జడ్చర్ల(మహబూబ్‌నగర్): ఎన్నికలకు ముందు ఇంటింటికి మంచినీళ్లు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు నీటి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని మహిళలు ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డి ఇంటి ఎదుట ఈ రోజు మహిళలు ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శనలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ఆయన ఇంటి ముందు.. పట్టణంలోని తాలూక క్లబ్, విద్యానగర్, మసీదు ఏరియా ప్రాంతాలకు చెందిన మహిళలు ఖాళీ బిందెలతో వచ్చి ఆందోళన చేపట్టారు.
.....................
మంత్రి ఇల్లు ముట్టడి
Published Mon, Aug 3 2015 2:28 PM | Last Updated on Sun, Sep 3 2017 6:43 AM
Advertisement
Advertisement