హామీని నెరవేర్చాల్సిందే..
-
లేకపోతే ఆమరణ దీక్ష చేపడతా
-
ర్యాంపును, ఇసుక లారీలను అడ్డుకుంటాం
-
ప్రజావాణిలో అధికారులను నిలదీసిన జక్కంపూడి రాజా
సీతానగరం :
జాలిమూడి వద్ద గత నెల 15న ఇసుక లారీ కిందపడి మామిడి దుర్గ మరణించిన సంఘటన నేపథ్యంలో ఆమె ఇద్దరు కుమార్తెలకు అధికారులు, ర్యాంపు నిర్వాహకులు నష్ట పరిహారం ఇస్తానన్న హామీని విస్మరిస్తే సహించేది లేదని జక్కంపూడి రాజా హెచ్చరించారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ చంద్రశేఖరరావును ఆయన నిలదీశారు. సంఘటన జరిగి 40 రోజులైనా, మృతురాలి కుమార్తెలు శ్రీదేవి, సత్యభువనకు ర్యాంపు నిర్వాహకులు రూ.4 లక్షలు, ప్రభుత్వపరంగా ఇంటిస్థలం, ఆర్థికసాయం ఇచ్చేలా అధికారులు ఒప్పుకున్నారని, ఇంతవరకూ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నగదు విషయమై తమకు సంబంధం లేదని, ఇంటì æస్థలం, సీఎం రిలీఫ్‌ఫండ్ వచ్చేలా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ర్యాంపు నిర్వాహకులతో చర్చిస్తామని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు చేతులెత్తేస్తారా అంటూ రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితంగా హామీ నెరవేర్చకపోతే ఆమరణ æదీక్ష చేపడతానని ప్రకటించారు. ఇసుక లారీలను, కాటవరం ర్యాంపును అడ్డుకుంటామని హెచ్చరించారు.
సిగ్గుంటే పదవికి రాజీనామా చెయ్!
సాక్షి, రాజమహేంద్రవరం :
గతంలో ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు నీతి, నైతిక విలువల గురించి మాట్లాడిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు.. ఇప్పుడు తాను చేసిన వ్యవహారం ఏమిటో చెప్పాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ప్రశ్నించారు. సిగ్గు, నైతిక విలువలుంటే పార్టీకి రాజీనామా చేసినట్టుగానే, పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆదిరెడ్డి వల్లే నగరంలో ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేషన్, ఆర్యాపురం బ్యాంక్ ఎన్నికల్లో పార్టీ నష్టపోయిందని మండిపడ్డారు. బీసీలకు పెద్దపీట వేయాలని పార్టీ నుంచి తొలి ఎమ్మెల్సీ పదవిని ఆదిరెడ్డికి ఇచ్చారని గుర్తు చేశారు. పుష్కరాల్లో 29 మంది మరణిస్తే ఒక్కసారి కూడా కమిషన్ ముందు పార్టీ వాదన వినిపించలేదని విమర్శించారు. ఇసుక విక్రయాలు, నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై కోర్టుకెళతానన్న మాటలు, ఆ తర్వాత ఎక్కడిపోయాయో చెప్పాలని డిమాండ్ చేశారు. సాధారణ లెక్చరర్‌గా ఉన్న ఆదిరెడ్డి ఇప్పుడు ఖరీదైన కార్లలో ఎలా తిరుగుతున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. కార్పొరేటర్లు మేడపాటి షర్మిలారెడ్డి, మింది నాగేంద్ర, బొంత శ్రీహరి, పిల్లి నిర్మల, మజ్జి నూకరత్నం, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.