సాక్షి, తూర్పుగోదావరి: కూటమి ప్రభుత్వం సంక్రాంతికి కొత్త నిర్వచనం ఇచ్చిందని సెటైరికల్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా(Jakkampudi Raja). ఏపీలో నారా వారి నిర్వహణలో సంక్రాంతి సంబరాలు పేరిట రాష్ట్రంలో దోపిడీ జరిగిందన్నారు. పేకాట, గుండాట, కోడి పందాలు, రికార్డింగ్ డ్యాన్స్, మద్యం అమ్మకాలు.. ఇదే కూటమి మేనిఫెస్టో అంటూ ఎద్దేవా చేశారు.
రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఏం జరుగుతుందో చంద్రబాబు(Chandrababu), పవన్(Pawan Kalyan) ఒక్కసారి మనస్సాక్షిగా ఆలోచించుకోవాలి. సంక్రాంతి(sankranthi) సంబరాలు అంటే గంగిరెద్దులు ముగ్గులు, అక్కడక్కడ కోడిపందాలు మాత్రమే గతంలో ఉండేవి. సంక్రాంతికి కొత్త నిర్వచనం ఇచ్చారు కూటమి నేతలు.. నారా వారి నిర్వహణలో సంక్రాంతి సంబరాలు పేరిట రాష్ట్రంలో దోపిడీ జరిగింది. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా జూదాలు.. గుండాటలు జరిగాయి.
ఒక్కో మహిళకు నెలకు 15వేలు చొప్పున ఆర్థిక సాయం అన్నారు.. సూపర్ సిక్స్ మేనిఫెస్టో దేవుడి పేరిట అటకెక్కింది. పేకాట, గుండాట.. కోడిపందాలు.. రికార్డింగ్ డ్యాన్స్.. మద్యం అమ్మకాలు.. ఇవే కూటమి మేనిఫెస్టో. ఇంటర్నేషనల్ టోర్నమెంట్ చూసినట్టు కోడి పందాలను, ప్రీమియర్ లీగ్‌లా నిర్వహించి పార్కింగ్ పేరిట సామాన్యుడి దగ్గర విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేశారు. రాజానగరం నియోజకవర్గంలో భూపాలపట్నంలో డ్రగ్స్.. రేవ్ పార్టీలు.. రికార్డింగ్ డ్యాన్స్ సంస్కృతి తీసుకొచ్చారు. అనకాపల్లిలో గంజాయి దొరికితే.. అందులో రాజానగరం నియోజకవర్గం కాపవరం గ్రామానికి చెందిన జనసేన నేతలు మూలాలు ఉన్నాయి.
గంగాధర్ అనే వ్యక్తి గుండాటలో డబ్బులు పోయాయని ఆత్మహత్య చేసుకున్నాడు. బహిరంగంగా పోలీసులను కూడా వేదికలపై నుండి బయటకి గెంటేస్తున్నారు. ప్రభుత్వ ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గాల్సి వచ్చింది. కొన్నిచోట్ల సంక్రాంతికి అసలు పోలీసులు ఉన్నారా లేరా అనే ప్రశ్న తలెత్తింది. రాజమండ్రి పేపర్ మిల్‌పై వేలమంది కార్మికులు ఆధారపడి ఉన్నారు. కార్మికుల పొట్టకొట్టే ప్రయత్నం ప్రవీణ్ చౌదరి అనే వ్యక్తి చేస్తున్నాడు. ప్రవీణ్ చౌదరికి తెలుగుదేశంలో మూలాలు ఉన్నాయి.. బుచ్చయ్య చౌదరి అడుగుజాడల్లో నడుస్తాడు’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment