వివిధ ప్రాంతాల్లో బైక్‌లను దొంగిలించిన ఓ నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ వెంకటరమణ కథనం ప్రకారం...
జడ్చర్ల, న్యూస్‌లైన్ : వివిధ ప్రాంతాల్లో బైక్‌లను దొంగిలించిన ఓ నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ వెంకటరమణ కథనం ప్రకారం... ఈ నెల 15న జడ్చర్ల కొత్తబస్టాండు దగ్గర ఓ హోటల్ ఎదుట కర్నూలుకు చెందిన మహబూబ్‌పాషా తన బైక్‌ను ఉంచగా అపహరణకు గురయ్యింది. 19న నేతాజీచౌరస్తాలోని మెడికల్ షాప్ ఎదుట నిలిపిన ఫణిరాంకు చెందిన బైక్ కనిపించకుండా పోయింది. అదే రోజు సిగ్నల్‌గడ్డలోని ఎస్‌బీఐ ఎదురుగా కర్నూలుకు చెందిన శంకర్ తన బైక్‌ను ఉంచగా అపహరణకు గురైంది.
అలాగే మహబూబ్‌నగర్ మర్లు ప్రాంతానికి చెందిన రామకృష్ణారెడ్డి తన బైక్‌ను జడ్చర్ల పట్టణంలోని దేవి హోటల్ ఎదుట నిలపగా అదృశ్యమైంది. 21న రుచి హోటల్ ఎదుట మహబూబ్‌నగర్‌కు చెందిన సుబ్రమణ్యం తన బైక్‌ను నిలపగా అపహరణకు గురైంది. నేతాజీచౌరస్తాలో తిమ్మాజీపేటకు చెందిన సదానందం బైక్ సైతం గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే మంగళవారం స్థానిక పాతబజార్‌లో నివాసముంటున్న మహ్మద్‌ఖాదర్‌ను అనుమానంతో అదుపులోకి తీసుకుని అతని ఇంటిని సోదా చేయగా అపహరణకు గురైన బైక్‌లన్నీ కనిపించాయి. దీంతో వాటిని స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించిన వారిలో ఎస్‌ఐ చెన్నయ్య, ఏఎస్‌ఐ నరేందర్, కానిస్టేబుళ్లు రవి, బేగ్ పాల్గొన్నారు.