రెచ్చిపోయిన పచ్చ మూకలు.. వైఎస్సార్‌సీపీ నేతలపై కత్తులతో దాడి | Tdp Leaders Attack Ysrcp Workers In Kakinada District | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన పచ్చ మూకలు.. వైఎస్సార్‌సీపీ నేతలపై కత్తులతో దాడి

Published Sat, Dec 28 2024 2:34 PM | Last Updated on Sat, Dec 28 2024 4:53 PM

Tdp Leaders Attack Ysrcp Workers In Kakinada District

మండపంలో పహరా కాస్తున్న పోలీసులు

సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన గుండుబిల్లి నానాజీపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో నానాజీ తీవ్రంగా గాయపడ్డారు. ఇదే గ్రామంలోనక్కా మాణిక్యం, గడి దివాణం అనే మరో ఇద్దరిపైనా టీడీపీ నేతలు దాడికి దిగారు. కాకినాడ రూరల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో నానాజీ చికిత్స పొందుతున్నారు.

నిన్న(శుక్రవారం) జరిగిన వైఎస్సార్‌సీపీ పోరుబాటలో పాల్గొనేందుకు ప్రత్తిపాడు వెళ్తుండుగా రెండు చోట్ల దారి కాచి పచ్చమూక దాడులకు తెగబడ్డారు. దాడికి పాల్పడిన తొమ్మిది మందిపై అన్నవరం పీఎస్‌లో కేసు నమోదైంది. 

మండపంలో పోలీస్‌ పహరా
మండలంలోని మండపం గ్రామంలో వైఎస్సార్‌సీపీ నేతలపై కూటమి నేతల దాడి నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు. దాడుల కారణంగా గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. కూటమి నేతల దాడిలో గాయపడిన వైఎస్సార్‌సీపీ నేతలకు అండగా ఉంటానని ఎవ్వరూ అధైర్యపడవద్దని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, నియోజక వర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి ముద్రగడ గిరి అన్నారు. దాడికి పాల్పడిన టీడీపీ నేతలను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. స్థానిక ఎంపీపీ పర్వత రాజుబాబు బాధిత కుటుంబాలను పరామర్శించారు.

ఇదీ చదవండి: పోలీసుల ఓవరాక్షన్‌.. వైఎస్సార్‌సీపీ పోరుబాటపై అక్రమ కేసులు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement