‘ఎవరికీ రాని ఐడియా చంద్రబాబుకే వచ్చింది’
పిఠాపురం : ప్రతి యువత ఒక మీడియాగా తయారు కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ చంద్రబాబు దుష్ప్ర చారాలను సోషల్ మీడియా ద్వారా యువకులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. యువత అభిమానించి, అండదండలు చూపిస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని దోమలపై దండయాత్ర అనే ఐడియా చంద్రబాబుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. అయితే ప్రజా సమస్యలపై దండయాత్ర చేసే పార్టీ వైఎస్ఆర్ సీపీనే అని కన్నబాబు పేర్కొన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువకుల నుంచే మొదలైందని యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. వైఎస్ జగన్ విధివిధానాలను యువజన విభాగం క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. ఎన్నికల ముందు బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసిన టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టిందన్నారు.