జడ్చర్లలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం | Revanth reddy scarecrow to crimate in Jadcharla | Sakshi
Sakshi News home page

జడ్చర్లలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం

Published Mon, Aug 10 2015 4:06 PM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM

జడ్చర్లలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం

జడ్చర్లలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం

జడ్చర్ల టౌన్ (మహబూబ్‌నగర్ జిల్లా): వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిని డాక్టర్‌కాదంటూ వాఖ్యలు చేసిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను జడ్చర్ల మండల టీఆర్‌ఎస్ నాయకులు సోమవారం అంబేద్కర్ చౌరస్తాలో దహనం చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద కొద్దిసేపు దిష్టిబొమ్మను ఊరేగింపు చేసిన టీఆర్‌ఎస్ నాయకులు రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు కోడ్గల్‌యాదయ్య, నాయకులు పిట్టల మురళిలు మాట్లాడుతూ 1994లో రేవంత్‌రెడ్డి ఏం చేశారో బహిర్గతపర్చాలని, తరువాత ఎలా ఎదిగారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీహెచ్‌ఎంఎస్ పూర్తిచేసిన తమ నాయకుడిపై మరోసారి నోరు జారితే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఇమ్మడి యాదయ్య, శ్రీకాంత్, శంకర్‌నాయక్, రఘుపతిరెడ్డి, ఇంతియాజ్, ఉమాశంకర్ గౌడ్, ఇబ్రహీం, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement