scarecrow
-
ప్రలోభాలకు తెలంగాణ లొంగదు
చౌటుప్పల్: ప్రలోభాలకు తెలంగాణ సమాజం లొంగబోదని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ నాయకత్వం ఆ పార్టీలో చేర్చుకునేందుకు చేసిన కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం రాత్రి వారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కలిసి వారు నిరసన వ్యక్తం చేశారు. మోదీ, బీజేపీ, రాజగోపాల్ రెడ్డిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. బీజేపీ చేసే కుట్రలకు తెలంగాణలో తావు లేదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీకి మునుగోడులో ఓటమి తప్పదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని హెచ్చరించారు. మునుగోడులో ఓటమి భయంతోనే టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ నాయకత్వం ప్రలోభాలకు గురిచేసిందన్నారు. అనంతరం వారు జాతీయ రహదారిపై బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్ఎస్ నిరసన.. మోదీ దిష్టిబొమ్మ దగ్ధం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని విమర్శిస్తూ తెలంగాణ భవన్ వద్ద పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, బ్రూవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్ నేతృత్వంలో మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మోదీ, అమిత్‌షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
వామ్మో! ఏంటీ దెయ్యం అలా ఎలా చేస్తోంది: వైరల్ వీడియో
ఇంతవరకు ఎన్నో రకాల వీడియోలు చూశాం. కానీ దెయ్యాలకు సంబంధించిన వీడియోల్లో ఏవో వస్తువులు గాల్లో ఎగురుతున్నట్లు కనిపిస్తాయి. ఇదేదో మిస్టరీగా ఉంది కాబట్టి ఇందులో దెయ్యం ఉందని డిసైడ్ చేసేస్తాం. నిజానికి మనం ఇంతవరకు చూసిన వీడియోల్లో దెయ్యాన్ని క్లియర్‌గా చూడలేదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో దెయ్యాన్ని స్పష్టంగా చూడగలరు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే... పంట పోలాల వద్ద కాకులు వంటి వివిధ రకాల పక్షులు ఆహార ధాన్యాలను తినకుండా ఉండేందుకు దిష్టి బొమ్మలు పెడుతుంటారు. మరికొంత మంది బాగా పండిన పంటను చూస్తే ఎవరి చెడు దృష్టి పడుతోందని కూడా ఇలాంటి దిష్టి బొమ్మలు ఏర్పాటు చేస్తుంటారు. ఐతే ఈ బొమ్మలకి కాస్త గ్రాఫిక్ జోడించి... ఆ దిష్టి బొమ్మ దెయ్యాం సైకిల్ పట్టుకుని ఉన్నట్లు రూపొందించారు. గాలి వీచినప్పుడల్లా ఆ దెయ్య గాల్లో ఎగురుతూ ఆ సైకిల్ హ్యండిల్ బార్ని తిప్పుతున్నట్లు ఉంటుంది. మొదటగా చూసినప్పుడూ నిజమైన దెయ్యంలా అనిపిస్తుంది. ఆ తర్వాత కాస్త నిశితంగా చూస్తే గానీ వాస్తవం ఏంటో అర్థమవ్వదు. When an engineer designs a scarecrow pic.twitter.com/IXG2ht2CLn — figensezgin (@_figensezgin) August 5, 2022 (చదవండి: నాన్న నన్ను క్షమించండి అంటూ సెల్ఫీ వీడియో! కన్నీటి పర్యంతమవుతున్న తండ్రి) -
చినజీయర్ స్వామి క్షమాపణ చెప్పాలి
ఎస్ఎస్ తాడ్వాయి/గుండాల: సమ్మక్క, సారలమ్మ వనదేవతలమీద త్రిదండి చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై పూజారులు మండిపడ్డారు. స్వామి వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం సమ్మక్క, సారలమ్మ పూజారులు, వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వా యి మండలంలోని మేడారంలో చినజీయర్ స్వామి దిష్టిబొమ్మను దహనం చేశారు. అయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్వామి మాటలపై పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు మాట్లాడుతూ చినజీయర్ స్వామి ఇంగీత జ్ఞానం లేకుండా సమ్మక్క, సారలమ్మ దేవత కాదని అనడం అవివేకమన్నారు. కోట్లాది మందికి అశీర్వాదాలు అందించే తల్లులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే ఆదివాసీ ప్రజానీకానికి, వనదేవతలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, స్వామి వ్యాఖ్యలను తప్పుబడుతూ భద్రాద్రి కొత్త గూడెం జిల్లా గుండాల మండలం యాపలగడ్డలోని పగిడిద్దరాజు గుడివద్ద అరెం వంశీయులు బుధవారం నిరసన తెలిపారు. సమ్మక్క, సారలమ్మ విషయంలో స్వామి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. -
సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
బీబీపేట నిజామాబాద్ : బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బుదవారం బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ చేసినందుకు గాను సీఎం కేసీఆర్‌ను కలవడానికి వెళ్లిన కిషన్ రెడ్డి, రామచంద్రరావు ప్రగతి భవన్‌కు వెళుతుండగా అరెస్టు చేశారు. ఇందుకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం చేశారు. అలాగే పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం కామారెడ్డి నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ ఆముదాల నరేందర్, బీజేవైఎం మండలాధ్యక్షుడు రంజిత్‌కుమార్, బీజేపీ మండలాధ్యక్షుడు దుంప నర్సింలు, ఉపాధ్యక్షుడు మురళి గౌడ్, టౌన్ అధ్యక్షుడు రాములు గౌడ్, కార్యకర్తలు శివ, ప్రసాద్, నాగరాజు, వంశీలాల్, దేవరాజ్ గౌడ్ పాల్గొన్నారు. -
కత్తి మహేశ్ దిష్టిబొమ్మ దహనం
మల్యాల/రామడుగు: రాముడిపై అనుచిత వ్యా ఖ్యాలుచేసిన కత్తి మహేశ్ దిష్టిబొమ్మను విశ్వహిం దూపరిషత్, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో మంగళవా రం మల్యాల మండలంలో దిష్టిబొమ్మను దహనంచేసి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. భజరంగ్‌దళ్ జిల్లా కోకన్వీనర్ బొద్దుల మ హేందర్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కట్ట రవీందర్ మాట్లాడుతూ.. పరిపూర్ణానంద స్వామిని గృ హనిర్భందం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ రా జారంకు వినతిపత్రం అందించారు. కార్యక్రమం లో భజరంగ్ దళ్ జిల్లా కోకన్వీనర్ బొద్దుల మ హేందర్తోపాటు బట్టు నరేశ్, గణేశ్, నరేశ్, చొప్ప దండి నియోజక వర్గ బీజేపీ కన్వీనర్ జిన్నాం విద్యాసాగర్, నాయకులు జిట్టవేని అంజిబాబు, బండపల్లి శ్రీధర్, రమేశ్ పాల్గొన్నారు. -
మంత్రి అఖిలప్రియ దిష్టి బొమ్మ దగ్ధం
సాక్షి, తూర్పు గోదావరి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. బుధవారం రాష్ట్ర బీజేపీ నేతలు మంత్రి అఖిలప్రియకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఈ నిరసనలో భాగంగా రాష్ట్ర మహిళామోర్చ అధ్యక్షురాలు శరణాల మాలతీరాణి మాట్లాడుతూ... ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అఖిలప్రియను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మానభంగాలకు ఉసిగొల్పుతున్నారంటూ ప్రధాని మోదీపై ఆమె వ్యాఖ్యలు చేయడం సంస్కారహీనంగా ఉన్నాయని అన్నారు. నిరసనలో భాగంగా ఆమె బీజేపీ నేతలతో కలసి తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా అఖిలప్రియ దిష్టిబొమ్మను దగ్ధం చేసి మండల తహసీల్దారుకు వినతిపత్రాన్ని అందజేశారు. -
మోడీకు హఠావో.. దేశ్‌కు బచావో..
పెద్దపల్లిటౌన్: ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ప్రచార ఆర్భాటాలలో మునిగి తేలుతున్న నరేంద్రమోడీకి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని టీపీసీసీ సభ్యులు ఈర్ల కొమురయ్య హెచ్చరించారు. కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్‌రహదారి కమాన్‌చౌరస్తా వద్ద శనివారం ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా కొమురయ్య మాట్లాడారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు. రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచుతూ సామాన్యుల నడ్డి విరిచేలా కుట్రపూరితంగా వ్యవహరించడం బీజేపీ ప్రభుత్వానికి తగదన్నారు. కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తూ కార్మిక, కర్షక, మహిళా, యువత, విద్యార్థి సంక్షేమాన్ని విస్మరించిన మోడీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. మోడీకి హఠావో.. దేశ్‌కి బచావో.. అంటూ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను గ్రామ గ్రామాన ప్రజల్లో అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులను చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. నిరసనలో నాయకులు బుషనవేని సురేశ్‌గౌడ్, మంథని నర్సింగ్, అక్బర్అలీ, సర్వర్‌పాషా, సునిల్గౌడ్, కడార్ల శ్రీనివాస్, నల్లగొండ కుమార్, టాంక్ జైదేవ్, పరమేశ్వర్, దొడ్డుపల్లి జగదీశ్, బండి అనిల్, భాషా తదితరులు పాల్గొన్నారు. -
మోది దిష్టిబొమ్మదహనం
ప్రధాని నరేంద్రమోది రాకను నిరసిస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మోది దిష్టిబొమ్మను ఆదివారం హిమాయత్‌నగర్ వై-జంక్షన్లో దహనం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు బి. రాములుయాదవ్, బోయ ఆంజనేయులు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఈ రెండేళ్ల కాలంలో దళితులు, విద్యార్థులపై బిజేపి కార్యకర్తల దాడులు అధికమయ్యాయన్నారు. యూనివర్సిటిల్లో కమల దళాన్ని ప్రోత్సహిస్తూ విద్యార్థులను సైతం కాషాయ రంగు పులుముకోవాలంటూ, ఆర్ఎస్ఎస్కు సహకరించాలంటూ హుకూం జారీ చేస్తున్నారన్నారు. విద్యార్థులకు, దళితులకు మోది క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ నాయకులు రాకేశ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
మెదక్ జిల్లాలో బంద్ పాక్షికం..ఉద్రిక్తం
- ముంపు గ్రామాల చుట్టూ పోలీసు వలయం - పోలీసుల ఆధీనంలోరాజీవ్ రహదారి - కార్లు, బస్సుల్లో తనిఖీలు - జాతీయ రహదారి మీదనే కోదండరాం అరెస్టు - గ జ్వేల్‌లో దామోదర్, సునీతారెడ్డి, రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు - సిద్దిపేట, ఆందోల్‌లో మల్లన్నసాగర్ కట్టాలంటూ ప్రతి ర్యాలీలు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులపై ఆదివారం జరిగిన లాఠీచార్జికి నిరసనగా సోమవారం వివిధ పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు మెదక్ జిల్లా బంద్ పాక్షికంగా జరిగింది. తూర్పు మెదక్ జిల్లా ప్రాంతంలోనే కొంత మేరకు బంద్ ప్రభావం కనిపించింది. ముందస్తుగానే ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. భారీ ఎత్తున పోలీసులను మొహరించటంతో సర్వత్రా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. జిల్లా సరిహద్దు ప్రాంతం ఒంటిమామిడి నుంచి కుకునూర్‌పల్లి వరకు దాదాపు 30 కిలోమీటర్ల మేర రాజీవ్ రహదారిని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కపల్లి, మెదక్ జిల్లా ఒంటిమామిడి గ్రామాల మధ్య రెండు కిలోమీటర్ల పరిధిలో రెండు భారీ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వందల మంది పోలీసు బలగాలను మొహరించారు. ఇద్దరు డీఎస్పీల ఆధ్వర్యంలో చెక్‌పోస్టు పహారా ఏర్పాటు చేశారు. ముంపు గ్రామాల ప్రజలను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రొఫెసర్ కోదండరాంను పోలీసులు ఒంటిమామిడి చెక్‌పోస్టు వద్దనే అరెస్టు చేసి జిన్నారం మండలం బొల్లారం పోలీసుస్ట్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దామోదర్‌రాజనర్సింహ, సునీతారెడ్డి, శ్రావణ్, అద్దంకి దయాకర్, టీడీపీ నాయకుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, రఘునందన్‌రావును గజ్వేల్ పట్టణంలో వేర్వేరు సమయాల్లో అరెస్టు చేసి తూప్రాన్, హైదరాబాద్‌లోని ఇతర పోలీసుస్టేషన్లకు తరలించారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరెడ్డి శ్రీధర్‌రెడ్డిని, తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్కను కుకునూర్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. సాయంత్రం 5 గంటల సమయంలో వారిని సొంత పూచీకత్తుపై వదిలారు. పోలీసు వలయంలో ముంపు పల్లెలు వేములఘాట్, పల్లెపహాడ్, ఎర్రవల్లి, ఏటిగడ్డ కిష్టాపూర్, సింగారం, బంజేరుపల్లి తదితర ముంపు గ్రామాలను పోలీసులు చుట్టుముట్టారు. బయటి వ్యక్తులు ఊర్లోకి, ఊరి వ్యక్తులు బయటికి వెళ్లకుండా దిగ్బంధించారు. పోలీసు చర్యలకు నిరసనగా ముంపు గ్రామాల ప్రజలు ఊళ్లలోనే ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎప్పుడేఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి పల్లెల్లో నెలకొని ఉంది. సిద్దిపేట, ఆందోల్‌లో ప్రతి ర్యాలీలు ఆందోల్‌లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొందరు రైతులు మల్లన్నసాగర్‌ను త్వరగా పూర్తి చేసి సింగూరును నింపాలని నినాదాలు చేస్తూ ఎంపీపీ కార్యాలయం నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి వినతిపత్రం ఇచ్చారు. దీంతో పట్టణంలో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. సిద్దిపేటలో ప్రతిపక్ష పార్టీల నేతలు బంద్‌ను విజయంవంతం చేయాలని కోరుతూ దుకాణాలు మూసివేయించగా...వారి వెనకే టీఆర్ఎస్ శ్రేణులు వెళ్లి మల్లన్నసాగర్‌ను త్వరగా పూర్తి చేయాలని కోరుతూ దుకాణాలు తెరిపించాయి. గజ్వేల్ పట్టణంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యరక్తల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. -
జడ్చర్లలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం
జడ్చర్ల టౌన్ (మహబూబ్‌నగర్ జిల్లా): వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిని డాక్టర్కాదంటూ వాఖ్యలు చేసిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను జడ్చర్ల మండల టీఆర్ఎస్ నాయకులు సోమవారం అంబేద్కర్ చౌరస్తాలో దహనం చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద కొద్దిసేపు దిష్టిబొమ్మను ఊరేగింపు చేసిన టీఆర్ఎస్ నాయకులు రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కోడ్గల్‌యాదయ్య, నాయకులు పిట్టల మురళిలు మాట్లాడుతూ 1994లో రేవంత్‌రెడ్డి ఏం చేశారో బహిర్గతపర్చాలని, తరువాత ఎలా ఎదిగారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీహెచ్ఎంఎస్ పూర్తిచేసిన తమ నాయకుడిపై మరోసారి నోరు జారితే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇమ్మడి యాదయ్య, శ్రీకాంత్, శంకర్‌నాయక్, రఘుపతిరెడ్డి, ఇంతియాజ్, ఉమాశంకర్ గౌడ్, ఇబ్రహీం, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
ఆదిలాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి, నోటుకు ఓటు కొనాలని ప్రయత్నించిన తెలుగు దేశం పార్టీపై టీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తి చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం బాబు అసలు రూపు బయట పడిందని, టీడీపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. -
కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
గుంటూరు: సాగర్ నీటికోసం జరుగుతున్న గొడవకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావే కారణమని ఆగ్రహించిన ప్రజలు ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నాగార్జున సాగర కుడి కాలువ సమీపంలోని విజయపురి(గుంటూరుజిల్లా) గ్రామస్థులు శుక్రవారం సాయంత్రం తెలంగాణ సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం శుక్రవారం కుడికాలువకు నీళ్లు విడుదల చేయడానికి వచ్చిన అధికారులను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడంతో కోపోద్రిక్తులైన ప్రజలు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. (మాచర్ల) -
చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
డిచ్పల్లి(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యార్థులు గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. హైదరాబాద్‌లో ఉంటే విదేశాల్లో ఉన్నట్లే ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలతో తెలంగాణ అమరవీరుల ఆత్మలు క్షోభిస్తున్నాయని అన్నారు. టీఆర్ఎస్వీ యూనివర్సిటీ విభాగం అధ్యక్షుడు మహేష్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. -
ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : కేంద్ర పారిశ్రామిక త్రైపాక్షిక కమిటీ పునరుద్దరించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఎంఎస్‌ఆర్‌యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుంపల ప్రసాద్ హెచ్చరించారు. కేంద్రంలో ఎన్డీఎ ప్రభుత్వం అధికారంలోకి రాగానే లక్షలాది మంది కార్మికులకు ప్రయోజనం కలిగించే పారిశ్రామిక త్రైపాక్షిక కమిటీని రద్దు చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రధాని మోడీ దిష్టిబొమ్మను మంగళవారం సాయంత్రం స్థానిక ఫైర్‌స్టేషన్ సెంటర్లో దహనం చేశారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికలలో అనేక వాగ్దానాలు చేసి బీజేపీ అధికారంలోకి రాగానే తన నిజస్వరూపాన్ని బయటపెడుతోందన్నారు. సేల్స్ రంగంలో పనిచేసే లక్షలాది మంది అనేక ఏళ్లుగా పోరాడి సాధించుకున్న హక్కును ఒక్క కలంపోటుతో రద్దు చేయడం దారుణమన్నారు. తొలుత మెడికల్ రిప్రజెంటేటివ్‌లు పవరుపేటలోని సీఐటీయూ కార్యాలయం నుంచి బోసు శిబిరం, రమామహాల్, విజయవిహార్ సెంటర్, ప్రభుత్వాసుపత్రి మీదుగా ఫైర్‌స్టేషన్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఏపీఎంఎస్ఆర్యూ అధ్యక్షుడు ఏకే జోషి, కార్యదర్శి వీవీవీఎన్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఎం.రవికుమార్, ఎం.మురళీమోహన్, పి.కిరణ్ కుమార్, ప్రకాష్ రెడ్డి నాయకత్వం వహించారు. -
పవన్‌కల్యాణ్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ సీపీపై అభాండాలు వేసినందుకు నిరసనగా సినీనటుడు పవన్‌కల్యాణ్ దిష్టిబొమ్మను శుక్రవారం మధ్యాహ్నం బెంజిసర్కిల్‌లో ఆయన అభిమానులు దహనం చేశారు. పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యుడు కంభాల వెంకట మణుదీప్రెడ్డి మాట్లాడుతూ పవన్ తెలంగాణలో ఉన్నప్పుడు జై తెలంగాణ అని, ఇక్కడకు వచ్చిన తరువాత జై సమైక్యాంధ్ర అంటూ రెండు నాల్కల ధోరణి ప్రదర్శించడంతో ఆయన అభిమానులుగా తమకూ తిక్క ఉందని ప్రజలు భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిరంజీవి, పవన్‌లను ఎంతో అభిమానించామని, వారిని ఎవరైనా ఏదైనా అంటే ఎదిరించేవారమని తెలిపారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తరువాత చిరంజీవి, పవన్‌లు కాంగ్రెస్, టీడీపీలను తీవ్రస్థాయిలో విమర్శించారని చెప్పారు. ఆ తరువాత కనీసం అభిమానులతో సంప్రదించకుండా చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారని, ఇప్పుడు పవన్ టీడీపీ పంచన చేరారని మండిపడ్డారు. అతి పెద్ద అవినీతిపరుడని చంద్రబాబును విమర్శించిన పవన్‌కల్యాణ్ ఇప్పుడు ఆయన్ను గొప్ప నాయకుడంటూ పొగడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. రాష్ట్రాన్ని విడదీయడంలో టీడీపీ, బీజేపీలు సమాన పాత్ర పోషించాయని, ఇప్పుడు వాటివెంట పవన్‌కల్యాణ్ వెళ్లడం సరికాదని అభిమానులు పేర్కొన్నారు. పవన్‌ను నటుడుగా మాత్రమే ఆదరిస్తామని, రాజకీయ నాయకుడిగా చూడలేమన్నారు. ఆయన ఎవరికి ఓటేయాలో చెప్పడం అనవసరమని, తమకు నచ్చినవారికి ఓటేస్తామని చెప్పారు. ముందస్తు అనుమతి లేకపోవడంతో పవన్ అభిమానుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.