jakkampudi raja
-
ఇసుక దోపిడీ అడ్డుకోవాల్సిన అధికారులే చోద్యం చేస్తున్నారు
-
ఇదేనా విజనరీనని చెప్పుకునే చంద్రబాబు అనుభవం?: జక్కంపూడి రాజా
సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే, చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ పేదలకు ఇంటి కోసం సెంటు స్థలం కూడా కేటాయించిన పాపాన పోలేదని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ ప్రభుత్వ హయాంలో 72 వేల ఎకరాలు సేకరించి, వాటిలో 17 వేల కాలనీల్లో పూర్తి మౌలిక వసతులతో ఇళ్ల నిర్మాణం చేపట్టామని, అందు కోసం ఏకంగా రూ.1.27 లక్షల కోట్లు ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు. తమ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి సంపద సృష్టిస్తే, దాన్ని చంద్రబాబు తన ఘనతగా చెప్పుకోవడం విడ్డూరమని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన జక్కంపూడి రాజా ఆక్షేపించారు.చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు: నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందన్న ముని శాపం ఉండటం వల్లనేమో చంద్రబాబు ఏనాడూ నిజాలు చెప్పడు. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం శ్రీలంక అయిపోందని ఊరూరా తిరిగి తప్పుడు ప్రచారం చేశాడు. రాష్ట్రం అప్పులపై కూటమి నాయకులంతా కలిసిమెలిసి ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. తాను అధికారంలోకి వస్తే 40 ఏళ్ల అనుభవంతో సంపద సృష్టించి రాష్ట్రాన్ని గాడిలో పెడతానని చంద్రబాబు నమ్మబలికాడు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పుకుని.. తీరా అధికారంలోకి వచ్చాక బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారెంటీ అనేలా పాలన సాగిస్తున్నాడు. అసలే నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి జనం అల్లాడుతుంటే, కొత్తగా రకరకాల పన్నుల రూపంలో ప్రజలకు నరకం చూపిస్తున్నారు. ఇప్పటికే కరెంట్ బిల్లుల రూపంలో ప్రజలపై రూ.19 వేల కోట్ల భారం మోపాడు.నాడు అప్పులపై దుష్ప్రచారం:ప్రతిపక్షంలో ఉండగా రాష్ట్రం అప్పులు రూ. 14 లక్షల కోట్లని ప్రచారం చేసి, తీరా అధికారంలోకి వచ్చాక అప్పులు రూ.4.6 లక్షల కోట్లని కూటమి ప్రభుత్వమే ప్రకటించింది. రాష్ట్రం అప్పులు రూ.14 లక్షల కోట్లని చెబుతూనే చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలిచ్చారు. ఈ రోజు వాస్తవ అప్పులు రూ. 4.6 లక్షల కోట్లే అని తెలిసినా హామీలు అమలు చేయలేక చేతులెత్తేయడం ఆయన అసమర్థతకు నిదర్శనం. గత వైఎస్ జగన్ పాలనలో తీవ్రమైన కరోనా సంక్షోభం ఉన్నా సంక్షేమ పథకాల అమల్లో సాకులు చెప్పి తప్పించుకోలేదు. కానీ చంద్రబాబు మాత్రం వాగ్ధానాలను అమలు చేయలేక చేతులెత్తేశారు.ఇదేనా విజనరీనని చెప్పుకునే చంద్రబాబు అనుభవం?. తాజాగా ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువలు 50 శాతం పెంచబోతున్నట్టు ప్రకటించారు. ఆదాయార్జనే ధ్యేయంగా ప్రజల నడ్డి విరచడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైంది. సంపద సృష్టిస్తానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఎంత వీలైతే అంత దోచుకోవడానికి వ్యూహరచనలు చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పిన విజనరీ ఏడు నెలల్లోనే ఒక్క పథకం కూడా అమలు చేయకుండానే చేతులెత్తేశాడు. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల చంద్రబాబు దావోస్ వెళ్లినా పారిశ్రామికవేత్తులు పెట్టుబడులకు ముందుకు రావడం లేదు. అందుకే ఒక్క రూపాయి పెట్టుబడులు తీసుకురాలేకపోయారు.సెంటు స్థలం కూడా ఇవ్వని బాబు:సుదీర్ఘకాలం సీఎంగా చేసినా చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటీ లేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ పేదవారికి ఇంటి కోసం సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. ఆయన మాత్రం హైదరాబాద్‌లో ఇంద్ర భవనం నిర్మించుకుని విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నాడు. దివంగత వైఎస్సార్ హయాంలో పేదవారికి ఇళ్ల పంపిణీ జరిగింది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ ఏకంగా 31 లక్షల మంది నిరుపేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేయడంతోపాటు ప్రభుత్వం తరఫున ఇంటి నిర్మాణ బాధ్యతలను కూడా తీసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వ భూములతోపాటు రైతుల నుంచి భూములు సేకరించడం జరిగింది. చంద్రబాబు సీఎం అయ్యాక సొమ్మొకడిది సోకొకడిది అన్నట్టు మా పథకానికి పేర్లు మార్చి తానే చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నాడు.ఇంటి పట్టాల కోసం 71,811 ఎకరాలు సేకరణరూ.11,343 వేల కోట్లు వెచ్చించి 25 వేల ఎకరాలు కొనుగోలు చేయడం జరిగింది. ప్రభుత్వ భూమిని కూడా కలుపుకుంటే ఇళ్ల పట్టాల కోసం ప్రభుత్వం 71,811 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. దాని విలువ రూ. 31,832 కోట్లు.. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం చూస్తే 71,811 ఎకరాల భూమి విలువ కనీసం రూ.75 వేల కోట్లకుపైనే ఉంటుంది. దీంతో పాటు ఇళ్ల స్థలాలకు మౌలిక వసతుల కల్పనకు రూ. 32,909 కోట్లు వెచ్చించడం జరిగింది.ఇళ్ల పట్టాలు పొందిన వారిలో 22 లక్షల మందికి రూ. 1.80 లక్షల చొప్పున హౌసింగ్ శాంక్షన్ ఇచ్చాం. దీంతోపాటు అదనంగా డబ్బులు అవసరం అనుకుంటే పూర్తిగా సున్నా వడ్డీకే బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాం. ఇందుకోసం రూ. 57,375 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మొత్తంగా రూ. 1.27 లక్షల కోట్లు పేదల ఇళ్ల నిర్మాణం కోసం గత జగన్ ప్రభుత్వ ఖర్చు చేయడం జరిగింది. వైఎస్సార్సీపీ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలతో ఊర్లకు ఊర్లే రూపుదిద్దుకున్నాయి. దాదాపు 17వేలకుపైగా కాలనీలు ఏర్పడ్డాయి. ఆయా కాలనీల్లో అప్రోచ్ రోడ్లు, ఇంటర్నల్ గ్రావెల్ రోడ్లు, సైడ్ డ్రైన్లు, వాటర్ ట్యాంకుల నిర్మాణం, కరెంట్ పోల్స్ వంటి మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఉచితంగా ఎలక్ట్రిక్ మీటర్లు కూడా బిగించాం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సబ్ స్టేషన్లతో పాటు అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చేశాం.ప్రైవేట్ లేఅవుట్లకు దీటుగా అందంగా తీర్చిదిద్దాం. ఇంటి పట్టాను కూడా మహిళల పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసి వారి గౌరవాన్ని మరింత పెంచాం. పేదలకు మంచి చేయాలని ఇంత గొప్పగా ఆలోచిస్తే చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకోవాలని చూశారు. అమరావతి రాజధానిలో పట్టాలు పంపిణీ చేస్తే సోషల్ ఇంబ్యాలెన్స్ వస్తుందని కోర్టుకెళ్లిన దిక్కుమాలిన ఆలోచన చేసిన ఘనుడు చంద్రబాబు అని జక్కంపూడి రాజా గుర్తు చేశారు. -
కూటమి సర్కార్ పై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
-
‘సంక్రాంతికి వెరైటీ దోపిడీ.. కూటమి సూపర్ ఫైవ్ ఇవేనా?’
సాక్షి, తూర్పుగోదావరి: కూటమి ప్రభుత్వం సంక్రాంతికి కొత్త నిర్వచనం ఇచ్చిందని సెటైరికల్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా(Jakkampudi Raja). ఏపీలో నారా వారి నిర్వహణలో సంక్రాంతి సంబరాలు పేరిట రాష్ట్రంలో దోపిడీ జరిగిందన్నారు. పేకాట, గుండాట, కోడి పందాలు, రికార్డింగ్ డ్యాన్స్, మద్యం అమ్మకాలు.. ఇదే కూటమి మేనిఫెస్టో అంటూ ఎద్దేవా చేశారు.రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఏం జరుగుతుందో చంద్రబాబు(Chandrababu), పవన్(Pawan Kalyan) ఒక్కసారి మనస్సాక్షిగా ఆలోచించుకోవాలి. సంక్రాంతి(sankranthi) సంబరాలు అంటే గంగిరెద్దులు ముగ్గులు, అక్కడక్కడ కోడిపందాలు మాత్రమే గతంలో ఉండేవి. సంక్రాంతికి కొత్త నిర్వచనం ఇచ్చారు కూటమి నేతలు.. నారా వారి నిర్వహణలో సంక్రాంతి సంబరాలు పేరిట రాష్ట్రంలో దోపిడీ జరిగింది. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా జూదాలు.. గుండాటలు జరిగాయి.ఒక్కో మహిళకు నెలకు 15వేలు చొప్పున ఆర్థిక సాయం అన్నారు.. సూపర్ సిక్స్ మేనిఫెస్టో దేవుడి పేరిట అటకెక్కింది. పేకాట, గుండాట.. కోడిపందాలు.. రికార్డింగ్ డ్యాన్స్.. మద్యం అమ్మకాలు.. ఇవే కూటమి మేనిఫెస్టో. ఇంటర్నేషనల్ టోర్నమెంట్ చూసినట్టు కోడి పందాలను, ప్రీమియర్ లీగ్‌లా నిర్వహించి పార్కింగ్ పేరిట సామాన్యుడి దగ్గర విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేశారు. రాజానగరం నియోజకవర్గంలో భూపాలపట్నంలో డ్రగ్స్.. రేవ్ పార్టీలు.. రికార్డింగ్ డ్యాన్స్ సంస్కృతి తీసుకొచ్చారు. అనకాపల్లిలో గంజాయి దొరికితే.. అందులో రాజానగరం నియోజకవర్గం కాపవరం గ్రామానికి చెందిన జనసేన నేతలు మూలాలు ఉన్నాయి.గంగాధర్ అనే వ్యక్తి గుండాటలో డబ్బులు పోయాయని ఆత్మహత్య చేసుకున్నాడు. బహిరంగంగా పోలీసులను కూడా వేదికలపై నుండి బయటకి గెంటేస్తున్నారు. ప్రభుత్వ ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గాల్సి వచ్చింది. కొన్నిచోట్ల సంక్రాంతికి అసలు పోలీసులు ఉన్నారా లేరా అనే ప్రశ్న తలెత్తింది. రాజమండ్రి పేపర్ మిల్‌పై వేలమంది కార్మికులు ఆధారపడి ఉన్నారు. కార్మికుల పొట్టకొట్టే ప్రయత్నం ప్రవీణ్ చౌదరి అనే వ్యక్తి చేస్తున్నాడు. ప్రవీణ్ చౌదరికి తెలుగుదేశంలో మూలాలు ఉన్నాయి.. బుచ్చయ్య చౌదరి అడుగుజాడల్లో నడుస్తాడు’ అంటూ కామెంట్స్ చేశారు. -
చరిత్ర హీనులుగా మిగిలిపోతారు.. కూటమి పాలనపై జక్కంపూడి రాజా ఫైర్
-
యువకుడిని చితకబాదిన SIపై జక్కంపూడి రాజా పిర్యాదు
-
ప్రజల్లో వ్యతిరేకత వల్లే ఈ దౌర్జన్యాలు
రాజమహేంద్రవరం సిటీ: సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా వ్యవహరించిందని తూర్పు గోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. రాజమహేంద్రవరంలోని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నివాసంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. గడిచిన ఆర్నెలల్లో ప్రభుత్వం ఏమీచేయకపోవడంవల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, అందుకే ఏకగ్రీవం పేరుతో విపక్ష పార్టీలను నామినేషన్లు వేయకుండా చేశారని చెల్లుబోయిన ఆరోపించారు. విపక్ష పార్టీలకు చెందిన వారికి నో డ్యూస్ సరి్టఫికెట్లు ఇవ్వకుండా చేయడానికి వీఆర్వోలను ఎమ్మార్వో ఆఫీసుల్లో ఉంచేయడం, కొన్నచోట్ల బంధించడం, వారి దగ్గరకు వెళ్లకుండా పోలీసులను ప్రయోగించి అడ్డగించడం ద్వారా నామినేషన్లు వేయకుండా చేశారన్నారు. ఇక విజయనగరం జిల్లా ఎస్.కోటలో అయితే కూటమిలో భాగస్వామి అయిన బీజేపీకి చెందిన అభ్యరి్థనే నామినేషన్ వేయకుండా చేసి అధికార పార్టీకే కొమ్ము కాశారన్నారు. ఏమాత్రం పారదర్శకత లేకుండా కూటమి ప్రభుత్వం ఏకపక్ష ధోరణిలో వ్యవహరించడం దారుణమని చెల్లుబోయిన చెప్పారు. రైతులు బాగా అసంతృప్తితో ఉన్నారు : జక్కంపూడి వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఒకటి ఎన్నికల తర్వాత మరొకటి చెప్పడం చంద్రబాబుకి మొదటినుంచీ అలవాటేనన్నారు. సూపర్ సిక్స్ అని చెప్పి, ఈ ఆర్నెలల్లో ఒక్కటి కూడా అమలు చేయకపోవడంతో ప్రజల్లో కూటమి ప్రభుత్వంపట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు.ముఖ్యంగా రైతులు బాగా అసంతృప్తితో ఉన్నారని.. అందుకే సాగునీటి సంఘాల ఎన్నికలను అరాచక పద్ధతిలో నిర్వహిస్తున్నారని జక్కంపూడి విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులున్నా సరే, రైతులకు ఎప్పటికప్పుడు రూ.13,500ల పెట్టుబడి సాయం అందించామని.. అయితే, కూటమి ప్రభుత్వం ఇప్పటివరకూ ఆ ఊసే ఎత్తడంలేదని ఎద్దేవా చేశారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో ప్రజలందరూ ప్రభుత్వ అరాచకాన్ని గమనిస్తున్నారని.. పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు సమయం వచ్చినపుడు బుద్ధి చెబుతారన్నారు. -
హత్యాచారం దోషుల్ని కఠినంగా శిక్షించాలి
కడియం: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక పంచాయతీలోని బుర్రిలంకలో మహిళపై అత్యాచారం చేసి, హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఎస్పీ డి.నరసింహకిశోర్‌ని కోరారు. వారు శనివారం రాజమహేంద్రవరంలో ఎస్పీని కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారు పార్టీ నాయకులతో కలిసి బుర్రిలంకలో బాధితురాలు రౌతు కస్తూరి కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ తరఫున రూ.1.1 లక్షల ఆర్థికసాయం అందజేశారు. న్యాయం జరిగేంతవరకు తాము అండగా ఉంటామని బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ తరఫున తాము వస్తున్నామని.. కూటమి ఎమ్మెల్యే హడావుడిగా వచ్చి బాధితుల చేతిలో రూ.పదివేలు పెట్టి వెళ్లడం చూస్తుంటే ఈ ఘటన పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో తెలుస్తోందని చెప్పారు. పత్రికలు తిరగేస్తే ఓ హత్య, ఓ మానభంగం కచ్చితంగా కన్పిస్తున్నాయన్నారు. ఇలాంటి దారుణాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ వాళ్ల కాళ్లు విరగ్గొడతామని, 11 సీట్లు వచ్చినా నోరు లేస్తోందా అంటూ బెదిరిస్తున్నారని చెప్పారు. దిశ యాప్ తీసేయడం ద్వారా నేరాలు చేసేవారికి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చినట్లయిందన్నారు. ఇంత పాశవికంగా మహిళను హత్య చేస్తే జనసేన, టీడీపీ నాయకులు బైటకు పొక్కకుండా చేయాలని ప్రయత్నించడం శోచనీయమని చెప్పారు. దోషులను కఠినంగా శిక్షించకపోతే తమపార్టీ ఉద్యమిస్తుందని వారు తెలిపారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించినవారిలో వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రుడా మాజీ చైర్ç³ర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నక్కా రాజబాబు, గిరజాల బాబు తదితరులున్నారు. -
కూటమికి జక్కంపూడి రాజా స్ట్రాంగ్ వార్నింగ్
-
ప్రజల్లో తిరుగుబాబు మొదలైంది: జక్కంపూడి రాజా
సాక్షి, తూర్పుగోదావరి: తూర్పుగోదవరి జిల్లాలో బిక్కవోలు మండలం ఇల్లపల్లిలో వైఎస్సార్సీపీ సర్పంచ్ లొల్ల భద్రంను గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ కి ప్రయత్నించారు. కారులో తీసుకెళ్తుండగా కేకలు వేయగా గ్రామస్తులు.. కిడ్నాపర్లను పట్టుకుని దేహశుద్ధి చేయడంతో సర్పంచ్ క్షేమంగా బయట పడ్డారు. దండగుల పెనుగులాటలో సర్పంచ్‌కి గాయాలు అయ్యాయి. దీంతో ఆయన్ను అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గురువారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి వైఎస్ఆర్సిపి నేత గూడూరు శ్రీనివాస్ ఇల్లపల్లి సర్పంచ్‌ను పరామర్శించారు. అనంతరం జక్కంపూడి రాజా మీడియాతో మాట్లడారు. ‘‘ కూటమి ప్రభుత్వం దాడులు పెచ్చు మీరుతున్నాయి. ఇల్లపల్లిలో ప్రజలే తిరగబడి సర్పంచును కాపాడుకున్నారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. అనపర్తిలో మరొక్క హింస పక్క సంఘటన చోటుచేసుకున్నా ఊరుకునేది లేదు. వేలాదిగా ప్రజలతో కలిసి బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇంటిని ముట్టడిస్తాం. అధికారం శాశ్వతం కాదు’’ అని అన్నారు. -
టీడీపీ నేతలపై జక్కంపూడి రాజా ఫైర్
-
దాడులు చేస్తే చేతులు కట్టుకుని కూర్చోం జక్కంపూడి రాజా వార్నింగ్
-
తప్పు ఎవరిది గెలిచినా ఓడినా జగన్ రియల్ హీరో
-
ఓటమిపై జక్కంపూడి రాజా రియాక్షన్
-
‘కాపుల కష్టాలను పట్టించుకోనివాళ్లు హీరోలు అయిపోయారు: జక్కంపూడి రాజా
తూర్పుగోదావరి: కన్నతల్లికి బాగోలేదన్నా పట్టించుకోకుండా, నియోజకవర్గం గురించే ఆలోచించానని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘కోరుకొండ సీతానగరం మండలాల్లో రెండు పంటలకు నీరు ఇచ్చాం. వ్యవసాయం చక్కగా చేసుకునేందుకు అనువైన పరిస్థితి ప్రభుత్వం కల్పించింది. విత్తనాలు, ఎరువులు, ఇన్పుట్ సబ్సిడీ, పురుగుమందులు, గోడౌన్లు, యంత్ర పరికరాలు అన్నీ అందించాం. రూ. 25 కోట్లతో తొర్రిగడ్డ పంపిణీ స్కీం మోడరనైజ్ చేశాం. ప్రతి చిన్న ఫిర్యాదుకు స్పందించి జవాబుదారీ తనంతో పని చేశాం. నియోజకవర్గంలో లక్ష కుటుంబాలు ఉంటే 80 వేల కుటుంబాలకు వద్దకు నేనే వెళ్ళాను. నా కుటుంబ సభ్యులంతా ఎన్నో రకాల సహాయ కార్యక్రమాలు నియోజకవర్గంలో నిర్వహించాం. ఇవాల్టి పరిస్థితి చూస్తే ఇంతవరకు భ్రమలో బతికామా అన్నట్టు అనిపిస్తుంది.... మీకు మంచి చేసి ఉంటే నాకు ఓటు వేయమని అడిగిన దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే. దేశంలో ఏ ముఖ్యమంత్రికైనా ఈ దమ్ముందా?. గెలిచినా ఓడినా రియల్ హీరో జగన్ మాత్రమే. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం. గత ప్రభుత్వంలో పది లక్షలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగని రాజానగరం మండల కేంద్రంలో రూ. 20 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. .. ఏదేమైనా ప్రజల కోసం పనిచేస్తాం. రాజశేఖర్‌రెడ్డి కుటుంబంతోనే కలిసి నడుస్తాం. కాపు రిజర్వేషన్ కోసం శ్రమించిన ముద్రగడ లాంటి నాయకుడు అనేక మాటలు పడ్డారు. కాపుల కష్టాలను ఏనాడు పట్టించుకోని నాయకులు హీరోలు అయిపోయారు’’ అని అన్నారు. -
పవన్ పై ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కామెంట్స్
-
YSRCP సిద్ధం సభకు శరవేగంగా ఏర్పాట్లు
-
చంద్రబాబు పై జక్కంపూడి రాజా ఫైర్
-
చంద్రబాబుకు మతిభ్రమించింది
సాక్షి, రాజమహేంద్రవరం: చంద్రబాబుకు మతిభ్రమించడంతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే రాజమహేంద్రవరం రాగానే జైలు జీవితం గుర్తుకు వచ్చినట్లుందని ఎద్దేవా చేశారు. ఇతరులపై బురద జల్లడం మాని ముందు ఆయన పార్టీలోని అంతర్గత సమస్యలను చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. ఉన్నవి, లేనివి కల్పించి, వైఎస్సార్సీపీ, నేతలపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకువచ్చే ప్రయోగం చేస్తున్నారని, చంద్రబాబుకు ఏ విషయంలోనూ చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. బాబు చిప్ అరిగిపోయింది: ఎంపీ మార్గాని చంద్రబాబుకు చిప్ అరిగిపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ విమర్శించారు. సోమవారం చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాజమహేంద్రవరంలో జరుగుతున్న అభివృద్ధి గురించి చంద్రబాబుకు తెలుసా అని ప్రశ్నించారు. ఆయన హయాంలో ఏనాడైనా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న బాబు జైలు కిటికీల్లోనుంచైనా అభివృద్ధి చూడాలి కదా... అని వ్యంగ్యాస్త్రం సంధించారు. లోకేశ్‌ను రాజమహేంద్రవరంలో పోటీకి దింపితే ప్రజలు చిత్తుగా ఓడిస్తారని చెప్పారు. తాను చేసిన అభివృద్ధిలో బాబు తన హయాంలో సగం చేసినట్లు నిరూపించినా తాను రాజకీయాల్లోంచి తప్పుకుంటానని మార్గాని సవాల్ విసిరారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. -
పప్పు తుప్పు రేగ్గొట్టిన జక్కంపూడి
-
జక్కంపూడి గణేష్ వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్ (ఫోటోలు)
-
వైభవంగా 'జక్కంపూడి వారి పెళ్లి సందడి..' ముఖ్యమంత్రి జగన్‌కు ఘన స్వాగతం!
సాక్షి, తూర్పుగోదావరి: స్థానిక శాసనసభ్యుడు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా సోదరుడు, వైఎస్సార్ సీపీ ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగం రీజినల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ వివాహ రిసెప్షన్ దివాన్‌చెరువులోని డీబీవీ రాజు లేఅవుట్లో అంగరంగ వైభవంగా జరిగింది. దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావుకు ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అభిమానమంతా ఉవ్వెత్తున ఎగసివచ్చిందా అన్నట్టుగా అభిమాన గణం భారీఎత్తున తరలివచ్చి, ఆయన ద్వితీయ కుమారుడైన గణేష్ దంపతులను ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తాడేపల్లి నుంచి నేరుగా దివాన్‌చెరువుకు హెలికాప్టర్లో వచ్చి, నూతన వధూవరులైన జక్కంపూడి గణేష్, సుకీర్తిలను ఆశీర్వదించి, కొద్దిసేపు వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. ఈ సమయంలో కొంతమంది సీఎంతో సెల్ఫీలకు రిక్వెస్టు చేయడంతో అందుకు ఆయన చిరునవ్వుతో వారికి అవకాశం ఇచ్చారు. కుటుంబ సభ్యులే కాకుండా బంధువర్గంలోని వారు, అభిమానులు సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో.. ఆహ్వానితులలో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలుగకుండా సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో సినిమా సెట్టింగ్‌లను తలపించేలా చేసిన ఏర్పాట్లు అందరినీ అబ్బురపరిచాయి. వివాహ రిసెప్షన్ వేదికపై యశస్వి కొండేపూడి మ్యూజిక్ బ్యాండ్ లైవ్‌తోపాటు సింగర్ శిల్ప, యాంకర్ దీప్తి నల్లమోతు, మిమిక్రీ రాజు, గోవింద్ డ్యాన్స్ టీమ్ లైవ్ ప్రోగ్రామ్స్ అలరించాయి. పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన జెయింట్ వీల్, రంగుల రాట్నం, ‘పెట్టా తులాల్’ కేరళ నృత్యం, ప్రకృతి ఒడిలోకి వచ్చామా అనే రీతిలో ఆసక్తి ఉన్నవారు ఫొటో షూట్లు తీసుకునేలా వేసిన సెట్టింగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక భోజన సదుపాయాల గురించి ప్రస్తావిస్తే .. ‘ఆహా .. ఏమి రుచి, తినరా మైమరిచి..’ అనేవిధంగా 24 రకాల వంటకాలతో ఆహార ప్రియుల మదిని దోచారని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి జగన్‌కు ఘన స్వాగతం.. జక్కంపూడి గణేష్ వివాహ రిసెప్షన్‌కి గురువారం వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం లభించింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో తాడేపల్లి నుంచి నేరుగా హెలికాప్టర్లో దివాన్‌చెరువులోని డీబీవీ రాజు లేఅవుట్లోని హెలిపాడ్‌పై దిగిన ఆయనకు ఆహ్వాన కర్త, స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆయన తల్లి జక్కంపూడి విజయలక్ష్మితో పాటు మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, అంబటి రాంబాబు, తానేటి వనిత, ఆర్కే రోజా, దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్, పినిపే విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, రాజంపేట ఎంపీ పీవీ మిధున్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆహ్వానం పలికారు. కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం ఎంపీలు వంగా గీత, చింతా అనురాధ, మార్గాని భరత్‌రామ్, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, అనంతబాబు, వంక రవీంద్రనాఽథ్, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, పెండెం దొరబాబు, జ్యోతుల చంటిబాబు, తలారి వెంకట్రావు, కొండేటి చిట్టిబాబు, జె.శ్రీనివాస్‌నాయుడు, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రుడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్సార్ సీపీ పెద్దాపురం కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు, రాజమహేంద్రవరం సిటీ కో ఆర్డినేటర్ గూడూరి శ్రీనివాస్, రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్, జిల్లా కలెక్టర్ కె.మాధవీలత, పలువురు ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు. సినీ ప్రముఖులు రామ్‌గోపాల్‌వర్మ, సుమన్, హీరో విశ్వక్‌సేన్‌లు గణేష్, సుకీర్తిలకు ఆశీస్సులు అందజేశారు. -
ఇన్నాళ్లూ ప్యాకేజీ బంధం.. ఇప్పుడు పొత్తు బంధమా..?
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: పొలిటికల్ కమెడీయన్ పవన్ కళ్యాణ్.. చంద్రబాబు దత్తపుత్రుడిగా పొత్తు ప్రకటన హాస్యాస్పదం అని వైఎస్సాఆర్సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్యాకేజీ పెంచుకునేందుకే జైల్లో బాబును కలిశాడన్నది నిజం.. బాబు అవినీతి వాటా పార్టనర్‌గానే ప్రభుత్వంపై రంకెలేస్తున్నాడు’’ అని మండిపడ్డారు. జక్కంపూడి రాజా ఇంకా ఏమన్నారంటే.. బ్లాక్‌మెయిలింగ్‌కు సరైన టైమ్ అని.. పవన్‌కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసిన తర్వాత మాట్లాడిన మాటల్ని చూస్తే.. ఒక విషయం స్పష్టమైంది. తన ప్యాకేజీ పెంపునకు చంద్రబాబును ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ చేయడానికి ఇంతకన్నా సరైన సమయం దొరకదనకున్నాడు. అందుకే, రేపటి ఎన్నికల్లో నీకూ-నాకూ లాభం జరగాలంటే, ఇద్దరం కలిసి పోటీచేసే ప్రతిపాదనతో తన ప్యాకేజీ విలువను పెంచుకున్నాడు. పొత్తు పలుకులతో కామెడీ.. ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందంటూ పవన్‌కళ్యాణ్ అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్ ఈ రోజు ఇలా కొత్తగా చెబుతున్నాడేంటని అందరూ నవ్వు కుంటున్నారు. ఆయన సొంత పుత్రుడు లోకేశ్ మీడియా ముందుకొచ్చి చంద్రబాబుకు నేను మద్ధతు పలుకుతున్నాను.. నా ఓటు తెలుగుదేశం పార్టీకే అని.. అంటే ఎంత కామెడీగా ఉంటుందో.. ఇప్పుడు దత్తపుత్రుడి మాటలూ అంతే జోక్‌గా ఉన్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రశ్నిస్తానన్న ప్యాకేజీ స్టార్‌ను ఆనాడే నమ్మలేదు.. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం చూస్తే.. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రత్యక్షంగా సపోర్టు చేసి ఆయనకు మేలు చేయడానికే ఉన్నానంటూ జనసేన పార్టీ పెట్టాడు. ఏ ఒక్కర్నీ జనసేన తరఫున ఎన్నికల్లో పోటీకి దించకుండా పూర్తిగా తాను, తన కేడర్ బాబు కోసం పనిచేసి అధికారం లోకి తెచ్చారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు తాను ప్రకటించిన ఎన్నికల వాగ్దానాల్లో ఏ ఒక్కదాన్నీ అమలు చేయకుండా.. ఏకంగా టీడీపీ వెబ్సైట్ నుంచే మానిఫెస్టోను తొలగించారు. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌తో పాటు వారి కేబినెట్లో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, సాధారణ పార్టీ కార్యకర్త వరకు ప్రభుత్వ ఖజానా సొమ్మును దోచుకుని పంచుకుని దాచుకున్న విషయం అందరం గమనించాం. అప్పట్లో బాబు అవినీతిని ప్రశ్నిస్తానన్న పవన్‌కళ్యాణ్ పూర్తి నిద్రమత్తులో జోగాడు. ఆ తర్వాత 2019 ఎన్నికలొచ్చేసరికి ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని.. ఆ వ్యతిరేక ఓటు చీల్చకూడదనే వ్యూహం పన్నాడు. జనసేన అనేది టీడీపీకి వ్యతిరేకమన్నట్లు ఒక సూత్రీకరణతో ప్రజల్ని నమ్మించాలని చూశాడు. కానీ, ప్రజలు మాత్రం పవన్‌కళ్యాణ్ నిజస్వరూపాన్ని అప్పటికే గమనించి అర్ధం చేసుకోవడంతో ఆయన మాటల్ని ఎవరూ నమ్మలేదు. టీడీపీ, జనసేనను చిత్తుచిత్తుగా ఓడించాయి. వైఎస్ఆర్సీపీకి అనూహ్యమైన భారీ మెజార్టీ కల్పించి రాష్ట్రవ్యాప్తంగా 151 స్థానాల్లో విజయాన్ని అందించారు. దొంగలా బాబు జైలుకెళ్తే.. నీకెందుకు కడుపుమంట..? మరలా ఇప్పుడు 2024 ఎన్నికల వ్యూహంలో పవన్‌కళ్యాణ్ నోటివెంట జనసేన, టీడీపీ పొత్తు అనే మాట వినిపిస్తుంది. ఈ సందర్భంగా ఆయన్ను ఆత్మపరిశీలన చేసుకోవాలని చెబుతున్నాను. ఇన్నాళ్లూ ప్రజలు నీ సినిమాలు చూసి హీరోగా పవర్‌స్టార్ అని పిలుచుకున్నారు. ఇప్పుడేమో రాజకీయాల్లో నువ్వొక ప్యాకేజీ-పొత్తుస్టార్ అంటూ పొలిటికల్ కమెడియన్‌గా చూస్తున్నారు. అసలు చంద్రబాబు మీద నీకంత ప్రేమేంటి..? ఆయనకూ నీకూ ఉన్న లాలూచీ ఏంటి..? అవినీతి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని దోచుకుని ఆధారాలతో సహా దొరికిన ఒక దొంగను నువ్వెలా సమర్ధిస్తావు..? ఆయన ఎమన్నా దేశం కోసం పోరాడి జైలుకు వెళ్లాడా?అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రెడ్‌హేండెడ్‌గా దొరికిన ఒక అవినీతిపరుడ్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పడేస్తే ప్రభుత్వంపై నీకంత కడుపుమంటేంటి.? ఎందుకు ప్రభుత్వం మీద పడి అంత ఊగిపోతున్నావని అడుగుతున్నాను. ఏదో దేశభక్తుడ్ని జైల్లో పెడితే.. ఆయనకు మద్ధతుపలికేందుకు వచ్చినట్టు నువ్వు బిల్డప్ ఇవ్వడం అవసరమా..? చంద్రబాబు కుంభకోణాలకు బాధ్యుడు కనుకే జైలుకొచ్చాడని అర్ధం చేసుకోకుండా.. నువ్వెందుకు దిగజారి మాట్లాడుతున్నావని ప్రశ్నిస్తున్నాను. ఇందుకు సమాధానం చెప్పాలి. కాపులకు ద్రోహం తలపెట్టే కుట్ర: పవన్‌కళ్యాణ్ రాజకీయాల్లోకొచ్చి చంద్రబాబుకు దఫదఫాలుగా సపోర్టు చేయడంలో యువతకు మేలు చేసే లక్ష్యం కనిపించడంలేదు. సమాజానికి మంచి చేసే సిద్ధాంతం కూడా ఆయన పార్టీ జనసేనలో లేదు. ఇక, కాపుల్ని పూర్తిగా ద్రోహం చేసేందుకే, బాబు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టేందుకే ఆయన పనిచేస్తున్నాడనే కుట్ర కనిపిస్తుంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఉమ్మడి పొత్తులో రాష్ట్రమొత్తం పర్యటించారు. కాపుల్ని బీసీల్లో చేరుస్తామని, ఏడాదికి రూ.5 కోట్లు చొప్పున కాపులకు సంక్షేమాన్ని అందిస్తామని చంద్రబాబు హామీనిచ్చాడు. ఆ హామీని నిలబెట్టుకోలేదని ప్రశ్నించిన పాపానికి ఆనాడు ముద్రగడ పద్మనాభాన్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని బూతులు తిడుతూ బూటు కాళ్లతో తన్నుతూ శారీరకంగా, మానసికంగా వేధించి చిత్రహింసలకు గురిచేసి రోడ్డుమీద నిలబెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు కాదా..? అని ప్రశ్నిస్తున్నాను. మరి, ఆ సమయంలో చంద్రబాబును నువ్వెందుకు నిలదీయలేదు..? ఇవన్నీ పక్కనబెట్టి మరలా ఆయనతోనే కలిసి ఎన్నికల్లో పోటీచేయాలనే ఆలోచన ఎలా కలిగిందని ప్రతీ ఒక్క కాపు సోదరుడు నిన్ను నిలదీసే పరిస్థితి ఉంది. జనసేన నాయకులు, కార్యకర్తల్లోనూ ఈరోజు నీ మాటలతో కళ్లుతెరుచుకున్నాయి. నీలాంటి దుర్మార్గమైన వ్యక్తిని ఇన్నాళ్లూ మా నాయకుడిగా భావించామా..? జనసేన జెండాను ఎందుకు మోశామని వాళ్లంతా బాధపడుతున్నారు. పార్టనర్‌గా పవన్‌కళ్యాణ్ ఆందోళనా..? 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పార్టనర్‌గా పవన్‌కళ్యాణ్ ఉన్నాడు. ఇప్పుడేమో అప్పట్లో జరిగిన కుంభకోణాలకు సంబంధించే చంద్రబాబు జైలుపాలయ్యాడు. మరి, ఆయన దోచుకున్న అవినీతి సొమ్ములో పవన్‌కళ్యాణ్‌కు కూడా వాటాలున్నాయని.. తనకేమైనా జరగరానిది జరుగుతుందనే ఆందోళనలో పవన్‌కళ్యాణ్ ఉన్నాడేమో. రాజకీయాలంటే సినిమా షూటింగులు కాదని ఆయన ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఆయన పిలుపునిస్తే ఉన్నపళంగా ఏదో జరిగిపోతుందని.. ఈ ప్రభుత్వం పడిపోతుందనే భ్రమల్ని వీడి నేలమీద నిలబడి మాట్లాడితే మంచిదని చెబుతున్నాను. చదవండి: ఇదంతా చంద్రబాబుకి తెలిస్తే ఫీల్ అవ్వరా? -
పవన్ డ్రామా ముగించారు: జక్కంపూడి రాజా
-
షెల్ కంపెనీలతో ప్రజాధనాన్ని దోచేశారు