
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. అందుకే ప్రభుత్వాలు మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించాలన్న నియమాలను తప్పనిసరిచేసిన విషయం తెలిసిందే. అయితే, కర్ణాటకలో ఒక యువకుడు మాస్క్ వేసుకోమన్నందుకు వింత చేష్టలతో అక్కడి వారిని ఇబ్బందులకు గురిచేశాడు. కాగా, మాస్క్ లేదా అని పాలికె మార్షల్స్ అడగడంతో ఓ యువకుడు అంగీ, ప్యాంటు విప్పి గలాటా చేశాడు.
కే.ఆర్.మార్కెట్ వద్ద ఈ ఘటన జరిగింది. టీ ఫ్లాస్క్ పట్టుకొని వ్యాపారం చేసే యువకుడు మాస్క్ వేసుకోలేదు. మాస్క్ లేదా, జరిమానా కట్టు అని మార్షల్స్ గద్దించడంతో అతడు వెంటనే షర్ట్, ప్యాంట్ విప్పివేసి అర్ధనగ్నంగా నిలబడ్డాడు. బిత్తరపోయిన మార్షల్స్ అతన్ని పంపించివేశారు. ఎవ్వరూ మాస్క్‌లు వేసుకోవద్దు, ఏం చేస్తారో చూస్తామని యువకుడు చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment