
ఇంతవరకు ఎన్నో రకాల వీడియోలు చూశాం. కానీ దెయ్యాలకు సంబంధించిన వీడియోల్లో ఏవో వస్తువులు గాల్లో ఎగురుతున్నట్లు కనిపిస్తాయి. ఇదేదో మిస్టరీగా ఉంది కాబట్టి ఇందులో దెయ్యం ఉందని డిసైడ్ చేసేస్తాం. నిజానికి మనం ఇంతవరకు చూసిన వీడియోల్లో దెయ్యాన్ని క్లియర్‌గా చూడలేదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో దెయ్యాన్ని స్పష్టంగా చూడగలరు.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే... పంట పోలాల వద్ద కాకులు వంటి వివిధ రకాల పక్షులు ఆహార ధాన్యాలను తినకుండా ఉండేందుకు దిష్టి బొమ్మలు పెడుతుంటారు. మరికొంత మంది బాగా పండిన పంటను చూస్తే ఎవరి చెడు దృష్టి పడుతోందని కూడా ఇలాంటి దిష్టి బొమ్మలు ఏర్పాటు చేస్తుంటారు.
ఐతే ఈ బొమ్మలకి కాస్త గ్రాఫిక్ జోడించి... ఆ దిష్టి బొమ్మ దెయ్యాం సైకిల్ పట్టుకుని ఉన్నట్లు రూపొందించారు. గాలి వీచినప్పుడల్లా ఆ దెయ్య గాల్లో ఎగురుతూ ఆ సైకిల్ హ్యండిల్ బార్‌ని తిప్పుతున్నట్లు ఉంటుంది. మొదటగా చూసినప్పుడూ నిజమైన దెయ్యంలా అనిపిస్తుంది. ఆ తర్వాత కాస్త నిశితంగా చూస్తే గానీ వాస్తవం ఏంటో అర్థమవ్వదు.
When an engineer designs a scarecrow pic.twitter.com/IXG2ht2CLn
— figensezgin (@_figensezgin) August 5, 2022
(చదవండి: నాన్న నన్ను క్షమించండి అంటూ సెల్ఫీ వీడియో! కన్నీటి పర్యంతమవుతున్న తండ్రి)
Comments
Please login to add a commentAdd a comment