అందుకే బార్‌కు వెళ్లి రచ్చ చేసింది. ఆ వివరాలు.. యూకే, సౌత్ వ్రాక్సాల్, విల్ట్‌షైర్‌లో ఉన్న లాంగ్ ఆర్మ్స్ బార్ వారం రోజుల క్రితం తన ట్విటర్లో ఓ వీడియోని షేర్ చేసింది. వీడియోలో రికార్డయిన దాని ప్రకారం బార్లో టేబుల్‌కి ఇరువైపులా ఓ మహిళ, వ్యక్తి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపటి తర్వాత మహిళ అక్కడ నుంచి లేచి వెళ్తుంది. ఆ వెంటనే టేబుల్ షెల్ఫ్‌లో ఉన్న ఓ గ్లాస్ దానంతట అదే కింద పడుతుంది. (చదవండి: అవును నా ఇంట్లో దెయ్యాలున్నాయి.. తరిమేశాను: నటి) ఈ సంఘటనతో బార్లో ఉన్నవారు ఒక్క క్షణం భయపడతారు. మహిళ అయితే ఆ షాక్ నుంచి త్వరగా కోలుకోలేకపోయింది. టేబుల్‌కి అవతల పక్క ఉన్న వ్యక్తి.. అక్కడ ఏమైనా ఉందేమోనని.. చేయి పెట్టి చూస్తాడు. కానీ వారికి ఏం కనిపించదు.. కనీసం తగలదు కూడా. అయితే ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఈ బార్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ఇదే తొలిసారి కాదట. (చదవండి: ఆకాశంలో నాలుగు చుక్కలు.. గ్రహాంతర వాసులులేనా!?) గత కొన్నేళ్లుగా ఇలాంటి వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అక్కడ పని చేస్తున్న సిబ్బంది తెలిపారు. తాము కిచెన్‌లో పని చేస్తుండగా.. సడెన్‌గా ఎవరో వచ్చి.. దాని డోర్ లాక్ చేస్తారని.. కూర్చీలు, టేబుల్స్ కదిల్చినట్లు శబ్దాలు వస్తాయని తెలిపారు. ఈ సంఘటనలు చూసి మొదట్లో తాము భయపడ్డామని.. రానురాను అలవాటయ్యింది అని తెలిపారు. చదవండి: పబ్‌లో ‘దెయ్యం’ కలకలం.. వీడియో వైరల్ -
వింత నమ్మకం.. ఐదేళ్ల కొడుకును గొడ్డలితో 7 ముక్కలుగా నరికి..!
భోపాల్: సభ్యసమాజం తలదించుకునే పనిచేశాడా కసాయి తండ్రి. కన్నబిడ్డను ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు. ఐదేళ్ల పసిపిల్లాడిని దయ్యాలు బూనాయనే మూఢనమ్మకంతో ఇంతదారుణానికి వడికట్టాడు. తాజాగా వెలుగు చూసిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం..మధ్యప్రదేశ్‌లోని అలిరాజ్పుర్కు చెందిన దినేశ్ దావర్ ఐదేళ్ల పసివాడని కూడా కనికరించకుండా కన్నకొడుకును గొడ్డలితో 7 ముక్కలుగా నరికాడు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా పాతిపెట్టేశాడు. అయితే ఎందుకు చంపావని నిందితుడిని పోలీసులు ప్రశ్నించగా.. కొడుకు పుట్టినప్పట్నుంచి తన భార్య ఆరోగ్యం క్షీణించిందని, ఇంట్లో వాతావరణం కూడా ఇబ్బందిగా ఉండేదని, ఈ పరిస్థితుల దృష్ట్యా సమీప గ్రామంలోని గురుమాతను అడుగగా.. కొడుకును దెయ్యాలావహించాయని, అందుకే తన ఇంట్లో సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పిందట. ఇదంతా విన్న దినేశ్ ఐదేళ్ల కొడుకును గొడ్డలితో నరికి చంపి, పూడ్చినట్లు తెలిపాడు. ఈ ఘటన పై కేసు ఫైల్ చేసిన అలిరాజ్పుర్ ఎస్డీఓపీ శ్రద్ధా సొంకర్ మాట్లాడుతూ.. నిందితుడు దినేశ్ దావర్‌ను అరెస్ట్ చేశాం.. అతని కొడుకుకు దెయ్యం ఆవహించినట్లు తెలిపిన మహిళ కోసం గాలింపు చేపట్టినట్లు మీడియాకు వివరించాడు. చదవండి: ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే రూ. 4 వేల వరకు జరిమానా..! బాదుడే.. బాదుడు!! -
నయా ఇంగ్లిష్: ఘోస్ట్ కిచెన్ అంటే?
కస్టమర్ల కోసం ఇండోర్ సీటింగ్ ఉండదు. వెయిటర్లు ఉండరు. డైనింగ్ రూమ్ ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఫుడ్ డెలివరీ వోన్లీ తరహా రెస్టారెంట్లను ‘ఘోస్ట్ కిచెన్’ అంటారు. truthiness అంటే? అమెరికన్ టెలివిజన్ కమెడియన్ స్టిఫెన్ కోల్బర్ట్ ఈ టెర్మ్‌ను కాయిన్ చేశాడు. సాక్ష్యాలు, ఆధారాలతో సంబంధం లేకుండా ఒక విషయాన్ని గట్టిగా నమ్మడం... ట్రూతినెస్. sobercurious అంటే? ఆల్కహాల్ ముట్టకుండా ఒక నిర్ణితమైన కాలాన్ని ప్రయోగాత్మకంగా గడపడం. (చదవండి: పూజను 70 లక్షల మంది ఫాలో అవుతున్నారు.. ఎందుకంటే!) హైపర్బొలి అనగా... ఏదైనా విషయాన్ని కాస్త అతిశయంగా చెప్పడమే హైపర్బొలి. భావాన్ని యథాతథం గా తీసుకోవద్దు. కవితల్లో ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తారు. ఉదా: అతని కళ్లు కన్నీటి సముద్రాలు అయ్యాయి. convolution అంటే ఒక విషయం కష్టంగా, సంక్లిష్టంగా ఉండడం. ‘మనం సృష్టించకపోతే పదాలు ఎలా పుడతాయి!’ అనేది ఒక పాలసీ. పాత పదాలనే కొత్తగా కాయిన్ చేయడం అనేది మరో పద్ధతి. ‘ఒరిజనల్ సెన్స్ ఆఫ్ ది వర్డ్’కు దగ్గరగా తమాషా పదాలను సృష్టించడమే aptagram -
మనుషులే కాదు శునకం కూడా దెయ్యం అవుతుందా?
Dog Playing With Ghost Dog in Australia: నిజంగా దెయ్యాలు ఉన్నాయంటే ఎవరు కచ్చితంగా చెప్పలేరు. ఒకవేళ ఎవరైన తమ అనుభవాలు గురించి ప్రస్తావిస్తే అదంతా ఒట్టి బూటకం అని, అది కేవలం భయం కారణంగా వారికి అలా జరిగిందంటూ చాలామంది కొట్టిపారేస్తారే తప్ప ఎవరు నమ్మరు. పైగా వారిని పిచ్చివాళ్లగా చూస్తారు. నిజానికి ఈ ఆధునిక టెక్నాలజీ కారణంగా కొన్ని వీడియోల్లో రికార్డు అయ్యి ఉన్న ఆధారాలను చూస్తే గానీ ఎవ్వరూ అంత తేలికగా నమ్మరు. అచ్చం అలాంటి దెయ్యం వీడియోని చూసి ఇక్కడొక యజమాని షాక్‌కి గురవుతాడు. (చదవండి: టీ పొడి వ్యాపారం చేద్దామనుకోవడమే వారిపాలిట శాపమైంది.. అదిరిపోయే ట్విస్ట్!!..) అసలు విషయంలోకెళ్లితే....ఆస్ట్రేలియాలోని డిమార్కో అనే వ్యక్తి పెరటి తోటలో తన పెంపుడు కుక్కపిల్ల మరో కుక్కతో ఆడుతున్నట్లు సీసీపుటేజ్‌లో చూశానని చెబుతున్నాడు. పైగా మెల్బోర్న్కు చెందిన డిమార్కో, తన పెరటి తోట పూర్తిగా కంచెతో లాక్ చేసి ఉంటుందని. ఏ జంతువు లోపలకి వచ్చే ఆస్కారమే ఉండదని గట్టిగా చెబుతున్నాడు. అంతేకాదు ఆ సీసీపుటేజ్‌లో పారదర్శకంగా కనిపిస్తున ఒక దెయ్యం కుక్కతో తన పెంపుడు కుక్క ఆడుతున్నట్లు కనిపించదని తను చాలా భయభ్రాంతులకు గురయ్యానని చెప్పాడు. పైగా తన కుక్క వద్దకు పరుగెత్తుకుని వెళ్లి చూసినప్పుడు అదొక్కటే ఉందని అన్నాడు. ఆ సమయంలో తన కుక్క ఒక్కత్తే పెరట్లో ఉన్నట్లు తాను చూశానని అంతేకాక ఆ వీడియోలో ఒక నిమిషం వ్యవధిలోనే ఆ దెయ్యం కుక్క అదృశ్యంగా వచ్చి తన పెంపుడు కుక్కతో ఆడుతోందని చెబుతున్నాడు. (చదవండి: వింత వ్యాధి... రోజుకు 70 సార్లు వాంతులు... కానీ అంతలోనే!) -
అవును నా ఇంట్లో దెయ్యాలున్నాయి.. తరిమేశాను: నటి
వాషింగ్టన్: వెనకటి రోజుల్లో అంటే ఏమో కానీ.. ప్రస్తుతం మాత్రం దెయ్యాలు, భూతాలు అంటే చాలామంది కొట్టి పారేస్తారు. కేవలం సినిమాల్లో తప్ప వాస్తవంగా దెయ్యాలు ఉండవు అనే వారు చాలా మంది. అయితే దెయ్యాల ఉనికిని నమ్మేవారు కూడా కొకోల్లలు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే.. ప్రముఖ హాలీవుడ్ నటి ఒకరు తాను చాలా ఏళ్ల పాటు దెయ్యాలతో కలిసి జీవించానని.. చివరకు ఒకరోజు వాటిని తరిమే వ్యక్తిని తీసుకువచ్చి.. దెయ్యాల గోల నుంచి విముక్తి పొందానని తెలిపారు. సామాన్యులు ఎవరైనా ఇలాంటి మాటలు చెబితే పెద్దగా పట్టించుకోం.. కానీ ఏకంగా హాలీవుడ్ నటే వెల్లడించడంతో.. ఈ టాపిక్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ వివరాలు.. ఇటీవలే క్లో జావో 'ఎటర్నల్స్'తో అజాక్గా తన సూపర్ హీరో అరంగేట్రం చేసిన ప్రముఖ నటి సల్మా హాయక్, తన లండన్ ఇల్లు దెయ్యాలతో నిండిపోయిందని తెలిపారు. ది ఎల్లెన్ డిజెనెరెస్ షోకు హాజరైన సందర్భంగా హాయక్ సంచలన విషయాలు వెల్లడించారు. ఇంట్లో తాను ఎదుర్కొన్న విచిత్ర పరిస్థితుల గురించి.. దెయ్యాలను తరిమికొట్టిన విధానం గురించి వెల్లడించారు. (చదవండి: ఆ ఇంట్లో సంకెళ్ల దెయ్యం.. రాత్రయితే..) ఈ సందర్భంగా హాయక్ మాట్లాడుతూ.. ‘‘లండన్‌లో ఉన్న నా ఇంట్లో చిత్ర, విచిత్రమైన, ఒళ్లు గగుర్పొడిచే సంఘటనలు చోటు చేసుకునేవి. పియానో దానంతట అదే మోగేది. మూడో అంతస్తులో ఉన్న లైట్లు.. వాటంతట అవే వెలిగేవి.. ఆరిపోయేవి. ప్రారంభంలో ఇవన్ని చూసి బెదిరిపోయాను. మనుషులు ఎవరు కనిపించే వారు కారు. ఆ తర్వాత ఇది దెయ్యాల పనే అని నాకు అర్థం అయ్యింది. కాకపోతే నేను ఎప్పుడు వాటిని ప్రత్యక్షంగా చూడలేదు’’ అని తెలిపారు. (చదవండి: వైరల్: ఈమె మనిషా.. దెయ్యామా?!) ‘‘ఈ బాధ నుంచి బయటపడటానికి ఓ వ్యక్తిని తీసుకువచ్చాను. నాకు మా ఇంట్లో ఎప్పుడు దెయ్యం కనిపించలేదు. కానీ విచిత్ర సంఘటనలు చోటు చేసుకునేవి. అందుకే దెయ్యాలను తరిమే వ్యక్తిని తీసుకువచ్చాను. దెయ్యాలు ఉన్నాయో లేవో తెలియదు. కానీ నా ఈ ప్రయత్నం వల్ల వాటిని ఇంటి నుంచి తరిమేశాను అనే తృప్తి కలుగుతుంది.. భయం తగ్గి ప్రశాంతంగా ఉంటాను. ఇక నేను తీసుకువచ్చిన వ్యక్తి దగ్గర దగ్గర 20 దెయ్యాలను పట్టుకున్నట్లు తెలిపాడు’’ అని వెల్లడించారు. హాయక్ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తున్నాయి. చదవండి: ఇంట్లో దెయ్యం.. కాలనీ మొత్తం ఖాళీ -
రూ. 8 కోట్లకు అమ్ముడుపోయిన ‘ది కంజురింగ్’ దెయ్యాల కొంప
వాషింగ్టన్/బురిల్‌విల్లే: దెయ్యాల గురించి ఎన్ని కథలు, సినిమాలు వచ్చినా హిట్టే తప్ప.. ఫెయిల్ అవ్వడం ఉండదు. ఇక ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రదేశాలు, ఇళ్లు, ఆఖరికి వస్తువులు కూడా దెయ్యాల నివాసాలుగా ప్రచుర్యం పొందుతాయి. ఈ కోవకు చెందినదే అమెరికా బురిల్‌విల్లే ప్రాంతానికి చెందిన ‘రోడ్ ఐల్యాండ్’ ఫామ్‌హౌస్. ఈ ఇంటి గురించి ఆ చుట్టూ పక్కల ఎవరిని ప్రశ్నించినా.. భయంతో గజ్జున వణికిపోతారు. ఇక ఈ ఇంట్లో జరిగే వింత సంఘటనల గురించి కథలు కథలుగా వర్ణిస్తారు. రోడ్ ఐలాండ్ ఫామ్‌హౌస్‌పై ప్రచారంలో ఉన్న కథల ఆధారంగా 2013లో హాలీవుడ్లో ‘ది కంజూరింగ్’ సినిమా తీశారు. అది బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ దెయ్యాల కొంప ప్రసక్తి ఎందుకు వచ్చిందంటే.. తాజాగా ఈ హాంటెడ్ హౌస్‌ని వేలం వేశారు. ఆశ్చర్యంగా అది కాస్తా 1.2 మిలియన్ డాలర్లు (8,89,48,380 కోట్ల రూపాయలు) పలికి అందరిని ఆశ్చర్యపరింది. ఆ వివరాలు.. అమెరికాలోని బురిల్‌విల్లే ప్రాంతంలో ఉన్న ఈ ఇంటిని 1826 లో నిర్మించారు. ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలోని ప్రాంతంలో ఫామ్‌హౌస్ కేవలం 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక ఈ ఇంట్లో మొత్తం మూడు బెడ్రూమ్లు, 1 1/2 బాత్రూమ్లు ఉన్నాయి. మొత్తంగా ఈ ఇంటిలో మొత్తం 14 గదులు ఉన్నాయి. (చదవండి: పబ్‌లో ‘దెయ్యం’ కలకలం.. వీడియో వైరల్) ఈ ఫామ్‌హౌస్ 19వ శతాబ్దానికి చెందిన పెర్రాన్ కుటుంబానికి చెందినదిగా దివంగత పారానార్మల్ పరిశోధకులు ఎడ్, లోరైన్ వారెన్ 1971లో ప్రకటించారు. 19వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో మరణించిన బత్షెబా షెర్మాన్ అనే మంత్రగత్తె ఈ ఫామ్‌హౌస్‌ను వెంటాడిందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ ఫామ్‌హౌస్ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ది కంజురింగ్’ హర్రర్ చిత్రాన్ని ఈ ఇంటిలో చిత్రికరించలేదని.. కానీ అక్కడ నివసించిన పెర్రాన్ కుటుంబ సభ్యుల అనుభవాల ఆధారంగా రూపొందించినట్లు పరిశోధకులు వెల్లడించారు. 2013 లో సినిమా విడుదలైనప్పటి నుంచి ఈ ఇల్లు ప్రజాదరణ పొందింది. (చదవండి: శవాల గుట్టల కోసం బావిలోకి దిగితే..) "ఈ ఇంటికి సంబంధించిన సమాజంలో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటి ఆధారంగా డజన్ల కొద్దీ పుస్తకాలు, సినిమాలను తెరకెక్కాయి. చాలా మంది అర్హత కలిగిన పారానార్మల్ పరిశోధకులు ఇంటికి వెళ్లి దెయ్యాల గురించి పరిశోధించారు. న్యూ ఇంగ్లాండ్‌లో పురాతన దెయ్యం వేట బృందాన్ని స్థాపించిన అత్యంత ప్రసిద్ధ ఎడ్, లోరైన్ వారెన్‌లు 1970 లో ఈ ఫామ్‌హౌస్ మిస్టరీని చేధించేందుకు ఇక్కడకు వచ్చారు. ఈ క్రమంలో వారు ‘ది కంజురింగ్’ సినిమాలో ఉన్న అనేక సంఘటనలు.. ఈ ఫామ్‌హౌస్‌లో వాస్తవంగానే జరిగాయని ధ్రువీకరించారు. "ప్రస్తుత ఈ ఇంటి వద్ద సెక్యూరిటీ గార్డులుగా ఉన్న వారు ఇంట్లో జరిగే వింతలకు సంబంధించి లెక్కలేనన్ని సంఘటనలను నివేదించారు. ప్రస్తుతం ఈ ఫామ్‌హౌస్ రాత్రిపూట నిర్వహించే గ్రూప్ ఈవెంట్స్‌కి బాగా ప్రాచుర్యం పొందింది. చదవండి: Stonehenge: ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే!! -
కాజల్ గర్భవతా? సినిమా నుంచి తప్పుకున్న చందమామ!
Jacqueline To Replace Pregnant Kajal Aggarwal: ‘విశేషం ఏమైనా ఉందా?’... పెళ్లయిన అమ్మాయిలను చాలామంది అడిగే ప్రశ్న ఇది. తల్లి కాబోతున్నావా? అనే విషయాన్ని ఇలా అడుగుతుంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు కాజల్ అగర్వాల్ ఏదైనా విశేషాన్ని స్వయంగా చెబుతారేమోనని కొందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాజల్ పెదవి విప్పడంలేదు కానీ ఆమె గర్భవతి అనే వార్త మాత్రం ప్రచారంలోకొచ్చింది. చదవండి: ఖరీదైన కారు కొన్న హీరోయిన్..ధర తెలిస్తే షాకే గత ఏడాది వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని కాజల్ పెళ్లాడిన విషయం తెలిసిందే. ఆమె తల్లి కానున్నారనీ, ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న చిత్రాలను పూర్తి చేయాలనుకుంటున్నారనీ, సైన్ చేసి.. ఇంకా సెట్స్‌కి వెళ్లని సినిమాల నుంచి మాత్రం తప్పుకుంటున్నారనీ టాక్. అలా తప్పుకుంటున్న సినిమాల్లో నాగార్జున సరసన అంగీకరించిన ‘ది ఘోస్ట్’ ఒకటని చెప్పుకుంటున్నారు. ఆమె స్థానంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ని తీసుకున్నారట. ‘సాహో’లో ప్రభాస్‌తో ‘బ్యాడ్ బాయ్’ ఐటమ్ సాంగ్‌కు జాక్వెలిన్ కాలు కదిపారు. మరి.. తెలుగు తెరపై కథానాయికగా కూడా ఆమె కనిపిస్తారా అంటే.. కాజల్ విశేషం నిజమే అయ్యుంటే, ‘ఘోస్ట్’ యూనిట్ జాక్వెలిన్‌ని తీసుకుని ఉంటే నిజమే అవుతుంది. చదవండి : దయచేసి అందరూ హెల్మెట్ వేసుకొని వెళ్లండి: వైష్ణవ్ తేజ్ -
పబ్‌లో ‘దెయ్యం’ కలకలం.. వీడియో వైరల్
లండన్: సాధారణంగా దెయ్యాలు అనగానే అర్థరాత్రి పూట.. నిర్మానుష్య ప్రాంతంలో తిరుగుతుంటాయి.. పాడుబడిన బంగళాల్లో ఉంటాయి.. ఎవరు లేని చోట తచ్చాడతాయనే ఎక్కువగా వింటుంటాం. ఇక సినిమాలు, కథల్లో కూడా ఇలానే చూపిస్తారు. అయితే ఇప్పుడు మీరు చదవబోయే వార్త మాత్రం అందుకు పూర్తిగా వ్యతిరేకం. ఇక్కడ ఓ దెయ్యం ఏకంగా పబ్‌కే వస్తుంది. పైగా తాను వచ్చానని అందరికి తెలియజెప్పడం కోసం రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. కార్డిఫ్‌లోని ది లాన్స్‌డౌన్ పబ్‌లో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. ఈ ఏడాది జూలై 26 సాయంత్రం ఓ మహిళ లాన్స్‌డౌన్ పబ్‌కి వెళ్లింది. ఓ టేబుల్ మీద కూర్చుంది. అక్కడ మొత్తం నాలుగు కుర్చీలుండగా.. ఒకదాంటో ఆమె కూర్చుంది. మిగిలిన మూడు చైర్లు ఖాళీగా ఉన్నాయి. తన ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ.. మొబైల్ చూడసాగింది. ఇంతలో ఆమెకు ఎదురుగా ఉన్న వరుసలోని కుర్చీ సడెన్‌గా కదిలింది. ఇది గమనించిన సందరు మహిళ చైర్ కింద ఏమైనా ఉందేమోనని చెక్ చేసింది. ఏం కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యింది. (చదవండి: ఆ ఇంట్లో సంకెళ్ల దెయ్యం.. రాత్రయితే..) మేనజర్ దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. సీసీటీవీ ఫూటేజ్ చెక్ చేసి ఆశ్చర్యపోయింది. ఆ కుర్చీ దానంతట అదే కదలడం చూసి ఆమె భయపడింది. ఈ సందర్భంగా సదరు మహిళ మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా నేను దెయ్యాలు వంటి వాటిని నమ్మను. లాజిక్ లేని విషయాలను అసలు పట్టించుకోను. కానీ సీసీటీవీ పుటేజ్ చూసి నేను ఆశ్చర్యపోయాను’’ అని తెలిపింది. (చదవండి: జిమ్‌లో ‘దెయ్యం’.. కాలు పట్టుకుని మరీ లాక్కెళ్లింది) దీని గురించి పబ్‌లో ఎనిమిదేళ్లుగా పని చేస్తున్న ఓ ఉద్యోగి మాట్లాడుతూ.. ‘‘మొదట్లో నాకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఓ రోజు ఉన్నట్లుండి చాక్‌బోర్డ్ దానంతట అదే ఊగడం చూశాను. అప్పుడు చాలా భయపడ్డాను. కానీ సదరు దెయ్యం మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. కేవలం తన ఉనికిని మేం గుర్తించాలనే ఉద్దేశంతో ఇలా ఫర్నిచర్‌ను కదుపుతూ ఉంటుంది. నెమ్మదిగా మాకు అలవాటయిపోయింది’’ అని తెలిపింది. (చదవండి: 'ఘోస్ట్'గా కింగ్ నాగార్జున.. ఫస్ట్‌లుక్ అవుట్) పబ్ మేనేజర్ మాట్లాడుతూ.. ఇ‘‘క్కడ ఇలాంటి వింత వింత సంఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణం. మా పబ్‌పై ఉన్న ఇళ్లల్లో నివసించే వారికి కూడా ఇలాంటే అనుభవాలు ఎదురయ్యాయి. ఇక పబ్ టైమింగ్స్ పూర్తయ్యాక నేను బయట కూర్చుని పేపర్ వర్క్ చేసుకుంటుంటే ఫర్నిచర్‌ను కదిలిస్తున్నట్లు శబ్దాలు వినిపిస్తాయి. వెళ్లి చూడగానే శబ్దాలు ఆగిపోయేవి’’ అని తెలిపాడు. -
'ఘోస్ట్'గా కింగ్ నాగార్జున.. ఫస్ట్‌లుక్ అవుట్
అక్కినేని నాగార్జున హీరోగా డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం(ఆగస్టు29)న నాగార్జున బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌తో పాటు నాగార్జున ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేశారు. ఫాంటసీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'ఘోస్ట్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వర్షంలో కత్తి పట్టుకొని ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ప్యాక్ లుక్‌లో నాగార్జున కనిపిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీలుక్‌తో పాటు పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది. ఈ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న విదేశీ బ్యాడ్డీలు, లండన్ ల్యాండ్‌స్కేప్ పిక్‌లు హైలెట్‌గా కనిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించనుంది.. చదవండి : Raj Tarun: నాగార్జున చేతుల మీదుగా రాజ్ తరుణ్ మూవీ ఫస్ట్‌లుక్ అందుకే నాగార్జున పరిశ్రమలో స్పెషల్ వన్! -
‘మైఖేల్ జాక్సన్ దెయ్యంలా మారి నన్ను పెళ్లి చేసుకున్నాడు’
లండన్: ఆత్మ, పునర్జన్మ, దెయ్యాలు వంటి అంశాలకు ముగింపు దొరకడం కష్టం. ఇక సెలబ్రిటీలు చనిపోయినప్పుడు పలువురు.. వారి ఆత్మలు తమతో మాట్లాడుతున్నాయని.. వారు తమకు కనిపిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ మహిళ సంచలన వ్యాఖ్యలు చేసింది. దెయ్యంగా మారిన మైఖేల్ జాక్సన్ తనను పెళ్లి చేసుకున్నాడని.. తన శరీరంలో ప్రవేశించి డ్యాన్స్ చేయడం, తినడం, పాటలు పాడటం వంటి పనులు చేస్తున్నాడని తెలిపింది. మైఖేల్ జాక్సన్ ఆత్మ తన శరీరంతో శృంగారం తప్ప అని పనులు చేస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. ఆ వివరాలు.. యూకేకు చెందిన కాథ్లీన్ రాబర్ట్స్ అనే మహిళ తాను మార్లీన్ మన్రో పునర్జన్మ అని.. అంతే కాక దెయ్యంగా మారిన మైఖేల్ జాక్సన్ తనను పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. ఈ విషయాలన్నింటిని కాథ్లీన్ గతేడాది ఓ న్యూస్ పేపర్లో ప్రచురించడంతో ఇవి వెలుగులోకి వచ్చాయి. దానిలో ఆమె ‘‘అతీతశక్తులకు సంబంధించి నా అనుభవాలను మీతో పంచుకోవలనుకుంటున్నాను. నేను దెయ్యంతో నివసిస్తున్నాను. ఆ దెయ్యం గురించి భూమ్మీద అందరికి తెలుసు. అది మైఖేల్ జాక్సన్’’ అని తెలిపింది. మైఖేల్ అనుక్షణంతో నాతోనే ఉంటాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడకు వస్తాడు.. ఆఖరికి రెస్ట్రూమ్కు కూడా నాతో పాటు వస్తాడు. మా ఇద్దరి మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధ క్షణాలను అతడు టాయిలెట్రైస్ అని పిలుస్తాడు. మైఖేల్ నాతో చాలా విషయాలు మాట్లాడతాడు. టీవీల్లో మనం చూసే మైఖేల్ జాక్సన్ చాలా సిగ్గుపడుతూ ఉంటాడు. కానీ నాలో ఉన్న మైఖేల్ జాక్సన్ అందుకు పూర్తి భిన్నంగా ఉంటాడు’’ అని తెలిపారు. ‘‘మైఖేల్ జాక్సన్ నాలో ఉండి విశ్రాంతి తీసుకుంటాడు.. నా శరీరంలో ఉండి ఎంజాయ్ చేస్తుంటాడు. ఓ భర్తలా నాతో మాట్లాడతాడు. తనకు కుకీస్ అంటే చాలా ఇష్టం. నాలో ఉండి వాటిని తింటాడు. తను నా శరీరంతో అన్ని పనులు చేస్తాడు. శృంగారం మాత్రం చేయడు. నేను ప్రయత్నిస్తే.. సాలీడు నీడ, శవాల ఆకారాలతో నన్ను భయపెడతాడు. నేను చేసే తప్పులను ఎత్తి చూపుతాడు’’ అని తెలిపింది. ఇక మైఖేల్ జాక్సన్ 2009లో జూన్ 25న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. -
జిమ్‌లో ‘దెయ్యం’.. కాలు పట్టుకుని మరీ లాక్కెళ్లింది
దెయ్యాలు ఉన్నాయా.. లేవా.. అనే విషయం మీద ఎప్పటికి చర్చలు నడుస్తూనే ఉంటాయి. చాలా మంది దెయ్యాలున్నాయని విశ్వసిస్తే.. కొందరు మాత్రం అదంతా ఉట్టిదే అని కొట్టిపారేస్తారు. ఇక ఇంటర్నెట్లో దెయ్యాలకు సంబంధించిన వీడియోలు కోకొల్లలు. అయితే వీటిలో చాలా మటుకు ఫేక్ వీడియోలే అని మనం గుర్తించగలం. కానీ కొన్ని వీడియోలుంటాయి.. ఎంతటి ధైర్యవంతులైనా సరే.. వాటిని చూస్తే.. దడుసుకోవాల్సిందే. ఈ తరహాకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఎక్సర్సైజ్ చేసుకుందామని జిమ్‌కు వచ్చిన వ్యక్తిని ‘దెయ్యం’ పరుగులు పెట్టించింది. కాలు పట్లుకుమని లాక్కెళ్లింది. ఆ వివరాలు.. టిక్‌టాక్ యూజర్ @carlosruizoficial పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పటికే 12 మిలియన్లకు పైగా వ్యూస్‌తో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిలో జిమ్‌కు వెళ్లిన ఓ వ్యక్తిని అదృశ్య శక్తి ఫ్లోర్ అంతటా లాగుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఎక్సర్సైజ్ కోసం ఓ వ్యక్తి జిమ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో జిమ్‌లో అతనొక్కడే ఉన్నాడు. ఇక అతడు వామప్ చేసుకుంటూ ఉండగా.. అతడి వెనక ఉన్న కొన్ని జిమ్ పరికరాలు వాటంతట అవే కదులుంతుంటాయి. మొదట ఆ వ్యక్తి దాన్ని పెద్దగా పట్టించుకోడు. ఆ తర్వాత మరి కొన్ని పరికరాలు అలానే అసాధారణ రీతిలో కదలడం మొదలవుతుంది. వీటన్నింటిని గమనించిన సదరు వ్యక్తి అక్కడ ఏదో అదృశ్య శక్తి ఉందని భావించి... బయటకు వెళ్లాలని అనుకుంటాడు. ఇక తనతో పాటు తీసుకువచ్చిన వస్తువులు తీసుకుని బయటకు వెళ్తుండగా.. సడెన్‌గా కిందపడతాడు. ఆ తర్వాత ఉన్నట్టుండి అతడి కాలు గాల్లోకి లేస్తుంది. ఆ తర్వాత ఎవరో అతడి కాలు పట్టి జిమ్ ఫ్లోర్ మీద కొంత దూరం ఈడ్చుకెళ్లినట్లు కనిపిస్తుంది. కానీ అక్కడ ఎవరు కనిపించరు. వదిలేయగానే.. ఆ వ్యక్తి కాలుకు పని చెప్పి.. అక్కడ నుంచి బయటకు పరిగెత్తాడు. ఈ వీడియోపై నెటిజనులు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు కావాలనే ఇలాంటి స్టంట్లు చేశారు.. అక్కడ దెయ్యం లేదు పాడు లేదు అంటుండగా.. మరి కొందరు దెయ్యం కూడా జిమ్ చేద్దామని వచ్చి ఉంటుంది.. అతడు అక్కడే ఉండటం దానికి నచ్చలేదేమో.. అందుకు ఇలా బయటకు గెంటేసింది అని కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. -
ఆ ఇంట్లో సంకెళ్ల దెయ్యం.. రాత్రయితే..
సాక్షి, వెబ్‌డెస్క్: దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయా.. లేవా.. అన్న సంగతి పక్కన పెడితే.. చిన్న తనంలో మనం విన్న కథల్లో దెయ్య కథలది ఓ ప్రత్యేక స్థానం. పెద్దలు, స్నేహితులు దెయ్యం కథలు చెబుతున్నపుడు భయపడుతూ వినేవాళ్లం. ఆ రాత్రి వాటిని గుర్తుకు తెచ్చుకుని విపరీతంగా భయపడి సరిగా నిద్రకూడా పోయేవాళ్లం కాదు. ‘ఇంకోసారి దెయ్యం కథలు వినకూడదు బాబోయ్’ అని ఆ రాత్రే తీర్మానం కూడా చేసుకునేవాళ్లం. అయితే, మళ్లీ దెయ్యం కథలు వినడానికి తీరుకునేవాళ్లం. దెయ్యం కథల మీద ఆసక్తి మనల్ని దెయ్యం పట్టినట్లు పట్టి పీడించేది మరి. ప్రాంతాల వారీగా కొన్ని దెయ్యం కథలు బాగా ప్రచారంలో ఉండేవి. కొందరు కొన్నింటిని తమ ఇంట్లో వారికి.. తమకే జరిగినట్లుగా పిల్లలకు చెప్పేవారు. గీకుర మల్లయ్య.. దెయ్యం కొంప.. మేక దెయ్యం లాంటి కథలు ఒక్క మనదగ్గరే కాదు ప్రపంచ నలుమూలలా ప్రచారంలో ఉన్నాయి. అలాంటిదే సంకెళ్ల దెయ్యం కథ.. ప్రాచీన ఏథెన్స్లో ప్రచారంలో ఉండిన సంకెళ్ల దెయ్యం కథ : ప్రాచీన ఏథెన్స్ నగరంలో ఓ పాడు బడ్డ ఇళ్లు ఉండేది. ఆ ఇంట్లో దెయ్యం తిరుగుతోందనే కథ ప్రచారంలో ఉండటంతో అక్కడ ఉండటానికి జనం భయపడేవారు. అయితే, ఈ విషయం తెలియని ఓ వ్యక్తి ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. కుటుంబంతో కలిసి ఆ ఇంటిలోకి చేరాడు. ఆ రోజు రాత్రినుంచి ఇంటి సభ్యులకు గొలుసుల చప్పుడు వినపడసాగింది. ఆ చప్పుడు చాలా భయంకరంగా ఉండేది. గొలుసుల శబ్ధానికి మేలుకున్న వారికి మసి కొట్టుకుపోయి, చిరిగిన దుస్తులు వేసుకున్న గడ్డం వ్యక్తి ఇంట్లో తిరుగుతూ కనిపించేవాడు. సంకెళ్లతో ఉన్న ఆవ్యక్తి ఇంటి సభ్యుల దగ్గరకు వచ్చి, తనను సంకెళ్లనుంచి విముక్తున్ని చేయాలని ప్రాథేయపడేవాడు. ఆ వ్యక్తి ప్రతి రోజు రాత్రి అలా సంకెళ్లతో వచ్చి కుటుంబసభ్యులను ప్రాథేయపడుతుంటంతో వాళ్లు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆ సంకెళ్ల వ్యక్తి ఎవ్వరికీ కనిపించలేదు. ఎవరైనా ఆ ఇంట్లో దిగితే వారికి మాత్రమే కనిపించేవాడు. తనను సంకెళ్లనుంచి విముక్తున్ని చేయమని ప్రాథేయపడేవాడు. ఈ దెయ్యం కథను విన్న ‘‘అథెనోడొరస్’’ అనే వ్యక్తి ఆ ఇంట్లో దిగాడు. ఆ ఇంట్లో ఏ దెయ్యమూ లేదని నిరూపించటం అతడి ఉద్ధేశ్యం. అయితే, అతడి ఆలోచనలను తలకిందులుచేస్తూ ప్రతి రోజు రాత్రి ఇంటి బయటినుంచి సంకెళ్ల చప్పుడు వినపడేది. తనను సంకెళ్లనుంచి విముక్తుని చేయమని ఓ వ్యక్తి మాటలు కూడా వినపడేవి. ఓ రోజు రాత్రి అథెనోడొరస్ ధైర్యం తెచ్చుకుని శబ్ధం వస్తున్న వైపు వెళ్లాడు. అలా ఆ శబ్ధాన్ని ఫాలో అవుతూ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలోకి వచ్చాడు. అక్కడ ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతడి కాళ్లు భూమిలో కూరుకుపోయి ఉన్నాయి. అథెనో అక్కడికి రాగానే ఆ వ్యక్తి తనను సంకెళ్లనుంచి బయటకు విడిపించమని ప్రాథేయపడ్డాడు. కొన్ని నిమిషాల తర్వాత మాయమయ్యాడు. ఉదయం కాగానే అథెనో సంకెళ్ల మనిషి నిలబడ్డ చోటుని తవ్వాడు. అక్కడో కుళ్లిన శవం బయటపడింది. రాత్రి చూసిన విధంగా ఆ శవం సంకెళ్లతో బంధించి ఉంది. అథెనో సంకెళ్లను తీసి, ప్రజలతో కలిసి శవానికి దహన సంస్కారాలు నిర్వహించాడు. ఆ తర్వాత ఎవ్వరికీ ఆ సంకెళ్ల దెయ్యం మళ్లీ కనిపించలేదు. -
ఆదివాసీ గూడేలను వణికిస్తున్న దెయ్యం భయం
-
‘దెయ్యాల గుంపు వేధిస్తుంది.. నన్ను కాపాడండి సార్’
గాంధీనగర్: దెయ్యాలున్నాయో, లేవే తెలియదు కానీ.. వాటికి సంబంధించిన వార్తల మీద జనాలకు ఎంతో ఆసక్తి. దెయ్యాలను వదిలించే బాబాలకు మన సమాజంలో ఫుల్ డిమాండ్. ఇప్పుడు ఈ దెయ్యాల గొడవ ఎందుకంటే తాజాగా గుజరాత్లో ఓ వింత సంఘటన వెలుగు చూసింది. దెయ్యాల గుంపు తనను వేధిస్తుందని.. వాటి నుంచి తన ప్రాణాలు కాపాడిల్సిందిగా ఓ వ్యక్తి ఏకంగా పోలీసులను ఆశ్రయించాడు. వింత ఫిర్యాదు చూసి పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. ఆ వివరాలు.. గుజరాత్ పంచమహల్ జిల్లా జంబుఘోడ తాలుగా హమ్లెట్ గ్రామానికి చెందిన వర్సంగ్‌భాయ్ బరియా(35) అనే వ్యక్తి మంగళవారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఓ దెయ్యాల గుంపు తనను వేధిస్తుందని.. ప్రశాంతంగా ఉడనివ్వడం లేదని తెలిపాడు. మరీ ముఖ్యంగా ఆ గ్రూపులోని రెండు దెయ్యాలు తనను చంపుతామని బెదిరిస్తున్నాయని వాపోయాడు. ఎలాగైనా తన ప్రాణం కాపాడాల్సిందిగా పోలీసులను అభ్యర్థించాడు. బరియా మాటలు, వాలకం చూసిన పోలీసులకు కాస్త తేడా కొట్టింది. దాంతో అతడిని పక్కకు కూర్చోబెట్టి.. కుటుంబ సభ్యులను పిలిచి విచారించారు. ఈ క్రమంలో బరియా మానసిక పరిస్థితి సరిగా లేదని.. గతేడాది నుంచి చికిత్స తీసుకుంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. గత పది రోజులగా మందులు తీసుకోవడం మానేశాడని.. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడని పోలీసులకు వెల్లడించారు. ఇక బరియా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. అతడికి వైద్యం అందిచాల్సిందిగా సూచించారు. చదవండి: వైరల్: ఈమె మనిషా.. దెయ్యామా?! -
వైరల్.. ఈ ఫోటోలో ‘దెయ్యం’ ఉంది..చూశారా!
ఒక్కొక్కరికీ ఒక్కో భయం ఉంటుంది. కొందరు నీళ్లు, ఎత్తైన ప్రదేశాలు, పాము ఇలా రకరకాలైన వాటిని చూసి భయంతో జంకుతారు. సాధారణంగా అధిక శాతం మందికి దెయ్యాలంటే భయం ఉంటుంది. ఇప్పటికీ అక్కడక్కడా చేతబడి, క్షుద్రపూజల నేపథ్యంలో జరిగిన నేరాల గురించి వార్తలు చూస్తూనే ఉన్నాం. అయితే దెయ్యాలపై పరిశోధనలు చేసేవారు దెయ్యాలు ఉన్నాయని కొన్ని రకాల ఆధారాలు చూపిస్తుంటారు. కానీ అవన్నీ వాస్తవానికి దగ్గగరా ఉండవు. అందుకే నేటికి సైతం దెయ్యం అంటే నమ్మని, నమ్మే వాళ్ల చర్చ జరుగుతూనే ఉంది. ఇక సోషల్ మీడియా డెవలప్ అయ్యాక ఈ దెయ్యాల గురించి తెలుసుకోవాళ్లన్న ఆసక్తి ఎక్కువవుతోంది. తాజాగా యునైటెడ్ కింగ్డమ్కు చెందిన రెబెకా గ్లాస్‌బరో మహిళ కొన్ని నెలల క్రితం తన ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసి స్నేహితులతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసింది. తమ ఆనందాలను బంధించేందుకు గుర్తుగా ఫోటోలు కూడా తీసుకున్నారు. తరువాత ఓ రోజు పార్టీలో దిగిన ఫోటోలు చూసుకుంటే అందులో అందరికంటే వెనకాల మరో ముఖం కనిపిస్తోంది. ముక్కు, కళ్లు, నోరు, జుట్టు ఉండి అచ్చం ఓ అమ్మాయి రూపం కంటపడింది. ఫోటో చూస్తుంటే నిజంగానే దెయ్యంలా అనిపిస్తోంది. అయితే ఈ ఘటన గతేడాది అక్టోబర్‌లో చోటుచేసుకోగా ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం వైరలవుతోంది. అయితే రెబెకా నివాసముంటున్న ఫ్లాట్‌లో ఇంతకముందు ఎవరో చనిపోయారని ప్రచారంలో ఉంది. దీంతో ఫోటోలో మరో ముఖం కనిపించడంతో తన స్నేహితులంతా ఆ ఇంట్లో క్షుణ్ణంగా పరిశీలించారు. కానీ అక్కడ వాళ్లకు ఏం కనిపించలేదు. ఈ సంఘటన జరిగిప్పటి నుంచి సదరు యువతికి భయంతో అప్పటి నుంచి నిద్ర పట్టడం లేదు. ఇక ఈ విషయం నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. "ఇది మీ వెన్నెముకకు వణుకు పుట్టించే ఫోటో. నిజంగా చాలా భయానకంగా ఉంది. ఓహ్ అది ఏమిటి. చాలా విచిత్రంగా ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఇది నిజం కాదని కొట్టి పారేస్తున్నారు. చదవండి: వైరల్: దుస్తులు చించేసి, మరీ ఘోరంగా.. వైరల్: ఈమె మనిషా.. దెయ్యామా?! -
వైరల్: ఈమె మనిషా.. దెయ్యామా?!
జాగ్రెబ్(క్రొయేషియా): దెయ్యాలు, భూతాలు అంటే నమ్మకం లేని వారు ఎందరు ఉన్నారో.. వాటి ఉనికిని విశ్వసించే వారు కూడా అంతకంటే ఎక్కువ మందే ఉంటారు లోకంలో. దెయ్యాలకు సంబంధించిన వార్తలు, వీడియోలకు చాలా క్రేజ్. చాలా మంది భయపడుతూ మరి వాటిని చూస్తారు. ఇక నెట్టింట్లో దెయ్యాల ఉనికికి సంబంధించిన వీడియోలు కోకొల్లలు. వీటిలో చాలా మటుకు ట్రిక్స్ ఉపయోగించి క్రియేట్ చేసిన వీడియోలే. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే తాజాగా ఓ మహిళ ఫోటో ఇంటర్నెట్‌ని హడలెత్తిస్తుంది. చాలా మంది ఇమె మనిషి కాదు దెయ్యం అంటుండగా.. కొందరు మాత్రం.. కెమరా ట్రిక్ అని కొట్టి పారేస్తున్నారు. ఇంతకు ఈ ఫోటో కథ ఏంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే.. క్రొయేషియాకు చెందిన ఇవాన్ రుబిల్ టూర్ గైడ్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం జాగ్రేబ్ బస్టాప్ వద్ద నిలుచున్న ప్రయాణికులను తన ఫోన్ కెమేరాతో ఫొటో తీశాడు. ఆ ఫొటో చూసేందుకు చాలా సాధారణంగానే ఉంది. దీనిలో ఇద్దరు నన్‌లు, బ్రౌన్ కలర్ కోటు ధరించిన ఓ మహిళ ఉన్నారు. ఇక ఈ ఫోటోని పరిశీలనగా చూస్తే.. అందులో బ్రౌన్ కోటు వేసుకున్న మహిళ కాళ్లను చూడగానే ఒక్కసారిగా వెన్నులో వణకు పుడుతుంది. ఎందుకంటే.. ఈ ఫోటోలో ఆమె కాళ్లు పారదర్శకంగా ఉన్నాయి. బస్టాప్‌లో ఉన్న తెల్ల గీత సైతం ఆమె కాళ్ల నుంచి వెళ్లినట్లు కనిపిస్తోంది. దాంతో ఇవాన్ ఆ ఫొటోను రెండు మూడుసార్లు పరిశీలనగా చూశాడు. ఈ ఫొటోను అతడి స్నేహితులకు షేర్ చేశాడట. వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు మాత్రం ‘‘అది నీ కెమేరా ట్రిక్ కాబోలు’’ అని కొట్టిపడేశారట. అనంతరం ఆ ఫొటోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్టు చేశాడు ఇవాన్. ఇక ఈ ఫోటో చూసిన వాళ్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ‘‘నీ ఫొటోలో దెయ్యం ఉంది’’ అంటే.. చాలామంది మాత్రం ‘‘నీ కెమేరాలో ఏదో సమస్య ఉంది చెక్ చేసుకో’’ అంటూ కామెంట్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఇవాన్ మాట్లాడుతూ.. ‘‘నా ఫోన్ కెమేరాలో ఏదైనా సమస్య ఉందేమోనని భావించి మిగతా ఫొటోలను కూడా చెక్ చేశాను. కానీ, ఆ ఫొటో మాత్రమే అలా వచ్చింది. బహుశా వారు చెప్పేది కూడా నిజమే కావచ్చు. నా కెమేరాలో సమస్య వల్లే ఆ ఫొటో అలా వచ్చిందేమో’’ అని తెలిపాడు. ఏది ఏమైనా ఈ ఫోటో మరోసారి దెయ్యాల ప్రస్తావను తెరమీదకు తెచ్చింది. చిత్రం ఏమిటంటే ఇవాన్‌కు హాంటెడ్ సిటీలంటే ఇష్టమట. అతడు చాలాసార్లు ఆయా ప్రాంతాలను సందర్శించాడు. కానీ, ఎక్కడా అతడికి దెయ్యం జాడ కనిపించలేదట. అందుకే ఆ ఫొటోను చూడగానే అతడు అంత ఆశ్చర్యపోయాడు. ఇక సదరు మహిళ కాళ్లు అంత పారదర్శకంగా కనిపించడానికి కారణం ఏమిటో ఎవరు చెప్పలేకపోతున్నారు. చదవండి: ప్రాంక్ కాదు, అక్కడ నిజంగానే దెయ్యం! -
అవునంటారా? దెయ్యంగారేనంటారా!
అనగనగా లాస్ వేగస్‌లో (యూఎస్)లో ఒక బామ్మ. ఈ బామ్మకు ఒక కొడుకు. అతడికి ఇద్దరు పిల్లలు. ఇప్పటివరకు బానే ఉంది. అయితే బామ్మ మనవడు, మనవరాలు తమ గదిలో అర్ధరాత్రి దాటిన తరువాత నిద్రలోనే ఎవరితోనో మాట్లాడుతున్నారట. మొదట కల కావచ్చు అనుకున్నారట. కానీ పదే పదే పిల్లలు నిద్రలో మాట్లాడుతుండడంతో ఆ గదిలో మోషన్ యాక్టివేటెడ్ కెమెరాను సెట్ చేశారు. రెండు మూడురోజుల తరువాత ఈ కెమెరాను పరిశీలించగా తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఒక ఆకారం కనిపించింది. పిల్లలు ఎవరో ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నట్లే మాట్లాడుతున్నారట గానీ భయపడడం లేదట. ఒకరోజు అయితే ఈ ఆకారం ‘బయటికి వెళ్లండి’ అని పిల్లలను గట్టిగా గద్దించిందట. బామ్మ ఈ అనుభవాన్ని ఫొటోతో సహా ఫేస్బుక్లో షేర్ చేసింది. సలహా ఇవ్వమని అడిగింది. ‘మూఢనమ్మకాలను వదలండీ’ ‘మీరేదో భ్రమల్లో ఉన్నారు’ ‘ఫేక్ ఇమేజ్’ లాంటి తిట్లతో పాటు– ‘ఇల్లు అమ్మేసి వేరే ఇంట్లోకి మారండి. 20 సంవత్సరాల ఇంట్లోకి దెయ్యాలు రావడం కొత్తేమీ కాదు’ లాంటి సలహాలు కూడా వచ్చాయి. ఒక ఆకారం ఏదో కనిపిస్తున్న ఫొటో గురించి ప్రస్తావన వస్తే–‘ఫేక్ ఫొటోలు సృష్టించే టెక్నికల్ నాలెడ్జ్ నాకు లేదని ఎవరిని అడిగినా చెబుతారు. పబ్లిసిటీ కోసం పాకులాడాల్సిన ఖర్మ నాకేమిటి!’ అంటోంది బామ్మ. నిజం దెయ్యమెరుగు! చదవండి: విమానంలో పిచ్చి చేష్టలు.. 20 ఏళ్ల జైలు, 2 కోట్ల జరిమానా! -
దెయ్యం కోసం వెళితే పుర్రె కనపడింది
లండన్ : దెయ్యాలు ఉన్నాయా? లేవా? అన్న సంగతి పక్కన పెడితే.. వాటి పెరు చెప్పుకుని లాభపడేవాళ్లు మాత్రం చాలా మందే ఉన్నారు. దెయ్యాలను చూశామని, ఆత్మలతో మాట్లాడతామని చెప్పుకుంటూ తమ అనుభవాలను క్యాష్ చేసుకునేవాళ్లు కూడా లేకపోలేదు. మరికొంతమంది ఓ అడుగు ముందు కేసి లైవ్‌లో దెయ్యాల్ని చూపెడతామంటూ వీడియోలతో హల్చల్ చేస్తుంటారు. ఉన్నవీ లేనివి చెప్పి.. అయినవి,కానివి చూపించి జనాలను భయపెడుతుంటారు.. కొన్ని కొన్నిసార్లు జనాల ఆగ్రహానికి గురవుతుంటారు. తాజాగా ఇంగ్లాండ్‌కు చెందిన ఓ జంట కూడా దెయ్యాల్ని అన్వేషించే వేటలో నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్, గ్రేటర్ మాంచెస్టర్‌లోని బోల్టన్‌కు చెందిన దెయ్యాలను అన్వేషించే డ్యానీ డఫ్పీ దంపతుల జంటకు యూట్యూబ్‌లో 1,50,000వేల మంది సబ్ స్రైబర్లు ఉన్నారు. ఈ దంపతులు తరచూ గోస్ట్ హంటింగ్( దెయ్యాలను అన్వేషించటం) పేరిట వీడియోలు తీసి తమ యూట్యూబ్ ఛానల్లో ఉంచుతుంటారు. సోమవారం అర్థరాత్రి బోల్టన్‌కు సమీపంలోని ఓ చిట్టడవి ప్రాంతంలోకి గోస్ట్ హంటింగ్ కోసం వెళ్లారు. చెట్ల మధ్య దెయ్యాల కోసం అన్వేషిస్తుండగా నేలపై ఆకుల మధ్య ఓ పుర్రె దర్శనమిచ్చింది. దాన్ని చేతుల్లోకి తీసుకున్న డ్యానీ మూడు నిమిషాల పాటు పుర్రెగురించి సుత్తి మాట్లాడాడు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరకున్న పోలీసులు అ పుర్రెను స్వాధీనం చేసుకున్నారు. చేతిలో పర్రెతో డ్యానీ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ పుర్రె ఎవరిది? అక్కడికి ఎలా వచ్చింది? ఆ వ్యక్తి మరణానికి కారణం ఏంటి? అన్న కోణాలలో దర్యాప్తు ప్రారంభించారు. తాము సాధించిన ఘన కార్యానికి సంబంధించిన వీడియోను డ్యానీ తన యూట్యూబ్ ఛానల్లో విడుదల చేయగా.. నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘‘పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పుర్రెను ఎలా చేత్తో పట్టుకుంటావు’’.. ‘‘మీరు క్రైం సీన్‌ను డిస్ట్రబ్ చేశారు’’.. ‘‘ఎందుకు నువ్వు దాన్ని పట్టుకున్నావు.. ముట్టుకోకుండానే అది పుర్రె అని చెప్పొచ్చు..’’ అంటూ మండిపడుతున్నారు. -
ఇంట్లో దెయ్యం.. కాలనీ మొత్తం ఖాళీ
సాక్షి, తరిగొప్పుల: దెయ్యం తిరుగుతోందన్న భయంతో బేడ, బుడగజంగాల ప్రజలు తాముంటున్న కాలనీని ఖాళీ చేసి వలస పోయారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని పోతారం గ్రామంలో ఇలా సుమారు 40 కుటుంబాలు కాలనీని విడిచిపెట్టి పోవడంతో ఇప్పుడా కాలనీ పూర్తి నిర్మానుష్యంగా మారిపోయింది. పదేళ్లుగా కాలనీలో నిరుపయోగంగా ఉన్న ఓ పాడుబడిన భవనంలో రాత్రిళ్లు దెయ్యం తిరుగుతోందని, ఓ మహిళ నగ్నంగా బోనం ఎత్తుకుని నృత్యం చేస్తోందని కాలనీ వాసులు నమ్ముతున్నారు. వరుస మరణాలతో ఆందోళన.. బేడ బుడగ జంగాల కాలనీలో అన్నదమ్ములు చింతల భాను, చింతల బాలరాజు గతేడాది అక్టోబర్‌లో వారం వ్యవధిలోనే మరణించారు. అదే కాలనీకి చెందిన గంధం రాజు తాజాగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ మరణాలకు చేతబడి, దెయ్యమే కారణమని కాలనీవాసులు నమ్మడంతో ఒక్కొక్కరుగా వలస వెళ్లిపోతుండటంతో మంగళవారానికి కాలనీ పూర్తిగా ఖాళీ అయింది. ఇక కాలనీకి చెందిన గంధం శేఖర్ అనే వ్యక్తి మాట్లాడుతూ..తమ కాలనీలో యువకులు మాత్రమే చనిపోతున్నారని, ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఆస్పత్రికి తీసుకెళ్తే రిపోర్టుల్లో ఏమీ లేదంటున్నారని తెలిపారు. దీంతో భయం వేసి కాలనీని వదిలి మండల కేంద్రానికి వెళ్లి గుడిసెలు వేసుకుంటున్నట్లు వివరించారు. ►పోలీసులు, కళాజాత బృందం ఆధ్వర్యంలో దెయ్యం, భూతం లేదని అవగాహన కల్పించినా ఎవరూ నమ్మడం లేదు. వేరేచోట స్థలం కేటాయిస్తామని చెప్పినా ఎవరూ వినట్లేదు. –ఎండబట్ల అంజమ్మ, గ్రామ సర్పంచ్ -
బర్త్‌డే పార్టీలో దెయ్యం.. వీడియో వైరల్
బెంగళూరు: బర్త్‌డే పార్టీ అంటే సాధారణంగా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, బంధువులు హాజరవుతారు. కానీ రాయ్‌చూర్‌లో జరిగిన ఓ బర్త్‌డే పార్టీకి అనుకోని అతిథి వచ్చింది. ఇలా వచ్చి అలా మెరుపుతీగలా మాయమైన ఈ అతిథి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఎవరా గెస్ట్ అనుకుంటున్నారా.. దెయ్యం. వినగానే కాస్త భయం వేసినా ఇది మాత్రం వాస్తవం. పైగా వీడియో కూడా ఉంది. ఆ వివరాలు.. రాయ్‌చూర్‌లో ఓ వ్యక్తి పుట్టిన రోజు వేడుకను వెరైటీగా పెట్రోల్ బంక్‌లో ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్ అంతా వచ్చి.. కేక్ కట్ చేసి బర్త్‌డే బాయ్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మిగతా స్నేహితులు దీన్ని వీడియో తీసే పనిలో ఉన్నారు. యువకులంతా ఇలా ఎంజాయ్ చేస్తుండగా.. ఉన్నట్టుండి వీరి వెనక నుంచి ఓ ఆకారం పరిగెత్తడం వీడియోలో క్లియర్‌గా కనిపిస్తుంది. యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీన్ని చూసిన నెటిజనులు ‘‘ఇదంతా ట్రిక్, ఆత్మ కాదు పాడు కాదు.. పొగ అలా కనిపించింది’’ అని కామెంట్ చేస్తున్నారు. (చదవండి: ప్రాంక్ కాదు, అక్కడ నిజంగానే దెయ్యం!) -
ప్రాంక్ కాదు, అక్కడ నిజంగానే దెయ్యం!
చిన్నప్పుడు ఓ పాట పాడుకునేవాళ్లం.. చెట్టు మీద దెయ్యం, నాకేం భయ్యం అని! అలా పాడతామే కానీ రాత్రి పూట మర్రి చెట్టు కింద కూర్చోవాలంటే వెన్నులో నుంచి వణుకు పుడుతుంది. కొందరైతే పగటి పూట కూడా దెయ్యాలను గుర్తు చేసుకుని మరీ తెగ భయపడిపోతుంటారు. ఏ చిన్న అలికిడి వినిపించినా అదేదో ప్రేతం పనే అని భయంతో బిగుసుకుపోతుంటారు. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఓ వ్యక్తి తన గదిలో తన పని చేసుకుంటుంటే అకస్మాత్తుగా శబ్ధాలు వినిపించాయి. ఆ సమయంలో అతడు తప్ప అక్కడ మరెవరూ లేరు. దీంతో ఇది ప్రాంక్ కాదని అతడికి అర్థమైంది. వింత శబ్ధాలతో గుండె బేజారు మరోవైపు కిచెన్‌లో నళ్లా విప్పినట్లుగా కొన్ని చిత్రవిచిత్ర శబ్దాలు రావడంతో గట్టిగా కొట్టుకుంటున్న అతడి గుండె చప్పుడు అతడికే భయాన్ని కలిగించేట్లుగా కొట్టుకుంది. ఏదో శబ్ధం అతడి గదిని సమీపించినట్లు రావడంతో వెంటనే బ్యాగు సర్దుకుని అక్కడి నుంచి పరారయ్యేందుకు రెడీ అయ్యాడు. అయితే ఒక్క క్షణం కిచెన్ గది తలుపు దగ్గర ఏముందో చూడాలన్న కుతూహలం పుట్టింది. వెంటనే వెనక్కు తిరిగి ఫొటో క్లిక్‌మనిపించి అక్కడ నుంచి జారుకున్నాడు. (చదవండి: ఒంటరిగా మహిళ డ్యాన్స్.. తర్వాత ఏమైందంటే) తలుపు చాటున ఏదో ఉంది! తర్వాత దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఈ ఫొటోను పైపైన చూసిన జనాలు అక్కడేమీ లేదని కొట్టిపారేశారు. కానీ జూమ్ చేసిన క్షణం వారి గుండెలదిరి పడ్డాయి. నిజంగానే తలుపు చాటునుంచి ఏదో తొంగి చూస్తున్నట్లు అస్పష్టంగా కనిపిస్తోంది. అది దెయ్యమేనని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొద్ది సేపు అక్కడే ఉంటే ఏంజరిగేదో తల్చుకుంటేనే భయమేస్తోందని కామెంట్లు చేస్తున్నారు. అయినా అంతటి భయంలోనూ ధైర్యం చేసి దెయ్యాన్ని ఫొటో తీయడం మామూలు విషయం కాదని మెచ్చుకుంటున్నారు. మొత్తానికి ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. (చదవండి: ‘దెయ్యాల పనే అంటారా?!’) -
బిగ్‌బాస్‌లోకి కొత్త అతిథి.. జడుసుకున్న బోల్డ్ గర్ల్
తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్ నాల్గో సీజన్ ముంగింపు దశకు వచ్చింది. షో ముగింపునకు మరో 25 రోజులు మాత్రమే ఉండటంతో మిగిలిన ఎపిసోడ్స్‌ని మరింత రసవత్తంగా తిర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు బిగ్‌బాస్ నిర్వాహకులు. కొత్త కొత్త గేమ్‌లు, కొత్త తరహా టాస్క్‌లను ప్రవేశపెట్టి మరింత వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియ కూడా కాస్త వెరైటీగా నిర్వహించారు. శవాల పేటికలను తీసుకురావడం, అలాగే ఎవిక్షన్ ఫ్రీ పాస్ తీసుకొచ్చి పొలిటికల్ తరహాలో అవినాష్, అఖిల్‌తో ప్రచార సందడి చేయించారు. ఇలా ప్రతి రోజు ఏదోఒక కొత్తదనాన్ని చూపిస్తున్నారు. ఇక బుధవారం ఎపిసోడ్ లో బిగ్‌బాస్ హౌస్‌లోకి ఓ అతిథిని పంపి అందరిని భయపెట్టే ప్రయత్నం చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా కొన్ని కొత్త తరహా సెట్స్ ని యాడ్ వేశారు. ఇంట్లోకి దెయ్యాన్ని పంపి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే హౌజ్ మెంట్స్ ని భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇక ఇంట్లో దెయ్యాన్ని చూసి అందరి కంటే బోల్డ్ గర్ల్ అరియానానే ఎక్కువగా భయపడింది. దెయ్యం మొదటగా అరియానాకే కనిపించడంతో భయంతో బిగ్గరగా అరుస్తూ పరుగులు తీసింది. ఇక సోహైల్ అయితే నేను భయపడేదిలేదంటూ కౌంటర్ ఇచ్చాడు. అరియానా భయంతో వణికిపోతుంటే.. హారిక మాత్రం ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది. ప్రతి దానికి భయపడితే వాళ్ళు నీ మీదనే ఫోకస్ చేసి ఇంకా భయపెడతారని చెప్పింది. అందుకు అరియానా నేను ఏమి భయపడటం లేదని చెప్పడంతో.. హారిక పీకినవ్ తీయ్ అంటూ మరో కౌంటర్ ఇచ్చింది.ఇక సోహైల్ అయితే కెమెరా ముందుకు చూస్తూ ‘హలో దెయ్యం ఎక్కడున్నావ్ అంటూ.. భయపడతారు అనుకుంటున్నారా? అలా రాత్రి మాత్రం రాకండి ’ అంటూ తనదైన శైలీలో కామెడీ పంచ్ వేశాడు. (చదవండి : నువ్వు మా నాన్నకు నచ్చావంటే..: అభిజిత్) ఇక ఈ రోజు ఎపిసోడ్లో అవినాష్ కామెడీ హైలెట్ కాబోతున్నట్టు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే తెలుస్తోంది. దెయ్యం గురించి హారిక అవినాష్‌తో మాట్లాడుతూ.. ఆ మిర్రర్ లో నుంచి రెండు పెద్ద చేతులు వచ్చి నిన్ను లోపలికి గుంజుకపోవాలి అని అనగా.. లాక్ రాగానే రెండు చేతులకు నేయిల్ పాలిష్ పెట్టేస్తానని అవినాష్ పంచ్ వేశాడు. అలాగే చంద్రముఖి డైలాగ్ చెప్పి అందరిని నవ్వించాడు. నేను వెంకటపతి రాజా ఈ దుర్గాష్టమికి నిన్ను అదే అంటూ.. అంటూ అవినాష్ చెప్పిన డైలాగ్‌కి ఇంటి సభ్యులు పగలబడి నవ్వేశారు. ఇక వెంటనే హే అవినాష్ అని ఒక లేడి దెయ్యంలా సౌండ్ వచ్చింది. అనంతరం వస్తా.. అంటూ గట్టిగా అరిచేసింది. అసలు హౌస్‌లోకి దెయ్యం ఎందుకు వచ్చింది? హౌస్‌మేట్స్‌తో దెయ్యం ఎలా ఆడుకుందో తెలియాలంటే మరికొద్ది గంటల్లో ప్రసారమయ్యే నేటి ఎపిసోడ్‌ని చూడాల్సిందే. -
గ్యాంగ్‌స్టర్ దూబే ఆత్మ : ప్రతీకారం తప్పదు!
కాన్పూర్ : గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే పోలీసు కాల్పుల్లో హతమై రెండు నెలలు పూర్తి కావస్తున్నా ఉత్తరప్రదేశ్, బిక్రూ గ్రామ ప్రజలు మాత్రం భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఒంటరిగా సంచరించాలన్నా ..ఆకు కదిలినా దూబే ఆత్మ వచ్చినట్టు గజగజ వణికిపోతున్నారు. రాత్రి అయిదంటే ఇళ్లలోకి వెళ్లి, తాళాలు వేసుకుని మరీ బతుకుజీవుడా అంటూ కాలం గడుపుతున్నారు. దూబే ఎన్కౌంటర్ తర్వాత బిక్రూ గ్రామ ప్రజలను తుపాకీ మోతల బీభత్సం ఇంకా వెంటాడుతోంది. వికాస్ భయ్యా దెయ్యమై తిరుగుతున్నాడని భ్రమపడుతున్నారు. దూబే ఆత్మ ప్రతీకారం తీర్చుకోవడం ఖాయమంటున్నారు. ఇప్పటికీ కూడా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇది అందరికీ తెలుసు కానీ దీని గురించి ఎవరూ మాట్లాడరు(ఆజ్ భీ గోలియోం కి ఆవాజ్ సునాయీ దేతి హై. సబ్ జాన్తే హై.. పర్ బోల్తా కోయి నహీ) అని గ్రామస్తులు ఆందోళనతో చెబుతున్నారు. కొంతమంది వికాస్ దెయ్యాన్ని కూడా చూశారంటూ పేరు చెప్పడానికి ఇష్టపడిన ఒక యువకుడు తెలిపాడు. భయ్యా ప్రభుత్వం కూల్చివేసిన ఇంటి శిథిలాల మీద కూర్చుని ఉండటం చూశామనీ మరొకరు తెలిపారు. అక్కడ కూర్చుని నవ్వుతూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అనిపిస్తోంది. తన మరణానికి అతడు(దూబే)ప్రతీకారం తీర్చుకుంటాడని తమకు ఖచ్చితంగా తెలుసని గ్రామానికి చెందిన మరో వృద్ధుడు చెప్పారు. అంతేకాదు అప్పుడప్పుడు ఆ ఇంటినుంచి మాటలు, మధ్య మధ్యలో నవ్వులు వినిపిస్తున్నాయని కూల్చివేసిన దూబే ఇంటి సమీపంలో నివసిస్తున్న మరో మహిళ పేర్కొంది. (‘ఇందులో ఓ పొలిటికల్ థ్రీల్లర్ పాయింట్ ఉంది’) మరోవైపు గ్రామస్తుల భయాలను, వాదనలను తోసిపుచ్చలేమని స్థానిక పూజారి చెప్పారు. అసహజ మరణాలు జరిగిన సందర్భాలలో, ఇటువంటి సంఘటనలు జరుగుతాయనీ, వికాస్ విషయంలో దహన సంస్కారాలు కూడా సక్రమంగా నిర్వహించలేదనీ ఆయన వాదిస్తున్నారు. దీనికి ప్రాయశ్చిత్తంగా సంబంధిత పూజలు చేయాలని స్థానిక పూజారిని కోరినప్పటికీ, పోలీసుల దృష్టిలో పడటం ఇష్టం లేక పూజారి దీనికి అంగీకరించలేదని గ్రామస్తులు తెలిపారు. అందుకే వికాస్ దూబే సహా, చనిపోయిన పోలీసుల ఆత్మశాంతి కోసం దసరా నవరాత్రి సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామంటున్నారు. అయితే ఎన్కౌంటర్ తర్వాత బిక్రూ గ్రామంలో విధుల్లో ఉన్న నలుగురు పోలీసులు (ఇద్దరు పురుషులు,ఇద్దరు మహిళలు) అలాంటివేమీ తాము వినలేదని, అంతా సవ్యంగానే ఉందని కొట్టి పారేశారు. కాగా గ్యాంగస్టర్, ఎనిమిది మంది పోలీసులను పొట్టన బెట్టుకున్న నేరస్థుడు వికాస్ దూబేను ఎన్కౌంటర్ లో యూపీ పోలీసులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. -
దెయ్యం విడిపిస్తానని లైంగికదాడి
కర్ణాటక,మైసూరు: దెయ్యం విడిపిస్తానని చెప్పి యువతిపై ఒక ధర్మ గురువు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మైసూరు జిల్లాలో జరిగింది. చిల్కుంద గ్రామానికి చెందిన యువతి మానసికంగా ఇబ్బంది పడుతోంది. ఆమెకు దయ్యం పట్టిందని భావించిన బంధువు... హణసూరు లాల్‌బన్ వీధికి చెందిన ధర్మగురువు జబీవుల్లా వద్దకు తీసుకొచ్చాడు. ఆమెపై మంత్ర ప్రయోగం జరిగిందని, దయ్యం పట్టుకుందని పిరియాపట్టణ దర్గా వద్దకు తీసుకొస్తే దెయ్యాన్ని విడిపిస్తానని చెప్పి వెళ్లిపోయాడు. దీంతో బంధువు ఆ యువతిని దర్గా వద్దకు తీసుకెళ్లాడు. యువతి వద్ద ఉంటే నీకూ దెయ్యం పడుతుందని బంధువును దూరంగా పంపించాడు. అనంతరం యువతికి స్నానం చేయాలనే నెపంతో తీసుకెళ్లి జబీవుల్లా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ పైశాచిక కృత్యంతో బెదిరిపోయిన యువతి జరిగిన సంగతిని తన తండ్రికి తెలిపింది. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హుణసూరు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి జబీవుల్లాను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. -
నిజంగానే అక్కడేదో ఉంది; మీకు కనిపించిందా?
-
నిజంగానే అక్కడేదో ఉంది; మీకు కనిపించిందా?
ఇప్పటికీ దయ్యాలు ఉన్నాయని నమ్మేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ కొందరు మాత్రం అసలు దయ్యమే లేదని, 5జీ యుగంలో వాటికి చోటెక్కడిదంటూ తేలికగా తీసిపారేస్తారు నేటి తరం మనుషులు. కానీ ఏదైనా మిస్టరీగా కనిపించే ఫొటోలు, వీడియోలు చూస్తే మాత్రం మానవమాత్రులకు అంతుచిక్కనిదేదో ఉందంటూ బుర్రలు బద్ధలు కొట్టుకుంటారు. కొంపతీసి దయ్యమేమో అని భయంతో బిగుసుకుపోయేవాళ్లూ లేకపోలేదు. తాజాగా ‘ఇందులో ఉన్నది ఏంటో కనుక్కోండి..’ అంటూ ఓ వ్యక్తి షేర్ చేసిన వీడియో నెటిజన్ల మేధస్సుకు పదును పెడుతోంది. కటిక చీకటి కమ్ముకున్నట్లు కనిపిస్తున్న ఈ వీడియో 20 సెకండ్ల నిడివి ఉంది. ఈ వీడియోలో ఏదో తెల్లగా కదులుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ఇది నిజమేనా అని కళ్లు పెద్దవి చేసి చూసేసరికి మరోసారి ఆ రూపం కదులుతూ వెళ్లడం గమనించవచ్చు. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇది దయ్యమే, జాగ్రత్తగా ఉండండి’ అని కొందరు, ‘ఇలాంటివి చాలా చూశాం.. ఇది తప్పకుండా ఫేక్’ అని మరికొందరు వారి అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ‘అది కెమెరా జిమ్మిక్కు’ అని తేలికగా తీసిపారేశాడో వ్యక్తి. ‘నిజంగానే అక్కడేదో ఉంది.. ఈ విషయం జీర్ణించుకోడానికి కష్టంగా ఉన్నా నమ్మి తీరాల్సిందే’నంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మరి మీరేం అంటారు. -
రోడ్డుపై దెయ్యాలు.. పోలీసుల రంగప్రవేశం
-
రోడ్డుపై దెయ్యాలు.. పోలీసుల రంగప్రవేశం
బెంగళూరు: దెయ్యాల్లాగా వేషాలు వేసుకుని ప్రాంక్ వీడియో చేసిన యువకులకు దెబ్బకు దేవుడు గుర్తొచ్చిన ఘటన బెంగళూరులో జరిగింది. పక్కవాళ్లను భయపెట్టి పాపులారిటీ సంపాదించుకుందాం అనుకున్నవాళ్లు చివరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి వార్తల్లో నిలిచారు. వివరాలు.. కుకీ పీడియా అనే యూట్యూబ్ చానెల్ నిర్వాహకులు ఓ ప్రాంక్ వీడియో చేద్దామని భావించారు. ఇందుకోసం షరీఫ్‌నగర్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ప్రాంక్ వీడియో కోసం.. ఏడుగురు.. దెయ్యాల్లా వేషాలు వేసుకుని సోమవారం అర్థరాత్రి రోడ్లమీదకు వచ్చారు. వీరిని చూసిన ప్రయాణికుల్లో కొంతమంది భయంతో జడుసుకున్నారు. అయితే దెయ్యాల ముసుగులో ఉన్నది మనుషులేనన్న విషయం తెలుసుకున్నాక అక్కడి ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాంక్ వీడియోల పేరిట ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వ్యక్తులు శాన్ మాలిక్, నవీద్, మహమ్మద్ సాజిల్, సకీబ్, సైద్ నబిల్, యుసిఫ్ అహ్మద్‌లుగా పోలీసులు గుర్తించారు. వీరంతా వివిధ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులుగా పేర్కొన్నారు. జనాల్లో ఫేమస్ కావడానికి ఇలాంటి పనులు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే వారు క్షమాపణలు కోరినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోక తప్పలేదు. టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు సమీపిస్తున్న తరుణంలో నగరంలో 144 సెక్షన్ అమలులో ఉంది. ప్రాంక్ పేరిట ప్రజలను ఇబ్బందులకు గరిచేయడంతో పాటు, ఒకేసారి ఇంత మంది కలిసి రోడ్లపై హల్చల్ చేయడంతో వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ఆ యువకుల కుటుంబసభ్యుల విజ్ఞప్తి మేరకు వారిని బెయిల్‌పై వదిలేశారు. -
మా ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయి: వైరల్
న్యూయార్క్ : ‘‘మా ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయి. అర్థరాత్రి సమయంలో ఓ దెయ్యం పిల్లాడు, చిన్న కుక్కపిల్లతో మా ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నాడు. అది మా ఇంట్లోని సీసీకెమెరాల్లో రికార్డైంది’’ అంటున్నాడు అమెరికాకు చెందిన జోయ్ నోలన్ అనే వ్యక్తి. ఇందుకు రుజువుగా ఆగస్టు 8న తన ఇంటి కిచెన్ దగ్గర చోటుచేసుకున్న సీసీటీవీ దృశ్యాలను చూపెడుతున్నాడు. జోయ్ నోలాన్ తెలిపిన వివరాల మేరకు.. లాంగ్ ఐలాండ్‌కు చెందిన జోయ్ నోలాన్ అనే వ్యక్తి ఇంట్లో రాత్రి సమయాల్లో ఎవరో తిరుగుతున్నట్లు అనిపించేది. దీంతో కొద్దిరోజుల క్రితం అతడు తన ఇంటి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి చూశాడు. ఆగస్టు 8నాటి సీసీటీవీ దృశ్యాలను చూడగానే అతడి ఒళ్లు జలదరించింది. రెండు వింత ఆకారాలు ఇంట్లో అటు ఇటు పరిగెత్తడం అతడి కంటపడింది. కొంచెం పరిశీలనగా చూడగా అది ఓ పిల్లాడు అతడి కుక్కపిల్ల ఆత్మలుగా జోయ్ గుర్తించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో ఉంచి నెటిజన్ల సలహాలను కోరాడు. ఇందుకు స్పందించిన ఓ నెటిజన్.. ‘‘ఈ మధ్య ఆ ఇంట్లో ఎవరన్నా చనిపోయారా?... స్పష్టంగా ఏమీ కనిపించటం లేదు. కానీ, ఎవరో అక్కడ తిరుగుతున్నట్లు మాత్రం అనిపిస్తోంది’’ అంటూ కామెంట్ చేశాడు. జోయ్ ఇందుకు ప్రతిగా స్పందిస్తూ.. ‘‘ఈ మధ్య ఎవరూ చనిపోలేదు. అంతకు పూర్వం ఎవరన్నా చనిపోయారేమోనని తెలుసుకుంటున్నాం. ఆగస్టు 8కి ఈ సంఘటనతో సంబంధం ఉందని నా అభిప్రాయం. అంతుకు ముందు, ఆ తర్వాత గానీ అలాంటి సంఘటనలు జరగలేదు’’ అని తెలిపాడు. -
‘ఓటు వేసింది మనుషులే.. దయ్యాలు కాదు’
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసింది మనుషులే అని.. దయ్యాలు కాదంటున్నది ఎన్నికల సంఘం. ఈసీ ఇంత వ్యంగ్యంగా స్పందించడానికి ఓ కారణం ఉంది. లోఎక్సభ ఎన్నికల్లో పోల్ అయిన ఓట్లు.. లెక్కించిన ఓట్ల మధ్య పొంతన లేదని కొందరు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ఈసీ శనివారం స్పందించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మనుషులే ఓట్లు వేశారని.. దయ్యాలు కాదని వివరించింది. తాము ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఉంచిన పోలింగ్ సమాచారం తాత్కాలికమైనదని ఈసీ తెలిపింది. దీనిలో మార్పులు చేయవచ్చని పేర్కొంది. ఈ గణాంకాలు పోల్ అయిన ఓట్ల సంఖ్యపై తుది గణాంకాలు కాదని పేర్కొంది. 542 నియోజకవర్గాల్లో పోల్ అయిన ఓట్ల సంఖ్యపై తుది లెక్కలను త్వరలోనే రిటర్నింగ్ అధికారులు పంపిస్తారని, వెంటనే ఆ లెక్కలను అందుబాటులో ఉంచుతామని తెలిపింది. గతంలో ఎన్నికలు జరిగినపుడు వాస్తవ ఎన్నికల సమాచారాన్ని రాబట్టడానికి కొన్ని నెలల సమయం పట్టేదని ఈసీ తెలిపింది. 2014లో జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వాస్తవ వివరాలను ప్రకటించడానికి దాదాపు మూడు నెలలు పట్టిందని పేర్కొంది. తాజా ఎన్నికల్లో సరికొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సదుపాయాలను వినియోగించుకున్నామని ఫలితంగా లెక్కించిన ఓట్లపై తుది సమాచారాన్ని ఫలితాలను ప్రకటించిన కొద్ది రోజుల్లోనే అందుబాటులో ఉంచగలిగామని పేర్కొంది. -
క్రియేటివ్ భూతం సీసాలోంచి బయటికి వచ్చేసింది
రోడ్డు మీద చెత్త పడితే ఎత్తేయొచ్చు. మురికి అయితే కడిగేయొచ్చు. కానీ సమాజంలో కంపు.. అది.. భరించలేని విధంగా మారితే? మన సమాజంలో మహిళల పట్ల మర్యాద లేదు. వారి పనికి గుర్తింపు లేదు. వారి మనుగడకు భరోసా లేదు. వారి అస్తిత్వాన్నే చీకటిలో కలిపేసే ధోరణి! స్త్రీల విషయం ఒక్కటనే కాదు.. వంచన, కపటం, మాయ తప్ప నీతి, నిజాయితీలేని ఈ సమాజంపై అసహ్యం కలిగింది ఆమెకు. ‘తను కాలిపోతూ, మనిషిని కాల్చేస్తూ పారదర్శక నైజం కలిగిన సిగరెట్ మీ కన్నా నయంగా ఉంది’ అంటూ ఓ పాట రాసింది. పాడింది. వీడియో చేసింది. ‘స్మోకింగ్ కిల్స్.. బట్ సిగరెట్ రాక్స్’ అనే పేరుతో రూపొందించిన ఆ మల్టీ లింగ్వల్ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసింది.. దశాబ్ద కాలానికి పైగా ఘోస్ట్ (అజ్ఞాత) రైటర్‌గా, సింగర్‌గా, కంపోజర్‌గా కొనసాగిన ఫీబా మార్టిన్! ఆ వీడియో ఇప్పుడొక సోషల్ మీడియా సెన్సేషన్! ఇన్నాళ్లు ఎన్నో విభాగాల్లో దేశంలోని పలు భాషల సినీ పరిశ్రమల్లో ఘోస్ట్‌గా వర్క్ చేసిన ఫీబా తన కష్టం ఇప్పటికైనా గుర్తింపు పొందాలని ఆకాంక్షిస్తోంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ప్రపంచ పౌరురాలు అమ్మ తమిళియన్. నాన్నది ఇంగ్లండ్. నేను నా భర్తతో కలిసి ముంబైలో ఉంటున్నాను. బెంగళూరులో పన్నెండు మంది చిన్నారులను మేము అడాప్ట్ చేసుకున్నాం. క్తుప్లంగా ఇవీ మా కుటుంబ వివరాలు. ఇక నా విషయం. డబుల్ మాస్టర్స్ చేశాను. ఎంఏ లిటరేచర్, కూచిపూడి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి చేశాను. ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్నాను. గతంలో సాఫ్ట్‌వేర్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా జాబ్ చేశాను. కార్పొరేట్ జాబ్ వదిలేసి ఇప్పుడు ఫుల్‌టైం మ్యూజిక్, రైటింగ్‌కే కేటాయిస్తున్నాను. అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటాను. ప్రపంచ పౌరురాలిని అనుకోండి. ఇప్పటి వరకు రెండు వందల చిత్రాలకు మ్యూజిక్, డైరెక్షన్, రైటింగ్ విభాగాల్లో ఘోస్ట్‌గా వర్క్ చేశాను. చాలామంది మ్యుజీషియన్స్ దగ్గర ఘోస్ట్ కంపోజర్‌గా చేశాను. వారి పేర్లు ఏవీ చెప్పలేను. ఆర్పీ పట్నాయక్ గారు చేసిన ‘ఈమీ’ హాలీవుడ్ చిత్రానికి పనిచేశాను. అందులో రైటర్‌గా నాకు ఆయన టైటిల్ క్రెడిట్ ఇచ్చారు. అనేక చిత్రాలకు ర్యాప్ మ్యూజిక్ పాడాను. తెలుగులో వచ్చిన మ్యాక్సిమమ్ ర్యాప్ పాటలు నేను పాడినవే. ఇక్కడి అందరి ర్యాపర్లతో కలిసి పనిచేశాను. అలాగే తమిళ్, కన్నడ, బెంగాళీ, హిందీ, ఇంగ్లిష్ జింగిల్స్కి వాయిస్ ఇచ్చాను. ఆర్పీ, రామ్‌గోపాల్ వర్మ తప్ప మరెవ్వరూ నాకు గుర్తింపు ఇవ్వలేదు. ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని, జీవితకాలమంతా ఒకరి కింద పనిచెయ్యకూడదనే లక్ష్యంతో ఇప్పుడు పనిచేస్తున్నాను. ప్రస్తుతం పారిస్‌లోని రాక్‌బ్యాండ్ ‘పుల్ఆర్ట్ బీ’తో ర్యాపర్‌గా ట్రావెల్ చేస్తున్నాను. సంగీత కచేరీలో పాల్గొంటున్నాను. మోడలింగ్ చేస్తున్నాను. అవికాక సొంతగా ప్రైవేటు ఆల్బమ్స్ మీద ఫోకస్ చేస్తున్నాను. రెండేళ్ల క్రితం రాంగోపాల్‌వర్మ కలిసి చేసిన ఒక ప్రాజెక్ట్ రిలీజ్ అయి ఉంటే ఈపాటికి మంచి గుర్తింపు వచ్చి ఉండేది. వీడియో వెనుకజనాలతో బాగా విసిగిపోయి ఉన్నాను. చెప్పేదొకటి, చేసేదొకటి. రిలేషన్‌షిప్స్‌కి, పనికి, ఆడవాళ్లకి వాల్యూ లేదు. ఇవన్నీ చూసి చూసి సమాజం మీద ఏవగింపు కలిగింది. ఏ భావన అయినా.. నేను చేసేది, నాకు తెలిసింది, రాయటం, కంపోజ్ చెయ్యటమే. దానినే మాటల్లో పెట్టి ఈ ర్యాప్ చేశాను. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. జీవితంలో నాకు ఎదురైన చేదు అనుభవాలే ఈ వీడియోకి ప్రేరణ. సౌత్‌లో, ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో నేను ఎదుర్కొన్న చేదు అనుభవాలు అని చెప్పాలి. ఇందులో చూపించినట్లు నేను స్మోక్ చెయ్యను, డ్రింక్ చెయ్యను. అవన్నీ గ్రాఫిక్స్‌తో చేశాను. భావాన్ని అర్థం చేసుకునే వారికే ఈ వీడియో అర్థమవుతుంది. మనుషుల కంటే సిగరెట్ ఎంతో మేలు. ప్యాకెట్ మీద వార్నింగ్ ఉంటుంది. సిగరెట్ తన గురించి ఏమీ దాచదు. తాగితే చస్తావ్ అంటుంది. ఆ తర్వాత చావడం, బతకడం మన చాయిస్. భక్తి, బంధం.. వీటి ముసుగులో మనుషులు మోసం చెయ్యటం దారుణం అనిపిస్తుంది. అది తీవ్రంగా గాయపరుస్తుంది. సిగరెట్ డబ్బా మీద ఉన్న హెచ్చరిక మనుషుల ముఖాల మీద కూడా ఉంటే బాగుండు. ఇదే ఈ పాటలో రాశాను. – ఓ మధు క్యాస్టింగ్ కౌచ్ ఉంది అడిగారు కాబట్టి చెబుతున్నాను. ‘క్యాస్టింగ్ కౌచ్’ అన్ని పరిశ్రమల్లోనూ ఉంది. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో మాత్రం.. మనం ఎప్పుడొచ్చాం అనే దగ్గర నుంచి మన పని, మన మూమెంట్స్ అన్నీ రికార్డ్ అవుతుంటాయి కనుక క్యాస్టింగ్ కౌచ్ కొంత తక్కువ. కానీ ఫిలిం ఇండస్ట్రీలో అలా ఉండదు. అలాగే సినిమా పరిశ్రమలో గుర్తింపు రావడం కష్టం. పేమెంట్లు కూడా సరిగా అందవు. చేసిన పనికి గుర్తింపు లభించక పోవటం అక్కడ చాలా కామన్ విషయం. ‘నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో మీ పేరు పెడతాం, ఈసారికి చెయ్యండి’ అనేవాళ్లే ఎక్కువ. – ఫీబా మార్టిన్ -
దెయ్యం భయం.. ఊరు ఖాళీ!
సాక్షి, వేలేరుపాడు: ఆ ఊరి పొలిమేరల్లో ఓ పెద్ద బండరాయి.. దాని కింద ఓ సొరంగం.. అందులో ఉడుము రూపంలో ఎర్రమారి దెయ్యం.. నిత్యం బయట సంచరిస్తుంది.. కాలక్రమేణా ఆ సొరంగం మట్టితో పూడుకుపోయింది. ఇంకేం.. ఆ దెయ్యానికి కోపం వచ్చింది.. గ్రామస్తులను బలితీసుకోవడం మొదలుపెట్టింది.. అందుకే ఆ గ్రామాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు.. సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతున్నా ఇంకా ఇటువంటి మూఢాచారాలు జన జీవనాన్ని బెంబేలెత్తిస్తూనే ఉన్నాయనడానికి పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో మారుమూల గిరిజన గ్రామమైన కొర్రాజులగూడెం నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. ఇళ్లను సైతం పడగొట్టారు గ్రామంలో మొత్తం 40 గిరిజన కుటుంబాలుండేవి. పెంకుటిళ్ల కాలనీలతో పాటు, మూడు మంచినీటి బోర్లు, లక్షలాది రూపాయలు వెచ్చించి రహదారి కూడా నిర్మించారు. తొమ్మిదేళ్ల కిందట పక్కా పాఠశాల భవనాన్ని కూడా నిర్మించారు. గతేడాది మరో అదనపు పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఆ ఊరి పొలిమేరల్లో ఉన్న ఓ పెద్ద బండరాయి కింద ఉన్న సొరంగం రెండున్నరేళ్ల కిందట మట్టితో పూడిపోయింది. అదే ఏడాది గ్రామంలో వివిధ వ్యాధులతో కారం లక్ష్మయ్య, పరిశక లక్ష్మయ్య, బందం తమ్మయ్య, మిడియం రాములు మృతి చెందారు. మళ్లీ ఆరు నెలలకు మడివి చిన్నయ్య, కారం చిన్నక్క, సోడే రాజమ్మలు అనారోగ్యంతో మృతి చెందారు. ఇంకేముంది దీనికి ఎర్రమారి దెయ్యం ఆగ్రహమే కారణమని భయపడిన గ్రామస్తులు ఊరుని ఖాళీచేసి వెళ్లిపోయారు. గ్రామంలోని 30 పెంకుటిళ్లను సైతం పడగొట్టి.. కిలోమీటర్ దూరంలోని తారురోడ్డు ప్రాంతంలో పూరిగుడిసెలు నిర్మించుకున్నారు. అందుకే బలితీసుకుంటోంది.. ‘మా గ్రామంలో దెయ్యం ఉన్న సొరంగం మట్టితో పూడిపోవడంతో అది ఆగ్రహించి మా ఊరివాళ్లను బలితీసుకుంది’ అని ఆ గ్రామ పెద్దకాపులు తెల్లం సాయిబు, సోడే ముత్యాలు, కారం గంగులు ‘సాక్షి’తో చెప్పారు. అందువల్లనే ఊరు ఖాళీ చేశామని, ఇప్పుడు తమకు ప్రశాంతంగా ఉందన్నారు. గతంలో ఊరు అక్కడున్నప్పుడు 46 మంది విద్యార్థులు ప్రాథమిక పాఠశాలలో చదువుకునేవారు. గ్రామస్తులు కొత్తగా ఇళ్లు నిర్మించుకున్న ప్రాంతానికి అరకిలో మీటర్ దూరంలో ఉన్న ఈ పాఠశాలకు విద్యార్థులు వెళ్లకపోవడంతో ప్రభుత్వం మూసేసింది. దీంతో కొర్రాజులగూడేనికి చెందిన 18 మంది విద్యార్థులు కాలినడకన కిలోమీటరు దూరంలో ఉన్న చాగరపల్లి పాఠశాలకు వెళ్తున్నారు. బతుకుజీవుడా అంటూ బయటపడ్డాం.. ఆ దెయ్యం వల్ల మా వాళ్లను కోల్పోయాం. ఇంకా అక్కడే ఉంటే మమ్మలికూడా ఆ అది మింగేసేదే. అందుకే బతకుజీవుడా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాం. వేరే చోట కొత్త ఇళ్లు కట్టుకున్నాం. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. – కణితి శ్రీరాములు కొర్రాజులగుడెం గ్రామస్తుడు నన్నూ భయపెట్టారు.. ఈ పాఠశాలలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేయడానికి ఇక్కడకొచ్చాను. ‘మీరు పాఠశాలకు ఎలా వెళుతున్నారు.. అక్కడ దెయ్యం ఉంది’ అంటూ నన్ను భయపెట్టారు. మొదట్లో కొంత భయపడ్డాను. తర్వాత నెమ్మదిగా భయం వీడి పాఠశాలకెళ్లాను. తర్వాత పాఠశాలను ప్రభుత్వమే మూసేసింది. ఇక్కడి విద్యార్థులను కిలోమీటరు దూరంలోని చాగరపల్లి పాఠశాలలో విలీనం చేశారు. ప్రస్తుతం చాగరపల్లి పాఠశాలలో పర్మినెంట్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నా. కొర్రాజులగూడెం విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు. – గుజ్జా శిరీష, అకడమిక్ ఇన్స్ట్రక్టర్ -
మరాఠీ దెయ్యం
ఊరికొసానున్న మంత్రాల పుల్లయ్య ఇంటిముందర కూర్చోని పుల్లలేసినప్పుడంతా కొరివి దెయ్యం తలమంటలా భగ్గునలేస్తున్న చలిమంటవొంకే చూస్తున్నాడు గోవిందు. కడపెళ్లిన నరసప్ప తిరిగిరావడం కోసం సాయంత్రం నుంచి ఎదురుచూస్తా పెద్దూర్‌లోనే ఉండిపోవాల్సొచ్చింది.మామూలుగా ఐతే పెద్దూరొచ్చిన చెర్లోపల్లెవాళ్లంతా వెల్తురుండగానే తిరిగెళ్లిపోతారు. మూడు మైళ్ల దారంతా తోటలు, వంకలు, డొంకలు, రాత్రైతే దెయ్యాల భయం.గోవిందుకు ఇవ్వాల్సిన బెల్లం డబ్బు ఇవ్వకుండా నరసప్ప సంవత్సరం నుంచి తిప్పుకుంటున్నాడు. అది చేతికొస్తే గాని మరుసటి కారుకు విత్తనాలు కొనలేడు గోవిందు.తప్పనిసరై ఉండిపోయాడు.అతనికి అసహనంగా ఉంది.ఆరోజు పట్టుకోకపోతే నరసప్ప మళ్లీ వారందాకా దొరకడు. అమావాస్య చీకటి కమ్ముకుంటావుంది. ఇంకా ఆలస్యమైతే తోడులేకుండా ఒక్కడే వాళ్లవూరు వెళ్లలేడు.‘‘నర్సప్ప రావాల్సిన లాస్ట్ బస్సు అడ్డరోడ్డు కాడికి వచ్చేసింటాదిగదా మామా’’ అడిగాడు గోవిందు, పొలాల్లో గొర్రెల మంద బెరుగ్గా అరవడం, కీచురాళ్ల చప్పుడు పెరగడం గమనిస్తూ.‘‘నీ పెండ్లానికి నీకునాలుగురోజులాయె మాటల్లేవంటాండావు. యేమైండాది?’’ అన్నాడు పుల్లయ్య బీడిని వెలిగిస్తూ.ఎర్రగా మెరుస్తున్న అతని పళ్లు, సారాకళ్లు, జులపాలు, బుర్రమీసాలు చూస్తూ ‘దయ్యం కంటే ఈనేబైంకరంగా వుండాడే’ అనుకున్నాడు గోవిందు.‘నెల్రోజుల్నించి దాని అన్న ఖాయిలాతో కడపాస్పత్రిలో జేరివుండాడు. దాని గొలుసు, గాజులు నాతో మాటైనా చెప్పకుండా వాళ్లన్న కంపించింది.తాళిబొట్టొకటే మిగిలుండాది.ఈతూరి యెరువుల ఖర్చులకు కుదవ నా తలకాయ బెట్టాల్సిందే’’ నిట్టూర్చాడు గోవిందు.‘‘యెట్లైనా నీ పెండ్లానికి ధైర్ణమెక్కువేబ్బీ’’ అన్నాడు బీడి పొగ వదుల్తూ పుల్లయ్య.‘దాని మొఖం. సస్తే సీకట్లో అడుగు బైటపెట్టదు, ఆడోల్ల ధైర్ణాన్ని నువ్వే పొగడాల...ఈరాత్రి ఇంటికి బోయినాక దాని కత వుంది’’అన్నాడు గోవిందు కోపంగా.‘‘నీ పెండ్లామ్మీదైతే వొంటికాలు మీద లేస్తాండావుగానీ, నర్సప్పను దుడ్లు గెట్టిగా అడగాలంటే నీకు బయ్యేం’’ అని నవ్వి–‘‘మనిసికి బయం నరాల మూలాల్లోనే వుంటాది. తెల్సినా నీ వొశంలో వుండదు. బతకి బట్టగట్టాలంటే బయంగూడా అవుసరమబ్బీ’’ అన్నాడు పుల్లయ్య. సగం కాలిన పుల్లల్ని జవిరి కుప్పగా మంటలో వేశాడు గోవిందు. మంట భగ్గుమంది.‘‘అందుకేనేమో నర్సప్ప అందర్నీ ఆడిస్తావుండాడు. మాసువుల్లో యేసిన బెల్లం. వాయన టౌన్లో అమ్ముకొనే ఆర్నెల్లయ్యుండాది. నా దుడ్లు నాకిచ్చేదానికి ఇన్ని తూర్లా తిప్పుకునేది. ఈ పొద్దెట్లైనా బాకీ వసూలు చేస్కోవాల’’ నరసప్ప మిద్దె వైపు చూసి అన్నాడు గోవిందు.ఊరివైపు నుంచి చలిమంట దగ్గరకు నీడలా నడిచొచ్చి నిలబడ్డాడు నరసప్ప పొలాలు చూసుకునే సిలారు.వొంగి మంటకు అరచేతులు పెట్టి ‘‘యేం గోవిందన్నా పెండ్లైనోడివి వూరికి బోకుండా ఈడ దయ్యాలాయన్తో చలిగాచుకుంటా వుండావా. ఇనేవోడుంటే ఈన యెన్ని గ్యాసు దయ్యాలకతలైనా చెప్తాడు’’ అనినవ్వాడు.అతని వైపు చురచురా చూశాడు పుల్లయ్య.‘‘మీ సౌకారొచ్చేది ఆల్చెమౌతాదాబ్బీ’’ అడిగాడు అతని కోసమే చూస్తున్న గోవిందు.‘‘ఆయన అనుకోకండా కడపలోనే కూతురింట్లో నిల్చిపోయినాడు.ఇప్పుడే రాజరత్నం సారు చెప్పిపాయె. మన్నాడొస్తాడంటన్నా’’ అన్నాడు సిలారు చేతులు మొహానికి రుద్దుకుంటూ, గోవిందు నిస్సత్తువగానిట్టూర్చి ‘కత మొదుటికొచ్చింది’ అనుకున్నాడు.‘‘మీవూరోళ్లు రాగిమానుకిందుండిరే’’ అని ఊరివైపు చూసి,‘‘యెళ్లిపోయినట్టుండార్నా. నువ్వు బిన్నే నాలుగడుగులేస్తే అందుకోవచ్చు’’ అని తమ ఇండ్లవైపు వెళ్లిపోయాడు సిలారు.మంట ఆరిపోయి నిప్పురవ్వలు మిగిలాయి.చీకటి కమ్ముకుంది. ‘‘నువ్వు ఇంటికి బొయేట్టుంటే తోడుంటేనే బయల్దేరాది మంచిదిబ్బీ. అమాస్య గడియ లొచ్చేస్తాండాయి. మీవూరి దావలో యాడైనా సమాలిచ్చుకోవచ్చుగానీ అంకాలు మామిడొనం దాటేటప్పుడు మాత్రం ప్రాణం మీది కొస్తాది. ఆడ మర్రిచెట్టు మీద మరాఠీ ఆడదయ్యం శానా యిరుడ్డమైంది, యేషాలేస్తాది. గొంతుచీల్చి రగతం తాగుతాది. మా బోటి మంత్రగాళ్లే తట్టుకోలేరు. పోనీ రాత్రికి మా యింట్లో పండుకోని పొద్దున్నేపోరాదు’’ అని పుల్లయ్య లేచాడు.‘‘సీకట్తోనే రాయారం బోవాల. నాగిరెడ్డి దుడ్లిస్తానన్నాడు. రేప్పొద్దునైతేనే వుంటాడంట. యిత్తనాలకు కసాలగా వుండాది’’ అని–‘‘అరే..ఈ నర్సప్ప ఖయాల్లోబడి మర్చేపోయినా. చెంచయ్యతోట నించి వొకబుట్ట తొమలపాకులు తెమ్మన్నాడు నాగిరెడ్డి. తెల్లార్తోనన్నా బొయ్యి తొమలపాకులు తీస్కోని పరిగెత్తాల. వుత్తచేతుల్తోబోతే యింట్లేకే రానీడు, బోకోపం మనిసి.దయ్యాలని నిల్చిపోతే మనకు జరుగుతదా. పోతా...యెట్టన్నాగానీ....దావలో మావూరోళ్లు యెవురోవొకరు తోడు దొరక్కపోరు’’ అంటూ తనూ లేచి బయల్దేరాడు గోవిందు. గోవిందు కళ్లు చిట్లించి చూస్తూ వడివడిగా నడుస్తున్నాడు. చీకట్లో ముందర మనుషులెళ్తున్నారో లేదో తెలీడం లేదు. వాళ్లవూరోళ్లు కల్సుకునే నామాలోళ్ల కళ్లం దగ్గరకొచ్చాడు.అక్కడ గుడ్డిలాంతరు వెల్తురులో నులకమంచమ్మీద నిద్రపోతున్న వాళ్ల సేద్యగాడు చెవిటి ఓబయ్య తప్ప మరో మనిషి జాడలేదు. సంశయిస్తూ ముందుకు నడిచాడు.అతనికి దెయ్యాల భయం మొదలైంది.‘యెనకరోజుల్లో ఆడోళ్లంతా చెట్టుకు వురేసుకొనో, బావిలో దూకో సచ్చేవాళ్లేమో. రేత్రైతే సాలు చెట్టు కోటి, బావికోటి యేడజూసినా దయ్యాలే. ఇవి మనుసులుగా వున్నప్పుటికంటే సచ్చి దెయ్యాలైనాకే చిన్నప్పబావిగట్టు మీద ఎవరో తెల్లగా కూర్చున్నట్టుంది.వొళ్లు జలదరించింది.అడుగు ముందుకుపడలేదు.పరికించి చూశాడు, అది కొత్తగా బెరడు లేచిపోయిన కానుగచెట్టు మొదలు.ఊపిరిపీల్చుకుని కదిలాడు. నక్కలమడుగు దగ్గరికొచ్చాడు. అక్కణ్ణుంచి దారి వరిమళ్లు వొదిలి తోటల్లో, డొంకలగుండా పోతుంది.‘అమాస్య సీకట్లో ఈ చెట్టుచేమా, కొండావాగూ మనిసివి కాదు, యేరే శక్తుల రాజ్జెం. యెనక్కిపోదామా’ అనుకుని ఓ క్షణం ఆగాడు.పద్దున్నే ఎట్లైనా రాయవరం పోవాలని గుర్తొచ్చింది.బెరుగ్గానే ముందుకు నడిచాడు.అతనికి పుల్లయ్య చెప్పిన భయానక ఘటనలు గుర్తుకొచ్చిభయమెక్కువైంది. చుట్టూ ఉన్నవి వేరేగా మారి కనబడుతున్నాయి. కొండలు నల్లగా మీదికి లేస్తున్నాయి. నక్షత్రాలు గుచ్చి చూస్తున్నాయి. చెట్లు నల్లనిజుట్టు విరబోసుకుని కదుల్తున్నాయి.టెంకాయ తోటల్లోంచి వీస్తున్న కీచురాళ్లతో కలిసి చలికి ఈదురుమంటోంది.మడుగుచుట్టూ కప్పలు, మడుగుపైన అడవిబాతులు, దూరంగా నక్కలు గుంభనగా అరుస్తున్నాయి. చెట్ల సందుల్లో నీడల్లాగా ఏవో ఆకారాలు కదుల్తున్నాయి. నడుస్తూంటే వెనకాలే ఎవరో వస్తూన్న చప్పుడు.ఎవరో నవ్వినట్టు, అంతలోనే ఏడ్చినట్టు, ఎవర్నో పిలిచినట్లు దగ్గర్లో గుసగుసలు. ఎలాగో మడుగును, ఆపైన బడేసాబ్ చెరకుతోటను దాటాడు. అంత చలిలోనూ చెమటలు పట్టాయి.మలుపు తిరిగాక అంతదూరంలో చిక్కగా అంకాలు మామిడివనం కనిపిస్తావుంది.‘ముందుకాలంలో మరాఠీ కుటుంబమొకటి నాటకాలేస్తా తిరగతా ఈవొరొస్తే, వోళ్ల సక్కటి ఆడకూతుర్ని అంకాలొనంలోనే అత్యాచారం జేసినారంట. ఆ పిల్ల ఆణ్ణే సీరతో మర్రిచెట్టుకు ఉరేసుకుని సచ్చిపోయి, దయ్యంగా మారి అమాస్యరేత్రిల్లు ఆ దోవన వొంటరిగా పొయ్యేవాళ్లని రకతం తాగి సంపుతాండాది’అనిచిన్నప్పట్నుంచి వింటున్నది వద్దనుకున్నా గుర్తుకొచ్చింది.అంకాలువనంలోని తాటిచెట్లు, మామిళ్ల మధ్యలో వున్న ఎల్తైన ముసలిమర్రిచెట్టు వికృతంగా అతని కోసం చేతులు సాచినట్టుంది. ఆ పక్కన చెంచయ్య తమలపాకులతోట అతను తప్పించుకోకుండా దడి కట్టినట్టుంది. కుడివైపున నాగమ్మ చెరకుతోట ప్రహరీగోడలాగుంది.ఉన్నట్టుండి గోవిందు నడక ఆగిపోయింది.గుండెలువరసతప్పినాయి.వనం పక్క నుంచి తెల్లని పొట్టి ఆకారం ఎగుడుదిగుడుగా అతనికేసి వస్తోంది.దాని గజ్జలు లయగా మోగుతున్నాయి.భయం కమ్మేసి అడుగులు వెనక్కిపడిబాటపక్కన లోతైన ఎండినకాలవలో పడ్డాడు.కాలిమడమ కలుక్కుమంది.‘‘అబ్బా’’ అన్నాడు.చేతులు నేల మీద ఆన్చి తలెత్తి చూశాడు. ఆ ఆకారం బాట మీద నిలబడి అతని వైపే చూస్తోంది.భయం శక్తినంతా లాగేసింది.గోవిందు కష్టం మీద లేచి బాట పైకెక్కి కుంటుతూ నడక సాగించాడు. భయం నుంచి వొళ్లు ఇంకా స్వాధీనంలోకి రాలేదు. ఎడమవైపు తలతిప్పకుండా బాటకు కుడివైపునడుస్తూమర్రిచెట్టును దాటాడు. అంతే, హఠాత్తుగా నడక మళ్లీ ఆగింది.అంకాలువనానికి చెంచయ్య తోటకు మధ్య సందులోంచి మర్రిచెట్టుకు వైపు నుంచి ఒక ఆకారం బాట మీదికి వస్తోంది.ఈసారిమనిషి ఆకారం. ఆడమనిషి. జుట్టు విరబోసుకుంది. వయ్యారంగా దగ్గరికొస్తావుంది.అది మరాఠీ దెయ్యమే, నా పని ఐపోయింది’ అనుకున్నాడు.అతని వెన్ను నిలువునా వణికింది.నక్షత్రాల వెల్తుర్లో చీర తెల్లగా మెరుస్తావుంది.ఆమె కుడిచేత్తో తమలపాకుల వెదురుబుట్ట పట్టుకుంది.ఆమె ఇరవైఅడుగుల దూరంలో బాట మీదికి వచ్చి ఒక్క క్షణం ఆగింది.పలకరింపుగా నవ్వినట్లు పలువరస చీకట్లో తెల్లగామెరిసింది. గోవిందుకు జల్దరింపు తప్ప ఏమీ తెలియడం లేదు. స్థాణువై నిలబడ్డాడు. చూస్తుండగానే ఆమె విసురుగా అటువైపు తిరిగి వాళ్లవూరి వైపు నడవసాగింది.అతను కళ్లప్పగించి చూస్తూ నిలబడ్డాడు.ఆమె డొంకలోకి తిరిగింది.రెండు నిమిషాల తరువాత కదలిక తెచ్చుకొని అతనూ డొంకలోకి నడిచాడు.రెండు పక్కలా చెట్లతో డొంక పైకప్పులేని పొడవాటి గుహలాగుంది. ఆమె అంతదూరంలో నిద్రలో నడిచేవాళ్లలాగ నడుస్తోంది. బుట్ట నడుం మీద పెట్టుకోడంతో ఆమె నడక ఉయ్యాల ఊగినట్టుంది.ఆమె మలుపు తిరిగింది. అతను డొంకదాటి తిరిగాక ఆమె కనబడలేదు. ‘బాట వొదిలేసి పోయింటాది. తోటలకా పక్క వాగు, వాగవతల తుమ్మచెట్లలో పాడుబడిన యెర్రంరాజు కొట్టాలు. అది పెద్ద దయ్యాలకొంప. ఆడికి పోయుంటుంద’నుకున్నాడు.‘‘ఈపొద్దు నా మీద దేవుడి దయూండాది, మరాఠీరాచ్చసి యెట్లో నన్ను సూడలేదు. సూసింటే ఆణ్ణే సచ్చుండేవాడిని’ అనుకుని కుంటుకుంటూ బాట వెంటబడి ఊరికేసి తిరిగాడు. కాలీడ్చుకుంటూ గోవిందు ఇల్లు చేరేసర్కి అలివేలు నులకమంచం మీద కొడుకును నిద్రపుచ్చుతా వుంది. ఆమెను చూడగానే అతనికి ఒక్కసారిగా నిస్సత్తువ వచ్చి గోడకానుకుని జారి కూర్చుండి పోయాడు.శరీరం వణుకుతావుంది.అలివేలు గాభరగా దగ్గరికొచ్చి చెంప మీద చెయ్యి వేసి చూసి–‘‘జొరంగా వుండాద...యేమయ్యిండాది’’ అనడిగింది.గోవిందు తనకు భార్యతో మాటల్లేవన్న విషయమే మర్చిపోయిఆయాసపడుతూ జరిగిందంతా చెప్పాడు.అతని వైఖరి చూసి అతని వెనకాలే లోపలికొచ్చిన ఎదురింటి గంగమ్మత్త అంతా వినింది.అలివేలు ఏదో చెప్పబోయే లోపలే గంగమ్మత్త గాభరగా ముందుకొచ్చి–‘‘గోయిందు జూసొచ్చింది యెవుర్ననుకుండావ్?’ అంకాలు తోట్లో వుండే మరాఠీదెయ్యాన్ని. అదెట్నో ఈణ్ణి సూళ్లేదు. సూసింటేరగతంగక్కోని ఆణ్ణే పడిపోయుండేవోడు. అది ఈపూట యాడికోపేరంటానికి బోతావుంది. ఈడు బతికి పోయినాడు’’ అని తెగేసి చెప్పి, తలుపు దగ్గరకెళ్లి–‘‘వొరే మహేసూ నువ్వు బేగిపొయ్యి జంగప్పసోమిని బిల్చుకోనిరా...మంత్రమేసి తాయెత్తు గడతాడు...మంగా పసుపునీళ్లు గలపవే...నేను ఆంజనేస్సావమి కుంకం దెస్తా. మల్లేరమ్మ బండారుగుడా వుండాది’’ అంటూ బయటున్న వాళ్లకి అరిచి చెప్పి తన ఇంటివైపు పరుగెత్తింది.అలివేలు భర్తవైపు చూసి పకపకా వ్వింది.గోవిందు అయోమయంగా చూశాడు.‘‘నువ్వు అంకాలొనం కాడ జూసింది నన్నే. మరాఠీదయ్యన్ని గాదు, మల్లేరమ్మ చెల్లెల్నీ గాదు. తొమలపాకుల కోసం బొయినా. నవ్వు నా మీద అలిగుండావని, మాట్లాడవని ఆడ పలకరించలా’’ అనిమూలనున్న తమలపాకుల బుట్టను చూపించింది.ఆమె తలస్నానం జేసుండడాన్ని, కట్టుకున్న సన్నపూల తెల్లచీరను అప్పుడు చూశాడు గోవిందు.‘‘నీకేమైనా మతిబోయిండాదా, ఆడికి వొక్కదానివే యింతరాత్రా పొయ్యేది. యేమన్నా అయ్యుంటే’’ ఆందోళనగా అడిగాడు నిటూరుగా కూర్చొని,గోవిందుకి ఇంకా వణుకు తగ్గలేదు.‘‘నాకేం బయం. ఆ దయ్యంనన్నేంజేస్తాది... నువ్వు తెల్లార్తో లేచి రాయారం నాగిరెడ్డి దెగ్గిరికి బోవాలనుకున్నావుగనా... మీయక్క జెప్పిందిలే.... తొమలపాకులు లేకుండాబోతే ఆయన నీతో మాట్లాడతాడా... అందుకే’’ అంటూ చిన్నగా నవ్వి అలివేలు అతని వీపు మీద చేత్తో రాసి, వాళ్లిద్దరి మధ్యా తగవుకు ఇక తావులేకుండా, అతని తలను తన గుండెలకు మృదువుగా హత్తుకుంది. - డా.కే.వి.రమణారావు -
పన్నెండు దాటింది
మగవాడి మంచితనమైనా, చెడ్డతనమైనా.. మగవాడి మంచితనాన్ని బట్టి, చెడ్డతనాన్ని బట్టి కాకుండా.. ఆడవాళ్లు అనుకోడాన్ని బట్టి ఉంటుంది. రాత్రి పన్నెండు దాటింది. పన్నెండు తర్వాత ఉప్పల్‌కి బస్సులు ఉండవు. పన్నెండుకి లాస్ట్ బస్. లాస్ట్ బస్ ఇంకా రాలేదు కాబట్టి, పన్నెండు దాటిన తర్వాత ఇక అది ఎప్పుడైనా రావచ్చు. ఒకవేళ ముందే వెళ్లిపోయిందా అని అనుకోడానికి లేదు. పదకొండున్నర నుంచి అతడు ఆ బస్టాప్‌లో ఉన్నాడు. టెలిఫోన్ భవన్ బస్టాప్ అది. మెహిదీపట్నం డిపో నుంచి వచ్చే ఉప్పల్ బస్సులకు, పంజాగుట్ట మీదుగా వచ్చే ఉప్పల్ బస్సులకు టెలిఫోన్ భవన్ బస్టాప్ జంక్షన్. పంజాగుట్ట మీదుగా వచ్చే ఉప్పల్ బస్సుల టైమ్ పన్నెండుకు ముందే అయిపోతుంది కనుక ఇక రావలసింది మెహదీపట్నం నుంచి వచ్చే ఉప్పల్ బస్సే అనుకున్నా.. పంజాగుట్ట నుంచి వచ్చే ఆఖరి బస్సూ లేటయితే.. రెండు బస్సులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ బస్టాప్‌లో మొదట అతడొక్కడే ఉన్నాడు కానీ, తర్వాత.. ఆమె కూడా వచ్చి అతడికి కాస్త దూరంలో నిలబడింది. పదకొండున్నర నుంచి అతడు అక్కడ ఉంటే.. పావు తక్కువ పన్నెండు నుంచి ఆమె అక్కడ ఉంది. ఇద్దరే ఉన్నారు బస్టాప్‌లో. ఎవరూ ఎవరితో మాట్లాడుకోవడం లేదు. సెల్ఫోన్లో టైమ్ చూసుకుంటూ.. బస్సు వచ్చే దారి వైపు చూస్తూ నిలుచున్నారు. బస్టాప్‌లో రిన్నోవేషన్ ఏదో జరుగుతున్నట్లుంది. అంతా తవ్వేశారు. పోల్స్‌కి ఉండవలసిన లైట్స్ కూడా లేవు. కాస్త దూరంలో ట్రాఫిక్ ఐలండ్‌లో ఉన్న స్ట్రీట్ లైట్ నుంచి ఇక్కడికి మసగ్గా వెలుతురు పడుతోంది. ఆ మసక వెలుతురులోనే ఆమె అందంగా ఉండడం గమనించాడు అతడు. అందంగా కాదు. చాలా అందంగా! ఆ ‘చాలా అందం’ బహుశా ఆమె జుట్టుది కావచ్చు. లేదా ఆ మెడ! లేదంటే.. ఆమెలో ఇంకేదో.. చూడబుద్ధయ్యేలా ఉన్న చోటు. ఎంతోసేపు బస్సుకోసమే చూడలేడు కాబట్టి అప్పుడప్పుడు ఆమెవైపు కూడా చూస్తున్నాడు అతడు. భుజానికి హ్యాండ్ బ్యాగ్ ఉంది. చేతిలో క్యారీ బ్యాగ్ ఉంది. ఇన్ని బ్యాగులతో ఆడవాళ్లకు ఎన్ని పనులో అనుకున్నాడు అతడు. అలా అనుకోడానికి ముందు.. ఇంత రాత్రివరకు ఆమె తన పని ఎందుకు తెముల్చుకోలేక పోయిందో అనుకున్నాడు. తనొక్కటే ఉన్నందుకు భయపడుతోందేమోనని ఆమెక్కొంచెం ధైర్యం ఇవ్వాలని అతడికి అనిపించింది. ధైర్యం ఇవ్వడం అంటే.. తను చెడ్డవాడిని కాదన్న భావన ఆమెకు కల్పించడం. అంతకన్నా కూడా.. అంతసేపటిగా ఒక ఆడ, ఒక మగ.. ఎంత అపరిచితులైనా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండడంలోని అసహజత్వం అతడిని ఇబ్బంది పెడుతోంది. ఆ ఇబ్బందిని పోగొట్టుకోడానికైనా అతడు ఆమెతో మాట్లాడాలనుకున్నాడు. ‘‘మీరూ ఉప్పలేనా?’’ అన్నాడు. ఆమె చికాగ్గా చూసింది. అతడు కొంచెం హర్ట్ అయ్యాడు. ఆడవాళ్లు వాళ్లకైవాళ్లు మంచి అనుకుంటే తప్ప మగవాళ్ల మంచితనాన్ని ఆమోదించరని జీవితంలో అనేకసార్లు అతడికి అనుభవమైంది. మగవాడి మంచితనమైనా, చెడ్డతనమైనా.. మగవాడి మంచితనాన్ని బట్టి, చెడ్డతనాన్ని బట్టి కాకుండా.. ఆడవాళ్లు అనుకోడాన్ని బట్టి ఉంటుంది. ‘‘వేరేలా అనుకోకండి. మీరూ ఉప్పలేనా అని అడగడంలో నా ఉద్దేశం.. నేనూ ఉప్పలే అని చెప్పడం కాదు. నేనూ మీలా మనిషినే అని మీరు అర్థం చేసుకోవాలని అలా అడిగాను. ఎందుకంటే.. ఈ చీకటి రాత్రి, ఈ ఒంటరి రాత్రి నేను మీకు మనిషిలా కాకుండా మరోలా కనిపిస్తున్నానేమోనని నాకు అనిపిస్తోంది’’ అన్నాడు అతడు. అతడివైపు చిత్రంగా చూసింది ఆమె. చూసిందే కానీ అతడితో మాట్లాడలేదు. మళ్లీ బస్సు వచ్చే దారి వైపు చూసింది. బస్సు వస్తూ కనిపించలేదు. ‘‘ఏమైందీ దెయ్యం బస్సుకు?!’’ అన్నాడతడు ఆమెకు సానుభూతిగా. ఆ మాటకు మళ్లీ అతడివైపు ఆమె చికాగ్గా చూసింది. ‘‘సారీ..’’ అన్నాడు అతడు. ‘ఎందుకు సారీ..’ అన్నట్లు చూసింది ఆమె. ‘‘బస్సులు దెయ్యాలు ఎందుకవుతాయి? వేళ తప్పి బస్సుల కోసం చూసే మనమే దెయ్యాలం’’ అన్నాడు అతడు. ఫక్కున నవ్వింది ఆమె. ‘‘హమ్మయ్య.. నవ్వారు’’ అన్నాడు అతడు. ఇద్దరూ ఒకర్ని చూసి ఒకరు నవ్వుకున్నారు. ‘‘మీరూ ఉప్పలేనా?’’ మళ్లీ అడిగాడు అతడు. ‘‘ఎందుకనుకుంటున్నారు.. నేనూ ఉప్పలేనని?’’ అంది ఆమె. అతడు నవ్వాడు. ‘‘ఈవేళప్పుడు ఈ స్టాప్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లే బస్సులు, కోఠి వెళ్లే బస్సులు ఉండవు. అందుకే ఉప్పలేనా అని అడిగాను’’ అన్నాడు. ఆమె నవ్వింది. ‘‘ఎందుకు నవ్వుతున్నారు?’’ అడిగాడు. ‘‘ఉప్పల్ బస్సు ఎక్కితే ఉప్పలే వెళ్తారా? మధ్యలో పది స్టాపులు ఉంటాయి. ఏ స్టాపులోనైనా దిగొచ్చు కదా నేను. నారాయణగూడనో, బర్కత్పురానో, రామంతపూరో..’’ అంది ఆమె. అతడు నవ్వాడు. ‘‘సో.. నేను మిమ్మల్ని అడగవలసిన ప్రశ్న.. ‘మీరూ ఉప్పల్ బస్ కోసమేనా?’ అనే కదా’’ అన్నాడు. ఆమె మళ్లీ నవ్వింది.అతడికి సంతోషంగా ఉంది. అక్కడ తామిద్దరే ఉండడం అతడికి బాగుంది. తెల్లారే వరకు బస్సు రాకపోతే బాగుండనుకున్నాడు. అయితే అలా అనుకోగానే.. ఇలా వస్తూ కనిపించింది ఉప్పల్ వెళ్లే బస్సు! పావు తక్కువ ఒంటిగంటకు. ‘‘వచ్చేసింది’’ అన్నాడు అతడు ఆమెవైపు తిరిగి. అయితే ఆమె అక్కడ లేదు. బస్సు ఎక్కుతూ కనిపించింది! అరె.. అంత వేగంగా ఎప్పుడు వెళ్లిపోయింది అనుకున్నాడు అతడు. అతడు ఎక్కేలోపే బస్సు కదలిపోయింది! తనొక్కడే ఉసూరుమంటూ బస్టాప్‌లో ఉండిపోయాడు. కనీసం నేనొకణ్ని బస్టాప్‌లో ఉన్నానని డ్రైవర్‌కి చెప్పి ఆపించలేకపోయింది అనుకున్నాడు అతడు. వెంటనే అతడికి ఇంకో ఆలోచన కూడా వచ్చింది. బస్సులో తనొక్కటే లేదు కదా.. అని. ఎస్.. తనొక్కటే ఉన్నట్లుంది. బస్సు ఆగినప్పుడు చూశాడు. డ్రైవర్, కండక్టర్ తప్ప లోపల ఎవరూ లేరు. బస్సు ఫెయిలైందని, రూటు మళ్లించి, ఏ మూలో ఆపి, ఆమెను వాళ్లు ఏమైనా చేస్తే? పైగా అందంగా ఉంది. ఒంటరిగా ఉంది. బస్టాపులో తన ఒంటరితనం మర్చిపోయి, బస్సులో ఆమె ఒంటరితనం గురించి ఆలోచిస్తున్నాడు అతడు. పది నిముషాల తర్వాత ఇంకో బస్సు వచ్చింది! ఉప్పల్ బస్సు. పరుగున వెళ్లి ఎక్కేశాడు. అందులో కూడా డ్రైవర్, కండక్టర్ తప్ప ఎవరూ లేరు. వెనక్కు వెళ్లి కూర్చున్నాడు. బస్సు వేగంగా వెళుతోంటే కిటికీలోంచి రయ్యిన చల్లటి గాలి ముఖానికి తగులుతోంది. కళ్లు మూసుకున్నాడు. అతడు కళ్లు మూసుకున్నాడే కానీ, మళ్లీ వెంటనే కళ్లు తెరిచాడు. అప్పటికింకా బస్సు తర్వాతి స్టాపుకు కూడా చేరుకోలేదు. ఎవరూ లేని బస్సులో.. తన సీటు వెనుక సీట్లో ఎవరో ఉన్నట్లనిపించి వెనక్కు తిరిగి చూశాడు. ఆమె!!!అతడి గొంతు కండరాలు భయంతో బిగుసుకుపోయాయి. ‘‘ముందెక్కిన బస్సు ఫెయిలయింది. అందుకే ఈ బస్సెక్కాను’’ అంది.. నోటి దగ్గర రక్తాన్ని నాలుకతో చప్పరిస్తూ. వెంటనే లేచి ముందు సీట్లలోకి వెళ్లిపోతే ఏం గొడవోనని... ప్రాణాల్ని బిగబట్టుకుని అక్కడే కూర్చుండిపోయాడు అతడు. - మాధవ్ శింగరాజు -
మా ఇంట్లో దెయ్యం ఉంది..!
-
నాకు దెయ్యాలంటే చాలా భయం : అమ్రపాలి
సాక్షి, హన్మకొండ అర్బన్ : తన అధికార నివాసంలోని రెండో అంతస్తులో దెయ్యం ఉందని, తనకు దెయ్యాలంటే భయమని స్వయంగా వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాట వెల్లడించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఇటీవల (ఆగస్టు 10న) కలెక్టర్ బంగ్లాకు 133 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కలెక్టర్ ఓ ప్రైవేట్ వెబ్ చానల్‌తో మాట్లాడుతూ.. భవన నిర్మాణం అద్భుతమని, ఆధునిక హంగులు లేకున్నా వసతులు బాగున్నాయని తెలిపారు. అయితే రెండో అంతస్తులో ఓ బెడ్రూం.. సామగ్రి ఉన్నప్పటికీ అక్కడ దెయ్యం ఉందని గతంలో ఉన్న కొందరు కలెక్టర్లు తనకు చెప్పారన్నారు. అయితే కలెక్టర్ భవన నిర్మాణానికి సంబంధించి పలు విధాలుగా పరిశోధనలు చేయించినట్లు తెలిపారు. వాటి ఆధారంగా భవన నిర్మాణానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయని ఆమె వివరించారు. ‘జార్జ్ పామర్ అనే వ్యక్తి భార్య వరంగల్ కలెక్టరేటు క్యాంపు కార్యాలయానికి శంకుస్థాపన చేశారని తెలిసింది. నిజాం కాలంలో అతడు ఓ ఇంజినీర్ అని తెలుసుకున్నా. చిందరవందరగా ఉన్న రెండో అంతస్తు గదిని శుభ్రం చేయించా. కానీ దెయ్యం ఉందన్న భయంతో ఆ గదిలో పడుకునే సాహసం చేయలేదు’ అంటూ ఆమ్రపాలి నవ్వుతూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కలెక్టర్ చెప్పడంతో ఆ బంగ్లాలో దెయ్యం విషయం చర్చనీయాంశంగా మారింది. -
ఇతడు
బలహీనమైన గుండె కలవారు ఈవారం ఈ దెయ్యం కథను చదవకపోవడమే మంచిది. ఎందుకంటే.. ఈ కథను రాయడం మొదలు పెట్టాక ఈ రచయితకు రెండుసార్లు దెయ్యం కనిపించింది! ఈ రెండుసార్లూ హైదరాబాద్ సిటీ బస్సులోనే ఈ రచయితకు దెయ్యం కనిపించింది. అదికూడా లేడీస్ సీట్ల వైపే కనిపించింది! లేడీస్ సీట్ల దగ్గర రచయితకేం పని అని మీలో ఎవరికైనా డౌట్ రావచ్చు. అది ముఖ్యం కాదు. లేడీస్ సీట్ల దగ్గరే దెయ్యం ఎందుకు కనిపించిందన్నది కూడా ముఖ్యం కాదు. అయితే అక్కడ ఆ రెండుసార్లూ రచయితకు కనిపించింది మగదెయ్యమే! చచ్చి దెయ్యాలయ్యాక కూడా ఈ మగవాళ్లు సిగ్గులేకుండా సిటీబస్సుల్లో ఆడవాళ్ల సీట్ల కోసం వెంపర్లాడతారా అని మీలో కొందరికి ఆ దెయ్యం మీద, ఈ రచయిత మీదా అసహ్యం కలగవచ్చు. అలా ఎందుకు జరిగిందన్నది అక్కర్లేని సంగతి. ఎలా జరిగిందన్నది కథలోని సంగతి. బలహీనమైన గుండె కలవారు ఈ కథను ఎందుకు చదవకూడదనే దానికి లాజిక్ ఏమీ లేదు. కథకూ, బస్సులో కనిపించిన దెయ్యానికీ సంబంధం కూడా లేదు. కథ రాస్తున్నప్పుడు ఇలా జరిగిందని చెప్పడమే రచయిత ఉద్దేశం. కథ చదువుతున్నప్పుడు మీకు ఒక వేళ దెయ్యం కనిపించినా.. అది కూడా కథకు, ఆ దెయ్యానికీ సంబంధం లేని విషయమే అనుకుని మీరు ధైర్యంగా ఉంటే ఫర్వాలేదు. అంత ధైర్యం మనకెందుకులే అనుకున్నవాళ్లు ఈ వారం ఈ పేజీని తిప్పేయడమే మంచిది. హైదరాబాద్‌లో ‘49 ఎం’ నెంబరు సిటీబస్సు సికింద్రాబాద్–మెహిదీపట్నం మధ్య తిరుగుతుంటుంది. రోజూ ఆ నెంబర్ బస్‌లోనే ఆఫీస్‌కి వెళ్తాడు ఈ రచయిత. బంజారాహిల్స్‌లో ఆఫీస్. సరిగ్గా ఆఫీస్ ముందే బస్టాప్. సీటు దొరికితే సౌకర్యవంతమైన ప్రయాణమే.రచయిత అనే జీవి ఫలానాలా ఉంటుంది అనుకుంటే, ఆ ఫలానాలా కచ్చితంగా ఉండడు ఈ రచయిత. అంతేకాదు. అదోలా ఉంటాడు! ‘నేను కొడితే అదోలా ఉంటుందని వాళ్లు వీళ్లూ చెప్పడమే తప్ప నాక్కూడా తెలీదు’ అని ఏదో సినిమాలో మహేశ్‌బాబు అంటాడు. ఈ రచయితక్కూడా తను రచయితనని, రచయితను కాననీ తెలీదు. ఇతణ్ణి చూసినవాళ్లెవరైనా వాళ్లకై వాళ్లు అనుకోవడమే.. దెయ్యంలా ఉన్నాడని. ఆ అనుకునేవాళ్లు కూడా ఇతడు దెయ్యంలా ఉన్నాడని అనుకోరు. దెయ్యం ఇలాగే ఉంటుందేమో అనుకుంటారు. మరి వాళ్లు అనుకుంటున్నట్లు ఇతడికెలా తెలుస్తుంది? తెలియదు. వాళ్లు అనుకుంటున్నారేమోనని ఇతడు అనుకుంటాడు. బస్సు స్పీడుగా వెళ్లే ప్రయత్నం చేస్తోంది. మెట్రో ఎక్స్‌ప్రెస్ కాబట్టి అది స్పీడుగానే వెళ్లాలి. రోడ్డుపై వాహనాల రద్దీ బస్సును వేగంగా కదలనివ్వడం లేదు. రోడ్డు పై ఎంత రద్దీ ఉందో, బస్సులోపలా అంతే రద్దీ ఉంది! రోడ్డుపై యాక్సిడెంట్‌ను తప్పించడానికి డ్రైవరు బ్రేక్ నొక్కిన ప్రతిసారీ బస్సులోపల యాక్సిడెంట్ అవుతోంది. ఎవరెవరివో ఎముకలు పుటుక్కుమంటున్నాయి. రచయిత నిలబడి ప్రయాణిస్తున్నాడు. ఆఫీసు రెండో మూడో స్టాపుల దూరం ఉందనగా ఇతడికి సీటు దొరికింది. దొరికింది అని ఇతడేం అనుకోలేదు. కండక్టర్ చూసి, ‘కోర్చోండక్కడ’ అని ఖాళీ సీటు చూపిస్తే వెళ్లి కూర్చున్నాడు. ‘కూర్చోండి’ అంటే వెళ్లి కూర్చున్నాడు కానీ, అది లేడీస్ సీటా, జెంట్స్ సీటా అని ఇతడు చూసుకోలేదు. ఎందుకు చూసుకోలేదంటే.. ఆ ఖాళీ సీటు పక్కన కిటికీ వైపు కూర్చొని ఉన్నది స్త్రీ కాదు, పురుషుడు. సాధారణంగా ఇతడు లేడీస్ సీటు ఖాళీగా ఉన్నా వెళ్లి కూర్చోడు. కూర్చున్న సేపట్నుంచీ ఇతడి ఆలోచనలు తెగిపోతాయి. తెగిపోయి, లేడీస్ ఎవరైనా వస్తారేమో, వాళ్లొచ్చినప్పుడు లేవాలేమో అన్న టెన్షన్ మొదలౌతుంది.ఏం ఉన్నా, లేకున్నా మనిషికి టెన్షన్ ఉండకూడదని ఇతడు అనుకుంటాడు. అందుకే లేడీస్ సీట్లలో కూర్చోవడం కన్నా వెయ్యి కిలోమీటర్లయినా నిలబడి ప్రయాణించడమే సుఖం అనుకుంటాడు. సీట్లో కూర్చోగానే తన ఆలోచనల్లోకి తను వెళ్లిపోయాడు రచయిత. స్టాప్ దగ్గరపడుతుందన్న ఆలోచన కూడా రానంతగా ఆలోచనల్లో మునిగిపోయాడు. అప్పుడొచ్చిపడింది ఇతడి భుజంపై ఎవరిదో చెయ్యి! తలెత్తి చూశాడు. పక్కనే వచ్చి నిలబడి ఉన్న ఒక మగమనిషి చెయ్యి అది. ‘‘లెయ్! లేడీస్ సీట్లో ఎందుక్కూర్చున్నావ్. లేడీస్ నిలబడి ఉన్నారు చూళ్లేదా? లేడీస్ నీ దగ్గరకొచ్చి, దండంపెట్టి లెయ్యమని అడుక్కోవాలా’’ అని పెద్దగా అరుస్తోంది ఆ చెయ్యి. అరుస్తోంది ఆ మనిషి నోరే అయినా, అది నోరు అరుస్తున్నట్లుగా లేదు. చెయ్యి అరుస్తున్నట్లుగా ఉంది. అప్పుడు గమనించాడు రచయిత.. అవి లేడీస్ సీట్లని. సీట్లోంచి లేచాడు. రచయిత పక్కన, విండో సీట్లో కూర్చొని ఉన్న మనిషి కూడా అరుస్తున్న మనిషివైపు కోపంగా చూస్తూ సీటు ఖాళీ చేశాడు. ఖాళీ అయిన ఈ రెండు సీట్లలోకి... ఎప్పట్నుంచి నిలబడి ఉన్నారో.. ఆ ఇద్దరు ఆడవాళ్లు వచ్చి కూర్చున్నారు. ఆ ఘటన జరిగిన రోజు ర చయిత ఎప్పటిలా ఆఫీస్ దగ్గర స్టాప్‌లో దిగలేదు. ఎండ్ పాయింట్ మెహిదీపట్నం వెళ్లిపోయి.. బస్ డ్రైవర్, కండక్టర్.. బ్రేక్‌లో టీ తాగుతుంటే వెళ్లి అడిగాడు.. ‘ఎవరతను?’ అని. కండక్టర్‌కి వెంటనే అర్థమైంది. ‘‘తెలీదు!’’ అన్నాడు. రెండ్రోజుల తర్వాత మళ్లీ అలాంటి ఘటనే ఎదురైంది ఇతడికి. అయితే ఎదురైంది ఇతడికి కాదు. ఎవరో లేడీస్ సీట్లో కూర్చొని ఉంటే ఎవరో వచ్చి అరుస్తున్నారు.. సీట్లోంచి లెయ్మని! ఆరోజు అరచిన వ్యక్తి,ఈరోజు అరుస్తున్న వ్యక్తీ ఒకరు కాదు. రెండోసారి ఈ ఘటన జరుగుతున్నప్పుడు రచయిత నిలబడి లేడు. కూర్చొని ఉన్నాడు. లేడీస్ సీట్ల దగ్గర ఒక స్త్రీ నిస్సహాయంగా నిలబడి ఉంది. ఆమె కోసమే ఆ అపరిచితుడు జెంట్స్‌తో గొడవపడుతున్నాడు.ఆమెను పిలిచి తన సీటిచ్చాడు ఇతడు. ఆమె కూర్చోలేదు! ‘ఇది జెంట్స్’ సీటు కదా అంది. ఇతడికి నవ్వొచ్చింది. ‘‘బస్సుల్లో లేడీస్ సీట్లు మాత్రమే ఉంటాయి. జెంట్స్ సీట్స్ ఉండవు. ఇవి అందరికీ కామన్’’ అని చెప్పాడు.. మగవాళ్ల వైపు ఉన్న సీట్లను చూపిస్తూ. ఆ రోజు కూడా ఆఫీస్ దగ్గర ఉండే స్టాప్‌లో కాకుండా ఎండ్ పాయింట్లో దిగి, కండక్టర్ని అడిగాడు ఇతడు. ఆ రోజు ఉన్నది వేరే కండక్టర్. లేడీ కండక్టర్. ‘‘మేడమ్.. ఎవరతను?’’ అని అడిగాడు. ఆమె వెంటనే అర్థం చేసుకుంది! ‘‘మా కండక్టరే. ‘లేడీస్ సీట్లోంచి లేచి, లేడీస్‌కి సీట్ ఇవ్వు’ అని గట్టిగా అన్నందుకు ఓ ప్యాసింజర్ మా కండక్టర్ని బస్సులోనే కొట్టి చంపేశాడు. ఒక్కరైనా అడ్డు రాలేదు. ఈమధ్యే జరిగింది. మనిషి పోయినా మనసింకా డ్యూటీ చేస్తున్నట్లే ఉంది’’ అని చెప్పింది. ఆమె కంట్లో తడిని గమనించాడు అతడు. -
దెయ్యాలపల్లి
‘‘నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది’’ అన్నాడు కుర్రాడు. ‘‘ఏమో.. చెప్పలేం.. ఉండిపోవలసి వస్తుందేమో’’ అన్నాడు ఆ గురువులాంటి ఆయన. ‘దెయ్యాలపల్లి’ ఇంకో రెండు కిలోమీటర్ల దూరంలో ఉందనగా, వేగంగా వెళుతున్న ఆ వ్యాన్‌లోని నలుగురికీ ‘దెయ్యాలపల్లికి స్వాగతం’ అనే బోర్డు.. ఇలా కనిపించి, అలా మాయమైపోయింది. ‘దగ్గరికొచ్చింది’ అనుకున్నారు. ఆ నలుగురిలో ఒకరు డ్రైవరు కాదు. డ్రైవరు ప్లస్ నలుగురు. మొత్తం ఐదుగురున్నారు వ్యాన్‌లో. డ్రైవరుకు, దెయ్యాలపల్లికి సంబంధం లేదు. వాళ్లు రమ్మంటే వచ్చాడు. ఎందుకు, ఏమిటి అని అడగలేదు. డబ్బులిస్తాం అన్నారు. సరేనని వచ్చేశాడు. పెట్రోల్ వాళ్లే కొట్టించాలి. భోజనం వాళ్లే పెట్టించాలి. రోజుకు ఇంతని ఇవ్వాలి. అదీ ఒప్పందం. అప్పుడు కూడా డ్రైవర్ అడగలేదు. ఏమిటీ, ఎన్నిరోజులు అని. ఎన్ని రోజులైతే మాత్రం ఏంటి? తన బండి ఖాళీగా ఉండదు. అదే అతడికి కావలసింది. ‘దెయ్యాలపల్లికి దేనికి సార్?’ అని ఒక్కమాట అడిగి ఉంటే.. డ్రైవర్ మనసు మార్చుకుని ఉండేవాడేమో అనుకోనవసరం లేదు. అతడికి దెయ్యాలపల్లి అయినా, దేవుళ్లపల్లి అయినా ఒకటే. జీవితం అతyì కి రోజూ మనుషుల్లోనే ఎక్కడో ఒకచోట దెయ్యాలను, దేవుళ్లను చూపిస్తూనే ఉంటుంది. అందుకని ఒకవేళ అతడికి దేవుడినో, దెయ్యాన్నో చూడాలని అనిపించినా దెయ్యాలపల్లికో, దేవుళ్లపల్లికో వెళ్లే అవసరం ఉండదు. ఆరు గంటలుగా అతడు డ్రైవ్ చేస్తున్నాడు. తన వ్యాన్‌లో కొంతమంది మనుషులున్నారని, వాళ్లేదో మాట్లాడుకుంటున్నారనీ ధ్యాస లేదు అతడికి. అయినా అప్పుడప్పుడు కొన్ని మాటలు అతడి చెవిలో పడుతూనే ఉన్నాయి. వాళ్ల నలుగురూ దెయ్యాలపై రిసెర్చ్ చెయ్యడానికి దెయ్యాలపల్లి బయల్దేరారని మాత్రం అతడికి అర్థమైంది. ‘పిచ్చి పని’ అనుకున్నాడు. దెయ్యాలు ఉంటే ఉంటాయి? లేకపోతే లేదు. ఉన్నాయని నిర్ధారించుకున్నందు వల్ల, లేవని నిరూపించినందు వల్ల ఈ దెయ్యాల గొడవ అక్కడితో వదిలిపోయేది కాదు. కొత్తగా మనుషులు పుట్టుకొస్తున్నట్లే.. ఆ కొత్త మనుషులకు దెయ్యాల గురించి ఈ పాత సందేహాలే మళ్లీ పుట్టుకొస్తుంటాయి. ‘‘దెయ్యాలు లేకపోతే దెయ్యాలపల్లి అనే పేరు ఎలా వస్తుంది?’’ అని అంటున్నాడు నలుగురిలో చిన్నవాడైన కుర్రాడు వ్యాను బయల్దేరినప్పటి నుండి. మిగతా ముగ్గురిలో ఇద్దరు అతడి కన్నా వయసులో కాస్త పెద్దవాళ్లు. నాలుగో మనిషి ఈ బృందానికి లీడర్లా ఉన్నాడు. గడ్డం తెల్లబడింది. జుట్టు నల్లగా ఉంది! ‘ఊళ్లు–పేర్లు’ అనే అంశంపై వాళ్లు అధ్యయనం చేస్తున్నప్పుడు ‘దెయ్యాలపల్లి’ అనే ఈ ఊరు వారి దృష్టిలో పడింది. ఆ ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందో ‘తవ్విచూద్దాం’ అని ప్రాజెక్ట్ వర్క్ ప్లాన్ చేసుకున్నారు. ‘‘నిధులు, నిక్షేపాల్లా.. దెయ్యాలు భూగర్భంలో ఉండవు.. తవ్వి తియ్యడానికి..’ అన్నాడు ఆ తెల్లగడ్డం మనిషి. మిగతావాళ్లు నవ్వారు. సర్పంచ్ గెస్ట్ హౌస్ దగ్గర వీళ్ల వ్యాన్ ఆగింది. ‘తొందరగా భలే వచ్చేశాం!’ అనుకున్నారు కానీ.. అప్పటికే సూర్యుడు కొండ దిగుతున్నాడు. ‘‘లోపల గదులన్నీ మీవే. ఉన్నన్ని రోజులు ఉండొచ్చు. ఊళ్లో తిరిగినన్ని రోజులు తిరగొచ్చు. మీకే వివరం కావాలన్నా ఊళ్లోవాళ్లు చెబుతారు. భోజనాలూ అవీ గెస్ట్ హౌస్‌కే వస్తాయి’’ అని చెప్పాడు సర్పంచ్ పంపిన మనిషి.‘‘ఆ.. మీ డ్రైవరు కూడా లోపలే ఓ గదిలో ఉండొచ్చు. వ్యాన్‌లో పడుకోనవసరం లేదు’’.. వెళ్తున్నవాడల్లా మళ్లీ వెనక్కొచ్చి చెప్పాడు ఆ మనిషి. ఆ మాటను పెద్దగా పట్టించుకోలేదు డ్రైవర్. స్నానాలు అయ్యాక, ఫ్లాస్క్‌లో సిద్ధంగా ఉన్న కాఫీని తాగుతూ బాల్కనీలోంచి బయటికి చూస్తూ నిలబడ్డారు ఆ నలుగురూ. ఊళ్లో ఇంకా పూర్తిగా చీకటి పడలేదు. దగ్గర్లో రామాలయంలోంచి భక్తి పాటలు శ్రావ్యంగా వినిపిస్తున్నాయి. ఆ ఊరి పేరుకు, ఆ ఊరున్న తీరుకూ ఎక్కడా పొంతన లేదు. అసలు ఊళ్లోకి వస్తున్నప్పుడే వాళ్లు గమనించారు.. ఊరంతా పచ్చగా, ప్రశాంతంగా ఉండడం! పొద్దునెప్పుడో పేడనీళ్లు చల్లి, ముగ్గు వేసిన ముంగిళ్లు సాయంత్రం అవుతున్నా కూడా పొద్దు పొడవడానికి ముందే సిద్ధమైపోయినట్లుగా పచ్చి వాసన కొడుతున్నాయి. ‘‘నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది’’ అన్నాడు కుర్రాడు. ‘‘ఏమో.. చెప్పలేం.. ఉండిపోవలసి వస్తుందేమో’’ అన్నాడు ఆ గురువులాంటి ఆయన. మిగతా ఇద్దరూ అర్థం కానట్లు చూశారు. ‘‘దెయ్యాలపల్లికి ఆ పేరెలా వచ్చిందో శోధించడానికి వచ్చాం మనం. కానీ అదంత తేలిగ్గా అనిపించడం లేదు. చూశారుగా.. ఇది దెయ్యాలపల్లిలా లేదు. దేవుళ్లపల్లిలా ఉంది. గుడి, చర్చి, మసీదు ప్రతి ఊళ్లోనూ ఉండేవే. కానీ ఈ ఊళ్లో ప్రతి ఇల్లూ ఓ ప్రార్థనాస్థలంలానే ఉంది’’ అన్నాడు ఆయన. ‘‘దెయ్యాలు ఉంటేనే దేవుళ్లు అవసరం ఉంటుంది సర్’’.. అకస్మాత్తుగా వెనుకనుంచి మాట వినిపించింది.చప్పున తలతిప్పి చూశారు అంతా. ఆ మాట అన్నది డ్రైవర్! వాళ్లకు నాలుగడుగుల దూరంలో ఉండి కాఫీ తాగుతున్నాడతను.తెల్లగడ్డం ఆయన పెద్దగా నవ్వాడు. ‘‘రిసెర్చ్ అవసరం లేకుండానే ఒక్క మాటతో తేల్చేశాడు’’ అన్నాడు. మిగతావాళ్లూ నవ్వారు. తెల్లారే అందరికంటే ముందు డ్రైవర్ లేచాడు. కోనేటì లో స్నానం చేసి వచ్చాడు అతడు. గుడికి కూడా వెళ్లొచ్చినట్లున్నాడు. నుదుటిపై కుంకుమ బొట్టు ఉంది. ‘‘అప్పుడే తెరిచారా?’’ అన్నాడు తెల్లగడ్డం ఆయన. ‘‘ఎప్పుడూ మూయరట’’ అన్నాడు డ్రైవర్. ‘‘అవునా! ఏ గుడి?’’ అడిగాడాయన. చెప్పాడు డ్రైవర్.లె ల్లగడ్డం ఆయన వింతగా చూశాడు. ఆ మధ్యాహ్నం తనొక్కడే ఊళ్లొకి వెళ్లొచ్చాక తన టీమ్‌కి చెప్పాడు. ‘‘రిసెర్చ్ అయిపోయింది. వెళ్దాం, సర్దుకోండి’’.డ్రైవర్‌తో పాటు మిగతా ముగ్గురూ ఆశ్చర్యంగా చూశారు. వారం తర్వాత వీళ్ల ప్రాజెక్టు రిపోర్టు సిద్ధమైంది. అందులో తెల్లగడ్డమాయన చేతి రాతతో ముగింపు వాక్యం ఇలా ఉంది:‘దెయ్యాలపల్లిలో ఒక గుడి ఉంది. అది దేవుడికి కట్టినది కాదు. ఊరికి కట్టిన గుడి! దెయ్యాలపల్లికి ఆ పేరు ఎలా వచ్చిందో ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఊరికన్నా ముందే ఆ గుడి అక్కడ వెలసింది! - మాధవ్ శింగరాజు -
నీడతో ఏడడుగులు
ఆ ఇంట్లో ఉన్నన్ని పుస్తకాలు ఏ ఇంట్లోనూ ఉండవనిపిస్తుంది. ఒక్కో పుస్తకం వెన్ను మీద ఆ పుస్తకం పేరు కనిపించేలా చక్కగా అన్నీ ర్యాకుల్లో నిలబెట్టి ఉంటాయి. ఎవరికి ఇష్టమైంది వాళ్లు తీసుకుని చదువుకుని, మళ్లీ అక్కడే పెట్టేసేలా ఆ అమరిక ఉంటుంది. ఆ ఇంట్లో అన్ని పుస్తకాలున్నా ఆ పుస్తకాలన్నీ చదివినవాళ్లు, చదువుతుండేవాళ్లు ఆ ఇంట్లో ఒక్కరే.. మనోధర్మ. అవన్నీ ఆయన సమకూర్చుకున్నవే. ఆయన భద్రపరిచినవే. సమకూర్చున్నది తనకోసమే అయినా, భద్రపరుస్తున్నది ఎవరికోసమో ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు.nమనోధర్మకు అరవై ఏళ్లుంటాయి. గృహస్థుగా అన్ని ధర్మాలూ నెరవేర్చి కాలధర్మానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. సిద్ధం కావడం అంటే, రాబోతున్నదాని కోసం ఎదురుచూడ్డం కాదు. జీవితం ఓ కొలిక్కి వచ్చాక సహజంగా వచ్చే ఆలోచనలకు మనిషి ఎదురు వెళ్లకపోవడం. ఇప్పుడీ కథ మనోధర్మ గురించి కాదు. మనోధర్మ చదవడం కోసం కొన్నేళ్లుగా ఆ ఇంట్లోని ఒక ర్యాకులో ఎదురు చూస్తూ ఉన్న ఒక పుస్తకం గురించి. ముప్పై ఏళ్లుగా మనోధర్మ తన ర్యాకుల్లో ఆ పుస్తకాన్ని చూస్తున్నాడు. ముప్పై ఏళ్లుగా దాన్ని బయటికి తీస్తున్నాడు, మొదటి రెండు పేజీలు తిరగేస్తున్నాడు, తిరిగి లోపల పెట్టేస్తున్నాడు. అంతే తప్ప చదవడం లేదు. ఆ పుస్తకం తన ఇంట్లోకి ఎలా వచ్చిందో అతడికి గుర్తు లేదు. తనైతే తెచ్చి ఉండడని ఆయన అనుకుంటూ ఉంటాడు. ఏమో.. తెచ్చానేమో అని కూడా అప్పుడప్పుడు అనుకుంటాడు. ‘నీడతో ఏడడుగులు’ అనే టైటిల్‌తో ఉన్న ఆ తెలుగు తర్జుమా పుస్తకం మనోధర్మ పుట్టకముందు నాటిది. పాలు ఎర్రగా మరిగిన రంగులోకి తిరిగి ఉన్నాయి ఆ పుస్తకంలోని పేజీలు. అప్పటికే అది పదమూడో ముద్రణ! అన్ని ముద్రణలు బహుశా ఇంగ్లిష్ వెర్షన్‌వి అయి ఉంటాయి. ఎవరో పాశ్చాత్యుడు రాశాడు. ఏడడుగులు అన్న సంప్రదాయం పాశ్చాత్యులలో ఉన్నట్లు లేదు. తెలుగు పాఠకులు కనెక్ట్ కావడం కోసం అలా తర్జుమా చేసినట్లున్నారు. ‘నీడతో ఏడడుగులు’ ఏంటోనని మొదటిసారి ముప్పై ఏళ్ల క్రితం ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుని కవరు పేజీ తిప్పాడు మనోధర్మ. ‘దెయ్యంతో కాపురం చేసిన ఓ ధైర్యవంతుడి అనుభవాలు’ అని లోపలి పేజీలో ఉంది. పుస్తకాన్ని విసిరి కొట్టేశాడు. దెయ్యాలంటే అతడికి నమ్మకం లేదు. ఏ పుస్తకాన్నైనా ఒక్కసారైనా పేజీలు తిరగేయకుండా ఉండలేని మనోధర్మ.. నీడతో ఏడడుగుల్ని ఎప్పుడు చేతుల్లోకి తీసుకున్నా మొదటి రెండు పేజీలు మాత్రమే తిప్పేవాడు. అప్పటికే అతడి ఉత్సాహం చచ్చిపోయేది. బొత్తిగా ఆసక్తి లేని పుస్తకాల్ని అతడు కనీసం వెనుక నుంచైనా పేజీలు తిప్పేవాడు. అలాక్కూడా ఈ పుస్తకాన్ని తిప్పలేదు. ఇరవై ఏళ్ల క్రితం ఒకసారి అనుకోకుండా ఆ పుస్తకాన్ని మళ్లీ చదివే ప్రయత్నం చేశాడు మనోధర్మ. పేజీ తిప్పగానే మళ్లీ అదే వాక్యం కనిపించి ఆగిపోయాడు. ‘దెయ్యంతో కాపురం చేసిన ఓ ధైర్యవంతుడి అనుభవాలు’! నవ్వుకున్నాడు. దెయ్యంతో పిరికివాడు కాపురం చేస్తే చదవడానికి ఆసక్తిగా ఉంటుంది కానీ, ధైర్యవంతుడు కాపురం చేస్తే అందులో చదవడానికి ఏముంటుందనుకుని మళ్లీ ఆ పుస్తకాన్ని విసిరికొట్టాడు.ఇప్పుడీ అరవై ఏళ్ల వయసులో మరోసారి ఆ పుస్తకం ఆయన కంట పడింది. కొద్దిసేపు ఆయన ఆ పుస్తకాన్ని చూసీచూడనట్లు ఉండిపోయాడు. ఆ పుస్తకమంటే మనోధర్మకు తేలిక భావం ఏర్పడడానికి కారణం అది దెయ్యాలపై రాసిన పుస్తకం అని మాత్రమే కాదు. ఆడవాళ్లను చులకన చెయ్యడం ఆయనకు ఇష్టం ఉండదు. పుస్తక రచయితకు నిజంగానే దెయ్యంతో కొన్ని అనుభవాలు ఉండొచ్చు. కానీ దెయ్యాన్ని భార్యతో పోలిక తెచ్చే విధంగా టైటిల్ పెట్టడం ఆయనకు నచ్చలేదు. అయితే ఆయనకు తెలియని విషయం, పుస్తకం చదివితేనే గానీ తెలుసుకోలేని విషయం ఏంటంటే.. రచయిత రాసింది తన భార్య గురించే. భార్యను దెయ్యంతో పోల్చాడు తప్ప, దెయ్యాలను భార్యతో పోల్చలేదతను. ఆ సంగతి.. మరో రెండు పేజీలైనా తిరగేస్తే తెలిసి ఉండేది మనోధర్మకు. పుస్తకాన్ని చూసీ చూడనట్లు కాసేపు అలా ఉండిపోయిన మనోధర్మ ఏమనుకున్నాడో ఏమో, ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుని పడక్కుర్చీలోకి జారగిల పడ్డాడు. గుండె ఎందుకో బరువుగా ఉన్నట్లు అనిపించింది. పుస్తకం గానీ గుండెలపై లేదు కదా అని చూసుకున్నాడు. లేదు. తన చేతుల్లోనే ఉంది. చదువుతూ చదువుతూ నిద్రలోకి ఒరిగినప్పుడు మాత్రమే ఆయన గుండెలపై పుస్తకం ఉంటుంది. గుండెలపై ఎంత పెద్ద పుస్తకం ఉన్నా ఎప్పుడూ బరువు అనిపించని మనోధర్మకు ఈ పుస్తకం చేతుల్లో ఉండగానే గుండె బరువుగా అనిపిస్తోంది! ఒకసారి లేచి కూర్చున్నాడు. గుండెల నిండా గాలి పీల్చుకుని మళ్లీ వెనక్కు వాలాడు. పుస్తకం తెరిచి ఎప్పుడూ తిప్పేవి కాకుండా మరో రెండు కొత్త పేజీలు తిప్పాడు. ‘ముందుమాట’ కనిపించింది. అందులో ఇలా ఉంది: ‘మొదటి ముద్రణలో ముందుమాట లేదు. రెండో ముద్రణ నాటికి ముందుమాట రాయవలసిన అవసరం ఏర్పడింది. తర్వాత ప్రతి ముద్రణలోనూ ఈ ముందుమాట ఉంది. అయితే ముందుమాటను ఇక్కడ రాయకపోవడానికి ఒక కారణం ఉంది’.. అని ఉంది! మనోధర్మకు ఏం అర్థం కాలేదు. అక్కడ రాయని దానికి ‘ఇక్కడ రాయడం లేదని చెప్పడం దేనికి? ఎక్కడ రాశాడో చెప్పాలి గానీ’ అనుకున్నాడు. ఇంకో పేజీ తిప్పబోతే నిద్రపట్టేసినట్టుగా అయింది. పుస్తకాన్ని గుండెలపై ఉంచుకుని నిద్రలోకి వెళ్లిపోయాడు. మళ్లీ లేవలేదు మనోధర్మ! ఇంట్లోవాళ్లు వచ్చి చూసే సరికి మనోధర్మ గుండెలపై ఉన్న పుస్తకం ఫ్యాను గాలికి రెపరెపలాడుతూ ఉంది. వెనుక అట్ట పైకి లేచినప్పుడల్లా ఆఖరి పేజీలోని ‘ముందుమాట’ బయటికి కనిపిస్తోంది! చిన్న పేరా అది. ‘విపరీతంగా అమ్ముడుపోతున్న ఈ పుస్తకాన్ని కొన్నవాళ్లే గానీ చదివినవాళ్లు ఒక్కరూ లేరు. తన గురించి నేను రాసినదాన్ని ఎవరూ చదవకుండా నా భార్య అడ్డుకుంటోంది. ఇది నా అనుమానం కాదు. చనిపోయిన నా భార్యే వచ్చి స్వయంగా నాకు చెప్పిన విషయం’ అని రాసి ఉంది. దాని కింద మరో చిన్న వాక్యం.. అతి చిన్న అక్షరాలతో ఉంది. ‘నా భార్య కంట పడకూడదనే.. ఈ ముందుమాటను వెనుక పేజీలో ఉంచాను’. -
‘ఆ దెయ్యం వెంటాడుతోంది’
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో నగదు కొరత నెలకొనడంపై కేంద్రం ప్రభుత్వం, ఆర్బీఐ లక్ష్యంగా మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం విరుచుకుపడ్డారు. నోట్ల రద్దు దెయ్యం సర్కార్‌ను వెంటాడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకు కుంభకోణాలతో విసుగెత్తిన ప్రజలు బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరించి తిరిగి వాటిని జమ చేయడం లేదని అన్నారు. రూ 500, 1000 నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం రూ 2000 నోట్లు ముద్రించింది..ఇప్పుడు రూ 2000 నోట్లను కొందరు తమ వద్దే ఉంచుకుంటున్నారని చెబుతోంది. అసలు ఈ నోట్లను ముద్రించిందే అలాంటి వారి కోసమని తాము ముందునుంచే చెబుతున్నామని చిదంబరం వ్యాఖ్యానించారు. నగదు కొరతతో నోట్ల రద్దు దెయ్యం మళ్లీ వెంటాడుతోందని అన్నారు. నోట్ల రద్దు జరిగి 17 నెలలవుతున్నా ఇప్పటివరకూ ఏటీఎంలను కొత్త నోట్లకు అనుగుణంగా ఎందుకు సర్ధుబాటు చేయలేదని చిదంబరం వరుస ట్వీట్లలో ప్రభుత్వాన్ని నిలదీశారు. నోట్ల రద్దు అనంతరం చెలామణీలో ఉన్న నగదు కేవలం 2.75 శాతమే పెరిగిందా అని ప్రశ్నించారు. అదే నిజమైతే దేశ జీడీపీకి అనుగుణంగా నగదు సరఫరాను పెంచేందుకు ఆర్బీఐని ప్రభుత్వం అనుమతించడం లేదని అనుమానించాల్సి ఉంటుందన్నారు. నోట్ల ముద్రణ, సరఫరా సంతృప్తికరంగా ఉందని ఆర్బీఐ చెబుతుండటాన్ని ఆయన ఆక్షేపించారు. ఆర్బీఐ వాదన వాస్తవమైతే మరి నగదు కొరత ఎందుకు ఏర్పడిందన్నారు. -
‘మా ఇంట్లో మగవాళ్లు లేరు’
బ్యాంకాక్ : ‘ఓ స్త్రీ రేపు రా’.. కొన్నేళ్ల క్రితం దెయ్యాల భయంతో మన దేశంలోని చాలా గ్రామాల్లో ఇలాంటి బోర్డులు దర్శనమిచ్చాయి. అయితే మూఢ నమ్మకాలను ఎక్కువగా నమ్మే థాయ్‌లాండ్‌లోని ఓ గ్రామంలో ఇప్పుడీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమ ఇంట్లో మగాళ్లు మోహిని పిశాచి మూలంగా చనిపోతుండటంతో వింత పద్ధతులకు దిగారు. ఇంతకీ కథేంటో తెలియాంటే నాఖోన్ ఫానోమ్ గ్రామానికి ఒక్కసారి వెళ్దాం. ఈశాన్య థాయ్‌లాండ్‌కు సుదూర దూరంలో ఉన్న ఆ గ్రామంలో రాత్రయ్యిందంటే చాలూ మగాళ్లు.. మహిళల మాదిరి సింగారించుకుని పడుకుంటారు. ఇళ్ల ముందు దిష్టి బొమ్మలు, బోర్డులపై రాతలు దర్శనమిస్తాయి. అవి సాధారణంగా ఉంటే చర్చనీయాంశంగా ఎందుకు మారుతాయి?. దిష్టి బొమ్మలకు దుంగలతో పెద్ద పురుషాంగం మాదిరి ఏర్పాట్లను చేస్తున్నారు. ఇక బోర్డులపై ‘మా ఇంట్లో మగవాళ్లు లేరు’ అన్న రాతలు దర్శనమిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం ఆ ఊళ్లో ఓ వితంతువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కొన్ని రోజుల తర్వాత ఆ గ్రామంలో పురుషులు విచిత్రంగా ప్రాణాలు విడుస్తున్నారు. నిద్రలో పడుకున్న వాళ్లు.. పడుకున్నట్లే ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఆ మహిళ మోహిని పిశాచంలా మారి తమ ఇంట్లో మగాళ్లను బలితీసుకుంటూ ప్రతీకారం తీర్చుకుంటుందని ఆ ఊరి మహిళలు నమ్మసాగారు. వారంతా కలిసి కొందరు తాంత్రిక పెద్దలను కలిశారు. వారి సలహా మేరకు ఆ పిశాచి నుంచి మగాళ్లను రక్షించుకోవడానికి ఈ పద్ధతులను అవలంభిస్తున్నారు. అంత పెద్ద మర్మాంగం చూస్తే ఆ ఇంట్లోకి వచ్చేందుకు దెయ్యం వణికిపోతుందని.. ఒకవేళ తెగించి వచ్చినా మహిళల రూపంలో ఉన్న మగాళ్లని చూసి వెళ్లిపోతుందనే ఆ పని చేశారంట. అయితే ఈ పద్ధతులు పాటిస్తున్నాకే తమ గ్రామంలో పురుషుల మరణాలు ఆగిపోయాయని అక్కడివారు చెబుతున్నారంట. అలాంటప్పుడు తాము ఎంత చెప్పినా ఏం లాభమని హేతువాదులు, వైద్యులు అంటున్నారు. -
దెయ్యాల రోజు
అనుకోకుండా వాళ్లిద్దరూ కలుసుకున్నారు! ఒకతను చక్రవర్తిలా ఉన్నాడు. చక్రవర్తి కళ లేదు. ఇంకొకతను చక్రవర్తిలా లేడు. చక్రవర్తి కళ ఉంది! చక్రవర్తి కళ ఉన్న వ్యక్తిలోని కాంతి.. చక్రవర్తి కళ లేని వ్యక్తి మీద, ఆ చుట్టపక్కల పడుతోంది.‘‘నిన్నెక్కడో చూశాను..’’ చికాగ్గా అన్నాడు చక్రవర్తిలా ఉన్నతను కళ్లకు చేతులు అడ్డుపెట్టుకుంటూ.‘‘నాకూ అనిపిస్తోంది, మిమ్మల్నెక్కడో చూసినట్లు..’’ చిరునవ్వుతో అన్నాడు చక్రవర్తిలా లేనతను. ‘‘నేను నీతో చికాగ్గా మాట్లాడుతున్నాను కదా! నువ్వు నాతో ప్రవక్తలా నవ్వుతూ ఎలా మాట్లాడ గలుగుతున్నావు?’’ అన్నాడు చక్రవర్తిలా ఉన్నతను. ప్రవక్త నవ్వు ఆపలేదు. చక్రవర్తి చికాగ్గా చూశాడు.‘‘నేను నిన్ను ‘నువ్వు’ అంటున్నాను కదా! నువ్వు నన్నెలా ‘మీరు’ అనగలుగుతున్నావు? నన్ను‘మీరు’ అనడం మానెయ్. అందులో నాకు వ్యంగ్యం కనబడుతుంది. వ్యంగ్యంగా మాట్లాడేవాడు తనను తను గొప్పవాడినని అనుకుంటాడు. నాకన్నా గొప్పవాడు ఇంకొకడు ఉండడం నాకు ఇష్టం లేదు’’ అన్నాడు చక్రవర్తి. మళ్లీ నవ్వాడు ప్రవక్త. ‘‘మీకన్నా గొప్పవాడు ఇంకొకరు లేరు కానీ, మీకన్నా గొప్పది ఇంకొకటి ఉంది’’ అన్నాడు. ‘‘ఏంటది?’’ అన్నాడు చక్రవర్తి.‘‘ప్రేమ’’ అన్నాడు ప్రవక్త. చక్రవర్తి చికాకు ఎక్కువైంది.ప్రవక్త చిరునవ్వు ఎక్కువా కాలేదు, తక్కువా కాలేదు.ప్రవక్తని అసహ్యంగా చూస్తున్నాడు చక్రవర్తి. చక్రవర్తిని ఆపేక్షగా చూస్తున్నాడు ప్రవక్త. ఆ చూపు, ఆ మాట, ఆ నవ్వు.. ఏ జన్మలోనివో గుర్తుకొచ్చింది చక్రవర్తికి! ‘‘నువ్వా!! నిన్ను మళ్లీ చూడాలని నేను అనుకోలేదు. యుగాల తర్వాత కూడా నువ్వు అలాగే యవ్వనంతో ఎలా ఉన్నావ్?’’ అన్నాడు చక్రవర్తి. చక్రవర్తి తనను తను చూసుకున్నాడు. కిరీటం ఉంది. వెలుగు లేదు. ఒంటి మీద మణులున్నాయి. మెరుపు లేదు. ఖడ్గం ఉంది. పదును లేదు. ప్రవక్తను చూశాడు. కిరీటం లేదు. వెలుగుంది. మణుల్లేవు. మెరుపుంది. ఖడ్గం లేదు. పదునుంది. ఆ వెలుగు, మెరుపు, పదును అతడి చిరునవ్వులోంచి కిరణాల్లా ప్రసరిస్తున్నాయి. ‘‘ఈ చీకటి రాత్రి ఎక్కడివీ సూర్యకిరణాలు?’’ విస్తుపోయాడు చక్రవర్తి.‘‘సూర్యకిరణాలు కావు. ప్రేమ కిరణాలు. వేల సూర్యుళ్లనే వెలిగించే ప్రేమ కిరణాలు’’ నవ్వి, చెప్పాడు ప్రవక్త.‘‘నవ్వు ఆపి చెప్పు. నువ్వింకా అలాగే ఎలాగున్నావ్?’’ అని అడిగాడు చక్రవర్తి.‘‘నాలో ప్రేమ ప్రవహిస్తోంది. ప్రేమ ప్రవహించే చోటంతా పచ్చదనం ఉంటుంది. పూల పరిమళం ఉంటుంది. పక్షుల రాగాలు ఉంటాయి.’’‘‘నీ బొంద కూడా ఉంటుంది. ఉరి తీయించినా ఇంకా గాల్లోనే వేలాడుతున్నావా! నీతో పాటు నీ ప్రేమా చచ్చిపోతుందనుకున్నాను..’’ కోపంతో ఊగిపోతున్నాడు చక్రవర్తి. ‘‘నా ప్రేమ తనతో పాటు నన్నూ బతికించుకుంది’’ అన్నాడు ప్రవక్త.‘‘నిన్నొక్కడినేనా.. ఈ గాలిలో తిరుగుతున్న ప్రేమ దెయ్యాలనన్నింటినీనా?’’ విసుగ్గా అన్నాడు చక్రవర్తి.‘‘నేనొకటి చెప్తాను చక్రవర్తీ..’’ అన్నాడు ప్రవక్త. మొదటిసారి అతడు ‘చక్రవర్తీ’ అనడం. ‘‘నేనెవరో గుర్తొచ్చానా?’’ ఆశ్చర్యంగా అడిగాడు చక్రవర్తి. ‘‘ప్రేమ దేన్నీ మర్చిపోనివ్వదు. దేన్నీ వాడిపోనివ్వదు. దేన్నీ దుఃఖపడనివ్వదు. ఆ రోజు జరిగినవన్నీ నాకింకా గుర్తున్నాయి చక్రవర్తీ’’ అన్నాడు ప్రవక్త. ‘ఆ రోజు’ అంటే.. ఏ రోజో చక్రవర్తికి అర్థమైంది. ప్రవక్తను తను ఉరి తీయించిన రోజు. ఉరితీతకు ముందు.. ప్రవక్తతో చాలాసేపు ఘర్షణ పడ్డాడు చక్రవర్తి. ‘నీ ప్రేమ ప్రవచనాలతో యువతను చెడగొడుతున్నావు ప్రవక్తా! యువకులు యుద్ధానికి, యువతులు పద్ధతులకు పనికిరాకుండా పోతున్నారు. చచ్చేముందైనా వాళ్లకు చివరి మాటగా చెప్పు. పనికిమాలిన ప్రేమలకు దూరంగా ఉండమని చెప్పు’ అంటున్నాడు చక్రవర్తి.‘ప్రేమ.. ప్రజల్నీ, రాజ్యాల్నీ దగ్గర చేస్తుంది చక్రవర్తీ. ఒక్క శత్రువైనా మీకు మిగలకుండా చేస్తుంది. అప్పుడిక యుద్ధాలతో, పద్ధతులతో పనేముంది?’‘నీకర్థం కాదు ప్రేమోన్మాదీ.. రాజనీతిజ్ఞుడెవ్వడూ ప్రేమను అంగీకరించడు. పోనీలే పాపం అని ప్రేమించుకోనిస్తే.. చిన్న పువ్వును విసిరి రాజ్యంలోని యువతీయువకులు నా తలపై కిరీటాన్ని పడగొట్టేస్తారు’ అన్నాడు చక్రవర్తి.‘ప్రేమ కన్నా గొప్ప రాజ్యం లేదు. గొప్ప కిరీటం లేదు. అంతిమంగా ప్రేమదే సార్వభౌమత్వం’ అన్నాడు ప్రవక్త.చక్రవర్తి నిట్టూర్చాడు. ప్రవక్త వైపు జాలిగా చూస్తూ అక్కడి నుంచి నిష్క్రమించాడు. వెనకే తలుపులు మూసుకున్నాయి. ‘ప్రేమమూర్తులైన ఈ ప్రవక్తగారిని ప్రేమగా ఉరి తియ్యండి..’అవే చక్రవర్తి చివరి మాటలు. ప్రవక్తవి కూడా అవే చివరి చూపులు అనుకున్నాడు. మళ్లీ ఇలా మనిషిలా దాపురించాడు! ‘‘రాజ్యాలు అంతరించాయి. రాజును నేనూ అంతరించాను. నువ్వూ, నీ ప్రేమా ఇంకా ఇలాగే తగలడ్డాయి. నన్నెందుకిలా వెంటాడుతున్నావు? నా బతుక్కన్నా, నీ బతుకే బాగుందని చెప్పడానికా?’’ అన్నాడు చక్రవర్తి. ‘‘నేను మిమ్మల్ని వెంటాడడం లేదు చక్రవర్తీ. లోకంలోని ప్రేమ వెంటాడుతోంది. ఆ వెంటాడే ప్రేమకు నేనొక హృదయాన్ని మాత్రమే’’ అన్నాడు ప్రవక్త. ఇద్దరూ కాసేపు మాట్లాడుకోలేదు. మాట్లాడుకోని ఆ కాస్త సమయంలో ప్రవక్త చక్రవర్తిని ప్రేమిస్తూ కూర్చున్నాడు. చక్రవర్తి ప్రవక్తను ద్వేషిస్తూ కూర్చున్నాడు. అయితే ఎక్కువసేపు అతడలాద్వేషించలేకపోయాడు. ప్రేమ ద్వేషాన్ని మింగేసింది!‘‘ఈ లోకాన్ని కూడా నీ ప్రేమకు బందీని చెయ్యాలని వచ్చావా వాలెంటైన్?’’ అని అడిగాడు చక్రవర్తి. ‘‘ప్రేమ బందీని చెయ్యదు క్లాడియస్. బంధనాల నుంచి స్వేచ్ఛను ఇస్తుంది’’ అన్నాడు ప్రవక్త. చక్రవర్తికి ద్వేషం అనే బంధనం నుంచి విముక్తి లభించింది. ప్రవక్త వెంట గాలిలో పైకి లేచాడు. మాధవ్ శింగరాజు -
యూనివర్సిటీలో దెయ్యం : భయంతో క్లాస్‌లకు బంక్
కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ : ఉత్తర బెంగాల్ విశ్వవిద్యాలయ విద్యార్థులను దెయ్యం భయం వెంటాడుతోంది. దీంతో కొద్ది రోజులుగా కొందరు విద్యార్థులు తరగతులకు హాజరుకావడం లేదు. నార్త్ బెంగాల్ యూనివర్సిటీ సాల్ అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉంది. ఆంత్రోపాలజీ డిపార్ట్మెంట్కు అతి దగ్గరగా ఉన్న అటవీ ప్రాంత్రంలో దెయ్యం సంచరిస్తోందనే పుకార్లు మొదలయ్యాయి. కొందరు విద్యార్థులు తాము దెయ్యాన్ని చూశామని, ఆ సందర్భంగా తీసిన ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో కలకలం రేగింది. రాత్రి వేళల్లో ఆ ప్రాంతానికి చేరువలోని ఇళ్ల నుంచి వింత శబ్దాలు వస్తుండటంతో విద్యార్థుల భయం మరింత పెరిగింది. దీంతో పలువురు ఆంత్రోపాలజీ విద్యార్థులు తరగతులకు హాజరుకావడం మానేశారు. దెయ్యం ఘటనపై స్థానిక పోలీసు స్టేషన్లో సైతం కేసు నమోదైంది. దెయ్యం ఫొటోను క్షుణ్ణంగా పరిశీలించిన యూనివర్శిటీ యాజమాన్యం అది నకిలీదని పేర్కొంది. -
దెయ్యాల మలుపు
ఎనిమిదిన్నరకు బయల్దేరాల్సిన బస్సు తొమ్మిదైనా కదల్లేదు. సీట్ నెంబరు ఎయిట్ ప్రయాణికుడి కోసం బస్సు ఎదురుచూస్తోంది. బస్సుకోసం మనిషి ఎదురుచూడాలి. బస్సు మనిషి కోసం ఎదురుచూస్తోంది! అంటే మనిషిలో డిసిప్లీన్ తప్పింది. దారుణం అనిపించింది రాజేందర్‌కు. డ్రైవరేం తొందరపడడం లేదు. రావలసినవాళ్లు రాక మానరు, కదలవలసింది కదలక మానదు అనే కర్మ సిద్ధాంతం ఏదో ఆయన జీవితాన్ని నడిపిస్తున్నట్లుంది. లేదా, ‘పికప్ నా చేతుల్లో పనే కదా, ఎంత ఆలస్యం అయితే మాత్రం ఏముందీ’ అనుకుంటూనైనా ఉండాలి. బస్సు దిగి తాపీగా ఒళ్లు విరుచుకుంటున్నాడు. కండక్టరు కూడా పెద్దగా కంగారు పడడం లేదు. ఆయనకూ అలవాటైనట్లుంది.. రోజూ ఎవరో ఒకరు లేట్‌గా పరుగెత్తుకుంటూ రావడం. నిజానికి బస్సులో ఉన్నవాళ్లిద్దరూ డ్రైవర్లే. బస్సు గమ్యస్థానానికి చేరేలోపు ఒకరు కొన్ని గంటలు, ఇంకొకరు కొన్ని గంటలు రాత్రంతా డ్రైవ్ చేస్తారు. బస్సులో ఉన్నవన్నీ రిజర్వేషన్ సీట్లే కాబట్టి టిక్కెట్లు కొట్టడం ఉండదు, చార్టు చెక్ చేసుకోవడం మాత్రమే ఉంటుంది. అది పెద్ద పనేం కాదు. చార్టు చెక్ చేస్తున్నప్పుడు కండక్టరు అయిన మనిషే, బస్సు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ అవుతాడు.‘‘ఇంకా ఎంతసేపు ఆపుతారయ్యా?’’.. ప్రయాణికులెవరో వెనుక సీట్లలోంచి పెద్దగా అరుస్తున్నారు. బస్సుకు కుడివైపు డ్రైవర్ వెనుక వరుసలో కూర్చొని ఉన్నాడు రాజేందర్. సీట్ నెంబర్ సెవన్ అతడిది. విండో సీట్. ఆ రావలసిన ప్రయాణికుడిది రాజేందర్ పక్క సీటే. సీట్ నెంబర్ ఎయిట్. ఇంతమందిని టార్చర్ పెడుతున్న ఆ వ్యక్తిని.. బస్సు దిగైనా సరే, వెతుక్కుంటూ వెళ్లి ఒకసారి చూడాలి అనిపించింది రాజేందర్‌కి. ‘‘ఆ వస్తున్నాడు’’ అన్నారెవరో! మహానుభావుడు.. అనుకున్నాడు రాజేందర్. అయితే వస్తున్నది సీట్ నెంబర్ ఎయిట్ ప్యాసింజర్ కాదు. అంతవరకు బయట బస్కీలు తీస్తున్న బస్ డ్రైవర్. నేరుగా వచ్చి స్టీరింగ్ సీట్లో కూర్చున్నాడు. బస్ స్టార్ట్ అయింది. ‘‘ప్యాసింజర్ ఫోన్ ఎత్తట్లేదు. ఎంతసేపని చూస్తాం’’ అంటున్నాడు కండక్టర్. బస్సు వేగం పెరిగింది. సిటీ శివార్లకు రాగానే బస్సులో లైట్లన్నీ ఆఫ్ అయ్యాయి. కొద్దిగా తెరిచి ఉన్న కిటికీలోంచి వస్తున్న చల్లగాలికి మెల్లిగా కునుకు పట్టింది రాజేందర్‌కి. తన పక్క సీటు ఖాళీగా ఉండడం అతడికి కంఫర్ట్‌గా ఉంది. పెద్ద కుదుపుతో రాజేందర్‌కి మెలకువ వచ్చింది. టైమ్ చూసుకున్నాడు. ఒంటి గంట దాటింది. బస్సు వేగంగా పోతోంది. లేట్‌ని కవర్ చెయ్యాలని యాక్సిడెంట్ చెయ్యరు కదా అనుకున్నాడు. ఆ వెంటనే గ్రహించాడు.. అది బస్సు కుదుపు కాదు, తన పక్కన కూర్చొని ఉన్న మనిషి కుదుపు! ఎక్కడో బస్సు ఆగినప్పుడు ఎక్కి ఉంటాడు అనుకుని, తనవైపు తనే సర్దుకుని కూర్చున్నాడు. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ‘‘మీరెప్పుడు ఎక్కారు? మీదేనా ఈ రిజర్వేషన్ సీటు?!’’... గొంతు తగ్గించి అడిగాడు ఆ మనిషి రాజేందర్‌ని! నిజానికది రాజేందర్ అడగవలసిన ప్రశ్న. ‘‘ఎప్పుడెక్కడం ఏంటీ? స్టార్టింగ్ పాయింట్ నుంచీ నేను ఇదే సీట్లో ఉన్నాను. మీరే మధ్యలో ఎక్కినట్లున్నారు’’ అన్నాడు రాజేందర్ విసుగ్గా. ఆ మనిషి నవ్వాడు. నవ్వు కనిపించడం లేదు. నవ్వడమైతే తెలుస్తోంది. ‘‘నేనూ స్టార్టింగ్ పాయింట్ నుంచీ ఉన్నాను. మీ కోసమే కదా బస్సును ఆరగంట సేపు ఆపేశాడు డ్రైవర్. అప్పటికీ మీరు రాకపోతేనే బస్సు బయల్దేరింది’’ అన్నాడు. రాజేందర్‌కి మతిపోయింది. కోపం వచ్చింది. ‘‘అలాగా?!’’ అని ఊరుకున్నాడు. రాజేందర్ ‘అలాగా’ అనేసి, కళ్లు మూసుకోవడం ఆ మనిషి ఇగోపై దెబ్బకొట్టింది. అప్పటికప్పుడు బస్సు ఆపించి, ఇతని వల్లే కదా బస్ లేట్ అయిందని ఇద్దరు డ్రైవర్ల చేత, బస్సులోని ప్యాసింజర్లందరి చేతా చెప్పించాలన్నంత కోపం వచ్చింది. ‘‘నేనేమైనా దెయ్యాన్ని అనుకుంటున్నారా? పరుగెడుతున్న బస్సులోకి కిటికీలోంచి దూరి వచ్చి, ఖాళీగా ఉన్న సీట్లో కూర్చోడానికి’’ అన్నాడు. దెయ్యం అనే మాట వినపడగానే రాజేందర్ తన సీట్లో నిటారుగా కూర్చున్నాడు. పైగా ఆ రూట్లో ఎక్కడో దెయ్యాల మలుపు ఉంటుందని ఎవరో అనుకుంటుండగా ఎప్పుడో విన్నట్లు అతడికి గుర్తు. తన పక్కన ఉన్న మనిషిని చూస్తుంటే ఎందుకో రాజేందర్‌కి అనిపించింది.. బస్సు దెయ్యాల మలుపు దాటి ఉంటుందని! రాజేందర్ అలా నిటారు అవ్వగానే పక్కనున్న మనిషి కసిగా నవ్వుకున్నాడు. ఆ మనిషి రాజేందర్‌ని వదలదలుచుకోలేదు! తను టైమ్‌కి రాకుండా, తనను టైమ్‌కి రాలేదంటాడా? పైగా ‘అలాగా’ అని వ్యంగ్యంగా అంటాడా?!‘‘మీ పేరేంటి?’’ అని అడిగాడు ఆ వ్యక్తి రాజేందర్‌ని. రాజేందర్ చెప్పదలచుకోలేదు. కానీ ఆ వ్యక్తి ఒకవేళ నిజంగానే మనిషి కాకపోతే? అందుకే చెప్పాడు. ‘రాజు’ అని చెప్పాడు. ‘రాజేందర్’ అని చెప్పలేదు. ఆ వ్యక్తి నవ్వాడు. ‘‘రాజా.. శ్రమ తెలియకుండా ఉండడానికి నీకో కథ చెప్తాను వింటావా?’’ అన్నాడు. రాజేందర్‌కి రూఢీ అయింది. బస్సు దెయ్యాల మలుపు దాటేసిందని, ఆ మలుపులోంచి ఒక దెయ్యం వచ్చి తన పక్కన కూర్చుందనీ! మెల్లిగా సీట్లోంచి లేవబోయాడు. లైట్లన్నీ ఆపేసుకుని.. బస్సు వేగంగా పోతుంటే, అంత రాత్రప్పుడు తనొక్కడే లేచి ఎక్కడికి వెళ్లాలో, ఎక్కడ కూర్చోవాలో ఆలోచించకుండానే లేవబోయాడు. ఒక్కసారిగా బస్సు ఆగిపోయింది! ఎవరో పిలిచినట్లుగా రాజేందర్ పక్క సీటు మనిషి.. ఆ చీకట్లోనే వడివడిగా బస్సు దిగి వెళ్లిపోయాడు. అతడలా దిగిపోగానే, మళ్లీ బస్సు బయల్దేరింది. కిటికీ అద్దాల్లోంచి బయటికి చూస్తూ.. ‘‘ఎక్కడి వరకూ వచ్చాం’’ అని అడిగాడు రాజేందర్ తన ముందు మెలకువొచ్చి కూర్చున్న ప్యాసింజర్ని. ‘‘దెయ్యాల మలుపు’’.. చెప్పాడతను. తెల్లారే బస్ ఎండ్ పాయింట్లో దిగాడు రాజేందర్. డ్రైవర్లిద్దరూ టీ తాగుతున్నారు. ‘రాత్రి దెయ్యాల మలుపులో బస్సులోంచి దిగిపోయిన ఆ మనిషెవరు?’ అని వాళ్ల దగ్గరికి వెళ్లి అడుగుదామని అనుకున్నాడు రాజేందర్. కానీ అడక్కుండానే వెళ్లిపోయాడు. ‘‘మొన్న కూడా ఇలాగే జరిగింది. భోజనాలకు ఆపినప్పుడు ప్యాసింజర్లు బస్సులు మారిపోతున్నారు. రాత్రి ఎక్కిన మనిషిని నేనూ చూసుకోలేదు. సీటు నెంబరు కరెక్టే. బస్సు నెంబరు వేరే. వెనకొచ్చే డ్రైవర్ మనల్ని ఓవర్టేక్ చేసుకొచ్చాడు.. ఈ ప్యాసింజర్ కోసం. ఏం మనుషులో ఏమో’’ అంటున్నాడు ఇద్దరిలో ఒక డ్రైవర్. -మాధవ్ శింగరాజు -
శ్మశాన సౌందర్యం
చలి ఎక్కువైంది. ఎముకలు కొరికే చలి. ‘దెయ్యాలకు ఎముకలు ఉండవు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఈ చలికి చచ్చి, మనుషులయ్యేవి’.. అని చిన్న స్లిప్పులో బాల్‌పెన్‌తో రాసుకుని ఆ స్లిప్పునీ, పెన్నునీ తిరిగి జేబులో పెట్టుకున్నాడు కల్పేశ్.ఆ ముక్క రాసుకోడానికి కాస్త ముందు, కల్పేశ్ అదే స్లిప్పులో ఇంకో ముక్క కూడా రాసుకున్నాడు. ‘వెన్నెలే లేకపోయుంటే ఇంత శ్మశాన సౌందర్యం మనిషికి దక్కేది కాదేమో!’ అని. శ్మశానంలో అంత రాత్రప్పుడు ఒక్కడే కూర్చొని ఉన్నాడు కల్పేశ్. ఎంత రాత్రప్పుడో కల్పేశ్ చూసుకోలేదు. ‘అంత రాత్రప్పుడు’ అని మనం అనుకోవడమే కానీ, కల్పేశ్‌కి అది అంత రాత్రి, ఇంత రాత్రి కాదు. రాత్రి మాత్రమే! మనుషుల్ని చూసినవాడు చీకటిని కొలుచుకుని, చీకటిని తలచుకుని భయపడడు. బాగా చలిగా ఉంది. బాగా చలిగా ఉన్నట్లనిపించడం చలి ఎక్కువై కాదు.. ఆ రోజు అక్కడ.. మండుతున్న చితి ఒక్కటి కూడా లేకపోవడం అని కల్పేశ్ గ్రహించాడు. కల్పేశ్ బాగుంటాడు. శ్మశానంలో రాత్రి పూట, అదీ.. సమాధి అరుగు మీద ఒంటరిగా కూర్చొని, దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న మనిషి గురించి ఇలా చెప్పడం అసందర్భంగా ఉంటుంది. అయినా చెప్పాలి. కల్పేశ్ బాగుంటాడు. బాగుండడం అంటే లోపల ఎలాగుంటాడో బయటికీ అలాగే ఉంటాడు. ‘‘ఇంత చలిలో బయటికెందుకొచ్చావ్? వెళ్లు లోపలికి..’’ ఉలిక్కిపడి చూశాడు కల్పేశ్.ఎవరో మనిషి! దెయ్యంలా ఉన్నాడు. చేతిలో కర్ర ఉంది కాబట్టి అతడిని మనిషిగా పోల్చుకున్నాడు కల్పేశ్. కర్ర పట్టుకుని ఉన్న దెయ్యాన్ని అతడు ఏ పుస్తకంలోనూ చూడలేదు. అందుకే అతడు మనిషి అని తేలిగ్గా గుర్తుపట్టేశాడు. ‘‘ఇంత చలిలో బయటికెందుకొచ్చావ్? వెళ్లు లోపలకి..’’ అని మళ్లీ గదమాయించాడు ఆ మనిషి. ‘‘బయటికి రావడం ఏంటి? లోపలికి వెళ్లడం ఏంటి?’’ అన్నాడు కల్పేశ్.‘‘నీలాంటి పిల్ల దెయ్యాలను చాలా చూశాను కానీ, శకలు మానెయ్. నన్ను భయపెట్టడానికి సమాధిలోంచి బయటికి వచ్చి కూర్చున్నట్లున్నావ్. చలికి ఛస్తావ్. వెళ్లు లోపలికి’’ అన్నాడు.పెద్దగా నవ్వాడు కల్పేశ్. ‘‘నేను దెయ్యాన్ని కాదు. మనిషిని’’ అన్నాడు. ఆ మనిషి కూడా నవ్వాడు. అయితే కల్పేశ్ నవ్వినంత పెద్దగా మాత్రం నవ్వలేదు.‘‘మనిషివైతే శ్మశానంలో ఎందుకు కూర్చున్నావ్? మీవాళ్లెవరైనా పోయారా’’ అని అడిగాడు. ‘‘మావాళ్లెవరూ పోలేదు. నేనే పోవాలనుకుంటున్నాను’’ అన్నాడు కల్పేశ్. ఆ మనిషి బిత్తరపోయాడు. ‘‘పోయిన తర్వాతే ఎవరైనా ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి పోవాలనుకోరు’’ అన్నాడు. ‘‘పోయేవరకైనా ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. నాకు ఈ ప్లేస్ నచ్చింది’’ అన్నాడు కల్పేశ్. జాలిగా చూశాడు ఆ మనిషి కల్పేశ్ని. కల్పేశ్‌కి డౌటొచ్చింది. మనిషిని చూసి మనిషి జాలిపడడం తనెప్పుడూ చూడలేదు. ఈ మనిషి తనపై జాలిపడుతున్నాడంటే.. నిజంగా మనిషే అయివుంటాడా?! ‘‘ఏంటి ఆలోచిస్తున్నావ్?’’ అన్నాడు ఆ మనిషి.‘‘నేనేం భయపడను కానీ, నిజంగా నువ్వు మనిషివేనా.. చెప్పు’’ అన్నాడు కల్పేశ్. ఆ మనిషి ఈసారి పెద్దగా నవ్వాడు.‘‘ఎందుకు నవ్వుతున్నావ్?’’‘‘మనం అడగాలనుకున్నది మనల్నే అడిగితే నవ్వు రాదా’’ అని మళ్లీ పెద్దగా నవ్వాడు ఆ మనిషి. ‘‘ఇలా మాటిమాటికీ నవ్వడం కూడా మనిషి లక్షణంలా లేదు’’ అన్నాడు కల్పేశ్. ‘‘సరే, ఇక్కడెందుకు కూర్చున్నావ్?’’ అన్నాడు ఆ మనిషి. ‘‘రోజూ వచ్చి, ఇక్కడి లైఫ్ ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేసి వెళ్తున్నాను’’‘‘లైఫ్ లేనివాళ్లుండే చోటు కదా ఇదంతా. ఇక్కడ లైఫ్ ఎందుకుంటుంది?’’ ‘‘కానీ ఈ లైఫ్ నాకెందుకో బెటర్‌గా అనిపిస్తోంది. నేనున్న ప్రపంచం నాకు నచ్చడం లేదు.’’‘‘ఏం నచ్చడం లేదు?’’‘‘అదంతా అబద్ధాల ప్రపంచం. ఒక్కరూ నిజమైన మనిషిలా బతకడం లేదు’’.‘‘నీకొచ్చిన నష్టం ఏంటి?’’‘‘నన్నూ వాళ్ల అబద్ధాల్లో కలిపేసుకుంటున్నారు. నేనెవరో తెలియనివాళ్లు కూడా నాపై అబద్ధాలు చెబుతున్నారు. నేనేంటో బాగా తెలిసినవాళ్లు కూడా ఆ అబద్ధాలనే నిజం అని నమ్ముతున్నారు.’’‘‘నీకొచ్చిన నష్టం ఏంటి?’’‘‘నిజాన్ని చంపడమూ, మనిషిని చంపడమూ ఒకటే అని నా ఫీలింగ్. బతికి ఈ అబద్ధాలతో పడలేకపోవడం కన్నా.. చచ్చి, నా మీద అబద్ధాలను పడనివ్వకపోవడం నయం కదా’’ అన్నాడు కల్పేశ్.పెద్దగా నవ్వాడు ఆ మనిషి. ‘‘చనిపోయాకైనా నీ గురించి అబద్ధాలు చెప్పుకోరని ఎందుకు అనుకుంటున్నావ్?’’ అన్నాడు. కల్పేశ్ ఆ మనిషి వైపే కన్నార్పకుండా చూశాడు.‘‘చనిపోయి వచ్చాక, ఇక్కడైనా అబద్ధాలు చెప్పేవాళ్లు ఉండరని ఎందుకనుకుంటున్నావ్?’’ అన్నాడు.కల్పేశ్ ఆ మనిషినే చూస్తున్నాడు. ‘‘ఇవన్నీ కాదు.. ఇంకా నువ్వు బతికే ఉన్నావని ఎందుకనుకుంటున్నావ్?’’ అన్నాడు. ‘‘అదేంటి?’’ అన్నాడు కల్పేశ్, తనని తను చూసుకుంటూ. ఆ మనిషి నవ్వాడు. ఈసారి చిన్నగా నవ్వాడు. తాత్వికంగా నవ్వాడు. మనవడితో మాట్లాడుతున్న తాతయ్యలా నవ్వాడు. ‘‘అబద్ధాలూ నిజాలూ కాదు. అవతలివాళ్లు నీ గురించి ఏమనుకుంటున్నారోనని నువ్వు ఆలోచిస్తున్నావంటే నువ్వు బతికిలేనట్లే’’ అన్నాడు ఆ మనిషి. విస్మయంగా చూశాడు కల్పేశ్.‘‘ఒకటి చెప్పు.. నువ్వు నిజంగా మనిషివేనా? మనిషి అని నమ్మించడానికి కర్ర పట్టుకుని తిరుగుతున్న దెయ్యానివా?’’ అని అడిగాడు ఆ మనిషిని.ఆ మనిషేం చెప్పకుండా వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ కల్పేశ్తో అన్నాడు..‘‘లోపలికెళ్లు.. చలికి చచ్చిపోతావు.’’ ‘‘ఇంతకీ ఆ ఇద్దరిలో ఎవరు పెద్దమ్మా.. మనిషి?’’ అని అడిగాడు వరుణ్. వాడికి పన్నెండేళ్లు. పెద్దమ్మ ప్రతిరోజూ వాడికో దెయ్యం కథ చెప్పాల్సిందే. ‘‘అదేమిట్రా.. వాళ్లిద్దర్లో దెయ్యం ఎవరని అడుగుతావని అనుకున్నానే’’ అని ఆశ్చర్యపోయింది పెద్దమ్మ. -
దెయ్యం చెట్టు
హైదరాబాద్ వరంగల్ హైవేలో సి.పి.ఆర్.ఐ. మలుపు దాటిన మూడు నిముషాలకు నారపల్లి క్రాస్ వస్తుంది. అక్కడి నుంచి కుడివైపు లోపలికి ఇరవై నిముషాలు నడుచుకుంటూ వెళ్తే ప్రహ్లాద్ ఇల్లు వస్తుంది. ప్రహ్లాద్ ఆఫీస్ జూబ్లీ హిల్స్‌లో. ఉంటున్నది ఇదిగో.. ఈ నారపల్లి క్రాస్ నుంచి కుడివైపు కొంత దూరం నడిచాక, కాలికి తగిలినట్లుగా వచ్చే కాలనీ లాంటి ప్రదేశంలో. ఆఫీస్‌కి ప్రహ్లాద్ పగలు ఏ సమయంలో బయల్దేరినా రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి మాత్రం పన్నెండు దాటుతుంది. ఇంటికి వచ్చేటప్పటికి కాదు, ఇంటికి చేరుకోడానికి నారపల్లి క్రాస్‌కు వచ్చేటప్పటికి. ఇక అక్కడి నుంచి ఆ చీకట్లో ఒకటే నడక. ఒక్కడే నడక. దారికి రెండు పక్కల తుప్పలు, పొదలు. రెండు వైపులా అక్కడొక చెట్టు, ఇక్కడొక చెట్టు.. అలా కొన్ని చిన్న చెట్లు. వాటిల్లో ఒకే ఒక పెద్ద చెట్టు. దెయ్యంలా ఉంటుందది! పదేళ్లు అవుతోంది ప్రహ్లాద్ ఫ్యామిలీ ఆ ఏరియాకు వచ్చి. ‘‘ఇంత దూరం ఎందుకండీ’’ అనలేదు ప్రహ్లాద్ భార్య. ప్రహ్లాద్‌కి చెట్లు, పుట్టలు అంటే ఇష్టం అని పెళ్లికి ముందే ఆమెకు తెలుసు. అరేంజ్డ్ మ్యారేజ్‌లో అభిరుచుల్ని షేర్ చేసుకుంటున్నప్పుడు ప్రహ్లాద్లోని పచ్చదనం బయటపడింది. ‘‘నాకూ ఇష్టమే’’ అంది. ప్రహ్లాద్ ఇష్టమయ్యాడు కాబట్టి, నాకూ ఇష్టమేనని ఆమె అంది కానీ, ప్రహ్లాద్ భార్యకు సిటీలో ఉండడమే ఇష్టం. సిటీలో పచ్చదనం ఉండకపోవచ్చు. మంచి అపార్ట్మెంట్ తీసుకుని, బాల్కనీలో రెండు మొక్కల్ని వేలాడదీసుకుంటే పచ్చదనం రావడానికి ఎంతసేపని?! ఆ మాటే ఆమె అంటే.. ‘‘అది పచ్చదనం కాదు. పాలకూర పప్పులో ఉండేది కూడా పచ్చదనమే కదా’’ అని నవ్వాడు ప్రహ్లాద్.సిటికీ అన్ని మైళ్ల దూరంలో ప్రహ్లాద్ నారపల్లినే ఎంచుకోడానికి కారణం పచ్చదనం అయితే, అతడు చెప్పే కారణం మాత్రం అక్కడ అద్దెలు తక్కువని. ఎవరో వెంచర్వాళ్లు ఆఫీసుకొచ్చి, సైట్ సీయింగ్‌కి ప్రహ్లాద్‌ని తీసుకెళ్లినప్పుడు నారపల్లి అనేదొకటి ఈ భూమ్మీద ఉందన్న సంగతి ప్రహ్లాద్‌కి మొదటిసారిగా తెలిసింది. ప్రహ్లాద్‌ని తీసుకెళ్లి చూపించినందువల్ల వెంచర్ వాళ్లకు ఒరిగిందేమీ లేదు. ప్రహ్లాద్‌కి మాత్రం పచ్చదనం దొరికింది. ఆల్రెడీ అక్కడ కట్టి ఉన్న ఇళ్లలో వెలుతురు బాగా వచ్చే ఒక ఇంట్లోకి వెంటనే అద్దెకు దిగేశాడు.భార్య, తను, ఇద్దరు చిన్న పిల్లలు, చుట్టు పక్కల పచ్చటి చెట్లు, వాటి మీదకు వచ్చి వాలి ఉదయాన్నే కువకువమనే పిట్టలు, డ్యూటీ అయ్యాక నడిరేయి చీకట్లో సుదీర్ఘంగా నడుచుకుంటూ ఇంటికి చేరుకోవడం.. ఇదీ పదేళ్లుగా ప్రహ్లాద్ పచ్చటి ప్రపంచం. ఆ నిశ్శబ్దపు చీకట్లో దారి పక్కన పెద్ద భూతంలా కనిపించే ఆ చెట్టును భయం భయంగానే అయినా ఒకసారి తలెత్తి చూడడం అతడి అలవాటు. మొక్కను పెంచుకున్నట్లుగా ఆ దెయ్యపు చెట్టుపై తనకు తెలియకుండానే ఇష్టం లాంటిదేదో పెంచుకున్నాడు ప్రహ్లాద్. ‘‘సరే, జాగ్రత్తగా వెళ్లండి. ఈ దారిలో దెయ్యం తిరుగుతోంది’’ దేవుడు ప్రతి మనిషికీ ఏదో ఒకటి ఇస్తాడు.. ‘ఇది నీది.. తీసుకుని సంతోషంగా’ ఉండు అని! అలా దేవుడు తనకు ఇచ్చింది.. చీకట్లో ప్రతి రాత్రీ ఒంటరిగా నడిచే ఆ ఇరవై నిముషాల నడక అని ప్రహ్లాద్ అనుకుంటూ ఉంటాడు. నడుస్తున్నప్పుడు ఒక్కోసారి ఏ బైకో వచ్చి, పక్కన ఆగుతుంది. ‘కాలనీ లోకే కదా.. ఎక్కు బాస్’ అని! నవ్వి థ్యాంక్స్ చెప్తాడు. అంతే కానీ బైక్ ఎక్కడు. నడుచుకుంటూనే వెళ్తాడు. ఓసారి బైక్ మీద ఇద్దరు పోలీసులు వచ్చి ప్రహ్లాద్‌ని ఆపారు. ఆ రోజైతే మరీ ఒంటి గంట దాటింది ప్రహ్లాద్‌కి అక్కడికి చేరుకోడానికి.‘‘ఎక్కడుంటారు మీరు’’ అని అడిగారు వాళ్లు. ‘‘ఇక్కడే.. ఆ కాలనీలో ఉంటాను’’ అని చెప్పాడు.‘‘ఈ టైమ్‌లో ఈ దారి వెంట వెళ్లడం మంచిది కాదు’’ అన్నాడు.. ఆ ఇద్దరిలో ఒక పోలీసు. అతడి చేతిలో టార్చ్‌లైట్ ఉంది.‘‘ఆఫీస్‌లో కొద్దిగా లేట్ అయింది’’.. చెప్పాడు ప్రహ్లాద్.‘‘సరే, జాగ్రత్తగా వెళ్లండి. దెయ్యం తిరుగుతోందట’’ అన్నాడు పక్కనే ఉన్న పోలీసు.ప్రహ్లాద్ ఆశ్చర్యపోయాడు. కానీ ఆశ్చర్యంగా చూడలేదు. అతడూ అప్పటికి కొన్నాళ్లుగా వింటూనే ఉన్నాడు. సి.పి.ఆర్.ఐ. మలుపులో ఆక్సిడెంట్ అయి చనిపోయినవాళ్లలో ఒకరు ఈ దారిలో దెయ్యమై తిరుగుతున్నారని. అతడు ఆశ్చర్యపోయింది ఎందుకంటే.. పోలీసులు దెయ్యాల గురించి మాట్లాడ్డం ఏంటని! ప్రహ్లాద్‌కు దేవుడిచ్చిన సంతోషాలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఉదయాన్నే భార్య తన కన్నా ముందే లేచి, తను లేచిన వెంటనే కాఫీ అందివ్వడం అతడికి సంతోషాన్నిస్తుంది. కూతురు, కొడుకు స్కూల్‌కి చకచకా తయారై ‘బై.. డాడీ’ అని తన రెండు చెంపలకు అటొకరు, ఇటొకరు.. ముద్దు పెట్టి స్కూల్ వ్యాన్ దగ్గరికి పరుగులు తియ్యడం సంతోషాన్నిస్తుంది. ఆఫీస్‌లో తన పని తను త్వరగా పూర్తి చేసేయడం సంతోషాన్నిస్తుంది. అయితే అన్నిటికన్నా అతడికి ఎక్కువ సంతోషాన్నిచ్చేది మాత్రం.. రోజూ ఇంటికి వెళ్లే ఆ చీకటి దారిలో ఆ దెయ్యపు చెట్టును చూసీ చూడనట్లు చూసి దాటుకుని వెళ్లడం. దాటుకుని వెళ్లాక ప్రహ్లాద్ ఇక ఆ చెట్టును వెనక్కు తిరిగి చూడడు. తిరిగి చూస్తే, చెట్టు కొమ్మకు ఊగుతూ ఏ దెయ్యమో తనని చూస్తూ ఉంటుందేమోనని అతడి అనుమానం. అనుమానమే. భయం కాదు. చాలాకాలం తర్వాత ఆఫీసులో మళ్లీ లేటయింది ప్రహ్లాద్‌కి. నారపల్లి క్రాస్ దగ్గరికి వచ్చేసరికి ఒంటి గంట అయింది. ఎప్పటిలా చీకట్లో ఒక్కడే నడక మొదలుపెట్టాడు. ఆ వేళ ఎందుకో ఆ దారి కొత్తగా ఉంది ప్రహ్లాద్‌కి! తనది కాని దారిలోకి వచ్చినట్లుగా ఉంది. నడుస్తున్నాడు. నడుస్తున్నాడు. నడుస్తున్నాడు. దెయ్యపు చెట్టు దగ్గరికి వచ్చేసరికి నడక వేగం తగ్గించాడు. చెట్టు ఉన్న వైపు చూశాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. కొన్ని క్షణాలు శిలలా స్తంభించిపోయాడు. ముందుకు మరికొంత దూరం నడిచి, ఎప్పుడూ చూడని వాడు, వెనక్కి తిరిగి చెట్టు వైపు చూశాడు. అంతే అతడి గుండె ఆగినంత పనైంది.ఆ రాత్రి బాగా జ్వరం వచ్చింది ప్రహ్లాద్‌కి. ‘చెట్టు.. చెట్టు..’ అని అతడు కలవరించడం అతడి భార్య వింది. చెట్టేమిటో ఆమెకు అర్థం కాలేదు. దెయ్యపు చెట్టు గురించి ప్రహ్లాద్ ఎప్పుడూ ఆమెకు చెప్పలేదు. భర్తను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. ‘జ్వరమే.. ఇంకేం లేదు’ అని మందులు రాసిచ్చాడు డాక్టర్. ఇద్దరూ వెళుతుంటే, మళ్లీ ఆమెను మాత్రమే వెనక్కి పిలిచి డాక్టర్ చెప్పాడు.. ‘ఎందుకో మీవారు బాగా భయపడినట్లున్నారు’ అని.ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రహ్లాద్ తన ఫ్యామిలీని సిటీలోకి షిఫ్ట్ చేశాడు. ఎందుకో.. ఆ దెయ్యపు చెట్టు లేని ఆ దారిని అతడు చూడలేకపోయాడు. ఇప్పటికీ ఎక్కడ రోడ్ వైడెనింగ్ అన్నా.. ఆ రోజు అకస్మాత్తుగా మాయం అయిపోయిన ఆ దెయ్యం చెట్టే గుర్తుకు వస్తుంటుంది ప్రహ్లాద్‌కి. అప్పుడు ఈ మనుషులంతా అతడికి చెట్టును పొట్టన పెట్టుకుంటున్న దెయ్యాల్లా కనిపిస్తుంటారు. -
ఘోస్ట్ రైటర్
భూతవైద్యుడిలా, డేనియల్ వర్మ భూతకథకుడు. దెయ్యాలు, భూతాల కథలు తప్ప మనుషుల కథలు రాయడు. కమిటెడ్ రైటర్. మనిషి కూడా చూడ్డానికి దెయ్యంలాగే ఉంటాడు. దెయ్యాల కథలు రాసి రాసి డేనియల్ వర్మ అలా అయిపోయి ఉంటాడని చుట్టుపక్కల వాళ్ల అనుమానం. పత్రికల్లో తన కథతో పాటు రెగ్యులర్‌గా వచ్చే ఫొటోలో అరవై ఏళ్లవాడిలా కనిపిస్తాడు డేనియల్ వర్మ. నిజానికి డేనియల్ వర్మ ఆ వయసుకు రీచ్ అవడానికి ఇంకా పదేళ్ల టైమ్ ఉంది! ‘‘ఎవరో అమ్మాయి వచ్చింది మీ కోసం..’’ అని చెప్పింది కుంకుమ. దెయ్యాల గదిలో కూర్చొని దెయ్యం కథ రాసుకుంటున్నాడు డేనియల్ వర్మ.‘‘కూర్చోబెట్టు, కథ ఎండింగ్లో ఉన్నాను’’ అన్నాడు భార్యతో. కుంకుమ ఇక ఆయన్ని డిస్టర్బ్ చెయ్యలేదు. డేనియల్ వర్మ దెయ్యాల గదిలో తప్ప ఇంకో గదిలో కూర్చొని కథ రాయడు. ఓసారెప్పుడో భోజనానికి పిలిస్తే ఎంతకూ రావడం లేదని, ‘‘ఆ దెయ్యాల గది నుంచి డైనింగ్ హాల్లోకి వస్తారా లేదా?’’ అని కుంకుమ పెద్దగా పిలిచింది. అప్పట్నుంచీ అది దెయ్యాల గది అయింది. కథ రాయడం పూర్తయ్యాక ఒళ్లు, వేళ్లు విరుచుకుంటూ గది నుంచి బయటికి వచ్చి, హాలును దాటుకుని ముందు గదిలోకి వెళ్లాడు డేనియల్ వర్మ. ఆ గదిలో కూర్చొని ఉన్న అమ్మాయి చప్పున లేచి నిలబడింది. ‘‘నమస్తే అంకుల్. మీ కథలంటే నాకు ఇష్టం’’ అంది. నవ్వాడు డేనియల్ వర్మ. ‘‘కూర్చోమ్మా’’ అన్నాడు. ‘అమ్మా’ అనడం ఆ అమ్మాయికి నచ్చింది. చేతిలో ఉన్న స్వీట్బాక్సును పక్కన పెట్టి, వంగి అతడి కాళ్లకు నమస్కరించింది. ‘‘అయ్యో... ఎందుకు తల్లీ’’ అని, ఆ అమ్మాయిని పైకి లేపాడు.‘‘ఈ రోజు నా పుట్టినరోజు అంకుల్’’ అంది. ‘‘అవునా! గాడ్ బ్లెస్ యు తల్లీ’’ అని, ఇంట్లోకి చూస్తూ ‘‘కుంకూ’’ అని పిలిచాడు డేనియల్ వర్మ. భార్యను అతడు అలాగే పిలుస్తాడు. పిలుపు కన్నా ముందే.. కుంకుమ టీ ట్రేతో వచ్చి ఆ అమ్మాయికి, భర్తకి ఇచ్చి, తనూ ఒక కప్పు తీసుకుని వాళ్లతోపాటు కూర్చుంది. ‘‘తన పుట్టిన రోజట’’ అని భార్యకు చెప్పి, ‘‘నీ పేరేమిటమ్మా?’’ అని అడిగాడు డేనియల్ వర్మ ఆ అమ్మాయిని. ‘‘ప్రతిమ’’ అని చెప్పింది. భార్యాభర్తలిద్దరూ వాత్సల్యంగా ఆ అమ్మాయి వైపు చూశారు. ప్రతిమ అందంగా ఉంది. ‘‘చెప్పమ్మా.. ఎక్కడ ఉంటున్నావ్? ఏం చదువుతున్నావ్?’’ అని అడిగాడు డేనియల్ వర్మ. ‘‘ఇక్కడే ఉంటాను అంకుల్. మీ కథలు ఇష్టంగా చదువుతాను’’ అంది ప్రతిమ. నవ్వారు భార్యభర్తలిద్దరూ. ఇక్కడే ఉంటాను అంది కానీ, ఎక్కడ ఉంటోందో చెప్పలేదు ప్రతిమ. ఆ సంగతి డేనియల్ వర్మ గ్రహించాడు. ‘‘మీ కథలన్నీ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా చదివాను అంకుల్. ఐ లవ్ టు ఎంజాయ్ యువర్ డెవిలిష్ స్టెయిల్ ఆఫ్ రైటింగ్’’ అంది ప్రతిమ. ‘‘థ్యాంక్స్ అమ్మా’’ అన్నాడు. మళ్లీ అతడు ‘అమ్మా’ అనడం ప్రతిమకు నచ్చింది. ఒక్క క్షణం ఆగి మళ్లీ ఆ అమ్మాయే అంది..‘‘అంకుల్.. మీతోపాటే నేనూ మీ ఇంట్లో ఉండొచ్చా’’ అని!డేనియల్ వర్మ రాసే దెయ్యాల కథల్లో ఏదో ఒక క్యారెక్టర్ ఎక్కడో ఒకచోట కంపల్సరీగా గతుక్కుమంటుంది. ఫస్ట్‌టైమ్ డేనియల్ వర్మ గతుక్కుమన్నాడు.‘‘ఐయామ్ సీరియస్ అంకుల్. మీ ఇంట్లో.. ఆంటీతో, మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను’’ అంది ఆ అమ్మాయి వాళ్లిద్దర్నీ ఆర్ద్రతగా చూస్తూ. దెయ్యాల రైటర్‌గా డేనియల్ వర్మ ముప్పై ఏళ్ల కెరీర్లో ఇలాంటి అనుభవం లేదు. ‘మీ కథ చదివి మా ఇంటిల్లపాదీ భయపడ్డాం’ అని ఉత్తరాలు రాసినవాళ్లే కానీ, ఇలా భయం లేకుండా ఇంటికొచ్చిన వాళ్లు లేరు. పైగా ఈ అమ్మాయి మీ ఇంట్లో ఉంటాను అంటోంది. కుంకుమ నవ్వింది. ‘‘ఆంటీ లవ్లీగా ఉన్నారు అంకుల్’’ అంది ప్రతిమ. థాంక్స్ చెప్పింది కుంకుమ.‘‘మిమ్మల్ని భర్తగా పొందడం ఆంటీ అదృష్టం అంకుల్’’ అంది ప్రతిమ.‘‘కాదు.. నా అదృష్టం’’ అన్నాడు డేనియల్ వర్మ. ‘‘కాదు.. కాదు.. నా అదృష్టమే’’ అంది కుంకుమ. ‘‘మీ ఇంట్లో ఉండే అదృష్టాన్ని నాక్కూడా కొంచెం కలిగించండి ఆంటీ’’ అంది ఆ అమ్మాయి. డేనియల్ వర్మ నవ్వాడు.‘‘సరే.. మీ అమ్మానాన్నతో మాట్లాడి అలాగే మాతో ఉందువులే’’ అంది కుంకుమ. ఆ తర్వాత కూడా కొద్దిసేపు ఆ అమ్మాయితో ప్రేమగా మాట్లాడారు భార్యాభర్తలు. వెళ్లేటప్పుడు గేటు బయటి వరకు తోడుగా వెళ్లారు. ప్రతిమను సాగనంపి ఇంట్లోకి రాగానే డేనియల్ వర్మని గట్టిగా కావలించుకుంది కుంకుమ. డేనియల్ వర్మ ఆమెను ఇంకా గట్టిగా హత్తుకుని ముద్దుపెట్టుకున్నాడు. ఆమెను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడతను. చేసుకున్నాక అతడిని లవ్ చెయ్యడం మొదలుపెట్టింది ఆమె. భార్య అంటే అతడికి ఎంత ఇష్టమంటే.. ఆమె కాలేజీలో ఉండగా లవ్ చేసి, పెళ్లి చేసుకోలేకపోయిన డేనియల్ అనే అబ్బాయి పేరును తన పేరుకు ముందు పెట్టుకున్నాడు వర్మ! ఈ జన్మకిక పిల్లలొద్దు అని కుంకుమ అంటే.. ‘సరే’ అని కూడా అన్నాడు. ఆ రాత్రి ఇద్దరూ చాలాసేపు ప్రతిమ గురించి మాట్లాడుకున్నారు. ‘‘మనకే ఒక అమ్మాయి ఉండి ఉంటే ప్రతిమలా ఉండేది కదూ’’ అంది కుంకుమ. ‘నేనూ అదే అనుకున్నా’ అని భర్త అంటాడనుకుంది ఆమె. అయితే డేనియల్ వర్మ అలా అనలేదు. ‘‘ప్రతిమ మన కూతురు కాదని ఎందుకనుకుంటున్నావ్ కుంకూ’’ అన్నాడు.కుంకుమ నిర్ఘాంతపోయి చూసింది. ‘‘ఒకటి గమనించావా కుంకూ.. పెళ్లికి ముందు మీవాళ్లు నీకు అబార్షన్ చేయించిన రోజు, ఇవాళ మన ఇంటికి వచ్చిన ప్రతిమ పుట్టిన రోజు రెండూ ఒకటే..’’ అన్నాడు డేనియల్ వర్మ.‘‘అంటే.. ప్రతిమ..’’ అంటూ ఆగిపోయింది కుంకుమ. ‘‘మళ్లీ కనిపించకపోతే మనమ్మాయే... మన కోసం తిరుగుతోందని’’ అన్నాడు. ‘‘మళ్లీ కనిపిస్తే?’’ అంది కుంకుమ. ‘‘అప్పుడూ మనమ్మాయే. మన అమ్మాయి అనుకోవడం మనకు బాగుంది కాబట్టి’’ అన్నాడు. ఆ తర్వాత కుంకుమ నిద్రపోయింది. డేనియల్ వర్మ చాలాసేపటి వరకు మేల్కొనే ఉన్నాడు. చనిపోయి దెయ్యం అయిన మనిషికి.. మనిషిగా చనిపోయిన రోజే దెయ్యంగా పుట్టినరోజు అవుతుందా అనే థాట్‌తో ఒక కొత్త కథకు ప్లాట్ తయారయ్యాకే అతడికి నిద్రపట్టింది. -
అయ్యో పాపం దెయ్యం!!
తనకు ‘వీర’ అని పేరు పెట్టిన వ్యక్తిని బతికించి, చంపేయాలన్నంత కోపం వీర కుమార్‌కి. ఆ పేరు పెట్టిన దూరపు బంధువు చనిపోయాడు కాబట్టి బతికి పోయాడు! ‘వీర’ అనే పేరులో బూతేమీ లేదే? మరి తన పేరు మీద తనకు కోపం ఎందుకు?! ఎందుకంటే వీరకుమార్ పేరు మోసిన పిరికివాడు. ‘తెనాలి’ సినిమాలో కమలహాసన్ టైప్ అన్నమాట. ‘‘నీకు ఏవంటే భయం?’’ అనే డాక్టర్ క్వొశ్చన్‌కు కమలహాసన్ ఏమంటాడు? సరిగ్గా ఇలా అంటాడు... ‘అంతా శివమయం అంటారు కదండీ. నాకు మాత్రం అంతా భయమయమండీ. నీడంటే భయం. గోడ అంటే భయం. గూడు అంటే భయం. బల్లి అంటే భయం...పిల్లి అంటే భయం. బంతిని చూసినా భయం. ముద్దబంతిని చూసినా భయం. ఏ కాంతను చూసినా భయం. ఏకాంతంగా ఉండాలన్నా భయం’ సినిమాలో కమలహాసన్‌కు ఉన్న భయాలన్నీ వీరకుమార్కి ఉన్నాయి. అలాంటి వీర ఒకరోజు రాత్రి హఠాత్తుగా చనిపోయాడు. చనిపోయినందుకు వీరకు విపరీతమైన సంతోషంగా ఉంది. బతికినంత కాలం తాను భయపడుతూనే బతికాడు తప్ప, ఎవరినీ భయపెట్టలేదు. ‘‘ఇప్పుడు నాకో గోల్డెన్ ఛాన్స్ దొరికింది. ఇప్పుడు చూపిస్తా నా తడాఖా. నేను దెయ్యమై ప్రతి ఒక్కరిని భయపెట్టిస్తాను. వారు గజగజ వణుకుతుంటే నేను భళ్లు భళ్లుమని నవ్వుతుంటాను’’ కాలర్ ఎగరేశాడు వీర. అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ‘అలా షికారుకు వెళ్లొస్తాను’ అని శ్మశానంలో సాటి దెయ్యాలకు చెప్పి బయలుదేరింది వీర దెయ్యం. జూబ్లిహిల్స్‌లో అందంగా కనిపిస్తున్న ఒక ఇంట్లోకి దూరింది దెయ్యం. ఆ ఇంట్లో అందరూ గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. పదిహేడేళ్ల ఒక కుర్రాడు మాత్రం ‘స్మార్ట్‌ఫోన్’లో తలమునకలై ఉన్నాడు. ఈ కుర్రాడిని భయపెట్టాలని రీసౌండ్ ఎఫెక్ట్‌తో.... ‘రా.......జా......’ అని పిలిచినట్లుగా అరిచింది దెయ్యం. కుర్రాడు మాత్రం పొరపాటున కూడా దెయ్యం వంక చూడలేదు. ఫేస్బుక్లో ఏదో కామెంట్ పోస్ట్ చేస్తున్నాడు. రీసౌండ్ ఎఫెక్ట్‌తో దెయ్యం అయిదుసార్లు పిలిచిన తరువాత ఆ కుర్రాడు...‘చల్లని రాజా ఓ చందమామా...’ అని పాడుకున్నాడే తప్పా దెయ్యం వైపు చూడలేదు...ఫేస్బుక్లో నుంచి తల తీయలేదు. ఆ పాటలో వెటకారం తప్ప రవ్వంత భయం లేదు.‘మరెవరైనా అయితే... రా.....జా అనే రీసౌండ్‌కు భయపడి చచ్చేవాళ్లు. వామ్మో దెయ్యం అని అరిచేవాళ్లు. వీడేంటి ఇలా?’ తనలో తాను కుమిలిపోయింది దెయ్యం. ఈ జనరేషన్ కుర్రాళ్లని తిట్టుకుంది. ఈసారి క్రూరమైన గొంతుతో... ‘ఒరేయ్ రాజా’ అని హాల్ అదిరేలా అరిచింది దెయ్యం. ఆ కుర్రాడు మాత్రం యూట్యూబులో ‘భయ్యానికి నేనంటే భయ్యం.... దెయ్యానికి నేనంటే దడ’ అనే పాటను చూస్తూ ఆనందిస్తున్నాడు. భయపెట్టాలని దెయ్యం ఎంతగా ప్రయత్నించినా ఆ కుర్రాడు తన పనిలో తాను ఉన్నాడు. కొద్దిసేపు ఫేస్బుక్, కొద్దిసేపు యూట్యూబ్, కొద్ది సేపు ట్విట్టర్, కొద్దిసేపు మట్టర్...ఇలా ఏవేవో చూస్తున్నాడేగానీ ‘రా...జా’ అనే భయంకరమైన సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? అని ఒక్క నిమిషం కూడా పక్కకు తిరిగి చూడలేదు. ‘ఛీ... వెదవ బతుకు... సారీ వెదవ చావు’ అని తనను తాను తిట్టుకొని అక్కడి నుంచి స్పీడ్‌గా పారిపోయింది దెయ్యం. ఇప్పుడు దెయ్యం సాగర్ అనే ఆయన ఇంట్లోకి దూరింది. ఇతడిని అందరూ ‘సమాచార సాగర్’ అని పిలుచుకుంటారు. దీనికి కారణం...ఈ సాగర్ని ఒక్క విషయం అడిగితే పది విషయాలు చెబుతుంటాడు. ఇప్పుడు మనం మళ్లీ దెయ్యం దగ్గరికి వద్దాం. ‘హీ....హీ....హీ’ అని వికృతంగా నవ్వింది దెయ్యం. చదువుతున్న పుస్తకం నుంచి తల పైకెత్తిన సాగర్ వెంటనే...‘హీ....హీ....హీ’ అనేది హిబ్రూ పదం ‘గుష్కీ గుష్కి’ నుంచి వచ్చింది. దీని అర్థం ‘మీరు క్షేమంగా ఉన్నారా?’ అని దెయ్యానికి చెప్పి తిరిగి పుస్తకం చదవడంలో మునిగిపోయాడు. ‘‘రేయ్ సచ్చినోడా...సారీ...బతికినోడా...నేను దెయ్యాన్నిరా...భయపడరా’’ గట్టిగా అరిచింది దెయ్యం. ‘దెయ్యం’ అనే పదం వినబడగానే సాగర్ కళ్లు చురుక్కున మెరిశాయి. వెంటనే గొంతు సర్దుకొని... ‘దెయ్యాల్లో మొత్తం 72 రకాలు ఉన్నాయి. ఇందులో ఒక దెయ్యానికి మరొక దెయ్యానికి పోలికే లేదు. కలర్ మాత్రం సేమ్ టు సేమ్. ఆఫ్రికా దెయ్యాలు నల్లగా ఉంటాయనేది అపోహ మాత్రమే’ అని తిరిగి పుస్తకం చదవడంలో మునిగిపోయాడు సాగర్. ‘వీడు సమాచారంతో భయపెడుతున్నాడు తప్ప భయపడడం లేదు. ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు’ అని మరోసారి పారిపోయింది దెయ్యం. చివరిగా ఒక ప్రయత్నం చేసి చూద్దామని కృష్ణానగర్‌లో ఒక చిన్నరూమ్లోకి దూరింది. ఆ గదిలో థర్టీ ప్లస్ కుర్రాడు ఏదో సీరియస్‌గా రాసుకుంటున్నాడు. ఆ కుర్రాడి ముందుకు వచ్చి...‘రేయ్...నేను దెయ్యాన్నిరా’ గట్టిగా తనను తాను పరిచయం చేసుకుంది దెయ్యం. ‘వామ్మో’ అని అరవలేదు ఆ కుర్రాడు. కొత్త రెండు వేల రూపాయల నోట్ల కట్టలు వంద ఒకేసారి దొరికినట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఆ తరువాత ఇలా అన్నాడు... ‘‘సమయానికి దెయ్యంలా వచ్చారు. ఇలా కూర్చొండి. ముందు నన్ను నేను పరిచయం చేసుకుంటాను. గత అయిదేళ్లుగా సినిమా ఫీల్డ్‌లో ఉన్నాను. నా పేరు...మణిరత్న శంకర రాజమౌళి. అందరూ ఎంఎస్ఆర్ అని పిలుస్తుంటారు. ఇప్పుడంతా హర్రర్ సినిమాల హవా నడుస్తుంది కదండీ....అందుకే మంచి దెయ్యం స్క్రిప్ట్ ఒకటి రెడీ చేసి, పెద్ద నిర్మాతకు వినిపించి డైరెక్టరవుదామనుకుంటున్నాను. దెయ్యం సబ్జెక్ట్‌పై వర్క్ చేయడానికి ఎన్నో పుస్తకాలు చదివాను. చదవడం వేరు...స్వయంగా మీలాంటి దెయ్యం మహాశయులు నన్ను వెదుక్కుంటూ రావడం వేరు. మీరు ఇన్పుట్స్ ఇస్తే స్క్రిప్ట్ అద్భుతంగా వస్తుంది. దెయ్యం సార్...ప్లీజ్ ఏమైనా చెప్పండి సార్’’ అంటూ పెన్ను ప్యాడ్ పట్టుకొని దెయ్యం వైపు ఆశగా చూశాడు ఫ్యూచర్ డైరెక్టర్ ఎంయస్ఆర్. ‘‘ఒరేయ్ నీకో దండం...నీ సినిమాకో దండం...నన్ను వొదల్రా బాబూ’’ అని అక్కడి నుంచి పారిపోవడానికి రెడీ అయింది దెయ్యం. ‘‘అలా అంటే ఎలా సార్. మీకు పాదాభివందనం చేస్తాను. మీరు నాకు ఇన్పుట్స్ ఇవ్వాల్సిందే ’’ అంటూ సడన్‌గా వంగీ ‘సారీ...మీకు కాళ్లు ఉండవు కదా’’ అని పైకి లేచాడు ఎంయస్ఆర్. ఈలోపే...‘పరారే పరారే... ఈ మనుషులు దేనికీ భయపడి చావరే’ అని పాడుకుంటూ అక్కడి నుంచి జెట్ స్పీడ్‌తో కన్నీటితో కానరాని తీరాలకు పారిపోయింది దెయ్యం!...పాపం దెయ్యం!! – యాకుబ్ పాషా -
అవి ఆత్మల కదలికలేనా?!
-
అవి ఆత్మల కదలికలేనా?!
ఆత్మలు, దయ్యాలు, భూతాలు ఉన్నాయా? లేవా? ఈ ప్రశ్నలకు సమాధానాలు మాత్రం ఎరికి తోచినట్టు వాళ్లు చెబుతారు. కానీ ఖచ్చితమైన జవాబులు మాత్రం ఎవరి వద్దనుంచి రావు. అయితే అప్పుడప్పుడూ.. మేం మీకు కనిపించకపోయినా ఉన్నాం.. అందుకు ఇదిగో నిదర్శనం అంటూ ఆత్మలు చెబుతాయి. ఇంగ్లడ్‌లోని ప్రఖ్యాత కాంటెర్బరీ నగరం. అందులో టేలర్స్ క్లిన్ అనే పబ్ తెలియని వారుండరు. పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా.. జనాలు అక్కడ సమయాన్ని గడిపేస్తారు. ఎప్పటిలానే రాత్రి బాగా పొద్దుపోయాక పబ్‌నుంచి జనాలు వెళ్లిపోయాక.. అక్కడి సబ్బంది కూడా తాళాలు వేసి ఇంటికెళ్లారు. పబ్ సిబ్బంది ఇంటికెళ్లే సమయంలో కిటికీలు, లైట్లు, ఫ్యాన్లు, ఇలా అన్నింటిని జాగ్రత్తగా ఆఫ్ చేసి వెళ్లారు. అయితే ఉదయాన్నే మళ్లీ పబ్ తెరిచేసరికి కిటికీలు తెరిచిఉండడం, కొన్ని గదుల్లో ఫ్యాన్లు, లైట్లు వేసి ఉండడాన్ని పబ్ యజమాని ఆలిస్టర్ కొలిన్స్ గుర్తించారు. కరెంట్ వృధా అవుతుండడంతో సిబ్బందిపై ఆయన కేకలేశారు. ఉద్యోగులు మేము చాలా జాగ్రత్తగా అన్ని ఆఫ్ చేశామని.. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని చెప్పారు. ఆగస్టు 4 నుంచి దాదాపు ప్రతి రోజూ ఇలాగే జరుగుతోందని సిబ్బంది యజమానికి చెప్పారు. విషయం ఏమిటో తెలుసుకుందామని.. ఆయన సీసీటీవీ ఫుటేజ్ తెప్పించారు. ఫుటేజ్ చూడగానే ఆలిస్టర్తో పాటు సిబ్బందికి కాళ్లు, చేతులు వణికిపోయాయి. సిబ్బంది అంతా రాత్రి ఇంటికి వెళ్లిపోయాక.. కుర్చీలు వాటంతట అవే కదిలేవి. కిటికీలు, లైట్లు, ఫ్యాన్లు ఇలా అన్నింటికీ ఎవరో తెరిచేవారు. సోపాల్లో విలాసవంతంగా కూర్చున్న ఆనవాళ్లు.. మద్యం తాగుతున్నట్లుగా కనిపించే దృశ్యాలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. ఆత్మలు.. దయ్యాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ.. కంటికి కనిపించని శక్తులు ఏవో నా పబ్‌లో ఉన్నాయని ఆలిస్టర్ భయపడ్డారు. అంతేగాక ఆ వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడాయో ఇప్పుడు ఫేస్బుక్లో వైరల్‌గా మారింది. -
అక్కడ దయ్యాలున్నాయా?!
బ్రస్సెల్స్ : దయ్యాలున్నాయా? ఆత్మలున్నాయా? అనే ప్రశ్నలు వేస్తే.. నమ్మమున్నోడికి ఉంటాయి.. లేనోడికి ఉండవు అనే సమాధానం వస్తుంది. ఇప్పుడింత హఠాత్తుగా ఈ ప్రశ్నలు ఎందుకంటే.. తాజాగా బెల్జియం సముద్ర తీరంలో ఎప్పుడో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మునిగిపోయిన ఒక సబ్ మెరైన్ను నేవీ అధికారులు గుర్తించారు. సముద్రమన్నాక ఎన్నో మునుగుతుంటాయి.. టైటానిక్ మునిగి పోలేదా అన్న ప్రశ్న మీ దగ్గర నుంచి సహజంగానే వస్తుంది.. అందుకే నేరుగా విషయానికి వస్తున్నా.. ఈ సబ్ మెరైన్ మునిగిన ప్రాంతంలో అటుగా ఏవైనా నౌకలు, చేపలు పట్టే జాలర్లు వెళుతుంటే చిత్రవిచిత్రమైన శబ్దాలు.. మనుషులు బాధపడుతున్నట్లుగా ఏడుపులు వస్తుంటాయట. మొదట్లో దీనిని పెద్దగా పట్టించుకోకపోయినా తాజా సబ్ మెరైన్ బయటపడ్డంతో అందరూ ఇదే అలోచిస్తున్నారట. భూమికి 98 అడుగుల లోతులో యూబీ-2 టైప్ సబ్ మెరైన్ ఎప్పుడో మునిగింది. దీనితో అందులో ప్రయాణిస్తున్న 23 మంది మరణించారు. దీనిని బుధవారం నేవీ సిబ్బంది గుర్తించింది. ఇంకో విషయం ఏమిటంటే.. సబ్ మెరైన్ ఇంకా కండీషన్లోనే ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇదిలాఉంటే.. అందులోని 23 మృత దేహాలు కూడా పెద్దగా పాడవకుండా ఉన్నాయట. ఈ 23 మందే దయ్యాలుగా మారారని.. వాళ్లే ఇటుగా ఎవరైనా వస్తుంటే.. చిత్రవిచిత్రంగా శబ్దాలు చేస్తున్నారేమోనని స్థానికులు అనుకుంటున్నారు. -
అవునా! దెయ్యాలు ప్రేమిస్తాయా?
మేల్ వాయిస్ మూడు రోజుల క్రితం ఊరెళ్లి ఉండకపోతే, ఊళ్లో రాత్రి పన్నెండు గంటల సమయంలో చెరువుగట్టు దాటి మా ఫ్రెండుగాడింటికి చేరకపోయి ఉంటే ‘దెయ్యాలు ప్రేమిస్తాయా?’ అని నన్ను ఎవరైనా అడిగి ఉంటే ఇట్టి విషయాన్ని ఖండించడానికి నూట ఒక్క కత్తులను నా ఒర నుండి తీసేవాడిని. చార్వాకుడినై ‘దైవం దెయ్యం జాన్తానై’ అని అరిచేవాడిని. ఇప్పుడు నేను ఖండించలేను. అరవనూ లేను. ఎందుకో తెలుసా? ఆ రాత్రి... సన్నని వర్షం నన్ను ప్రేమగా కౌగిలించుకోవడానికి వస్తుంటే చెరువుకట్ట మీద నా అడుగులు వడివడిగా పడుతున్నాయి. దూరంగా జిట్టీత చెట్ల నుంచి ఆడపిల్ల నవ్వు! ‘భ్రమ’ అనుకొని ధైర్యం చెప్పుకున్నాను. మళ్లీ అదే నవ్వు. నా ధైర్యాన్ని నిలువునా చీల్చేసిన నవ్వు. నేను ఎంత వేగంగా పరుగు తీశానంటే ‘ప్రసన్నాంజనేయం’ పద్యం పూర్తయ్యేలోపు ఫ్రెండుగాడింట్లో ఉన్నాను. నాకు ఎదురైన అనుభవాన్ని వాడికి చెబితే ‘పాతాళభైరవి’ విలన్లా నవ్వాడు. ఆ తరువాత ఒక కథ చెప్పాడు. దాని సారాంశం: పెళ్లి కాకుండా చనిపోయిన అమ్మాయిలు కన్నెదెయ్యాలై యువకులను వెంబడిస్తాయట. ప్రేమిస్తాయట. పెళ్లి చేసుకోమని పోరుతాయట. మా ఫ్రెండు అబద్ధాల పుట్ట. ఈ కథ ఆ పుట్టలోనిదై ఉండొచ్చు. నిజమై కూడా ఉండొచ్చు. దెయ్యాలు ప్రేమిస్తాయా? అని మా అమ్మను అడిగాను. అమ్మమ్మను అడిగాను. వాళ్ల చెల్లిని అడిగాను. ఆమె భర్తను అడిగాను. ఏ ఒక్కరూ ‘నో’ అనలేదు. ఒక్కొక్కరూ ఒక్కో కథ చెప్పారు. నమ్మకం అపనమ్మకాల విషయం ఎలా ఉన్నా ఆ కథలు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి.మహారచయిత్రి మహాశ్వేతాదేవి ఒక మాట ఇలా అన్నారు. ‘దెయ్యాల భయం పద్మవ్యూహం. అందులో చొరబడ్డమే గానీ బైట పడ్డం అనేది ఉండదు’ నేను కూడా పద్మవ్యూహంలోనే ఉన్నాను. అయితే దానిలో నుంచి ఎలా తప్పించుకోవాలని మాత్రం ఆలోచించలేదు. అప్పుడప్పుడూ భయాల్లో కూడా తెలియని మజా ఉంటుంది. కన్నెదెయ్యాలకు వాళ్ల రాజ్యాంగం ప్రకారం మగవాళ్ల ‘రక్తమాంసాలు పీల్చేసే’ ప్రత్యేక అధికారం దాఖలవుతుందట. నా ‘మగ’ జాతి జనులు ప్రేయసి తలను, పెళ్లాం తలను నరికి చేతుల్లో పెట్టుకొని సగౌరవంగా ఊరేగుతున్న రాక్షససమయాల్లో కూడా కరుణామయులైన కన్నెదెయ్యాలు తమ ప్రత్యేక అధికారాన్ని వినియోగించుకున్న దాఖలా లేదు. పైగా అమాయకంగా నాలాంటి మగవాళ్లను చెట్టు మీది నవ్వుతో ‘ఐ లవ్ యూ’ అనేస్తారు. దెయ్యాలై కూడా నిప్పుల వర్షం కురిపించకుండా చిరుగాలి సితార సంగీతమై అడుగు అడుగులో సుతారంగా ప్రతిధ్వనిస్తూనే ఉంటారు. ఈ అమాయక ఆడపిల్లలు ఎప్పుడు బాగుపడతారో ఏమో? – యాకూబ్ పాషా యం.డి -
దెయ్యం బాబోయ్.. దెయ్యం
పెదబయలు కేజీబీవీలో విద్యార్థినుల ఆందోళన (అరకులోయ): మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు గత కొద్ది రోజులుగా దెయ్యమంటూ హడలిపోతున్నారు. మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు టెన్త్ విద్యార్థినులకు దెయ్యం ఆవహించిందంటూ గురువారం పాఠశాల అంతటా టైర్లు పొగపెట్టారు. విద్యార్థినుల భయాందోళనలతో పాఠశాల ప్రత్యేక అధికారి, సిబ్బంది కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఆరోగ్యం బాగాలేదేమోనని ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యసేవల అనంతరం పాఠశాలకు తీసుకు వస్తే దెయ్యం అంటూ అరుపులు, కేకలతో బాలికలు పరుగులు తీస్తున్నారు. గతంలోనూ ఇలాగే ఇక్కడ ప్రచారం జరిగింది. ఆందోళనలో బాలికలు.. పెదబయలు పీహెచ్సీ వైద్యాధికారి అప్రోజ్ సుల్తాన్ గురువారం సాయంత్రం కేజీబీవీకి వచ్చి ఓ విద్యార్థినిని పరిశీలించి పాడేరు ఏరియా ఆస్పత్రికి తరిలించాలని సూచించారు. ఇక్కడి పరిస్థితిని గిరిజన సంక్షేమశాఖ డీడీకి తెలిపారు. ఈమేరకు ఆమె విద్యార్థినులకు పాడేరు ఏరియ ఆస్పత్రికి తరలించాలని స్పెషలాఫీసర్‌ను ఆదేశించినట్టు సమాచారం. గురువారంరాత్రి స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు జర్సింగి సూర్యనారాయణ, సందడి కొండబాబు, సీతగుంట పాఠశాల హెచ్ఎం అప్పారావు పాఠశాలకు వచ్చి విద్యార్థినులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. దీనిపై పాఠశాల ప్రత్యేక అధికారి సుధారాణి మాట్లాడుతూ మూడు రోజుల నుంచి ముగ్గురు విద్యార్థినులు ఒకే లక్షణాలతో బాధపడుతున్నారన్నారు. గతంతోనూ పలువురు ఇదే లక్షణాలతో ఇబ్బంది పడ్డారన్నారు. స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లినా నయం కాలేదని తెలిపారు. -
పరుపుపై దెయ్యం.. వణికిపోతున్న ఆస్పత్రి!
-
పరుపుపై దెయ్యం.. వణికిపోతున్న ఆస్పత్రి!
అర్జెంటీనా: దాదాపు గుండెలు ఆగిపోయేంత రేంజ్లో ఉన్న హర్రర్ చిత్రం చూసినంత భయం ఇప్పుడు అర్జెంటీనాలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నవారిని అలుముకుంది. తాము చూసిన విషయాన్ని బయటకు చెప్పేందుకు వారికి గొంతులు పెగలట్లేదు. కొంతమంది ఆ సన్నివేశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నా విన్నవారిలో కొంతమంది ఈ రోజుల్లో ఇది నిజామా అని కొట్టి పారేస్తుండగా.. తిరిగి అదే భయంతో అవును.. వారు చెప్పేది నిజమే మాక్కూడా ఆ అనుభవం ఎదురైంది.. మేం కూడా చూశాం ఓ పిల్ల దెయ్యాన్ని అంటూ చెప్పడంతో ఇప్పుడు ఆస్పత్రి వర్గాలు వణికిపోతున్నాయి. అర్జెంటీనాలోని కార్డోబా అనే పిల్లల ఆస్పత్రి ఉంది. అందులో గంట వ్యవధిలో ఓ చిన్న బాలిక స్వరం పలుమార్లు వినిపిస్తుందట. వాస్తవానికి అక్కడ ఎవరూ లేకపోయినా అదే గొంతు పలువురికి వినిపించడంతోపాటు కారిడార్లలో తమను చూసి నవ్వుకుంటూ ఏదో రూపం వెళుతుందంట. దీంతో ఆ అరుపులు వచ్చే గదివైపు తీక్షణగా చూసిన ఓనర్సుకు చిన్న పాప వయసులో ఉన్న ఒక దెయ్యపు ఆత్మ అందులోని పరుపు చాటున దాక్కున్నట్లు కనిపించందట. ఇక అంతే.. అది చూసిన ఆమె గట్టిగా కేకలు పెట్టింది. ఆస్పత్రి వర్గాలంతా ఆమెను చేరి ఏం జరిగిందని ప్రశ్నించగా తాను దెయ్యం పిల్లను చూశానని చెప్పింది. అంతా బిక్కుబిక్కుమంటూ తమ పనుల్లోకి వెళ్లగా ఓ నర్సు మాత్రం తన ఫోన్ తీసుకొని ఆ గదిలో ఏం జరుగుతుంది అసలని తన ఫోన్‌తో షూట్ చేసే ప్రయత్నం చేసింది. అందులో కూడా ఓ పాపలాంటి ఆకారం చాలా సేపు మంచం పరుపు చాటున దాచుకొని మెల్లగా బెడ్‌పైకి పాకి.. ఆ తర్వాత కారిడార్ నుంచి వెనుక వైపున్న కిటికీలో నుంచి అవతలికి దూకేస్తూ కనిపించిందంట. దీంతో ఆమె కూడా అవాక్కయి కేకలు పెట్టింది. అయితే, అక్కడి చాలామంది మాత్రం ఆ విషయాన్ని నమ్మడం లేదు. బెడ్ నీడే అలా పడి కన్ఫ్యూజ్ చేసి ఉంటుందని అంటున్నారు. అయితే, ఆ గదిలో గతంలో చిన్నారులు చనిపోయిన నేపథ్యంలో వారిలో ఎవరిదో ఒకరి ఆత్మ అలా దెయ్యమై తిరుగుతుందని అంటున్నారు. -
కొత్త దెయ్యం
దెయ్యాల్లో రకాలున్నాయి. కొరివి దెయ్యం, గత్తర దెయ్యం, బాదుడు దెయ్యం, మోహినీ దెయ్యం.. ఇలా! ఇంగ్లిష్‌లో అయితే డెవిల్, ఘోస్ట్, డ్రాక్యులా, పోల్టర్‌గీస్ట్, శాటాన్, ఫాంటమ్.. ఇలాంటివేవో కొన్ని. లేటెస్టుగా ఇప్పుడు కొత్త దెయ్యం ఒకటి వచ్చింది! ఎక్కడికి? మెరియం వెబ్‌స్టర్ డిక్షనరీలోకి. దాని పేరు ‘ఘోస్ట్’. ఘోస్ట్ అన్నది తెలిసిన దెయ్యమే కదా! ఇందులో కొత్తదనం ఎక్కడుందీ? కొత్తదనం మాటలో లేకపోవచ్చు, చేష్టలో ఉంది. ఇక నుంచి మీరు.. మీతో సడెన్‌గా కాంటాక్ట్‌ను కట్ చేసిన మీ ఫ్రెండ్‌ని కానీ, లవర్ని కానీ చక్కగా ‘ఘోస్ట్’ అని పిలిచేయొచ్చు. కాల్స్‌కి, మెసేజెస్‌కి రిప్లయ్ ఇవ్వకుండా, రెస్పాండ్ కాకుండా సతాయించే మనిషికి ఆ డిక్షనరీ పెట్టిన పేరు ఘోస్ట్. ప్రస్తుతం మీ లైఫ్‌లో ఉన్న ఘోస్ట్ ఎవరో ఒకసారి వెనక్కు తిరిగి చూసుకోండి. వెనక్కి అంటే కాల్ హిస్టరీలోకి. అలాగే.. ‘స్వీయనింద’కు (మెప్పు కోసం మనల్ని మనం విమర్శించుకోవడం) ఈ డిక్షనరీ ఏuఝb ్ఛbట్చజ అనే పదం కాయిన్ చేసింది. హంబుల్బ్రాగ్! బాగుంది కదా. సవినయ దురహంకారం. -
వామ్మో దెయ్యం!
పాపం.. త్రిష. ఓ దెయ్యం ఈ బ్యూటీని టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది. ఇక్కడ కాదు.. లండన్‌లో. షెఫ్‌గా చేయడానికి త్రిష లండన్ వెళుతుంది. అక్కడ ఓ దెయ్యం ఆమెను వెంటాడడం మొదలు పెడుతుంది. ఆ దెయ్యం పెట్టే టార్చర్ తట్టుకోలేక తెగ బాధపడుతుంది. త్రిషను వెంటాడి బాధపెట్టడంలో ఆ దెయ్యం ఆనందం పొందుతుంటుంది. చివరికి ఆ దెయ్యాన్ని త్రిష ఎలా వదిలించుకుందో తెలియాలంటేæతెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘మోహిని’ చూడాల్సిందే. ఇప్పటివరకూ చెప్పిందంతా ‘మోహిని’ కథా కమామీషు. ఇందులో మనిషిగా, దెయ్యంగా రెండు పాత్రలనూ త్రిష చేశారు. త్రిష వర్సెస్ త్రిష సీన్స్ ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తాయని దర్శకుడు మాదేశ్ పేర్కొన్నారు. -
తెల్ల దెయ్యం పూలు
కథ తెల్లపూలు గాలికి రెపరెపలాడుతున్నాయి. రివ్వున వీస్తున్న గాలి పూల మధ్యనుంచి మత్తుగా తూర్పు కొండల దిక్కు సాగుతోంది. తుమ్మచెట్ల దారి నుంచి రాళ్ళవంక పైకి చేరుకొని కట్ట దిగింది గుర్రమ్మ. ఆ మోట్లో మామిడిచెట్లకు కాపలాగా నులక మంచంపై కూర్చొని ఉండే తిరుమలయ్య తాత నోట్లో బీడీ పొగ పెడతాంది.‘మ్మీ... గుర్రమ్మ... ఏం యింత పొద్దున్నే పొలం దిక్కు పోతాండవే... ఏడి నీ మొగుడు గూడా వస్తాండడా...’ పలుకరించినాడు.గుర్రమ్మ ఏం జవాబు చెప్పలేదు.అడుగులు వేగంగా ముందుకు పడుతున్నాయి. చీర కాళ్ళకు తగులుకుంటూ మధ్య మధ్యలో విసిగిస్తోంది. కాళ్ళకు చెప్పులు కూడా లేవు.‘ఓయమ్మ! మాట్లాడేకి గూడా బరువైపోతాండేటట్లుందే... ఆ పక్కనేదో కొంపలు అంటుక పోతాండేటట్లు ఎగేసుకొని పోతాండవే...’ తిరుమలయ్య తాత బీడీ పొగ వదుల్తా వెటకారంగా వెక్కిరిచ్చినాడు. గుర్రమ్మ వెనక్కి తిరిగి కూడా చూల్లేదు.రాళ్ళూ రప్పలూ, ముళ్ళూ ఏవీ చూసుకోవడం లేదు. పాదాలు వేగంగా ముందుకు పడ్తున్నాయి. సహదేవనాయుడి తోటలోంచి అడ్డదారి గుండా అటువైపుకి చేరుకుంది. అట్నుంచి గడ్డపైకెక్కి కిందకిదిగింది. తెల్లపూలు మెరిసిపోతున్నాయి.కయ్యనిండా వేసిన తెల్లపూలు నవ్వుతూ పలుకరిస్తున్నాయి. వాటి కాయలు కలవరపెడ్తున్నాయి.పూలతోటనంతా కనులారా చూసుకుంది. కళ్ళనిండా కన్నీళ్ళు పొంగుకొచ్చాయి. అర చేత్తో తుడుచుకుంది. బాధ. గుండెల్ని పిండేసే దుఖ్కం. తన కుటుంబం గుర్తుకొచ్చింది. తన భర్త గుర్తుకొచ్చాడు. కూతురూ, కొడుకూ ఇద్దరూ గుర్తుకొచ్చారు. కళ్ళనిండా కన్నీళ్ళు పొంగుకొచ్చాయి. యిక ఆలస్యం చేయలేదు.ఒక్కొక్క మొక్కనూ పీకి పారేయ్యడం మొదలుపెట్టింది. ఏడుపు ఆగడం లేదు.కన్నీళ్ళు వాటికవే కార్తున్నాయి.ఒక మొక్క తర్వాత మరొకటి. దాని తర్వాత ఇంకొక్కటి. చేతులు వేగంగా ఆడిస్తోంది. విసుగూ, విరామం రెండూ లేవు. చేతులు బొబ్బలెక్కి పోతున్నా పట్టించుకోవడం లేదు. పూల మొక్కలన్నీ పీకి నడి పొలం మధ్యలో కుప్పగాపోసింది. పూనకం వచ్చిన దానిలా! దేహమంతా చమటలు... గస.చిన్న ఎండు పుల్లలు ఏరుకొచ్చి కుప్పకింద పెట్టి నిప్పు రాజేసింది. పచ్చటి పొలాల మధ్యలోంచి ఎర్ర దుమ్ముతో నల్లటి పొగ చిటపటలాడుతూ రగులుకుంటూ గింగిరాలు తిరుగుతూ పైకి లేస్తోంది. తెల్లపూలు మాడిపోతున్నాయి. కాయలు కందిపోయి వాసన వేస్తున్నాయి.కళ్ళముందు కాలిపోతున్న పూలమొక్కల్ని చూస్కొని కుదుటపడింది గుర్రమ్మ. గుండెల్లోని బరువు, భయం ఏదో తొలగిపోతున్న భావన. ప్రశాంతంగా పొలం గట్టుపై కూర్చొంది. కన్నీళ్ళు తుడుచుకుంది. రెండోజుల్నుంచి పల్లెలో జరుగుతూ వస్తున్న విశేషాలన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి. సర్పంచు తమ్ముడు సుబ్రమణ్యంను పోలీసులు పిల్చుక పోయారు. అలాగే ఎగువ ఇండ్లలోని రామరాజును పట్టుకపోయారు.పల్లెంతా భయంతో వణికిపోతోంది. ఎప్పుడు ఎవర్ని స్టేషనుకు రమ్మని కబురు పెడ్తారోనని బెంబేలెత్తి పోతున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఆర్నెల్ల క్రితం బెంగుళూర్నుంచి పల్లెలోకి ఒక కారు వచ్చింది. దాంట్లోంచి సర్పంచింటికి నలుగురు వ్యక్తులు వచ్చారు. రాత్రంతా మాట్లాడిన తర్వాత పగలు ఒక నిర్ణయానికి వచ్చారు.‘విత్తనాలు మేమే ఇస్తాం, పంట మేమే కొంటాం. మీరు పండించి ఇస్తే చాలు! మీకు రెండు చేతూల డబ్బు ముడుతుందని’ ఆశపెట్టారు.పల్లెలోవాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు ఎగాదిగా చూసుకున్నారు. మంచికైనా, చెడ్డకైనా సర్పంచయ్య ముందుకుంటాడు అనేది నమ్మకం. ఆయప్పనే ముందుకు నిలబడిన తర్వాత యింక మనకేమైతాది? అనే భరోసా. ‘అందరొద్దు గానీ నేను జెప్పినోళ్ళు నలుగురు వుండండి. ముందు పైలెట్ కింద పంట వేసి జూద్దాం. బాగుంటే, మంచిగా గిట్టుబాటుంటే అప్పుడు అందరం వేసుకోవచ్చు’ తన మాటగా చెప్పినాడు సర్పంచయ్య.సర్పంచు తమ్ముడు సుబ్రహ్మణ్యం పైకి లేచి ఎగువిండ్ల రామరాజు, దిగువిండ్ల మేకల కృష్ణయ్య, జెండామాను సందులోని గౌస్ బాషా, రాయలసత్రం దగ్గరుండే మునిరత్నంలను ఈ పంట వేసేదానికి ఎంపిక చేసినాడు. మిగిలినోళ్ళు బయటికి వెళ్ళిపోయారు. చెప్పిన నల్గురూ ఒప్పుకున్నారు.బెంగుళూరు నుంచి వచ్చిన బానకడుపు మనిషి జారిపోతాండే బెల్టును సరిచేసుకుంటూ లేచి పంటను గురించి ఏదో చెప్పబోయాడు. ప్లాస్కులో టీ పట్టుకొచ్చాడు పనోడు. ‘న్నా! ఒక్క మాట అడుగుతా. ఇది గంజాయి సాగు కాదు కదా!’ భయం భయంగానే పైకి అడిగినాడు మునిరత్నం. అరుగుమీద కూర్చొని వున్న సర్పంచయ్య నవ్వినాడు. అట్లే అందరూ కూడా. నిజానికి అక్కడ కూర్చున్న అందరిలో వున్న సందేహమే మునిరత్నం అడిగింది. కానీ అది బయటకు రానీయకుండా అందరూ తమ నవ్వు కింద కప్పిపుచ్చుకుంటున్న విషయం అర్థమౌతోంది. మునిరత్నం తల గోక్కున్నాడు.‘టీ తీసుకో రత్నం ఎందుకు భయపడ్తావ్... మేమందరం వుండాం గదా!’ సర్పంచ్ కాళ్లాడించుకుంటూ అన్నాడు. మునిరత్నం టీ గ్లాసు అందుకున్నాడు.‘ఇవి గసగసాల విత్తనాలు. వీటిని మీ పొలాల్లో కొద్ది భాగంలో సాగు చెయ్యండి. మామూలుగా దొరికే విత్తనాలు చల్లితే మొక్కలు రావు. ఇవి ప్రత్యేకంగా తెప్పించినవి. వీటినే చల్లాలి. పంట కోసం మీరు కొంత ఓపిక చేసుకోవాలి’ చెప్తున్నాడు బెంగుళూరు వ్యక్తి.టీ తాగుతూ అందరూ వింటున్నారు. ‘పంటకు తెల్లపూలు పూస్తాయి. కాయలు కాస్తాయి. పచ్చికాయలకు గంటుపెట్టిన తర్వాత పాలు కారి నల్లబడ్తాయి. ఆ నల్లబడిన జిగురు మాకు కావాలి. అలాగే కాయలు కోసిన తర్వాత తీసివేసిన తొక్క కూడా కావాలి. దాన్ని ఎండబెట్టి పొడిచేసి మాకు ఇవ్వాలి. పొడి చేయడానికి కావలసిన మిషనరీ మేమే ఇస్తాం. కాయ లోపలుండే గింజలే గసగసాలు. అవి మీరు బయట అమ్ముకున్నా మాకభ్యంతరం లేదు. మాకే అమ్మినా కొంటాం. ఇలా వుంటుంది ఈ పని.’ తను చెప్పదల్చుకున్నది సూటిగానే చెప్పాడు బెంగళూరు వ్యక్తి. ‘గసగసాలు మీకమ్మితే కిలోకు ఎంతిస్తారూ?’ అడిగాడు దిగువ ఇండ్ల మేకల కృష్ణయ్య. ‘ఎనిమిది వందలు’ జవాబిచ్చాడు అతడు.‘ధరదేముండాదిలే... ఒక వంద అటో ఇటో తర్వాత మాట్లాడుకోవచ్చు’ సర్పంచయ్య మధ్యేమార్గంగా అన్నాడు.‘విత్తనాలు కారు డిక్కీలో వున్నాయి. లోపలికి తెప్పిస్తే పంపిణీ చేస్తాను’ సర్పంచు వైపుకు చూస్తూ అన్నాడు బెంగళూరు వ్యక్తి. సర్పంచు కనుసైగ చేశాడు.తమ్ముడు పనోళ్ళను పంపించి ఆ విత్తనాల సంచుల్ని లోపలికి తెప్పించాడు. ఐదుగురికి ఐదు సంచుల్ని పంచాడు.పేర్లు, ఫోన్ల నంబర్లు రాసుకున్నాడు.‘గసగసాల కాయల పొట్టుగానీ, జిగురుగానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటవాళ్ళకు ఇచ్చేదానికి ఒప్పుకోము. ముందే చెప్తావుండాము. తేడా వస్తే బాగుండదు!’ హెచ్చరిస్తా చెప్పినాడు బెంగళూరు వ్యక్తి. వచ్చిన పని పూర్తయ్యింది.సర్పంచు సంతృప్తిగా చేతులూపినాడు.కారు కదలడానికి సిద్ధమైంది.‘భయపడాల్సిందేమీ లేదు. మీరు సాగు చేసేది కూడా పంటే. కాకుంటే కొంచెం పోలీసుల దృష్టిలో పడకుండా చూస్కోండి’ అనే మాట మాత్రం సూచనగా చెప్పాడు బెంగళూరు వ్యక్తి. కారు ముందుకు కదిలింది.అట్నుంచి అటే గసగసాల విత్తనాల సంచి భుజంపై పెట్టుకొని ఇంటికి చేరుకున్నాడు మునిరత్నం. సర్పంచయ్య ఇంటి దగ్గర జరిగిన విషయమంతా తీరిగ్గా భార్య గుర్రమ్మకు చెప్పాడు.నాల్గు పచ్చ కాగితాలు చేతిలో మిగిలేటట్లు పంట సాగుకొస్తే తమ జీవితాల్లో కాస్తన్నా వెలుగు చూడాలనే కోరిక ఆమెది.రాత్రి పిల్లల్ని అటొక్కరిని ఇటొక్కరిని పడుకోబెట్టుకున్న తర్వాత పంట సాగు తర్వాత తమ చేతికి అందే సొమ్ము గురించి కలలు కంటూ నిద్రలోకి జారుకుంది.ఆకాశంలో నల్లమేఘాలు వెన్నెల చుట్టూ అల్లుకపోయాయి. తమ పొలంలోని ఒక కయ్యలో విత్తనాలు చల్లింది మొదలు నిరంతరంగా శ్రమిస్తూనే వున్నారు.కాలం తన చుట్టూ తాను తిరుగుతూనే తెల్లపూల చుట్టూ కూడా పరిభ్రమిస్తోంది. మధ్యమధ్యలో బెంగుళూరు నుంచి రెండు, మూడు సార్లు పొలంలో వేసిన గసగసాల సాగు గురించి వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటూనే ఉన్నారు.మరో నెల రోజులు గడిచిన తర్వాత పల్లెలోకి పోలీసు జీపొచ్చింది. కొత్తగా స్టేషనుకొచ్చిన ఎస్.ఐ.కి ఎవరో చెప్పారట – పల్లెలో గసగసాల సాగు చేస్తున్నారని!రచ్చబండ రావిచెట్లు మోట్లో జీపు ఆగింది. పల్లెలోని రైతులందర్నీ పంచాయితీకి రమ్మని దండోరా కొట్టించినారు.‘మీకు తెలిసి సాగు చేస్తున్నారో, తెలియక సాగు చేస్తున్నారో నాకు అనవసరం. గసగసాల సాగు చేయడం ఇక్కడ నేరం. ఈ పంట పండించాలంటే ప్రభుత్వ అనుమతి వుండాలి. అక్రమంగా ఎవరైనా సాగు చేస్తే కేసులు కడ్తాం. అరెస్టులు చేస్తాం. యిక మీ ఖర్మ!’ రచ్చబండ అరుగు పైకెక్కి ఎస్.ఐ. ఆవేశంగా చెప్తున్నాడు.రావిచెట్టు కొమ్మల్లోని పక్షులు కూత వేయకుండా నిశ్శబ్దంగా వున్నాయి. ఆకుల గలగల తప్ప మరే శబ్దం లేదు.‘గసగసాల కాయల పొట్టు మార్కెట్లో కిలో ధర నాలుగు వేలదాకా వుండొచ్చు. పచ్చికాయల జిగురు కిలో మూడు లక్షల దాకా పలుకుతోంది. మాదక ద్రవ్యాల ముఠాలు వీటితో మార్ఫిన్, ఓపియం వంటి డ్రగ్స్ తయారు చేస్తున్నాయి’ ఎస్.ఐ. చెప్పే మాట – ఆసక్తికరంగా జనం వింటున్నారు. ‘కర్నాటక రాష్ట్రం నుంచి ముఠాలు తిరుగుతున్నాయని మాకు అందిన సమాచారం. బెంగళూరు నుంచి ముంబై, గోవాల వంటి ప్రాంతాలకు ఈ డ్రగ్ మాఫియా విస్తరించి వుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ ఉచ్చుల్లో పడకండి’ ఎస్.ఐ. ఆవేశంగా హెచ్చరిస్తున్నాడు. దూరంగా అరుగుపైన కూర్చొని సర్పంచయ్య కూడా వింటున్నాడు. ఇంకాస్త దూరంలో కృష్ణయ్య, గౌస్ బాషా, రామరాజులందరూ ఈ మాటలు వింటున్నారు.దిగదాల బోరింగ దగ్గర కూర్చొని మునిరత్నం, గుర్రమ్మ కూడా మౌనంగా చూస్తున్నారు.పల్లె నిండా ఆవరించిన నిశ్శబ్దం.పోయిన వారం ఇంటి దేవత, గ్రామ దేవత బోయకొండ గంగమ్మకు మొక్కుబడి చెల్లించుకొని వచ్చిన దృశ్యమే గుర్రమ్మకు గుర్తుకు వస్తాంది. తన కుటుంబంతో పాటూ తల్లి దర్శనం చేసుకుంది. అక్కడే గుడి వద్ద వంట పాత్రలు అద్దెకు తీసుకొని వుండి వచ్చారు. తల్లి దగ్గరి రంగునీళ్ళ తీర్థం తీసుకొచ్చి పొలానికి చల్లుకున్నారు. ఆ తల్లి ఆశీస్సులతో పంట పొలాలకు చీడపీడలు తగలవని నమ్మకం. పోలీసులను చూస్తూ ఆ తల్లినే కాపాడమంటూ వేడుకుంది గుర్రమ్మ. పోలీసు జీపు కదిలిపోతూ ఆగింది. సర్పంచు తమ్ముడు సుబ్రహ్మణ్యంను ఎస్.ఐ. పిలిచాడు. జీపులో వెనుక ఎక్కమన్నాడు. పల్లెంతా ఇప్పుడు గసగసాల సాగు గురించే మాట్లాడుకుంటున్నారు.నేడు సుబ్రహ్మణ్యం, రేపు రామరాజు, మర్నాడు క్రిష్ణయ్య తర్వాత తన వంతు అని లోలోపలే కుమిలి పోతున్నాడు – మునిరత్నం.రావి చెట్టు కొమ్మల్లోని పక్షులు రెక్కలు విప్పి ఎగురుతున్నాయి.రాత్రి గుర్రమ్మకు నిద్ర పట్టిందే లేదు.కాసేపు భర్తను, మరి కాసేపు పిల్లల్ని చూసుకుంటూ భయంతో, బాధతో సతమతమైంది.తనకి ధైర్యం లేదు కానీ లేదంటే నడిరాత్రే పొలం దగ్గరికి వెళ్ళాలనేంత కసి.కళ్ళు మూసుకుంటే కన్నుల నిండా కల్లోలం. కాళరాత్రి అంటే ఇలాగే వుంటుందా... తను పుట్టి పెరిగిన మిట్ట చింతవారిపల్లెలోని తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు. ఊరు, పేరు, కుటుంబ గౌరవం కళ్ళముందు మెదులుతున్నాయి. గుండె పగిలేంత బాధ.ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూస్తూ గడిపింది.అలసిన ఆలోచనలతోనే చీకటి దారిని దాటుకొని వెలుతురు ఉదయంలో ప్రయాణం మొదలుపెట్టింది. ఉదయాన్నే ఎవరికీ చెప్పలేదు. ఎవరితో ఏమీ మాట్లాడలేదు. ఒక నిర్ణయానికి వచ్చినదానిలా ముందుకు కదిలింది. తుమ్మచెట్ల దార్నుంచి రాళ్ళవంక దాటింది. సహదేవ నాయుడి తోట అడ్డదారి గుండా పొలానికి చేరుకుంది. కయ్యలో వేసిన గసగసాల పూల చెట్లన్నింటినీ ధ్వంసం చేసింది.తన చేతుల్తో తానే స్వయంగా పీకి కుప్పపోసి అగ్గిపెట్టింది. వెక్కి వెక్కి ఏడ్చింది.కన్నీళ్ళు తుడుచుకొని సాయంత్రానికి ఇంటిదారి పట్టింది.తనకిప్పుడు ధైర్యంగా వుంది.ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నట్లుగా వుంది.గడప దగ్గర భర్త మునిరత్నం ఎదురైనాడు. తలొంచుకొని ఇంట్లోకెళ్ళింది. మునిరత్నం ఏమీ అడగలేదు. కానీ గుర్రమ్మ తను ఉదయాన్నే పొలం దగ్గరికి వెళ్ళి చేసి వస్తున్న పనినంతా సూటిగా చెప్పింది. మునిరత్నం మండిపడ్డాడు.సర్పంచుకు ఎలా సమాధానమిచ్చుకోవాలో తెలియడం లేదన్నట్లు భగ్గున రగులుతున్నాడు. ‘కొంచెం ఓపిక పట్టివుంటే బాగుండునని’ దిగులు పడుతున్నాడు.బూడిద రంగు గసాల సాగుకోసం బతుకును బుగ్గిపాలు ఎవరు చేసుకొంటారు. కానీ నాల్గు నెలల్లోనే చేతికొస్తుందని సాగుకు పూనుకున్నాడు. ఇది నిషేధిత పంట అని తెలియదు. ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ గురి వుంటుందని తెలియదు. పోలీసులకు భయపడి గుర్రమ్మ చేసొచ్చిన పని మాత్రం కలవర పెడ్తోంది. కంపరంగా వుంది. మునిరత్నం అసహనంగా ఉన్నాడు. తిట్టాడు. అరిచాడు. కోప్పడ్డాడు. విసిరేశాడు. కొట్టడానికి వచ్చాడు.యిక చేసేదేం లేక మౌనంగా అలిగి అరుగుమీద కూర్చున్నాడు. ఇవేవీ పట్టించుకోకుండా గుర్రమ్మ వంట పనిలో నిమగ్నమై వుంది.నల్ల మందు మొక్కల తెల్ల దెయ్యం పూలు గుర్తొచ్చినప్పుడల్లా గుండెల నిండా భయం ఆవహిస్తోంది.గొంతు తడారి పోతోంది. కాసిన్ని నీళ్ళు తాగి నిమ్మళ పడుతోంది.ఇద్దరు పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని అన్నం వడ్డిస్తూ, తినిపిస్తూ ఆనందపడుతోంది. తమకు పట్టిన నరకం మబ్బు తొలగిపోయిందనే సంతోషం ఆమె ముఖంలో స్పష్టంగా కన్పిస్తోంది. బయట వెన్నెలను కమ్ముకున్న చీకటి నీడలు ఒక్కొక్కటిగా విడిపోతున్నాయి.నాల్గు పచ్చ కాగితాలు చేతిలో మిగిలేటట్లు పంట సాగుకొస్తే తమ జీవితాల్లో కాస్తన్నా వెలుగు చూడాలనే కోరిక ఆమెది.రాత్రి పిల్లల్ని అటొక్కరిని ఇటొక్కరిని పడుకోబెట్టుకున్న తర్వాత పంట సాగు తర్వాత తమ చేతికి అందే సొమ్ము గురించి కలలు కంటూ నిద్రలోకి జారుకుంది.ఆకాశంలో నల్లమేఘాలు వెన్నెల చుట్టూ అల్లుకపోయాయి. పోలీసు జీపు కదిలిపోతూ ఆగింది. సర్పంచు తమ్ముడు సుబ్రహ్మణ్యంను ఎస్.ఐ. పిలిచాడు. జీపులో వెనుక ఎక్కమన్నాడు. పల్లెంతా ఇప్పుడు గసగసాల సాగు గురించే మాట్లాడుకుంటున్నారు.నేడు సుబ్రహ్మణ్యం, రేపు రామరాజు, మర్నాడు క్రిష్ణయ్య తర్వాత తన వంతు అని లోలోపలే కుమిలి పోతున్నాడు – మునిరత్నం.రావి చెట్టు కొమ్మల్లోని పక్షులు రెక్కలు విప్పి ఎగురుతున్నాయి. రాత్రి గుర్రమ్మకు నిద్ర పట్టిందే లేదు. కాసేపు భర్తను, మరి కాసేపు పిల్లల్ని చూసుకుంటూ భయంతో, బాధతో సతమతమైంది. -
రికార్డుల్లో ఉన్నా.. భౌతికంగా సున్నా..
ఆ ఊళ్లు ఏనాడో ఖాళీ • దెయ్యం దెబ్బకు, రోగాలకాటుతో పొరుగూళ్లకు.. • లేనివి ఉన్నట్లు రెవెన్యూశాఖ ఉత్తర్వులు • జోగుళాంబ గద్వాల జిల్లాలో వింత పరిస్థితి గట్టు: ఆ మూడు గ్రామాలు ఎప్పుడో కాలగర్భం లో కలిసిపోయాయి. అయితే రికార్డుల్లో మా త్రం పదిలంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆ గ్రామాలు ఉన్నట్లు రికార్డుల్లో చూపడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. గట్టు మండలంలో ఒకప్పుడు ఉన్న ముసలంపల్లి, అప్పకొండనహళ్లి, ఈసర్లపాడు కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని గ్రామాలు. ప్రస్తుతం ఆ ప్రాంతానికి వెళ్లి చూస్తే శిథిలాలు తప్ప మరేమీ కనిపించవు. జనసంచారం లేని గ్రామాలుగా రికార్డులకెక్కాయి. మరి ఆ గ్రామాల్లోని జనాభా ఎటు వెళ్లారు... ఏమైపో యారు! అని ప్రశ్నిస్తే ఒక్కో గ్రామానికి ఒక్కో దీనగాథ ప్రచారంలో ఉంది. మూఢ నమ్మకం, ప్రజల అమాయకత్వం, అంటురోగాలు ఆ మూడు గ్రామాలను జనసంచారం లేని గ్రామాలుగా మార్చేశాయని చెబుతున్నారు. ఈసర్లపాడుకు అంతుచిక్కని రోగం నందిన్నె–కాలూర్ తిమ్మన్దొడ్డి గ్రామాల మధ్య ఈసర్లపాడు ఉంది. ఇక్కడ సుమారు 500 మంది జనాభా నివసించేవారట. పాడిపంటలకు ప్రసిద్ధి చెందిన ఈ గ్రామం పరిసర ప్రాంతాల్లో సంపన్న గ్రామం. అయితే ఇక్కడా అప్పట్లో అంతుచిక్కని రోగాలు ప్రబలి, వైద్యసేవలు అందక గ్రామస్తులు చాలామంది మృత్యువాతపడడంతో ఒక్కొక్కరుగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఊరును ఖాళీ చేసి నందిన్నెలో కొందరు, కాలూర్‌తిమ్మన్‌దొడ్డిలో మరికొందరు స్థిరపడ్డారు. ఇక్కడ జనవాసానికి సంబంధించిన ఆనవాళ్లు పూర్తిగా శిథిలమయ్యాయి. ప్రభుత్వ తాజా ఉత్తర్వులు జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వం కొన్నిమార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అప్పకొండనహళ్లి గ్రామాన్ని కేటీదొడ్డి (కాలూ రు తిమ్మన్దొడ్డి) మండలంలో, ముస్లింపల్లెను గట్టు మండలంలోకి, శాలిపూర్, ఖానాపూర్ గ్రామాలను ఉండవెల్లి మండలంలోకి, మంగంపేట, రాయిమాకులకుంట్ల, పోసలపాడు గ్రామాలను మానవపాడు మండలంలోకి మార్చుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూశాఖ పేర్కొం ది. ఈ గ్రామాలు భౌతికంగా ఎక్కడాలేవు. దెయ్యం దెబ్బకు ముసలంపల్లి ఖాళీ! బల్గెర గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో తెలంగాణ–కర్ణాటక సరిహద్దు లో ముసలంపల్లి గ్రామం ఉండేది. ఇప్పటికీ అక్కడ శిథిలావస్థలో ఆంజనేయస్వామి దేవాలయం అలాగే ఉంది. సుమారు 150 ఏళ్ల క్రితం ఇక్కడ 600 మంది జనాభా నివసించేవారట. అప్పట్లో ఓ నిండు గర్భిణిని భర్త అనుమానించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుని గ్రామంలోని వారిని దెయ్యం రూపంలో వెంటాడినట్లుగా కథ ప్రచారం ఉంది. ఇలా దెయ్యంగా మారిన ఆమె అంతు చిక్కని రోగాలతో ఆ గ్రామస్తులను హత మార్చుతుండేదని∙శతాధిక వృద్ధులు చెబుతుంటారు. అప్పట్లో రోగాలు గ్రామంలో ప్రబలడంతో చాలామంది మృత్యువాత పడగా, మిగిలిన వారు గ్రామం వదిలి ఇతర ప్రాంతాల్లో స్థిరపడినట్లుగా చెబుతున్నారు. అలా దెయ్యం దెబ్బతో పాటు అంటు రోగాల కారణంగా ఈ గ్రామం జన సంచారం లేని గ్రామంగా మారిపోయింది. ఈ గ్రామానికి చెందిన వారి వారసులు ఇప్పటికీ బల్గెర, చమన్‌ఖాన్‌దొడ్డి గ్రామాలతో పాటు కర్ణాటకలోని జిలంగేరి గ్రామంలో స్థిరపడ్డారు. వారు ఈ గ్రామశివారులోని పొలాలను ఇప్పటీకి సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అప్పకొండనహళ్లిని వదిలేశారు.. మాచర్ల– చింతలకుంట గ్రామాల మధ్య అప్పకొండనహళ్లి ఉంది. ఈ గ్రామంలోనూ సుమారు అప్పట్లోనే 450 మంది దాకా జనాభా ఉండేవారని చెబుతున్నారు. ఒకానొక సందర్భంలో గ్రామంలో భయం కరమైన రోగాలు ప్రబలడంతో మరణించే వారిసంఖ్య రోజు రోజుకు పెరగడంతో మిగతావారు గ్రామం వదలి వెళ్లిపోయారు. మాచర్లలో కొందరు, చింతలకుంటలో మరికొందరు స్థిరపడ్డారు. ఇక్కడ ఆంజనేయస్వామి దేవాలయం, పురాతనకాలం నాటి కోట బురుజు ఇప్పటికీ శిథిలమై కనిపిస్తాయి. -
అమ్మాయిని భయపెట్టిన దెయ్యం!!
ఓ చిన్నారి ఒళ్లో బొమ్మను కూర్చోబెట్టుకుని ఆడుకుంటోంది. ఆమెకు కొంత దూరంగా మరో బొమ్మ ఉంది. ఉన్నట్టుండి ఆ బొమ్మ తలాడించడం, ఒక జడ పైకి లేపడం లాంటివి చేయసాగింది. ఆ విషయం సీసీటీవీ ఫుటేజిలో రికార్డయింది గానీ, అప్పటికి ఆ చిన్నారి ఏమీ చూడలేదు. కాసేపటి తర్వాత ఆ అమ్మాయి వేరే గదిలోకి వెళ్లి టేబుల్ మీద కొన్ని కాగితాలు పెట్టుకుని ఏదో రాసుకోసాగింది. గదిలో కిటికీ తలుపులు ఏమీ తీసి లేవు. ఫ్యాన్ కూడా వేసి లేదు. అయినా ఉన్నట్టుండి కాగితాలు ఎగిరిపోయాయి. వాటి మీద ఉన్న డస్టర్ కింద పడిపోయింది. దూరంగా ఒక టేబుల్ మీద ఉన్న రిమోట్ కంట్రోల్, మందుల డబ్బా తలోవైపు పడిపోయాయి. కాగితాలు ఎగరగానే ఒక్కసారిగా భయపడిన చిన్నారి అక్కడినుంచి పారిపోయింది. ఆ తర్వాత క్రమంగా ఆమె కాగితాలు పెట్టుకున్న టేబుల్ జరగసాగింది. ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజిలో రికార్డయింది. తమ ఇంట్లో ఏదో దెయ్యం ఉందని, అదే తమ కూతురిని భయపెడుతోందని ఆ చిన్నారి తల్లిదండ్రులు అంటున్నారు. ఈ వీడియోను అమ్మాయి తండ్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంట్లో తాము లేనప్పుడు అమ్మాయి భద్రత కోసం కెమెరాలు పెట్టామని, అందులో ఈ దెయ్యం చేష్టలు రికార్డయ్యాయని చెప్పారు. అయితే ఈ వీడియో ఏ దేశంలోనిదో, ఎప్పుడు రికార్డు చేశారో మాత్రం తెలియలేదు. -
అమ్మాయిని భయపెట్టిన దెయ్యం!!
-
దెయ్యప్పిల్ల! మీకో టెస్ట్!
మిస్సింగ్ ఈ ఫొటోలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? 1, 2, 3, 4, 5, 6... యు ఆర్ రైట్! ఈ అమ్మాయిలంతా ఏం చేస్తున్నారు? చక్కగా నవ్వుతున్నారు.... యు ఆర్ రైట్! వీళ్లంతా ఎక్కడ కూర్చొని ఉన్నారు? సోఫాలో... యు ఆర్ రైట్! వీళ్ల చేతుల్లో ఏం ఉన్నాయి? ఏవో డ్రింక్స్... యు ఆర్ రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. సోఫాలో మధ్యలో కూర్చొని ఉన్న అమ్మాయి కాళ్లెక్కడ ఉన్నాయి? (పట్టె మీద కూర్చున్న అమ్మాయిని వదిలెయ్యండి). మిగతా ఐదుగురిలో... మధ్యలో ఉన్న అమ్మాయి కాళ్లు ఎక్కడున్నాయి? టైమ్ తీసుకోండి. కరెక్ట్ సమాధానం చెప్పండి. ఆ పిల్ల కాళ్లు ఎక్కడున్నాయో కనిపెడితే మీరు గ్రేట్. కనిపెట్టలేకపోతే... ఆ పిల్ల దెయ్యప్పిల్లే! ఇటీవలే ఈ ‘దెయ్యం’ నెట్లోకి వచ్చేసింది. కొందరికైతే కలలోకీ వచ్చేస్తోందట. -
దెయ్యం 'మాయం'
చేత'న'బడి ‘ఎవరికీ దెయ్యం కనిపించడం లేదు’ ఆ ఊరిలో ఇప్పుడు ఇదే చర్చనీయాంశం. నిజమే ఆ ఊళ్లో ఎవరికీ దెయ్యం కనిపించడం లేదిప్పుడు. జ్వరాలతో మంచాలు పట్టిన వాళ్లకీ కనిపించడం లేదు. బడికెళ్లే పిల్లలకూ కనిపించడం లేదు. తొలి జామున పొలానికెళ్లే రైతులనూ పలకరించడం లేదు. మిట్టమధ్యాహ్నం భర్తలకు అన్నం తీసుకెళ్లే ఆడవాళ్లనూ భయపెట్టడం లేదు. అజ్ఞానం చీకట్లో కొరివి దెయ్యం వీర విహారం చేసిందొకప్పుడు విజ్ఞానం వెలుగులో మాయమైపోయిందిప్పుడు. ‘‘మరి దెయ్యం ఎక్కడికెళ్లింది నాన్నా’’ తండ్రి భుజాన్ని గుంజుతూ అడుగుతోంది గాయత్రి. ‘‘దెయ్యం మంటల్లో కాలిపోయింది. ఇక ఎవరికీ కనిపించదు’’ కూతురికి నచ్చే రీతితో ఆమె సమాధానపడేటట్లు చెప్పాడు గోవిందయ్య. ‘‘అయినా లేని దెయ్యాన్ని ఉందని నమ్మించి ఎంత డబ్బు గుంజాడయ్యా ఆ మాయగాడు’’ బుగ్గలు నొక్కుకుంటూ వచ్చి ఎదురుగా కూర్చుంది కమలమ్మ. ‘‘నెల్లాళ్ల కిందట ఈ ఊరు ఊరులా ఉండిందా, ఇంటికో జబ్బు మంచంతో ఆసుపత్రి వార్డులా ఉండేది’’ అన్నదామె. ఆమె ఆలోచనలు గతంలోకి పరుగులు తీశాయి. ‘‘రాజమ్మొదినా! మీ పిల్లాడుంటే నాలుగు వేపమండలు కోసిమ్మని చెప్పవే. నా కొడుకు ఒళ్లు కాగిపోతోంది. మూసిన కన్ను తెరవలేదు. నిన్న పొలం పోయినోడు రాత్రికి ఇంటికి రావడమే మంచం మీద వాలాడు. ఇంకా లేవలేదు. ఆ కొరివిదెయ్యం చూపు నా బిడ్డ మీద పడ్డట్టుంది దేవుడా’’ అంటూ వరండాలో కూర్చుంది నాగమ్మ. రాజమ్మలో సానుభూతి, సహాయం చేయాలనే సహృదయత కంటే ఎక్కువగా భయం గూడుకట్టుకుంటోంది. దెయ్యం పట్టిన ఇంటి వాళ్లను తన ఇంటికి రానిస్తే వాళ్లతోపాటు ఆ పీడ కూడా వస్తుందేమోననే భయం ఆమెది. ‘‘నువ్వింటికి పో వదినా, పిల్లాడిని ఒక్కణ్నీ వదిలి వస్తే ఎట్టా, మా పిల్లాడు బడి నుంచి వచ్చాక వేపాకు కోయిస్తాలే’’ అన్నది. నాగమ్మను త్వరగా పంపించేయాలని తొందరపడుతోంది రాజమ్మ. వారం రోజుల్లోనే ఊళ్లో ఆడమగ, చిన్నా పెద్దా అంతా కలిసి వందమంది దాకా మంచం పట్టారు. ఒక్కో ఇంట్లో ఒకరికి జ్వరం తగ్గితే ఇద్దరు మంచాన పడుతున్నారు. అందరిదీ ఒకటే జ్వరం... అది భయం జ్వరం. కొరివిదెయ్యం భయంతో వచ్చిన చలిజ్వరం. అది పొరుగురిలోని భూతవైద్యుడి ఇల్లు. గ్రామ పెద్దల వంటి నలుగురు ఆయన ఎదురుగా ఉన్నారు. ‘‘రాత్రి దీపాలు పెట్టాక నట్టింట్లో కూర్చోబెట్టి జ్వరం వచ్చిన వాళ్ల కుడి చేతికి కట్టండి’’ జ్వరాలకు అంత్రాలు మంత్రించి ఇస్తూ చెప్పాడు భూతవైద్యుడు. వాటిని భక్తిగా చేతిలోకి తీసుకుని సంచిలో దాచుకున్నాడు ఊరిపెద్ద. ‘‘ఆ శ్మశానం దారిని వదిలేసి మరొక దారిలో నడవమని చెప్పండి’’ అని ముక్తాయించాడు భూతవైద్యుడు. వాళ్లు అయోమయంగా చూశారు. ‘‘ఊరంతా పొలం పనులు చేసుకునే వాళ్లమే. శ్మశానం మీదుగా వెళ్లాల్సిందే. మరో దారి లేదు’’ అన్నాడు వారిలో ఒకతడు. సాలోచనగా తల పంకించాడు భూతవైద్యుడు. వ్యవసాయం మీద ఆధారపడిన ఆ ఊరికి - ఊరి పొలాలకి మధ్యలో శ్మశానం ఉందని అర్థమైందతడికి. ‘‘అలా ఉంటే ఊరికి అరిష్టం కాక మరేమవుతుంది’’ అని శక్తిమంతమైన బాణాన్ని వదిలాడు భూతవైద్యుడు. నలుగురూ ఒకరిముఖాలొకరు చూసుకున్నారు. ఒకతడు ఊరికి పట్టిన అరిష్టం వదిలే మార్గం చెప్పమంటూ అమాయకంగా చక్కటి అవకాశాన్ని భూతవైద్యుడి చేతిలో పెట్టాడు. ‘‘రాజమ్మా! నా కొడుకుని పట్టుకుంది ఆ అరవదెయ్యమేనంట! భూతవైద్యుడు ఎల్లుండి ఆదివారం నుంచి పదిహేన్రోజులు మనూళ్లోనే ఉండి ఇంటింట్లో పూజ చేస్తాట్ట. ఆయన చేత్తో పూజ చేయించుకుంటే దెయ్యం రాకుండా లక్ష్మణరేఖ గీసినట్లేనని చెప్పుకుంటున్నారే రాజమ్మా! నువ్వు కూడా చేయించుకో పిల్లలు గల దానివి’’ సమాచారంతోపాటు ఓ సలహా ఇచ్చేసి వెళ్లింది నాగమ్మ. ఆదివారం మధ్యాహ్నం... నాగమ్మ ఇల్లు. భూతవైద్యుడు, అతడి ఎదురుగా నాగమ్మ కొడుకు. పక్కనే భూతవైద్యుడి అనుచరులిద్దరు. ‘‘నువ్వేం చూశావ్’’ ఆ గొంతులోని గంభీరానికి నోరు పెగల్లేదు నాగమ్మ కొడుక్కి. ‘‘రాత్రి ఎనిమిది గంటలప్పుడు పొలం నుంచి పిల్లాడొక్కడే వస్తూన్నాడు. వల్లకాట్లో కొరివి మండడం చూశాడు, ఊపిరి బిగపట్టుకుని వస్తుంటే వెనక ఎవరో వెంట వస్తున్నట్లు చప్పుడు విన్నాడు. దెయ్యమే వెంటపడింది. చెమటలతో ఇంటికొచ్చిన వాడు పది రోజులైనా మంచం మీద నుంచి లేవలేదు’’ చేత్తో గుండెలను బాదుకుంటూ చెప్పింది నాగమ్మ. నట్టింట్లో ముగ్గు వేసి క్షుద్రపూజలు, నల్లకోడిని కోసి రక్తం ధారపోయడం, కళ్లెర్ర చేసి వేపమండలు చరుస్తూ కర్ణకఠోరంగా మంత్రాలు వల్లించడం వంటివన్నీ పూర్తయ్యాయి. నాగమ్మకు ఐదు వేల ఖర్చు లెక్కకొచ్చింది. ‘‘పిల్లవాడిని బాగా భయపెట్టింది కొరివిదెయ్యం. ఎంత పెద్ద దెయ్యమైనా సరే... దాన్ని భయపెట్టే వైద్యుడు వచ్చే వరకే ఆ ఆటలన్నీ. ఇప్పుడు తోక ముడుచుకుని శ్మశానం దారి పట్టింది’’ అంటూ రక్తి కట్టించాడు ఓ అనుచరుడు. ఇదే తంతు దాదాపుగా ఇరవై ఇళ్లలో జరిగింది. మరి... కొరివి దెయ్యం ఇప్పుడు శ్మశానం దారి పట్టింది సరే. మళ్లీ పట్టదని నమ్మకమేంటి. రోజూ ఆ దారిన నడవాల్సిన వాళ్లమే కదా! సందేహం రావడం అది వేళ్లూనుకోవడం గంటల్లోనే జరిగిపోయింది. దానికి విరుగుడుగా ఊరంతటికీ రక్షణ కల్పించడం లేదా దెయ్యాన్ని శ్మశానం దాటకుండా దిగ్బంధనం చేయడం... తరుణోపాయం చెప్పాడు ఇంకోఅనుచరుడు. దిగ్బందనం చేయించాలంటే ఎంత ఖర్చవుతుంది... పెద్దలు ఆలోచనలో పడ్డారు. ‘పంట కాలువ కోసం ఎకరాకి వెయ్యేసి రూపాయలు పోగు చేశాం కదా పెద్దయ్యా! ఆ డబ్బుతో కొరివి దెయ్యం రాకుండా దిగ్బందం చేయిద్దాం. పంట కాలువ వచ్చే ఏడు తవ్వుకోవచ్చు’’ తోచిన సలహా ఇచ్చాడొక మధ్యవయస్కుడు. అందరికీ అదే ఆమోదయోగ్యంగా కనిపిస్తోంది. భూతవైద్యుడికి ఆ ఊరు లాభసాటిగా కనిపిస్తోంది. ఇంతలో ఓ రోజు... ‘‘మనూర్లో దెయ్యం ఉందని పేపర్లో ఏశారంట’’ ఉద్వేగంతో చెప్తోంది రాజమణి. ఈ సమాచారం ఊరంతటినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దాని ప్రభావం మరుసటి రోజు కనిపించింది. గ్రామం రచ్చబండ దగ్గర సమావేశం. ఊరిపెద్దలంతా ఉన్నారు. ఊరికి కొత్తవాళ్లు ఐదుగురు కూడా ఉన్నారు. ‘‘పెద్దయ్యా! ఈ పని చేస్తే అంతా మనమీదకే వస్తుందేమో! కొరివిదెయ్యాన్ని దిగ్బందం చేద్దామని ఊరంతా ఒక్కమాట మీద ఉంది. పంటకాలవ డబ్బు బయటకు తీయడానికి ఇష్టం లేకే నువ్వీపని సేత్తన్నావనుకుంటారంతా’’ చెవిలో గుసగుసలాడాడు ఒకాయన. ‘‘నాకూ అయోమయంగానే ఉందిరా వెంకటయ్యా! ఏది నిజమో తెలవడంలా. ఏం చేద్దామన్నది పాలుపోవడం లేదు. చూద్దాం! వీళ్లేం చెబుతారో’’ సర్ది చెప్పాడు పెద్దయ్య. ఊరికి వచ్చిన వాళ్లు జ్వరంతో మంచం పట్టిన ఒక్కొక్కరినీ పిలిచి మాట్లాడుతున్నారు. పదిమందికి పైగా వాళ్లు చూసింది చెప్పారు. ఒక్కో ప్రశ్న సంధిస్తే స్పష్టమైన సమాధానం మాత్రం రావడం లేదు. అందరి మాటల్లో కామన్‌గా ఉన్నది మాత్రం శ్మశానంలో మంట ఒక్కటే. అదెలా వస్తుందో చెప్పారు. ఊరంతా సమాధానపడే వరకు శాస్త్రీయంగా వివరించారు. అంతా విన్న తర్వాత ఒక కుర్రాడు లేచి ‘‘చెప్పడానికి మేమూ చెప్తాం. రాత్రి ఆ దారెంట మీరు నడిచి చూడండి, మీకు జ్వరం రాకపోతే మీరు చెప్పింది నమ్ముతాం’’ సవాల్ విసిరాడు. ‘‘ఆ హేతువాదులు ఎక్కడా వెనకగుడు వేయలేదు చూడయ్యా! మీ ఊళ్లో దెయ్యం ఉంటే మాకేంటి, మీ చావు మీరు చావండని వెళ్లిపోయుంటే ఈ రోజు ఇంకా కొరివి దెయ్యం పట్టకుండా ఉండడానికి అంత్రాలు కట్టించుకుంటూ, భూతవైద్యులకు వేలకు వేలు సమర్పించుకుంటూ ఉండేవాళ్లం’’ అన్నది కమలమ్మ. ఆమె మాటల్లో అజ్ఞానం చీకటి వదిలిన ధైర్యం. విజ్ఞానం వెలుగు దారి చూపిస్తుందన్న నమ్మకం వ్యక్తమవుతున్నాయి. అరవదెయ్యం పుకారు! ఆ ఊరికి చెందిన ఒక కుటుంబం తమిళనాడుకి వలసవెళ్లింది. కొన్నేళ్ల తర్వాత సొంతూరికి తిరిగి వచ్చింది. వారిలో ఒకావిడ అనారోగ్యంతో మరణించింది. ఆమెను తమిళనాడులో దెయ్య పట్టుకుందని, ఆమె పోయాక కొరివి దెయ్యమై ఊళ్లో వాళ్లను భయపెడుతోందని పుకారు పుట్టింది. ఇది పూర్తిగా భయం నుంచి మొదలైన అపోహ మాత్రమే. ఆ కుటుంబం పట్ల ఎవరికీ కక్షలు, కార్పణ్యాలు లేవు. భయమే దెయ్యం... ఇది మూడేళ్ల కిందట ఖమ్మం జిల్లా మణుగూరు మండలం, పాతర్లపాడు గ్రామంలో జరిగింది. ఆ కుర్రాడు సవాల్ చేశాడు. కానీ ఊళ్లో అందరి ఉద్దేశం అదే. అతడిని ఎవరూ వారించే ప్రయత్నం చేయలేదు. మా వివరణతో పూర్తిగా కన్విన్స్ కాలేకపోతున్నారనిపించింది. శ్మశానానికి మేమూ వస్తాం అని సవాల్‌ను స్వీకరించాం. ఆ రాత్రి అక్కడే ఉండి శ్మశానానికి వెళ్లాం. మంటలు ఎందుకు వస్తున్నాయో వివరిస్తూ ప్రాక్టికల్‌గా చూపించాం. ఇక వాళ్లను ఎవరో వెంబడిస్తున్నారనే భ్రాంతికి కారణం వాళ్ల పాదాల చప్పుడే. రాత్రిళ్లు నిశ్శబ్ద వాతావరణంలో తమ చెప్పుల చప్పుడు కొద్ది క్షణాల తర్వాత ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. దెయ్యం వెంబడిస్తోందని భయపడతారు. వెనక్కి చూడడానికీ భయమేయమడంతో వెనుక ఏమీ లేదని తెలిసే అవకాశం ఉండదు. - అలవాల నాగేశ్వరరావు, జనవిజ్ఞాన వేదిక, రాష్ట్ర కోశాధికారి శ్మశానంలో మంటలు! శవాన్ని దహనం చేసిన తర్వాత కూడా కొన్ని ఎముకలు మిగిలే ఉంటాయి. ఎముకల్లో క్యాల్షియంతోపాటు భాస్వరం కూడా ఉంటుంది. కాలి బూడిదవుతూ ఒక్కొక్క పొర గాలికి ఎగిరి పోతూ ఉంటుంది. లోపలి పొరల్లో భాస్వరం గాలిలోని ఆక్సిజెన్‌తో సమ్మేళనమై మండుతూ ఉంటుంది. పగలు కూడా ఇదే రసాయన చర్య జరుగుతుంటుంది. కానీ పగలు వెలుతురులో మంటలు దూరానికి కనిపించవు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి గమనిక: వ్యక్తుల పేర్లు మార్చడమైంది -
విజయవాడలో దెయ్యం చేపలు
-
దయ్యాల వల్లే చనిపోయారట!
భోపాల్: రైతుల ఆత్మహత్యలకు దయ్యాలే కారణమట! ఈ మాట చెప్పింది ఏ మంత్రగాడో కాదు. సాక్షాత్తూ ఒక రాష్ట్ర ప్రభుత్వం, అదీ అసెంబ్లీలో. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సొంత జిల్లా సెహోర్‌లో గత మూడేళ్లలో 418 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందుకు కారణం ఆర్థిక బాధలు కాదని, దయ్యాలని హోం మంత్రి భూపేంద్ర అసెంబ్లీలో బుధవారం చెప్పారు. తమవారు దయ్యాల వల్లే చనిపోయారని ఆత్మహత్య చేసుకున్న రైతుల బంధువులిచ్చిన సమాచారం ఆధారంగానే ఈ వివరాలు ఇస్తున్నట్లు వివరించారు. విపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే శైలేంద్ర పటేల్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ విధంగా సమాధానం ఇచ్చారు. దయ్యాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం నమ్ముతుందా అని పటేల్ ప్రశ్నించారు. అసెంబ్లీ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వం చెప్పిన సమాధానం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. 418 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటే 117 మంది బలవన్మరణాలకు కారణాలు నమోదు చేయలేదన్నారు. -
అరెస్ట్ దిస్ దెయ్యం
గౌరవ్ తివారీ దెయ్యాల్ని పట్టుకుంటాడు. ఇది తెలిసి దెయ్యాలన్నీ కలిసి ఓ మీటింగ్ పెట్టుకున్నాయట. దెయ్యమంటే భయం ఉండాలి కానీ గౌరవ్‌కి గౌరవం పెరగడం ఏంటని మీటింగ్‌లో నిరసనలు. ‘వెంటనే ఖతమ్ చేసెయ్యాలి’ అంది దెయ్యాల ప్రెసిడెంట్.అలా ఎందుకని ఓ పిల్లదెయ్యం అడిగింది. లేకపోతే ప్రజలకి మనమీద భయం పోతుంది,చెప్పాడు ప్రెసిడెంట్. సారీ, చెప్పింది ప్రెసిడెంట్ దెయ్యం.అంతే... నెక్స్ట్ డే మార్నింగ్... సారీ, నైట్ గౌరవ్ గొంతు పిసికి చంపేశాయట. దెయ్యాలుంటాయని నమ్మేవారు రాసుకున్న కథలివి.. హేతువాదులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు.. దెయ్యాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనుకునేవాళ్లు మాటిమాటికీ మంచం కిందికి తొంగి చూసుకుంటున్నారు... జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్. దెయ్యాల్లేవ్, భూతాల్లేవ్... కానీ భయమైతే ఉంది. భయాన్ని మించిన దెయ్యం లేదు! లేదూ దెయ్యమే చంపింది అంటే... దెయ్యాల వేట సాగించే ఆ సాహసవంతుడు మరిలేడు. అనుమానాస్పదంగా మరణించాడు. ప్రమాదవశాత్తూ చనిపోయాడా... ఆత్మహత్య చేసుకున్నాడా... లేదా దెయ్యాలే చంపేశాయా? ఇదో మిస్టరీ. వారం రోజుల క్రితం మరణించిన ఘోస్ట్ హంటర్ గౌరవ్ తివారీ కథ ఇప్పుడు దేశ విదేశాల్లో పారా నార్మల్ యాక్టివిటీల్లో నిమగ్నమైన గ్రూపులలో ఉత్కంఠ రేపుతోంది. ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. గౌరవ్ తివారీ ఎవరో తెలుసుకునే ముందు అతడేం చేసేవాడో చూద్దాం. కోల్‌కతాలోని ఓ అపార్ట్మెంటు... ఐదో అంతస్తులోని ఒక ఫ్లాట్ తలుపు బర్రున తెరుచుకుంది. లోపలంతా చిక్కటి చీకటి. కన్ను పొడుచుకుని చూసినా ఏమీ కనిపించడం లేదు. ‘ఏంటిది... భూత్ బంగ్లాలా ఇలా ఉంది’ అంటూ లోపలికి అడుగు పెట్టాడా వ్యక్తి. చేతిలోని టార్చ్‌ను ఆన్ చేశాడు. ఆ వెలుగులోనే స్విచ్‌బోర్డ్ ఎక్కడుందో వెతుక్కుని లైట్ ఆన్ చేశాడు. ఒక్కసారి చుట్టూ పరికించి చూశాడు. ‘వావ్... చీకటిలో కనిపించలేదు కానీ ఫ్లాట్ అదిరింది’ అనుకుంటూ ఒక్కో గది తలుపూ తెరిచి చూడటం మొదలుపెట్టాడు. కిచెన్, డైనింగ్ హాల్, స్టడీ రూమ్... అన్నీ చాలా బాగున్నాయి. ఇక బెడ్రూమ్ ఎలా ఉందో చూడాలి అనుకుంటూ డోరు తీశాడు. లోనికి అడుగుపెడుతుంటే ఎవరిదో నవ్వు వినిపించింది. ఎవరిదో అర్థం కాలేదు. కిటికీ తీసి చూశాడు బయట ఎవరైనా ఉన్నారేమో అని. ఎవరూ లేరు. మరి నవ్వింది ఎవరు అనుకుంటూ ఉండగానే మళ్లీ నవ్వు వినిపించింది. అతని వెన్నులో వణుకు. ఒకవేళ అది తన భ్రమ అయివుంటుంది అనుకున్నాడు. కానీ అది భ్రమ కాదని ఆరోజు రాత్రి అర్థమయ్యిందతనికి. ఎవరో అమ్మాయి నవ్వులు... అంతలోనే ఏడుపులు... మధ్యలో మూలుగులు. ఉన్నట్టుండి కప్పుకున్న దుప్పటి గాల్లోకి లేచింది. సైడ్ టేబుల్ మీద ఉన్న నీళ్ల గ్లాసు కింద పడి భళ్లున బద్దలయ్యింది. ఏసీ లేకపోయినా గది మొత్తం చల్లగా అయిపోయింది. మళ్లీ అంతలోనే వేడెక్కిపో యింది. మొత్తానికి ఆ రాత్రి అతనికి కాళరాత్రి అయ్యింది. అంతా శ్రద్ధగా విన్నాడు గౌరవ్ తివారీ. వెంటనే ఆ వ్యక్తిని తీసుకుని అతని ఫ్లాట్‌కి బయలుదేరాడు. ఆ గదిలో అడుగుపెడుతూనే అతనికి అర్థమైపోయింది అక్కడ ఏం జరుగుతోందో, ఎవరి వల్ల జరుగుతోందో. కొద్దిపాటి అన్వేషణ సాగించాడు. ఆచూకీ తెలిసింది. ఎస్. అక్కడ ఒక ఆత్మ ఉంది. కొన్ని సంవత్సరాలుగా అక్కడే ఉంది. భర్త చేతిలో వంచనకు గురై, హింసకు గురై, చివరికి ప్రాణాలే కోల్పోయిన వేదనతో దెయ్యమై అక్కడే తిరుగాడుతోంది. ఇక్కడ గౌరవ్ రెండు విషయాలు చెబుతాడు. ఒకటి: అక్కడ దెయ్యం ఉంది కనుక ఆ స్థలం విడిచి పెట్టమని. లేదా ఆ దెయ్యాన్ని తాను పారదోలదలుచుకుంటే అందుకు సహకరించమని. గౌరవ్ ఎక్కువగా దెయ్యాలు ఆ ప్రదేశంలో కచ్చితంగా ఉన్నాయి అని నిరూపించడమే తన పనిగా పెట్టుకున్నాడు. దెయ్యాలతో చెలిమి... ‘దెయ్యం అన్న మాట వింటేనే అందరూ హడలిపోతారు. అవి తమను ఏదో చేస్తాయని భయపడతారు. కానీ అన్ని దెయ్యాలూ చెడ్డవి కావు. మంచివి కూడా ఉంటాయి’... అంటాడు గౌరవ్ తివారీ. ఎన్నో పారానార్మల్ యాక్టివిటీస్‌ని ఇన్వెస్టిగేట్ చేసిన అనుభవంతో అన్న మాట ఇది. నిజానికి ఒకప్పుడు దెయ్యం అన్న మాటనే నమ్మేవాడు కాదు గౌరవ్. కానీ టెక్సాస్‌లో పైలట్ ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు అతణ్ని మొదటిసారి దెయ్యం అన్న మాట వణికించింది. లేదా దెయ్యాన్ని చూసిన అనుభవం కలిగింది. ఆ రోజుల్లో నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి ఓ ఫ్లాట్‌లో ఉండేవాడు గౌరవ్. అక్కడ అతనికి విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి. ఏవో ఆకారాలు కన్పించేవి. ఏవేవో శబ్దాలు వినిపించేవి. నవ్వులు, అరుపులు, ఏడుపులు... ఒక్క క్షణం ప్రశాంతత ఉండేది కాదు. చివరికి ఆ ఫ్లాట్‌ను ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడే దెయ్యం అన్న దానిపై ఆసక్తి మొదలైంది గౌరవ్‌కి. పైలట్ కోర్సుతో పాటుగానే ‘పారానెక్సస్ అసోసియేషన్ ఆఫ్ ఫ్లారిడా’లో ‘పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ కోర్సు’ పూర్తి చేశాడు. రెండు లెసైన్సులూ పట్టుకుని ఇండియాకు వచ్చాడు. పారానార్మల్ సొసైటీని స్థాపించి దెయ్యాల వేట మొదలెట్టాడు. చూస్తూండగానే ఫేమస్ ఘోస్ట్ హంటర్ అయ్యాడు. దేశ విదేశాల్లో ఉన్న ఎన్నో దెయ్యాలను అతను వేటాడాడు. కానీ చివరికి అతనినే ఒకరు వేటాడారు. అతని ఉసురు తీశారు. కానీ అది మనిషా? దెయ్యమా? అదే ఇప్పుడు పెద్ద మిస్టరీ. ఎలా చనిపోయాడు... జూలై 7, 2016. ఢిల్లీలోని ద్వారక. ఉదయం పది గంటలు కావస్తోంది. గౌరవ్ తివారీ గది తలుపు మూసి ఉంది. కాఫీ తీసుకొచ్చిన భార్య సున్నితంగా తలుపు తోసింది. తెరచుకోలేదు. చిన్నగా తట్టింది. లోపలి నుంచి అలికిడి లేదు. దబదబా బాదింది. అయినా తెరవలేదు. తలుపు తెరవమంటూ అరిచింది. అతను పలకలేదు. దాంతో కంగారుపడి అత్తమావల్ని పిలిచింది. వాళ్లు కూడా ప్రయత్నించారు. కానీ ఫలితం లేదు. దాంతో బల వంతంగా తలుపు తెరిచారు. లోపలికి వెళ్లి చూస్తే అటాచ్డ్ బాత్రూమ్లో నేలమీద పడివున్నాడు గౌరవ్. ఉలుకూ పలుకూ లేదు. వెంటనే అతణ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఉపయోగం లేకపోయింది. అతని ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఆ క్షణం అతని జీవితం అంతమైపోయింది. కానీ ఓ కొత్త మిస్టరీకి తెర లేచింది. గౌరవ్ మెడ చుట్టూ తాడుతో బిగించినట్టుగా నల్లని గీత ఒకటుంది. అంటే అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అన్నారు పోలీసులు. ఊపిరాడకే చనిపోయాడని పోస్ట్‌మార్టం రిపోర్టు కూడా తేల్చడంతో అతనిది సూసైడ్ అని డిసైడైపోయారంతా. గౌరవ్ భార్య నోరు తెరవకపోయి ఉంటే అందరూ అదే నిజం అనుకునేవారు. కానీ ఆమె చెప్పింది విన్న తర్వాత కొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయి. ఇంతకీ ఆమె ఏం చెప్పింది? వెంటాడుతున్న ఆత్మ... ‘నా భర్త గౌరవ్‌ని ఓ ఆత్మ వెంటాడుతోంది’ అని చెప్పిందామె. ‘ఆ సంగతి నాతో తరచూ చెప్పేవాడు. అది తనను ఎప్పుడో ఒకప్పుడు తన అధీనంలోకి తీసేసుకుంటుందని గౌరవ్ భయపడ్డాడు. కొన్నాళ్లుగా ఆ విషయాన్ని తరచూ చెబుతున్నాడు కానీ పని ఒత్తిడిలో ఏదో అలా మాట్లాడుతున్నాడు అనుకుని పట్టించుకోలేదు’ అందామె. గౌరవ్ తండ్రి కూడా అది నిజమే కావచ్చు అంటున్నారు. గౌరవ్ అభిమానులు కూడా అలాగే జరిగిందేమో అని అనుమానపడుతున్నారు. అందరూ చెప్తున్నదాన్ని బట్టి ఆత్మహత్య చేసుకునేంత సమస్యలు, బాధలు గౌరవ్‌కి లేవు. పైగా అయిదు నెలల క్రితమే పెళ్లయ్యింది. మరి ఎందుకు ప్రాణం తీసుకుంటాడు? ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నా తాడుకి వేళ్లాడుతూ ఉండాలి. కానీ అతడు నేలమీద పడివున్నాడు. కనీసం అతడు ఉరి వేసుకున్న తాడు కూడా అక్కడ లేదు. అంటే గౌరవ్‌ని దెయ్యం చంపిందా? అది సాధ్యమేనా? దేవుడు, దెయ్యాలు లేవనే నాస్తికులు ఈ సంగతి విని నవ్వి ఊరుకున్నారు. కానీ దెయాల్ని నమ్మేవారు, వాటి ఉనికిని రుచి చూసినవాళ్లు మాత్రం భయంతో వణుకుతున్నారు. దెయ్యాల్ని వేటాడేవాడు ఆ దెయ్యాలకే బలైపోయాడా అంటూ వాపోతున్నారు. నిజమా? గౌరవ్‌ని దెయ్యాలే చంపేశాయా? ప్రస్తుతం అతను ఢిల్లీలోని జానకీపుర ప్రాంతంలో సంచరిస్తోన్న ఓ మహిళ ఆత్మ గురించి పరిశోధిస్తున్నాడని తెలిసింది. దానికీ అతని చావుకీ ఏదైనా సంబంధం ఉందా? గౌరవ్‌ని వెంటాడుతోంది ఆ ఆత్మేనా? ఆ ఆడదెయ్యమే అతణ్ని వేటా డిందా? అంటే పోలీసులు దెయ్యాన్ని అరెస్ట్ చేయాలా? దెయ్యాల్ని వేటాడేదెలా? అతీంద్రియ శక్తుల ఉనికిని పారానార్మల్ యాక్టివిటీ అంటారు. వాటిని కనిపెట్టేవాళ్లని పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్, ఘోస్ట్ బస్టర్స్, ఘోస్ట్ హంటర్స్ అంటారు. ఘోస్ట్ హంటింగ్ అన్న మాట మన దేశంలో తక్కువే వినిపిస్తుంది కానీ, విదేశాల్లో... ముఖ్యంగా అమెరికాలో ఇది చాలా ఎక్కువ. దెయ్యాలు ఉన్నాయి అని అనుమానం వచ్చిన ప్రదేశాల్లో పరిశోధనలు జరపడం, దెయ్యాల ఉనికిని కనిపెట్టడమే ఘోస్ట్ హంటింగ్. ఎలక్ట్రో మ్యాగ్నటిక్ రేడియేషన్ డిటెక్టర్ (దీన్ని ఈఎంఫ్ మీటర్ అని కూడా అంటారు), డిజిటల్ థర్మోమీటర్, డిజిటల్ వీడియో కెమెరాలు, డిజిటల్ ఆడియో రికార్డర్, కంప్యూటర్ తదితర పరికరాలను ఉపయోగించి శబ్దాలను, దృశ్యాలను రికార్డు చేస్తారు. తద్వారా అక్కడ దెయ్యం ఉందో లేదో కనిపెడతారు. కొందరు వాటిని వెళ్లగొడతారు కూడా. అమెరికాకు చెందిన ఎడ్, లారెన్ దంపతులను ప్రపంచంలోనే నంబర్‌వన్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అని చెబుతారు. వీరి పరిశోధనల ఆధారంగానే ఆనబెల్లె, కన్జ్యూరింగ్, పారానార్మల్ యాక్టివిటీ, పోల్టర్‌గైస్ట్ లాంటి సూపర్‌హిట్ సినిమాలు వచ్చాయి. మన దేశపు తొలి ప్రఖ్యాత ఘోస్ట్ హంటర్ కావడం వల్ల గౌరవ్ తివారీని ఎడ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తుంటారు. పదహారేళ్ల వయసులో నటుడిగా కెరీర్‌ను ప్రారంభించాడు గౌరవ్ తివారీ. టాంగో చార్లీ, 16 డిసెంబర్ చిత్రాల్లో నటించాడు. తర్వాత పైలట్ కోర్సు చేయడానికి అమెరికా వెళ్లిపోయాడు. గౌరవ్ కేవలం ఘోస్ట్ హంటరే కాదు... రెవరెండ్, స్పిరిచ్యువల్ కౌన్సెలర్, హిప్నటిస్ట్, లైఫ్ అండ్ రిలేషన్షిప్ కోచ్ కూడా. అయితే ఘోస్ట్ హంటర్‌గానే ఎక్కువ పాపులర్ అయ్యాడు. ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, సింగపూర్, యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ తదితర దేశాల్లో గౌరవ్ ఘోస్ట్ హంటింగ్స్ చేశాడు. గౌరవ్ హంటింగ్స్ ఆధారంగా పలు టీవీ షోలు రూపొందాయి. వాటిలో ‘ఎమ్‌టీవీ గాళ్స్ నైటవుట్’ ఒకటి. ఇది మన దేశంలో తొలి హారర్ రియాలిటీ షో. ఇది ఏషియన్ టెలివిజన్ అవార్డును గెల్చుకుంది. అలాగే హాంటెడ్ వీకెండ్స్ విత్ సన్నీ లియోన్, ఫియర్ ఫైల్స్, భూత్ ఆయా షోలు కూడా సక్సెస్ అయ్యాయి. వీటిలో కొన్నింటిలో గౌరవ్ కూడా కనిపించాడు. దెయ్యమై వచ్చింది! ఇరవై రోజుల శెలవు తర్వాత ఆఫీసులో అడుగు పెట్టింది సీమ (పేరు మార్చాం). ఆమెను అందరూ సంతోషంగా పలకరించారు. పరామర్శల తర్వాత పనిలో పడిపోయింది సీమ. సాయంత్రం ఇంటికి బయలుదేరేటప్పుడు ‘చాలా రోజులయ్యింది కదా... ఈరోజు నాతో నా రూమ్‌కి రావే’ అంది సీమ ఫ్రెండ్ కాజల్. ‘దానికేం... పద పోదాం’ అది సీమ. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కాజల్ రూమ్‌కి వెళ్లారు. సరదాగా గడిపారు. రాత్రి పది అవుతుండగా సీమ వెళ్లిపోయింది. కాజల్ పడక మీదకు చేరింది. మరుసటి రోజు ఉదయం ఆఫీసుకు బయల్దేరి ఆటో కోసం ఎదురుచూస్తోన్న కాజల్‌కు సీమ వాళ్ల అక్క కనిపించింది. సంతోషంగా వెళ్లి పలకరించింది. ముందు రోజు తాను, సీమ కలిసి గడిపినట్టు చెప్పింది. అది విని సీమ అక్క షాకైపోయింది. ‘సీమ యాక్సిడెంట్లో చనిపోయి పదిహేను రోజులవుతోంది. తను నీ దగ్గరకు రావడమేంటి’ అంది. అంతే... కాజల్ పై ప్రాణాలు పైనే పోయాయి. ఇది ఢిల్లీలో జరిగిన ఓ వాస్తవ ఘటన. గౌరవ్ డీల్ చేసిన కేసుల్లో ఇదొకటి. మరణించిన సీమ మళ్లీ ఎలా వచ్చిందో అర్థం కాక ఈ విషయాన్ని గౌరవ్ దృష్టికి తీసుకెళ్లారు. సీమ ఆత్మే అలా వచ్చిందని తేల్చాడు గౌరవ్. విచిత్రం ఏమిటంటే ఆ తర్వాత మళ్లీ ఆ ఆత్మ కనిపించలేదు. ఇంటి గొడవలే కారణమా? గౌరవ్ మృతి వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి. మొదట గౌరవ్ మృతదేహం బాత్రూమ్లో నేలమీద పడివుంది అన్నారు. తర్వాతేమో బట్టలు హ్యాంగ్ చేసుకునే రాడ్‌కి ఓ క్లాత్‌తో ఉరి వేసుకున్నాడు అన్నారు. వీటిలో ఏది నిజం, ఏది కాదు అన్నది ఓ పెద్ద సందేహం. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే అందుకు కారణం ఏముంటుంది అన్నది మరో పెద్ద సందేహం. పోలీసులు మాత్రం ఇంటి గొడవలే కారణమై ఉండొచ్చు అంటున్నారు. గౌరవ్ ప్రొఫెషన్ కారణంగా అతని ఇంట్లో గొడవలు జరుగుతున్నాయట. దెయ్యాలు, భూతాలు అంటూ తిరగడం, అర్ధరాత్రిళ్లు ఇంటికి రావడం, సంపాదన సరిగ్గా లేకపోవడం వంటి విషయాలపై అటు భార్య, ఇటు తండ్రి కూడా అతనిని తప్పు పట్టి నిందిస్తున్నట్లు పనివాళ్లు, కొందరు దగ్గరివాళ్ల ద్వారా తెలిసిందని పోలీసులు అంటున్నారు. మరి నిజం ఎప్పటికి నిర్ధారణ అవుతుందో! -
పట్టపగలే దెయ్యం ఊయల ఊగితే..
న్యూయార్క్: అమెరికాలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. కుటుంబంతో కలిసి టూర్ కి వెళ్లిన ఓ వ్యక్తి తమ పిల్లలను అక్కడి ఊయలలు ఊగనివ్వలేదు. కారణం ఏమిటో తెలుసా.. దెయ్యం. అవును ఆ ఊయలలో దెయ్యం ఊగుతోందంట. ఆ విషయం ఆ వ్యక్తి స్వయంగా తెలపడం కాకుండా ఆ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఇప్పటికే ఆ వీడియోను లక్షలమంది చూశారు. అమెరికాలోని రోడే ఐలాండ్ లో వార్విక్ అనే ప్రాంతంలో ఓ కుటుంబం సరదాగా గడిపేందుకు వెళ్లింది. అదే సమయంలో అదే కుటుంబంలోని ఓ మూడేళ్ల పాప బీచ్ ఒడ్డున ఉన్న ఊయల ఊగుతానని మారాం చేసింది. దీంతో ఆ కుటుంబం పాపను తీసుకునే ముందుకు రెండు అడుగులు వేయగా అనూహ్యంగా అందులో ఎవరు కూర్చోకుండానే ఆ ఊయల ఊగడం ప్రారంభించింది. దీంతో అవాక్కయిన ఆ పాప తండ్రి స్కాట్ పాపను వెళ్లనివ్వకుండా వీడియో తీయడం ప్రారంభించాడు. ఆ సమయానికి పెద్దగా గాలి ప్రభావం కూడా లేదని, ఊయలలో ఉన్న ఓ ఖాళీ కుర్చి ఎలా ఊగుతుందని ఆశ్చర్యపోయానని అతడు చెప్పాడు. పగలు కూడా దెయ్యాలు సంచరిస్తున్నాయా అనే గుండె ఆగినంత పనైందని అతడు తన అభిప్రాయం చెప్పాడు. -
నిర్మానుష్యం... టూరిస్టు నగరం!
ఇస్తాంబుల్ః చారిత్రక టర్కిష్ నగరం ఇస్తాంబుల్... ఇప్పుడో దెయ్యాల దీవిలా కనిపిస్తోంది. టూరిజానికి ఎంతో ప్రసిద్ధి చెంది, ఎప్పుడూ టూరిస్టులతో కళకళలాడే నగరం... ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయింది. షాపింగ్ చేసేందుకు సైతం టూరిస్టులు భయపడిపోతున్నారు. ఎప్పుడూ రష్ గా కనిపించే షాపులు... ఖాళీగా కనిపించడమే ఇస్తాంబుల్ అంటే జనం భయపడిపోతున్నారనేందుకు పెద్ద నిదర్శనం. పర్యాటక నగరం ఇస్తాంబుల్ విమానాశ్రయంలో గతవారం ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించడంతో ఇప్పుడా ప్రాంతంలో అడుగు పెట్టేందుకే జనం భయపడిపోతున్నారు. టర్కీలోని అతి పెద్ద నగరం, వందల ఏళ్ళుగా టూరిజానికి ప్రసిద్ధి చెందిన ఇస్తాంబుల్... ఇప్పుడు నిర్మానుష్యంగా కనిపిస్తోంది. కొనుగోలుదారులతో సందడిచేసే పర్యాటక నిలయం ఖాళీ వీధులతో దర్శనమిస్తోంది. గతవారం అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయంలో తుపాకులు, బాంబులతో మారణహోమానికి తెగబడి ఉగ్రమూకలు నలభై మందికి పైగా ప్రాణాలను పొట్టన పెట్టుకోవడం అందర్నీ భయభ్రాంతులకు గురిచేసింది. ప్రపంచంలో అత్యధిక జనాభా గల నగరాల్లో నాలుగో స్థానంలో ఉన్న ఇస్తాబుల్.. టర్కీలోని అతి పెద్దనగరమే కాక, సాంస్కృతిక, వాణిజ్యాలకు ప్రధాన కేంద్రం. యూరప్ ఆసియా ఖండాల మధ్య భాగంలో ఉన్న నగరంలోని పలు చారిత్రక ప్రాంతాలు ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా కూడ గుర్తించబడ్డాయి. చారిత్రక మాస్క్ లు, అద్భుతాలను తలపించే సందర్శనా స్థలాలు ఇస్తాంబుల్ నగరానికి తలమానికాలు. అటువంటి ప్రదేశం ఇప్పుడు ఉగ్రదాడుల భయోత్పాతానికి తలవంచాల్సి వస్తోంది. ఈ ఏడాది వరుసగా జరిగిన దాడులు స్థానిక ప్రజలనే కాక, టూరిస్టులనూ ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొనుగోలుదారులు లేక షాపులు వెలవెలబోతున్నాయి. టూరిస్ట్ జిల్లాగా పేరొందిన సుల్తానా మెట్ లోని రెస్టారెంట్లు, ఫైవ్ స్టార్ హోటళ్ళు సైతం పర్యాటకులు లేక అల్లాడుతున్నాయి. ఒకవేళ ఫైవ్ స్టార్ హోటళ్ళకు ఎవరైనా వచ్చినా.. అక్కడి పరిస్థితులే అదనుగా రూమ్స్ ధరలపై బేరాలాడుతున్నారు. ఇస్తాంబుల్ దాడుల ఘటన స్థానిక పరిస్థితులనేకాదు, తమ జీవితాలనూ తారు మారు చేసేసిందని ఓ టూరిస్ట్ గైడ్ చెప్పడం విశేషం. ఎన్నో ఏళ్ళుగా తాను అదే వృత్థిలో ఉన్నానని, ప్రసిద్ధ పర్యాటక నగరంలో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని చెప్తున్నాడు. దీనికి తోడు తొమ్మిది రోజుల అంతర్జాతీయ సెలవు ప్రకటించడం.. స్థానికులు సైతం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళడంతో ఇప్పుడదో దెయ్యాల దీవిలా కనిపిస్తోందంటున్నాడు. ఇస్తాంబుల్ లో జిహాదీల దాడి.. ఇప్పుడు టర్కీలోని టూరిస్ట్ ఇండస్త్రీనే తీవ్రంగా దెబ్బతీసిందని చెప్తున్నాడు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇక్కడి వ్యాపారులు సైతం విదేశాలకు తరలిపోతామంటున్నారని చెప్తున్నాడు. అయితే ఇటువంటి ఘటనలు ఇక్కడకు మాత్రమే పరిమితం కాదని, ఇలా ఏ దేశంలోనైనా జరగవచ్చని కొందరు టూరిస్టులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పౌరులంతా ఏకమై, ప్రభుత్వాల కృషితో ఉగ్రభూతాన్ని అణచివేస్తే తప్పించి ఈ పరిస్థితులు ఏ దేశానికైనా తప్పవని చెప్తున్నారు. -
ఈ ఫొటోలో దెయ్యం ఎక్కడుందో చెప్పండి!
దాదాపు 116 సంవత్సరాల క్రితం ఓ లెనిన్ మిల్లులో పనిచేసే అమ్మాయిల గ్రూపు దిగిన ఫోటో చూసిన ప్రతి ఒక్కరూ అందులో దెయ్యం ఉందని భయపడుతున్నారు. మొత్తం 15 మంది అమ్మాయిలు ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం ఆన్ లైన్ లో వైరల్ అయింది. ఈ ఫోటో లో దెయ్యం ఉంది. గుర్తించండి చూద్దాం..! అంటూ నెటీజన్లు అమ్మాయిల ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు. ఉత్తర ఐర్లాండ్ లోని బెల్ ఫాస్ట్ పట్టణంలో ఈస్టర్ పండుగ సందర్భంగా మిల్లులో పనిచేసే అమ్మాయిలంతా సరదాగా ఈ ఫోటో దిగారు. ఫోటోలో మొత్తం నాలుగు వరుసల్లో నిలుచున్నారు. రెండో వరుసలో కుడివైపు కూర్చున్న అమ్మాయి భుజం మీద ఎవరో చెయ్యి వేసినట్లు చిత్రంలో కనిపిస్తుడటంతో చూసిన వారంతా షాక్ గురవుతున్నారు. ఈ ఫోటోను క్షుణ్ణంగా పరిశీలించిన నిపుణులు ఎలాంటి మార్ఫింగ్ చేయలేదని చెప్తున్నారు. అమ్మాయి భుజం మీద చెయ్యి వేసి ఉన్నట్లు కనిపిస్తుండటం ఆప్టికల్ ఇల్యూజన్ గా భావిస్తున్నారు. కాగా, వెబ్ సైట్ లో ఈ ఫోటోను చూసిన ఓ అజ్ఞాత వ్యక్తి మాత్రం భుజం మీద చేయి వేసింది ఆమె అమ్మమ్మ అని కామెంట్ చేశాడు. ఇదే ఫోటో ఆ అమ్మాయి వాళ్ల ఇంట్లో ఇప్పటికీ ఉందని చెప్పాడు. -
బస్తీ మే దెయ్యం
చేత'న'బడి చీకట్లో ఏడుపులు వినిపిస్తున్నాయి. గుండెల మీద ఎవరో కూర్చున్నట్టుగా ఉంది! చనిపోయిన బాలమ్మ కళ్లను దానం చేశారు కాబట్టి... బాలమ్మ దెయ్యం ఇంటింటికీ... ‘తడుముకుంటూ’ తిరుగుతోందని బస్తీలో పుకార్లు! ఓర్నాయనో! ఎవరిని ఆవహిస్తుందో ఏమో! బస్తీ గజగజలాడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వివేకంగా ఉండాలి! దేనికి జాగ్రత్త? దేనికి వివేకం. చదవండి. రెండు సంఘటనలు. మూడు మరణాలు. ఆ బస్తీని అతలాకుతలం చేస్తున్నాయి. ఎవరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీం పట్నంలో ముదిరాజ్ బస్తీ. మూడు శ్మశానాల మధ్య ఉంది ఆ బస్తీ. అక్కడ నివసించేవారంతా శ్రామికులే. రవి బేల్దారి పని చేస్తుంటాడు. అర్ధరాత్రి నిద్రలో ఉలిక్కిపడి లేచాడు. లేస్తూనే ఇంట్లో వాళ్ల మీద విరుచుకు పడ్డాడు. ‘నేనెన్ని సార్లు మిమ్మల్ని గిచ్చి లేపినా ఒక్కరూ లేవరేం?’ అని అరిచాడు. ‘నువ్వెప్పుడు గిచ్చావయ్యా’ అంటే వినడు. ‘నా గుండెల మీద బ్రహ్మరాక్షసి కూర్చుంది. ఎంతకీ లేవలేదు. మిమ్మల్ని లేపుతుంటే ఒక్కరూ లేవలేదు’ అని రవి ఆరోపణ. అంతే... ఇంట్లో వాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెట్టడం మొదలైంది. ‘ఊరి వాళ్లంతా నెత్తీనోరూ కొట్టుకుని చెప్పినా వినకపోతిరి’ అని సణుగుతూ రవి తల్లి పక్కింటి వైపు తొంగి చూసింది. ఆ పెంకుటింటికి ఎప్పటిలాగే తాళం పెట్టి ఉంది. రవికి కూడా గుబులు మొదలైంది. రవి కళ్ల ముందు గతం మెదిలింది. అది సంతోష ఆత్మేనా?! ఆ పెంకుటిల్లు సంతోషది. ఆమె భర్తకు నల్గొండ జిల్లా చిట్యాలలో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం. వారి కాపురమూ అక్కడే. సంతోష గర్భవతైంది. అన్యోన్యంగా సాగుతున్న వారి దాంపత్య జీవితంలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ భార్యాభర్తల మధ్య కీచులాటలు ఎక్కువయ్యాయి. సంతోష ప్రాణాలు తీసుకుంది! చిట్యాలలో వారున్నది అద్దె ఇల్లు. ఆ ఇంటి నుంచి దహన సంస్కారాలు చేయడానికి ఇంటి యజమానులు ఒప్పుకోరు. సొంతూరికి వచ్చి సొంత వాళ్ల మధ్యన ఆ కర్మకాండలు నిర్వహించడమే మార్గం. అయితే ఇందుకు ఊరు ఒప్పుకోలేదు. రెండు ప్రాణాలు పోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. సహాయ నిరాకరణ చేసింది. దాయాదులైన రవి కుటుంబం ఒక్కటే ఆదుకుంది. పాడె మోయడం దగ్గర నుంచి అంతిమ సంస్కారం వరకు ఆ కుటుంబం వారే దగ్గరుండి పూర్తి చేశారు. అయితే రోజులు గడిచినా ఊరివాళ్లకు సంతోష మరణం మీద శంకలు తగ్గలేదు. సంతోష ఆత్మ అక్కడే, ఆ ఇంట్లోనే ఉంటుందని, పాడె మోసిన వారిని పీడిస్తుందని భయపెట్టసాగారు. జరిగినదంతా గుర్తొచ్చి రవికి ఒళ్లంతా చెమటలు పట్టాయి. సందేహం లేదు. సంతోష ఆత్మ తన గుండెల మీద కూర్చుని ప్రాణాలు తీయబోయింది అనే నిర్ధారణకు వచ్చేశాడు. ఈ సంగతి ఊరంతా పొక్కింది. అంతలోనే మరో సంఘటన. రెండో ఆత్మ... బాలమ్మ! అదే బస్తీలో ఉండే పోచమ్మ ఓ రోజు పొద్దున్నే కూతుర్ని పిలిచి అర్ధరాత్రి నట్టింట్లో ఏడుపు వినిపించిందని చెప్పింది. అది బాలమ్మ ఏడుపేనేమో అనుకున్నారు తల్లీకూతుళ్లు. అప్పటినుంచి ఆ ఇంట్లో అందరూ అస్థిమితంగానే నిద్రపోతున్నారు. ఊళ్లో దాదాపుగా అందరికీ ఏదో ఒక సమయంలో ఏడుపు వినిపిస్తోంది. ఇదంతా ఏదో అరిష్టానికి సంకేతం అని ఊరంతా నమ్మింది. గుబులుగా రోజులు గడుస్తున్నాయి. ఓ రోజు పోచమ్మ ఇంట్లో సందడి. కల్లు తాగి, తిళ్లు వండుకుని తిన్నారంతా. కొంతసేపటికి పోచమ్మ విచిత్రంగా ప్రవర్తిస్తోంది. టీవీ సీరియళ్లలో, సినిమాల్లో దెయ్యం పాత్రలో కనిపించే హావభావాలన్నీ ఆమె ముఖంలో పలుకుతున్నాయి. వాంతి వస్తోందని కొంతసేపు హడావుడి చేసింది. గర్భిణి సంతోష దెయ్యమై పట్టిందేమోనని వెన్నులో నుంచి చలి మొదలైంది పోచమ్మ కూతురికి. ‘అన్నం అరగలేదేమో, జీర్ణమవడానికి ఏ నిమ్మకాయ రసమో ఇవ్వు’ అనేసి నిద్రకు ఉపక్రమించాడు పోచమ్మ అల్లుడు. మరికొంత సేపటికి పోచమ్మ ఆకలంటూ కేకలు పెట్టింది. ‘కార్జం (కాలేయం), మాంసం పెట్టండి’ అంటోంది. పొంతనలేని మాటలతో ఇంట్లో వాళ్లు భీతిల్లిపోతున్నారు. ‘నువ్వెవరు’ అనగానే ‘మీకు తెల్వదా, నన్ను మర్చిపోయిన్రా... మీ పక్కింటి బాలమ్మను కదా’ అంటోంది పోచమ్మ. ఆ పక్కింట్లోనే బాలమ్మ కొడుకు, కోడలు, ఇద్దరు పిల్లలు నిద్రపోతున్నారు. ‘మీ ఇంటికి పోక, మా ఇంటికెందుకొచ్చావ్’ అన్నది పోచమ్మ కూతురు. ‘నా కొడుకు పూజ చేయించి నన్ను ఇంట్లోకి రానివ్వకుండా కట్టడి చేసిండు’ అని చెప్పింది బాలమ్మ ఉరఫ్ పోచమ్మ. అలా మాట్లాడుకుంటూ ఇంటి బయటికొచ్చింది. కళ్లు కనిపించనట్లు తడుముకుంటూ శ్మశానం వైపు వెళ్లి పోయింది. చూపు లేని దెయ్యం! బాలమ్మ చనిపోయిన తర్వాత ఆమె కళ్లను దానం చేశాడు కొడుకు. దాంతో బాలమ్మ దెయ్యమైన తర్వాత చూపు కోల్పోయిందని, దారి కనిపించక తడుముకుంటూ తిరుగుతోందనేది బస్తీలో వదంతులు లేచాయి. బాలమ్మ దెయ్యమై తిరుగుతోందని, అర్ధరాత్రి వినిపించే ఏడుపు కూడా బాలమ్మదేనని పుకారు పుట్టింది. దాంతో బస్తీలో చాలా మంది భయంతో విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. కొందరి ప్రవర్తన బాలమ్మను స్ఫురింప చేస్తుంటే, కొందరి ప్రవర్తన సంతోషను గుర్తు చేస్తోంది. కాలనీలో మహిళలందరి చీర కొంగులకు, చుడీదార్ చున్నీలకు మంత్రించిన నిమ్మకాయల మూటలు కనిపిస్తున్నాయి. ఊరంతటికీ కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత కాస్తంత సమాధానపడినట్లు కనిపిస్తున్నారు. కానీ వారిలో భయం పూర్తిగా పోలేదు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి అసలేం జరిగింది? గత డిసెంబర్లో వృద్ధురాలు బాలమ్మ తుదిశ్వాస విడిచింది. అది జరిగి రెండు నెలలు గడవక ముందే ఫిబ్రవరిలో తొమ్మిది నెలల నిండు గర్భిణి సంతోష ఆత్మహత్య చేసుకుంది. గర్భిణి కాబట్టి అది ఒక మరణం కాదు, రెండు మరణాల పెట్టు. అందుకే ఊరికి అరిష్టం పట్టిందని బస్తీవాసులు నమ్మారు. ఏడిచిందెవరు? కుక్కలు... మనిషి చెవులు వినలేని చాలా తక్కువ పౌనఃపున్యం ఉన్న శబ్దాన్ని కూడా గ్రహి స్తాయి. దానికి ప్రతిస్పందనగా తిరిగి అదే లయతో అరుస్తాయి. ఆ అరుపు మనిషి ఏడుపును తలపిస్తుంది. అర్ధరాత్రి నిశ్శబ్దంగా ఉండడంతో చాలా దూరం వినిపిస్తుంది. కల్లు, దెయ్యం కలిశాయి జెవివి సూచన మేరకు పోచమ్మను మరో కూతురు తనింటికి తీసుకెళ్లింది. అక్కడ ఆమెకు ఎటువంటి భ్రాంతులూ కలగడం లేదు. ఈ విచిత్ర ప్రవర్తనకు కారణం దెయ్యం భయం, దానికి తోడు కల్తీ కల్లు. ఆ కల్లు చిన్న మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. విచిత్రమైన భ్రాంతులకు లోను చేస్తుంది. రవి పరిస్థితి కూడా అలాంటిదే. ఊరంతా సంతోష దెయ్యమై పట్టుకుంటుందని భయపెట్టడం, కల్తీ కల్లు తాగడం కలిసి ఆరోగ్యం పాడైంది. గుండెలు పట్టేసినట్లు అనిపించడంతో దెయ్యం గుండెల మీద కూర్చున్నదని భయపడ్డాడు. దానికితోడు టీవీ సీరియళ్లు, సినిమాల ప్రభావంతో ఆయాపాత్రల హావభావాలను ఆటోమేటిక్‌గా అనుకరించడం అలవాటైపోయింది. - టి. రమేశ్, జనరల్ సెక్రటరీ,ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ -
అందమైన దెయ్యం!
దెయ్యం అందంగా ఉంటుందా? ఉంటుందట. అచ్చంగా అనుష్కా శర్మ అంత అందంగా ఉంటుందట. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా? మరేం లేదు... ఓ చిత్రంలో ఈ బ్యూటీ దెయ్యంలా నటించనున్నారు. మనిషి పాత్రలకన్నా దెయ్యం పాత్రలకు నటనకు స్కోప్ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అందుకే అనుష్కా శర్మ ఈ పాత్ర చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని తన హోమ్ బేనర్లోనే నిర్మించనున్నారు. ‘ఎన్‌హెచ్10’ ద్వారా ఆమె నిర్మాతగా మారిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. దాంతో రెట్టింపు ఉత్సాహంతో రెండో సినిమా మొదలుపెట్టనున్నారు. ఇటీవలే కథ ఫైనలైజ్ చేశారు. ఈ చిత్రానికి ‘ఫిలౌరి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కామెడీ, హారర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఆమె దెయ్యంగా భయపెడుతూ, నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. పంజాబీ పెళ్లి నేపథ్యంలో సాగే చిత్రం ఇది. దీనికి అన్షాయ్ లాలా అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించనున్నారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. -
ఆ ఊళ్లో దీపం కదిలి వెళ్తుంది..!
మిరుదొడ్డి (మెదక్) : రాత్రి వేళల్లో దయ్యం వచ్చి మంటలు రేపుతోందంటూ ఆ గ్రామంలో పుకారు షికారు చేసింది. ఇటీవల బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళే దయ్యమై తిరుగుతోందన్న వదంతి వారి కంటిపై కునుకు లేకుండా చేసింది. దయ్యం భయంతో ఆ గ్రామస్తులు జాగారం చేస్తున్నారన్న సమాచారం పోలీసులకు చేరింది. వారు రంగ ప్రవేశం చేసి.. అసలు విషయం తేల్చారు. మెదక్ జిల్లా మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామం ఈ ఘటనకు వేదికైంది. గ్రామ శివారులోని రుద్రాయ కుంట సమీపంలో మూడు రోజులుగా రాత్రి వేళ మంటలు మండుతున్నట్లు, దీపం కదిలి వెళ్తున్నట్లు కొందరు పుకార్లు పుట్టించారు. గ్రామానికి చెందిన ఓ మహిళ ఇటీవల బావిలో దూకి చనిపోయింది. ఆమె దయ్యమై తిరుగుతూ మంటలు రేపుతూ, దీపాలు వెలిగిస్తూ తిరుగుతోందని గ్రామస్తులు మూఢంగా నమ్మారు. దీంతో మూడు రోజులుగా రాత్రయిందంటే నిద్రపోవటం మానేశారు. భయంతో గుంపులు గుంపులుగా ఉంటూ కాలం గడుపుతున్నారు. అంతా ఒట్టిదే... ఈ విషయం తెలుసుకున్న మిరుదొడ్డి ఏఎస్ఐ సామయ్య ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు.దయ్యం లేదు గియ్యం లేదు ఎవరి ఇళ్లలో వారు ప్రశాంతంగా పడుకోవాలని గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారు వినలేదు. దీపం వెలుగులు మీరు కూడా చూడాల్సిందేనని పట్టుబట్టారు. ఇక చేసేది లేక పోలీసులు అర్థరాత్రి వరకు నిరీక్షించారు. కొద్ది సేపటికి గ్రామస్తులు చెప్పిన మాదిరిగానే కుంట సమీపంలో ఓ దీపం వెలుగు మిణుకు మిణుకు మంటూ వెళ్లటం కనిపించింది. దీంతో పోలీసులు కొందరు గ్రామస్తులను వెంట బెట్టుకుని వెలుతురు వస్తున్న చోటికి వెళ్లి పరిశీలించారు. అక్కడ చీకట్లో ఏమీ కనిపించకపోవడంతో వెనుదిరిగి పరిస్థితిని సమీక్షించారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగుపల్లి- మల్లుపల్లి రోడ్డులో రాత్రిపూట వెళ్లే వాహనాల లైటు వెలుతురుని చూసి దయ్యం పుకారు లేపారని గ్రామస్తులకు పోలీసులు నచ్చజెప్పారు. కొందరు గ్రామస్తులను తమ జీపులో ఎక్కించుకుని లింగుపల్లి-మల్లుపల్లి రోడ్డున తిప్పారు. ఆ వాహనం లైట్లు రెడ్, బ్లూ లైట్లు రంగుల్లో మిణుకు మిణుకు మంటూ వెలుగుతుండటంతో చూసిన గ్రామస్తుల అనుమానం పటాపంచలైంది. మూడు రోజులుగా వాహనాల లైట్లను చూసి దయ్యంగా భ్రమించి అనవసరంగా నిద్రాహారాలు మాని భయపడాల్సి వచ్చిందని గ్రామస్తులు ఒక్క సారిగా నవ్వుకున్నారు. దయ్యం వదంతులు ఒట్టివేనని తేలటంతో గ్రామస్తులు ధైర్యంగా ఇళ్లకు వెళ్లిపోయారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా చర్యలు తప్పవని ఏఎస్ఐ సామయ్య హెచ్చరించారు. దయ్యం పుకారు లేపి గ్రామంలో లేనిపోని సమస్యలు సృష్టించడం సరికాదన్నారు. మూఢనమ్మకాలను వదిలిపెట్టి అసలు నిజా నిజాలేమిటో గ్రహించాలని గ్రామస్తులకు హితవు పలికారు. -
మైండ్ గేమ్
చేతనబడి దెయ్యాన్ని దేనికోసమైనా వాడుకోవచ్చు. మంత్రగాళ్లు నాలుగు రాళ్లు వెనకేసుకోడానికీ... మామిడి కాయలు రాలకుండా ఉండడానికీ...మైండ్ గేమ్ ఆడుకోడానికీ, పాడుకోడానికీ... దెయ్యాన్ని వాడుకోవచ్చు. కానీ ‘మారాల’ ఊరి యువత.. దెయ్యం మాయలో పడలేదు. దారి కాశారు... మాటు వేశారు. అసలు దెయ్యం ఎవరో కనిపెట్టారు. అది అనంతపురం జిల్లా మారాల గ్రామం. ఊరికి దూరంగా ఉంటూ, ఊరితో సంబంధం ఉన్నట్లే ఉంటాయి తండాలు. బోడే నాయక్ తండా కూడా అలాంటిదే. తండాలో మంచిబావి, తండాకు ఆనుకుని తోటలు, అందరికీ చేతిలో పని ఉంటుంది. ఒక హ్యాబిటేషన్‌లో జనం ప్రశాంతంగా జీవించడానికి అనువైన వాతావరణమనే చెప్పాలి. ఏ ఉపద్రవాలూ లేకపోతే ఏదో ఒక ఉపద్రవాన్ని మనమే సృష్టించుకుంటాం. అది మనుషుల నైజం. పగలంతా పని చేసుకుని రాత్రి భోజనం చేసి మంచాల మీద పడుకున్న తర్వాత నిద్ర వచ్చే వరకు మాట్లాడుకోవడానికి ఓ టాపిక్ కావాలి. అది గాసిప్ అయినా ఫరవాలేదు. కిష్టప్ప భోజనం చేసి మంచం మీద పడుకున్నాడు. ఎండాకాలం ఉక్కపోత. ఎంతకీ నిద్రరావడం లేదు. ‘రే య్! నువ్వు ఇయ్యాల బాలమోళ్ల తోపులోకి పనికిపోయావంట’ అంటూ మరో మంచం మీదున్న తమ్ముడిని పలకరించాడు. ‘ఆ’ అంటూ అటు తిరిగి పడుకున్నాడు మారెప్ప. ‘ఇంకెప్పుడూ అటెల్లకు, రాత్రయితే అసలే ఎల్లకు. దెయ్యం తిరుగుతోందక్కడ’ అనేసి పక్కకు తిరిగి నిద్రకుపక్రమించాడు. నిద్రలోకి జారుకుంటున్న మారెప్ప దిగ్గున లేచి కూర్చున్నాడు. నిద్ర గాలికెగిరిపోయింది. పగలంతా ఆ తోపులోనే పనిచేసి వస్తిని... ఏమౌవుతుందో ఏమో! మంచం దిగాడు, తనతోపాటు ఆ రోజు తోపులోకి పనులకొచ్చిన వాళ్లను నిద్రలేపడానికి వెళ్లాడు. అంతా కలిసి బాలమోళ్ల తోపు కనిపించేటట్లు ఒక చోట మాటు వేశారు. ‘అదుగో వెళ్తోంది’ అంటూ చేయి చూపించారొకరు. జుట్ట ‘విరబోసుకుని ఉంది’ మరొకరు తాను గమనించిన విశేషణాన్ని తెలియచేశారు. ‘మీ అన్న చెప్పింది నిజమేరా!’ అంటూ వణికిపోయాడు అసలేమీ చూడని ఓ కుర్రాడు. ‘తోపులో దెయ్యం తిరుగుతోంది’ అని ఊరంతా పొక్కిపోయింది. దాదాపుగా అందరిలో లీలగా ఉన్న అనుమానం బలపడింది. ఆ తోటల వాళ్లకూ భయం పట్టుకుంది. ఎవరికీ చెప్పుకోకుండా ఎవరి తోటను వాళ్లు రాత్రిళ్లు కాపలా కాసుకోసాగారు. ఓ రోజు విరూపాక్షరెడ్డి దెయ్యం తన తోటలోకి పోవడాన్ని చూశాడు. మరో రోజు ఎల్లప్ప తోపులోకి వెళ్లడాన్ని కూడా చూశాడు. ఆ సంగతిని ఎన్నో రోజులు మనసులో దాచుకోలేక ఓ రోజు ఎల్లప్పతో చూచాయగా బయటపెట్టాడు. తానూ చూశానన్నాడు ఎల్లప్ప. తోటల యజమానులకు దెయ్యం పెద్ద సవాల్‌గానే అనిపించింది మొదట్లో. మెల్లగా ఆ దెయ్యం భయాన్ని పెంచి పోషించారు. ఆ పుకారుతో కాపును దొంగలబారి నుంచి కాపాడుకోవచ్చనేది వారి వ్యూహం. ప్రతి చర్యకూ ఓ ప్రతి చర్య ఉన్నట్లే... ప్రతి పనికీ ఎవరి లెక్కలు వారికుంటాయి. దెయ్యం తిరుగుతుందన్న భయంతో చీకటి పడితే తోటల పరిసరాల్లో మనుషులు మెదలడం లేదు. ఇక ఆ తండాలో రాత్రి ఎనిమిది అవుతుందో లేదో అన్ని ఇళ్ల తలుపులూ బిగించుకుంటున్నాయి. అప్పటి వరకు అర్ధరాత్రి తర్వాత కనిపించిన దెయ్యం, తొమ్మిదింటికే కనిపించసాగింది. తోటల్లో తిరిగే దెయ్యం ఆ తండా ఆచారి ఇంటి పరిసరాల నుంచి వస్తోందని, కాదు కాదు గుడిలో ఉంటోందని ఒకరు, ఊరి దిగుడు బావిలో నుంచి అర్ధరాత్రి బయటకొస్తోందని ఒకరు చెప్పసాగారు. తెల్లవారు జామున బావికెళ్లి నీళ్లు తెచ్చుకోవాలంటే భయం, తోటల్లో, పంట పొలాల్లోకి పనులకెళ్లాలంటే భయం, మిట్టమధ్యాహ్నం అయినా భయమే, కనుచూపు మేరలో మనిషి కనిపించకపోతే చాలు... దెయ్యం కనిపిస్తుందేమోనని భయం. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టాలంటే భయపడుతున్నారు తండా వాసులు.. ఇలాగైతే లాభం లేదు. ఊరు ఊరంతా ఏ పనీ చేయకుండా చేతులు ఒళ్లో పెట్టుకుని భయంతో వణికిపోతూ ఉంటే కడుపులోకి అన్నం వెళ్లేదెలాగంటూ తండా పెద్దలు కార్యరంగంలోకి దిగారు. ‘దెయ్యాన్ని తరిమేయాలి’ తీర్మానించారంతా. ఒక్కొక్కరు తమకు తెలిసిన మంత్రగాళ్ల పేర్లు చెప్పసాగారు. అరివీరభయంకర మంత్రగాడు, దెయ్యాలకు సింహస్వప్నం లాంటి మంత్రగాడనే పేరున్న ఓ మంత్రగాడిని పిలిపించారు. ఈ విషయంలో ఊరంతా ఐకమత్యంతో పని చేసింది. సామూహికంగా జాతర చేశారు. మేకపోతును బలి ఇచ్చి ఊరి చుట్టూ ధార పోశాడు మంత్రగాడు. ఆకాశంలోకి చూస్తూ ‘అష్టదిగ్బంధనం చేశాను. ఇక ఈ గీత దాటి ఊళ్లోకి రావడానికి వీల్లేద’ంటూ కళ్లు ఉరుముతూ దెయ్యాన్ని ఆజ్ఞాపించాడు. తనకు రావాల్సిన డబ్బు, వాయనాలందుకుని వెళ్లిపోయాడు. ఊరంతా హాయిగా నిద్రపోయింది. అదీ రెండు రోజులే. మూడో రోజు మళ్లీ జుట్టు విరబోసుకున్న దెయ్యం తోటల్లో తిరుగుతోంది. ఇంతకీ ఏం జరుగుతోంది? ఇది ఆ తండాలో అభ్యుదయకోణంలో ఆలోచించే యువకులకు వచ్చిన ప్రశ్న. ‘యంగ్ ఇండియా’ ప్రాజెక్టు చురుగ్గా పని చేస్తున్న యువకులు ఏకమయ్యారు. దెయ్యం మిస్టరీ చేధించాలనుకున్నారు. వారి ప్రణాళిక అమలు చేయడానికి వేదిక కావాలి. ఆ ఊరి మొత్తానికి ఒకటే మిద్దె ఇల్లు. ఆ ఇంటి వారిని ఒప్పించి యువకులంతా రాత్రి అక్కడే మకాం వేశారు. మధ్య రాత్రిలో భాస్కర్ చేతులు చరుస్తూ ‘అదిగో వెళ్తోంది’ అని ఒక్కసారిగా అరిచాడు. మిగిలిన వారంతా అప్రమత్తం అయ్యారు. ‘ఆచారి శేషయ్య ఇంట్లో నుంచి వచ్చి, దిగుడుబావి దగ్గరకు వెళ్తోంది’ అన్నాడు భాస్కర్. అంతా చూస్తూనే ఉన్నారు, కొంతసేపటికి బావిలో నుంచి బయటకొచ్చి చీనీ తోటలోకెళ్లింది దెయ్యం. ‘వెనుకే వెళ్లి చూద్దాం’ అన్నాడో యువకుడు. అనుసరించడానికి కొందరికి ధైర్యం చాలడం లేదు. ఈ మీమాంసలో దెయ్యం మాయమైంది. మిస్టరీ వీడింది! మరుసటి రోజు రాత్రి కూడా నిఘా వేశారు. మళ్లీ అదే ఇంటి నుంచి మొదలైంది. ఈ రెక్కీ నాలుగు రోజులు సాగింది. ఓ రోజు బావిలో నుంచి వచ్చి నేరుగా గుడిదారి పట్టింది. నిశ్శబ్దంగా అనుసరించారు యువకులంతా. గుళ్లో కెళ్లగానే యువకులంతా ఆశ్చర్యంగా నోరు తెరిచారు. ఆచారి ఇంటికి వెళ్లి చెప్పారు. ఆ సంగతి అతడికీ ఆశ్చర్యమే. బాధను తమాయించుకుని జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇచ్చాడు. ఊళ్లో అందరికీ చెప్పి అల్లరి చేయవద్దని బతిమలాడాడు. ఆ తర్వాత మారాల గ్రామం, బోడేనాయక్తండాలో ఎవరికీ దెయ్యం కనిపించలేదు. గుళ్లో ఏం కనిపించింది? ఆచారి శేషయ్యకు మానసిక పరిణతి లేని ఓ చెల్లెలు, పేరు నీలమ్మ. యువకులు అనుసరిస్తూ వెళ్లి చూసేటప్పటికి ఆమె గుళ్లో తులసికోట ముందు కూర్చుని ఉంది. దగ్గరకు వెళ్లి ‘నీలమ్మా!’ అని పిలవగానే ఉలిక్కిపడింది. భయంతో బిగుసుకుపోయింది. ఆమెకు ఇంటికి వెళ్దాం అని నచ్చచెప్పి ఇంటికి తీసుకెళ్లి అన్నావదినలకు అప్పగించారు యువకులు. ఆకలి తీరకనే! నీలమ్మను ఇంట్లో ఎవరూ పట్టించుకునే వారుకాదు. ఆమె ఆలయానికెళ్లి పూజారులు పళ్లేలలో పెట్టిన బెల్లం పొంగలి, కొబ్బరి, అరటి పండ్లు తిని ఆకలి తీరాక ఇల్లు చేరేది. గుళ్లో ప్రసాదాలు దొరక్కపోతే తోటల్లోకెళ్లి కాయలు కోసుకుని తినేది. మధ్యలో ఎక్కడ ఫిట్స్ వస్తే అక్కడే పడిపోయేది. తెలివి వచ్చాక ఇంటికెళ్లేది. మేమంతా మిద్దె ఇంటి మీద ఒక్కొక్కరు రెండు గంటలు నిద్రమేల్కొని కాపలా కాసి మిస్టరీ ఛేదించాం. - ఎస్. శంకర శివరావు కన్వీనర్, జెవివి నేషనల్ మేజిక్ కమిటీ - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
మమ్మీ! దెయ్యం?
చేతనబడి అమ్మ రారమ్మంటే పిల్లలు పరుగెత్తుకు వస్తారు లకలక... అంటే దూరంగా పరుగెత్తుకుపోతారు త్రివేణి ‘లకలక’మన్నప్పుడు పిల్లలు పారిపోయారు ‘మామూలయ్యాను’ రారమ్మంటోందిప్పుడు ‘నిజమేనా’ అన్నట్లున్నాయి వారి చూపులు ఆ చూపులకు సమాధానం ఎవరు చెప్తారు? ‘అమ్మా! నువ్వు బాగయ్యావా!’ భయంభయంగా చూస్తూ అడిగాడు పదేళ్ల వినోద్. ఆ ప్రశ్నతో త్రివేణి ముఖం పాలిపోయింది. దగ్గరకు రమ్మన్నట్లు చేతులు చాచింది. వసంత్ కళ్లలో ఆందోళన. ఒక్క ఉదుటున అమ్మ దగ్గరకు వెళ్లబోతున్న తమ్ముడిని ఆపాడు. వెళ్లొద్దన్నట్లు కళ్లతోనే సైగ చేశాడు. అంతే... త్రివేణి కళ్లు జలపాతాలయ్యాయి. తానే లేచి వెళ్లి కొడుకులిద్దరినీ కౌగలించుకుని బావురుమన్నది. పిల్లలు త్రివేణి దగ్గరకు రావడానికి భయపడుతున్నారు. పగలు ఈ మాత్రమైనా వస్తున్నారు. రాత్రి అమ్మ దగ్గర పడుకోవడానికి భయపడుతున్నారు. ఎప్పుడూ అమ్మపక్కన నేనంటే నేనంటూ వచ్చే పిల్లలు... అమ్మ మీద చేయి వేసుకుని నిశ్చింతగా నిద్రపోయే పిల్లలు... ఇప్పుడు దగ్గరకు రావడానికే భయపడుతున్నారు. తనకేమైంది? త్రివేణికి గతం కళ్ల ముందు మెదిలింది. గడచిన ఏడాది జూలై నెల. ఆరుద్రకార్తె రెండవ మంగళవారం. అనంతపురంలో శీతలయాడి జాతర జరుగుతోంది. బంజారాలకు అది పెద్ద వేడుక. తల మీద బోనాలతో రెండు వందల కుటుంబాలు జాతరలో పాల్గొన్నాయి. బ్యాండ్ మేళం ఊపందుకుంటోంది. త్రివేణి దేహంలో ప్రకంపనలు... బ్యాండు మేళం శబ్దానికి అనుగుణంగా కాళ్లుచేతులు కదలసాగాయి. ఆ తరవాత ఏం జరిగిందో ఆమెకు తెలియదు. మరుసటి రోజు పరామర్శించడానికి వచ్చిన బంధువు ‘‘నువ్వు ఎప్పుడూ డాన్స్ చేయలేదు, నేర్చుకోలేదు కూడా. అయినా బీట్‌కి అనుగుణంగా అడుగులు భలే వేశావు. అయితే అంతలోనే పూనకం వచ్చినట్లు ఊగిపోయావు, దేవత పూనిందా’’ అత్యుత్సాహంతో అడిగిందామె. ఆ ప్రశ్నతోపాటు ఆమె మనసులో మాత్రం ‘దేవత పూనిందా, దెయ్యం పట్టిందా’ అనుకున్నది. అనుమానాన్ని బయటపడనివ్వకుండా ‘హారతి పట్టిన తరవాత మామూలయ్యావు’ అని కూడా చెప్పింది. ‘తనకేమయింది’ మొదటిసారిగా ఓ ప్రశ్న ఆమె మెదడులో. అప్పటి నుంచి వరుసగా వందలసార్లు అదే ప్రశ్న. తనను తాను ప్రశ్నించుకుంటోంది. మధ్యాహ్నం మూడు గంటలు... ఇంట్లో త్రివేణి ఒక్కటే ఉంది. భర్త ఉద్యోగానికి, పిల్లలు స్కూల్‌కీ వెళ్లారు. ఇంట్లో ఏ వైపు నుంచి వస్తోందో కానీ, మల్లెపూల వాసన గుభాళిస్తోంది. ఇల్లంతా మల్లెలతో అందంగా అలంకరించినట్లుంది. ‘మల్లెలు ఎక్కడి నుంచి వచ్చాయి, నేనెప్పుడు అలంకరించాను’ అనే సందేహం తలలో గిర్రున తిరిగే లోపే కళ్లు వలయాకారంగా తిరిగిపోతున్నాయి. ‘లకలకలక’ అంటూ చంద్రముఖి సినిమాలో జ్యోతిక కళ్లు తిప్పినంత వేగంగా తిప్పుతోంది. స్కూలు నుంచి వచ్చిన పిల్లలు తల్లిని అలా చూడగానే భయభ్రాంతులయ్యారు. కొంతసేపటికి ఆమె మామూలయ్యింది. కానీ ఒంట్లో శక్తి అంతా ఎవరో తోడేసినట్లు మంచం మీద వాలిపోయింది. నాలుగైదు గంటలపాటు అచేతనంగా అలా పడి ఉంది. తండ్రి ఇంటికి వచ్చేవరకు భయంతో బిక్కచచ్చిపోయారు పిల్లలు. మెలకువ వచ్చిన తర్వాత త్రివేణికి ఇంటి వాతావరణంలో మార్పు కనిపించింది. మళ్లీ అదే ప్రశ్న... తనకేమైంది? ఇదిలా ఉంటే త్రివేణికి దేవత పూనుతోందని తెలిసిన వాళ్లు ఇంటికి వస్తున్నారు. పూలుపండ్లు తెచ్చి పెట్టి పాదాలకు నమస్కరించి వాళ్ల సందేహాలు అడుగుతున్నారు. అలా ఎవరైనా రాగానే త్రివేణి దేవత పూనినట్లు మారిపోతోంది. మొదట్లో వారానికోసారి పూనిన దేవత, ఇప్పుడు రెండు గంటలకోసారి కనిపిస్తోంది. పూనకం వదిలిన తరవాత ‘బిడ్డలను దగ్గరకు తీసుకోలేని దైవత్వం నాకెందుకు’ అని త్రివేణి కుంగిపోతోంది. ఓ రోజు త్రివేణి ఇంటి ఎదురుగా ఓ మాంత్రికుడు వచ్చి నిలబడ్డాడు. ఎంతకీ కదలడం లేదు. ‘మీ ఇంట్లో ఉన్నది దేవత కాదు, దెయ్యమూ కాదు, శని.’ అంటూ తొలిదెబ్బ వేశాడు. దెయ్యమా, దేవతా అనే సందిగ్ధంలో ఉన్న సంగతి ఈయనకెలా తెలిసింది అనే సందేహంతోపాటు ఆ మాంత్రికుడి మీద నమ్మకం కలుగుతోంది భరత్‌కి. ‘అష్టదిగ్బంధనం చేసి శనిని కట్టి పడేస్తాను’ అంటూ నవధాన్యాలు, నవరత్నాలు, తొమ్మిది కొబ్బరికాయలు, తొమ్మిది రాగిరేకులు, నిమ్మకాయలు తెప్పించాడు. ఇంటి ఆవరణలో నాలుగు మూలలు, నాలుగు దిక్కులతోపాటు ఇంటి మధ్యలో గుంత తీసి వాటిని పూడ్చాడు. భరత్‌కు దాదాపుగా యాభై వేల రూపాయలు ఖర్చయ్యాయి. త్రివేణి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించసాగింది. తనకేదో అయిపోతోందన్న ఆందోళన ఆమెను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. ఓ రోజు అర్ధరాత్రి నరాలు బిగుసుకు పోతున్నాయి. చాలా సార్లు జనవిజ్ఞానవేదిక వాళ్లు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. తండ్రి తన అత్తింటి వారిని బతిమాలుతున్న సంగతీ గుర్తొచ్చింది. భయంతో తండ్రికి ఫోన్ చేసింది. చచ్చిపోతానేమోనని భోరున ఏడ్చింది. ఇది జరిగిన నెల తర్వాత... చిన్న వాడు ‘అమ్మా నువ్వు బాగయ్యావా’ అని అడిగాడు. మందుల పెట్టె తీసి చూపిస్తూ ‘ఈ మందులన్నీ వేసుకుంటున్నాగా, బాగయిపోయాను. బాగయిపోయానని డాక్టర్ కూడా చెప్పారు’ అని పిల్లలకు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తోంది త్రివేణి. ‘ఇంకెప్పుడూ లకలక అనవుగా’ అనుమానంగా అడిగాడు వినోద్. ‘ఇంకెప్పుడూ అనను, కావాలంటే అన్నను అడుగు’ అంటూ పెద్దకొడుకు వసంత్‌ను చూసింది. పెద్దవాడివి కదా, నువ్వయినా అర్థం చేసుకోమనే అర్థింపు ఆమె కళ్లలో. అమ్మకు తగ్గిందోలేదో తెలియకపోయినా అమ్మ కళ్లలో అర్థింపు అర్థమైంది వసంత్‌కి. ‘అమ్మ ఇప్పుడు బాగుంది. భయపడొద్దు’ అని తమ్ముడికి ధైర్యం చెప్పాడు వసంత్. నరాల బలహీనత ఆమెలో మానసిక స్థిరత్వలోపానికి కారణమైంది. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ వల్ల ఆమె మరో పాత్రను ఆవహింపచేసుకోసాగింది. పూనకం వచ్చినట్లయి మరో పాత్రలోకి ప్రవేశించడం, కొంతసేపటికి మామూలవడం, వాతావరణ పరిస్థితులను బట్టి కొత్త పాత్రను ఆవహింపచేసుకోవడం ఇందులో ఉంటుంది. తండ్రి వచ్చి సైకియాట్రిస్ట్‌కు చూపించి మందులు వాడిన తర్వాత రెండు వారాల్లో త్రివేణి పూర్తిగా మామూలైంది. అయితే పిల్లలకు నమ్మకం కుదిరే వరకు ఆమె తల్లి మనసు వేదన తీరదు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి దెయ్యం అన్నారు... దేవత అని కొలిచారు! ఊరి చెరువు కట్ట కింద శ్మశానంలో ఓ మాంత్రికుడు ముగ్గుపోసి మధ్యలో పిండిబొమ్మ పెట్టి కోడిరక్తంతో తర్పణం చేశాడు. చేతబడి పోయిందని ఐదువేల రూపాయలు పట్టుకెళ్లాడు. కానీ త్రివేణిలో మార్పు రాలేదు. ఆంజనేయస్వామికి మొక్కితే దెయ్యాలు పోతాయని ఎవరో చెప్పారు. అది మరో మలుపు అవుతుందని ఆమె ఊహించనే లేదు. ‘ఈ అమ్మాయికి దెయ్యం పట్టలేదు, చేతబడి జరగలేదు. దేవత పూనుతోంద’ని చెప్పాడు పూజారి. ‘దేవత మొదటగా కనిపించింది శీతలయాడి జాతరరోజు. అక్కమ్మగార్లు పూనుతున్నారు’ అని తేల్చేశారు. ‘దేవత పునుతోందా... అయితే నేనేం చేయాలి’ త్రివేణిలో ఆందోళన. ఓ రోజు ఉదయం పూజ పూర్తయ్యేలోపు త్రివేణిలో మార్పు వచ్చేసింది... త్రివేణిని అలా చూస్తూనే ఆమె కాళ్ల మీద పడిపోయాడు భర్త భరత్. ‘నువ్వెవరమ్మా’ అనగానే ‘‘శీతలాదేవిని, అక్కమ్మ దేవతను నేనే. ఈ అమ్మాయి శుచిశుభ్రతతో చక్కగా ఉంది. నేనిక ఈ ఇంట్లోనే ఈమె ఒంట్లోనే ఉంటాను. నువ్వు తాకడానికి వీల్లేదు’’ అంది. భరత్‌కు జీవితం అగమ్యగోచరంగా ఉంది. ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదు. ఎవరితోనూ చెప్పుకోకుండా ఉండలేని స్థితి. చేతికి రాగి కడియం వేస్తే దేవత రాదని చెప్పారెవరో. అదీ చేశారు. అయినా మార్పు రాలేదు. -
మద్యం మత్తులో భర్తను రేపిస్టుగా భావించి..!
మాస్కో: మద్యం మత్తులో భర్తను దెయ్యంగా భావించిన ఓ మహిళ మూడో అంతస్తు నుంచి దూకేసింది. దెయ్యం తనను రేప్ చేసి చంపేస్తుందేమోనన్న భయంతో ఈ చర్యకు పాల్పడింది. రష్యాలోని తులున్ పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. మద్యాన్ని సేవించిన ఆ మహిళకు తన గది తలుపును కొడుతున్న చప్పుడు వినిపించడంతో భయపడింది. తలుపు వెనుక ఉన్నది దెయ్యం అయి ఉంటుందని, అది తనను అత్యాచారం చేసి.. చంపడానికి వచ్చిందని ఆమె భయపడింది. అంతే ఆ దెయ్యం నుంచి తప్పించుకునేందుకు మూడో అంతస్తు కిటికీ నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలో కిటికీ నుంచి ఆమె జారి మంచులో పడిపోయింది. స్థానిక టీవీ కంపెనీ ప్రతినిధులు ఆమెను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన ఆమెకు వైద్యులు చికిత్స అందించారు. అసలు ఏమైందని ఆమెను వైద్యులు ఆరా తీయగా.. తలుపు బయట ఉన్న వ్యక్తి దెయ్యం అయి ఉంటుందని, అది తనపై దాడి చేసేందుకే వచ్చాడని తనకు అనిపించిందని, అందుకే తాను కిటికీ నుంచి దూకేశానని ఆమె తెలిపింది. 'వారం రోజులుగా నిరాటంకంగా మద్యాన్ని తాగుతుండటంతో ఆమెలో మానసిక సమస్య తలెత్తింది. అందుకే తాగిన మత్తులో కిటికీ నుంచి దూకేసింది. నిజానికి ఆ సమయంలో ఆమె భర్త ఆఫీసు నుంచి మధ్యాహ్నం భోజనం చేయడానికి వచ్చాడు. అతడిని ఆమె దెయ్యంగా భావించింది' అని పోలీసు అధికార ప్రతినిధి ఇగర్ మార్దాటినెంకో తెలిపారు. -
గడుసు దెయ్యం
చేతనబడి సాధారణంగా... దెయ్యం మనిషిని పట్టుకుంటుంది. మరి, మనిషే దెయ్యాన్ని పట్టుకుంటే? అక్కడో కథ ఉంటుంది. వ్యథ ఉంటుంది. దెయ్యాలు ఉన్నాయా? లేవా? అన్నది వేరే టాపిక్. ఈ కథలోని అమ్మాయి దెయ్యాన్ని పట్టుకుంది. పట్టుకుని ఏం చేసింది? ఏం సాధించింది? చదవండి. మాఘమాసం. ‘ఇదిగో.. వెళ్లిపోతున్నా’నన్న సంకేతాలిస్తూనే మధ్యరాత్రి రగ్గు వెతుక్కునేటట్లు చేస్తోంది చలి. పగలవగానే సూర్యుడూ బద్దకంగానే ఒళ్లు విరుచుకుంటున్నాడు. ఉండీలేనట్లున్న చలి; లేనట్లు, ఉన్నట్లున్న గోరువెచ్చని ఎండ. పెళ్లి పనులు చేసుకోవడానికి, పెళ్లికి హాజరయ్యే వారికి హాయైన వాతావరణం ఇది. ఉదయం పది గంటలు. కల్యాణిని పెళ్లి కూతురిగా అలంకరిస్తున్నారు. ఇంటి ముందు పెళ్లిపందిరి. బంధువులు ఒక్కొక్కరే వస్తున్నారు. పట్టుచీర కట్టుకున్న వధువు మండపంలోకి అడుగుపెట్టింది. కొబ్బరికాయను పూజారి చేతిలో పెట్టి పీటల మీద కూర్చుంది. పూజారి ఇచ్చిన అక్షతలను గౌరీదేవి మీద వేయకుండా పూజారి ముఖం మీదకు చల్లింది! పూజారి ఖంగుతిన్నాడు. అంతలోనే సర్దుకుని ‘గౌరీదేవికి పూజ చేయమ్మా’ అన్నాడు అనునయంగా. అమ్మాయి కళ్లెర్రబడ్డాయి. బాడీ లాంగ్వేజ్ మారింది. ‘ఎందుకు గౌరీ పూజ, ఎవరికి పెళ్లి చేస్తున్నావ్’ అంటూ పూజ సామగ్రిని చిందరవందర చేస్తోంది. వేదిక కింద కూర్చున్న వాళ్లకు పరిస్థితి అర్థంకావడం లేదు. ‘పెళ్లి కూతురికి దెయ్యం పట్టినట్లుంది’... గుసగుసలాడుతున్నారు వేదిక మీదున్న మహిళలు. ‘ఆ...’ అంటూ కంగారుపడ్డారు పెళ్లికొడుకు బంధువులు. వెంటనే వేదిక దిగి ఓ పక్కగా గుమిగూడి... ‘పెళ్లిచూపులప్పుడు బాగానే ఉందా, అప్పుడెవరెవరెళ్లారు, వాళ్లింట్లో ఇంకెవరికైనా గాలి పట్టిందా...’ ఒక్కొక్కరు ఒక్కోరకంగా ఆరా తీస్తున్నారు. ఈ మాటలన్నీ పెళ్లికూతురి బంధువుల చెవిన కూడా పడుతున్నాయి. ‘లక్షణంగా చదువుకుంటున్న పిల్ల. ఎప్పుడూ ఇలాంటిది లేదు. శుభమా అని పెళ్లి జరుగుతుంటే ఇప్పుడు దెయ్యం పట్టడమేంటి?’ ఆందోళన మొదలవుతోంది వారి గుండెల్లో. అబ్బాయి వాళ్లు ఏమనుకుంటారో ఏమో... పెళ్లి ఆగకుండా మూడుముళ్లు పడితే చాలు’ ఆని మనసులోనే దేవుళ్లకు మొక్కుకుంటోంది అమ్మాయి తల్లి రాణెమ్మ. తండ్రి ‘బాణు’ ముఖం ఎర్రగా కందగడ్డలా ఉంది. అమ్మాయి మేనమామలు చొరవ తీసుకుని పెళ్లికొడుకు అన్నావదినలకు నచ్చచెబుతున్నారు. ఎలా స్పందించాలో తెలియని అయోమయం వారిది! నీ కోరికలు చెప్పమ్మా! దెయ్యం... కోరిన కోరికలు తీరిస్తే వదులుతుందని నమ్మకం. ఇద్దరు మహిళలు ధైర్యం చేసి ‘నీకేం కావాలమ్మా’ అనగానే... రకరకాలుగా నోరంతా తెరిచి విచిత్రంగా అభినయిస్తూ ‘మాంసం, చేపలు, కోళ్లు...’ జాబితా చదువుతోంది. ‘అమ్మో! ఇది రాకాసి దెయ్యమే...’ నిర్ధారణకు వచ్చేశారు పెళ్లికొడుకు బంధువులు. మంచి దెయ్యమైతే పూలు, చీరలు, ఆకు, వక్క, తాంబూలం వంటివి అడుగుతుందని, అవి పెద్దగా హానికరం కాదని, మాంసం అడిగిన దెయ్యాలు భయంకరమైనవని, అవి ప్రాణాన్ని బలి తీసుకునే వరకు వదలవని నమ్ముతారు. పెళ్లి కూతురు మాంసం అడగడంతో ... ‘అసలే పెద్ద దిక్కు లేని కుటుంబం మాది. అమ్మానాన్నలు లేని వాడిని అన్నావదినలు పట్టించుకోకుండా వదిలేశారంటారని బాధ్యతగా పెళ్లి చేస్తున్నాం. ఈ దెయ్యాన్ని ఇంటికి తీసుకెళ్తే మాలో ఎవర్ని మింగుతుందో ఏమో’ అని మనసులో ఉన్న భయాన్ని కక్కేసింది పెళ్లికొడుకు వదిన. అంతే... అబ్బాయి వాళ్లంతా ఒక్కొక్కరుగా మాయమయ్యారు. గతం మెదిలింది! ఇంతలో అమ్మాయి పీటల మీద నుంచి లేచి నిలబడింది. తండ్రిని ‘ఏరా’ అని సంబోధిస్తోంది. బాణు పరుగెత్తుకుంటూ వెళ్లి కూతురి ఎదురుగా నిలబడ్డాడు. కూతురి మాటల్ని బట్టి ఆమెను పూనింది తన తండ్రని భావించాడతడు. ‘పిల్లకు ఇష్టం లేని పెళ్లి చేస్తావురా, నేన్నీకు అట్లనే చేసిన్నా’ అంటూ రంకెలు వేస్తోంది. నిలువునా కూలబడిపోయాడతడు. బంధువులు ధైర్యం చెబుతున్నారు. ఆడవాళ్లు పెళ్లికూతురిని శాంత పరుస్తున్నారు. బంధువుల్లో ఓ పెద్దాయన చొరవగా బాణుతో ఓ మాటన్నాడు. ఆ మాటతో బాణు కళ్ల ముందు ‘నాగు’ మెదిలాడు. అతడి కొడుకులు సునంద్, ప్రమోద్లకైతే గతంలో.. కల్యాణి జోలికి రావద్దని నాగును మందలించిన సంఘటన కూడా కళ్ల ముందు మెదిలింది. సందేహంగా తండ్రి వైపు చూశారు. ‘మేము మాట్లాడతాం’ అంటూ మరికొందరు ఆత్మీయులు ముందుకొచ్చారు. నాగు కూడా ఆ పెళ్లికి వచ్చాడు! అయితే పెళ్లి ఆగిపోయింది. ఇంకా అక్కడే ఉంటే ఏం బావుంటుందని వెళ్లడానికి సమాయత్తమవుతున్నారు నాగు, అతడి అన్నలు. ‘కల్యాణిని పెళ్లి చేసుకుంటావా’ అని నాగును అడగ్గానే... ‘నాకిస్తారా’ అంటూ బదులు ప్రశ్నించాడు నాగు. ‘మేమిప్పుడే వస్తా’మని వధువు గదిలోకి వెళ్లారు పెద్దలు. ‘నాగును పెళ్లి చేసుకోవడానికే ఇదంతా’ అనేసిందా అమ్మాయి. ఆ ఒక్క సందర్భం మినహా అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఆ అమ్మాయికి దెయ్యం పట్టనేలేదు. పెద్దవాళ్లకు పెద్ద మనసుండాలి పెద్దవాళ్లు... పెద్దవాళ్లమనే మొండితనంతో ఇష్టంలేని పెళ్లిని పీటల వరకు తీసుకురాకపోయి ఉంటే ఆ అమ్మాయికి అసలు దెయ్యమే పట్టేది కాదు. ఒక మూర్ఖత్వం నుంచి తప్పించుకోవడానికి ఈ మూఢత్వాన్ని ఒంటబట్టించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పుకోవడానికి సరదాగానే ఉంటుంది. కానీ అప్పటి వరకు ఒక అమ్మాయి పడిన ఆవేదనను వివరించడానికి మాటలు చాలవు. కల్యాణి ధైర్యం ఉన్న అమ్మాయి. దెయ్యం డ్రామాతో కథను సుఖాంతం చేసుకుంది. కానీ చాలా మంది అమ్మాయిలు ఇష్టం లేని పెళ్లి చేసుకుని మౌనంగా రోదిస్తూ జీవిస్తుంటారు. మరికొంత మంది జీవితాన్ని అంతం చేసుకుంటారు. అందుకే... తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోవాలి. వాళ్లను ప్రేమించినంతగా వాళ్ల ఇష్టాల్నీ ప్రేమించగలగాలి. పిల్లల ప్రేమలో ఆకర్షణ తప్ప జీవితానికి బంధం ఏర్పడే భరోసా లేదనిపించినప్పుడు ఆ విషయాన్ని వారితోనే మాట్లాడాలి. వారిని మాట్లాడనివ్వాలి. పిల్లల్ని కన్విన్స్ చేయాలి. తల్లిదండ్రులు ఏది చెప్పినా పిల్లల పట్ల ప్రేమతోనే చెబుతారనే నమ్మకం పిల్లల్లో కలిగించాలి. పిల్లల ఎంపిక బావుందనే భరోసా కలిగితే పెద్దలూ ఒప్పుకోవాలి. అలాగే పేరెంట్స్ చెప్పిన విషయాన్ని ఓ క్షణం పాటు వాళ్ల స్థానంలో నిలబడి ఆలోచిద్దాం అని పిల్లలూ అనుకోవాలి. వాళ్లనుకోకపోతే తల్లిదండ్రులే ‘మా స్థానంలో నిలబడి ఆలోచించ’మని ఓ రిక్వెస్ట్ చేస్తే పోయేదేమీ ఉండదు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి గమనిక: వ్యక్తుల పేర్లు మార్చాం. నాగు ఎవరు? అనంతపురం జిల్లా, ముదిగుబ్బ గ్రామంలో బాణు పొలాన్ని కౌలు చేసేవాళ్లు నాగు అన్నలు. ఆ కుటుంబంతోదూరపు బంధుత్వం కూడా ఉంది. ముగ్గురన్నలు కష్టపడుతూ చిన్నవాడిని చదివించారు. అనంతపురం కాలేజీలో నాగు డిగ్రీ చదివేటప్పుడు కల్యాణి ఇంటర్ చదివేది. ఒక ఊరి వాళ్లు, తెలిసిన వాళ్లు కావడంతో కలిసి ప్రయాణించేవారు. సాన్నిహిత్యం పెరుగుతుందేమోనని సందేహ పడిన కల్యాణి అన్నదమ్ములు నాగును మందలించారోసారి. అప్పటి నుంచి కల్యాణి, నాగుల సాన్నిహిత్యం పెరిగింది. ప్లాన్ లేదు కానీ... ప్రేమ ఉంది నాగుతో ‘కల్యాణికి దెయ్యం ప్లాన్ ఇచ్చింది నువ్వేనా’ అంటే ‘అదేమీ లేదబ్బా’ అన్నాడు కంగారుగా. ‘ప్రేమించిన అమ్మాయికి పెళ్లవుతుంటే బాధతో ఆ పరిసరాల్లోకి రాకుండా దూరంగా ఉంటారు ఎవరైనా. మరి నువ్వు పెళ్లి పందిట్లో ఎందుకున్నావు’ అని అడగ్గానే... నవ్వుతూ ‘పోనివ్వకూడదూ’ అని... ‘ఆ అమ్మాయి ఎప్పుడైనా ప్రేమిస్తున్నానని నాతో చెప్పిందా, లోపలే దాచుకుంది. నాకు మాత్రం చెప్పాలని ఉండేది. వాళ్ల డబ్బు చూసి భయమేసేది’ అన్నాడు. వాళ్లిద్దరూ పెళ్లయ్యాక ఎం.ఎ, బిఈడీ చేసి, ఇప్పుడు బెంగళూరులో టీచర్లుగా ఉద్యోగం చేసుకుంటున్నారు. నాలుగేళ్ల కొడుకుతో ఆనందంగా జీవిస్తున్నారు. - ఎస్. శంకర శివరావు, కన్వీనర్, జెవివి నేషనల్ మేజిక్ కమిటీ -
నిన్నేపెళ్లాడతా
ది మోస్ట్ బ్యాచి లర్ హీరోయిన్లలో నటి త్రిష ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలో 13 వసంతాలు పూర్తి చేసుకున్న నటి త్రిష. అయితే నేటికీ తను క్రేజీ హీరోయినే. నానాటికి తన అందాలను ఇనుమడింపజేసుకుంటున్న ఈ చెన్నై చిన్నది అదే విధంగా అవకాశాలను పెంచుకుంటున్నారు. మధ్య లో అవకాశాలు కాస్త చేజారినా ఎన్నై అరిందాల్ చిత్రం విజయం తరువాత అవకాశాలు వరుస కడుతున్నాయన్నది నిజం అయితే ఇప్పటి వరకూ గ్లామర్‌ను నమ్ముకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తనలోని అభినయాన్ని చాటడానికి సిద్ధమయ్యారు. అలా ఇటీవల అరణ్మణై-2 చిత్రంలో దెయ్యంగా భయపెట్టించారు. ఈ తరం నటీమణులు పత్రికల వారికి బేటీ ఇస్తున్నారో లేదో గానీ తన అభిమానులతో సోషల్ మీడియాలో చిట్‌చాట్‌కు ఆసక్తి కనబరుస్తున్నారు. పత్రికల వారి కొన్ని ప్రశ్నలకు బదులివ్వడానికి సంకట పడాల్సి వస్తుంది.అదే అభిమానులతో అయితే అలాంటి సమస్యలుండవు. అందువల్ల తమ ప్రతి చిత్రం విడుదల సమయాల్లో హీరోయిన్లు తమ అభిమానులతో చాటింగ్ ఆసక్తి చూపిస్తున్నారు. అలా అరణ్మణై-2 చిత్ర విడుదల సందర్భంగా నటి త్రిష సోషల్ మీడియాలో అభిమానులతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. వారి ప్రశ్నలకు సావధానంగా సమాధానాలను చెప్పారు. ఏఏ హీరో గురించి త్రిష ఎలాంటి బదులిచ్చారో ఆమె మాటల్లోనే... సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించాలని చాలా ఆసక్తిగా ఉంది. ఇక నటుడు అజిత్ నా ఆల్ టైమ్ అభిమాన రేట్ హీరో. ఆయనతో జత కట్టడానికి ఎప్పుడైనా రెడీ. విజయ్ నాకు స్పెషల్ నటుడు. శివకార్తికేయన్‌తో రొమాన్స్‌కు వెనుకాడను. ధనుష్ గురించి చెప్పాలంటే కొన్ని పేజీలనే కేటాయించాలి. అంత ఉత్తమ నటుడాయన. అని తన భావాలను వెల్లడించిన త్రిషకు ఒక అభిమాని ఆమెను పెళ్లి చేసుకుంటాననే ఆఫర్ ఇచ్చారు. అందుకామె తనకిప్పుడు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఎస్కేప్ అయ్యారు. -
ఆ ఇంట్లో దెయ్యాలున్నాయ్..!
ఆధునిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న నేటి తరుణంలోనూ...దెయ్యాలూ, భూతాలకు భయపడుతున్నవారు మెండుగానే కనిపిస్తున్నారు. అదీ అభివృద్ధి చెందిన దేశాల్లోనూ అటువంటి నమ్మకాలకు కొదవ లేదు. సైతాన్లు వేధిస్తున్నాయని, దెయ్యాలు పట్టి పీడిస్తున్నాయని, ఆస్తులు అమ్ముకొనే వారు కొందరైతే... ప్రాణాలు తీసుకునేవారు మరి కొందరు. అటువంటి ఘటనే తాజాగా బ్రిటన్‌లో వెలుగు చూడటం అందర్నీ విస్మయ పరుస్తోంది. ఓ సైతాను తనను గాయపరుస్తోందని, తీవ్రంగా వేధిస్తోందని అందుకే తన ఇల్లు అమ్మకానికి పెట్టానని బ్రిటన్‌కు చెందిన 43 ఏళ్ళ వెనెస్సా మిచెల్ వెల్లడించింది. అందుకు తనవద్ద ఎన్నో ఆధారాలు ఉన్నాయంటోంది. ఎస్సెక్స్ సెయింట్ ఓసిత్ లో నివసించే ఆమె... ఏకంగా దెయ్యాల భయంతో స్వంత ఇంటిని అమ్మకానికి పెట్టి కాటేజీకి మారిపోయింది. తన ఇల్లు ఓ భయానక ప్రదేశమని, దెయ్యాలకు, భూతాలకు కేంద్రమని, అనేక సంఘటనలు తాను ఎదుర్కొన్నట్లు చెప్తోంది. గర్భిణిగా ఉన్నపుడు దెయ్యం తనను వెనకనుంచీ బలవంతంగా తోసేదని, నేలపై రక్తం చారికలే అందుకు నిదర్శనమని వెనెస్సా సాక్ష్యాలను సైతం చూపిస్తోంది. తన ఇల్లు మధ్యయుగంలో అధికారిక జైలుగా ఉండేదని, 16వ శతాబ్ద కాలంలో ఇంగ్లాండ్ లోని ప్రసిద్ధ మంత్రగత్తె అక్కడ ఉండేదని, ఎనిమిదిమందిని చంపిందన్న నేరారోపణతో అనంతరం ఆమె చంపబడినట్లు చరిత్ర సాక్ష్యాలున్నాయంటోంది. అయితే అటువంటి ఇంట్లో తాను 11 సంవత్సరాల నుంచీ ఉంటున్న వెనెస్పా.. ఇటీవల ఓ మేక రూపంలోని దుష్టశక్తి తన జీవితంలోకి ప్రవేశించిందని అందుకే ఇంటిని వేలానికి పెట్టానని అంటోంది. మేక ముఖం ఫోటోల్లో కనిపించడమే కాక, సీసీ టీవీ ఫుటేజ్ లో కూడ బయట పడిందని అంటోంది. తనకు... తన కొడుకు మధ్య నల్లటి ఆకారం నిలబడటం తాను స్వయంగా చూశానంటోంది. మేకలో ఏదో ఆత్మ ప్రవేశించి ఉండొచ్చిని, అదే తమను వేధిస్తోందని వెనెస్సా నమ్ముతోంది. నిజానికి వెనెస్సా ఆ ఆకర్షణీయమైన ఇంటిని చూసి అప్పట్లో మనసు పారేసుకుందట, గ్రామానికి మధ్యలో, చూసేందుకు ఆకట్టుకునే ఆ ఇల్లు నిజానికి ఎప్పుడూ అమ్మకానికే ఉండేదని.... తాను కొనుగోలు చేసేప్పుడు ఎందరో తనను హెచ్చరించారని అంటోంది. అయితే అప్పట్లో అటువంటి విపరీత ధోరణులను తాను నమ్మకపోవడం వల్లే ఇల్లు కొనుగోలు చేశానని, పదకొండేళ్ళపాటు ఇంట్లో నివసించి అనేక ప్రయోగాలను చేశానని చెప్తోంది. ఇల్లు కట్టినప్పటినుంచీ ఎవ్వరూ ఆర్నెల్లకు మించి అందులో నివసించలేదని ఆమె తెలుసుకుంది. వందేళ్ళ క్రితం ఓ కుటుంబం 150 యూరోలకు ఈ ఇంటిని కొనుగోలు చేసి, కొంతకాలం తర్వాత దాన్ని వదిలించుకొనేందుకు కేవలం 50 యూరోలకే విక్రయించినట్లు తెలిసిందంటోంది. ప్రస్తుతం తానుకూడా ఇంటిని అమ్మకానికి పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని, ఆ ఇంట్లో ఏవో అతీంద్రియ శక్తులు ఉన్నట్లు ఎన్నో నిదర్శనాలు తనకు కనిపించాయని చెప్తోంది. 2004 లో 148 యూరోలకు ఆ ఇంటిని కొనుగోలు చేసిన వెనెస్సా... దానికి దెయ్యాల చరిత్ర ఉందని గ్రహించలేకపోయానంటోంది. -
'దెయ్యాలు మా కార్లలో రోజూ ఎక్కుతాయి'!
టోక్యో: ఇషినోమాకి.. ఇది జపాన్ లో 2011లో 30 అడుగుల ఎత్తు సునామీ అలల తాకిడికి నిండా మునిగిపోయిన నగరం. వేల సంఖ్యలో ఇక్కడ ప్రాణాలుకోల్పోయారు. సునామి సమయంలో దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినట్లు కనిపించిన ఈ నగరం మళ్లీ ఊపిరి పోసుకొని మనుగడ ప్రారంభించింది. అయితే, ఆ నగరంలోని ట్యాక్సీ డ్రైవర్లను ఇప్పుడు ఒక సమస్య పట్టి పీడిస్తోంది. అదే దెయ్యాలు. అవును.. తాము అప్పుడప్పుడు మనుషులనుకొని దెయ్యాలను ఎక్కించుకొని తిరుగుతున్నామని ఇషినోమాకి పట్టణంలో ట్యాక్సీ డ్రైవర్లుగా పనిచేస్తున్న వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఎంతో మంది క్యాబ్ డ్రైవర్లు ఇవే మాటలు చెప్తున్నారు. దీంతో అసలు ఆ విషయం ఏమిటా అని సెండాయ్ లోని తోహోకు గాకిన్ అనే విశ్వవిద్యాలయం, కెనడాకు చెందిన ఓ విశ్వవిద్యాలయం అధ్యయనకారులు ఆ ప్రాంతంలో పరిశోధనకు వెళ్లి ఇంటర్వ్యూలు చేశారు. అనేకమంది క్యాబ్ డ్రైవర్లను ప్రశ్నించారు. ఆ సమయంలో వారు చెప్పిన పలు సమాధానాలు అధ్యయనకారులను ఆశ్చర్య పరిచాయి. తాము కార్లలో వెళుతున్నప్పుడు నిజమైన వ్యక్తుల్లాగే కనిపించిన కొందరు ఆపి ఎక్కుతారని, ప్రయాణం మధ్యలో వెనుక సీట్లోకి చూస్తే కనిపించకుండా పోతారని, ఇలా జరగడం తమకు తరుచుగా ఎదురవుతున్న అనుభవాలు అని చెప్పారు. ఒక డ్రైవర్ అయితే 'నేనొకసారి ఒక మహిళను ఇషినోమాకి స్టేషన్లో ఎక్కించుకున్నాను. ఆమెను ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించగా మినమిహామాకు వెళ్లాలని చెప్పింది. ఆ ప్రాంతం సునామి దెబ్బకు తుడిచిపెట్టుకు పోయింది కదా అని నేను ప్రశ్నించాను. ఆ మాట విని ఆమె అయితే, నేను చనిపోయానా? అని ప్రశ్నించింది. ఆ మాట విని భయంతో వెనక్కి తిరిగి చూశాను. ఆమె ఆ సీట్లో లేదు' అని చెప్పాడు. ఇక మరో డ్రైవర్.. 'నేను కారు ఎక్కిన మనిషి చెప్పిన ప్రాంతానికి తీసుకెళ్లాను. అతడు చెప్పిన చోటు రాగానే వెనక్కి తిరిగి చూశాను. కానీ, అతడు కనిపించలేదు' అని చెప్పాడు. ఇలా అంతా ఇలాంటి అనుభవాలే చెప్పుకొచ్చారు. అయితే, ఈ అధ్యయనం చేసిన వారు వారు చెప్తున్న దెయ్యాల అంశాలపై స్పందిస్తూ 2011, మార్చి 11న భూకంపం సంభవించి ఇషినోమాకిపై 30 అడుగుల ఎత్తు అలలతో సునామీ విరుచుపడిందని, ఆ దెబ్బతో దాదాపు 3,100మంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించగా మరో 2,770 మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఈ దృశ్యాలను స్వయంగా చూసిన వాళ్లలో ప్రస్తుతం డ్రైవర్లుగా పనిచేస్తున్నవారు కూడా ఉన్నారు. ఆ సునామి వల్ల వారిలో ఏర్పడిన భయం ఓ రకమైన ఒత్తిడిగా మారి అవతలి వ్యక్తికి కనిపించనివి తమకే కనిపిస్తున్నట్లుగా భ్రమపడే ఓ వింత సమస్య నుంచి బాధపడుతున్నారని స్పష్టం చేశారు. -
బూచి లేదు.. బడికి రండి
► విద్యార్థుల తల్లిదండ్రులకు అధికారుల కౌన్సెలింగ్ ► తొలిరోజు పాఠశాలకు 11 మంది విద్యార్థుల హాజరు చందంపేట: అధికారుల కౌన్సెలింగ్‌తో బూచి భయం వదిలింది. నిన్నటి వరకు బడి ముఖం చూడని విద్యార్థులు శుక్రవారం పాఠశాల బాట పట్టారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం గట్టుకిందితండా ప్రాథమిక పాఠశాలలో దెయ్యం భయంతో పక్షం రోజులుగా పాఠశాల మూతబడడంతో ‘బూచి ఉంది బడికి పంపం’ అనే శీర్షికన శుక్రవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. చందంపేట ఎంఈవో సామ్యనాయక్, డిప్యూటీ తహసీల్దార్ ఏలేశం పాఠశాలను సందర్శించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మూఢ నమ్మకాలతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగించవద్దని సూచించారు. మొదటి రోజు 11 మంది విద్యార్థులను బడిబాట పట్టించారు. విద్యార్థులందరినీ బడికి రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వారు సాక్షికి తెలిపారు. -
బూచి ఉంది.. బడికి పంపం
►దెయ్యం ఉందంటూ బడికి రాని విద్యార్థులు ►15 రోజులుగా విద్యార్థుల డుమ్మా ►కౌన్సెలింగ్ చేపట్టేందుకు ఎంఈఓ విఫలయత్నం చందంపేట: దెయ్యం ఉందంటూ పక్షం రోజులుగా ఆ పాఠశాల మూతపడింది. నల్లగొండ జిల్లా చందంపేట మండలం గట్టుకింది తండాలో చోటుచేసుకున్న ఈ ఉదంతం గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ పాఠశాలలో 22 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు లేకపోవడంతో ఒక్క విద్యా వలంటీర్తోనే పాఠశాల నిర్వహిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం గ్రామానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆమెకు దెయ్యం పట్టిందని భావించిన వారి బంధువులు పలుచోట్ల తిప్పారు. ఎంతకూ తగ్గకపోవడం, మరొకరికి కూడా అనారోగ్యం రావడంతో సమాధులున్న చోట నిర్మించిన బడి వైపు వెళ్లడం వల్లే వారికి దెయ్యం పట్టిందని భావించారు. తమ పిల్లలకు కూడా ఎక్కడ దెయ్యం పడుతుందోనని భావించి విద్యార్థుల తల్లిదండ్రులు బడికి పంపడం మానేశారు. 22 మంది విద్యార్థులున్న ఆ పాఠశాలలో 15 రోజులుగా ఏ ఒక్కరు బడి మొహం చూడడం లేదు. ఈ విషయం చందంపేట ఎం ఈఓ సామ్యనాయక్‌కు తెలియడంతో ఆయన ఈనెల 4న పాఠశాలను సందర్శించారు. ఆ సమయంలో పాఠశాలలో ఒక్క విద్యార్థి లేడు. విద్యావలంటీర్ మాత్రమే ఉన్నారు. ఎంఈవో వెంటనే విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆరా తీశారు. పిల్లలను పంపించకపోవడానికి కారణం ఏమిటని ఆయన ప్రశ్నించడంతో వారు ఇదే విషయాన్ని ఏకరువు పెట్టుకున్నారు. మూఢవిశ్వాసాలపై ఆయన వారికి కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ‘మా పిల్లలకు ఏమైనా జరిగితే మీరు బాధ్యత వహిస్తారా? అని తల్లిదండ్రులు ప్రశ్నించడంతో ఆయన ఈ విషయాన్ని తహసీల్దార్ ప్రవీణ్‌నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. దెయ్యం భయంతో విద్యార్థులు బడికి రావడం లేదు పాఠశాలలో దెయ్యం ఉందనే ప్రచారంతో పాఠశాలకు విద్యార్థులు రావడం లేదు. విద్యార్థులను బడికి పంపించేందుకు తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు. తల్లిదండ్రులకు సర్దిచెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. - జర్పుల తులసి, మధ్యాహ్న భోజనం నిర్వాహకురాలు -
దెయ్యం బూచితో మూతపడిన స్కూలు
చందంపేట (నల్లగొండ): ఆ ఊళ్లో ఓ మహిళకు అనారోగ్యం సోకింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఆమెకు దయ్యం పట్టిందని అందుకే అలా జరుగుతోందని గ్రామంలో పుకారు లేచింది. గ్రామ పొలిమేరల్లోని సమాధుల వద్ద ఉన్న ప్రభుత్వ పాఠశాల వద్దకు ఆమె వెళ్లడమే కారణమని అనుకున్నారు. ఈలోపు మరొకరికి కూడా జబ్బు చేసింది. ఇంక అంతే... బడి వైపు వెళ్తే అలాగే జరుగుతుందని అనుమానించారు. దీంతో తమ పిల్లలను ఆ బడికి పంపడం మానేశారు. దీంతో 15 రోజులుగా ఆ పాఠశాల మూతబడింది. నల్లగొండ జిల్లా చందంపేట మండలం గట్టుకిందితండా గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఉదంతం గురువారం తాజాగా వెలుగులోకి వచ్చింది. అచ్చంపేట పట్టిగా పిలువబడే చందంపేట గ్రామపంచాయతీ గట్టుకింది తండా ప్రాథమిక పాఠశాలలో 22 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యా వాలంటీర్‌తోనే నెట్టుకొస్తున్నారు. కొన్ని రోజుల క్రితం గ్రామానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆమెకు దెయ్యం పట్టిందని భావించిన వారి బంధువులు పలు చోట్ల తిప్పారు. ఎంతకూ తగ్గకపోవడం, మరొకరికి కూడా అనారోగ్యం రావడంతో సమాధులున్న చోట నిర్మించిన బడి వైపు వెళ్లడం వల్లే వారికి దెయ్యం పట్టిందని భావించారు. తమ పిల్లలకు కూడా ఎక్కడ దెయ్యం పడుతుందోనని భావించి విద్యార్థుల తల్లిదండ్రులు బడికి పంపడం మానేశారు. విషయం చందంపేట ఎంఈఓ సామ్యనాయక్‌కు తెలియడంతో ఆయన ఈనెల 4న గ్రామానికి వెళ్లారు. విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆరా తీశారు. పిల్లలను పంపించకపోవడానికి కారణం ఏమిటని ఆయన ప్రశ్నించడంతో వారు ఇదే విషయాన్ని ఏకరువు పెట్టుకున్నారు. మూఢవిశ్వాసాలపై ఆయన వారికి కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ‘మా పిల్లలకు ఏమైనా జరిగితే మీరు బాధ్యత వహిస్తారా' అని తల్లిదండ్రులు ప్రశ్నించడంతో ఆయన ఈ విషయాన్ని తహసీల్దార్ ప్రవీణ్‌నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. -
‘రియల్’ దెయ్యం
అది మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట. కర్నాటక సరిహద్దులో ఉంటుంది. నారాయణపేట పేరుకి మండల కేంద్రమే కానీ వెనుకబాటుతనం ఛాయలు ఏ మాత్రం వీడలేదు. మండల కేంద్రమైన తర్వాత కొంత ఆధునికత తోడవుతూ పట్టణం విస్తరిస్తోంది. దాదాపుగా పదిహేను వందల కుటుంబాలు జీవిస్తుంటాయి. పట్టణానికి దూరంగా పురాతన నివాస ప్రాంతం ఉంది. అది నూటయాభై కుటుంబాలు నివసించే వాడ. ఆ వాడలో దాదాపుగా ఐదేళ్ల కిందట జరిగిందా సంఘటన. సాయంత్రం అవుతుంటే అందరి కళ్లలో బెరుకు. భయంభయంగా గడుపుతున్నారు. సాధారణంగా ఏడు దాటితే రొటీన్ పనులన్నీ బంద్ అయి ఇళ్లకు చేరే సంస్కృతి వారిది. గూట్లో దీపం, నోట్లో ముద్ద అన్నట్లు సందె చీకట్లు అలుముకోగానే రోజు ముగిసిందనే లైఫ్‌స్టయిలే అక్కడ. అలాంటిది పొద్దు కొండల్లో పడుతోందంటే... అంటే సాయంత్రం ఐదింటికల్లా ఇంటిదారి పడుతున్నారు. ఎవరికైనా ఏ పక్క ఊరికో వెళ్లి రాత్రి ఎనిమిదింటికి- తొమ్మిదింటికి ఇల్లు చేరాల్సి వచ్చిందంటే చాలు. గుండె గొంతులోకి వచ్చినంత పనవుతుంది. దడదడలాగే గుండెను అరచేత్తో అదుముకుంటూ వచ్చి ఇంట్లో పడేవాళ్లు. ‘అమ్మా ట్యూషన్ నుంచి ఒక్కదానివే రాకు. నేనొచ్చి తీసుకొస్తా’ అంటూ కూతురికి జాగ్రత్తలు చెబుతున్నాడో తండ్రి. ‘దెయ్యం ఎలా ఉంటుంది నాన్నా! ఏం చేస్తుంది?’ అంటూ అమాయకంగా అడిగే ప్రశ్నలకు జవాబు ఆ తండ్రి దగ్గర లేదు. తన బిడ్డ లక్షణంగా ఉంటే తనకదే చాలు అనుకోవడమే అతడికి తెలిసింది. చీకటి పడక ముందే వీధులు నిర్మానుష్యంగా మారేవి. ఒక్కొక్కరైతే పరుగుతో ఇంట్లోకి వస్తూనే కళ్లు తిరిగి పడిపోయేవాళ్లు. ఎవరో వెంబడించినట్లు అనిపించిందని, దూరంగా లీలగా ఓ రూపం కనిపించి ‘ఎక్కడికెళ్తున్నావు’ అని అరిచిందని చెప్పేవారు. మరికొంత మంది ‘తెల్ల దుస్తులు వేసుకున్న యువతి - ఇక్కడికి ఎందుకు వచ్చారు- అంటూ గద్దించింది’ అని చెప్పేవారు. ‘ఆ యువతి కళ్లు దేనికోసమే వెతుకుతున్నట్లు, తీవ్రమైన ఆశాభావం ఆ కళ్లలో గూడు కట్టుకున్నట్లు ఉండేవి. జుట్టు నిశీథిలా వీపంతా పరుచుకుని ఉంది’ ఇలాంటి అనేక కథనాలు. వాడవాడంతా భయం గుప్పెట్లో రోజు వెళ్లదీస్తోంది. ఊళ్లో దెయ్యం తిరుగుతోందని గట్టిగా నమ్ముతున్నారు. దెయ్యం అనే పదం లేకుండా పది మాటలు మాట్లాడడం లేదు. ఇంతకీ దెయ్యం ఎలా పుట్టిందంటే... ‘ఎలా పుట్టిందో, ఎక్కడ పుట్టిందో మాకు తెలియదు కానీ ఆ ఖాళీ స్థలంలో ఉంటోంది’ అని ముక్తకంఠంతో చెప్పసాగారు. దెయ్యం ఉంటున్నదిక్కడే! ఇళ్ల మధ్య వందల ఏళ్ల నాటి కట్టడం. విశాలమైన ప్రహరీ, ఓ మూలగా చిన్న ఇల్లు. కప్పు కూలిపోయి, గోడల్లో నుంచి మొక్కలు పెరిగి, మట్టిదిబ్బలు, రాళ్లకుప్పలతో చూడడానికే భయంగొలిపేలా ఉందా ప్రదేశం. ఆవరణంతా పిచ్చిచెట్లు మొలిచాయి. ఎక్కడ అడుగుపెడితే ఏమవుతుందో అన్నట్లు తీగలు అల్లుకుపోయి ఉన్నాయి. పాములు, తేళ్లు యథేచ్చగా సంచరించే అవకాశం ఉంది. వాడలో అందరి వేళ్లూ ఆ జాగానే చూపిస్తున్నాయి. ‘ఆ యువతి ఇక్కడే ఉంటోంది. జన సంచారం తగ్గినప్పుడు వీధుల్లో తిరుగుతోంది. అప్పుడామెకు ఎవరు ఎదురు వచ్చినా భయపెడుతోంది’ ఇలా తమ అనుభవాలను కథలు కథలుగా చెప్తున్నారు. ‘రీల్’ దెయ్యంలాగానే! ఆ స్థలానికి ఎదురుగా ఉన్న ఇంటి యజమాని అక్కడే మంచం మీద కూర్చుని చూస్తున్నాడు. అతడిని పలకరించినప్పుడు... ‘అబ్బే! దయ్యమా ఇంకేమైనానా! నే రోజూ ఇక్కడే మంచం వేసుకుని పడుకుంటా. నాకొక్కసారీ కనిపించందే’ అని తేలిగ్గా తీసిపారేశాడు. అక్కడ గుమిగూడిన ఆడవాళ్లను ‘మీరు చూశారా’ అని అడిగితే, తెల్లముఖం వేశారు. ఎలా ఉంటుంది దెయ్యం? అని అడిగితే... సినిమాల్లో కనబడినట్లు ఉంటుందని భయం వ్యక్తం చేశారు. స్థూలంగా తేలిందేమిటంటే... ‘మేము చూశామని చెప్పేవారి కంటే, ఫలానా వాళ్లకు కనిపించిందట’ అనేవాళ్లే ఎక్కువ. ఆ ‘ఫలానా’ వాళ్లు ఎవరూ అంటే... అందరి కళ్లూ ఏడెనిమిది మంది చుట్టూనే తిరుగుతున్నాయి. వారిలో ఎక్కువమంది ఆ జాగా పక్కనున్న ఇంటి వాళ్లే. వాళ్లు ‘మేము చూశామని స్థిరంగా చెబుతున్నారు. కానీ దయ్యం కనిపించిందనే ఆందోళన, భయం వారి మాటల్లో కానీ, స్వరంలో కానీ ఏ మాత్రం ధ్వనించడం లేదు. లీలగా దెయ్యాన్ని ఊహించుకుని, చూసినట్లు భ్రమించిన వాళ్లంతా భయంతో వణికిపోతున్నారు. స్పష్టంగా చూశామని చెప్తున్న వాళ్లు మాత్రం భయపడడం లేదు. విచిత్రమైన పరిస్థితి. ఇంత జరుగుతుంటే ఆ స్థలం యజమాని ఏమయ్యాడు? అని ఆరా తీస్తే... ‘రియల్’ దెయ్యమే! సెంటర్లో టీ దుకాణం నడుపుకుంటున్నాడు. పాత ఇంటిని పట్టించుకోకపోవడంతో శిథిలమైపోయింది. అతడికి దానిని అమ్మాల్సిన అవసరం రాలేదు. కొనేవాళ్లు ఆసక్తి కొద్దీ అడిగితే అందనంత ధర చెప్పసాగాడు. ఆ ప్లాట్ పనికిరానిదని నిర్ధారించగలిగితే తక్కువ వెలకు సొంతం చేసుకోవచ్చనే దుర్బుద్ధి కలిగింది పక్కింటి వాళ్లకు. కుయుక్తితో పక్కింటి వాళ్లు అల్లిన కథనాన్ని ఖాళీజాగా యజమాని కూడా నమ్మేశాడు. చివరికి అంతా గొప్ప ఫిక్షన్ స్టోరీ అని తేలాక ఊపిరి పీల్చుకుని, ఆ స్థలాన్ని శుభ్రం చేసి ఓ గది కట్టేసి నివాసయోగ్యంగా మార్చుకున్నాడు. మనుషుల్లో బలంగా నాటుకుపోయిన దెయ్యం భయం గురించి సైకియాట్రిస్టులు ఏమంటున్నారంటే... చిన్నప్పటి నుంచి విన్న సంగతులు, ముద్రపడిపోయిన విశ్వాసాలు మనిషి మనసుని ఆడుకుంటుంటాయి. ఆ బలహీనతలతో స్వార్థపరులు ఆటలాడుతుంటారు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఆ దెయ్యం ఇక కనిపించదు! స్థానిక వార్తాపత్రికల్లో వార్త ప్రచురితమైందని జనవిజ్ఞాన వేదిక మండల కమిటీ వాళ్లు మాకు తెలియచేశారు. హైదరాబాద్ నుంచి నేను వెళ్లాను. మా జిల్లా ప్రతినిధులు కూడా వచ్చారు. మొత్తం ఐదారుగురం కలిసి ఆ వాడంతా తిరిగాం. కనిపించిన వారితో మాట్లాడాం. ఆ పుకారును లేవదీసింది ఖాళీ జాగా పక్కన ఉన్న ఒక కుటుంబం. ప్రచారం చేసింది వారి స్నేహితులు, బంధువులు. వీరికి సలహా ఇచ్చింది ఓ మంత్రగాడు. ఆ కుటుంబ యజమానిని పిలిచి ‘ఇదంతా నువ్వు చేసిందేనని మాకు తెలుసు. ఎందుకు చేశావో చెప్ప’మని నిలదీశాం. మొదట అతడు సహకరించలేదు. పోలీసుల జోక్యంతో నిజం ఒప్పుకున్నాడు. ఆ స్థలాన్ని తక్కువ ధరకు కొట్టేయడానికేనని ఒప్పుకున్నాడు. ఆ వాడలోని వారందరికీ ‘దెయ్యాలుండవని చెప్పి, ఇక దెయ్యం కనిపించదు’ అని ధైర్యం చెప్పాం. ఆ తర్వాత ఆ వాడలో ఎవరూ దెయ్యం కనిపించిందనలేదు. - రమేశ్, జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ అంతా భ్రాంతి..! మనిషి ఎమోషనల్ స్టేట్‌ని బట్టి ఇల్యూజన్స్ ప్రభావితం చేస్తాయి. దాహంతో ఉన్న వ్యక్తికి ఎడారిలో అడుగడుగునా ఎండమావులే కనిపిస్తాయి. చేతిలో నీళ్లు ఉంటే ఎండమావులు కనిపించవు. ఇదీ అలాగే. దెయ్యం విషయంలోనూ అంతే. ప్రీ ఫిక్సేషన్ ఆఫ్ మైండ్ అలా ఉంటుంది. అందుకు చదువు, విజ్ఞానం లోపించడంతోపాటు చిన్నప్పుడు అన్నం తినిపిస్తూ ‘తినకపోతే దెయ్యం పట్టుకెళ్తుందని భయపెట్టడం’ వంటివన్నీ కారణాలే. అలాగే ఇళ్లలో దెయ్యాల మీద చర్చ, దెయ్యాల సినిమాలు చూడడం వల్ల చదువుకున్న వారిలోనూ మైండ్ దెయ్యం ఉందనే భావంతో నిండిపోతుంది. కనిపించిన వాటిని దెయ్యంతో పోల్చుకుంటుంటారు. లైటు దగ్గర పురుగు కదిలినా దెయ్యం కదలినట్లు భ్రాంతికి లోనవుతుంటారు. - డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ -
మరో హారర్ చిత్రం - షీ...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోదరుని కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వర్రావు నిర్మిస్తున్న ‘షీ’ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. పర్స రమేశ్ మహేంద్ర దర్శకుడు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘హీరో ఎప్పుడూ తనకు దెయ్యం పడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తూంటాడు... అతనికి దెయ్యం పట్టిందా లేదా అనే కథాంశంతో ఈ చిత్రాన్ని ఎంటర్టైనర్గా రూపొందించ నున్నాం’’అని తెలిపారు. -
ఓ స్త్రీ కథ!
ఇంటికి దెయ్యం వస్తుందేమో అన్న భయంతో గోడల మీద ‘ఓ స్త్రీ రేపురా’ అని చాలా గ్రామాల్లో రాసి ఉంటుంది. ఈ అంశంతో రూపొందిన చిత్రం ‘ఓ స్త్రీ రేపు రా’. ఆశిష్ గాంధీ, వంశీకృష్ణ కొండూరి, దీక్షా పంత్, శృతీ మోల్ ముఖ్యతారలుగా స్వీయదర్శకత్వంలో అశోక్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని అశోక్ రెడ్డి చెప్పారు. -
'నన్ను దెయ్యాలు వెంటాడుతున్నాయి.. నమ్మరేం'
లండన్: తనను గత కొద్ది రోజులుగా దెయ్యాలు వెంటాడుతున్నాయని ప్రముఖ హాలీవుడ్ గాయకురాలు కెర్రీ కతోనా అన్నారు. ఈ విషయం చెప్తుంటే తనను అందరూ పిచ్చిదానిలా చూస్తున్నారని చెప్పారు. ఈ విషయం అవతలివారికి చేరవేయడంలో తనకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని, ఎవ్వరూ తన మాటలు నమ్మడం లేదని అన్నారు. 34 ఏళ్ల కతోనా పాత నివాసం ఆక్స్ ఫోర్డ్ షైర్లో ఆత్మలు సంచరిస్తున్నాయని తొలుత ఫిర్యాదు చేసింది. 'ప్రస్తుతం నేను దానిని ఓ ఇంటిలా భావించడం లేదు. ఏదో నన్ను వెంటాడుతుంది. ప్రజలు నన్ను పిచ్చిదాన్నని అనుకుంటున్నారు. కానీ నేను మాత్రం నన్ను ఎవరో వెంటాడుతున్నారనే విషయం చెప్పగలను. అసలేం జరుగుతోందని కొంతమంది నా చుట్టూ మూగుతున్నారు' అని ఆమె అంటోంది. -
నేను - నా దెయ్యం!
కథ మీకు ఎంతమంది స్నేహితులు? ఒక్కరా? ఇద్దరా? చాలామందా? నాకు ఒకే ఒక స్నేహితురాలు! ఐతే తను ఒక దెయ్యం. దెయ్యాలన్నీ చెడ్డవి కావు. ఈ సంగతి నాకన్నా బాగా ఇంకెవరికీ తెలీదనుకుంటాన్నేను. మహానుభావుడెవడో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలన్నాడు. ఐతే నా దెయ్యానికీ నాకూ మధ్యనున్న సంబంధం, అనుబంధం ఏ విధమైన ఆర్థికత్వమో నాకు అర్థం కాదు. దానికోసం ఆర్థికతకి నిర్వచనాన్ని పెంచాల్సి వస్తుందేమో! లేకపోతే అసలు పెద్దవాళ్లే ఆర్థికతకి ఏదైనా విస్తృతమైన నిర్వచనం ఇచ్చారేమో తెలుసుకోవాలి. నా సమస్య తీవ్రతను నేను గుర్తించినప్పుడు నాకు ఇంచుమించు ఇరవై ఏళ్లు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండీ ఒకటే సమస్య... నాలో నేను మాట్లాడుకోవడం. నేను మాట్లాడే కొన్ని మాటలు నా చుట్టూ ఉన్నవాళ్లకి అర్థం కాకపోవడం, ఆఖరికి మా అమ్మకి కూడా! శివకుమార్ పేరు (నా పేరే)తో ఓ డిక్షనరీ అచ్చేయిద్దాం అనుకున్నా కానీ, ఇవాళా రేపూ పెద్ద పెద్ద డిక్షనరీలకే దిక్కు లేదు... ఇంకెందుకు, ఖర్చు దండగ అని ఊరుకున్నాను. టీచర్ చెప్పేది నాకర్థం అయ్యేది, మా అమ్మ చెప్పేదీ బాగా అర్థమయ్యేది. కానీ నేను చెప్పే జవాబు వాళ్లకి అంతుబట్టేది కాదు. నేను మాట్లాడేది ప్రాకృతం, పాళీ కాదు తెలుగే! కానీ ఒక్కోసారి అది మాయగా ఉండేది. ‘‘ఒరే, నీ పలుకు ఆ దేవుడికే తెలియాలి’’ అనేది మా అమ్మ. నా పలుకు దేవుడికి అర్థం అవుతుందనే మా అమ్మ సలహా నా మనసులో బాగా నాటుకుపోయింది. కానీ దేవుడిని ఎలా వెతకడం? ఎక్కడో ఆకాశంలో పైన, పైపైన ఉంటాడు. అయినా అసలు నిజంగా ఉన్నాడో లేడో ఎలా తెలుస్తుంది? దేవుడు పోతే పోనీ, కనీసం దెయ్యం కనపడితే బావుణ్ణు అనుకున్నాను. ‘‘దేవుడున్నాడు. నాకు తెలుసు. దెయ్యం కూడా ఉంది. కానీ, దెయ్యాన్ని చూడాలని కోరుకోకు. తలచిందే తడవుగా ప్రత్యక్షం అయి, నీ జీవితాన్ని దేవుని నుండి దూరం చేస్తుంది. దేవుడి కోసం ప్రార్థన చెయ్. పట్టు వదలకుండా వెతికితే ఆయన కరుణిస్తాడు. నీకోసం స్వర్గంలో బెర్త్ రిజర్వ్ చేసి ఉంచుతాడు.’’ ఒకాయన బోధించాడు! నాకు అర్థం అయింది. దేవుడిని కనిబెట్టాలంటే చాలా తతంగం ఉంది. అదే దెయ్యమైతే అందుబాటులో ఉంటుంది. పిలిచిందే తడవుగా ప్రత్యక్షం అవుతుంది. మాటలు కలిపితే విషయం తేలిపోద్ది.. నా మనసు, నా మాట దానికర్థం అవుతాయేమో! దెయ్యాలు ఎలా వుంటాయి? ఎక్కడ ఉంటాయి - పుస్తకాల్లో పరిశోధన చేశాను. చందమామ పుస్తకంలో తోకచుక్కల్లాంటి దెయ్యాలు, శివ పురాణంలో రౌద్రమైన దెయ్యాలు, ఈవిల్ డెడ్ సినిమాల్లో రోతగా ఉండే బొమ్మల్లాంటి దెయ్యాలు, మా అమ్మమ్మ కథల్లో మనసున్న బంగారు దెయ్యాలు - ఏదో ఒకటి, ఒక్కటంటే ఒక్కటే కనబడొచ్చుగా! రాన్రానూ, రాత్రీ పగలూ దెయ్యం కోసం పలవరిస్తూ ఇంచు మించు పిచ్చివాడిని అయిపోయాను. చింతచెట్ల దగ్గరా, శ్మశానాల లోపల, యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగే చోట్ల అర్ధ రాత్రిళ్లు వెతికేవాడిని. సమయం గాని సమయంలో తప్పనిసరి పనుల మీద అటుగా వచ్చినవాళ్లు నన్ను చూసి నేనే దెయ్యాన్ననుకొని జడుసుకునేవాళ్లు. ఓ సారి కొట్టబోయారు కూడా! ఏదో సాకు చెప్పి పలాయనం చిత్తగించాల్సి వచ్చింది. కానీ దెయ్యం మీద ప్రేమ, ఆశ చావలేదు. చివరికి ఊరి చివర పాడుబడిన కొంపలో మూల కూచుని కనబడింది. మోకాళ్ల మీద తలపెట్టుకొని, తెల్ల డిజైనర్ చీర కట్టుకొని చూడచక్కని దెయ్యం. ఎగిరి గంతేసినంత పనిచేశాను. సంతోషం నుంచి తేరుకోవడానికి కాసేపు పట్టింది. మామూలు స్థితికి వచ్చాక నిదానంగా, స్నేహంగా దెయ్యం దగ్గరగా వెళ్లి అలికిడి చేశాను. ‘‘ఇక్కడున్నావా?’’ అన్నాను. తలెత్తి చూసింది. నీలం కళ్లతో పలకరింపుగా నవ్వింది. మళ్లీ అనుమానపడింది. ‘‘ఇక్కడికెందుకొచ్చావు?’’ గాబరాగా అడిగింది. ‘‘ఊరికే. నిన్ను కలుసుకోవాలని. నీనుంచి పెద్దగా ఏం ఆశించను. చాలా వెతికాను. ఇప్పటికి చిక్కావు. ఇంత వెతికితే దేవుడే దొరికే వాడేమో.’’ ‘‘దేవుడి పేరు నా దగ్గర ఎత్తకు. నేను భరించలేను.’’ ‘‘సరేలే. ఎత్తను. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు?’’ ‘‘ఎవరూ లేరు. నేనొక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడు నువ్వొచ్చావు.’’ ‘‘నువ్వెలా చచ్చిపోయావు?’’ ‘‘గుర్తులేదు. బతికి వున్నప్పుడు తోటల్లో తిరుగాడుతూ కులాసాగా ఉండేదాన్ని. అంత మటుకే గుర్తుంది’’ కళ్లనీళ్లు పెట్టుకుంది. ‘‘సరే, అదంతా వదిలెయ్. ఇక నుంచీ మనిద్దరం ఒకరికొకరు. సరేనా?’’దెయ్యం జవాబు చెప్పలేదు. నేను కబుర్లు మొదలుపెట్టాను. చాలాసేపు మాట్లాడాను. తను ఏం మాట్లాడలేదు. వింటూ ఉంది. నా భాష, భావన తనకి అర్థం అవుతున్నట్టు తెలుస్తోంది. ముఖ కవళికలు మారుస్తోంది. దానితో మాట్లాడుతూంటే నాకు నా ఊపిరి లోపలికి వెళ్లడం, బైటికి పోవడం బాగా తెలుస్తోంది. ఎంతోసేపు దాని దగ్గర కూచొని తర్వాత శెలవు తీసుకొని ఇంటికి వెళ్లిపోయాను.మాకు ఇంటినిండా బోలెడు‘మంది’ ఉన్నారు. రోజులు సరదాగా గడుస్తాయి. కానీ హఠాత్తుగా ఉన్నట్టుండి ఊపిరి ఆడనట్టు అని పించేది. వెంటనే పనులన్నీ వదిలి దెయ్యం దగ్గర వాలేవాడిని. దానితో మాట్లాడితే నాకు ఊపిరి తిరిగేది, బలం వచ్చేది. దెయ్యంతో నా స్నేహం రాన్రానూ గాఢం అయింది. ఎంతగా నంటే అది పూర్తిగా నా సొంతం అనుకోవడం మొదలెట్టాను. ఏ అవసరం వచ్చినా చెప్పమనేవాడిని. ప్పుడప్పుడూ బజార్లోకి డిజైనర్ తెల్లచీరలొస్తే తెమ్మనేది. వేరే రంగులు వాడొచ్చుగా? అంటే డ్రెస్ కోడ్ ఒప్పుకోదని చెప్పింది! దాని కళ్లు ఒక్కోసారి నీలం రంగు నుండి నలుపులోకి మారిపోయేవి. అవీ బానే ఉండేవి. మనిషై వుంటే దాన్నే పెళ్లి చేసు కునేవాడినేమో అనేంత అందంగా ఉంటుంది! నేను తెగ చదివీ చదివీ విసుగుపుట్టి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగంలో చేరాను. బాగా జీతం, బాగా పని. కొన్నాళ్లకి పని చేసీ చేసీ విసు గనిపించి పెళ్లి చేసుకున్నాను! నా భార్య పార్వతి నాలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్. అసలు తను అహ్మ దాబాద్‌లో నేషనల్ అకాడమీ ఆఫ్ డిజైన్‌లో చేరాలనుకుందంట. కానీ కుదరలేదంట. చిత్ర (చిత్తు) పటాలు గీయడం చాలా ఇష్టం అంది. ఏవో పిచ్చి గీతలు గీసిన పుస్తకాలు చూపించింది. నేనంత ఆసక్తి చూపలేదు. నా భార్య నాలానే అదో మాదిరిగా మాట్లాడుతుంది. ఆ ‘మాదిరి’ ఏంటో నేను చెప్పలేను గానీ మొత్తానికి అదేదో! నాతో ఇష్టంగా ఉంటుంది. ఇంట్లో బాధ్యతగా ఉంటుంది. సంసార పక్షంగా తన పనులు తను చేసుకుపోతుంది. నాతో ఆఫీసు విషయాలన్నీ చెబుతుంది. నేనూ తనతో అన్ని విషయాలూ పంచుకునేవాడిని. ఐతే ఈ దెయ్యం సంగతి రహస్యంగా ఉంచాను. చెబితే నమ్మదని పించింది. పైగా నా దెయ్యం ఆడది కాబట్టి అనుమానపడుద్దని భయపడ్డాను! మేం తీరిక దొరికితే కబుర్లు చెప్పు కునేవాళ్లం. ‘‘నేను పద్మజను ప్రేమిం చాను. కానీ పెళ్లి చేసుకోవడం కుదర లేదు’’ ఓసారి తనకి షాక్ ఇవ్వాలని అన్నాను. ‘‘ఔనా! నేను కూడా సుబ్బ రామయ్యను చేసుకోవాలని కలలు కన్నాను. కానీ వాడికి బొత్తిగా సంపాదన లేదు. అందుకే నిన్ను చేసుకున్నాను’’ పార్వతి ఎంతో మామూలుగా చెప్పేసింది. తనకి షాక్ ఇవ్వాలని నేను షాక్ తిన్నాను. తర్వాత్తర్వాత నాకు అర్థం అయింది - తను ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్టు మొహానే చెబుతుంది. కానీ ఇంకా చెప్పనిదేదో ఉన్నట్టుగా నాకు తోస్తుంది! పెళ్లి తర్వాత చాలా రోజులు దెయ్యాన్ని కలుసుకోలేదు. పిల్లలు పుట్టి వాళ్లు కొంచెం పెద్దాళ్లై నేను బాగా డబ్బు సంపాదించీ సంపాదించీ ఇక ఏం చెయ్యాలో తోచక ఊపిరి తిరగలేదు. కాసేపట్లో ప్రాణం పోతుందేమో అని పించింది. నా దెయ్యం గుర్తొచ్చి పరి గెట్టుకుంటూ వెళ్లాను. ఎప్పుడో నేను చూసినప్పుడు ఎక్కడ, ఎలా ఉందో ఇప్పుడూ అక్కడ అలానే ఉంది. ఇన్ని రోజులూ నేను తనని నిర్లక్ష్యం చేశానని కోపగించుకుంటుందేమో అనుకున్నా గానీ, ఆ ఛాయలే కనబడలేదు.‘‘నిన్ను కలుసుకోవడానికి రాలేక పోయాను. ఏం అనుకోకు. బావున్నావా?’’దెయ్యం జవాబు చెప్పలేదు. ‘‘ఏమైనా మాట్లాడు. నేను నీకోసం వచ్చాను కదా!’’మళ్లీ జవాబు చెప్పకుండా ఊరికే వుండిపోయింది. నేను చెప్పేది నిజం కాదు. నాకు తెలుసు! తనకోసం వెళ్లను. నాకోసమే తన దగ్గరికి వెళతాను. తను నాలోపలి ఉద్వేగాలకి ఒక అవసరం.నేను చాలాసేపు నా పిల్లల గురించీ, నా భార్య గురించీ చెప్పాను. జీవితానికి ఎలా అలవాటు పడిపోయానో తెలియ పరిచాను. చాలాసేపటికి వుషారొచ్చింది. ఇంక వెళ్లొస్తానని చెప్పి వచ్చేశాను. తర్వాత ఓ రోజు ఆఫీసులో కూచుని పనిచేస్తున్నానా, హఠాత్తుగా నా దెయ్యం ఓ కుర్చీ లాక్కుని నా పక్కన కూచుంది. నాకు కాళ్లూ చేతులూ చల్లబడిపోయాయి. పని ఆపేసి తనని బైటికి తీసుకువెళ్లాను. ‘‘నువ్విలా ఇక్కడికి రాకూడదు. ఇది నా ఆఫీస్. ఇక్కడ నేను పనిచేసుకోవాలి. తేడా వస్తే నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు’’ వివరించాను. వెళ్లిపోయింది. వెనక్కి తిరిగి ఓసారి నావంక చూసింది. నాకేదో తప్పు చేసిన భావన కలిగింది. నా బాధ ఎవరికైనా చెప్పి ఓదార్పు పొందేది కాదు. అది నా ఒక్కడికే పరిమితమైన రహస్యం. ఓ రాత్రి పడక గదిలో నిద్రపోతు న్నానా, ఎవరో తట్టి లేపినట్టు తోచింది. కళ్లు తెరిచి చూస్తే నా దెయ్యం! ఉలిక్కి పడ్డాను. దెయ్యం దాని కొంపలో ఉన్నప్పుడే బాగుండింది. ఇలా ఏకంగా ఇంటికి వచ్చేస్తే చాలా ఖంగారయ్యింది.‘‘చాన్నాళ్లుగా నన్ను పలకరించను రాలేదే?’’ అడిగింది. ‘‘పని ఒత్తిడిలో కుదర్లేదు’’ చెప్పాను. ‘‘ఏం పని?’’ ‘‘ఏం పనంటే ఏం చెప్పను? రోజువారీ చాలా పనులు ఉంటాయి.’’ ‘‘ఎన్ని పనులున్నా నీ భార్యాపిల్లల కోసం నీకు సమయం దొరుకుతుంది కదా. నన్నెందుకు పట్టించుకోకుండా వదిలేశావు?’’ నిష్ఠూరమాడింది. ‘‘అంటే మనుషులకి తప్పనిసరి బాధ్యతలు కొన్ని ఉంటాయి. నువ్వు నా బాధ్యత కాదు. మనసు నాకు ఇచ్చిన ఓ వెసులుబాటువి. నువ్వు నా అశాంతివీ, నా శాంతివి కూడానూ! దయచేసి తొందరగా ఇక్కణ్నించి వెళ్లిపో. నా భార్య చూస్తే బావోదు. భయపడుతుంది’’ అని పక్కకి తిరిగి చూస్తే పక్కన పార్వతి లేదు. బాత్రూమ్కి వెళ్లినట్టుంది. తనొచ్చేలోగా ఈ దెయ్యాన్ని పంపించేయాలి.‘‘నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా. నిన్ను కలవకుండా ఎన్నాళ్లని ఉంటాను? తప్పకుండా వస్తాను. నా భార్య నిన్ను చూస్తే అదురుబోతుంది. ఇంక వెళ్దూ’’ బతిమాలుతున్నట్టు అనేటప్పటికి విచిత్రంగా నవ్వుకుంటూ కిటికీలోంచి బైటికి పోయింది. ఇంక నిద్రపట్టలేదు. మొహమాటం పక్కనబెట్టి దెయ్యం సంగతి పార్వతితో చెప్పేయాలనుకున్నాను. పార్వతి ఎంతకీ రాలేదు. బాత్రూమ్ తలుపు కొట్టాను. తలుపు తీసే ఉంది. లోపల పార్వతి లేదు. నా గుండె ఝల్లుమంది. ఈ దెయ్యం నా భార్యని చూసి అసూయపడి ఎత్తుకు పోలేదు కదా. కానీ అది నాకు, నా వాళ్లకీ హానిచేసే రకం కాదు. మరైతే పార్వతి ఎటు వెళ్లినట్టు? ఇల్లంతా వెతికాను. బాల్కనీ తలుపు తీసుంది. ఇంత అర్ధరాత్రి వేళ బాల్కనీలోకి ఎందుకు వెళ్లింది? బాల్కనీ బెంచ్‌మీద పార్వతి కూచుని ఉంది. పక్కన ఎవరో మగమనిషి ఉన్నాడు! అతని భుజం మీద తల ఆనించి ఏదో మాట్టాడుతోంది. అతను వింటు న్నాడు. వెన్నెల వెలుగులో అతను నాకు కనబడ్డాడు. అరె, వాడు మనిషిగాదు, దెయ్యంగాడు! దెయ్యం సావాసం వల్ల చీకట్లో కూడా నే దెయ్యాన్ని గుర్తుపట్ట గలను. ఎలాగంటే దెయ్యాల తల చుట్టూ హీనమైన నీలం రంగు మెరుపు చక్రం ఉంటుంది! వాడి వంకీల జుట్టు, భుజాలూ నాక్కనబడుతున్నాయి. చొక్కా వేసుకో లేదు. ఇంకా ఏం వేసుకున్నాడో లేదో చూసే ధైర్యం నాకు లేకపోయింది (అంటే ఆడ దెయ్యాలకి డ్రెస్ కోడ్ ఉంది కానీ మగ వాటికి ఉన్నట్టు ఎక్కడా ఎవరూ చెప్పలేదు కదా! అందుకే వేసుకున్నట్టు లేదు) అతని ఒళ్లంతా పచ్చబొట్లు పొడిచి ఉన్నాయి! ఐతే ఒకటి గమనంలోకి వచ్చింది. నాలానే నా పెళ్లానికి కూడా ఓ పెంపుడు దెయ్యం ఉంది (దెయ్యం స్త్రీ లింగమో, దానికి పురుష లింగమో రెంటినీ వేరువేరుగా చెప్పడానికి వేరు వేరు పదాలున్నాయేమో కనుక్కోవాలి). కాసేపు అలానే చూసి నేను మెదలకుండా లోపలికి వచ్చేశాను. తీరా చూస్తే నా దెయ్యం నా మంచం మీద నాకోసం చూస్తూ ఉంది. ‘‘బాధగా ఉందా?’’ అడిగింది. లేద న్నట్టు తల ఊపాను. బాధ లేదు, పశ్చా త్తాపంగా అనిపించింది. కాసేపు చేతులు నలుపుకున్నాను. ఈ స్థితికి కారణం ఏంటో ఆలోచించాను. అసలు నిజంగా సమస్య ఏమైనా ఉందా లేదా అర్థం కాలేదు. నా దెయ్యం నాకేదైనా సాంత్వన ఇస్తుందేమో అని దాని కళ్లలోకి చూశాను. అది నా నుదుటిని ముద్దుపెట్టుకుని, చూస్తూండ గానే దట్టమైన పొగలా మారిపోయింది. నిదానంగా నా ఊపిరితోపాటు నాలోకి వెళ్లిపోయింది. నాకు క్షణకాలం అసౌక ర్యంగా అనిపించింది గానీ కాసేపటికి అలవాటైంది. తరవాత...!ఇది చాలా రహస్యం. నేను ఒకే మనిషిని కానీ నాలో రెండు ఆత్మలు న్నాయి. మీరు నాకు చాలా బాగా కావల సినవాళ్లు కావడం మూలాన ఇదంతా నేను మీకు చెప్పాను. మీరు మాత్రం ఎవరికీ చెప్పకండే! ‘‘నువ్వెలా చచ్చిపోయావు?’’ ‘‘గుర్తులేదు. బతికి వున్నప్పుడు తోటల్లో తిరుగాడుతూ కులాసాగా ఉండేదాన్ని. అంత మటుకే గుర్తుంది’’ కళ్లనీళ్లు పెట్టుకుంది. ఓ రోజు ఆఫీసులో కూచుని పనిచేస్తున్నానా, హఠాత్తుగా నా దెయ్యం ఓ కుర్చీ లాక్కుని నా పక్కన కూచుంది. నాకు కాళ్లూ చేతులూ చల్లబడి పోయాయి. -
ఒక రాత్రి ఆ తోటలో..!
* తోటలో యువతి... * తిరుగుతూ పాట పాడుతోంది. * నవ్వుతోంది... ఏడుస్తోంది. * మనిషా? దెయ్యమా?? ఇంగ్లండ్‌లోని బ్రిమింగ్‌హామ్ టౌన్ ఎలా ఉంటుంది? ఒకప్పుడు దానికి ఉన్న పేరు మార్కెట్ టౌన్. దీనికి సార్థకత చేకూరుస్తున్నట్లుగానే ఉంటుంది ఆ టౌన్. మార్కెట్ మాదిరిగానే గజిబిజిగా, బిజీ బిజీగా ఉంటుంది. అలాంటి పట్టణంలో ఒక తోటను ఆనుకొని ఉంది విక్టోరియా విల్లా. ‘‘ఎంత అందంగా ఉంది! ఎంత రాజదర్పంతో ఉంది!’’ అనుకుంటారు కొత్తవాళ్లు. ‘‘ఎంత క్రూరంగా ఉంది, ఎంతగా భయపెడుతోంది’’ అని వణికి పోతారు పాతవాళ్లు. ఇప్పుడు ఆ పాతభవంతికి సరికొత్త కళ వచ్చింది. ఎందుకంటే ఆ భవంతిని గ్రేగ్ క్లార్క్ అనే ప్రొఫెసర్ కొనుగోలు చేశాడు. తెలియక కాదు... తెలిసీ తెలియక కాదు... బాగా తెలిసే ఈ భవంతిని కొనుగోలు చేశాడు. దెయ్యాల సంఘం ఒకటి ప్రొఫెసర్ క్లార్క్‌ను కలుసుకొని ‘మేము ఉన్నాం మహాప్రభో’ అని వినతిపత్రం సమర్పించినా సరే... ఆ భవంతిని కొనడానికి వెనుకంజ వేసేవాడు కాదు. ప్రొఫెసర్‌కు ఇద్దరు కూతుళ్లు. ఇద్దరు కొడుకులు. అందరిలోకెల్లా పెద్దది హన్నా బెట్స్. మిగతా పిల్లలకు తల్లి దండ్రుల కంటే అక్క దగ్గరే చనువు ఎక్కువ. విల్లాలో ఉన్న ఆరు బెడ్ రూమ్‌లలో పిల్లలు స్వేచ్ఛగా తిరుగు తుంటారు. ఒకరోజు మాత్రం పెద్ద తమ్ముడు టామ్ బిక్కచచ్చి వచ్చాడు. ‘‘అక్కా... ఆ గదిలో ఒక ముసలాయన ఉన్నాడు. ఏరా మనవడా, ఇప్పుడా రావడం’’ అని నా దగ్గరికి రాబోతుంటే భయంతో పరుగెత్తుకు వచ్చాను’’ అన్నాడు. నవ్వింది బెట్స్. మరో రోజు చెల్లి మేరీ గడ గడ వణుకుతూ... ‘‘అక్కా... ఆ గదిలో గెడ్డం ముసలోడు తిరుగుతున్నాడు’’ అంది. ఈసారి మాత్రం నవ్వలేదు బెట్స్. ఆలోచించింది. అమ్మతో చెబితే నాన్నకు చెప్పమంటుంది. నాన్నతో చెబితే ఏం జరుగుతుందో తనకు తెలుసు. కాబట్టి తానే ఆరోజు ఒంటరిగా ఆ గది లోకి వెళ్లి, నవల చదువుకోవడం ప్రారంభించింది. అయిదు నిమిషాల తరువాత... ఏడుస్తున్న ముసలిగొంతు వినిపించింది. ‘‘ఎవరది?’’ అని అరిచింది బెట్స్. జవాబు లేదు. కిటికీ రెక్కలు ఊగాయి. ఆ తరువాత ఏడుపు దానికదే ఆగిపోయింది. ఒకరోజు ప్రొఫెసర్ కుటుంబం సినిమాకు వెళ్లి, హోటల్లో భోజనం చేసి ఇంటికి తిరిగొచ్చింది. లోపల ఏవో గొంతులు, వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. ‘‘లోపల ఎవరో ఉన్నారు’’ భయంగా అన్నారు పిల్లలు. ‘‘లోపల పిల్లులు పోట్లాడుకుంటున్నాయి. వాటి శబ్దానికి కూడా భయపడితే ఎలా?’’ అని పిల్లల భుజాల మీద చేయివేసి ధైర్యం చెప్పాడు ప్రొఫెసర్. లోపల ఎవరూ లేరా?? ఒకరోజు రాత్రి ప్రొఫెసర్ భార్య మేడపైగది కిటికీలో నుంచి తోట వైపు చూస్తోంది. ఓ యువతి వెన్నెల్లో తిరు గుతూ పిచ్చిగా నవ్వుతోంది. పాడుతోంది. అంతలోనే ఏడుస్తోంది. ‘‘కొంపదీసి దెయ్యమైతే కాదుగదా!’’ అనుకుంది ప్రొఫెసర్ భార్య. ఒకరోజు ప్రొఫెసర్ క్లార్క్ హడావుడిగా వచ్చి ‘‘ఈ ఇంటిని అమ్మేశాను. త్వరలో మనం ఒక కొత్త ఇంట్లోకి మారబోతున్నాం’’ అన్నాడు. వారం తిరిగేలోపే ఆ కుటుంబం కొత్తింటికి మారింది. ఆగమేఘాల మీద విక్టోరియా విల్లాను ఎందుకు అమ్మేశాడో ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు ప్రొఫెసర్ క్లార్క్. హన్నా బెట్స్ ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తల్లి. లండన్‌లో ఉంటోంది. సుదీర్ఘకాలం తరువాత తన ఫ్రెండ్స్‌తో కలసి విక్టోరియా భవంతికి వెళ్లింది. ఆ భవంతి అప్పటిలాగే గంభీరమైన మౌనంతో ఉంది. చుట్టుపక్కల జనాల ద్వారా... ఈ భవంతి గురించి ఎన్నడూ వినని కొత్త విషయం ఒకటి తెలిసింది. విక్టోరియా విల్లాను ఒక డాక్టర్ చాలా ఇష్టంగా కట్టించుకున్నాడు. అతడి మన వడిని డబ్బు కోసం కొందరు కిడ్నాప్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశాడనో, అడిగినంత డబ్బు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నాడనే కారణంతోనో పిల్లాడిని చంపేశారు. అది తట్టుకోలేక పిల్లాడి తల్లి చనిపోయింది. ‘‘కూతురు, మనవడు చనిపోయాక నేనెందుకు ఈలోకంలో...’’ అని ఆ డాక్టర్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి వికోర్టియా విల్లాలో, చుట్టుపక్కలా తండ్రీకూతుళ్ల్ల ఆత్మలు సంచరిస్తున్నాయనేది ప్రచారంలో ఉన్న కథ. బెట్స్ విక్టోరియా విల్లాలోని ఆరు గదుల్లోకీ వెళ్లింది. ఆమెకు మళ్లీ ముసలి డాక్టరు అరుపు, వెన్నెల రాత్రుల్లో తోటలో యువతి ఏడుపు, నవ్వు మళ్లీ వినిపించినట్లుగా అనిపించింది! -
బంగారు దెయ్యం
పిల్లల కథ చాలా కాలం నుండి ఒక జువ్వి చెట్టు మీద ఓ దెయ్యం నివాసముంటుండేది. అది ఎవరినీ ఏమీ హింసించేది కాదు. ఆ ఊరి దొంగలు ఆ చెట్టుకింద దొంగిలించిన వాటిని పంచుకునేవారు. ఒకరోజు రాత్రి సమయంలో బంగారు వస్తువులు పంచుకుంటుండగా, చెట్టుమీద నుండి దెయ్యం దబ్బున కిందికి జారిపడింది. దాంతో దొంగలు బంగారాన్ని విడిచి పరుగుతీశారు. దెయ్యం ఆ బంగారు వస్తువుల్ని మూటలో బిగించి, చెట్టు పలవల మధ్య దాచింది. కొంతకాలానికి ఈ విషయం బైటపడింది. విన్నవారందరూ ఆ బంగారం దక్కించుకోవాలనుకున్నారే తప్ప ప్రయత్నం చేయలేకపోయారు. ఒకరోజు ముగ్గురు సాహసవంతులు భూత వైద్యుడిని వెంటబెట్టుకొని దెయ్యం వద్దకు బయలుదేరారు. దారిలో వారికి కర్రపుల్లలు అమ్ముకునే బీద సీనయ్య కలిసి విషయం తెలుసుకొని, తనకీ ఆశపుట్టి వారి వెంట బయలుదేరాడు. దెయ్యం వారిని చూసిన వెంటనే, ‘‘మీరు ఏ ఉద్దేశంతో నా వద్దకు వచ్చారో నాకు తెలుసు. నన్ను బంధించవద్దు. మీకు కావలసింది బంగారమే కదూ. ఇస్తాను. అయితే ఒక షరతు. మీకు బంగారం ఇస్తే ఎవరేం చేస్తారో నాకు చెప్పండి. అది విని నేను మీలో ఎవరికి ఇవ్వాలో ఇస్తాను’’ అంది. మొదటి వ్యక్తి, ‘‘నేను నాకున్న కొద్దిపాటి ఆస్తిని అమ్ముకొని, వ్యాపారం మొదలుపెట్టాను. దానిలో బాగా నష్టపోయాను. నువ్వు బంగారం నాకిచ్చిన పక్షంలో, తిరిగి వ్యాపారం ప్రారంభించి, పోయిన నా ఆస్తిని సంపాదించుకుంటాను’’ అన్నాడు. మిగతావారు ఏవేవో వారి బాధలు చెప్పుకున్నారు. సీనయ్యతో దెయ్యం, ‘‘నువ్వేం చేస్తావో చెప్పు?’’ అంది. సీనయ్య, ‘‘నిజం చెప్పాలంటే వీళ్లందరి కంటే బీదవాడిని. ఒకపూట తిండి కూడా సరిగ్గా దొరకదు. నాకూ బోలెడన్ని ఆశలు, కోరికలు ఉన్నాయి. నువ్వు అంటూ బంగారం ఇస్తే, దాంతో కొన్ని ముఖ్యమైన సమస్యలు తీర్చుకొని, మిగతా బంగారంతో నాలా కష్టాల్లో ఉంటూ పూటకు తిండిలేని వారి సమస్యలు తీరుస్తాను’’ అన్నాడు ధైర్యంగా. సీనయ్య ఉదార బుద్ధికి దెయ్యం ఒక్కసారిగా చలించిపోయింది. ‘‘మనిషి ఆశాజీవి! దొరికినదంతా తానే అనుభవించి సుఖపడాలనుకున్న రోజులివి. అటువంటిది నువ్వు కష్టాలు అనుభవిస్తూ పొరుగువాడి కష్టాన్ని తీర్చడం అన్నది గొప్ప మహత్తర విషయం. నిన్ను అభినందిస్తూ ఈ బంగారం ఇస్తున్నాను’’ అని బంగారం మూట అందించింది. దెయ్యం మనసులో... దొంగల బంగారం ఓ మంచి పనికి పనికొచ్చింది అనుకున్నది. - ఆరుపల్లి గోవిందరాజులు -
అమ్మో దెయ్యం..!
కర్ణాటకలోని మైసూర్ కోర్టు హాలులో దెయ్యం సంచరిస్తుందనే పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. దెయ్యం దెబ్బతో ఓ కోర్టు హాలు కొన్ని నెలలుగా మూతపడటం విశేషం. తొమ్మిది నెలల కిందట మూతబడిన సదరు కోర్టు హాలును ఇప్పటికీ తెరవొద్దంటూ న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. అయితే మరికొందరు లాయర్లు మాత్రం వారితో విభేదిస్తున్నారు. న్యాయవాదులు రెండు గ్రూపులుగా విడిపోయి ఇదే విషయంలో పరస్పరం ఘర్షణలకు దిగుతున్నారు. దీంతో ఆ కోర్టు హాలును తెరిచే సాహసం ఎవరూ చేయడం లేదు. గతంలో ఇదే కోర్టులో జడ్జిగా పనిచేసిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయి దెయ్యమై అందులో సంచరిస్తున్నాడనే పుకార్లతో ఆ హాలును గత ఏడాది మే నెలలో మూసివేశారు. ప్రస్తుతం ఇందులో విరిగిపోయిన బల్లలు, కుర్చీలు వేసి స్టోర్ రూమ్‌గా వాడుతున్నారు. ఎన్నో ముఖ్యమైన కేసుల వాదనలకు ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయవాదులకు నెలవుగా నిలిచిన ఆ కోర్టు హాలు... మూఢనమ్మకాల కారణంగా మూతపడటం గమనార్హం. న్యాయవాదులే పట్టుబట్టి దగ్గరుండి మరీ ఆ హాలును మూయించేశారట. అది కాకుండా కోర్టు అధికార వర్గాలు కూడా ఆ గదిని తెరవాలన్న ప్రయత్నం చేయకపోవడం, అందులో ఎవరికీ పోస్టింగ్ ఇవ్వాలన్న ఆలోచన చేయకపోవడం మరీ విచిత్రంగా మారింది. ఒక వేళ తెరవాలని అనుకుంటున్నప్పటికీ దెయ్యాలను పారద్రోలే పూజలు చేయించే వరకు ఆ కోర్టు హాలును తెరవొద్దని జ్యోతిష్యులు సూచించారట. ఇంతకి ఆ హాలులో దెయ్యం ఉందా లేదా అనేది ఇప్పటికీ సస్పెన్స్‌గా మారింది. -
దెయ్యం బాబోయ్!
గది మార్చమన్న పాక్ క్రికెటర్ సొహైల్ లింకన్: పాకిస్థాన్ యువ క్రికెటర్ హారిస్ సొహైల్‌కు హోటల్ గదిలో వింత అనుభవం ఎదురైంది. తనకు కేటాయించిన గదిలో దెయ్యాలు తిరుగుతున్నాయంటూ బెంబేలెత్తిపోయాడు. ప్రస్తుతం పాక్ జట్టు న్యూజిలాండ్‌లో ఉంది. ఇక్కడ సోమవారం ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడిన జట్టు, స్థానిక హోటల్లో బస చేసింది. అర్ధరాత్రి నిద్రలో ఉలిక్కి పడి లేచిన సొహైల్, ఏవో వింత దృశ్యాలు తన గదిలో కనిపించాయని, అవి దెయ్యాలే అని చెప్పుకొచ్చాడు. పాపం... ఈ దెబ్బకు అతనికి ఒక్కసారిగా తీవ్ర జ్వరం కూడా వచ్చేసింది! దాంతో వెంటనే హోటల్ సిబ్బంది సొహైల్‌ను మరో గదిలోకి మార్చి ఉపశమనం కలిగించారు. -
దెయ్యాల గోల..!
ఈ వారమంతా దెయ్యాల గోలతో బాలీవుడ్ షేకైపోయింది. ఏ పార్టీకెళ్లినా... ఎవర్ని చూసినా... భూతాలు, పిశాచాల్లా భయపెట్టేశారు. సమాధులు, బూజు పట్టిన బురుజుల సెట్టింగుల్లో చిందులేసి దుమ్ములేపారు. ప్రియాంకాచోప్రా, సన్నీ లియోన్, బిపాసాబసు... ఎవరూ మినహాయింపు లేదు. ఎవరి ఫ్రెండ్ సర్కిల్‌తో వారు మాస్క్‌లేసుకుని తెగ ఎంజాయ్ చేశారు. హాలోవీన్ ఫెస్టివల్లో భాగమిదంతా! ఆ ఉత్సాహం అంతటితో ఆగలేదు. ఆ ఫొటోలను ఇదిగో ఇలా సోషల్ నెట్‌వర్క్‌ల్లో పోస్ట్ చేసి ప్రపంచమంతా ఫియర్ ఫీవర్ పాస్ చేశారు. -
అదిగో దెయ్యం... ఇదిగో ఫోటో!
హారర్ ఇంగ్లాండ్‌లోని వెస్ట్‌మిడ్‌ల్యాండ్‌లో ఉన్న డూడ్లే కోట ప్రస్తావన రాగానే ‘‘మీరు మాట్లాడేది ఆ దెయ్యాల కోట గురించేనా?’’ అనడం పరిపాటి. ఈ దెయ్యాల కోట మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కోటను ఇటీవల సందర్శించిన డీన్, ఎమీ హర్పర్ అనే దంపతులకు ‘బూడిదరంగు దెయ్యం’ కనిపించిందని, వాళ్లు ఆ దెయ్యాన్ని ఫోటో కూడా తీశారని ఇంగ్లాండ్‌లోని చిన్నా, పెద్దా పత్రికలన్నీ కోడై కోస్తున్నాయి. కోటలో దెయ్యం... అనేది ఎంతవరకు నిజం అనేది తెలుసుకోవడానికి గతంలో చాలామంది రకరకాల ప్రయత్నాలు చేశారు. ‘‘అర్థరాత్రి దాటిన తరువాత... వింత వింత శబ్దాలు వినిపించాయి’’ అని చెప్పిన వాళ్ల సంఖ్య తక్కువేమీ కాదు. ఎమీ హర్పర్ తీసిన ఫోటోలోని దెయ్యం(?) తన ఎడమ చేతికి వాచ్ ధరించి ఉంది. ‘‘దెయ్యాలు గడియారాలు ధరిస్తాయా?!’’అని లా పాయింట్ లేవనెత్తారు హేతువాదులు. థామస్ హాబెస్ అనే ప్రసిద్ధ తత్వవేత్త 1651లో ‘‘అసలు దెయ్యాలు దుస్తులు ఎందుకు ధరించాలి? వాటికి ఆ అవసరం ఏమిటి? ఒకవేళ వేసుకున్నా చూసేవారెవరు? బర్త్‌డే సూట్లో కనిపించవచ్చు కదా!’’ అని. ఇంతకీ బూడిదరంగు దెయ్యం వాచ్ ఎందుకు ధరించినట్లు?! ఫ్లాష్‌బ్యాక్ డూడ్లె కోట 1071లో నిర్మాణం అయింది. డోర్తి బెమెంట్ అనే రాణి ఇందులో నివాసం ఉండేది. ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చే ముందు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ రెండు కోరికలు కోరింది. 1.తనతో పాటు బిడ్డ చనిపోతే...ఇద్దరినీ ఒకే సమాధిలో పాతి పెట్టాలి. 2. తన అంత్యక్రియలకు భర్త హాజరు కావాలి. దురదృష్టవశాత్తు...తల్లీబిడ్డా ఇద్దరు చనిపోయారు. కానీ ఆమె రెండు కోరికలూ నెరవేరలేదు. దీంతో ప్రతికారేచ్ఛతో డోర్తి రాణి బూడిదరంగు దెయ్యంగా మారి ఆ కోటలో తిష్టవేసింది అనేది ఒక కథ. -
అసలక్కడ దెయ్యాలే లేవు!!
-
లిప్ట్ ప్లీజ్...
దెయ్యం అన్న మాట వింటేనే గుండె గుభేల్మంటుంది. ఇక దెయ్యం ఎదురుపడితే? వచ్చి మన పక్కనే కూచుంటే? మనతో మాట కలిపితే? ఆలోచిస్తుంటేనే చెమటలు పట్టేయడం లేదూ! చికాగోలో ఓ దెయ్యం ఇలాగే అందరికీ చెమటలు పట్టించింది. కంటి మీద కునుకు లేకుండా చేసింది. నమ్మశక్యంగా లేదా? అయితే ఆ దెయ్యం కథని మీరూ చదవండి! అమెరికాలోని చికాగో... 1939వ సంవత్సరం. రాత్రి తొమ్మిది గంటలు దాటి పదిహేను నిమిషాలయ్యింది. ఒక తెల్లటి కారు వచ్చి ‘ఒ.హెన్రీ బాల్రూమ్’ ముందు ఆగింది (దీన్ని ఇప్పుడు విల్లోబ్రూక్ బాల్రూమ్ అంటున్నారు). లేత గ్రే కలర్ సూట్లో హుందాగా దిగాడు జెర్రీ పాల్యూస్. అతడిని చూస్తూనే వాచ్‌మేన్ ఆనందంగా సెల్యూట్ చేశాడు. అతడి అభివందనాన్ని స్వీకరించినట్టుగా తలాడించాడు జెర్రీ. లోనికి వెళ్తూ వాచ్‌మేన్ చేతిలో ఓ కరెన్సీ నోటు పెట్టాడు. నోటు చూడగానే అతగాడి ముఖం మరింత వికసించింది. కృతజ్ఞతగా మరో సెల్యూట్ కొట్టాడు. తనదైన స్టయిల్లో అందంగా నవ్వి లోనికి నడిచాడు జెర్రీ. ఓ కోటీశ్వరుడు తన పుట్టినరోజు ఫంక్షన్‌ని జరుపుకుంటున్నాడు ఆ రోజు. అతడి స్థాయి ఏమిటో ఆ హాల్ అలంకరణను బట్టే అంచనా వేసేయవచ్చు. అంత అద్భుతంగా ఉంది డెకొరేషన్. డిజైన్ చేసినవాడిని మనసులోనే మెచ్చుకుంటూ హాల్లోకి అడుగు పెట్టాడు జెర్రీ. అప్పటికే హాలంతా సందడి సందడిగా ఉంది. సముద్రంలో కెరటాలు ఎగసిపడుతున్నట్టుగా అందరిలోనూ హుషారు ఉరకలు వేస్తోంది. అలుపూ సొలుపూ లేకుండా ఆడా మగా కలిసి స్టెప్పులేస్తున్నారు. కొందరి చేతుల్లో వైన్ గ్లాసులున్నాయి. కొందరి చేతుల్లో కాక్టెయిల్ గ్లాసులున్నాయి. మధ్యమధ్యలో వాటిని సిప్ చేస్తూ మరీ హుషారెత్తిపోతున్నారు. అందరినీ ఓసారి పరికిస్తూ పుట్టినరోజు చేసుకుంటున్న వ్యక్తి దగ్గరకు వెళ్లాడు జెర్రీ. తాను తెచ్చిన గిఫ్టును చేతిలో పెట్టి, విషెస్ చెప్పాడు. తర్వాత ఓ వైన్ గ్లాస్‌ను అందుకుని, ఓ పక్కగా ఉన్న టేబుల్ దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు. డ్యాన్స్ చేస్తున్నవాళ్లను చూస్తూ వైన్‌ని సిప్ చేస్తున్నాడు. అనుకోకుండా అతడి చూపు... ఓ మూలన వేసున్న టేబుల్ వైపు మళ్లింది. అక్కడో అమ్మాయి ఒంటరిగా కూర్చుని ఉంది. పాల నురుగులాంటి తెల్లని గౌను వేసుకుంది. గాలికి ముంగురులు ఎగిరి ముఖమ్మీద పడుతుంటే మృదువుగా ఎగదోసుకుంటోంది. హోరెత్తుతున్న సంగీతానికి పాదాలను మెల్లగా కదిలిస్తోంది. జెర్రీ మనసులో చిన్న అలజడి. ఎంత ప్రయత్నించినా చూపు తిప్పుకోలేకపోయాడు. కోటీశ్వరుడైన తనను బుట్టలో వేసుకోవడానికి చాలామంది అమ్మాయిలే ప్రయత్నించారు. కానీ వాళ్లలో ఎవరిని చూసినప్పుడూ ఇలాంటి అనుభూతి కలగలేదు. ఆమె దగ్గరకు వెళ్లాలని మనసు పరితపిస్తోంది. కంట్రోల్ చేసుకోలేకపోయాడు. లేచి మెల్లగా ఆమె దగ్గరకు వెళ్లి ‘హలో’ అన్నాడు. తల తిప్పి చూసిందామె. కింద నుంచి పైకి ఓసారి పరికించి చూసి ‘హలో’ అనేసి ముఖం తిప్పుకుంది. ‘‘నేనిక్కడ కూర్చోవచ్చా’’ అన్నాడు. ఆమె ఓసారి చుట్టూ ఉన్న టేబుల్స్ వైపు చూసింది. అవన్నీ ఉన్నాయిగా అన్నట్టున్నాయి ఆమె చూపులు. ఆ భావం అర్థమై... ‘‘అవన్నీ ఖాళీగానే ఉన్నాయనుకోండి. కానీ ఒక్కడినే కూర్చుంటే బోర్ కొడుతోంది. అందుకే ఇక్కడ కూర్చుందామని’’ అన్నాడు నవ్వుతూ. ఆమె కూర్చోమన్నట్టు సైగ చేసింది. హమ్మయ్య అనుకున్నాడు. మెల్లగా మాట కలిపాడు. కబుర్లలోకి దింపాడు. ఇంప్రెస్ చేశాడు. తనతో డ్యాన్స్ చేయడానికి ఒప్పించాడు.ఆమెతో సన్నిహితంగా మెలగడం జెర్రీ మనసును పులకింపజేస్తోంది. ఆమె నడుము చుట్టూ చేయి వేసి నర్తిస్తుంటే... హృదయం ఉప్పొంగిపోయింది. ఆ క్షణమే నిర్ణయించేసుకున్నాడు... ఆమెకి ఎప్పటికీ దూరం కాకూడదని! తెల్లవారుజా మున మూడు అవుతుండగా చెప్పాడు... ‘‘మేరీ... ఐలవ్యూ’’. ఆమె కళ్లలో మెరుపులు మెరిశాయి. సిగ్గుతో పెదవులు అదిరాయి. ‘‘ఇక నేను వెళ్తాను. చాలా టైమయ్యింది’’ అంది దూరం జరుగుతూ. ‘‘సమాధానం చెప్పవా’’ అన్నాడు ఆమె కళ్లలోకి చూస్తూ. సిగ్గుల మొగ్గయ్యిందామె. ‘‘సరేలే... టైమ్ తీసుకుని చెప్పు. నేను నిన్ను డ్రాప్ చేస్తాను పద’’ అన్నాడు జెర్రీ. అతని వెంట నడిచింది. ఇద్దరూ కారులో బయలుదేరారు. దారి పొడుగునా కబుర్లలో మునిగిపోయారు. కాసేపటి తర్వాత అంది... ‘‘ఇక్కడ ఆపండి. నేను దిగుతాను.’’ ‘‘ఓహ్... ఇక్కడేనా మీ ఇల్లు?’’ ‘‘అవును. మళ్లీ కలుద్దాం.’’ ‘‘ఎప్పుడు?’’ ‘‘మీరెప్పుడంటే అప్పుడు’’ అనేసి జింకపిల్లలా చెంగు చెంగున వెళ్లిపోతుంటే జెర్రీ మనసు విహంగమై ఊహాలోకాల్లోకి ఎగిరిపోసాగింది. తన పిచ్చికి తనలో తనే నవ్వుకుని చేతులు స్టీరింగ్ మీద వేశాడు. కారు స్టార్ట్ చేస్తూ మేరీ వెళ్లినవైపే చూశాడు. అంతే... అతడి ఒళ్లు ఝల్లుమంది. కారు ఆపి, గబగబా దిగాడు. ఎదురుగా ఉన్న బోర్డుమీద ఉన్న పెద్ద పెద్ద అక్షరాలు అంత చీకట్లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి... ‘రిజరక్షన్ సిమెట్రీ’! హడలిపోయాడు జెర్రీ. చుట్టూ చూశాడు. అక్కడ ఇళ్లేమీ లేవు. అంతా శ్మశానమే. మేరీ అక్కడెందుకు దిగింది? ఎక్కడికి వెళ్లింది? కొంపదీసి కాటికాపరి కూతురా? లేక... ఇక ఒక్కక్షణం నిలబడలేకపోయాడు జెర్రీ. ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దయిపోయింది. గుండె వేగం హెచ్చింది. గబగబా కారెక్కి స్టార్ట్ చేశాడు. క్షణాల్లో అక్కడ్నుంచి దూసుకుపోయాడు. పాపం జెర్రీకి తెలియదు... ఆమె ఎవరో. తెలిసివుంటే అసలు ఆమెతో పరిచయం చేసుకునేవాడు కాదు. ఆమెకు లిఫ్ట్ ఇచ్చేవాడు కూడా కాదు. ఇంతకీ ఆమె ఎవరు?????? ఆ రోజు రాత్రి జెర్రీకి జరిగిన అనుభవం అతడికి కొత్త కావచ్చు. కానీ అప్పటికే చాలామందికి అలా జరిగింది. కానీ ఎవరూ నోరు మెదపలేదు. తొలిసారిగా జెర్రీ తన అనుభవాన్ని అందరితో మేరీ కథ ప్రపంచానికి తెలిసి వచ్చింది. చికాగోలోని ఒ.హెన్రీ బాల్రూమ్కీ, రిజరక్షన్ సిమెట్రీకీ మధ్య ఉన్న దారిలో ప్రయాణించిన చాలామందికి తెలుసు మేరీ గురించి. తెల్లని గౌను వేసుకుని, రోడ్డు పక్కన నిలబడి లిఫ్ట్ అడిగేది. ఎక్కించుకున్నవాళ్లని శ్మశానం దగ్గరకు వచ్చాక ఆపమనేది. ఆమె ఆపమన్నది శ్మశానం దగ్గర అని వాళ్లు తెలుసుకునేసరికి మాయమైపోయేది. ఆ విషయాన్ని చాలామంది చాలాసార్లు చెప్పారు. కానీ అది భ్రమ కావచ్చు అని అంతా కొట్టి పారేశారు. కానీ జెర్రీకి కలిగిన అనుభవం గురించి విన్న తర్వాత అవాక్కయ్యారు. ఆమె తనతో రాత్రంతా డ్యాన్స్ చేసిందనీ, తాను ఆమెను ముద్దాడాననీ కూడా జెర్రీ చెప్పాడు. దాంతో అందరికీ మేరీ అనే దెయ్యం ఉందనే విషయం అర్థమైంది. దాంతో ఆ దారిలో వెళ్లాలంటేనే భయం మొదలైంది. విషయం తెలియని వాళ్లు వెళ్లేవారు. మేరీ బారిన పడేవారు. ఓసారి ఓ ట్యాక్సీ డ్రైవర్ ఆ దారిలో వస్తుంటే శ్మశానం గేటు లోపల ఓ అమ్మాయి కనిపించింది. గేటు ఊచలను వంచడానికి ప్రయత్నిస్తోంది. దాంతో వెంటనే దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, ఎవరో అమ్మాయి పొరపాటున శ్మశానంలో ఇరుక్కుపోయిందని, గేటు తెరవడానికి ప్రయత్నిస్తోందని చెప్పాడు డ్రైవర్. తక్షణం ఇన్స్పెక్టర్ అక్కడికి వెళ్లాడు. ఎవరూ కనిపించలేదు. కానీ రెండు ఊచలు వంగిపోయి ఉన్నాయి. వాటి మీద వేలిముద్రలు కనిపించాయి. అవి మనిషి ముద్రల్లా లేవు. విచిత్రంగా ఉన్నాయి. దాంతో పరిశోధన మొదలైంది. రిజరక్షన్ శ్మశానంలో సమాధి అయిన మేరీ పేరుగల మృతులందరి గురించీ ఆరా తీయడం మొదలుపెడితే తెలిసింది... ఆత్మగా సంచరిస్తోన్న మేరీ అసలు కథ! ఆమె పేరు మేరీ బ్రెగోవీ. చికాగోలోనే నివసించేది. 1934లో ఓ రోజు రాత్రి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఒ.హెన్రీ బాల్రూమ్కి వెళ్లింది. అక్కడ వారిద్దరికీ చిన్న తగాదా వచ్చింది. ఆ సమయంలో బాయ్‌ఫ్రెండ్ ప్రవర్తించిన తీరు ఆమెకి మనస్తాపం కలిగించింది. ఎంత గానో ప్రేమించిన వ్యక్తి తనతో అను చితంగా ప్రవర్తించడంతో తట్టుకోలేక పోయింది. ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసింది. ఒంటరిగా ఇంటికి బయలుదేరింది. కాస్త దూరం నడిచిందో లేదో ఓ ట్రక్కు వచ్చి ఆమెను గుద్దేసింది. క్షణాల్లో మేరీ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. మేరీని రిజరక్షన్ శ్మశానంలో పాతిపెట్టారు ఆమె తల్లిదండ్రులు. నాటి నుంచీ ఆమె ఆత్మ బాల్రూమ్కీ, శ్మశానానికీ మధ్య సంచరి స్తూనే ఉంది. లిఫ్ట్ అడిగి అందరినీ భయపెడుతూనే ఉంది. కానీ ఏ ఒక్క రోజూ ఎవరికీ హాని మాత్రం చేయలేదు.అయితే ఏమయ్యిందో ఏమోగానీ... 1999 తర్వాత కనిపించడం మానేసింది మేరీ. ఆమె ఆత్మకు విముక్తే లభించిందో లేక మరేదైనా కారణం ఉందో తెలియదు కానీ... మేరీని చూశామని ఆ తర్వాత ఇంకెవరూ చెప్పలేదు. మేరీ ఏమయ్యింది? ఎక్కడికి వెళ్లింది?! - సమీర నేలపూడి మేరీ చికాగోలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన దెయ్యం. కొన్ని దశాబ్దాల పాటు ఆమె వార్తల్లో ఉంది. అలాంటి ఆత్మే లేదని నిరూపించడానికి ప్రయత్నించిన చాలామందికి సైతం ఆమె కనిపించింది. దాంతో మేరీ మళ్లీ లేచింది అంటూ పలు పత్రికలు కథనాలు ప్రచురించాయి. మేరీ బ్రెగోవీకి ‘రిజరక్షన్ మేరీ’ అంటూ ముద్దు పేరు పెట్టాయి! -
'భూతానికి' జరిమానా విధించిన కోర్టు!
లండన్:జనాన్ని భయపెట్టిన ఒక దొంగ 'భూతానికి' కోర్టు జరిమానా విధించింది. బ్రిటన్ కు చెందిన ఆంటోనీ స్టాలార్డ్ ఈ ఏడాది ఒక శ్మశానంలో భూతం మాదిరిగా జనాన్ని భయపెట్టడంతో కోర్టు అతనికి భారీ జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చింది. అతను మిత్రునితో కలిసి ఫుట్ బాల్ ఆడుతున్న క్రమంలో ప్రక్కనున్న పోర్ట్స్ మౌత్ లోని కింగ్ స్టన్ శ్మశాన వాటికకు కొంతమంది జనం తమ మిత్రుల గోరీలకు నివాళలు అర్పించేందుకు వచ్చారు. ఇక స్టాలార్డ్ వారిని భయపెట్టాలని నిశ్చయించుకుని వెనక్కు నడుస్తూ దెయ్యం చేసి శబ్ధాలను కూడా జోడించాడు. దీంతో ఉలిక్కిపడ్డ వారు అక్కడ నుంచి జారుకున్నఅనంతరం పోలీస్ ఫిర్యాదు చేశారు. దీంతో స్టాలార్డ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై పలు సెక్షన్లు నమోదు చేశారు. ఇటీవలే ఈ కేసును విచారించిన కోర్టు అతనికి 75 పౌండ్లు జరిమానా విధించింది. ఇందులో 20 పౌండ్లను బాధితులకు, మరో 20 పౌండ్లను కోర్టు ఖర్చులకు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. -
పికాసో గారి దెయ్యం
మిస్టరీ పికాసో ప్రసిద్ధ చిత్రం ‘బాతింగ్ వుమన్ ఇన్ బ్లూరూమ్’లోని సౌందర్యం గురించి మాత్రమే మనకు తెలుసు. తాజా విశేషం ఏమిటంటే, అందులో ఒక ‘రహస్యం’ కూడా దాగి ఉంది. ఆ చిత్రంలో ఒక అపరిచితుడు దాగి ఉన్నాడు! ఇదేమి విచిత్రం... చిత్రంలో చిత్రమేమిటంటారా? అయితే అసలు విషయంలోకి వచ్చేద్దాం. ప్యారిస్‌లో 1901లో ‘బాతింగ్ ఉమన్...’ చిత్రాన్ని చిత్రించాడు పికాసో. ఇది ఆయనకు ఎంతో పేరు తెచ్చింది. కట్ చేస్తే... వాషింగ్టన్ డి.సీలోని ‘ది ఫిలిప్స్ కలెక్షన్’ గ్యాలరీ సంరక్షకురాలు పెట్రికా ఫవెరో ‘బాతింగ్ వుమన్...’ చిత్రాన్ని లోతుగా పరిశీలించారు. సైనికులు ఉపయోగించే నైట్ విజన్, రిమోట్ సెన్సింగ్ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ప్రత్యేకమైన కెమెరాతో సూక్ష్మ పరిశీలన చేశారు. (మామూలు కంటికి కనిపించని దృశ్యాలను దీని ద్వారా చూడడం వీలవుతుంది) ఈ క్రమంలోనే... చిత్రం వెనుక ‘చిత్రం’ కనిపించి ఆమెను ఆశ్చర్యానికి గురి చేసింది. చేతికి ఉంగరాలు, గెడ్డంతో ‘అంతర్గత చిత్రం’లో ఉన్న వ్యక్తి ఎవరు? అది పికాసో సెల్ఫ్పోర్ట్రయిట్ అనేది కొందరి అంచనా. పికాసోకు సన్నిహితుడైన ఆర్ట్ డీలర్దని మరి కొందరి అంచనా... ఈ చర్చ నేపథ్యంలోనే కొందరు వింత వాదన ఒకటి వినిపించారు. అంతర్ చిత్రంలో కనిపించేది పికాసో దెయ్యమని, తాను ప్రేమించిన ప్రతి చిత్రంలోనూ ఇలా పికాసో దెయ్యమై కొలువుంటాడని! ఒక పోర్ట్రయిట్ వేయడం, ఒకవేళ అది నచ్చకపోతే దాని మీదే మరో పోర్ట్రయిట్ వేసి రీవర్క్ చేయడం అనేది పికాసో అలవాటు అని, పికాసో గీసిన ‘ఉమెన్ ఐరెనింగ్’ పెయింటింగ్‌లోనూ ‘హిడెన్ ఇమేజ్’ కనిపిస్తుందని కళాచరిత్రకారులు కాస్త గట్టిగా చెప్పేసరికి దెయ్యం కథలు తగ్గుముఖం పట్టాయి. -
ఒబామాకు లాడెన్ దయ్యం పడితే ఎలా..
మాఫియా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రస్తుత ధ్యాస దెయ్యాల చుట్టే తిరుగుతోంది. దయ్యాల కథలతో ప్రేక్షకులను భయపెట్టించేలేకపోయిన వర్మ తన ప్రయత్నానికి ఇంకా పుల్ స్టాప్ పెట్టే దాఖలాలు కనిపించడం లేదు. తాజాగా ఐస్ క్రీమ్ చిత్రంతో మరోసారి తన హారర్ చిత్రాన్ని ప్రేక్షకుల మీదకు వదలుతున్న వర్మకు మరో దయ్యాల కథ బుర్రలో పుట్టింది. తాజాగా తన దయ్యాల కథను సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఒసామా బిన్ లాడెన్ దయ్యంగా మారి ఒబామాను పట్టేసి.. చనిపోయిన అల్ ఖైదా తీవ్రవాదులు వైట్ హౌజ్ ను ముట్టడించే కథ ఎలా ఉంటుందని వర్మ ట్వీట్ చేశారు. A great idea for hollywwood horror film ..Osama Bin Laden's ghost posesses Obama and all dead Alqaeda terrorists haunt the White House— Ram Gopal Varma (@RGVzoomin) June 16, 2014 -
దెయ్యంగా సూర్య!
కమల్‌హాసన్ తర్వాత కోలీవుడ్‌లో ప్రయోగాలపై అమితంగా ఆసక్తి కనబరిచే నటుడు సూర్య. గజనీ, సూర్య సన్నాఫ్ కృష్ణన్, సెవెన్త్ సెన్స్, మాట్రాన్... ఇలా పలు చిత్రాల్లో భిన్నమైన పాత్రలు పోషించి.. దక్షిణాది ప్రేక్షకులందరి అభిమానం చూరగొన్నారాయన. తమిళ కథానాయకుడైన సూర్యను, తెలుగు హీరోలతో సమానంగా ఇక్కడి ప్రేక్షకులు అభిమానిస్తున్నారంటే కారణం అదే. త్వరలో సూర్య మరోసారి విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు కోలీవుడ్ టాక్. వెంకటప్రభు దర్శకత్వంలో నటించడానికి ఆయన పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నారని వినికిడి. ఇందులో ఒక పాత్ర నేటి యువతరానికి ప్రతీక కాగా, మరో పాత్ర ‘దెయ్యం’. మీరు చదివింది నిజమే... సూర్య భూతంలా కనిపించనున్నారట. సూర్య స్థాయి హీరోలు ఇలా దెయ్యంలా నటించడం దక్షిణాదిన ఇదే ప్రథమం కావొచ్చు. ఆయన తరం కథానాయకుల్లో ఎక్కువ ద్విపాత్రాభినయాలు చేసింది కూడా సూర్యనే. దీనికి తోడు ఇప్పుడు దెయ్యంలా కూడా నటించనుండటం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. మరి దెయ్యంగా సూర్య ఏ మేరకు ప్రేక్షకులను భయపెడతారో చూడాలి. -
నెట్టింట్లో దెయ్యం
-
పురుడు పోసుకుంది!
అనగనగా ఓ ఊరు.. దాని పేరు వంగర.. అక్కడో ఆరోగ్య కేంద్రం ఉంది. చుట్టుపక్కల పల్లెలకు అదే ఆధారం. అయితే చిన్నాచితకా జ్వరాలకే తప్ప పురుడు పోసుకునేందుకు ఆ ప్రాంత ప్రజలు ఆ ఆస్పత్రి గడప తొక్కేవారు కాదు. 12 ఏళ్లుగా ఇదే పరిస్థితి. కారణం.. ఆ ఆస్పత్రికి దెయ్యం పట్టిందట!.. అక్కడ పుట్టే బిడ్డలను అది చంపేస్తుందట!!.. అదేం చిత్రమో.. ఇంకే ఆధారం లేకపోయినా.. దూరాభారం వెళ్లలేక గర్భిణులు, శిశువులు అసువులు బాస్తున్నా సరే.. దెయ్యం పట్టిన ఆస్పత్రికి రామంటే.. రామని.. బిగదీసుకున్నారు అమాయక పల్లెవాసులు. దాదాపు ఏడాదిన్నర క్రితం వరకు ఇదే దుస్థితి. క్రమంగా పరిస్థితి మారింది. చైతన్యం పురుడు పోసుకుంది. పండంటి బిడ్డలకు జన్మనిస్తూ పీహెచ్సీ తెగ మురిసిపోతోంది.వంగర, న్యూస్‌లైన్:.. ఆరోగ్యకరమైన ఈ మార్పునకు ప్రధాన కారకుడు పీహెచ్సీ వైద్యాధికారి సీతారాం. 2012 జూలై 25న ఇక్కడ బాధ్యతలు చేపట్టిన ఆయన పీహెచ్సీ దుస్థితి చూసి విషయమేంటని ఆరా తీశారు. ఆర్థిక, రవాణా సమస్యలతో పట్టణ ప్రాంతాలకు వెళ్లలేక ఎంతో మంది గర్భిణులు, శిశువులు మరణిస్తున్నా సరే.. ఈ పీహెచ్సీ సేవలు మాత్రం మాకొద్దు బాబోయ్ అంటూ ప్రజలు హడలిపోవడానికి కారణాలు క నుగొన్నారు. అప్పుడు అసలు విషయం తెలిసింది. సమస్యలే అసలు దెయ్యాలు మండల కేంద్రమైన వంగరతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు వైద్య సేవలు కల్పించేందుకు 2000 సంవత్సరంలో ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ) ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయి స్థలం లభించకపోవడంతో ఈ భవనాన్ని గ్రామానికి ఆనుకొని ఉన్న కొండపై నిర్మించారు. దానికి ఆనుకొనే శ్మశాన వాటిక ఉంది. కాగా పీహెచ్‌సీకి రావడానికి కూడా అప్పట్లో సరైన రవాణా సౌకర్యం ఉండేది కాదు. అతి కష్టం మీద గర్భిణులను తీసుకొచ్చినా.. సకాలంలో వైద్యం అందించి, పురుడు పోయించడానికి వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేవారు కాదు. ఇదే కారణంతో పీహెచ్సీ ఏర్పాటైన కొత్తలోనే ఓ మహిళ ప్రసవించిన వెంటనే మరణించింది. తర్వాత కొద్దిసేపటికే శిశువు కూడా మృతి చెందింది. అంతే.. అప్పటి నుంచి ఆస్పత్రిలో దెయ్యం ఉందని.. అదే తల్లీబిడ్డలను కబళించిందని ఆమె బంధువులు అపోహ పడ్డారు. అదే ఆ నోటా ఈ నోటా చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ పాకింది. ఆ భయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అప్పటి నుంచి ప్రసవాలకు ఈ ఆస్పత్రికి రావడం మానుకున్నారు. దాంతో దాదాపు 12 ఏళ్లు అక్కడ ప్రసవాలే జరగలేదు. గాయపడిన మనసులకు చికిత్స బలంగా నాటుకుపోయిన మూఢ విశ్వాసంతో గాయపడిన ప్రజల మనసులకు ముందు చికిత్స చేస్తే తప్ప పరిస్థితి మారదని, ఆస్పత్రి ప్రసవాలకు అవకాశం ఉండదని గుర్తించిన డాక్టర్ సీతారాం ఆ దిశగా కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. మొదట తమ సిబ్బందితోనే ప్రారంభించారు. పీహెచ్సీలో పనిచేసే వారితోపాటు గ్రామాల్లో తిరిగే ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బందిని పలుమార్లు సమావేశపరిచి మాట్లాడారు. ఎంత నచ్చజెప్పినా ప్రజలనుంచి దెయ్యం భయాన్ని తొలగించలేకపోతున్నామని వారు చెప్పారు. దాంతో ఆయన నేరుగా గ్రామాల్లోకే వెళ్లడం ప్రారంభించారు. సిబ్బంది సహాయంతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేశారు. పల్లెకుపోదాం, గ్రామదర్శిని, గ్రామ సభలు, టీకా, పల్స్ పోలియో కార్యక్రమాలను కూడా ఇందుకు ఉపయోగించుకున్నారు. ఏ చిన్న సందర్భం వచ్చినా ఆస్పత్రి ప్రసవాలపై చైతన్యం కలిగించేందుకు వినియోగించుకున్నారు. ఆస్పత్రిలో దెయ్యం లేదని, అదంతా అపోహ, భయమేనని స్పష్టం చేస్తూ గర్భిణులను తీసుకురండి.. ప్రసవం చేయించి.. సురక్షితంగా పంపించే పూచీ నాదని’ భరోసా ఇస్తూ.. మెల్లగా వారి మనసుల్లో గూడు కట్టుకున్న భ యాన్ని తొలగించారు. స్వల్ప కాలంలోనే ఎంతో మార్పు అంతే మార్పు మొదలైంది. గత ఏడాది మే నెల నుంచి గర్భిణులు పీహెచ్సీ తలుపు తట్టడం ప్రారంభించారు. మొదట్లో ఒకరిద్దరే రాగా.. వారికి సుఖప్రసవం చేయించి తల్లీబిడ్డలను సురక్షితంగా ఇళ్లకు పంపించడంతో ప్రజల్లో నమ్మకం పెరిగింది. మారుమూల గ్రామాల నుంచి గర్భిణులు రావడం క్రమంగా పెరిగింది. పీహెచ్సీలో ప్రసవాలు సంఖ్యా గణనీయంగా పెరిగింది. గత పుష్కర కాలంలో ఒక్క కాన్పు కూడా జరగని ఈ పీహెచ్సీలో గత ఏడాది మే నుంచి డిసెంబర్ వరకు ఏడు నెలల్లోనే 70 మంది గర్భిణులు ఇక్కడ పురుడు పోసుకొని పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు. పీహెచ్సీ కళకళ అప్పుడే ఈ లోకంలోకి అడుగుపెట్టిన బిడ్డల కేరింతలు.. తల్లిదండ్రుల ఆనందోత్సాహాలతో ఆరోగ్య కేంద్రం కొత్త కళ సంతరించుకుంది. గత ఏడాది వరకు ఇక్కడి ప్రసవాల గది పట్లు పట్టి దుమ్మూధూళి, చెత్తాచెదారాలతో నిండి ఉండేది. ఇప్పుడు వాటి స్థానంలో వైద్య పరికరాలు బెడ్లు తళతళలాడుతూ కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి అందిన వివిధ పథకాల నిధులతో అవసరమైన పరికరాలు దశలవారీగా కొనుగోలు చేశారు. పుట్టిన శిశువుల ఆరోగ్య పరిరక్షణకు వార్మర్ సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. తల్లీబిడ్డలకు అవసరమైన అన్ని రకాల మందులు ఉన్నాయి. -
టీవీక్షణం: దెయ్యపు సీరియళ్లు
దెయ్యం... ఈ పేరు చెబితేనే కొందరికి భయం. కానీ టీవీ వాళ్లకు దెయ్యమంటే మహా ప్రీతి. ఎందుకంటే, అది సీరియళ్లను సక్సెస్ చేస్తుంది. టీఆర్పీని పెంచుతుంది. కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. అందుకే దెయ్యాల కథనాలకు టెలివిజన్ పెద్ద పీటే వేస్తోంది. రాత్రి, అర్ధరాత్రి, అన్వేషిత, తులసీదళం, మర్మదేశం... హారర్ ఎలిమెంట్ ఉంటే చాలు... ఆ సీరియల్ సూపర్ హిట్టయినట్టే. తెలుగులోనే కాదు... హిందీలో కూడా హారర్ సీరియల్స్‌కి టీఆర్పీ ఎక్కువే ఉంటుంది. అన్హోనీ, ఆహట్, హారర్ నైట్స్, అనామిక, ఫియర్ఫైల్స్ లాంటివి ప్రేక్షకులను టీవీల ముందు కూర్చోబెట్టడంలో విజయం సాధించాయి. అసలెందుకు దెయ్యమంటే ఇంత క్రేజ్! గమనిస్తే... మొదట్నుంచీ ఎంటర్టైన్మెంట్ రంగంలో హారర్‌కి చాలా ప్రాధాన్యత ఉందని అర్థమవుతుంది. సినిమా వాళ్లు దెయ్యాన్ని ఓ రేంజ్లో ఉపయోగించుకున్నారు. పున్నమిరాత్రి, రాత్రి, జగన్మోహిని, దెయ్యం, కాష్మోరా, కాంచన వంటి తెలుగు సినిమాలు... మహల్, భూత్, రాజ్, 1920 లాంటి హిందీ చిత్రాలు... ఈవిల్‌డెడ్, ఎగ్జార్సిస్ట్, అలోన్, ద గ్రడ్జ్, డార్క్ వాటర్ లాంటి హాలీవుడ్ చిత్రాలు విజయఢంకా మోగించాయి. ఇప్పటికీ ఆ తరహా చిత్రాలను తీస్తూనే ఉన్నారు దర్శకులు. దెయ్యాలు లేవనే వారి సంఖ్య పెరుగుతూ ఉన్నా... దెయ్యాల సినిమాలు చూసేవారి సంఖ్య మాత్రం తరగడం లేదు. అందుకే ఇప్పటికీ మన సినిమాలను దెయ్యాలు ఆవహిస్తూనే ఉన్నాయి. సీరియల్స్‌ని దెయ్యాలు పట్టి పీడించడానికి కూడా కారణం అదే! అయితే ఈ హారర్ ఎలిమెంట్‌తో జనాన్ని అలరించాలనుకోవడం కరెక్టేనా అన్న చర్చ ఎంతో కాలంగా జరుగుతోంది. నిర్మాతలు, దర్శకుల దృష్టితో చూస్తే అది కరెక్టే. ఎందుకంటే, వాళ్లకు తమ షోని సక్సెస్ చేసుకోవడం ముఖ్యం. అందుకే వాళ్లు దెయ్యాల్ని విడిచిపెట్టరు. పైగా ‘ప్రేక్షకులు చూస్తున్నప్పుడు మేం తీయడంలో తప్పేముంది’ అనేది ‘ఆహట్’ సీరియల్ దర్శకుడు బీపీ సింగ్ మాట. కానీ కొందరు మాత్రం... హారర్ సీరియళ్లు, ప్రోగ్రాములు ఎక్కువైపోయాయి, వీటి వల్ల భయం కలుగుతోంది, గుండె జబ్బులొచ్చేలా ఉన్నాయి అంటున్నారు. అంత భయపడేవారు చూడకూడదు అంటారు దర్శకులు. దాంతో ఈ చర్చ ఎప్పటికీ అంతమే కావడం లేదు. ఆలోచిస్తే రూపకర్తలు చెప్పే మాటే కరెక్టనిపిస్తుంది. ఎందుకంటే, మా సీరియల్ చూడండి అని ఏ దర్శకుడూ ప్రేక్షకులను బలవంతం చేయడం లేదు. కాబట్టి భయప డేవాళ్లు చూడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఆసక్తి ఉన్నవాళ్లు చూడాలి. భయపడేవాళ్లు మానాలి. అది మానేసి హారర్ అవసరమా అంటే ఎలా? అది కూడా ఎంటర్టైన్మెంట్లో భాగమే కదా!