
హయత్‌నగర్: విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ ప్రిన్సిపల్ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించి అధ్యాపక వృత్తికే కలంకం తెచ్చిన ఉదంతం శుక్రవారం హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. ఐఎస్ సదన్‌కు చెందిన సత్యనారాయణ కొంత కాలంగా హయత్‌నగర్‌లో గౌతమి గరల్స్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్, కరెస్పాండెంట్‌గా పని చేస్తున్నాడు. ఆ కళాశాలలోనే ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినికి మాయమాటలు చెప్పి సినిమాకు తీసుకెళ్ళిన సత్యనారాయణ కొన్ని రోజులగా అమెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.
ఈ నెల 16న కూడా బాలికకు ఫోన్ చేసి ప్రత్యేక క్లాసు చెబుతానంటూ కళాశాలకు పిలిపించుకుని అ సభ్యంగా ప్రవర్తించాడు. అతని వేధింపులు తట్టకోలేక బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు గురువారం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం నిందితుడు సత్యనారాయణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితునిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రిన్సిపల్‌ను కఠినంగా శిక్షించాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆద్వర్యంలో విద్యార్థులు పోలీస్టేషన్ వద్ద ర్యాలీ నిర్వహించారు.
(చదవండి: తుపాకీతో కాల్చుకుని న్యాయవాది ఆత్మహత్య!)
Comments
Please login to add a commentAdd a comment