jadcharla
-
జడ్చర్లలో అక్షయకల్ప ప్రాసెసింగ్ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రసాయనరహిత, సేంద్రియ ఆహారానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో డెయిరీ ఉత్పత్తుల సంస్థ అక్షయకల్ప ఆర్గానిక్ హైదరాబాద్ మార్కెట్‌పై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా తెలంగాణలోని జడ్చర్లలో రూ. 20 కోట్లతో ప్రాసెసింగ్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ సీఈవో శశికుమార్ తెలిపారు. ప్రాథమికంగా రోజుకు 40 వేల లీటర్ల సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ ప్లాంటు ఆరేడు నెలల్లో అందుబాటులోకి రాగలదని ఆయన చెప్పారు. షాద్‌నగర్ ఫార్మ్‌లో ప్రస్తుతం 65 మంది రైతులతో కలిసి పని చేస్తుండగా, వచ్చే మూడేళ్లలో దీన్ని 380మందికి పెంచుకోనున్నట్లు, అక్కడ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని కూడా నెలకొల్పినట్లు వివరించారు. ఇప్పుడు మూడు క్లస్టర్లు ఉండగా పుణెలో మరొకటి ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు శశికుమార్ చెప్పారు. ఇప్పటివరకు సుమారు రూ. 250 కోట్ల పైగా నిధులు సమీకరించగా .. రూ. 200 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వివరించారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 285 కోట్ల ఆదాయం నమోదు చేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 400 కోట్ల పైగా అంచనా వేస్తున్నట్లు వివరించారు. -
జడ్చర్ల వద్ద డీసీఎంను ఢీకొన్న APSRTC బస్సు దగ్ధం
-
జడ్చర్లలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు దగ్ధం
సాక్షి,మహబూబ్‌నగర్ జిల్లా: జడ్చర్లలో సోమవారం(జులై 15) తెల్లవారుజామున 2 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 44పై భూరెడ్డి పల్లి వద్ద ఏపీలోని ధర్మవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డీసీఎంను ఢీకొని దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డవారిని 108 అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి బస్సు ధర్మవరానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. -
కందూరు కోసం వచ్చి.. కాటికి!
మహబూబ్‌నగర్, జడ్చర్ల: కందూరు చేసి మొక్కు తీర్చుకోవాలని కుటుంబంతో కలిసి వచ్చారు. ఈ క్రమంలో ముగ్గురు బాలురు సమీపంలో ఉన్న బావిలో కాళ్లు కడుక్కోడానికి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి ఇద్దరు బాలురు మృతిచెందగా.. కొద్దిమేర ఈత వచ్చిన మరో బాలుడు త్రుటిలో తప్పించుకున్నాడు. ఈ విషాదకర సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం.. బిజినేపల్లికి చెందిన మతీన్ అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం జడ్చర్లకు వెళ్లి స్థిరపడ్డాడు. ఈ క్రమంలో స్వగ్రామంలో కందూరు చేయాలని భావించిన మతీన్ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మంగళవారం బిజినేపల్లిలోని దర్గా వద్దకు వచ్చారు. అయితే దర్గాకు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో కాళ్లు కడుక్కోవడానికి మతీన్ కుమారుడు పూర్కన్(10), బంధువు అజ్మత్ కుమారుడు మహమ్మద్(12), మరో బాలుడు అక్మల్ కలిసి వెళ్లారు. ఈ క్రమంలో వారు ప్రమాదశావత్తు బావిలో జారిపడ్డారు.దర్గాకు పాతాళ్లు ఇస్తున్న కుటుంబ సభ్యులు విషయం గమనించి వారిని రక్షించే ప్రయత్నం చేయగా.. అప్పటికే పూర్కన్, మహమ్మద్ నీటిలో మునిగిపోయారు. అక్మల్‌కు ఈత రావడంతో ఒడ్డుకు చేరుకున్నాడు. అనంతరం స్థానికులు అక్కడికి చేరుకుని బావిలో నుంచి ఇద్దరు బాలుర మృతదేహాలను బయటికి తీశారు. విగతజీవులుగా మారిన చిన్నారులను చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు.జడ్చర్లలో విషాదఛాయలు..జడ్చర్లలోని విద్యానగర్‌కాలనీలో నివాసం ఉంటున్న బీఆర్ఎస్ నాయకులు మతీన్, అజ్మత్‌ల కుమారులు మహమ్మద్, పూర్కాన్ బావిలో ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. మతీన్‌కు పూర్కాన్తోపాటు మరో ఇద్దరు పిల్లలు ఉండగా.. అజ్మత్కు మహమ్మద్‌తోపాటు ఒక కూతురు ఉంది. -
2023 జడ్చర్ల ఎలక్షన్స్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వీళ్ళే
ఉదయం 9గం వరకు జరిగిన పోలింగ్ శాతం: 12% నియోజకవర్గం: జడ్చర్ల జిల్లా: మహబూబ్ నగర్ లోక్‌సభ పరిధి: మహబూబ్ నగర్ రాష్ట్రం: తెలంగాణ మొత్తం ఓటర్ల సంఖ్య: 212,655 పురుషులు: 106,922 మహిళలు : 105,469 ఈ నియోజకవర్గం పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి: 1. జడ్చర్ల 2. నవాబుపేట 3. బాలానగర్ 4. మిడ్జిల్ 2023లో పోటీ చేస్తున్న అభ్యర్థులు: 1. చిత్తరంజన్ దాస్ - BJP 2. జె.అనిరుధ్ రెడ్డి - INC 3. చర్లకోల లక్ష్మ ర్‌రెడ్డి - BRS నియోజకవర్గం ముఖచిత్రం: ఈ నియోజకర్గం మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంది. 2007లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జడ్చర్ల నియోజకవర్గం 4 మండలాలుగా విభజింపబడినది. పునర్వవస్థీకరణ ఫలితంగా షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న బాలానగర్, నవాబ్‌పేట మండలాలు జడ్చర్ల నియోజకవర్గంలోకి, జడ్చర్లలో ఉన్న తిమ్మాజీపేట మండలం నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి మార్చబడినది. జడ్చర్ల నియోజకవర్గానికి ఇప్పటివరకు రెండు ఉప ఎన్నికలతో సహా 14 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, కాంగ్రెస్(ఐ)లు కలిసి నాలుగు సార్లు, తెలుగుదేశం పార్టీ ఆరుసార్లు టీఆర్ఎస్ రెండుసార్లు గెలుపొందాయి. ఇక్కడి నుంచి ఇండిపెండెంట్లు కూడా రెండుసార్లు ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి అత్యధికంగా మూడుసార్లు ఎం. చంద్రశేఖర్ టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన మల్లు రవి కొంతకాలం ప్రభుత్వ విప్ పదవి నిర్వహించారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన లక్ష్మారెడ్డికి తెలంగాణ తొలి మంత్రివర్గంలో స్థానం లభించింది. ఈ నియోజకవర్గం మహబూబ్‌నగర్ లోక్‌సభ పరిధిలోకి వస్తుంది. 2023లో జరగబోయే ఎన్నికలలో జడ్చర్ల నియోజకవర్గంలో ప్రధానంగా కాంగ్రెస్, బి.ఆర్.ఎస్‌ల మధ్యే పోటీ జరగనున్నది. ఇక్కడ బి.జే.పి నామమాత్రంగానే పోటీలో ఉంది. 2018లో మంత్రి పదవిలో ఉంటూ టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన డాక్టర్ సి.లక్ష్మారెడ్డి మూడోసారి విజయం సాదించారు. కాని 2018లో గెలిచిన తర్వాత ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడం విశేషం. లక్ష్మారెడ్డి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది, మాజీ ఎమ్.పి డాక్టర్ మల్లు రవిపై 45082 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. లక్ష్మారెడ్డి ఇంతకుముందు రెండుసార్లు ఇక్కడ నుంచే గెలుపొందారు. లక్ష్మారెడ్డికి 94598 ఓట్లు రాగా, మల్లు రవికి 49516 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన మదుసూదన్ యాదవ్‌కు 3600 ఓట్లు మాత్రమే వచ్చాయి. సి. లక్ష్మారెడ్డి రెండువేల నాలుగులో టిఆర్ఎస్ పక్షాన గెలిచినా, ఆ తర్వాత పదవికి రాజీనామా చేసి 2008 ఉప ఎన్నికలో పోటీచేసి ఓటమి పాలయ్యారు. రెండువేల పద్నాలుగులో లక్ష్మారెడ్డి తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ ఐ పార్టీ సీనియర్ నేత డాక్టర్ మల్లు రవిపై 14734 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. టిడిపి-బిజెపి కూటమి పక్షాన పోటీచేసిన సిటింగ్ ఎమ్మెల్యే ఎమ్.చంద్రశేఖర్‌కు 11465 ఓట్లు మాత్రమే వచ్చి ఓటమి పాలయ్యారు. మల్లు రవి 2008లో జరిగిన ఉపఎన్నికలో గెలిచి కొంతకాలం విప్ పదవిని నిర్వహించారు. అంతకు ముందు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అదికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. నాగర్ కర్నూల్ ఎమ్.పిగా కూడా రెండుసార్లు ఎన్నికయ్యారు. అంతకు ముందు ఆయన సోదరుడు మల్లు అనంతరాములు కూడా నాగర్‌కర్నూల్ నుంచి ఎమ్.పిగా గెలుపొందారు. అనంత రాములు పీసీసీ అధ్యకక్షుడిగా కూడా పనిచేశారు. మల్లురవి మరో సోదరుడు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా మధిర నుంచి 2009, 2014, 2018లలో గెలుపొందారు. ఛీఫ్ విప్, ఉప సభాపతి పదవులను నిర్వహించారు. రవికి మాజీ ఉప ముఖ్యమంత్రి, దివంగత నేత కోనేరు రంగారావు మామ అవుతారు. జడ్చర్లలో కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి నాలుగుసార్లు, తెలుగుదేశం పార్టీ ఆరుసార్లు, టిఆర్ఎస్ మూడుసార్లు గెలిచాయి. ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా గెలిచారు. 1994లో ఇక్కడ గెలిచిన ఎమ్. సత్యనారాయణ హత్యకు గురి అయ్యారు. ఆ తర్వాత 1996లో జరిగిన ఉప ఎన్నికలోను, 1999లోను, తిరిగి 2009లోను సత్యనారాయణ సోదరుడు ఎమ్. చంద్రశేఖర్ గెలుపొందారు. ఇక్కడ నుంచి కాంగ్రెస్ నేత ఎన్.నరసప్ప, టిడిపి నేత కృష్ణారెడ్డి రెండేసి సార్లు గెలిచారు. జడ్చర్లలో ఏడుసార్లు రెడ్డి నేతలు, ఏడుసార్లు బిసి నేతలు (ప్రధానంగా ముదిరాజ్ వర్గం) గెలుపొందారు. ఇది జనరల్ సీటు అయినా ఉప ఎన్నికలో ఎస్.సి.నేత అయిన మల్లురవి పోటీచేసి గెలిచారు.మూడుసార్లు ఇతరులు గెలిచారు. -
మహబూబ్‌నగర్ నా గుండెల్లో ఉంటుంది: సీఎం కేసీఆర్
సాక్షి, మహబూబ్‌నగర్: కృష్ణా జలాల్లో మన హక్కులు మనకు దక్కాలని పోరాటం చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. పాలమూరు- రంగారెడ్డి పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు మార్చామని పేర్కొన్నారు. అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అడిగే ధైర్యం లేక జూరాల నుంచి నీళ్లను తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇప్పుడు కూడా కొందరు జూరాల నుంచే నీళ్లు తీసుకోవాలని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కృష్ణా జలాల్లో మన హక్కులు మనకు దక్కాలని పోరాటం చేశానని చెప్పారు. శ్రీశైలం ఎవరి అయ్య జాగీరని ప్రశ్నించారు. 9 ఏళ్ల తర్వాత అనుమతులు జడ్చర్లలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పాలమూరూరు ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేసులు వేశారన్నారు. 9 ఏళ్ల తర్వాత అనుమతులు వస్తున్నాయన్నాయని తెలిపారు. మొన్ననే పాలమూరు పథకాన్ని ప్రారంభించానని, టన్నెల్స్ పూర్తయ్యాయి. మోటర్లను బిగిస్తున్నారని చెప్పారు. రాబోయే మూడు, నాలుగు నెలల్లో లక్షా 50 ఎకరాలను సాగునీళ్లు అందివ్వనున్నట్లు తెలిపారు. నీటి గోసపై ఉద్యమ సమయంలో పాట రాశా మహబూబ్‌నగర్‌తో తనకున్న అనుంబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. గతంలో మహబూబ్‌నగర్ జిల్లాలో ఏ మూలకు పోయినా దుఖంతోనే పోయేదని అన్నారు. ఒకప్పుడు దుమ్ముకొట్టుకుపోయిన దుందుబి నది ఇప్పుడు జీవనదిగా మారిందని తెలిపారు. కృష్ణా నది పక్కనే ఉన్నా ఏం లాభం జరగలేదని, మహబూబ్‌నగర్ నీటి గోసపై ఉద్యమ సమయంలో నేను పాట రాశానని గుర్తు చేశారు. కరువు అనే మాట ఉండదు జిల్లాలో మార్పు రావాలనే ఎంపీగా పోటీ చేశానని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని సాధింధించానని చెప్పారు. జిల్లా తన గుండెల్లో ఉంటుందని, పాలమూరు పాలుకారే జిల్లాగా మారుతుందని తెలిపారు. పరిశ్రమల కేంద్రంగా జడ్చర్లను తీర్చిదిద్దుతానని, ఇకపై ఇక్కడ కరువు అనే మాట ఇక ఉండదని హామీ ఇచ్చారు. చదవండి: కాంగ్రెస్ పార్టీకి గద్వాల జిల్లా అధ్యక్షుడి రాజీనామా కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రాంరాం అంటారు ‘తెలంగాణను మనకు ఎవరో ఇవ్వలేదు. ఆమరణ దీక్ష చేస్తే తప్ప తెలంగాణ రాలేదు. రాష్ట్రాన్ని ఉత్తిగా ఇవ్వలేదు. ఎంతో మంది విద్యార్థులను బలితీసుకొని ఇచ్చారు ఎప్పుడైనా రైతుబంధు లాంటి స్కీం విన్నామా?. కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రాంరాం అంటారు. ఎన్నికల ముందు కర్ణాటకలో కాంగ్రెస్ 20 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పింది. ఇప్పుడు కర్ణాటక సీఎం 5 గంటల కరెంట్ ఇస్తాం సరిపెట్టుకోండని అన్నారు. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు 24 గంటల కరెంట్ ఎందుకు? 3 గంటలు చాలన్నాడు.’ అంటూ కేసీఆర్ మండిపడ్డారు. -
అనారోగ్యంతో అన్న.. అంతలోనే తమ్ముడు.. తీవ్ర విషాదం..
మహబూబ్‌నగర్: పచ్చని కుటుంబంపై విధి కన్నెర్ర జేసింది. అన్నదమ్ములు ఇద్దరు భార్య, పిల్లలతో ఆనందంగా గడుపుతుండగా.. రోడ్డు ప్రమాదం రూపంలో తమ్ముడిని మృత్యువు కబళించగా, అనారోగ్యం కారణంగా అన్న మృతి చెందాడు. అన్నదమ్ములు ఇద్దరు మృతిచెందడంతో ఆ కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. జడ్చర్ల మున్సిపాలిటీలోని వెంకటేశ్వరకాలనీలో ఈ ఘటన చోటుచేసుకోగా.. పూర్తి వివరాలిలా.. గంగారం శేఖర్ (38), గంగారం రవి (32) ఇద్దరు అన్నదమ్ములు. మున్సిపాలిటీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. అయితే, అన్న శేఖర్ కొంతకాలంగా అనారోగ్యానికి గురికావటంతో ఇంట్లోనే ఉంటున్నాడు. ఇతనికి భార్య ఉంది. అలాగే, తమ్ముడు రవికి భార్య సరిత, కూతురు ఉంది. కూతురిని తీసుకెళ్లేందుకు వెళ్లి మృత్యుఒడికి.. ఈ క్రమంలో రవి సోమవారం ఉదయం చిట్టెబోయిన్‌పల్లి వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న కూతురును బోనాల పండగకు తీసుకువచ్చేందుకు ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరి వెళ్లాడు. ఉదయమే కావడంతో వాచ్మెన్ హాస్టల్ లోపలికి అనుమతించలేదు. మళ్లీ రావాలని చెప్పటంతో అక్కడి నుంచి భూత్పూర్ వైపు వెళ్లాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు దివిటిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రవి మృతి చెందాడు. అతని వివరాలు ఏవీ తెలియకపోవడంతో పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా జిల్లా ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చారు. ఈ క్రమంలో అతడు ఇంటికి రాకపోయే సరికి కుటుంబసభ్యులు వెతకటం ఆరంభించారు. ప్రమాద విషయం తెలుసుకుని మార్చురీలో ఉన్న మృతదేహన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. దీంతో బుధవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అనారోగ్యంతో అన్న.. ఇదిలా ఉండగా, శేఖర్ అనారోగ్యంతో ఇంట్లోనే ఉంటుండగా బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఇరువురి అంత్యక్రియలు బుధవారం సాయంత్రం జడ్చర్లలో నిర్వహించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందటం, అంత్యక్రియలు నిర్వహించాల్సి రావటంతో ఆ కుటుంబ సభ్యుల్లో తీరని విషాదం అలుముకొంది. -
జడ్చర్ల: ఆశావాహులు అడ్డగోలు.. అయోమయం వీడితేనే..!
నియోజకవర్గం: జడ్చర్ల మండలాల సంఖ్య: 6 (జడ్చర్ల, మిడ్జిల్, ఊరుకొండ, బాలానగర్, రాజాపూర్, నవాబుపేట) మొత్తం పంచాయితీలు: 187 మొత్తం ఓటర్లు: 202404 ఓట్లు పురుషులు: 102076; మహిళలు: 100326 ఆ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి . ఉమ్మడి పాలమూరు జిల్లాకు రాజకీయ మూలస్థంభంగా వున్న జడ్చర్ల నియోజక వర్గంలో ప్రధాన పార్టీలలో పోటీ చేయాలనే ఆశావాహుల సంఖ్య పెరుగుతుండటం ఆసక్తిని రేపుతుంది. నేతల వ్యవహారంతో అయా పార్టీలో వున్న కార్యకర్తలు అయోమయానికి గురి అవుతున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ అనివార్యం కానుంది. పారిశ్రామికంగా దినదినాభివృద్ది చెందుతున్న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా నడుస్తోంది. ఇటు 44 అటు 167 జాతీయ రహదారులు జడ్చర్ల మీదుగా వెళ్తున్నాయి. దీంతో ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. 2014, 2018 ఎన్నికల్లో జడ్చర్లలో టీఆర్ఎస్ నుంచి డాక్టర్ లక్ష్మారెడ్డి గెలిచారు. ఓ సారి మంత్రిగా పనిచేశారు. సిట్టింగులకే సీట్లంటూ కేసీఆర్ చేసిన ప్రకటనతో మరోసారి ఆయనే పోటీకి రెడీ అయ్యారు. రీసెంట్గా అభ్యుర్థుల ప్రకటించిన అధిష్టానం మరోసారి జడ్చర్ల టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యేకే కెటాయించింది. లక్ష్మారెడ్డి నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. మొదటి నుంచి లక్ష్మారెడ్డి కేసీఆర్‌కు సన్నిహితుడిగా ఉన్నారు. 2008లో ఆయన సూచన మేరకు మొదటి వ్యక్తిగా తన పదవికి రాజీనామా చేసి తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో, 2009లో ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత వరుసగా గెలిచారు. పార్టీల్లో కుమ్ములాటలు రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. ప్రభుత్వం నుంచి అన్ని నియోజకవర్గాలకు వచ్చిన ప్రకారం అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేశారు తప్పా తనకంటూ ప్రత్యేక గుర్తింపు నిచ్చే పని ఏ ఒక్కటి చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరిన వారికి సరైన ప్రాధాన్యత లేదనే అసంతృప్తి చాలా మందిలో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరంతా ఎన్నికల నాటికి లక్ష్మారెడ్డికి హ్యండ్ ఇస్తారనే చర్చ సాగుతుంది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు తగిన న్యాయం చేయలేదనే అపవాదు కూడా ఉంది. ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగటమే కాగా ఇళ్ల పరిహారంలో అక్రమాలు జరిగాయే ఆరోపణలు ఉన్నా న్యాయం చేయటం లేదనే విమర్శలు ఉన్నాయి. జడ్చర్ల మున్సిపాలిటీలో పలువురు కౌన్సిలర్లు భూకబ్జాలు, అవినీతి కార్యకలాపాల్లో తలదూర్చుతున్నా ఎమ్మెల్యే వారిని కట్టడి చేయటంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడ మైనస్‌గా మారే అవకాశం ఉంది. అయితే ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న కుమ్ములాటలు కలిసొస్తాయని ఆశగా ఉన్నారు. ఈసారి జడ్చర్ల నుంచి మన్నె జీవన్‌రెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. ఆయన మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్న కుమారుడు. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. ఆయనకు కేటీఆర్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో తరచు పర్యటించటం బీఆర్ఎస్ నేతలతో టచ్‌లో ఉండటం చూస్తుంటే ఆయన వచ్చే ఎన్నికల్లో రంగంలో దిగటం ఖాయంగా కనిపిస్తోంది. వ్యూహత్మకంగానే జీవన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇద్దరు సీటు విషయంలో పోటీ పడితే పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉంది. మూడు ముక్కలాట కాంగ్రెస్ పార్టీలో మూడు ముక్కలాట నడుస్తోంది. మొదటి నుంచి ఇక్కడ మల్లురవి ఇంచార్జీగా ఉన్నారు. ఆయన కేవలం 2008లో జరిగిన ఉపఎన్నికల్లో స్వల్ప ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో పోటీ చేయటం ఓడిపోవటం పరిపాటిగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన మల్లురవి మరోసారి అక్కడి నుంచే పోటీ చేసే అవకాశాలున్నాయి. జడ్చర్లలో ప్రస్తుతం జనుంపల్లి అనురుద్రెడ్డి ఇంచార్జీగా కొనసాగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎం.చంద్రశేఖర్ అలియాస్ ఎర్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరటంతో ముసలం మొదలయ్యింది. మొదటి నుంచి ఆయన రాకను అడ్డుకుంటూ వచ్చారు. ఆయనకు నేరచరిత్ర ఉందని పార్టీలో చేర్చుకోవద్దని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు. తనకు సన్నిహితుడైన అనిరుద్‌రెడ్డికి సీటు విషయంలో ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశ్యంతోనే కోమటిరెడ్డి అడ్డుపడ్డారనే ప్రచారం సాగుతుంది. ఆయన టీడీపీలో ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డి, చంద్రశేఖర్‌కి మంచి సంబంధాలు ఉన్నాయి. దీనికి తోడు బీసీ ఓట్లు అధికంగా ఉన్న జడ్చర్ల నియోజకవర్గంలో గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్ర శేఖర్‌ను పార్టీలో తీసుకుంటే కలిసివస్తుందని భావించి ఆయనను పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఇద్దరి మధ్య గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. నియోజకవర్గంలో ఎవరికి వారు తమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎడమొహం..పెడమొహంగా ఉన్నారు. అనిరుధ్ రెడ్డి మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లో పోటీ చేయటం ఖాయమని ఆయన వర్గీయులు చెబుతున్నారు. సీటు నిరాకరిస్తే వేరే పార్టో లేక ఇండిపెండెంటుగానైనా బరిలో దిగుతారనే ప్రచారం సాగుతుంది. రాహుల్ గాంధీ జోడో యాత్రను నియోజకవర్గంలో విజయవంతం చేయటంలో అనిరుధ్‌రెడ్డి కీలకంగా పనిచేసి పార్టీ డిల్లీ అధినేతలతో శభాష్ అనిపిచ్చుకున్నారు. నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు, పాదయాత్ర నిర్వహిస్తూ అనిరుధ్‌రెడ్డి జనాలకు చేరువయ్యే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కానీ రేవంత్‌రెడ్డికి కాకుండా కోమటిరెడ్డి వెంకట్ట్రెరెడ్డి వర్గీయుడిగా ముద్రపడటం ఆయనకు మైనస్‌గా మారింది. ఎర్రశేఖర్ ప్రస్తుతం నియోజకవర్గంలో తిరుగుతున్నారు. పాత నేతలు, తన వర్గీయులను కలుస్తున్నారు. నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అధికంగా ఉండటం ఎర్ర శేఖర్‌కు కలిసి వచ్చే అవకాశంగా ఉంది. గతంలో ఓడిన తర్వాత నియోజకవర్గం వైపు తిరిగి చూడకుండా కార్యకర్తలను పట్టించుకోలేదనే అపవాదు కూడా ఆయనపై ఉంది. నియోజకవర్గంలో బీజేపీ పార్టీ పరిస్థితి ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కు అన్నట్లుగా ఉంది. అయోమయంలో కార్యకర్తలు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు సన్నిహితంగా ఉన్న బాలత్రిపురసుందరీ ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలు తిరుగుతూ పట్టు సాదిస్తుండగా ఆ పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ సైతం ఇక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రచారంలో ఉంది. ఇప్పటికే నియోజకవర్గంలో మూడు, నాలుగు గ్రూపులు బీజేపీ పార్టీలో ఉండగా ప్రస్తుత రాజకీయ అస్పష్టతతో ఎపుడు ఎవరు ఏ గ్రూప్‌లో చేరతారో తెలియకుండా పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. బీఎస్పీ నుంచి బాలవర్థన్ గౌడ్ పోటీ చేసేందుకు సన్నద్దమవుతున్నారు. మొత్తంగా జడ్చర్ల నియోజకవర్గం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
అరుదైన పాము ‘కామన్కుక్రి’ పట్టివేత
సాక్షి, జడ్చర్ల టౌన్: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఆదివారం కామన్కుక్రి అనే అరుదైన పామును పట్టుకున్నారు. పట్టణంలోని వెంకటేశ్వరకాలనీలో ఓ వ్యాపారి ఇంట్లోకి పాము చొరబడగా ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సర్ప రక్షకుడు డాక్టర్ సదాశివయ్యకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో ఆయన తన శిష్యుడు, బీజెడ్సీ విద్యార్థి రాహుల్‌ను పంపించగా.. ఆయన పామును పట్టుకుని కళాశాలకు తీసుకెళ్లారు. కామన్కుక్రి పాము ప్రమాదకరం కాదని, అయితే అవి ఈ ప్రాంతంలో తక్కువ సంఖ్యలో సంచరిస్తాయని సదాశివయ్య చెప్పారు. కుక్రి పామును అంతరించిపోతున్న పాముల్లో ఒకటిగా ఐయూసీఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్– అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంస్థ) గుర్తించింది. ఈ పాము ఎక్కువగా చెత్తాచెదారంలో ఉండి సాయంత్రం సమయంలో బయటకు వస్తుందని, విషరహిత సర్పమని పేర్కొన్నారు. గ్రామంలోకి అడవిబర్రె ఏటూరునాగారం (ములుగు జిల్లా) : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని శివాపురం దట్టమైన అటవీప్రాంతం నుంచి అడవిబర్రె శనివారం గ్రామంలోకి వచ్చి హల్చల్ చేసింది. దానిని చూసి ఆందోళన చెందిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారమివ్వగా...అధికారులు వచ్చి దానిని మళ్లీ అడవిలోకి పంపించారు. దారితప్పి గ్రామంలోకి వచ్చిందని, ఎవరూ ఆందోళన చెందనవసరంలేదని అటవీ అధికారులు సూచించారు. -
జడ్చర్ల కోనేరుకు వెయ్యేళ్ల చరిత్ర
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని కోనేరుకు వెయ్యేళ్ల చరిత్ర ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ శివనాగిరెడ్డి తెలిపా రు. ఆయన ఆదివారం కోనేరును సందర్శించి పలు ఆసక్తికర వివరాలను వెల్లడించారు. ఈ కోనేరును కల్యాణ చాళుక్యుల కాలంలో క్రీ.శ.11వ శతాబ్దిలో నిర్మించినట్లు మండపంలోని స్తంభాలు, శిథిల శిల్పాలను బట్టి తెలుస్తోందని వివరించారు. జడ్చర్లలో కల్యాణ చాళుక్యల శాసనం, కందూరు చోళుల శాసనం ఉన్నాయన్నారు. జడ్చర్ల పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉన్న క్రీ.శ.1125, ఫిబ్రవరి 19 నాటి కల్యాణ చాళుక్య చక్రవర్తి భూలోక మల్ల మూడో సోమేశ్వరుడి శాసనంలో.. ఆయన కుమారుడైన మూడో తైలపుడు యువరాజుగా కందూరును పాలిస్తుండగా గంగాçపురంలో ఒక జైన చైత్యాలయాన్ని నిర్మించినట్లుందని తెలిపారు. ఆలయం వెలుపల క్రీ.శ.11వ శతాబ్దికి చెందిన సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాన్ని భద్రపరిచారన్నారు. రెండు వైపుల మెట్లు, మండపాలు కదిలిపోయాయని పేర్కొన్నారు. వీటికి మరమ్మతులు చేసి కోనేరుకు పూర్వ వైభవం తీసుకురావచ్చని, ఇందుకు స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. -
జడ్చర్ల నేతాజీ చౌరస్తాలో ఉద్రిక్తత
-
ప్రియుని ద్వారా నయం కాని రోగం.. భర్తకు మరో పెళ్లి.. ట్విస్టుల మీద ట్విస్టులు
సాక్షి, జడ్చర్ల: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కత్తితో దాడి చేసిన సంఘటన గురువారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో కలకలం రేపింది. సీఐ రమేశ్‌బాబు కథనం మేరకు వివరాలిలా.. హన్వాడ మండల దాచన్‌పల్లికి చెందిన సంజన్న, శిరీష భార్యాభర్తలు. వీరికి ఐదేళ్ల క్రితం పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి జరిగింది. పెయింటర్‌గా పనిచేసే సంజన్న, తన భార్యతో హైదరాబాద్‌లో ఉంటున్న క్రమంలో హుజూర్‌నగర్‌కు చెందిన రాంబాబుతో శిరీషకు పరిచయమైంది. రాంబాబు, శిరీషలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ప్రియుడు రాంబాబు ద్వారా శిరీషకు నయంకాని వ్యాధి రావడంతో తన భర్తను దూరం పెడుతూ వచ్చింది. చివరకు విషయాన్ని భర్తకు వివరించి నెల రోజుల క్రితం మరొక యువతితో సంజన్నకు పెళ్లి జరిపించి పెద్దల సమక్షంలో విడిపోయారు. అయితే సంజన్నతో కేవలం వారం రోజులు మాత్రమే ఉన్న రెండో భార్య ఆయనను విడిచివెళ్లిపోయింది. వారం క్రితం మొదటి భార్య శిరీష ప్రియుడు రాంబాబుతో వెళ్లిపోయింది. దీంతో ఒంటరిగా మిగిలిన భర్త సంజన్న తన మొదటి భార్య శిరీషతోనే కలిసి ఉండాలని నిశ్చయించుకొని ఆమెకు ఫోన్ చేశాడు. జడ్చర్లకు రావాలని అక్కడ ముగ్గురం కలిసి మాట్లాడుకుందామని నచ్చజెప్పి జడ్చర్లకు పిలిపించాడు. ఈ క్రమంలో ప్రధాన రహదారిపై నుంచి భార్యను జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో సాయినగర్‌కు వెళ్లే రహదారిపైకి మాట్లాడుకుంటూ తీసుకువచ్చి ఆకస్మికంగా తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. కొంచెం దూరంగా ఉన్న ప్రియుడు రాంబాబు వెంటనే తేరుకుని అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతనిపై కూడా దాడి చేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న శిరీష, రాంబాబును బాదేపల్లి ప్రభు త్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ముక్కుకోసి అందవిహీనంగా చేద్దామని.. రెండో పెళ్లి చేసుకున్న కూడా భార్య విడిచిపోవడంతో ఎలాగైనా తన మొదటి భార్య శిరీషను తాను దక్కించుకోవడానికి నిందితుడు పక్కా స్కెచ్ వేసినట్లు తెలిసింది. తనకు భార్య ద్వారా రోగం వచ్చినా ఫర్వాలేదు అనే నిర్ణయానికి వచ్చి తన భార్యతోనే కలిసి ఉండాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కత్తితో ముక్కును కోసి అందవిహీనంగా తయారు చేస్తే తన భార్య తనకు దక్కుతుందని అనుకున్నాడు. అందుకు అనుగుణంగా తన గదిలో ఉండే కూరగాయల కత్తిని వెంట తెచ్చుకున్నాడు. అయితే కత్తితో దాడి చేస్తున్నాడని పసిగట్టిన భార్య శిరీష తప్పించుకునే ప్రయత్నం చేయడంతో తొడ, వీపు భాగాలపై పొడిచాడు. -
ఎంతటి విషాదం.. స్కూటీపై వెళ్తుండగానే గుండెపోటు.. వీడియో వైరల్
సాక్షి, మహబూబ్ నగర్: జడ్చర్ల పట్టణానికి చెందిన రాజు అనే ఓ యువకుడు వాహనంపై వెళుతుండగానే గుండెపోటు రావడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు. పట్టణంలోని పాత బజార్‌కు చెందిన ఇరవై ఆరేళ్ల రాజు ప్రైవేట్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ సాయంత్రం తనకు గుండెల్లో నొప్పిగా ఉందని మిత్రులతో చెప్పగా.. ఓ మిత్రుడు తన స్కూటీపై రాజును తీసుకొని ఆసుపత్రికి బయలుదేరాడు. కాగా మార్గమధ్యంలోనే గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడం.. వాటిని సోషల్ మీడియా ద్వారా చూసిన ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. చదవండి: (ExtraMarital Affair: మామా నీ కూతుర్ని చంపేశా..) -
వేరే మహిళతో భర్త సంబంధం.. సర్పంచ్ తట్టుకోలేక..
జడ్చర్ల టౌన్: కుటుంబ కలహాలతో ఓ మహిళా సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని మాచారానికి చెందిన సిరి (28)కి నసురుల్లాబాద్‌తండా వాసి శ్రీనివాస్‌తో 11 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే కొన్నేళ్లుగా భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకోవడంతో కలహాలు మొదలయ్యాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోగా పలుమార్లు గొడవలు జరిగి పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. అయినా భర్త వైఖరిలో మార్పు రాకపోవడంతో మనోవేదనకు గురైన భార్య వారం కిందట ఇంట్లోనే గడ్డిమందు తాగింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందింది. శనివారం సాయంత్రం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని తండాకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురాలి సోదరుడు శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జడ్చర్ల పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఆమె భర్త ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. సర్పంచ్ల సంఘం సంతాపం నసురుల్లాబాద్‌తండా సర్పంచ్ సిరి మృతిపై సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్‌చందర్, మండల అధ్యక్షుడు బాల్‌సుందర్ తదతరులు సంతాపం వ్యక్తం చేశారు. జెడ్పీ వైస్‌చైర్మన్ కోడ్గల్ యాదయ్యతో పాటు సర్పంచ్ల సంఘం రాష్ట్ర నాయకులు తండాలో రాత్రి జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తాము అండగా ఉంటామని పిల్లలకు భరోసా కల్పించారు. -
అన్ని చోట్ల గుబాళింపు: టీఆర్ఎస్లో డబుల్ జోష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఫుల్ జోష్‌లో ఉంది. నాగార్జునసాగర్ శాసనసభ ఉప ఎన్నికలో గెలిచిన ఆనందంలో ఉండగానే మినీ మున్సిపల్స్‌లో అద్భుతమైన విజయంతో డబుల్ సంతోషంలో టీఆర్ఎస్ శ్రేణులు మునిగారు. రాష్ట్రంలో జరిగిన ఐదుకు ఐదు మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం ఐదు మున్సిపాలిటీలను సొంతం చేసుకుని గులాబీ పార్టీ సత్తా చాటింది. ఇక వరంగల్, ఖమ్మం కార్పొఒరేషన్లను కూడా టీఆర్ఎస్ సొంతం చేసుకోవడంతో గులాబీ శ్రేణుల్లో డబుల్ జోష్ వచ్చింది. నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. నకిరేకల్‌లో 20 వార్డులు ఉండగా వాటిలో టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 2, ఇతరులు 6 గెలిచారు. ఆ ఇతరుల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందినవారే ఉన్నారు. రేపోమాపో వారు కూడా టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది. దీంతో టీఆర్ఎస్ సంఖ్య పెరగనుంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీని టీఆర్ఎస్ 7 స్థానాలతో సొంతం చేసుకుంది. 12 డివిజన్లు ఉండగా టీఆర్ఎస్ 7 గెలవగా కాంగ్రెస్ 5 డివిజన్లలో గెలిచింది. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలో 20 డివిజన్లు ఉండగా టీఆర్ఎస్ 13 గెలిచి చైర్మన్ పీఠం సొంతం చేసుకుంది. మిగతా స్థానాల్లో కాంగ్రెస్ 6, బీజేపీ 1 గెలుచుకున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్ భారీగా డివిజన్లు సొంతం చేసుకుంది. మొత్తం 27 డివిజన్లు ఉండగా వాటిలో 23 టీఆర్ఎస్ గెలిచి సత్తా చాటింది. కాంగ్రెస్ 2, బీజేపీ 2 డివిజన్లతో సరిపెట్టుకున్నాయి. సిద్దిపేట జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీలో మంత్రి హరీశ్ రావు మ్యాజిక్ చేసినట్టు కనిపిస్తోంది. 43 స్థానాలు ఉన్న సిద్దిపేట మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఏకంగా 36 సొంతం చేసుకుంది. ఒకటి చొప్పున బీజేపీ, ఎంఐఎం గెలవగా ఇతరులు 5 డివిజన్లలో గెలిచారు. ఇతరులు కూడా టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది. క్లీన్ స్వీప్ చేస్తుందని అందరూ భావించగా కొద్దిలో ఆ అవకాశం మిస్సయ్యింది. సొంత నియోజకవర్గం సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు సత్తా చాటారు. కార్పొరేషన్ ఫలితాలు గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లను కూడా టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. టీఆర్ఎస్ 51 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 10 సొంతం చేసుకోగా, రెండుచోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. స్వతంత్రులు ముగ్గురు గెలుపొందారు. ఖమ్మం కార్పొరేషన్లో 55 డివిజన్లు ఉండగా అత్యధిక డివిజన్లను అధికార పార్టీ టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. 45 డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ గెలుపొంది కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ 8 డివిజన్లు, బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. స్వతంత్రులు రెండు చోట్ల గెలుపొందారు. చదవండి: థియేటర్లో కాదు.. శ్మశానాల్లో ‘హౌస్ ఫుల్’ చదవండి: డీఎంకే విజయంలో ‘ఇటుక’దే కీలక పాత్ర -
త్వరలో కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు
జడ్చర్ల/అచ్చంపేట: రాష్ట్రంలో త్వరలోనే కొత్త రేషన్‌కార్డులు, కొత్త పింఛన్లు జారీ చేస్తామని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 1.52 లక్షల ఉద్యోగాలు కల్పించామని, త్వరలోనే మరో 52 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నామని ప్రకటించారు. కరోనా కారణంగా పలు అంశాల్లో కొంత ఆలస్యం జరిగిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో అధోగతి పాలైన తెలంగాణను.. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీల్లో, రంగారెడ్డి జిల్లా కొత్తూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయా చోట్ల జరిగిన బహిరంగ సభల్లో కేటీఆర్ మాట్లాడారు. టీడీపీ, కాంగ్రెస్ పాలనలో వివక్షకు గురైన తెలంగాణను.. ఇప్పుడు సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. ఉమ్మడి పాలనలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పింఛన్ రూ.75 ఇచ్చేవారని, ఎవరైనా లబ్ధిదారు మరణిస్తే గానీ కొత్తగా మరొకరికి పింఛన్ వచ్చే పరిస్థితి ఉండేది కాదని గుర్తు చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ.200 చొప్పన పింఛన్ ఇచ్చిందని, ప్రస్తుతం సీఎం కేసీఆర్ పది రెట్లు పెంచి రూ.2,000 చొప్పున.. ఏకంగా 40 లక్షల మందికి అందిస్తున్నారని పేర్కొన్నారు. అర్హులైన మహిళల పేరిట డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయిస్తామన్నారు. ఒంటరి మహిళలకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా పింఛన్లు ఇస్తున్నామన్నారు. ‘‘ఇల్లు నేనే కట్టిస్తా, పెళ్లి నేనే చేయిస్తానంటూ మేనమామలా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారు’ అని కేటీఆర్ కొనియాడారు. రైతులకు మేలు కోసం.. రాష్ట్రంలో మాతాశిశు మరణాల రేటు తగ్గిందని, జాతీయ స్థాయి గణాంకాలు కూడా ఇదే చెప్తున్నాయని కేటీఆర్ అన్నారు. 75 ఏళ్ల ఎందరో పీఎంలు, సీఎంలు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించారని.. అంతా రైతుల గురించి మాట్లాడే వారేగానీ చేసిందేమీ లేదని చెప్పారు. కేసీఆర్ వచ్చాక రైతు బంధు, బీమాతో భరోసా కల్పించారన్నారు. జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. కాగా.. కేటీఆర్ పర్యటన ఉండటంతో అచ్చంపేటలో బీజేపీ, పలు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అయినా కొందరు నేతలు, కార్యకర్తలు అచ్చంపేట బస్టాండ్ సమీపంలో కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు శ్రీనివాస్‌రెడ్డి, రాములు, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి.. అచ్చంపేట సభలో ఎంపీ రాములు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, హర్షవర్ధన్‌రెడ్డి, అబ్రహం తదితరులు పాల్గొన్నారు. చదవండి: కరోనా రోగుల్లో మూడోవంతు ఆసుపత్రుల్లోనే..! -
అవసరమైతే సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి
అవసరమైతే సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి.. నిర్వాసితులకు మేలు చేస్తామని రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్‌లో మంపు నిర్వాసితులు చేపట్టిన దీక్ష శిబిరానికి వారు చేరుకుని ఆందోళన విరమించాలని కోరారు. సాక్షి, జడ్చర్ల : అవసరమైతే సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి.. నిర్వాసితులకు మేలు చేస్తామని రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న వల్లూరు, ఉదండాపూర్ ప్రజలు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కొన్ని రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మంగళవారం అక్కడి శిబిరానికి చేరుకుని ఆందోళన విరమించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాల్లో నిర్వాసిత కుటుంబాలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో సేకరించిన భూములకు అతి తక్కువ ధరలు ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు పనిగట్టుకుని రెచ్చ గొడుతున్నాయని, ఆ నాయకుల మాటలను నమ్మి మోసపోవద్దన్నారు. పునరావాసం, ముంపునకు గురవుతున్న ఇళ్లకు సంబంధించిన ప్యాకేజీ తదితర సమస్యలను చర్చించేందుకు ఓ కమిటీగా ఏర్పడి అసెంబ్లీ వద్దకు రావాలన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ తదితర కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను అందజేసి ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తామన్నారు. పోలేపల్లి పరిధిలోని భూములకు రూ.12.5 లక్షలు ఇస్తున్నట్లు వచ్చిన ప్రచారంలో నిజం లేదని, నిబంధనల మేరకే పరిహారం అందుతుందన్నారు. నిర్వాసితులకు బండమీదిపల్లి, శంకరాయపల్లి పరిధిలో ఒక్కో కుటుంబానికి 300 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తామన్నారు. 18ఏళ్లు నిండిన యువకులకు పునరావాసంలో ప్రాధాన్యత ఇస్తామన్నారు. రిజర్వాయర్‌లో చేపలను పట్టుకుని అమ్ముకుని ఉపాధి పొందేందుకు అనుమతి ఇస్తామన్నారు. వారి వెంట జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, ఆర్డీఓ శ్రీనివాస్, జడ్చర్ల తహసీల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. -
పెట్రోల్, డీజిల్‌లో జోరుగా కల్తీ
ధనార్జనే లక్ష్యంగా.. కొందరు బంకు యజమానులు పెట్రోల్, డీజిల్‌ను కల్తీ చేస్తూ జేబులు నింపుకుంటుండగా.. మరికొందరు నిబంధనలకు పాతరా వేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ కల్తీ పెట్రోల్, డీజిల్ వాడకంతో వాహనాలు మొరాయించడం.. వాటి లైఫ్ టైం తగ్గిపోవడంతోపాటు రిపేర్ చేయించేందుకు వెళ్తే షోరూంలలో రూ.వేలల్లో వినియోగదారుడి జేబుకు చిల్లు పడుతుంది. దీనిపై ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సంఘటనే జడ్చర్ల సమీపంలోని పెట్రోల్ బంక్‌లో ఇటీవల చోటుచేసుకుంది. సాక్షి, జడ్చర్ల: పెట్రోల్‌బంకుల్లో ఇంధన కల్తీతో వాహనదారుడు ఆందోళన చెందుతున్నాడు. కొన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయించుకునే సమయంలో బండిలో పెట్రోల్ పడక ముందే గిర్రున మీటర్ తిరిగి 2 నుంచి 4పాయింట్లు చూయిస్తుండడం, వెంటనే రెడ్‌హ్యాండ్‌గా పట్టుకుని అడిగితే.. అదంతే దిక్కున్న చోట చెప్పుకోమంటు బంక్ సిబ్బంది అక్రోషం వెల్లగక్కుతున్నారు. ఇలా డీజిల్, పెట్రోల్‌బంకుల నిర్వాహకుల ఆగడాలు మితిమీరిపోతున్న సంఘటనలు జిల్లాలో నిత్యకృత్యంగా మారాయి. ఆయా సంఘటనలపై ఫిర్యాదు చేసినా పట్టింపు లేక పోవడంతో కొద్ది సేపు అరిచి వెళ్లి పోవడం షరామామూలుగా మారింది. అంతేగాక ఎవరికి ఫిర్యాదు చేయాలో చాలా మందికి తెలియని పరిస్థితి ఉంది. ఇందుకు సంబందించి ఫిర్యాదు స్వీకరించే అదికారుల ఫోన్ నంబర్లు, తదితర సమాచారాన్ని పెద్ద ఆక్షరాలతో ప్రతి బంకువద్ద రాయిస్తే బాగుంటుందని వినియోగదారులు పేర్కొంటున్నారు. మచ్చుకు కొన్ని.. బాదేపల్లికి చెందిన దస్తగీర్ తన ఫార్చునర్ వాహనంలో పట్టణంలోని ఓ పెట్రోల్‌బంక్‌లో డీజిల్ పోయించి కొద్ది దూరం వెళ్లేలోగా వాహనం నిలిచిపోయింది. మెకానిక్‌తో విచారిస్తే ట్యాంకులో డీజిల్‌కు బదులు నిండా నీరే ఉందని చెప్పాడు. డీజిల్ కొట్టించిన సమయంలో ట్యాంకులో చేరిన నీరే వాహనంలోకి పంపింగ్ అయ్యిందని తరువాత సదరు ఇంధన కంపెనీ సేల్స్ ఆఫీసర్ ధ్రువీకరించారు. మరో బంకులో ఓ వ్యక్తి తన వోక్స్‌వ్యాగెన్ పోలో కారులో డీజిల్ పోయించాడు. ట్యాంకు ఫుల్ చేయించిన తరువాత హైద్రాబాద్ వెళ్లి జడ్చర్లకు తిరిగి వస్తుండగా కొత్తూరు దాటిన తరువాత అకస్మికంగా కారు ఆగిపోయింది. దీంతో అతను కారు కంపెనీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి నుండి వచ్చిన మెకానిక్ తనిఖీ చేసి డీజిల్‌లో కిరోసిన్ కల్తీ జరగడం వలన నాజిల్స్ దెబ్బతిన్నాయని పేర్కొన్నాడు. నాజిల్స్ కొత్తవి అమర్చడానికి రూ:లక్ష దాకా ఖర్చవుతుందని బాదితుడు వాపోయాడు. గంగాపూర్ రహదారిలో గల పెట్రోల్ బంకులో ఉదయాన్నే ఓ యువకుడు తన మోటార్ బైక్‌లో లీటర్ పెట్రోల్ పోయించాడు. అనంతరం బంకు దాటిండో లేడో బండి ఆగిపోయింది. బైక్ ట్యాంకు ఓపెన్‌చేసి చూస్తే చుక్క పెట్రోల్ లేదు. అదేంటి ఇప్పుడే లీటర్ పోయించా గదా పెట్రోల్ రాలేదు ఏంటీ అని ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదని బుకాయింపు పైగా బెదిరింపు ధోరణి. పారదర్శకతకు పాతర ఇంధన విక్రయాలు పారదర్శకంగా కొనసాగే విధంగా పర్యవేక్షించాల్సిన అధికారులు, కంపెనీ ప్రతినిధులు నిబంధనలకు నీళ్లొదిలి నిర్వాహకులతో కుమ్మక్కు కావడంతోనే కల్తీ పెట్రోల్, డీజిల్ విక్రయాలు యథేచ్చగా కొనసాగుతున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గత మూడేళ్ల క్రితం జడ్చర్ల జాతీయరహదారిని అనుసరించి నిర్వహిస్తున్న ఓ పెట్రోల్ బంక్‌లో ఏకంగా భూగర్భం ద్వార పైపులైన్ వేసి కిరోసిన్‌ను నింపుతుండగా విజిలెన్స్ అధికారులు దాడి చేసి కిరోసిన్ కల్తీని వెలుగులోకి తీసుకువచ్చిన సంఘటన అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. నిబంధనలు బేఖాతరు పెట్రోల్ బంకుల్లో కనీస నిబంధనలు పాటించ డం లేదు. నిబంధనల మేరకు వినియోగదారులకు తాగు నీరు, మరుగుదొడ్లు, ఉచితంగా వా హనాల టైర్లకు గాలి సౌకర్యం, బిల్లులు ఇవ్వ డం, తదితర సౌకర్యాలను నిర్వాహకులు ఏర్పా టు చేయాలి. అదేవిధంగా అగ్ని ప్రమాదాల నివారణకు గాను నీటి వసతి కోసం ఖచ్చితంగా బోరు ఉండాలి. కొలతల్లో అనుమానాలను నివృత్తి చేసేందుకు వినియోగదారుల డిమాండ్ మేరకు 5లీటర్ల కొలత పాత్రలో ఇంధనం నింపి మాక్ టెస్టింగ్ చేసి చూపించాలి. అదేవిధంగా ప్రతి వాహనదారుడికి బిల్లులు ఇవ్వాలి. డీజిల్ ట్యాంకులో నీళ్లు బంకుల్లో భూగర్భంలో ఇంధన నిల్వ కోసం ఏర్పాటు చేసిన ట్యాంకుల్లో వివిధ కారణాలుగా నీళ్లు చేరే అవకాశం ఉంటుందని ఇంధన కంపెనీ అధికారులు ఈసందర్భంగా పేర్కొంటున్నారు. వాహనాల్లో ఇంధనం నింపే సమయంలో బంకులోని ట్యాంకర్ల అడుగు భాగంలో సబ్మెర్సిబుల్ మోటారు పంపు ఉండడంతో మొదటగా నీటినే లాగేస్తుంది. దీంతో వాహనాల్లోకి నీళ్లు చేరే అవకాశం ఉంటుందని ఇందన కంపెనీ సేల్స్ ఆఫీసర్ ఈసందర్భంగా పేర్కొన్నారు. ఇదిలాఉండగా, ఇప్పటికైనా వినియోగదారులకు న్యాయం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం పెట్రోల్, డీజిల్ బంకుల్లో అక్రమాలకు తావిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. త్వరలోనే బంకుల్లో తనిఖీలు చేపడుతాం. వినియోగదారుల నుండి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి విచారిస్తున్నాం. జడ్చర్లలో ఓ బంకుపై వచ్చిన ఫిర్యాదుపై విచారించి వెంటనే ట్యాంకును శుభ్రం చేయించే విదంగా ఆదేశించాం. – వనజాత, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
గుండ్లపొట్లపల్లి సర్పంచ్‌కు అరుదైన గౌరవం
సాక్షి, జడ్చర్ల : సర్పంచ్‌గా ఎన్నికైనప్పటి నుంచి గ్రామాభివృద్ధి కోసం అహర్నిషలు కృషిచేస్తూ.. వందశాతం ఓడీఎస్‌తోపాటు వందశాతం ఇంటింటికీ ఇంకుడు గుంతలు పూర్తి చేసినందుకు గాంధీ జయంతి, స్వచ్ఛ భారత్ దివస్ 2019కి సందర్బంగా గుండ్లపొట్లపల్లి సర్పంచ్ రాఘవేందర్‌రెడ్డి ఈ నెల 30న, అక్టోబర్ 1, 2 తేదీల్లో అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమంలో ప్రధాని మోదీ చేతులమీదుగా అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. కార్యక్రమానికి దేశంలో గ్రామాభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్న 240 మందికి ఆహ్వానం అందగా.. రాష్ట్ర నుంచి 12 మంది సర్పంచ్‌లు ఉన్నారు. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి గుండ్లపొట్లపల్లి సర్పంచ్ రాఘవేందర్‌రెడ్డికి అవకాశం ద క్కింది. అంతేకాకుండా ఈ నెల 25న ఢిల్లీలో డాక్టర్ శ్యాంప్రసాద్‌ముఖర్జీ జాతీయ ఎక్సలెన్సీ అవార్డును సైతం అందుకోవాలని సోమ వారం ఢిల్లీలోని చాణక్య ఫౌండేషన్ స్వ చ్ఛ భారత్ అభియాన్ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఆహ్వనం అందింది. -
భార్య మృతి తట్టుకోలేక..
సాక్షి, నవాబుపేట (జడ్చర్ల): పెళ్లి పందిట్లో తోడూనీడగా ఉంటామని బాస చేసిన ఆ వధూవరులు.. తాము ఉంటే ఇద్దరం జీవించాలి.. లేకుంటే చనిపోవాలంటూ నిర్ణయించుకున్నట్టుంది..! భార్య మరణ వార్త విన్న వెంటనే భర్త ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన సంఘటన ఇది. వివరాలిలా ఉన్నాయి. నవాబుపేట మండలం లోని కేశవరావుపల్లికి చెందిన కావలి నర్సింహులు (25) కు కోస్గి మండలం కొండాపూర్ వాసి యాదమ్మ (21) తో 16 నెలల క్రితమే వివాహమైంది. స్థానికంగా తమ పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా, మూడు రోజుల క్రితం సొంత పనిమీద బైక్‌పై ఇద్దరూ నవాబుపేటకు వెళ్లారు. అదే రోజు సాయంత్రం తిరిగి స్వగ్రామానికి వస్తుండగా అమ్మపూర్‌గేట్ సమీపంలో ప్రమాదవశాత్తు భార్య కింద పడింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. దీంతో ఒంటరి జీవితం తనకు వద్దంటూ మనస్తాపం చెందిన భర్త సమీపంలోని తమ పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడాడు. మృతుడి తండ్రి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. కాగా, వివాహం జరిగి పట్టుమని రెండేళ్లయినా నిండని దంపతులు ఇలా తుదిశ్వాస విడవటంతో గ్రామస్తులు బోరున్నారు. -
చివరిచూపు కోసం..
సాక్షి, నవాబుపేట (జడ్చర్ల) : ఆస్ట్రేలియాలో హత్యకు గురైన డాక్టర్ ప్రీతిరెడ్డి చివరి చూపైన మాకు దక్కెనా అంటూ మండలంలోని గురుకుంట గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. ఎక్కడో ఆస్ట్రేలియాలో జరిగిన దురాఘతానికి తమ పల్లె యువ డాక్టరమ్మ హత్యకు గురవడంతో గ్రామస్తులు కంటతడి పెట్టారు. కాగా ప్రీతిరెడ్డి హత్య విషయంలో అక్కడికి వెళ్లేందుకు రెండు రోజులుగా ప్రయత్నించిన బంధువులు ఎట్టకేలకు గురువారం బయలుదేరి వెళ్లారు. గ్రామానికి నర్సింహరెడ్డి గత 36 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లి సిడ్నీలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడే íస్థిరపడ్డారు. వీరికి ఆస్ట్రేలియాలో గ్రీన్ కార్డు ఉంది. ఆయన కూతురు ప్రీతిరెడ్డి అక్కడే డాక్టర్‌గా పనిచేస్తుంది. ఈ క్రమంలో తనతోపాటు డాక్టర్ వృత్తిలో ఉన్న వ్యక్తి (మాజీ ప్రీయుడి) చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో ప్రీతిరెడ్డి బాబాయిలు హైదరాబాద్‌కు చెందిన దామోదర్‌రెడ్డి, అమెరికాలో స్థిరపడిన హరికృష్ణరెడ్డి ఆస్ట్రేలియాకు బయలుదేరారు. అయితే ప్రీతిరెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువస్తారా.. అక్కడే ఖననం చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. కానీ ప్రీతిరెడ్డి గురుకుంట గ్రామానికి ఒకేసారి వచ్చిందని, స్వగ్రామంలోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించాలని గ్రామస్తులు పేర్కొంటున్నారు. బుధవారం ఆమె మృతికి అక్కడి వైద్య బృందం ఆస్పత్రిలో శ్రద్ధాంజలి ఘటించారు. -
హత్య చేసి.. ఆపై భయంతో ఆత్మహత్య..
నవాబుపేట(జడ్చర్ల): ఒకరిని హత్యచేసిన వ్యక్తి, భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం మండలంలోని పోమాల్ గ్రామంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పోమాల్ గ్రామానికి చెందిన పిడుగు వెంకటయ్య(యాసూభు)(35) ఆదివారం రాత్రి పొలంవద్ద గేదెలకు పాలుపితికి బైక్‌పై క్యాన్‌లో ఇంటికి తీసుకువస్తుండగా, అప్పటికే కాపుకాసిన అదే గ్రామానికి కామారం యాదయ్య బైక్‌ను అడ్డగించాడు. అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో వెంకటయ్య పరుగు తీస్తూ గ్రామంలోకి చేరుకుని కిందపడిపోయాడు. గ్రామస్తులు, బంధువులు గమనించి అతన్ని చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు సోమవారం మృతిచెందాడు. వెంకటయ్య చనిపోయాడని తెలియడంతో యాదయ్య(25) తీవ్ర భయానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే సోమవారం గ్రామ సమీపంలోని మర్రిచెట్టుకు ఉరి వేసుకు ని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనలపై కేసు నమోదు చేశామని ఎస్ఐ శివకుమార్ తెలిపారు. పెట్రోల్ దాడికి పాతకక్షలే కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. -
జడ్చర్లలో రికార్డు సత్యం..!
జడ్చర్ల టౌన్: జడ్చర్ల నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14సారు ఎన్నికలు జర్గగా ఎర్ర సత్యం అలియాస్ మరాఠి సత్యనారాయణ అత్యధిక మెజారిటీ సాదించి రికార్డు నెలకొల్పారు. 1962లో జడ్చర్ల నియోజకవర్గం ఏర్పడింది. 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన సమీప కాంగ్రెస్ అభ్యర్థి నర్సప్పపై 53,779ఓట్ల మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు. ఆ తర్వాత ఏ అభ్యర్థి కూడా ఈ రికార్డును చేరుకోలేకపోయారు. ఇక 1989లో కాంగ్రెస్ అభ్యర్థి సుధాకర్‌రెడ్డి 1,056 ఓట్ల తేడాతో విజయం సాదించారు. ఆయన సమీప టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డిపై గెలుపొందారు. ఇక మెజారిటీ విషయానికి వస్తే ఎర్ర శేఖర్ అలియాస్ ఎం.చంద్రశేఖర్ పేరిట రెండో రికార్డు నమోదైంది. 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో 47,735 ఓట్ల మెజారిటీతో ఆయన సమీప అభ్యర్థి సుధాకర్‌రెడ్డిపై గెలుపొందారు. నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్లు పోలైన రికార్డు కూడా ఎర్ర శేఖర్ పేరిటే ఉంది. 1996లో ఆయనకు ఏకంగా 72వేల ఓట్లు పోలయ్యాయి. ఒక అభ్యర్థికి ఇన్ని ఓట్లు రావడం జడ్చర్లలో ఇప్పటి వరకు ఇదే రికార్డు. రికార్డులపై లక్ష్మారెడ్డి దృష్టి జడ్చర్ల నియోజకవర్గంలో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఎర్ర శేఖర్‌కు దక్కింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ లక్ష్మారెడ్డి పలు రికార్డులపై దృష్టిసారించారు. మూడో పర్యాయం గెలవడం ద్వారా శేఖర్ రికార్డును సమం చేయటంతో పాటు ఎర్ర సత్యంకు దక్కిన మెజారిటీ దాటేందుకు కృషి చేస్తున్నారు. అలాగే, అత్యధికంగా ఓట్లు సాధించే రికార్డుపై ఆయన దృష్టి సారించి విస్తృత ప్రచారం చేస్తున్నారు. -
వారి మాట ‘నోటా’..
సాక్షి, కల్వకుర్తి టౌన్ : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైంది. అలాంటి ఓటు అనే వజ్రాయుధాన్ని వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ అవగాహన కల్పిస్తోంది. అయితే, ఓటు వేయాలనే భావన ఉన్నా అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే ఎలా అనే పరిస్థితి తలెత్తేది. కానీ కొన్నేళ్ల క్రితం ఎన్నికల కమిషన్ ఈవీఎంల్లో నోటా(నన్ ఆఫ్ ది ఎబోవ్) ఆప్షన్‌కు కూడా ప్రవేశపెట్టింది. దీంతో అభ్యర్థులు నచ్చకపోతే నోటాకు ఓటు వేస్తున్నారు. ఈ సందర్భంగా నోటాకు 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 13,702 ఓట్లు పోలయ్యాయి. నోటాకు పోలైన ఓట్లలో 36 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు కూడా ఉండడం గమనార్హం. జడ్చర్లలో అత్యధికం ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలో 14 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా జడ్చర్ల నియోజకవర్గంలో 1,537 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఇందులో 5 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. ఇక అత్యల్పంగా నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో 581 ఓట్లు పోటాకు పోలయ్యాయి. కాగా, పలు నియోజకవర్గాలలో నోటా కంటే తక్కువ ఓట్లు పోలైన అభ్యర్థులు కూడా ఉండడం గమనార్హం. గత ఎన్నికల్లో షాద్‌నగర్ నియోజకవర్గంలో 14 మంది పోటీ చేయగా అందులో ఎనిమిది మందికి నోటాకు వచ్చిన ఓట్ల కంటే తక్కువగా వచ్చాయి. అలాగే కొడంగల్ నియోజకవర్గంలో ఏడుగురు అభ్యర్ధులు పోటీ చేయగా ఒక అభ్యర్ధికి నోటా కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి. కాగా, నోటాకు పోలయ్యే ఓట్ల సంఖ్య రానురాను పెరగొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సందర్భంగా 2014 లో నియోజకవర్గాల వారీగా మొత్తం ఓటర్లు, పోలైన ఓట్లు, నోటాకు నమోదైన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. - జడ్చర్ల నియోజకవర్గంలో 1,91,077 మంది ఓటర్లకు 1,46,551 ఓట్లు పోలయ్యాయి. ఇక 1,537 ఓట్లు నోటాకు, ఐదు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఈ నియోజకవర్గంలో ఏడు మంది అభ్యర్ధులు పోటీ చేయగా ఇద్దరికి నోటా కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి. - నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో 2,04,630 మంది ఓటర్లు ఉండగా 1,51,180 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో 581 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఈ నియోజకవర్గానికి పద్నాలుగు మంది అభ్యర్ధులు పోటీచేయగా ఏడుగురికి నోటా కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి. - కొల్లాపూర్ నియోజకవర్గంలో 2,08,312 మంది ఓటర్లు ఉండగా 1,55,532 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 767 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఈ నియోజకవర్గానికి 12 మంది అభ్యర్థులు పోటీ చేయగా ఐదుగురికి నోటా కంటే తక్కువ ఓట్లు నమోదు కావడం గమనార్హం. - వనపర్తి నియోజకవర్గంలో 2,36,908 మంది ఓటర్లు ఉండగా 1,68,370 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో 860 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఈ నియోజకవర్గం నుంచి 12 మంది అభ్యర్ధులు పోటీ చేయగా ఆరుగురు అభ్యర్ధులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. - మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 2,19,880 మంది ఓటర్లకు గాను 1,48,662 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 607 ఓట్లు నోటాకు, 11 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా నోటాకు నమోదయ్యాయి. ఈ నియోజకవర్గంలో 13 మంది అభ్యర్ధులు పోటీ చేయగా ఐదుగురు అభ్యర్ధులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. - దేవరకద్ర నియోజకవర్గంలో 2,08,413 మంది ఓటర్లకు 1,50,093 ఓట్లు పోలయ్యాయి. కాగా, పోలైన ఓట్లలో 1,213 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఈ నియోజకవర్గంలో ఏడుగురు అభ్యర్ధులు బరిలో ఉండగా.. ఇద్దరు అభ్యర్ధులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. - అలంపూర్ నియోజకవర్గంలో 2,10,104 మంది ఓటర్లు ఉండగా 1,59,348 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో 965 ఓట్లు నోటాకు, మూడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సైతం నోటాకు పోలయ్యాయి. ఈ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న 11 మంది అభ్యర్థుల్లో ఐదుగురు అభ్యర్ధులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. - గద్వాల నియోజకవర్గంలో 2,12,787 మంది ఓటర్లకు 1,72,603 ఓట్లు పోలయ్యాయి. ఇక పోలైన ఓట్లలో 862 ఓట్లు నోటాకు, ఏడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా నోటాకు పోలయ్యాయి. ఈ నియోజకవర్గానికి పదమూడు మంది అభ్యర్ధులు పోటీచేయగా ఆరుగురికి నోటా కంటే తక్కువ ఓట్లు నమోదయ్యాయి. - మక్తల్ నియోజకవర్గంలో 2,09,537 మంది ఓటర్లు ఉన్నాయి. ఈ సందర్భంగా 1,41,756 ఓట్లు పోల్ కాగా, 724 ఓట్లు నోటాకు, నాలుగు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఈ నియోజకవర్గం నుంచి పద్నాలుగు మంది బరిలో ఉండగా ఇద్దరు అభ్యర్ధులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. - నారాయణపేట నియోజకవర్గంలో 1,99,018 మంది ఓటర్లకు గాను 1,36,831 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 1,131 ఓట్లు నోటాకు, మూడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా నోటాకు పోలయ్యాయి. ఈ నియోజకవర్గం నుంచి ఎనిమిది మంది అభ్యర్ధులు పోటీచేయగా ఇద్దరికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. - కొడంగల్ నియోజకవర్గంలో 1,97,649 మంది ఓటర్లు ఉండగా 1,39,072 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 1,136 ఓట్లు నోటాకు, ఒక పోస్టల్ బ్యాలెట్ ఓటు కూడా నోటాకు పోలైంది. ఈ నియోజకవర్గం నుంచి ఏడుగురు అభ్యర్ధులు పోటీచేయగా శ్రీనివాస్ రెడ్డికి 680 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఆయనకు నోటాకు తక్కువగా ఓట్లు వచ్చి నట్లయింది. - కల్వకుర్తి నియోజకవర్గంలో 1,99,714 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,62,317 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 1,140 ఓట్లు నోటాకు, ఒక పోస్టల్ బ్యాలెట్ ఓటు కూడా నోటాకు పోలైంది. ఈ నియోజకవర్గం నుంచి బరిలో పది మంది అభ్యర్ధులు ఉండగా.. ముగ్గురికి నోటా కంటే తక్కువ ఓట్లు నమోదయ్యాయి. - అచ్చంపేట నియోజకవర్గంలో 2,04,850 మంది ఓటర్లు ఉండగా 1,47,768 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో 1,298 ఓట్లు నోటాకు, ఒక పోస్టల్ బ్యాలెట్ ఓటు కూడా నోటాకు పోలయింది. ఈ నియోజకవర్గానికి ఏడుగురు అభ్యర్ధులు పోటీ చేయగా ఇద్దరు అభ్యర్ధులకు నోటాకంటే తక్కువ ఓట్లు రాగా,123 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. -
100 మంది.. 184 సెట్లు
సాక్షి, మహబూబ్‌నగర్ న్యూటౌన్ : తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గడువు సోమవారంతో ముగియగా పెద్దసంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలోని మొత్తం ఐదు నియోజకవర్గాలకు గాను 100 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. వీరందరు కలిపి 184 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని సోమవారం రాత్రి అధికారులు వెల్లడించారు. అత్యధికం.. అత్యల్పం జిల్లాలో అత్యధికంగా మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ 25 మంది అభ్యర్థులు 51 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇక నారాయణపేటలో అతి తక్కువగా 15 మంది అభ్యర్థులు 25 సెట్ల నామినేషన్లు, మక్తల్‌లో 15 మంది అభ్యర్థులు 32 సెట్ల నామినేషన్లు అందజేశారు. అదేవిధంగా దేవరకద్రలో 22 మంది అభ్యర్థులు 40 సెట్ల నామినేషన్లు, జడ్చర్లలో 23 మంది అభ్యర్థులు 36 సెట్ల నామినేషన్లు సమర్పించారు. అయితే నామినేషన్ పత్రాలన్నింటినీ మంగళవారం స్క్రూటినీ నిర్వహించిన అనంతరం వివరాలు సరిగ్గా లేని వాటిని తిరస్కరించనున్నారు. ఆ తర్వాత అధికారులు పూర్తి వివరాలు వెల్లడిస్తారు. ఇక ఈనెల 22న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. పరిస్థితులపై సమీక్ష నామినేషన్ల దాఖలు గడువు సోమవారం ముగియనుండడం తో అన్ని రిజర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద ఏర్పాట్లు చేశారు. ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉండడంతో పోలీసు బందోబస్తుతో పాటు అదనపు సిబ్బందిని నియమించారు. ఇక మూడు గంటల వరకే నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉండడంతో అంతకు ముందు వచ్చిన వారినే కార్యాలయాలకు అనుమతించాలని ముందుగానే ఆదేశాలు జారీ చేశారు. అలాగే, జిల్లా కలెక్టరేట్ నుంచి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు. -
మంత్రి లక్ష్మారెడ్డిపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
జడ్చర్ల: తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డిపై కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. లక్ష్మారెడ్డి ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని విమర్శిస్తూ తీవ్రపదజాలం వాడారు. ప్రభుత్వ వాహనాలు వాడుకుంటూ భూదందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మంత్రి నియోజకవర్గం జడ్చర్లలో వంద పడకల ఆసుపత్రి మాటలకే పరిమితమైపోయిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిలో కూడా కనీస వైద్య సౌకర్యాలు లేవని, జడ్చర్ల నియోజకవర్గానికి లక్ష్మారెడ్డి చేసింది శూన్యమని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో లక్ష్మారెడ్డిని ఓడించి మల్లు రవిని గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గాన్ని వీడే ప్రసక్తే లేదని, అక్కడి నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. -
పోర్చుగల్ అమ్మాయి.. పాలమూరు అబ్బాయి..
సాక్షి, జడ్చర్ల: ప్రేమకు కులం, మతం, భాషతో పాటు ప్రాంతం అడ్డుకాదని నిరూపించారు ఓ ప్రేమ జంట. పోర్చుగల్ దేశానికి చెందిన అమ్మాయి, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన అబ్బాయి శుక్రవారం వివాహం చేసుకోగా.. జడ్చర్లలో రిజిస్ట్రార్ కార్యాలయం ఇందుకు వేదికైంది. జడ్చర్ల స్థానిక పద్మావతి కాలనీకి చెందిన మట్ట శ్రీపాల్(32) లండన్‌లో ఆడిటింగ్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ మేరకు అక్కడకు నాలుగేళ్ల క్రితం విహార యాత్రకు వచ్చి న పోర్చుగల్ రాజధాని లిస్బన్‌కు చెందిన వేర వెగాస్ లుకా వెలోజా(34)తో ఆయనకు పరిచ యం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మా రగా ఇరువురి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లికి సి ద్ధమయ్యారు. ఇందులో భాగంగా జడ్చర్ల వచ్చిన వారు నెల క్రితమే రిజిస్టర్ పెళ్లి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీపాల్ – వేర వెగాస్ లుకా వెలోజా జంటకు శుక్రవారం స్థానిక ఇన్చార్జి రిజిస్ట్రార్ ఆంజనేయులు మ్యారేజ్ సర్టిఫికెట్ అందజేశారు. ఈ మేరకు వేర వెగాస్ లుకా వెలోజా మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి, సం ప్రదాయాలు నచ్చడంతో తాను కుటుంబ సభ్యులను ఒప్పించి శ్రీపాల్‌ను వివాహం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన జంటను శ్రీపాల్ తల్లిదండ్రులు వెంకట్‌రెడ్డి – రమాదేవితో పాటు కుటుంబ సభ్యులు ఆశీర్వదించారు. -
జడ్చర్లలో భారీ చోరీ
జడ్చర్ల: స్థానిక సరస్వతీనగర్‌లో భారీ చోరీ చోటుచేసుకుంది. ఆదివారం ఊరు నుంచి ఇంటికి వచ్చిన ఇంటి యజమాని చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడు టీకే ఫణికిరణ్ కథనం ప్రకారం.. జడ్చర్ల కరూర్ వైశ్యబ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్న ఫణికిరణ్ సరస్వతీనగర్‌లో ఓ అద్దె ఇంటిలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం తాళం వేసి అందరూ సొంత ఊరు హైదరాబాద్‌కు వెళ్లారు. అనంతరం ఆదివారం ఇంటికి తిరిగి వచ్చిన ఫణికిరన్ గేటు తాళం తీసి ప్రధాన ద్వారం దగ్గరకు వెళ్లి డోర్ తీసేందుకు చూడగా తాళం విరగ్గొట్టి తలుపు తెరిచి ఉండడంతో దిగ్బ్రాంతికి లోనయ్యారు. వెంటనే ఇంటిలోకి వెళ్లగా బెడ్రూంలో ఉన్న బీరువా బార్ల తెరచి అందులోని వస్తువులు, దుస్తులు గది నిండా చెల్లాచెదురై పడి ఉన్నాయి. బీరువాలోని లాకర్లో దాచిన బంగారు నగలు అపహరణకు గురయ్యాయని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సీఐ బాలరాజుయాదవ్, క్లూస్‌టీం సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. బంగారు గాజు లు, నెక్లెస్‌లు, చైన్లు, పిల్లల గాజులు, చెవి కమ్మలు, బుట్టాలు, ఉంగరాలు తదితరవి కలిపి దాదాపు 25 తులాల వరకు ఉంటాయని బాధితుడు పేర్కొన్నారు. ఇటీవల తమ బ్యాంకు దినోత్సవం సందర్భంగా తనకు బహూకరించిన 100 గ్రాముల వెండి కాయిన్ తదితర కాయిన్స్ కూడా చోరీకి గురయ్యాయని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కుడికిళ్లలో అర్ధరాత్రి హల్చల్ కొల్లాపూర్ రూరల్: మండలంలోని కుడికిళ్లలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. రెండు గంటల ప్రాంతంలో గ్రామంలోని ఊర చెరువు కట్ట సమీపంలో ఉన్న జనార్దన్‌రావు, భార్య శ్రీదేవి ఆరుబయట నిద్రిస్తుండగా దొంగలు వచ్చి ఆమె మెడలో ఉన్న మూడు తులాల పుస్తెల తాడును ఎత్తుకెళ్లారు. వెంటనే తేరుకుని చూడటంతో అప్పటికే పరుగులు తీసి వెళ్లిపోయినట్లు చెప్పారు. గ్రామంలోని బీసీకాలనీలో సైతం దొంగతనానికి ప్రయత్నించగా మహిళలు వెంటపడటంతో పారిపోయారు. గ్రామంలోని కొల్లాపూర్ ప్రధాన రహదారిపై ఉన్న నాగేష్ ఇంటి మేడ మీద కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా అతని భార్య మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడు, సెల్‌ఫోన్ ఎత్తుకుపోయారు. దీంతో గ్రామస్తులు రాత్రంతా వెతుకుతూ నిద్రలేని రాత్రి గడిపారు. ఉదయాన్నే కొల్లాపూర్ పోలీస్‌స్టేషన్‌లో శ్రీదేవి, శివలీలలు ఎస్ఐ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. ఆయన గ్రామానికి వచ్చి దొంగతనానికి పాల్పడిన ఇళ్లను పరిశీలించారు. -
చిగురిస్తున్న ఆశలు..!
రాజాపూర్ : సరైన రోడ్లు, విద్యుత్, నీటి వసతి లేక అభివృద్ధికి ఆమడదూరంలో ఇన్నాళ్లు గిరిజన తండాలు ఉండేవి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం 500 జనాభా ఉన్న ప్రతి గిరిజన తండాను గ్రామపంచాయతీగా ప్రకటించి అభివృద్ధి చేస్తామని ఎన్నికల హామీలో పేర్కొన్న విషయం విధితమే. ఈమేరకు తండాలను గ్రామపంచాయతీలుగా ప్రకటించేందుకు ఇటీవల నివేదికలు సిద్ధం చేస్తుండడం.. మండల అధికారుల నుంచి సమాచారం తీసుకుంటుండడంతో గిరిజనుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తమ కష్టాలు ఇక తీరనున్నాయని.. అన్ని వసతులు కల్పనతోపాటు తండాలు అభివృద్ధి చెందనున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 8 తండాలకు జీపీలుగా అవకాశం నూతనంగా ఏర్పాటైనన రాజాపూర్ మండలంలో మొత్తం 14 గ్రామ పంచాయతీలు ఉండగా మరో 8 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మండలంలో ఇప్పటికే కుత్నపల్లె, రాఘవాపూర్, నర్సింగ్‌తండా, సింగమ్మగడ్డతండా, మోత్కులకుంటతండా, పల్గుతండా, బీబీనగర్‌తండా, నాన్‌చెరువుతండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు అధికారులు నివేదికలు తయారు చేశారు. అయితే 8 గ్రామ పంచాయతీలుగా ఏర్పాటుచేస్తే మండలంలో మొత్తం 22 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. దీంతో తండాలకు ప్రత్యేక నిధులు వస్తే తండాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయని గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రామాలకు తండాలు అనుబంధంగా ఉండటంతో తండాలను పట్టించుకునేవారు కాదని మా తాండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు అయితే అభివృద్దికి వీలు ఉంటుందని గిరిజనులు అంటున్నారు. అభివృద్ధి చెందుతాయి మా తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు అవుతున్నందున సంతోషంగా ఉంది. గతంలో తండాలను అసలు పట్టించుకునే వారు కాదు. ప్రస్తుతం ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటవుతున్నందున ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది. పాఠశాలలు ఏర్పాటుచేయడంతోపాటు, నీరు, విద్యుత్, రోడ్డు సౌకర్యాలు మెరుగు పర్చనున్నారు. – గీత, మోత్కులకుంట తండా హామీ నెరవేరుస్తున్నాం.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించనుంది. దీంతో ప్రత్యేక నిధులు కేటాయించి తండాల్లో సమస్యలు పరిష్కరించనుంది. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా పని చేస్తున్నారు. 8 తండాలు గ్రామపంచాయతీలుగా మారనున్నాయి. – ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ -
జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం
-
జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వద్ద హైవేపై జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. జడ్చర్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో మరొకరు చనిపోవటంతో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద శనివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉదండాపూర్ గ్రామానికి చెందిన ఐదుగురు మహిళలు దుర్మరణం చెందిన విషయం విదితమే. కాగా, రహదారిపై అండర్ గ్రౌండ్ బిడ్జి నిర్మించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవటం లేదని, దీంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయంటూ జాతీయ రహదారిపై స్థానికులు రాస్తారోకోకు దిగారు. దీంతో హైవేపై ఎటు చూసినా కిలోమీటరు మేర పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. కాగా ప్రమాద బాధితులంతా గంగాపూర్ గ్రామంలో పత్తి తీయటానికి వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని సమాచారం. మృతులను బాలమ్మ (66) లక్ష్మమ్మ (50) నాగమణి (30) రంగమ్మ (60)గా గుర్తించారు. మృతుల్లో ఆటో డ్రైవర్ సహా మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది -
అలనాటి అద్భుత కట్టడంపై నిర్లక్ష్యం
-
పందుల పంచాయితే ప్రాణం తీసింది
-
బాలికల వాలీబాల్ పోటీలు ప్రారంభం
జడ్చర్ల టౌన్: జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్చర్ల విద్యాదర్ వాలీబాల్ అకాడమిలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి బాలికల వాలీబాల్ పోటీలను డీఎస్డీఓ సత్యవాణి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. క్రీడల పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు. బాలికలు వాలిబాల్ ఆడటం అభినందనీయమన్నారు. జిల్లాలోనూ స్టేడియాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వాలిబాల్ అకాడమీ ఏర్పాటు చేసి అభివృద్ధికి దోహదపడుతున్న విద్యాదర్ను అభినందించారు.పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 24జట్లు పాల్గొంటున్నాయి. -
పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలి
జడ్చర్ల : అంగ¯Œæవాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారంపై గర్భిణులు, బాలింతల, కిశోర బాలికలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ టీకే శ్రీదేవి కార్యకర్తలకు ఆదేశించారు. గురువారం బాదేపల్లి పాతబజార్‌లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన పోషకాహార వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై ఆహార అ లవాట్లపై సూచనలు చేశారు. మహిళలు వయసుకు తగ్గట్టు బరువు ఉండాలని, అంగ¯Œæవాడీల్లో ఉండే బా లామతం చిన్నారుల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పుట్టిన పిల్లలనుంచి 6 మాసాల వరకు తల్లి పాలు పట్టించడం శ్రేయస్కరమని, తల్లి పాలతో పిల్లలకు రోగనిరోదశక్తి పెరుగుతుందన్నారు. పిల్లల కడుపులో నులిపురుగుల నివారణకు మందులు అందుబాటులో ఉంచామని, ప్రతినెల వేయించే టీకాలను వైద్యులు సూచించిన తేదీల వారీగా నిర్ణీత కాలంలో వేయించాలని కోరారు. ఏలోటూ రానివ్వొద్దు అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు కార్యకర్తలు ఏ లోటూ రానివ్వకుండా చూసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పౌష్టికాహారంతో పాటుగా ఆట వస్తువులను అందుబాటులో ఉంచాలని, దీంతో పిల్లల మెదడు ఎదుగుదలకు దోహద పడుతాయన్నారు. బాలింతలు, గర్భిణులకు ఎలాంటి శారీరక, ఆరోగ్య సమస్యలున్నా సమీప అంగన్వాడీ, ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలని కోరారు. గర్భిణుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రక్తహీనతకు అవకాశం లేకుండా చూడాలని, మేనరికం పెళ్లిళ్లు జరుగకుండా చూడాలని ఆరోగ్య కమిటీలు, మదర్స్ కమిటీలను కోరారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ జోస్న, డీఆర్డీఏ పీడీ మధుసూదన్, డీఎంఅండ్‌హెచ్‌ఓ నాగారం, అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ శ్రీదర్‌రెడ్డి, జెడ్పీటీసీ జయప్రద, ఎంపీపీ లక్ష్మి, సీహెచ్ఓ మల్లికార్జునప్ప, తహసీల్దార్ జగదీశ్వర్‌రెడ్డి, సీడీపీఓ ప్రవీణ పాల్గొన్నారు. -
‘గురుకులం’లో మిగులు సీట్ల భర్తీ
జడ్చర్ల : బాలుర, బాలికల గురుకుల పాఠశాలల్లో 5,6,7 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసినట్లు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయకర్త బి.కష్ణారావు తెలిపారు. మంగళవారం జడ్చర్ల మండలంలోని చిట్టెబోయిన్‌పల్లి బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన కౌన్సెలింగ్‌ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పాత, ఈ ఏడాది ప్రారంభించిన బాలురు, బాలికల గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో మిగిలిపోయిన 150సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ విద్యార్థులతో భర్తీ చేశామన్నారు. ఇంకా మిగిలిపోయిన సీట్లుంటే మెరిట్ ప్రాతిపదికన విద్యార్థులకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఓ కార్యాలయ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపాల్ రాంలక్ష్మయ్య, స్వేరోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల కష్ణయ్య పాల్గొన్నారు. -
త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
జడ్చర్ల : ఓ ప్రైవేటు బస్సులో కష్ణా పుష్కరాలకు వెళుతున్న భక్తులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. జడ్చర్ల మండలం మాచారం వద్ద మంగళవారం ఉదయం 7.20 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో 40మందికి గాయాలు కాగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలిలా ఉన్నాయి. కరీంగనర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాష్‌పురానికి చెందిన 55మంది భక్తులు సోమవారం అర్ధరాత్రి దాటాక రెండు గంటలకు ప్రైవేటు బస్సులో కష్ణాపుష్కరాల్లో పాల్గొనేందుకు అలంపూర్‌కు బయలుదేరారు. డ్రైవర్ మల్లేష్ నిద్రమత్తులో ఉండటంతో వాహనం అదుపుతప్పి జాతీయ రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొని బోల్తా పడింది. దీంతో అందులోని 40మందికి గాయాలయ్యాయి. కాగా, బస్సు వేగాన్ని రెయిలింVŠ కు ఏర్పాటుచేసిన ఇనుప కడ్డీకి తగిలి ఆగడంతో క్షతగాత్రులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. బాధ్యులపై కేసు నమోదు ఈ ప్రమాదానికి కారణ మైన బస్సు డ్రైవర్ మల్లేష్, యజమాని నరెందర్‌రెడ్డిలపై ఎస్ఐ మధుసూదన్‌గౌడ్ కేసు నమోదు చేశారు. డ్రైవర్ అజాగ్రత్త, నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన చోటుచేసుకుందని తెలిపారు. ఆర్టీసీతో ఒప్పందం ముగిసి ఆరేళ్లు గడిచినా బస్సు రంగును మార్చలేదని షాద్‌నగర్ డీఎం టి.సత్తయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదటగా ఎక్స్‌ప్రెస్ కలర్‌తోపాటు సిద్దిపేట–సంగారెడ్డి పేర్లను కలిగిన బోర్డులూ ఉండటంతో ఆర్టీసీ బస్సుగా భావించారు. చివరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు విచారించి ఈ బస్సుతో ఆర్టీసీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. -
జడ్చర్లలో కాల్‌మనీ నిందితులు!
జడ్చర్ల: సంచలనం సృష్టించిన కాల్‌మనీ కేసు వ్యవహారం గురువారం తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో కలకలం రేపింది. కాల్‌మనీతో సంబంధం ఉన్న నిందితులు కొన్ని రోజులుగా జడ్చర్ల మండల పరిధిలోని గోప్లాపూర్, తదితర గ్రామాలలో తలదాచుకున్నట్లు సమాచారం ఉండడంతో గురువారం వేకువజామునే గుంటూరు జిల్లా పోలీసులు జడ్చర్లకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రహస్య విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితులు తలదాచుకున్న గ్రామాన్ని పసిగట్టినట్లు తెలుస్తోంది. నిందితులు గోప్లాపూర్‌కు వచ్చి గుంటూరు ప్రాంతంతో సంబంధం కలిగి ఉన్న ఓ నాయకుడి దగ్గర ఆశ్రయం పొందినట్లు తెలిసింది. పక్కా సమాచారంతో పోలీసులు జడ్చర్లకు చేరుకుని నిందితుల అరెస్ట్‌కు ప్రయత్నించారు. అయితే పోలీసుల రాకను ముందే పసిగట్టిన నిందితులు తమ సెల్ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి ఇతర ప్రాంతాలకు పారిపోయినట్లుగా సమాచారం. అయితే అప్పటికే ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. జడ్చర్ల, మిడ్జిల్ మండలాల వాసులకు గుంటూరు జిల్లాతో సత్సంబంధాలు ఉండడంతో అక్కడి కాల్‌మనీ నిందితులు ఇక్కడ తలదాచుకునేందుకు దోహదపడిందని పోలీసులు భావిస్తున్నారు. -
జడ్చర్లలో పోలీసుల దాడులు
జడ్చర్ల టౌన్: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ సమీపంలోని పారిశ్రామిక వాడలో పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన కలపను పట్టుకున్నారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు బుధవారం ఉదయం దాడులు చేసిన పోలీసులు 10 టన్నుల బరువున్న 80 దుంగలను సీజ్ చేశారు. అయితే, అవి ఎర్రచందనం దుంగలా? లేక టేకు కలపా అనేది నిర్ధారణ కాలేదు. ఇందుకోసం వారు అటవీ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించాకనే ఏమిటనేది నిర్ధారణ అవుతుందని చెబుతున్నారు. -
కారు బోల్తా: ఇద్దరు మృతి
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వద్ద జాతీయరహదారిపై ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జడ్చర్ల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తూ.. డివైడర్‌ను ఢీకొని బ్రిడ్జి మీద నుంచి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో కొత్తూరు మండలం ఇనుముల్‌నర్వ గ్రామానికి చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మంత్రి ఇల్లు ముట్టడి
జడ్చర్ల(మహబూబ్‌నగర్): ఎన్నికలకు ముందు ఇంటింటికి మంచినీళ్లు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు నీటి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని మహిళలు ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డి ఇంటి ఎదుట ఈ రోజు మహిళలు ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శనలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ఆయన ఇంటి ముందు.. పట్టణంలోని తాలూక క్లబ్, విద్యానగర్, మసీదు ఏరియా ప్రాంతాలకు చెందిన మహిళలు ఖాళీ బిందెలతో వచ్చి ఆందోళన చేపట్టారు. ..................... -
బిచ్చమెత్తయినా డబ్బులిస్తాం..
మహబూబ్‌నగర్ : డబ్బు సంచులకోసమే ఆంధ్రోళ్లకు మోకరిల్లినట్లయితే రూపాయి రూపాయి బిచ్చమెత్తుకోనైనా డబ్బులిస్తాం..వారి మాయనుంచి బయటకు రావాలని తెలంగాణ టీడీపీ నాయకులను రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కోరారు. గురువారం జడ్చర్ల మండలం నసురుల్లాబాద్ చెరువులో మిషన్‌కాకతీయ పనుల ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. పాలమూరు జిల్లాను లేబర్‌జిల్లాగా మార్చిన ఘనత టీడీపీదే నని విమర్శించారు. అరవయ్యేళ్ల ఇతరుల పాలనలో తెలంగాణ దోపిడీకి గురైందని, దాని నుంచి కాపాడుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. తమ ప్రభుత్వం మిషన్‌కాకతీయ టెండరు ప్రక్రియలో ఎలాంటి రాజకీయం లేకుండా చేసిందని వైద్య ఆరోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. (జడ్చర్ల టౌన్) -
ఎస్సై సిద్ధయ్య జడ్చర్ల వాసి
జడ్చర్ల: నల్లగొండ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడిన ఎస్సై సిద్ధయ్యది మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల. శనివారం కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిన జడ్చర్ల వాసులు ఉలిక్కిపడ్డారు. ఆయన తల్లి దస్తగిరమ్మ, సోదరుడు దస్తగిర్ హతాశులయ్యారు. దస్తగిర్ వెంటనే హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సోదరుడిని చూసేందుకు బయలుదేరివెళ్లాడు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి మండలం చింతలచెరువు గ్రామానికి చెందిన సిద్ధయ్య కుటుంబం 20ఏళ్ల క్రితం జడ్చర్లలో స్థిరపడింది. నలుగురి సంతానంలో సిద్ధయ్య చివరివాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. పేదకుటుంబానికి చెందిన సిద్ధయ్య కష్టపడి ఉన్నత చదువులు చదివాడు. 2012-13లో ఎస్ఐగా ఎంపికయ్యాడు. ఆయనకు గతేడాది అనంతపురం జిల్లాకు చెందిన ధరణీషాతో వివాహమైంది. జడ్చర్లలో చదువుకుంటున్న సమయంలోనే చిన్నా చితకా పనులు చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేవాడని కుటుంబసభ్యులు తెలిపారు. -
లంచం ఇవ్వలేక.. తండ్రీకూతుళ్ల ఆత్మహత్య
కూతురును రైలు కిందకు తోసి తండ్రి ఆత్మహత్య మహబూబ్‌నగర: వైద్య సిబ్బందికి డబ్బులు ఇవ్వలేక.. భార్యకు వైద్యం చేయించుకోలేక మనస్తాపానికి గురై ఓ తండ్రి కూతురుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా వీరన్నపేట రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం, మృతుని సూసైడ్ నోట్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. జడ్చర్లకు చెందిన నాగలక్ష్మి రెండోకాన్పు కోసం తన భర్త చెన్నకేశవులు(35)తో కలిసి సోమవారం జిల్లా ఆస్పత్రికి వచ్చింది. మరుసటి రోజు మగబిడ్డకు జన్మనిచ్చింది. సిబ్బంది ఆమెకు చికిత్స చేయించేందుకు డబ్బులు డిమాండ్ చేశారు. అప్పటికి డబ్బులు ఇచ్చారు. గురువారం మరిన్ని డబ్బులు డిమాండ్ చేశారు. దాంతో సిబ్బంది తీరుపై ఆస్పత్రి సూపరిటెండెంట్ డాక్టర్ శామ్యూల్‌కు ఫిర్యాదుచేశారు. సిబ్బంది డబ్బులకు వేధిస్తున్నారని, ఇవ్వకుంటే సరైన వైద్యం అందించడం లేదని మానసికక్షోభకు గురయ్యారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెన్నకేశవులు లేఖ రాసి జేబులో పెట్టుకుని కూతురు హర్షితతో కలిసి వీరన్నపేట సమీపంలో రైలుకిందపడి ఆత్మహత్యకు ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న మృతుని భార్య నాగలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించింది.రైల్వేపోలీసులు మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాఘవేందర్‌గౌడ్ తెలిపారు. బాధ్యులపై చర్యలు ఆస్పత్రిలో రోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న సిబ్బందిపై కఠినచర్యలు తీసుకుంటామని సూపరిటెండెంట్ డాక్టర్ శామ్యూల్ తెలిపారు. సూసైడ్‌నోట్ ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు కలెక్టర్‌తో మాట్లాడతానని ఆయన చెప్పారు. -
పరుగులు పెట్టించిన వాన..
కొందుర్గు,/జడ్చర్ల,/జడ్చర్లటౌన్,/ఊట్కూర్, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా బుధ వారం చిరుజల్లులు కురిశాయి. జిల్లా కేంద్రంతోపాటు, నారాయణపేట డివిజన్ ప్రాం తంలో అక్కడక్కడ ఓ మోస్తారు వర్షం కురిసిం ది. బలంగా వీచిన ఈదురుగాలులకు మామిడి కాయాలు నేలరాలాయి. కూరగాయల పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జడ్చర్లలో కురిసిన వర్షం కారణంగా విక్రయానికి తీసుకొచ్చిన ధాన్యం మార్కెట్లో తడిపోయింది. దీంతో రైతులు తడిసిన పంటను ఆరబెట్టుకునేందుకు తంటాలు పడ్డారు. మధ్యాహ్నం 3గంటల నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో ఇబ్బందులకు గురయ్యారు. కొద్దిరో జులుగా ఉక్కబోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణం చల్లబడటం ఉపశమనం కలిగించింది. ఊట్కూర్‌కు చెందిన పీర్ మహ్మద్‌సాబ్‌కు తోటలో మామిడికాయలు నేలరాలాయి. దీంతో రూ. 50 ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. పాలమూరు జిల్లాలో మంగళవారం (నిన్న) రికార్డు స్థాయిలో ఈ వేసవిలోనే అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో బుధవారమే వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు విక్రయానికి తీసుకువచ్చిన ధాన్యం నీటిలో కలిసిపోరుుంది. అకాలంగా కురిసిన వానతో ఆరుగాలం కష్టించి పండించిన పంట వర్షార్పణమైంది. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. భూత్పూర్ మండలం కప్పెటకు చెందిన రైతు కుర్వ యాదయ్య 50 బస్తాల ధాన్యాన్ని యార్డుకు తీసుకు వచ్చి ఆవరణలో ఆరబోశాడు. సాయంత్రం అకాల వర్షం ఒక్క సారిగా కురువడంతో తడిసి ముద్దయింది.అంతేగాక దాదాపు 15 బస్తాల ధాన్యం కొట్టుకుపోయింది. -
అమ్మ లేదు.. నాన్న రాడు
44వ నంబరు జాతీయ రహదారి రక్తమోడింది.. జిల్లాలో రెండు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాతపడ్డారు.. వీరంతా ఇతర జిల్లాల వారే.. ఓ సంఘటనలో స్థానికంగా వాతావరణం అనుకూలించక పంటలు పండకపోవడంతో వలస వచ్చి ఇద్దరు మృత్యువాతపడగా, మరో సంఘటనలో దంపతులు తమ స్వగ్రామానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.. దీంతో ఆ కుటుంబాల్లో విషాదం అలుముకుంది.. జడ్చర్ల టౌన్, న్యూస్‌లైన్ : అతను ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరు.. భార్యాపిల్లలతో కలిసి స్వగ్రామానికి వెళ్లి కొన్ని రోజులపాటు ఇంటి వద్ద తల్లిదండ్రులతో సంతోషంగా గడుపుదామనుకున్నాడు.. అందులో భాగంగా కారులో బయలుదేరగా మార్గమధ్యంలోనే దంపతులను మృత్యువు కబళించింది.. అదృష్టవశాత్తు ఇద్దరు చిన్నారులు మాత్రమే త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.. హృదయ విదారకమైన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం వాల్మీకిపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్తమానుపల్లికి చెందిన కిషన్‌కుమార్‌రెడ్డి (35) హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. ఈయనకు భార్య శ్రీదేవి (30), కుమార్తె పరిణీతి, కుమారుడు చేతన్ ఉన్నారు. కొన్నాళ్లుగా భార్యాపిల్లలతో కలిసి నగరంలోనే నివాసముంటున్నాడు. ఈ క్రమంలోనే స్వగ్రామంలో ఉంటున్న తన తల్లిదండ్రులతో కొన్ని రోజుల పాటు సంతోషంగా గడుపుదామని తలంచాడు. దీంతో కారులో నలుగురూ మంగళవారం మధ్యాహ్నం బయలుదేరారు. 44వ నంబరు జాతీయ రహదారిపై జడ్చర్ల మండలం గొల్లపల్లి శివారులోకి చేరుకోగానే అదుపుతప్పి బోల్తాపడటంతో దంపతులకు తీవ్ర, చిన్నారులకు స్వల్పగాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే దంపతులు మృతి చెందారు. ఈ విషయమై పోలీసులకు సమాచారమివ్వడంతో సంఘటన స్థలాన్ని సీఐ జంగయ్య పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు దుర్మరం చెందడంతో చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది. జడ్చర్ల టౌన్, న్యూస్‌లైన్ :వారు వర్షాభావ పరిస్థితులతో పంటలు పండక నాలుగు రాళ్లు సంపాదించుకుందామని బతుకుబండి లాగుదామని అనంతరం జిల్లా నుంచి పాలమూరుకు వలస వచ్చారు.. జిల్లాలోని వివిధ గ్రామాల్లో తిరుగుతూ నైటీల వ్యాపారం చేసుకుంటున్నారు.. ఇక్కడా అది అంతంతమాత్రమే సాగటంతో మరో జిల్లాకు వెళదామనుకున్నారు.. అంతలోనే జరిగినరోడ్డు ప్రమాదంలో ఇద్దరి బతుకులు ‘తెల్లారి’పోగా, మరో ముగ్గురికి గాయాల్యయి.. హృదయ విదారకమైన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా గుత్తి మండలం చర్లోనిపల్లికి చెందిన సూర్యనారాయణ (45), సూర్యప్రకాష్ (20), అంకన్న, సుధాకర్ వృత్తిరీత్యా రైతులు. ఈసారి వర్షాభావ పరిస్థితులతో వారు తమకున్న పొలాల్లో వేసిన పంటలు సరిగా పండలేదు. దీంతో ఇతర జిల్లాలకు వలస వెళ్లి నైటీల వ్యాపారమైనా చేసి జీవనం సాగిద్దామనుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 22వ తేదీ రాత్రి పెబ్బేరుకు చేరుకుని సోమవారం సాయంత్రం వరకు వివిధ గ్రామాలు తిరిగారు. అయితే వ్యాపారం సరిగా సాగకపోవటంతో అర్ధరాత్రి జడ్చర్ల క్రాస్‌రోడ్డుకు చేరుకున్నారు. అక్కడి నుంచి నల్లగొండ జిల్లాకు బయలు దేరేందుకు సుమారు రెండు గంటలకు బాలానగర్ నుంచి మిర్యాలగూడకు క్రషర్ చిప్స్‌ను తీసుకెళున్న లారీలో ఎక్కారు. పట్టణ శివారులోకి వెళ్లగానే వాహనం అదుపుతప్పి బోల్తాపడటంతో సూ ర్యనారాయణ, సూర్యప్రకాష్ అక్కడికక్కడే మృతిచెందారు. ఇదే ప్రమాదంలో మిగతా ఇద్దరితో పాటు డ్రైవర్ వెంకట్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే క్షతగాత్రులను బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారమివ్వడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం ఉదయం బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఇక్కడికి చేరుకుని బోరుమన్నారు. మృతుల్లో సూర్యప్రకాష్‌కు వివాహం కాలేదు. సూర్యనారాయణకు భార్య సుంకమ్మతో పాటు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అనంతరం డ్రైవర్‌ను జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. -
నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం!
జడ్చర్ల, న్యూస్‌లైన్ : సబ్ స్టేషన్ నిర్మాణ పనుల్లో భాగంగా లై న్ బిగిస్తుండగా తీగలు తగిలి విద్యుదాఘాతాని కి గురై ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మ రొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వె ళితే... ఇటీవల జడ్చర్ల మండలం గంగాపూర్ శి వారులో కొత్తగా 33/11 కేవీ సబ్ స్టేషన్ ని ర్మాణ చేపట్టారు. ఇందులో భాగంగా స్తంభాల కు కొన్నిరోజుల క్రితం తీగలు బిగించారు. అ యితే అవి కిందకు వేలాడుతుండడంతో సరిచేసేందుకుగాను సంబంధిత కాంట్రాక్టర్ ఆది వారం సాయంత్రం కూలీలను పనుల్లోకి దిం చారు. వీరిలో మహబూబ్‌నగర్ మండలం రాం చంద్రాపురానికి చెందిన మహేశ్ (22), దేవరక ద్ర మండలం గూరకొండ వాసి బాలు ఉన్నారు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న 11 కేవీ పాత లైన్‌కు సబ్‌స్టేషన్ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మహేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, బాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన అక్కడివారు వెంటనే బాధితుడిని వెంటనే ఆటోలో ఎనుగొండలోని ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. మహేశ్ అవివాహితుడు కాగా బాలుకు భార్య శివలీల ఉంది. ఇదిలాఉండగా సబ్‌స్టేషన్ నిర్మాణ సమయంలో ఉన్నపుడు మరో 11 కేవీకి సంబంధించి లైన్ క్లియర్ తీసుకుని పనులు చేయాల్సి ఉన్నా కాంట్రాక్టర్, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగు చర్య తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెదిరిన బతుకులు
నల్లని రహదారులు రోడ్డు ప్రమాదాల రూపంలో ఈ ఏడాది ఎరుపెక్కాయి. వాహనాలు నడపడంలో చేసిన చిన్న, చిన్న నిర్లక్ష్యాలు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. ఎంతో మంది వికలాంగులు, క్షతగాత్రులుగా మారి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.అలక్ష్యంతో వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం రోడ్డు ప్రమాదాలకు దారితీశాయి. అయిదేళ్లుగా మావోయిస్టుల భయం వీడినా... దోపిడీ దొంగల బీభత్సం పెరిగిపోయింది. బాలికలు, మహిళలపై వేధింపులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. పగ, ప్రతీకారాలతో హత్యలు చోటు చేసుకున్నాయి. రాజకీయ కక్షలు రగిలాయి. ఏసీబీ అవినీతి అధికారుల భరతం పట్టింది. - న్యూస్‌లైన్, మహబూబ్‌నగర్ క్రైం జిల్లాలో ఏటా ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. రోడ్డు ప్రమాదాలు, మహిళలపై దాడులు, కేసులు పెరిగిపోయాయి. 2013లో జిల్లావ్యాప్తంగా 2963 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు రోడ్డు ప్రమాదాలపై 1550 కేసులు నమోదు కాగా, 783మంది మృత్యువాత పడ్డారు. మరో 361మంది వికలాంగులుగా మారారు. కొత్తకోట మండలం పాలెం వద్ద అక్టోబర్ 30న జరిగిన వోల్వో బస్సు ప్రమాదం రాష్ట్రంలోనే అతి పెద్ద సంఘటన. 45 మంది సజీవదహనమయ్యారు. హత్యలు... జిల్లాలో హత్యానేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాజకీయ హత్యలు కొన్నయితే, క్షణికావేశంలో , వివాహేతర సంబంధాల వల్ల కొన్ని చోటు చేసుకున్నాయి. రాజకీయ కక్షల నేపథ్యంలో మద్దూర్ మండలం మన్నాపూర్ సర్పంచ్ మాణిక్యమ్మను పెట్రోల్ పోసి, నిప్పంటించి హత్య చేశారు. ధన్వాడ మండలం పెద్దచింతకుంట సర్పంచ్ ఎన్నిక వివాదంలో జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్రశేఖర్ సొంత సోదరుడిని కాల్చి చంపారు. ఈ ఏడాది డిసెంబర్ 20 వరకు 159 మంది హత్యకు గురయ్యారు. మహిళలపై అత్యాచారాలు, కిడ్నాప్‌లు, వేధింపులకు సంబంధించి ఇప్పటి వరకు 977 కేసులు నమోదయ్యాయి. 40 వరకట్న హత్యలు జరగగా, 70 వరకట్న కేసులు నమోదయ్యాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకి సంబంధించి ఈ ఏడాది 25 శాతం కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. 2012లో 165 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది నవంబర్ వరకే 207 కేసులు నమోదయ్యాయి. అప్పులు, అవమానాలు భరించలేక, పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు. పలుచోట్ల బాల్యవివాహాలను, జోగినీగా మార్చే ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. -
బైక్‌ల దొంగకు రిమాండ్
జడ్చర్ల, న్యూస్‌లైన్ : వివిధ ప్రాంతాల్లో బైక్‌లను దొంగిలించిన ఓ నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ వెంకటరమణ కథనం ప్రకారం... ఈ నెల 15న జడ్చర్ల కొత్తబస్టాండు దగ్గర ఓ హోటల్ ఎదుట కర్నూలుకు చెందిన మహబూబ్‌పాషా తన బైక్‌ను ఉంచగా అపహరణకు గురయ్యింది. 19న నేతాజీచౌరస్తాలోని మెడికల్ షాప్ ఎదుట నిలిపిన ఫణిరాంకు చెందిన బైక్ కనిపించకుండా పోయింది. అదే రోజు సిగ్నల్‌గడ్డలోని ఎస్బీఐ ఎదురుగా కర్నూలుకు చెందిన శంకర్ తన బైక్‌ను ఉంచగా అపహరణకు గురైంది. అలాగే మహబూబ్‌నగర్ మర్లు ప్రాంతానికి చెందిన రామకృష్ణారెడ్డి తన బైక్‌ను జడ్చర్ల పట్టణంలోని దేవి హోటల్ ఎదుట నిలపగా అదృశ్యమైంది. 21న రుచి హోటల్ ఎదుట మహబూబ్‌నగర్‌కు చెందిన సుబ్రమణ్యం తన బైక్‌ను నిలపగా అపహరణకు గురైంది. నేతాజీచౌరస్తాలో తిమ్మాజీపేటకు చెందిన సదానందం బైక్ సైతం గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే మంగళవారం స్థానిక పాతబజార్‌లో నివాసముంటున్న మహ్మద్ఖాదర్ను అనుమానంతో అదుపులోకి తీసుకుని అతని ఇంటిని సోదా చేయగా అపహరణకు గురైన బైక్‌లన్నీ కనిపించాయి. దీంతో వాటిని స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించిన వారిలో ఎస్ఐ చెన్నయ్య, ఏఎస్ఐ నరేందర్, కానిస్టేబుళ్లు రవి, బేగ్ పాల్గొన్నారు.