నిషేధ ఉత్తర్వుపై నేడు ట్రంప్‌ సంతకం! | Trump expected to sign revised travel ban | Sakshi
Sakshi News home page

నిషేధ ఉత్తర్వుపై నేడు ట్రంప్‌ సంతకం!

Published Mon, Mar 6 2017 2:45 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

నిషేధ ఉత్తర్వుపై నేడు ట్రంప్‌ సంతకం! - Sakshi

నిషేధ ఉత్తర్వుపై నేడు ట్రంప్‌ సంతకం!

వాషింగ్టన్ : వలసదారులపై నిషేధానికి సంబంధించిన సవరణ ఉత్తర్వుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం సంతకం చేసే అవకాశముంది. హోంల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌లో సంతకం చేస్తారని సీనియర్‌ అధికారులు చెప్పినట్లు పొలిటికో పత్రిక తెలిపింది.

ముస్లిం ఆధిక్య దేశాల ప్రజలు అమెరికాకు 90 రోజుల పాటు రాకూడదన్న ఉత్తర్వు వివాదాస్పదం కావడం, ఉత్తర్వును సియాటెల్‌ కోర్టు నిలిపేయడమూ తెలిసిందే. కాగా.. ట్రంప్‌ వ్యవహారశైలిపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతుండగా అభిమానులు కొందరు ట్రంప్‌ తమకు గర్వకారణ మంటూ కొలరాడో రాష్ట్ర రాజధాని నుంచి న్యూయార్క్‌లోని ట్రంప్‌ టవర్‌ వరకు, అక్కడి నుంచి వాషింగ్టన్  స్మారకం వరకు ర్యాలీ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement