రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై కేటీఆర్‌ ఘాటు స్పందన | Minister KTR Fires on Revanth Reddy | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 25 2017 6:00 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Minister KTR Fires on Revanth Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి తీరును మంత్రి కేటీఆర్‌ తప్పుబట్టారు. రేవంత్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ లేదా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించాలని డిమాండ్‌ చేశారు. కేబినెట్‌ మంత్రిగా ఉన్న నాయకుడిపై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని మండిపడ్డారు.

ప్రధాని మోదీపై 'నీచ్‌' వ్యాఖ్యలు చేసిన మణిశంకర్‌ అయ్యార్‌పై కాంగ్రెస్‌ పార్టీ చర్య తీసుకుందని, ఆ సంప్రదాయన్ని గుజరాత్‌కే పరిమితం చేస్తుందా? లేక తెలంగాణకు కూడా పాటిస్తారో చూడాలని వ్యాఖ్యానించారు. లక్ష్మారెడ్డి డాక్టర్‌ పట్టా ఒరిజినల్‌దేనా అని ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి.. ఆయనపై తిట్లదండకాన్ని ఎత్తుకున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement