
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి దొంగ సర్టిఫికెట్ డాక్టర్ అని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికీ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, వాస్తవాలు నిరూపించడానికి బహిరంగచర్చకు సిద్ధమన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2004లో ఇచ్చిన ఎన్నికల అఫిడవిట్‌లో 1988లో గుల్బర్గా వర్సిటీ నుంచి, 2014 లో ఇచ్చిన అఫిడవిట్‌లో 1987లో కర్ణాటక వర్సిటీ నుంచి వైద్యవిద్యలో ఉత్తీర్ణులైనట్టు పేర్కొన్నారన్నారు.
ఈ రెండింటిలో ఏది వాస్తవమో మంత్రి చెప్పాలన్నారు. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి నుంచి 1990లో గుల్బర్గా వర్సిటీకి, కర్ణాటక వర్సిటీకి 1988లో అనుమతులు వచ్చాయన్నారు. ఆయా వర్సిటీలకు అనుమతులు రాకముందే లక్ష్మారెడ్డి ఉత్తీర్ణుడైనట్లున్నారన్నారు. తనపై, తన కుటుంబసభ్యులపై సోషల్ మీడియాలో వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ప్రచారం చేస్తున్నారని, వీటికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment