sign
-
జేమ్స్ బాండ్ సినిమాకు గుర్తుగా.. బంగారు రోల్స్ రాయిస్ కారు (ఫోటోలు)
-
Sign Languages Day: ఒకప్పుడు చులకనగా చూసినవాళ్లే నేడు..
అంతర్జాతీయ సంజ్ఞా భాష (సైన్ లాంగ్వేజ్) దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న జరుపుకుంటారు. వినికిడి లోపం కలిగినవారికి సంజ్ఞా భాష అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ దినోత్సవం నిర్వహణ వెనుక సుదీర్ఘ చరిత్ర, ఎంతో ప్రాముఖ్యత ఉన్నాయి. సంజ్ఞా భాష అనేది వినికిడి లోపం కలిగినవారు ఒకరితో ఒకరు సంభాషించడానికి ఉపయోగించే దృశ్య భాష. ఇది ఒక సహజ భాష, దానికి సొంత వ్యాకరణం, వాక్య నిర్మాణం, పదజాలం ఉన్నాయి. సంకేత భాషలో ప్రధానంగా చేతులు, ముఖ కవళికలు, శరీర కదలికలను ప్రదర్శిస్తారు.సంజ్ఞా భాష ఎంతో పురాతనమైనది. మొదట్లో ఈ భాషను చులకనగా చూసేవారట. అలాగే కొన్ని చోట్ల సంకేత భాషను ఉపయోగించకుండా నిరోధించారని కూడా చెబుతారు. అయితే కాలక్రమేణా సంజ్ఞా భాష అభివృద్ధి చెందిన భాషగా గుర్తింపు పొందింది. బధిరుల హక్కుల సాధన కోసం జరిగే పోరాటంలో ఉపయుక్తమయ్యింది.సామాన్యులలో సంజ్ఞా భాషపై అవగాహన పెంచడానికి ఈ దినోత్సవం దోహదపడుతుంది. సంజ్ఞా భాష అనేది ఒక కమ్యూనికేషన్ మాధ్యమం. దీనిని ఉపయోగించే వారి విషయంలో ఉండే వివక్షను తొలగించాలనే విషయాన్ని ఈ ప్రత్యేక దినోత్సవం గుర్తు చేస్తుంది. సంకేత భాష అనేది వక్రీకరణ కాదు, సహజమైన, అందమైన భాష అని గుర్తెరగాలని నిపుణులు చెబుతుంటారు.సంజ్ఞా భాషలు ప్రపంచవ్యాప్తంగా విభిన్నంగా ఉంటాయి. బధిరులకు విద్య, వైద్యం, ఇతర సేవలను ఇతరులతో సమానంగా అందించేందుకు ఈ సైన్ లాంగ్వేజ్ ఉపయోగపడుతుంది. ఇతర భాషల మాదిరిగానే సంకేత భాషలు కూడా నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి. కొత్త పదాలు, చిహ్నాలు, కొత్త ఆలోచనలు, సాంకేతికతలకు అనుగుణంగా అవి కొత్త రూపం తీసుకుంటున్నాయి. సంజ్ఞా భాష అనేది ఆలోచనలను వ్యక్తీకరించడానికి మాత్రమే కాకుండా భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది కూడా చదవండి: నిద్రలో నడుస్తూ అడవిలోకి...! -
ఈ హీరోయిన్ల రాశి ఏంటో తెలుసా? (ఫొటోలు)
-
నా గురించి తెలుసుకదా..! అలా చేయలేదంటే మిమ్మల్నీ?
కరీంనగర్: ‘బిల్లులో ఏముందనేది సంబంధం లేదు.. నేను చెప్పిందానికి సంతకం పెట్టలేదంటే అంతే. మీ ఎంబడి పడుడైతది చెబుతున్నా.. నా గురించి తెలుసు కదా.. నన్ను ఏ కొడుకు.. ఏం చేయలేడు’.. ఇది నగరపాలకసంస్థలో ఓ డీఈ దౌర్జన్యకాండ. నగరపాలక సంస్థలో పనులు పూర్తికాకున్నా బిల్లులపై సంతకాల కోసం ఇంజినీరింగ్ అధికారులపై వివాదాస్పద డీఈ వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. నిత్యం వివాదాల్లో ఉండే సదరు డీఈ కాంట్రాక్టర్ల తరఫున రంగంలోకి దిగాడు. ఏఈలు, డీఈలను సంతకాలకోసం బెదిరిస్తుండగా, వారు సెలవుపై వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. పూర్తి కాని, నాణ్యత పాటించని పనులకు.. ఓ వైపు స్మార్ట్ సిటీ, సీఎంఏ తదితర నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో వందల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయని అధికార, విపక్షాలనే తేడా లేకుండా ఫిర్యాదులు చేస్తుంటే.. మరో వైపు ఎలాంటి భయం లేకుండా పూర్తి కాని, నాణ్యత పాటించని పనులకు రికార్డులు తయారుచేసి బిల్లులు ఎత్తే పనిని సదరు డీఈ విజయవంతంగా పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాడు. దీనికోసం ఏఈలు, సహచర డీఈలపై బెదిరింపులకు దిగుతున్నాడు. సంతకాలు పెట్టకపోతే మీ సంగతి చెబుతానంటూ బూతులందుకుంటున్నాడు. మళ్లీ వేధింపులు షురూ! బల్దియాలో వివాదాస్పద అధికారిగా పేరొందిన సదరు డీఈ బెదిరింపులు మళ్లీ మొదలయ్యాయి. గతంలో ఉన్నతాధికారులను సైతం అసభ్యపదజాలంతో దూషించిన వ్యవహారం అప్పట్లో కలకలం సృష్టించింది. కొద్దికాలంగా స్థబ్దుగా ఉన్న ఆయన నాలుగైదు రోజుల నుంచి కిందిస్థాయి, సహచర, ఉన్నత అనే తేడా లేకుండా ఇంజినీరింగ్ అధికారులపై దూషణలకు దిగుతున్నాడు. వారి పరిధిలోని పనులకు సంబంధించిన బిల్లుల తయారీలో సంతకాలు పెట్టాలంటూ ఒత్తిడి తెస్తున్నాడు. సెలవులో వెళ్లేందుకు ప్రయత్నం సదరు డీఈ ఆగడాలు ఎక్కువవుతున్న క్రమంలో సెలవులో వెళ్లేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు. నగరపాలకసంస్థలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు ముఖ్యంగా ఇంజినీరింగ్ అధికారులు ఒత్తిడిలో ఉన్నారు. ఈ క్రమంలో డీఈ సంతకాల కోసం దౌర్జన్యానికి దిగుతుండడంతో తాము సంతకాలు చేసి ఉద్యోగాలను ఫణంగా పెట్టలేమని అధికారులు పేర్కొంటున్నారు. దీనికన్నా సెలవులో వెళ్లడం మేలని, అవసరమైతే బదిలీకి కూడా సిద్ధపడుతున్నారు. కాగా నగరంలో అభివృద్ధి పనుల్లో జరుగుతున్న అక్రమాలు, సదరు డీఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపించి ఆయన ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉన్నతాధికారులపై ఉంది. ఇవి చదవండి: నేరడిగొండ జెడ్పీఎస్‌ఎస్‌లో ఓ ఉపాధ్యాయుడు.. -
ఇస్రోతో చేతులు కలిపిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ - కొత్త ఆవిష్కరణల దిశగా..
న్యూఢిల్లీ: క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా స్పేస్–టెక్ సంబంధ నవకల్పనలకు ఊతమిచ్చేలా ఇస్రో, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్–స్పేస్)తో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి కొత్త ఆవిష్కరణలు చేసే దిశగా స్పేస్ స్టార్టప్‌లు, పరిశోధన సంస్థలు, విద్యార్థులకు క్లౌడ్ టెక్నాలజీలను అందుబాటులో ఉంచడానికి ఈ ఒప్పందం ఉపయోగపడగలదని ఏడబ్ల్యూఎస్ ఇండియా, సౌత్ ఏషియా డైరెక్టర్ శాలిని కపూర్ తెలిపారు. అంతరిక్ష రంగం మరింత మెరుగైన నిర్ణయాలను, వేగవంతంగా తీసుకునేందుకు క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారిత ఆవిష్కరణలు సహాయపడగలవని ఆమె వివరించారు. -
Twitter Blue Bird Auction: ట్విటర్ వేలానికి ఉంచిన వస్తువులు ఇవే.. (ఫొటోలు)
-
డేంజర్: ఇది జరిగితే మీ బ్యాంక్ అకౌంట్ ప్రమాదంలో ఉన్నట్టే..
ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. అమాయక ప్రజల డబ్బును దోచుకునేందుకు సైబర్ మోసగాళ్లు రోజుకో ఎత్తు వేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మీ డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు అత్యంత తేలికగా స్కామర్ల చేతికి చేరుతున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. పలు అక్రమ వైబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ నంబర్లు, కార్డ్ హోల్డర్ పేర్లు, సీవీవీతో సహా వివరాలను స్కామర్లకు విక్రయిస్తున్నాయి. అదీ కూడా ఒక్కో కార్డు వివరాలు కేవలం 5 యూఎస్ డాలర్లు. అంటే రూ.410లకు మాత్రమే. పశ్చిమ దేశాలలో చెల్లింపులు ప్రాసెస్ చేయడానికి కార్డు వివరాలు ఉంటే సరిపోతుంది. ఓటీపీ అవసరం ఉండదు. అందుకే ఆయా దేశాల్లో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. కానీ భారత్‌లో వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) ద్వారా రెండు-కారకాల ప్రామాణీకరణ తప్పనిసరి. అయినప్పటికీ దీన్ని కూడా అధిగమించడానికి స్కామర్లు కొత్త మార్గాన్ని కనుగొన్నారు. ఉన్నట్టుండి సిమ్ డీయాక్టివేట్ అయితే.. బాధితుల ఒరిజినల్ సిమ్‌ను డీయాక్టివేట్ చేయడం ద్వారా స్కామర్లు ఓటీపీని ఎలా యాక్సెస్ చేస్తున్నారో భారతీయ పోలీసు అధికారులను టైమ్స్ ఆఫ్ ఇండియా ఉటంకిస్తూ పేర్కొంది. హ్యాకర్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలను బాధితుడి పేరు, ఫోన్ నంబర్‌తో సహా షాడో వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్ల ద్వారా అమ్మకానికి పెడుతున్నారు. సైబర్ మోసగాళ్లు ఈ వివరాలను కొనుగోలు చేసి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను సంప్రదించి బాధితుల సిమ్ కార్డ్ డీయాక్టివేట్ చేయిస్తున్నారు. తర్వాత డూప్లికేట్ సిమ్ పొంది ఓటీపీలను సునాయాసంగా యాక్సెస్ చేయగలుగుతున్నారు. నష్టం జరిగేంత వరకు బాధితుడి ఈ మోసం గురించి తెలియదు. కాబట్టి మీ సిమ్ కార్డ్ ఉన్నట్టుడి డీయాక్టివేట్ అయినట్లు గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. కొన్ని నిమిషాల్లోనే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. ఈ వెబ్సైట్లను నిర్వహిస్తున్నదెవరు? నివేదిక ప్రకారం.. అక్రమ వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్లను రష్యా, ఉక్రెయిన్ దేశాలకు చెందిన హ్యాకర్లు నిర్వహిస్తున్నట్లుగా తేలింది. వీళ్లు వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్ల ద్వారా కార్డ్ వివరాలను హ్యాక్ చేసి విక్రయిస్తున్నారు. సంపన్న పాశ్చాత్య దేశాలకు చెందిన వారి కార్డు వివరాలకు ఒక్కో కార్డుకు 10 డాలర్లు (రూ.820) చొప్పున తీసుకుంటుండగా భారత్ సహా ఆసియా దేశాలకు చెందిన బాధితుల కార్డుల వివరాలకు చవగ్గా కేవలం 5 డాలర్లు (రూ.410)కే అమ్మేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. 2022 జనవరిలో అటువంటి అక్రమ వెబ్సైట్ ఒకదానిని అధికారులు గుర్తించి చర్యలు తీసుకున్నారు. కానీ అలాంటి అక్రమ వెబ్సైట్లు, టెలీగ్రామ్ చానెళ్లు లెక్కకు మించి పుట్టుకొస్తున్నాయి. ఇదీ చదవండి: ఇంటర్నెట్ షట్‌డౌన్: ఆరు నెలల్లో ఇన్ని వేల కోట్ల నష్టమా? -
వాషింగ్టన్లో జెలెన్స్ స్కీ పేరుతో రహదారి! వైరల్ అవుతున్న ఫోటో
President Zelensky Way Road Sign: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీ రష్యా బలగాలపై ధైర్యంగా పోరాడుతున్న సమయంలో 'ప్రెసిడెంట్ జెలెన్స్కీ వే' అని రాసి ఉన్న రోడ్ సైన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాషింగ్టన్‌లోని ఒక వీధిలో రష్యా కాన్సులేట్ వెలుపల ఈ రహదారి గుర్తు కనిపించిందని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు. అయితే జెలెన్ స్కీ గౌరవార్థం ఆదివారం మధ్యాహ్నం రష్యా కాన్సులేట్ వెలుపల కార్యకర్తలు ఈ గుర్తును పోస్ట్ చేశారు. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం 12వ రోజుకి చేరుకుంది. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలను ఒక్కోక్కటిగా ఆక్రమించుకుంటూ రష్య భయంకరంగా ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. అయినప్పటికీ ఉక్రెయిన్ కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా వీరోచితంగా ప్రతి దాడి చేస్తూనే ఉంది. ఈ తరుణంలో జెలెన్ స్కీకి దేశం విడిచి వచ్చేయండి అని అమెరికా ఆఫర్ ఇచ్చిన తిరస్కరించాడు. అంతేకాదు తన దేశంలోనే కొనసాగుతానని, తన భూమిని, ప్రజలను రక్షించుకుంటానని చెప్పి అందర్నీ విస్మయపరిచారు. అంతేగాక రష్యా ఉక్రెయిన్ పౌరులను, నివాసిత ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగడంతో ఉక్రెయిన్ నో ఫ్లై జోన్ ప్రకటించమని అభ్యర్థించారు జెలెన్ స్కీ. కానీ ఏ దేశం అయినా నో ఫ్లై జోన్ ప్రకటించినట్లయితే మాతో యుద్ధానికి దిగినట్లుగా భావించి దాడులు చేస్తాం అని రష్యా హెచ్చరించింది. దీంతో ప్రపంచ దేశాలు వెనక్కి తగ్గాయి. అయినప్పటికీ జెలెన్ స్కీ ఎంతో ధైర్య సాహాసాలతో రష్యాతో పోరాడుతూనే ఉన్నారు. అంతేగాక పౌరులపై రష్యా చేస్తున్న దాడిని నిరశిస్తూ మీరు చేసింది మేమే మరచిపోం, క్షమించం బదులు తీర్చుకుంటాం అంటూ సాహసోపేతంగా పోరాడుతున్నారు. రష్యా బలం ముందు ఉక్రెయిన్ బలం సరిపోకపోయినప్పటికీ తమ దేశం కోసం ఒక సైనికుడిలా మారి ముందుండి నడిపిస్తున్నందుకు జెలెన్స్కీ గౌరవార్థం రష్యా ఎంబీసీ వెలుపల ఈ గుర్తును ఉంచారు. (చదవండి: యుద్ధం 11 ఏళ్ల బాలుడిని ఒంటరిగా దేశం దాటేలా చేసింది) -
యువతకు షాక్: ‘ఇక్కడ ముద్దులు పెట్టుకోరాదు’
ముంబై: ఏమాత్రం విచక్షణ లేకుండా నడిరోడ్డుపై ముద్దూమురిపాలతో హద్దు మీరుతున్న యువత తీరుతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ముంబైలోని నివాసితులు ‘ఇక్కడ ముద్దులు పెట్టుకోరాదు’ ‘ముద్దులకు ఇక్కడ అనుమతి లేదు’ అని పొగ తాగరాదు వంటి మాదిరి బోర్డులు ఏర్పాటు చేశారు. బోర్డులు ఏర్పాటు చేసేంత వరకు వచ్చిందంటే వారు ఎంతలా హద్దు మీరుతున్నారో మీరే ఊహించుకోండి. ముంబైలోని బొరివలీలో ఉన్న సత్యం శివం సుందరం సొసైటీ వారు ‘ముద్దులు పెట్టుకోరాదు’ అని రోడ్లపై రాయించారు. లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని ప్రేమికులు, యువత అడ్డాగా చేసుకున్నారు. సాయంత్రం ఐదు గంటలు అయితే చాలు కార్లు, ద్విచక్ర వాహనాలపై యువతీయువకులు వచ్చి ఇక్కడ వాలిపోతారు. ఆ తర్వాత రెచ్చిపోయి ప్రవర్తిస్తుంటారు. కౌగిలింతలు.. ముద్దూముచ్చట.. తదితర కార్యాలు జరుగుతున్నాయి. అటువైపు నుంచి సొసైటీ నివాసుతులు రాకపోకలు సాగించలేకపోతున్నారు. ఇక ప్రశాంతంగా అపార్ట్మెంట్ బాల్కానీలో కూర్చుందామంటే.. కిటికీలు తెరుచుకుందామనుకుంటే వారి లీలలే కనిపిస్తున్నాయి. జుగుస్పకరంగా.. అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ విషయాన్ని యువతీయువకులను ఎన్నోసార్లు చెప్పారు. అయినా వారిలో మార్పు రాకపోవడంతో ఈ చర్య తీసుకున్నామని సత్యం శివం సుందరం సొసైటీ ప్రతినిధి కైలాశ్‌రావ్ దేశ్‌ముఖ్ తెలిపారు. యువత ఆగడాలను వీడియోలు తీసిన స్థానికులు వాటిని స్థానిక కార్పొరేటర్‌కు చూపించగా అతడు పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పాడు. కాలనీవాసులు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా ఇప్పటివరకు స్పందన లేదు. చివరకు దీని పరిష్కారంగా రోడ్డుపై హెచ్చరిక (నో కిస్సింగ్ జోన్) చేస్తూ రాతలు రాయాలని ఆలోచించి పైవిధంగా రాశారు. అయితే ఈ రాతలను చూసిన యువతలో మార్పు వచ్చిందని నివాసితులు చెబుతున్నారు. వారి ఆగడాలు తగ్గాయి. రాసిన చోట యువత వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు. కరోనా వ్యాప్తితో విధించిన లాక్డౌన్ వలన జంటలు పార్క్‌లు, సినిమా టాకీస్, పర్యాటక ప్రాంతాలకు వెళ్లలేకపోవడంతో స్థానికంగా కొంత ప్రాంతం ఖాళీగా ఉంటే అక్కడ వాలిపోతున్నారు. ఆ క్రమంలోనే సత్యం శివం సుందరం ప్రాంతంలో ఇదే విధంగా చేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఆ సూచన రాయడంతో వారిలో మార్పు వచ్చింది. -
సంయుక్త ప్రకటనలో ఏముందంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌జాంగ్ ఉన్ కొత్త అధ్యాయానికి తెరలేపుతూ ఒక చారిత్రక ప్రకటన మీద సంతకాలు చేశారు. సమగ్రమైన, లోతైన చర్చలు జరిపి, పరస్పరం అభిప్రాయాలు పంచుకున్న అనంతరం కొరియా ద్వీపంలో శాంతి స్థాపన, ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, పరస్పరం విశ్వాసం పాదుకొల్పే చర్యలు చేపడతామని ఇరువురు నేతలు ప్రతిజ్ఞ చేశారు. కొరియా భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదని ట్రంప్ హామీ ఇస్తే, అణు నిరాయుధీకరణకు తాము కట్టుబడి ఉన్నామని కిమ్ మరోసారి గట్టిగా చెప్పారు. అనంతరం ఒక సంయుక్త ప్రకటన మీద సంతకాలు చేశారు. ఆ ప్రకటనలో ఉన్న అంశాలు శాంతి, సుస్థిరత కోసం ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రెండు దేశాల మధ్య బంధం బలపడేలా చర్యలకు కట్టుబడి ఉండడం కొరియా ద్వీపకల్పంలో శాంతి, సుస్థిరతల కోసం ఇరు దేశాలు సంయుక్తంగా కృషి చేయడం ఏప్రిల్ 27, 2018న ఉత్తర కొరియా తాను చేసిన అణునిరాయుధీకరణ ప్రకటనకు కట్టుబడి ఉండడం, సంపూర్ణ అణునిరాయుధీకరణ జరిగేలా కిమ్ ప్రభుత్వం చర్యలు చేపట్టడం యుద్ధ ఖైదీల విడుదల, యుద్ధం సమయంలో కనిపించకుండా పోయిన వారిని గుర్తిస్తే వారిని తిరిగి తమ తమ దేశాలకు అప్పగించడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉండాలి. చాలా సంక్షిప్తంగా ఉన్న ఈ ప్రకటనపై సంతకాలు చేసిన ఇరువురు నేతలు, ఈ సానుకూల దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి విదేశాంగ శాఖ మంత్రులు, అత్యున్నత స్థాయి అధికారుల స్థాయిలో చర్చలు జరపడాలని నిర్ణయించారు. వీలైనంత త్వరలో వీరి భేటీ ఉండేలా చర్యలు తీసుకోవడానికి ఇరువురు అంగీకరించారు. కిమ్‌ను వీడియోతో పడగొట్టిన ట్రంప్..!! -
నిషేధ ఉత్తర్వుపై నేడు ట్రంప్ సంతకం!
వాషింగ్టన్ : వలసదారులపై నిషేధానికి సంబంధించిన సవరణ ఉత్తర్వుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం సంతకం చేసే అవకాశముంది. హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో సంతకం చేస్తారని సీనియర్ అధికారులు చెప్పినట్లు పొలిటికో పత్రిక తెలిపింది. ముస్లిం ఆధిక్య దేశాల ప్రజలు అమెరికాకు 90 రోజుల పాటు రాకూడదన్న ఉత్తర్వు వివాదాస్పదం కావడం, ఉత్తర్వును సియాటెల్ కోర్టు నిలిపేయడమూ తెలిసిందే. కాగా.. ట్రంప్ వ్యవహారశైలిపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతుండగా అభిమానులు కొందరు ట్రంప్ తమకు గర్వకారణ మంటూ కొలరాడో రాష్ట్ర రాజధాని నుంచి న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్ వరకు, అక్కడి నుంచి వాషింగ్టన్ స్మారకం వరకు ర్యాలీ నిర్వహించారు. -
కొత్త ‘ఇమ్మిగ్రేషన్’ పై ఎల్లుండే ట్రంప్ సంతకం!
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొత్త వలస విధానానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై బుధవారం సంతకం చేయనున్నారు. అమెరికా కాంగ్రెస్‌లోని చట్టప్రతినిధులతో ఉమ్మడిగా సమావేశం నిర్వహించిన మరుసటి రోజు ఆయన సంతకం చేయనున్నట్లు శ్వేతసౌదం వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ ఆదేశాలపై ట్రంప్ గతవారంలోనే సంతకం చేయాలని అనుకున్నారంట. అయితే, ఎలాంటి లోపాలు కొత్త ఆర్డర్లలో లేకుండా జాగ్రత్తగా చూసుకునేందుకే ఆయన ఈ వారం వరకు కావాలని నిలిపి ఉంచినట్లు అమెరికా అంతర్గత భద్రత వ్యవహారాల అధికారిక ప్రతినిధి సియాన్ స్పైసర్ తెలిపారు. ఏడు ముస్లిం దేశాలవారు అమెరికాలో అడుగుపెట్టవద్దంటూ డోనాల్డ్ ట్రంప్ అప్పటికప్పుడు కొత్త ఎగ్జిక్యూటివ్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఫెడరల్ కోర్టు జడ్జీ ట్రంప్ నిర్ణయం చెల్లబోదని అడ్డుకున్నారు. దీంతో ఆయా దేశాలకు చెందినవారికి కాస్తంత ఉపశమనం లభించినట్లయింది. అయితే, ఈసారి మాత్రం గతంలో జారీ చేసిన కొత్త ఇమ్మిగ్రేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకొని సంతకాలు చేయనున్నారట. అయితే, అందులో ఎలాంటి అంశాలు పొందుపరిచారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. -
డీఏ ఫైలుపై సీఎం సంతకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు 5.99 శాతం కరువుభత్యం(డీఏ) ఇచ్చే ఫైలుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు. దీంతో ఈమేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ కానున్నాయి. తెలంగాణలో ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ వర్తిస్తుంది. కాగా, డీఏ పెంపుతో ప్రతిసంవత్సరం దాదాపు 900 కోట్ల మేర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని ఆర్థిక శాఖ వర్గాలు వివరించాయి.