Marshalls
-
అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరణ! రాష్ట్రపతిని కలిసేందుకు ప్లాన్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడానికి ముందు విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు రోజంతా అసెంబ్లీ నుంచి బహిష్కరణకు గురయ్యాయి. ప్రతిపక్ష శాసన సభ్యులైన బీజీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆప్ పార్టీపై వచ్చిన ఆరోపణలపై చర్చలు జరగాలని పిలుపునిచ్చారు. వారంతా తరగతి గదుల నిర్మాణం, ఎక్సైజ్ పాలసీ 2021-22 అవకతవకలు జరిగిన ఆరోపణలపై చర్చ జరగాలని గట్టిగా డిమాండ్ చేశారు. దీంతో బీజీపీ ఎమ్మెల్యేలను బహిష్కరణకు గురై ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. ఈ మేరకు బీజేపీ నాయకుడు రాంవీర్ సింగ్ బిధూరి మాట్లాడుతూ...బీజేపీ ఎమ్మెల్యేలను రాజ్యంగ విరుద్ధంగా అసెంబ్లీ నుంచి రోజంతా బహాష్కరించారంటూ మండిపడ్డారు. కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, అందువల్లే ఈ అంశాలపై చర్చించేందుకు భయపడుతోందని దుయ్యబట్టారు. ఆప్ పార్టీ నియంతృత్వంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, ఎప్పటికప్పుడూ విపక్షాలను సభ నుచి తరిమికొడుతుందని ఎద్దేవ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలందరూ ఈ విషయమై రాష్ట్రపతిని సంప్రదిస్తామని తేల్చి చెప్పారు. అలాగే లోక్‌సభ స్పీకర్‌తో కూడా సభను నిరంతరాయంగా వాయిదా వేస్తున్న ఆంశాన్ని కూడా లేవనెత్తుతామని బిధూరి అన్నారు. ఢిల్లీలో ఏడాది పొడవునా కనీసం మూడు శాసనసభ సమావేశాలు జరగాలని వాటి వ్యవధి పది రోజుల కంటే తక్కువ ఉండకూడదనే నిబంధన పెట్టాలని అభ్యర్థిస్తామని చెప్పారు. ప్రస్తుతం కేవలం ఒక్క రోజు సుదీర్ఘ సమావేశాలు మాత్రమే జరుగుతున్నాయని అందులో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే తప్ప ఢిల్లీ ప్రజల సమస్యల గురించి మాట్లాడటం లేదని బిధూరి ఆరోపించారు. -
‘మార్షల్’ మెరుపులు
-
మాస్క్ లేదా అన్నందుకు.. అంగీ, ప్యాంటు విప్పి.. ఆపై
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. అందుకే ప్రభుత్వాలు మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించాలన్న నియమాలను తప్పనిసరిచేసిన విషయం తెలిసిందే. అయితే, కర్ణాటకలో ఒక యువకుడు మాస్క్ వేసుకోమన్నందుకు వింత చేష్టలతో అక్కడి వారిని ఇబ్బందులకు గురిచేశాడు. కాగా, మాస్క్ లేదా అని పాలికె మార్షల్స్ అడగడంతో ఓ యువకుడు అంగీ, ప్యాంటు విప్పి గలాటా చేశాడు. కే.ఆర్.మార్కెట్ వద్ద ఈ ఘటన జరిగింది. టీ ఫ్లాస్క్ పట్టుకొని వ్యాపారం చేసే యువకుడు మాస్క్ వేసుకోలేదు. మాస్క్ లేదా, జరిమానా కట్టు అని మార్షల్స్ గద్దించడంతో అతడు వెంటనే షర్ట్, ప్యాంట్ విప్పివేసి అర్ధనగ్నంగా నిలబడ్డాడు. బిత్తరపోయిన మార్షల్స్ అతన్ని పంపించివేశారు. ఎవ్వరూ మాస్క్‌లు వేసుకోవద్దు, ఏం చేస్తారో చూస్తామని యువకుడు చెప్పడం గమనార్హం. -
రాజా చెప్పిన చంద్రబాబు కథ
-
ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర కథ
సాక్షి, అమరావతి: యువ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తన ప్రసంసంతో అసెంబ్లీలో అందరినీ ఆకట్టుకున్నారు. మార్షల్‌పై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రవర్తించిన తీరుపై చర్య తీసుకోవడాన్ని స్పీకర్‌కు కట్టబెడుతూ తీర్మానం పెట్టిన తర్వాత ఆయన చెప్పిన కథ ఆసక్తికరంగా సాగింది. రాజా చెప్పిన కథ.. ‘ఒక ఘోర రాక్షసుడు పరమశివుడు కోసం తపస్సు చేస్తావుంటాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమయి నీకు ఏ వరం కావాలో కోరుకో అని రాక్షసుడిని అడుగుతాడు. నేను తపస్సు చేస్తున్నాను గానీ ఇంత తొందరగా ప్రత్యక్షమవుతానని అనుకోలేదని శివుడితో రాక్షసుడు అంటాడు. నాకు 5 నిమిషాలు సమయమిస్తే ఏ వరం అడగాలో ఆలోచించకుని చెప్తా అంటాడు. ఐదు నిమిషాలు సమయం ఉంది కదా శివుడు వేచిచూస్తుండగా కొంత మంది దేవతలు వచ్చి రాక్షసుడికి వరాలు ఇవ్వొద్దని మొరపెట్టుకుంటారు. ఈలోపు వరం అడిగేందుకు రాక్షసుడు వస్తాడు. శివుడు వెంటనే వరం ఇవ్వకుండా సముద్రం ఒడ్డుకు వెళ్లి ఇసుక రేణువులన్నింటినీ లెక్కపెట్టిన తర్వాత రమ్మని రాక్షసుడితో చెబుతాడు. ఇసుక రేణువులు లెక్కపెట్టడం అసాధ్యం కాబట్టి వరం ఇవ్వక్కర్లేదన్న ఆలోచనతో శివుడు ఉంటాడు. అయితే రాక్షసుడు ఇసుక రేణువులన్నిలెక్కపెట్టి తొందరగా వచ్చేస్తాడు. ఏం చేయాలా అని ఆలోచించి ఆకాశంలోని చుక్కలన్నింటినీ లెక్కపెట్టుకుని రమ్మని రాక్షసుడికి చెబుతాడు. ఈసారి రాక్షసుడు చుక్కలన్నింటినీ లెక్కపెట్టి వెంటనే తిరిగొస్తాడు. ఏం చేయాలా అని శివుడు ఆలోచిస్తుండగా ఒకతను వచ్చి ఒక ఐడియా ఇస్తాడు. రాక్షసుడు తొందరగా మీ దగ్గరకు రాకుండా ఉండాలంటే చంద్రబాబు చెప్పిన అబద్ధాలను లెక్కపెట్టుకుని రమ్మని చెబితే ఇక ఎప్పటికి తిరిగి రాలేడని చెబుతాడు’ అని చెప్పడంతో అసెంబ్లీలో ఒక్కసారిగా నవ్వులు విరిసాయి. చంద్రబాబుకు పౌరుషం ఉందా? అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట అని, మార్షల్స్ పట్ల ఆయన వ్యహారశైలిని చూసి రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని ఎమ్మెల్యే రాజా అన్నారు. వయసు పైబడటంతో మతిమరుపు వచ్చిందని తాను అన్నమాటలను అనలేదని అంటున్నారని పేర్కొన్నారు. ఆయన రావాల్సిన గేటు నుంచి రాకుండా మరో గేటు నుంచి వచ్చి మార్షల్స్‌పై విరుచుకుపడ్డారని.. గోదావరి పుష్కరాల సమయంలో పబ్లిసిటీ పిచ్చితో ఇలాగే చేసి 28 మంది ప్రాణాలను బలి తీసుకున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు పౌరుషం, సిగ్గు, శరం, మానం, మర్యాద ఉందని రాష్ట్రంలో ఎవరు అనుకోవడం లేదన్నారు. బాబుపై బుచ్చియ్యకే ఎక్కువ కోపం చంద్రబాబుపై బుచ్చియ్య చౌదరికే చంద్రబాబు మీద ఎక్కువ కోపం ఉంటుందని ఎమ్మెల్యే రాజా వెల్లడించారు. అసెంబ్లీలో మాటిమాటికి లేచి మాట్లాడాలని వెనుకనుంచి బుచ్చియ్య చౌదరిని చంద్రబాబు గిల్లుతుందారని అన్నారు. జీవితాంతం తానే ముఖ్యమంత్రిని అన్న భ్రమలో చంద్రబాబు ఉన్నారని, లోకేశ్ కూడా శాశ్వతంగా ముఖ్యమంత్రి కొడుకునన్న భావనతో ఉన్నారని ఎద్దేవా చేశారు. వయసుకు తగ్గట్టు నడుచుకోవాలని కోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. మార్షల్స్‌పై నోరు పారేసుకున్న చంద్రబాబు, టీడీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత వార్తలు.. చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం స్పీకర్‌దే తుది నిర్ణయం : బుగ్గన నీ సంగతి తేలుస్తా.. ప్రతిపక్ష నేత వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలి -
చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
సాక్షి, అమరావతి: మార్షల్స్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని మంత్రి కన్నబాబు డిమాండ్ చేశారు. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది మాట్లాడితే కుదరని.. సభా సంప్రదాయాలు అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు ఎంత దారుణంగా ప్రవర్తించడం సరికాదని తప్పుబట్టారు. సాధారణ ఉద్యోగులపై అనుచిత భాష వాడారని, ఉద్యోగుల పట్ల ఎంత చులకన భావంతో ఉందో దీన్ని బట్టి అర్థమవుతోందని పేర్కొన్నారు. తన కేటాయించిన గేటులోంచి కాకుండా మరో గేటులోంచి ఎందుకు రావాల్సి వచ్చిందని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. మార్షల్ అడ్డుకుంటే ఉదయం 9.15 గంటలకు సభలోకి ఎలా రాగలిగారు అని నిలదీశారు. తండ్రితో పాటు నారా లోక్‌శ్ కూడా మార్షల్స్‌పై నోరు పారేసుకోవడం దారుణమన్నారు. కుమారుడికి అదేనా నేర్పించేది అని కన్నబాబు ప్రశ్నించారు. ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందేనని, దీనిపై స్పీకర్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరాశ, నిస్పృశతో చంద్రబాబు నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఏమాత్రం గౌరవప్రదం కాదన్నారు. ఉద్యోగులను పట్టుకుని ఎంత తప్పుడు మాటలు మాట్లాడతారా? అంటూ నిలదీశారు. చంద్రబాబుపై చర్య తీసుకోవాల్సిందే మార్షల్స్‌ను బాస్టర్డ్ అని దూషించిన ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తప్పనిసరిగా చర్య తీసుకోవాల్సిందేనని ఎమ్మెల్యే జోగి రమేశ్ డిమాండ్ చేశారు. మానసిక రోగి ప్రవర్తించినట్టుగా చంద్రబాబు తీరు ఉందని ధ్వజమెత్తారు. 40 ఏళ్ల అనుభవం, 70 ఏళ్ల వయసున్న చంద్రబాబు.. మార్షల్స్‌ను బాస్టర్డ్ అనడం దారుణమన్నారు. మార్షల్స్ ఏమైనా తీవ్రవాదులా, పాకిస్తాన్లో పుట్టి ఇక్కడికి వచ్చారా? అంటూ ప్రశ్నించారు. అనుక్షణం భద్రత కల్పించే మార్షల్స్‌ను గొంతు పట్టుకుని పీక పిసికేసేలా దురుసుగా ప్రవర్తిస్తారా అంటూ దుయ్యబట్టారు. నిండు సభలో చంద్రబాబు తప్పకుండా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సంబంధిత వార్తలు.. నీ సంగతి తేలుస్తా.. ప్రతిపక్ష నేత వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలి: పేర్ని నాని -
ఈనాడు సంస్థలో చంద్రబాబు ఒక ఉద్యోగి
-
డ్రెస్‌కోడ్‌ని పునఃసమీక్షిస్తాం
న్యూఢిల్లీ: రాజ్యసభలో మార్షల్స్ ధరించే యూనిఫాం తీరును తాజాగా మార్చిన విషయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆదేశించారు. నూతన డ్రెస్‌కోడ్‌పై సైనికాధికారుల నుంచి అభ్యంతరాలు రావడంతో వెంకయ్య పై విధంగా ఆదేశించారు. ఇప్పటివరకు మార్షల్స్ ధరిస్తోన్న భారత సాంప్రదాయ సఫారీ డ్రెస్, తలపాగా స్థానంలో సైనికాధికారులు ధరించే ముదురు నీలం రంగు, ముదురు ఆకుపచ్చరంగు యూనిఫాంలను రాజ్యసభ మార్షల్స్కి కేటాయించారు. అయితే ఇది సైనికాధికారులు ధరించే యూనిఫాంలను పోలి ఉందని అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై రాజకీయవేత్తలు, ఇతర ప్రముఖుల నుంచి అభ్యంతరాలు రావడంతో డ్రెస్‌కోడ్‌లో మార్పులను పునఃసమీక్షించాలని సచివాలయ సిబ్బందిని వెంకయ్య ఆదేశించారు. -
ఢిల్లీలో మహిళల భద్రతకు కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: మహిళల భద్రత పెంపొందించే దిశగా ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. బస్సుల్లో మహిళల భద్రత కోసం మార్షల్స్ సంఖ్యను దాదాపు 10వేలు పెంచుతున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీలో ప్రభుత్వ వాహనాల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పథకంలో భాగంగా కేజ్రీవాల్ ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ‘ఈరోజు నేను మీకు ప్రభుత్వ వాహనాల్లో మహిళల భద్రత బాధ్యతను అప్పగిస్తున్నాను. దీని వల్ల వారు బస్సుల్లో తమ ఇంటిలో ఉన్నట్లు భావించి ప్రయాణం చేస్తారు’అని సోమవారం త్యాగరాజ స్టేడియంలో నూతనంగా నియామకమైన మార్షల్స్నుద్దేశించి మాట్లాడారు. మహిళల పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే సహించకూడదని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఢిల్లీలో 3,400 మంది మార్షల్స్ ఉన్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
మార్షల్స్, ప్లీజ్ డునాట్ టచ్ ది మెంబర్స్
-
కాంగ్రెస్‌కు పట్టిన గతే..టీడీపీకి పడుతుంది
-
మరో చేదు అనుభవం
టీడీపీ ఎమ్మెల్యేలకు మీడియా పాయింట్, స్పీకర్ చాంబర్లోకి నో ఎంట్రీ స్పీకర్ చాంబర్ ముందు ఎమ్మెల్యేల ధర్నా, అరెస్టు స్పీకర్ మౌఖిక ఆదేశాలున్నాయన్న చీఫ్ మార్షల్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం మీడియా పాయింట్ , స్పీకర్ చాంబర్లోకి వెళ్లకుండా మార్షల్స్ అడ్డుకోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన టీడీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ నరసింహన్‌ను కలసి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. పార్టీ ఫిరాయింపుదారులపై చర్యలు, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ బర్తరఫ్‌తో పాటు టీడీపీ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాలని మంగళవారం రోజంతా స్పీకర్ చాంబర్లోనే నిరసన జరిపిన టీడీపీఎమ్మెల్యేలు బుధవారం గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో ఉదయం 11 గంటలకు అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు టీడీఎల్పీ కార్యాలయంలో సమావేశమై కార్యాచరణ గురించి చర్చించారు. అనంతరం ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, వివేకానంద, రాజేందర్‌రెడ్డి మీడియా పాయింట్వద్ద మాట్లాడేందుకు బయలు దేరారు. వీరిని అక్కడే ఉన్న మార్షల్స్ అడ్డుకున్నారు. విషయం తెలిసిన ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డి, సాయన్న, మాగంటి గోపీనాథ్, గాంధీ, మాధవరం కృష్ణారావు అక్కడికి వచ్చి ఎమ్మెల్యేలను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నిం చారు. తమకు స్పీకర్ నుంచి మౌఖిక ఆదేశాలున్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కూడా మీడియా పాయింట్ వద్దకు వెళుతుంటే సభ్యులమైన తమను అడ్డుకునే హక్కు ఎక్కడిదని వారు గొడవకు దిగారు. లిఖితపూర్వక ఉత్తర్వులు తీసుకురమ్మని చీఫ్ మార్షల్‌ను కోరారు. అయినా వినకుండా మార్షల్స్ అడ్డుగా ఉంటే వారిని నెట్టుకొని వెళ్లి మీడియా పాయింట్లో ప్రభుత్వం అనుసరి స్తున్న వైఖరిపై ధ్వజమెత్తారు. అనంతరం శాసనసభ్యుల గౌరవానికి భంగం కలిగిస్తున్నారని చీఫ్ మార్షల్‌పై హక్కుల ఉల్లంఘన కింద స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు అసెంబ్లీకి వెళ్లారు. లాబీల్లోకి వచ్చిన ఎమ్మెల్యేలను స్పీకర్ చాంబర్ ముందు మరోసారి మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించిన శాసనసభ్యులు.. స్పీకర్ వైఖరిని నిరసిస్తూ ధర్నాకు దిగారు. అరగంట తరువాత మార్షల్స్ వారిని బలవంతంగా పోలీస్ వ్యాన్ ఎక్కించారు. తమను గవర్నర్ వద్దకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలు కోరినా పట్టించుకోకుండా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు తరలించి అక్కడే వదిలేశారు. అనంతరం సొంత కార్లలో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలసి ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. సభ్యులు అసెంబ్లీ లాబీల్లో ఆందోళన చేస్తున్న సమయంలో అటువైపు వచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు వీరిని చూసి నవ్వుతూ వెళ్లిపోయారు. స్పీకర్‌సార్ .. ఇదేం పద్ధతి..?: సండ్ర శాసనసభలోని సభ్యులందరి హక్కులను కాపాడాల్సిన సభాపతి ఒకరిద్దరి ఆదేశాల మేరకే నడుచుకుంటున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. గవర్నర్‌ను కలసిన అనంతరం సహచర ఎమ్మెల్యేలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘హరీశ్‌రావు మాట్లాడుతున్న మాటలు రాష్ట్ర ప్రజలందరూ వింటున్నారు. కొత్త సంప్రదాయం నెలకొల్పుతామని కేసీఆర్ చెబుతున్న మాటల అర్ధమిదేనా?’ అని ప్రశ్నించారు. శాసనసభ్యులను మీడియా పాయింట్‌కు రాకుండా, లాబీల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడమేమిటని నిలదీశారు. తమను కలిసేందుకు స్పీకర్ ఇష్టపడడం లేదని, ఇదేం పద్ధతి అని అడిగారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తలసాని దొంగ రాజీనామా చేశారు. దాన్ని ఏం చేయబోతున్నారో కూడా స్పీకర్ చెప్పడం లేదన్నారు.