
సాక్షి, అమరావతి: యువ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తన ప్రసంసంతో అసెంబ్లీలో అందరినీ ఆకట్టుకున్నారు. మార్షల్‌పై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రవర్తించిన తీరుపై చర్య తీసుకోవడాన్ని స్పీకర్‌కు కట్టబెడుతూ తీర్మానం పెట్టిన తర్వాత ఆయన చెప్పిన కథ ఆసక్తికరంగా సాగింది.
రాజా చెప్పిన కథ..
‘ఒక ఘోర రాక్షసుడు పరమశివుడు కోసం తపస్సు చేస్తావుంటాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమయి నీకు ఏ వరం కావాలో కోరుకో అని రాక్షసుడిని అడుగుతాడు. నేను తపస్సు చేస్తున్నాను గానీ ఇంత తొందరగా ప్రత్యక్షమవుతానని అనుకోలేదని శివుడితో రాక్షసుడు అంటాడు. నాకు 5 నిమిషాలు సమయమిస్తే ఏ వరం అడగాలో ఆలోచించకుని చెప్తా అంటాడు. ఐదు నిమిషాలు సమయం ఉంది కదా శివుడు వేచిచూస్తుండగా కొంత మంది దేవతలు వచ్చి రాక్షసుడికి వరాలు ఇవ్వొద్దని మొరపెట్టుకుంటారు. ఈలోపు వరం అడిగేందుకు రాక్షసుడు వస్తాడు. శివుడు వెంటనే వరం ఇవ్వకుండా సముద్రం ఒడ్డుకు వెళ్లి ఇసుక రేణువులన్నింటినీ లెక్కపెట్టిన తర్వాత రమ్మని రాక్షసుడితో చెబుతాడు. ఇసుక రేణువులు లెక్కపెట్టడం అసాధ్యం కాబట్టి వరం ఇవ్వక్కర్లేదన్న ఆలోచనతో శివుడు ఉంటాడు. అయితే రాక్షసుడు ఇసుక రేణువులన్నిలెక్కపెట్టి తొందరగా వచ్చేస్తాడు. ఏం చేయాలా అని ఆలోచించి ఆకాశంలోని చుక్కలన్నింటినీ లెక్కపెట్టుకుని రమ్మని రాక్షసుడికి చెబుతాడు. ఈసారి రాక్షసుడు చుక్కలన్నింటినీ లెక్కపెట్టి వెంటనే తిరిగొస్తాడు. ఏం చేయాలా అని శివుడు ఆలోచిస్తుండగా ఒకతను వచ్చి ఒక ఐడియా ఇస్తాడు. రాక్షసుడు తొందరగా మీ దగ్గరకు రాకుండా ఉండాలంటే చంద్రబాబు చెప్పిన అబద్ధాలను లెక్కపెట్టుకుని రమ్మని చెబితే ఇక ఎప్పటికి తిరిగి రాలేడని చెబుతాడు’ అని చెప్పడంతో అసెంబ్లీలో ఒక్కసారిగా నవ్వులు విరిసాయి.
చంద్రబాబుకు పౌరుషం ఉందా?
అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట అని, మార్షల్స్ పట్ల ఆయన వ్యహారశైలిని చూసి రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని ఎమ్మెల్యే రాజా అన్నారు. వయసు పైబడటంతో మతిమరుపు వచ్చిందని తాను అన్నమాటలను అనలేదని అంటున్నారని పేర్కొన్నారు. ఆయన రావాల్సిన గేటు నుంచి రాకుండా మరో గేటు నుంచి వచ్చి మార్షల్స్‌పై విరుచుకుపడ్డారని.. గోదావరి పుష్కరాల సమయంలో పబ్లిసిటీ పిచ్చితో ఇలాగే చేసి 28 మంది ప్రాణాలను బలి తీసుకున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు పౌరుషం, సిగ్గు, శరం, మానం, మర్యాద ఉందని రాష్ట్రంలో ఎవరు అనుకోవడం లేదన్నారు.
బాబుపై బుచ్చియ్యకే ఎక్కువ కోపం
చంద్రబాబుపై బుచ్చియ్య చౌదరికే చంద్రబాబు మీద ఎక్కువ కోపం ఉంటుందని ఎమ్మెల్యే రాజా వెల్లడించారు. అసెంబ్లీలో మాటిమాటికి లేచి మాట్లాడాలని వెనుకనుంచి బుచ్చియ్య చౌదరిని చంద్రబాబు గిల్లుతుందారని అన్నారు. జీవితాంతం తానే ముఖ్యమంత్రిని అన్న భ్రమలో చంద్రబాబు ఉన్నారని, లోకేశ్ కూడా శాశ్వతంగా ముఖ్యమంత్రి కొడుకునన్న భావనతో ఉన్నారని ఎద్దేవా చేశారు. వయసుకు తగ్గట్టు నడుచుకోవాలని కోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. మార్షల్స్‌పై నోరు పారేసుకున్న చంద్రబాబు, టీడీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు..
చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
స్పీకర్‌దే తుది నిర్ణయం : బుగ్గన
నీ సంగతి తేలుస్తా..
ప్రతిపక్ష నేత వ్యవహరించాల్సిన తీరు ఇదేనా?
Comments
Please login to add a commentAdd a comment