టెల్ అవీవ్: కాల్పుల విమరణ ఒప్పందంపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య సయోధ్య కుదరడంతో ఒప్పందంపై ఇరువర్గాలు సంతకాలు చేశాయి. దోహ ఈ ఘట్టానికి వేదికైంది. కాల్పుల విరమణ ఒప్పందానికి అడ్డంకిగా మారిన చిక్కులను మధ్యవర్తులు తొలగించినట్లుగా తెలుస్తోంది.
ఈ మేరకు గాజా(Gaza)లో ఉన్న బంధీల విడుదలకు ఒప్పందం కుదిరినట్లు ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వంతో బుధవారం ఇజ్రాయెల్‌హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఒకవైపు హమాస్ చివరి నిమిషంలో కొర్రీలు వేస్తోందంటూ ఇజ్రాయెల్ మండిపింది. ఆపై కాసేపటికే తమకూ కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని గురువారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో ఒప్పందంపై ఉత్కంఠ నెలకొంది.
అయితే మధ్యవర్తుల తాజా దౌత్యంతో ఈ ఉత్కంఠకు తెర పడింది. ఒప్పందం చివరి దశకు చేరిన విషయాన్ని తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం ధ్రువీకరించింది. ఈ ఒప్పందంపై తొలుత ఇజ్రాయెల్ వార్ కేబినెట్ చర్చించి ఆమోద ముద్ర వేస్తుంది. అయితే శనివారం వరకు కేబినెట్ ఆమోద ముద్ర పడకపోవచ్చని సమాచారం. ఆదివారం నుంచి ఇరు వర్గాల మధ్య డీల్ అమల్లోకి వస్తుందంటూ ఖతార్ ప్రధాని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment