mis behave
-
అకృత్యం – దుష్కృత్యం
అకృత్యం, దుష్కృత్యం అనే రెండు పదాలని సమానార్థకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు సాధారణంగా. నిఘంటువు ననుసరించి రెండింటి మధ్య తేడా ఉన్నా వ్యవహారంలో మాత్రం సమానార్థకాలే. నిజానికి రెండు చేయకూడని పనులే. కాని రెండింటికీ మధ్య అతిసన్నని గీత వంటి తేడా ఉంది. కృత్యం అంటే చేయబడినది, పని అని అర్థం. అకృత్యం అనగానే వ్యతిరేకార్థం కనుక చేయబడనిది అని అర్థం చెప్పేస్తారు వ్యవహారజ్ఞానం తక్కువైన పండితులు. వ్యాకరణ రీత్యా ఆ విధంగా పదాన్ని సాధించవచ్చు. కాని దాని అర్థం మాత్రం చేయకూడని పని అని. చేయబడనిది అనే అర్థంలో అకృత్యం అనవలసి ఉంటుంది. దుష్కృత్యం అంటే చెడ్డపని. అకృత్యం అంటే చేయకూడని పని చేయటం వల్ల ఆ వ్యక్తికి నష్టం కలగ వచ్చు, కలగక పోవచ్చు. అది ఆ వ్యక్తి స్వభావాన్ని సూచిస్తుంది. కాని, దుష్కృత్యం అంటే చెడ్డపని వల్ల వ్యక్తికి ఇతరులకి, సమాజానికి కూడా హాని కలుగుతుంది. మానవుడు ఏ పని చేయకుండా కొద్దిసేపైనా ఉండలేడు. ఏమీ చేయటం లేదు అన్న వ్యక్తి కూడా ఆ క్షణం చేయటం లేదు అనే మాటని పలికాడు కదా! అది పనేగా! గాలి పీల్చటం, మానలేదుగా. ఆహారం తినటం, నీళ్ళు తాగటం ఆపలేదే. ఇవన్నీ ప్రయత్న పూర్వకంగా చేయటం లేదు. అసంకల్పిత చర్యలుగా సాగుతుంటాయి. కనక, నేను ఏమీ చేయటం లేదు అనటానికి వీలు లేదు. చేయటం తప్పనప్పుడు ఉపయోగ పడేది ఏదైనా చేయవచ్చు కదా! చేయాలని ఉండి, ఏం చేయాలో సరిగా తెలియక అనవసరమైన పనికిరాని పని చేయటం జరుగుతుంది. ఉద్దేశపూర్వకంగా చేయక పోయినా, సాధారణంగా చేయకూడని పని వల్ల ఏదో ఒక హాని ఉంటుంది. అందుకే దానిని చెడ్డపనితో సమానంగా భావించటం జరుగుతుంది. కాని, దుష్కృత్యం అంటే, ఉద్దేశపూర్వకంగా, కావాలని ఇతరులకి హాని కలగాలని చేసే పని. దుష్కృత్యం వెనుక దురుద్దేశం ఉంటుంది. కావాలని బాధించటానికి చేసే పని. క్రూరత్వం కాఠిన్యం ఉంటాయి. అది ఒకరకమైన మానసిక స్థితి. నలుగురు ఆనందం గా ఉంటే చూడలేక పోవటం, ఏడుస్తూ ఉంటే ఆనందించటం, ఏదైనా వ్యవస్థ సవ్యంగా నడుస్తూ ఉంటే చూడలేక పోవటం మొదలైన దుర్బుద్ధులు ఉన్నవారు చేసేవి ఈ పనులు. నలుగురు కలిసి ఏదో వేడుక జరుపుకుంటూ ఆనందంగా ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని చూసి ఓర్వ లేక చెడగొట్టటానికి విధ్వంసకచర్యలు చేయటం దుష్కృత్యం కాదా! అదే సామర్థ్యాన్ని, తెలివితేటలని పదిమంది సంతోషానికి ఉపయోగించవచ్చు కదా! ఒక దేశం కాని జాతి గాని పురోగమిస్తున్నప్పుడు ప్రగతి నిరోధక వ్యవహారాలు, మాటలు, ప్రచారాలు దుష్కృత్యాలే. పరాయి దేశాలపై దండయాత్రలు, దోపిడీలు, దోచుకోటాలు చేయతగిన పనులా? ఒకరకంగా చూస్తే ఇవి మానసిక జాడ్యాలు అని చెప్పవచ్చు. పైశాచిక, రాక్షసానందాలు. మందులతో తగ్గకపోతే శస్త్రచికిత్స తప్పదు. సామదాన భేద దండోపాయాల్లో ఏదో ఒక దానితో అదుపు చేయవలసి ఉంటుంది. వ్యక్తిగతమైన కక్షలు, అసూయా ద్వేషాలతో చేసే హానికారకమైన పనుల నుండి, జాతి, మత విద్వేషాలతో చేసే దురాగతాల వరకు ఇటువంటివి మనకు ఎన్నో కనపడుతూ ఉంటాయి. సంఘవిద్రోహకచర్యలు, హత్యలు, అత్యాచారాలు మొదలైననవి అన్నీ దుష్కృత్యాలే. ఒక్కమాటలో చెప్పాలంటే పాపకృత్యాలు అని చెప్పవచ్చు. పాపం అన్న దానికి కూడా చక్కని నిర్వచనం ఇచ్చారు పెద్దలు. ‘‘..పాపాయ పరపీడనం..’’ అని. ఇతరులని బాధించటమే పాపం. అందులోనూ కావాలని బాధించటం. అనుకోకుండా తాము చేసిన పని వల్ల ఇతరులకి బాధ కలిగితే అది పొరపాటు అవుతుంది కాని, దుష్కృత్యం అవదు. దానిని సరి చేసుకునే అవకాశం ఉంటుంది. – డా. ఎన్. అనంత లక్ష్మి -
రూట్ మార్చి కారు డ్రైవింగ్.. క్యాబ్ డ్రైవర్ని మహిళ నిలదీయడంతో
బనశంకరి(చెన్నై): నగరంలో ఉబర్ క్యాబ్ డ్రైవరు మహిళా ప్రయాణికురాలితో అనుచితంగా ప్రవర్తించినట్లు బాధితులు ఫిర్యాదు చేసింది. వివరాలు.. నగరంలో బీటీఎం లేఔట్ రెండో స్టేజ్ నుంచి జేపీ.నగర మెట్రోస్టేషన్ వరకు ప్రయాణించడానికి ఒక మహిళ ఉబర్ ట్యాక్సీని బుక్‌చేసింది. డ్రైవరు మ్యాప్ ఆధారంగా వెళ్లకుండా మరో మార్గంలో వెళ్తుండగా, మ్యాప్ మేరకు వెళ్లాలని మహిళ కోరారు. కానీ డ్రైవర్ ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో మహిళ తనను తీసుకువచ్చిన స్థలంలో వదిలిపెట్టాలని, ఆ డబ్బులను చెల్లిస్తానని చెప్పింది. సమ్మతించని డ్రైవరు మహిళతో అనుచితంగా ప్రవర్తించినట్లు తెలిసింది. బాధితురాలు సోషల్ మీడియాలో ఈ ఘటనను వివరించింది. డ్రైవర్ తీరుతో భయభ్రాంతులకు గురై ఎలా తప్పించుకుని జనసందడి ఉన్న ప్రాంతంలోని వచ్చానని తెలిపింది. దీనిపై ఉబర్ సంస్థ స్పందిస్తూ ఆ డ్రైవరును గుర్తించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. చదవండి: HYD: తల్లీకూతుళ్ల ఆత్మహత్య.. చేతిపై ఏం రాసి ఉంది? -
తెలుగు టీచర్‌కు ‘తెగులు’.. విద్యార్థినులతో తరగతి గదిలోనే వికృత చేష్టలు
సాక్షి, అనంతపురం(ఉరవకొండ): విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పాడు. తన చేష్టల ద్వారా వికృతరూపాన్ని బయటపెట్టాడు. ఆయన చేష్టలు శ్రుతిమించడంతో విద్యార్థినులు తమ ఇళ్లల్లో చెప్పారు. తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. కామోపాధ్యాయుడి బడితపూజ చేయాలనుకున్న చర్యలను ఉపాధ్యాయులు నిలువరించారు. బాధితుల తల్లిదండ్రుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నింబగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3 నుంచి 10వ తరగతి వరకు 280 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తొమ్మిది మంది టీచర్లు పనిచేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ వెంకటేశులు ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు తెలుగు సబ్జెక్టు బోధిస్తున్నారు. ఈయన ఇటీవల కాలంలో పాఠాలను పక్కనపెట్టి అమ్మాయిలపై ‘ఫోకస్’ పెట్టాడు. ఓనీ తీసి డ్యాన్స్ చేయాలని, తనకు ముద్దులు పెట్టాలని అమ్మాయిలను ఒత్తిడి చేసేవాడు. ద్వందార్థాలు, వెకిలి చేష్టలు వికృతరూపం దాల్చాయి. టార్చర్ తట్టుకోలేక కొంతమంది విద్యార్థినులు బడికి వెళ్లకుండా ఇంట్లోనే ఆగిపోతున్నారు. చదవండి: (ఏ పోలీసోడు వస్తాడో.. రమ్మనండి!) ఇందుకు గల కారణాలను పలువురు తల్లిదండ్రులు తెలుసుకుని 15 రోజుల క్రితం టీచర్ వెంకటేశులుపై ఉరవకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇందుకు పోలీసులు సదరు టీచర్‌ను స్టేషన్‌కు పిలిపించారు. తాను సరిగా చదవకపోతే కొట్టాను తప్ప, అసభ్యంగా ప్రవర్తించలేదని చెప్పడంతో.. మరోసారి ఇలా జరగకుండా బుద్ధిగా ఉండాలని వెంకటేశులుకు చెప్పి పంపించేశారు. అయినా అతడిలో మాత్రం మార్పు రాలేదు. తన పంథా మార్చుకోలేదు. మళ్లీ అమ్మాయిలను వేధించడం కొనసాగించాడు. తమ పిల్లలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని తల్లిదండ్రులు రగిలిపోయారు. శుక్రవారం మధ్యాహ్నం పాఠశాల వద్దకెళ్లి ఆందోళనకు దిగారు. తెలుగు టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ పిల్లల జీవితాలతో ఆడుకుంటాడా అంటూ ఆగ్రహంతో టీచర్‌పై దాడి చేయడానికి సిద్ధమయ్యారు. పరిస్థితిని పసిగట్టిన హెచ్ఎం విజయలక్ష్మి సదరు టీచర్ వెంకటేశులును ఓ గదిలో పెట్టి తాళం వేసి.. పోలీసులకు సమాచారం అందించారు. కొద్దిసేపటికే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేశారు. విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని మండల విద్యాధికారి తెలిపారు. -
కీచక కరస్పాండెంట్.. ప్లస్‌టూ విద్యార్థినులతో..
సాక్షి, చెన్నై(తిరువళ్లూరు): ప్లస్‌టూ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు లైగింక వేధింపులకు గురి చేయడంతో ఆగ్రహించిన బాలికలు తరగతులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఈ ఘటన తిరువళ్లూరు జిల్లాలో బుధవారం జరిగింది. వివరాలు.. తిరునిండ్రవూర్‌లోని ఏంజెల్ మెట్రిక్ ప్రైవేటు పాఠశాలలో సుమారు 2 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. నర్సరీ నుంచి ప్లస్‌టూ వరకు పాఠశాల చైర్మన్ సిందై జయరామన్ ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన కుమారుడు వినోద్(34) కరస్పాడెంట్‌గా ఉన్నారు. కొద్ది రోజులుగా వినోద్ ప్లస్‌టూ, ప్లస్‌వన్ విద్యార్థినులను కౌన్సిలింగ్ పేరిట ప్రత్యేక గదికి పిలిపించుకుని అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు లౌగింక వేధింపులకు గురి చేసినట్లు తెలిసింది. పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లపై సైతం లౌగింకంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై పలుమార్లు పాఠశాల చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థినులు బుధవారం ఉదయం తరగతులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. వినోద్‌ను వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. విషయం తెలుసుకున్న సీఈఓ రామన్, డీఈఓ రాధాకృష్ణన్, ఇతర ఉన్నతాధికారులు పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. జరిగిన విషయాలను విద్యార్థినులు వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అతనిపై పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వినోద్ కోసం గాలిస్తున్నారు. నాలుగు రోజులు పాఠశాలకు సెలవు విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. విద్యార్థులు ఆందోళన చేయవద్దని..నిందితులపై చర్యలు తీసుకుంటామని.. విద్యార్థినుల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని హామీ ఇస్తూ మేసేజ్‌లు పంపింది. బీజేపీ నాయకులకు చుక్కెదురు విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు వారికి మద్దతుగా నిరసనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ నినాదాలు చేశారు. విద్యార్థుల ఆందోళన రాజకీయ కోణంలో వెళుతున్నట్లు గుర్తించిన కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బీజేపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఇది పాఠశాల యాజమాన్యానికి, విద్యార్థులకు మధ్య సమస్య అని.. తామే పరిస్కరించుకుంటామని తెలిపారు. -
విద్యార్థినితో ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తన
హయత్‌నగర్: విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ ప్రిన్సిపల్ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించి అధ్యాపక వృత్తికే కలంకం తెచ్చిన ఉదంతం శుక్రవారం హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. ఐఎస్ సదన్‌కు చెందిన సత్యనారాయణ కొంత కాలంగా హయత్‌నగర్‌లో గౌతమి గరల్స్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్, కరెస్పాండెంట్‌గా పని చేస్తున్నాడు. ఆ కళాశాలలోనే ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినికి మాయమాటలు చెప్పి సినిమాకు తీసుకెళ్ళిన సత్యనారాయణ కొన్ని రోజులగా అమెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ నెల 16న కూడా బాలికకు ఫోన్ చేసి ప్రత్యేక క్లాసు చెబుతానంటూ కళాశాలకు పిలిపించుకుని అ సభ్యంగా ప్రవర్తించాడు. అతని వేధింపులు తట్టకోలేక బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు గురువారం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం నిందితుడు సత్యనారాయణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితునిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రిన్సిపల్‌ను కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ ఆద్వర్యంలో విద్యార్థులు పోలీస్టేషన్ వద్ద ర్యాలీ నిర్వహించారు. (చదవండి: తుపాకీతో కాల్చుకుని న్యాయవాది ఆత్మహత్య!) -
ప్లాట్‌లో కార్లు పార్కింగ్.. అడిగినందుకు అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా..
సాక్షి ,బంజారాహిల్స్: తమ ప్లాట్‌లో అక్రమంగా కార్లు పార్కింగ్ చేయడమే కాకుండా తొలగించాలని చెప్పినందుకు వేధింపులకు పాల్పడుతున్న నిందితులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసుల సమాచార మేరకు... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 39లో క్రోమా బిల్డింగ్ వెనుకాల ప్లాట్ నెంబర్ 757లో యజమానురాలు ఇటీవల నిర్మాణ భూమి పూజ చేసేందుకు వెళ్లగా ఆ స్థలంలో పక్కనే సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే వ్యక్తి తన కార్లను పార్కింగ్ చేశాడు. ఇదేమిటని ఆమె ప్రశ్నించగా ఆమెపై దుర్భాషలాడాడు. కార్లు తొలగించను ఏం చేసుకుంటావో చేసుకో అంటూ హెచ్చరించాడు. ప్లాట్ కబ్జా చేసేందుకు అడ్డదారుల్లో ప్రయత్నిస్తున్నాడని నిలదీసినందుకు తనపై హత్యాయత్నానికి కూడా వెనుకాడటం లేదని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన ప్లాట్‌ను ఆక్రమించి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించారు. దీంతో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆమె అంతు చూస్తానని బెదిరించిన సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయ కేంద్రం యజమాని సయ్యద్ తౌసిఫ్, సయ్యద్ ఆసిఫ్‌లపై జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 354, 447, 506, 509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Nupur Sharma నూపుర్ శర్మ ఫొటో షేర్ చేసినందుకు షాకింగ్ ఘటన.. అందరూ చూస్తుండగానే -
ఆ ప్రేమికుల్ని బలవంతంగా బంధించి.. పూలు చల్లి, పెళ్లి చేసి.. యువతి శరీరంపై..
బరంపురం(భువనేశ్వర్): తమ పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఓ ప్రేమ జంట రాయిఘర్ పోలీసులను బుధవారం ఆశ్రయించి, ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయం జరిగేలా చూస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. వివరాలిలా ఉన్నాయి.. నవరంగపూర్ జిల్లాలోని రాయిఘర్ సమితి, సోనపూర్(డీఎన్‌కే) గ్రామంలో ఉన్న తన అక్క ఇంటికి ఈ నెల 8వ తేదీన ఛడిబెడ గ్రామానికి చెందిన ఓ యువతి వచ్చింది. కాళీమాత పూజల సందర్భంగా అదేరోజు రాత్రి గ్రామంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు యువతి హాజరైంది. అదే చోటుకి వచ్చిన తన ప్రియుడితో కాసేపు మాట్లాడేందుకు కార్యక్రమం జరుగుతున్న ప్రదేశం నుంచి కొంచెం దూరం వెళ్లారు. అక్కడ ఓ చోట వీరిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటుండగా గ్రామానికి చెందిన కొంతమంది ఆకతాయిలు వీరిని చుట్టుముట్టి, వారి వివరాలపై ఆరాతీశారు. ఆ తర్వాత వారికి ఇష్టమొచ్చినట్లు వారి బంధంపై మాట్లాడి, బలవంతంగా లాక్కెళ్లారు. వారిద్దరినీ ఓ ఇంట్లో బంధించి, వీడియో తీశారు. కాసేపు తర్వాత వారి ఇద్దరిపై పూలు చల్లి, పెళ్లి చేసినట్లుగా మరో వీడియో తీశారు. చదవండి: ('నూటొక్క జిల్లాల అందగాడు': విగ్గుతో అమ్మాయిలకు వలేస్తాడు.. ఆ తర్వాత..) న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు అనంతరం యువతి శరీరంపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి, అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో తనను దయచేసి విడిచిపెట్టాలని ఆ యువతి ఎంత మొరపెట్టుకున్నా వారు వినలేదు. అలాగే బంధించి, ఉంచిన వారిని మరుసటిరోజు ఉదయం విడిచిపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న యువతి తండ్రి సోనపూర్కి హుటాహుటిన వచ్చి, యువతిని తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. దీనిని అడ్డుకునేందుకు యత్నించిన గ్రామ కమిటీ సభ్యులు యువతి తండ్రిపై భౌతికదాడి చేసినట్లు ఫిర్యాదులో యువతి పేర్కొంది. ప్రస్తుతం తమను బంధించి, చిత్రహింసలు చేసిన వీడియోలు వైరల్ కావడంతో తమ పరువు పోయిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రేమికుల జంట పోలీసులను కోరింది. లేకపోతే తాము ఆత్మహత్య చేసుకుంటామని వాపోయారు. చదవండి: (Mukesh Ambani House: ‘అంటిలియా’ అడ్రస్ అడిగిన ముగ్గురి అరెస్టు!) -
మణికొండ: యువతితో క్యాబ్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన
సాక్షి, మణికొండ: తన క్యాబ్‌లో వచ్చిన ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్‌కు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్ సన్‌సిటీలో మంగళవారం రాత్రి జరిగింది. సన్‌సిటీలో నివసిస్తున్న ఓ యువతి హైదరాబాద్ నుంచి క్యాబ్‌లో హైదర్షాకోట్కు వచ్చింది. ఆ తరుణంతో డ్రైవర్ ఆ యువతితో అసభ్యంగా మాట్లాడటం, చేయిపట్టుకుని లాగటంతో ఆమె క్యాబ్ దిగగానే స్థానికులకు ఆ విషయం తెలిపింది. దీంతో అక్కడున్న వారు అతనికి దేహశుద్ధి చేసి నార్సింగి పోలీసులకు అప్పగించారు. అతడిపై కేసు నమోదు చేశామని సెక్టార్ ఎస్ఐ అన్వేష్‌రెడ్డి తెలిపారు. (చదవండి: ప్రాణం తీసిన వివాహేతర సంబంధం ) -
మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. పోలీసులకు ఫిర్యాదు
లక్నో: తన ఇంటి పక్కన ఉండే కొంత మంది వ్యక్తులు తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని లక్నోకి చెందిన ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, సెప్టెంబరు 25న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్నోలోని జంకిపురంలో ఉండే మహిళ పట్ల ఆమె ఇంటి పక్కన నివసించే రోహిత్ యాదవ్, హర్నామ్ యాదవ్ అనే యువకులు గత కొన్ని రోజులుగా వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో బాధిత మహిళ సెప్టెంబరు 25న ఇంటి నుంచి బయటకు వచ్చింది. దీంతో ఇద్దరు యువకులు ఆమె వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా సైగలు చేస్తూ.. బాధిత మహిళపై దాడిచేసి దుస్తులను తీసేశారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరింపులకు కూడా పాల్పడ్డారు . దీంతో బాధిత మహిళ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సహయంతో జరిగిన దారుణాన్ని పోలీసులకు ఫోన్ చేసి తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కి తరలించినట్లు జంకిపూరం పోలీసు అధికారి కుల్దీప్ సింగ్ తెలిపారు. కాగా, ప్రస్తుతం తనకు పోలీసు భద్రత కావాలని బాధిత మహిళ పోలీసు అధికారులను కోరినట్లు తెలిపింది. చదవండి: చెప్పుల్లో బ్లూటూత్ పెట్టుకుని పరీక్షలు.. ధర రూ.6 లక్షలు! -
మాస్క్ లేదా అన్నందుకు.. అంగీ, ప్యాంటు విప్పి.. ఆపై
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. అందుకే ప్రభుత్వాలు మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించాలన్న నియమాలను తప్పనిసరిచేసిన విషయం తెలిసిందే. అయితే, కర్ణాటకలో ఒక యువకుడు మాస్క్ వేసుకోమన్నందుకు వింత చేష్టలతో అక్కడి వారిని ఇబ్బందులకు గురిచేశాడు. కాగా, మాస్క్ లేదా అని పాలికె మార్షల్స్ అడగడంతో ఓ యువకుడు అంగీ, ప్యాంటు విప్పి గలాటా చేశాడు. కే.ఆర్.మార్కెట్ వద్ద ఈ ఘటన జరిగింది. టీ ఫ్లాస్క్ పట్టుకొని వ్యాపారం చేసే యువకుడు మాస్క్ వేసుకోలేదు. మాస్క్ లేదా, జరిమానా కట్టు అని మార్షల్స్ గద్దించడంతో అతడు వెంటనే షర్ట్, ప్యాంట్ విప్పివేసి అర్ధనగ్నంగా నిలబడ్డాడు. బిత్తరపోయిన మార్షల్స్ అతన్ని పంపించివేశారు. ఎవ్వరూ మాస్క్‌లు వేసుకోవద్దు, ఏం చేస్తారో చూస్తామని యువకుడు చెప్పడం గమనార్హం. -
అంపైర్ ఔటివ్వలేదని వికెట్లు పీకి పాడేసిన స్టార్ క్రికెటర్..
ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ క్రికెట్ సమాజం తలదించుకునే పని చేశాడు. అంపైర్ ఔటివ్వలేదని నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లోని వికెట్లను కాలితో తన్నాడు. అంతటితో ఆగకుండా అంపైర్‌ను దుర్భాషలాడుతూ అతనిపైకి దూసుకెళ్లాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఢాకా ప్రీమియర్ డివిజన్ టీ20 క్రికెట్ లీగ్‌లో భాగంగా అబహాని లిమిటెడ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో మహమ్మదెన్ స్పోర్టింగ్ క్లబ్ జట్టుకు ప్రాతనిధ్యం వహిస్తున్న షకీబ్ అల్ హసన్.. అంపైర్ నిర్ణయం పట్ల అసహనానికి లోనై వికెట్లను తన్నడంతో పాటు అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించాడు. Shit Shakib..! You cannot do this. YOU CANNOT DO THIS. #DhakaLeague It’s a shame. pic.twitter.com/WPlO1cByZZ — Saif Hasnat (@saifhasnat) June 11, 2021 వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన షకీబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అబహాని లిమిటెడ్ జట్టు ఆచితూచి ఆడుతున్న క్రమంలో, షకీబ్ ఐదో ఓవర్ బౌల్ చేశాడు. ఈ ఓవర్లో తొలి రెండు బంతులను అబహాని బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్ వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. అయితే, ఆ మరుసటి బంతి ముష్ఫికర్ బ్యాట్‌ను మిస్ అయి ప్యాడ్లను తాకింది. దీంతో ఎల్బీ కోసం గట్టిగా అప్పీల్ చేసిన షకీబ్.. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో సహనం కోల్పోయాడు. ఆగ్రహంతో అతనిపైకి దూసుకెళ్తూ నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లోని వికెట్లను గట్టిగా తన్నాడు. కాగా, షకీబ్ ఇదే మ్యాచ్‌లో మరోసారి అంపైర్ నిర్ణయం పట్ల అసహనానికి గురయ్యాడు. One more... Shakib completely lost his cool. Twice in a single game. #DhakaLeague Such a shame! Words fell short to describe these... Chih... pic.twitter.com/iUDxbDHcXZ — Saif Hasnat (@saifhasnat) June 11, 2021 ప్రత్యర్ధి విజయం దాదాపు ఖరారైన సమయంలో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అతను.. మరోసారి అంపైర్ నిర్ణయాన్ని తప్పుపట్టాడు. ఇంతటితో ఆగకుండా అంపైర్‌ను దుర్భాషలాడుతూ, వికెట్లను పీకి పారేశాడు. కాగా, షకీబ్ వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. జాతీయ జట్టుకు కెప్టెన్‌గా, స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదిగిన షకీబ్.. యువ క్రికెటర్లకు స్పూర్తిగా నిలవాల్సింది పోయి, ఇలా దురుసుగా ప్రవర్తించడం సిగ్గు చేటని నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే షకీబ్ ఇలా ప్రవర్తించడం ఇది తొలిసారేమీ కాదు. గతంలోనూ అనేకసార్లు ఈ తరహా ప్రవర్తనతోనే మందలింపుకు గురయ్యాడు. అయితే తాజా వీడియోలపై బంగ్లా క్రికట్ బోర్డు స్పందిస్తే మాత్రం అతనిపై కఠిన చర్యలు తప్పకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: నట్టూ, శ్రేయస్‌లను ఎంపిక చేయకపోవడానికి కారణం అదేనా.. -
మహిళతో అసభ్య ప్రవర్తన; ఎస్ఐ సస్పెన్షన్
సాక్షి, శ్రీకాకుళం : నిందితురాలితో ఫోనులో అనుచితంగా మాట్లాడినట్టు ఆరోపణ ఎదుర్కొంటున్న పొందూరు సబ్ ఇన్స్పెక్టర్ కొల్లి రామకృష్ణను జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ సోమవారం సస్పెండ్ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ ఈ విషయం ప్రకటించారు. పొందూరు మండలం రాపాక గ్రామంలో అక్రమ మద్యం నిల్వలు కలిగిన కేసులో నిందితురాలైన ఓ మహిళను ఎస్ఐ ఇంటికి రమ్మన్నట్టు ఫోన్లో రికార్డయిన సంభాషణ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఎస్ఐను సస్పెండ్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. ఈ సంఘటనపై విచారణ జరిపిన తరువాత సీఆర్ నంబర్ 430/2020 యు/ఎస్ 354–ఎ ప్రకారం కేసు నమోదు చేసినట్టు తెలిపారు. జిల్లాలో సిబ్బంది ఎవరైనా ఇలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, వారిపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సమావేశంలో ఎస్పీ హెచ్చరించారు. అసలేం జరిగిందంటే.. రాపాక కూడలికి సమీపంలోని కుమ్మరికాలనీలో నివాసం ఉంటున్న మహిళను శనివారం మద్యం సీసాలను అక్రమంగా నిల్వ ఉంచిన కేసులో అరెస్టు చేశారు. అదే రోజు తుంగపేటలో నిందితురాలి తండ్రిని మద్యం సీసాల నిల్వ కేసులో అరెస్టు చేశారు. ఈ కేసు విషయంలో ఆదివారం వీరిని స్టేషన్‌కు పిలిపించారు. అదే రోజున ఎస్ఐ ఫోనులో నిందితురాలితో మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. ఇంటికి వస్తే కేసు లేకుండా చూస్తానని ఫోనులో మాట్లాడుతూ తాను నివాసం ఉంటున్న వీధి చిరునామాను తెలియజేశారు. ఒంటరిగా మాత్రమే రావాలని సూచించారు. వారిద్దరి మధ్య జరిగిన ఫోను సంభాషణ ఆడియో టేప్ వాట్సాప్‌లో హల్చల్ చేసింది. ఈ ఘటన గురించి పత్రికల్లో వార్తలు రావడంతో జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ స్పందించి సస్పెండ్ చేశారు. విచారణ ప్రారంభం.. కేసు నమోదు ఈ ఉదంతంపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించామని జేఆర్‌పురం సీఐ హెచ్.మల్లేశ్వరరావు తెలిపారు. ఎస్సై రామకృష్ణపై కేసు నమోదు చేసినట్లు కూడా ఆయన చెప్పారు. మహిళతో ఫోన్లో అనుచితంగా మాట్లాడారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
ప్రముఖ కమెడియన్‌పై నిషేధం
న్యూఢిల్లీ : ఆంగ్ల వార్తాచానెల్ ‘రిపబ్లిక్ టీవీ’ ఎడిటర్, ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నాబ్ గోస్వామిపై తమ విమానంలో అనుచితంగా ప్రవర్తించినందుకు స్టాండ్ అప్ కమెడియన్ కునాల్ కామ్రాపై ఇండిగో విమానయాన సంస్థ నిషేధం విధించింది. 6 నెలల పాటు తమ విమానాల్లో ప్రయాణించేందుకు కామ్రాను అనుమతించబోమని ట్వీట్ చేసింది. ముంబై నుంచి లక్నో వెళ్తున్న విమానంలో గోస్వామితో కామ్రా అభ్యంతరకరంగా, ఎగతాళి చేసినట్లుగా ప్రవర్తించాడని పేర్కొంది. ఇండిగో తరహాలో ఇతర విమానయాన సంస్థలు కామ్రాపై నిషేధం విధించాలని కేంద్ర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి కోరారు. -
వివాదంలో మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ భార్య
-
కాంబ్లీ భార్యతో అసభ్య ప్రవర్తన
సాక్షి, ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ భార్యతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. కాంబ్లీ భార్య ఆండ్రియా ఆ వృద్ధుడిపై చెయ్యి చేసుకోగా.. సదరు వృద్ధుడ్ని బాలీవుడ్ సింగర్ అంకిత్ తివారీ తండ్రి రాజ్ కుమార్ తివారీగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ వ్యవహారంలో అంకిత్ సోదరుడు అంకుర్ తిరిగి కాంబ్లీ దంపతులతో వాగ్వాదానికి దిగారు. ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం మలాద్‌లోని ఇన్ఆర్బిట్ మాల్‌కు కాంబ్లీ-ఆండ్రియా వెళ్లారు. ఆ సమయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఓ వృద్ధుడు ఆండ్రియాను తాకాడు. దీంతో కోపంతో ఆమె తన చేతిలోని బ్యాగుతో అతనిపై దాడి చేసింది. ఆ వెంటనే కాంబ్లీ జోక్యం చేసుకుని ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లాడు. అయితే కాసేటికే ఆ వ్యక్తి కొడుకులమంటూ ఓ ఇద్దరు వ్యక్తులు కాంబ్లీ-ఆండ్రియాలతో గొడవకు దిగారు. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవటంతో మాల్ సిబ్బంది జోక్యం చేసుకుని వారిని అక్కడి నుంచి పంపించేశారు. ఈ ఘటన తర్వాత కాంబ్లీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మరోవైపు తివారీ సోదరులు కూడా బంగూర్ నగర్ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. సీసీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. చెప్పుతో కొట్టింది... కాగా, తివారీ సోదరులు ఘటనపై మీడియాతో మాట్లాడుతూ కాంబ్లీ భార్యపై ఆరోపణలు గుప్పించారు. ‘తోపులాటలో నా తండ్రి పొరపాటున ఆమెను తాకాడు. వృద్ధుడని కూడా చూడకుండా ఆమె చెప్పుతో కొట్టింది. అందుకే వాళ్లను మేం నిలదీశాం. కానీ, కాంబ్లీయే మమల్ని బెదిరించాడు’ అని అంకుర్ చెబుతున్నాడు. అయితే కాంబ్లీ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నాడు. -
నటుడిపై కేసు.. అరెస్ట్ చేసిన పోలీసులు
భోజ్‌పురి నటుడు, నిర్మాత రాజా చౌదరి మరోసారి వివాదంలో చిక్కారు. అతిగా మద్యం తాగి ఘర్షణకు దిగినందుకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి కాన్పూర్ సమీపంలో సినిమా యూనిట్, కొంత మందితో ఆయన గొడవకు దిగాడు. నోటికి వచ్చినట్టు తిట్లు తిట్టాడు. బాధితులు ఫిర్యాదు చేయడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నామని కాన్పూర్ ఎస్పీ సంజీవ్ సుమన్ తెలిపారు. గతంలో రాజా చౌదరి, నటి శ్వేతా తివారి విడాకుల కేసు విషయంలో వార్తల్లోకెక్కాడు. 1998లో అతనితో పరిచయం, ప్రేమ, పెళ్లి.. ఆ తరువాత వేధింపులు తట్టుకోలేక 2007లో విడిపోయిన శ్వేత, 2011లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత శ్వేత మరో వ్యక్తి (అభినవ్ కొహ్లీ), రాజా తన ప్రేయసి(శ్వేతా సూద్)ను వివాహం చేసుకున్నారు. శ్వేత తివారి, రాజా చౌదరి బిగ్‌బాస్ షో ద్వారా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. Kanpur: Actor Raja Choudhary allegedly misbehaved with people after being allegedly drunk. SP West, Sanjeev Suman, says, 'we have registered a case against him & have sent him for the medical tests. Further investigation underway.' pic.twitter.com/Yzbig94wtE — ANI UP (@ANINewsUP) June 1, 2018 -
కీచకోపాధ్యాయులు
రుద్రవరం(ఆళ్లగడ్డ) : ఉపాధ్యాయులు..సమాజ నిర్దేశకులు. భావిభారత పౌరులను తీర్చిదిద్దే గురుతర బాధ్యత కల్గిన వారు. అలాంటి వారి నడవడిక ఎంతో ఉన్నతంగా, ఆదర్శప్రాయంగా ఉండాలి. కానీ కొందరు దారి తప్పుతున్నారు. తమ ‘స్థాయి’ మరచి ప్రవర్తిస్తున్నారు. తద్వారా అపవాదును మూటగట్టుకుంటున్నారు. రుద్రవరం మండలం ఎల్లావత్తుల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల (మెయిన్)లో ఎస్జీటీగా పనిచేస్తున్న రామకృష్ణ అకృత్యాలు వెలుగు చూశాయి. బడిలోనే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడమే కాకుండా చిన్నారులతో వెకిలిచేష్టలు చేస్తుండడంతో అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో మండల విద్యాధికారి సాహెబ్ హుస్సేన్ గురువారం పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నారులు కన్నీటి పర్యంతమవుతూ టీచర్ వెకిలిచేష్టల గురించి వివరించారు. ‘టీచర్ తరగతి గదిలోకి వచ్చిన వెంటనే ఇదే గ్రామానికి చెందిన ఓ మహిళ ఇక్కడికొస్తుంది. ఆమెతో కొంతసేపు మాట్లాడతాడు. తరువాత మమ్మల్ని బయట కూర్చోమని పెద్దగా చదవమంటాడు. తర్వాత వారిద్దరే గదిలో ఉంటారు. అంతేకాకుండా ఐదో తరగతి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవరిస్తున్నాడు. అవసరం లేకపోయినా దగ్గరకు తీసుకుని ఒళ్లంతా నిమరడం..అసభ్యకరంగా మాట్లాడడం చేస్తుంటాడు. ఈ విషయాలను బయటకు చెప్పామన్న కోపంతో మమ్మల్ని చితకబాదుతున్నాడ’టూ ఎంఈఓ ఎదుట వాపోయారు. కాగా.. టీచర్ రామకృష్ణ ప్రవర్తనపై సదరు పాఠశాల హెచ్ఎం కూడా విసుగు చెందారు. తనను హెచ్ఎం బాధ్యతల నుంచి తప్పించాలని ఎంఈఓకు లేఖ రాయడం గమనార్హం. అనారోగ్య కారణాలు చూపుతున్నప్పటికీ సదరు టీచర్ కారణంగా ఏదైనా ఘటన జరిగితే హెచ్ఎంగా తనకు అపవాదు వస్తుందనే ఉద్దేశంతోనే బాధ్యతల నుంచి తప్పించాలని కోరినట్లు తెలుస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు చెప్పిన ప్రతి విషయం రికార్డు చేసుకున్నానని, రామకృష్ణను తక్షణమే సెలవుపై వెళ్లాలని ఆదేశించానని ఎంఈఓ చెప్పారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపి.. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. వ్యాయామ టీచర్‌పై పునః విచారణ రుద్రవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో గతంలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేసిన చంద్రమోహన్‌పై డిప్యూటీ డీఈఓలు బ్రహ్మం, అరవిందమ్మ, రాజకుమారిలు గురువారం పునః విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రమోహన్ విధులు నిర్వహిస్తున్న సమయంలో బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని, కొందరిపై లైంగిక వేధింపులు.. ఇతర ఆరోపణలు రావడంతో ఇక్కడి నుంచి బదిలీపై పంపారన్నారు. గతంలో విచారణ జరిపినప్పటికీ సంతృప్తికరంగా లేకపోవడంతో డీఈఓ ఆదేశాల మేరకు మళ్లీ విచారణ చేస్తున్నామన్నారు. గతంలో పనిచేసిన హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులతో విడివిడిగా మాట్లాడి.. లిఖిత పూర్వకంగా రాయించుకున్నట్లు తెలిపారు. ఈ నివేదికను డీఈఓకు అందజేస్తామన్నారు. గతంలో చంద్రమోహన్ అసభ్యకరంగా ఫొటోలు తీసి ఇతరులకు చూపడంతో మనస్తాపానికి గురైన పదో తరగతి విద్యార్థిని అత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇతనిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు, విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. -
అసభ్యకర ప్రవర్తన: 18 మంది అరెస్ట్
చిన్నశంకరంపేట (మెదక్) : నడిరోడ్డుపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న 15 మంది యవకులతో పాటు ముగ్గురు యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జాస్తిశివనూర్ గ్రామ శివారులోని సరోజినీ నగర్ వేశ్యవాటికల వద్ద శుక్రవారం అసభ్యకర చర్యలు చేస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకన్న పోలీసులు 15 మంది యువకులతో పాటు ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. -
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వృద్ధుడు
కంకిపాడు (విజయవాడ) : దుకాణానికి వచ్చిన బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో మంగళవారం జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బామర్ల శివరామకృష్ణ ప్రాసద్(64) అనే వృద్ధుడు తన ఇంటి సమీపంలోని దుకాణంలో సరుకులు కొనడానికి వచ్చిన తొమ్మిదేళ్ల బాలికతో సోమవారం రాత్రి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బెదిరిపోయిన బాలిక ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో.. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.