
రేవంత్ రెడ్డి(పాత చిత్రం)
జడ్చర్ల: తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డిపై కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. లక్ష్మారెడ్డి ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని విమర్శిస్తూ తీవ్రపదజాలం వాడారు. ప్రభుత్వ వాహనాలు వాడుకుంటూ భూదందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మంత్రి నియోజకవర్గం జడ్చర్లలో వంద పడకల ఆసుపత్రి మాటలకే పరిమితమైపోయిందని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిలో కూడా కనీస వైద్య సౌకర్యాలు లేవని, జడ్చర్ల నియోజకవర్గానికి లక్ష్మారెడ్డి చేసింది శూన్యమని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో లక్ష్మారెడ్డిని ఓడించి మల్లు రవిని గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గాన్ని వీడే ప్రసక్తే లేదని, అక్కడి నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment