
డొనాల్డ్ ట్రంప్-కిమ్‌జాంగ్ ఉన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌జాంగ్ ఉన్ కొత్త అధ్యాయానికి తెరలేపుతూ ఒక చారిత్రక ప్రకటన మీద సంతకాలు చేశారు. సమగ్రమైన, లోతైన చర్చలు జరిపి, పరస్పరం అభిప్రాయాలు పంచుకున్న అనంతరం కొరియా ద్వీపంలో శాంతి స్థాపన, ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, పరస్పరం విశ్వాసం పాదుకొల్పే చర్యలు చేపడతామని ఇరువురు నేతలు ప్రతిజ్ఞ చేశారు. కొరియా భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదని ట్రంప్ హామీ ఇస్తే, అణు నిరాయుధీకరణకు తాము కట్టుబడి ఉన్నామని కిమ్ మరోసారి గట్టిగా చెప్పారు. అనంతరం ఒక సంయుక్త ప్రకటన మీద సంతకాలు చేశారు. ఆ ప్రకటనలో ఉన్న అంశాలు
- శాంతి, సుస్థిరత కోసం ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రెండు దేశాల మధ్య బంధం బలపడేలా చర్యలకు కట్టుబడి ఉండడం
- కొరియా ద్వీపకల్పంలో శాంతి, సుస్థిరతల కోసం ఇరు దేశాలు సంయుక్తంగా కృషి చేయడం
- ఏప్రిల్ 27, 2018న ఉత్తర కొరియా తాను చేసిన అణునిరాయుధీకరణ ప్రకటనకు కట్టుబడి ఉండడం, సంపూర్ణ అణునిరాయుధీకరణ జరిగేలా కిమ్ ప్రభుత్వం చర్యలు చేపట్టడం
- యుద్ధ ఖైదీల విడుదల, యుద్ధం సమయంలో కనిపించకుండా పోయిన వారిని గుర్తిస్తే వారిని తిరిగి తమ తమ దేశాలకు అప్పగించడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉండాలి.
చాలా సంక్షిప్తంగా ఉన్న ఈ ప్రకటనపై సంతకాలు చేసిన ఇరువురు నేతలు, ఈ సానుకూల దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి విదేశాంగ శాఖ మంత్రులు, అత్యున్నత స్థాయి అధికారుల స్థాయిలో చర్చలు జరపడాలని నిర్ణయించారు. వీలైనంత త్వరలో వీరి భేటీ ఉండేలా చర్యలు తీసుకోవడానికి ఇరువురు అంగీకరించారు.
కిమ్‌ను వీడియోతో పడగొట్టిన ట్రంప్..!!