joint statement
-
NATO: విధ్వంసకారి చైనా
వాషింగ్టన్/బీజింగ్: చైనా–రష్యా దేశాల మధ్య బంధం నానాటికీ బలపడుతుండడం పట్ల నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) సభ్యదేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. యుద్ధం పేరిట ఉక్రెయిన్‌లో విధ్వంసానికి రష్యాకు చైనా అండదండలు అందిస్తోందని మండిపడ్డాయి. డ్రాగన్ దేశం నిర్ణయాత్మక విధ్వంసకారిగా మారిందని ఆరోపించాయి. రష్యాతో భాగస్వామ్యానికి ఎలాంటి పరిమితులు లేవంటూ చైనా నాయకత్వం చేసిన ప్రకటనలను నాటో దేశాలు ప్రస్తావించాయి. రష్యా రక్షణ పారిశ్రామిక రంగానికి చైనా పూర్తిస్థాయిలో మద్దతుగా నిలుస్తోందని, దీనివల్ల రష్యా పొరుగు దేశాలతోపాటు యూరో–అట్లాంటిక్ భద్రతకు పెనుముప్పు పొంచి ఉందని వెల్లడించాయి. అమెరికాలోని వాషింగ్టన్లో నాటోలోని 32 సభ్యదేశాల అధినేతలు, ప్రతినిధులు సమావేశమయ్యారు. కూటమి 75వ వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. కూటమిలో 32వ సభ్యదేశంగా చేరిన స్వీడన్‌కు సాదర స్వాగతం పలికారు. భేటీ అనంతరం ‘వాషింగ్టన్ సమ్మిట్ డిక్లరేషన్’ పేరిట ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. చైనా దుందుడుకు విధానాలు, చర్యలు తమ ప్రయోజనాలకు, భద్రతకు, విలువలకు సవాలు విసిరేలా ఉంటున్నాయని మండిపడ్డారు. రష్యాకు మద్దతిస్తే చైనాకే నష్టం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన చైనా బాధ్యతాయుతంగా మసలుకోవాలని నాటో సభ్యదేశాల ప్రతినిధులు హితవు పలికారు. ఉక్రెయిన్‌లో అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న రష్యాకు సహకరించుకోవడం తక్షణమే నిలిపివేయాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత చైనాపై ఉందని పునరుద్ఘాటించారు. రష్యాకు ఆయుధపరంగా, రాజకీయంగా ఎలాంటి సహకారం అందించవద్దని స్పష్టం చేశారు. రష్యాను గుడ్డిగా వెనుకేసుకొస్తే చైనాయే నష్టపోతుందని, ప్రపంచంలో ఏకాకిగా మారుతుందని తేలి్చచెప్పారు. రష్యా–చైనా–ఉత్తర కొరియా దేశాల మధ్య స్నేహ సంబంధాలు కొత్త చివుళ్లు తొడుగుతున్న నేపథ్యంలో దానికి ప్రతిచర్యగా ఇండో–పసిఫిక్ దేశాలతో భాగస్వామ్యాన్ని మెరుగుపర్చుకుంటామని నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ప్రకటించారు. అలజడి యత్నాలు మానుకోండి: చైనా ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధంలో చైనా విధ్వంసకారిగా మారిందంటూ నాటో కూటమి నేతలు చేసిన విమర్శలను చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ గురువారం ఖండించారు. సొంత భద్రత కోసం ఇతర దేశాల ప్రయోజనాలను బలిపెట్టడం నాటో దేశాలకు అలవాటేనని విమర్శించారు. ఆసియాలో అలజడి సృష్టించాలన్న ప్రయత్నాలు మానుకోవాలని చెప్పారు.నాటో సభ్య దేశాలు ఇవి...1.అమెరికా, 2.యునైటెడ్ కింగ్డమ్, 3.అల్బేనియా, 4.బెల్జియం, 5.బల్గేరియా, 6.కెనడా, 7.క్రొయేíÙయా, 8.చెక్‌రిపబ్లిక్, 9.డెన్మార్క్, 10.ఎస్తోనియా, 11.ఫిన్లాండ్, 12.ఫ్రాన్స్, 13.జర్మనీ, 14.గ్రీస్, 15.హంగేరీ, 16.ఐస్లాండ్, 17.ఇటలీ, 18.లాతి్వయా, 19.లిథువేనియా, 20.లక్సెంబర్గ్, 21.మాంటెనిగ్రో, 22.నెదర్లాండ్స్, 23.నార్త్ మాసిడోనియా, 24.నార్వే, 25.పోలాండ్, 26.పోర్చుగల్, 27.రొమేనియా, 28.స్లొవాకియా, 29.స్లొవేనియా, 30.స్పెయిన్, 31.స్వీడన్, 32.తుర్కియే -
PM Narendra Modi: యుద్ధాలకు సమయం కాదిది
వియన్నా: ప్రపంచం ఇప్పటికే అనేకానేక సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో ఇది యుద్ధాలకు సమయం కాదని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. రెండు రోజుల ఆ్రస్టియా పర్యటనలో భాగంగా ఆ దేశ చాన్సలర్ కార్ల్ నెహమర్‌తో బుధవారం ఆయన భేటీ అయ్యారు. పశి్చమాసియా సంక్షోభంతో పాటు ఉక్రెయిన్ యుద్ధం తదితరాలపై నేతలిద్దరూ లోతుగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకోవాలని, అందుకోసం మైలిక సదుపాయాలు, సంప్రదాయేతర ఇంధన వనరులు, ఇన్నొవేషన్లు, నీటి–వ్యర్థాల నిర్వహణ వంటి అన్ని రంగాల్లోనూ అవకాశాలనూ మరింతగా అందిపుచ్చుకోవాలని నిర్ణయించారు. ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. శాంతియుత వాతావరణంలో చర్చలే యుద్ధాలకు ఏకైక పరిష్కారమమని పేర్కొన్నారు. అందుకు అన్నివిధాలా సహకరించేందుకు ఇరు దేశాలూ సిద్ధమని ప్రకటించారు. ఔరాసతో పాటు పలు అంతర్జాతీయ సంస్థల్లో సమకాలీన అవసరాలకు తగ్గట్టుగా సంస్కరణలు అవసరమని నేతలు అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు మొదలుకుని ఉగ్రవాదం దాకా అన్ని అంశాలపైనా చర్చించినట్టు వివరించారు. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తుల నిర్వహణ మౌలిక సదుపాయాల కూటమి, జీవ ఇంధన కూటమి తదితరాల్లో భాగస్వామి కావాలని ఆ్రస్టియాను మోదీ ఈ సందర్భంగా ఆహా్వనించారు. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు భారత్ పాత్ర కీలకమని నెహమర్ అభిప్రాయపడ్డారు. గార్డాఫ్ ఆనర్ భారత ప్రధాని ఆ్రస్టియాలో పర్యటించడం 41 ఏళ్ల అనంతరం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో బుధవారం మోదీకి వియన్నాలో గార్డాఫ్ ఆనర్ లభించింది. స్థానిక కళాకారులు వందేమాతరం ఆలపించారు. మోదీని నెహమర్ ఆలింగనం చేసుకున్నారు. ఆయనతో సెల్ఫీ తీసుకుంటూ సందడి చేశారు. ఆ ఫొటోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘మోదీ జీ! వియన్నాకు స్వాగతం’ అని పేర్కొన్నారు. అంతకుముందు నేతలిద్దరూ పలు అంశాలపై చాలాసేపు మనసు విప్పి మాట్లాడుకున్నారు.సీఈవోలతో భేటీభారత్లో ఇన్ఫ్రా, ఇంధన, టెక్నాలజీ తదితర రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆ్రస్టియా కంపెనీలను మోదీ ఆహ్వానించారు. స్థానిక హాఫ్బర్గ్ ప్యాలెస్‌లో ఆ్రస్టియా, ఇండియా సీఈఓల రౌండ్‌టేబుల్ భేటీలో మోదీ, నెహమర్ పాల్గొన్నారు. ఇరు దేశాల నడుమ 2023లో 293 కోట్ల డాలర్ల మేర వర్తకం జరిగింది.అధ్యక్షునితో భేటీ ఆ్రస్టియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాండెర్ బెలన్తో మోదీ భేటీ అయ్యారు. పలు అంశాల్లో ద్వైపాక్షిక సహకారంపై లోతుగా చర్చించుకున్నట్టు చెప్పారు. ఈ మేరకు మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తమ భేటీ అద్భుతంగా జరిగిందన్నారు. -
సంయుక్త ప్రకటనలో ఏముందంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌జాంగ్ ఉన్ కొత్త అధ్యాయానికి తెరలేపుతూ ఒక చారిత్రక ప్రకటన మీద సంతకాలు చేశారు. సమగ్రమైన, లోతైన చర్చలు జరిపి, పరస్పరం అభిప్రాయాలు పంచుకున్న అనంతరం కొరియా ద్వీపంలో శాంతి స్థాపన, ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, పరస్పరం విశ్వాసం పాదుకొల్పే చర్యలు చేపడతామని ఇరువురు నేతలు ప్రతిజ్ఞ చేశారు. కొరియా భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదని ట్రంప్ హామీ ఇస్తే, అణు నిరాయుధీకరణకు తాము కట్టుబడి ఉన్నామని కిమ్ మరోసారి గట్టిగా చెప్పారు. అనంతరం ఒక సంయుక్త ప్రకటన మీద సంతకాలు చేశారు. ఆ ప్రకటనలో ఉన్న అంశాలు శాంతి, సుస్థిరత కోసం ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రెండు దేశాల మధ్య బంధం బలపడేలా చర్యలకు కట్టుబడి ఉండడం కొరియా ద్వీపకల్పంలో శాంతి, సుస్థిరతల కోసం ఇరు దేశాలు సంయుక్తంగా కృషి చేయడం ఏప్రిల్ 27, 2018న ఉత్తర కొరియా తాను చేసిన అణునిరాయుధీకరణ ప్రకటనకు కట్టుబడి ఉండడం, సంపూర్ణ అణునిరాయుధీకరణ జరిగేలా కిమ్ ప్రభుత్వం చర్యలు చేపట్టడం యుద్ధ ఖైదీల విడుదల, యుద్ధం సమయంలో కనిపించకుండా పోయిన వారిని గుర్తిస్తే వారిని తిరిగి తమ తమ దేశాలకు అప్పగించడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉండాలి. చాలా సంక్షిప్తంగా ఉన్న ఈ ప్రకటనపై సంతకాలు చేసిన ఇరువురు నేతలు, ఈ సానుకూల దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి విదేశాంగ శాఖ మంత్రులు, అత్యున్నత స్థాయి అధికారుల స్థాయిలో చర్చలు జరపడాలని నిర్ణయించారు. వీలైనంత త్వరలో వీరి భేటీ ఉండేలా చర్యలు తీసుకోవడానికి ఇరువురు అంగీకరించారు. కిమ్‌ను వీడియోతో పడగొట్టిన ట్రంప్..!! -
కెనడా ప్రధానిపై ట్రంప్ గరం
క్యుబెక్: జీ–7 శిఖరాగ్ర సదస్సు అనంతరం సభ్య దేశాలు విడుదలచేసిన ఉమ్మడి ప్రకటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఆతిథ్య కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై మండిపడ్డారు. సదస్సు ముగియడానికి ముందే సింగపూర్ బయల్దేరిన ట్రంప్ విమానంలోనే ఉమ్మడి ప్రకటనపై స్పందిం చారు. ట్రూడో విలేకర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ విలేకర్ల సమావేశంలో ట్రూడో చెప్పినవి అబద్ధాలు. నిజం ఏంటంటే అమెరికా కంపెనీలు, కార్మికులు, వ్యవసాయదారులపై కెనడా విధిస్తున్న టారిఫ్‌లు ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రకటనను నమ్మొద్దని మా ప్రతినిధులకు చెప్పాను. జీ–7 సమావేశ సమయంలో ఎంతో అణకువ, మర్యాదగా నటించిన ట్రూడో నేను వెళ్లిన తరువాత తనను ఎవరూ భయపెట్టలేరని మీడియా ముందు చెప్పారు’ అని డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. టారిఫ్‌ల పెంపునకు ట్రంప్ భద్రతను సాకుగా చూపడం.. క్లిష్ట సమయాల్లో అమెరికా మిత్ర దేశాలకు మద్దతుగా నిలిచిన కెనడా మాజీ నాయకులను అవమానించడమేనని జస్టిన్ ట్రూడో మీడియా ముందు వ్యాఖ్యానించారు. ట్రంప్ ట్వీట్లపై ట్రూడో కార్యాలయం స్పందిస్తూ.. తమ ప్రధాని ఇంతకుముందు చెప్పని కొత్త విషయాలు వేటినీ చెప్పలేదని వెల్లడించింది. -
చైనా ఆధిపత్యానికి భారత్ బ్రేక్?
-
చైనా ఆధిపత్యానికి భారత్ బ్రేక్?
న్యూఢిల్లీ: అణు సరఫరా బృందం(ఎన్ఎస్ జీ)లో భారత్ సభ్యత్వానికి చైనా అడ్డు పుల్ల వేయడంతో భారత్-చైనాల మధ్య దౌత్య వాతావరణం వేడిక్కింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాద సంస్ధ జైష్-ఈ-మొహమ్మద్(జేఈఎమ్) చీఫ్ మసూద్ అజర్ పై అంతర్జాతీయ నిషేధం విధించాలని యూఎన్ లో భారత్ చేసిన ప్రపోజల్ కూ చైనా ససేమీరా అనడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు సన్నగిల్లాయి. దీంతో దక్షిణ చైనా సముద్రంపై హక్కులన్నీ తమవేనంటూ ఆధిపత్యాన్ని చెలాయించాలని చైనాకు షాక్ ఇవ్వాలని భారత్ నిర్ణయించుకుంది. దక్షిణ చైనా సముద్రంపై తమకూ హక్కులు ఉన్నాయని పేర్కొన్న ఇతర ఆసియా దేశాలతో( వియత్నాం, మలేసియా, ఫిలిప్పైన్స్, బ్రూనై) భారత్ సంబంధాలను బలపర్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. ఈ మేరకు అక్టోబర్ లో అంతర్జాతీయ ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం దక్షిణ చైనా సముద్రంపై సంయుక్త ప్రకటన చేయాలని సింగపూర్ ను భారత్ కోరినట్లు తెలిసింది. అయితే అందుకు ఆ దేశం అందుకు ససేమీరా అన్నట్లు సమాచారం. దక్షిణ చైనా సముద్రంపై తమకూ హక్కు ఉందని సింగపూర్ ఎన్నడూ ప్రకటించలేదు. భూభాగాల వివాదాల్లోకి ప్రవేశించడానికి ఆ దేశం అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో దక్షిణ చైనా సముద్రం ప్రాంతంపై హక్కు గురించి జపాన్ తో భారత్ సంయుక్త ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి షింజో అబేతో సమావేశానంతరం ఈ ప్రకటన వెలువడొచ్చు. వియత్నాంతో కలిసి కూడా భారత్ సంయుక్త ప్రకటన చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే, సంయుక్త ప్రకటన చేయాలనే మనవిపై జపాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి. దక్షిణ చైనా సముద్రంపై భారత్ తన అభిప్రాయాన్ని చెప్పాలని గత నెలలో జపాన్ పేర్కొన్న విషయం తెలిసిందే. తూర్పు చైనా సముద్రంలో చైనా మాటను కాదని జపాన్ శరవేగంగా ఎదుగుతోంది. దీంతో జపాన్-చైనాల మధ్య కూడా దౌత్యపరంగా వాతావరణం వేడెక్కింది. చైనాపై ఎలాగైనా ఒత్తిడి తీసుకురావాలని చూస్తున్న జపాన్ యూఎస్-2ఐ విమానాల ధరను తగ్గించి భారత్ కు విక్రయించాలని నిర్ణయించింది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న డ్రాగన్ దేశం ఇది మంచి విషయం కాదని వ్యాఖ్యానించింది. యాక్ట్ ఈస్ట్ పాలసీ జపాన్, వియత్నాంలతో సంబంధాలను బలపర్చుకోవడానికి భారత్ ప్రయత్నిస్తుండటం శుభపరిణామం. చైనా బాధిత దేశాలైన కొన్ని ఆసియా దేశాలతో రక్షణ, భద్రత అంశాల్లో కీలక ఒప్పందాలు చేసుకోవడానికి భారత్ యత్నిస్తోంది. జపాన్ కూడా వియత్నాంతో సంబంధాలను బలపర్చునే యత్నాలు చేస్తుండటంతో దక్షిణ చైనా సముద్రం తమదేనన్న చైనా ఆటలు సాగకపోవచ్చు. -
బీజేపీ తీరుపై అగ్రనేతల ఫైర్
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాభవం నేపథ్యంలో బీజేపీ తీరును తప్పబడుతూ ఆ పార్టీ అగ్రనేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఢిల్లీ ఎన్నికల్లో దారుణ పరాభవం నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని బిహార్ ఫలితాలు చాటుతున్నాయని బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీమనోహర్ జోషి, శాంతకుమార్, యశ్వంత్ సిన్హా మంగళవారం రాత్రి ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. బిహార్‌లో ఓటమికి ప్రతి ఒక్కరిది బాధ్యత అని చెప్పడం తప్పించుకోవడమే అవుతుందని, విజయం వస్తే క్రెడిట్ తీసుకోడానికి ముందుకొచ్చే వాళ్లే.. ఓటమి బాధ్యత నుంచి తప్పించుకోజూస్తున్నట్టు కనిపిస్తున్నదని ఈ ప్రకటనలో అగ్రనేతలు తీవ్రంగా మండిపడ్డారు. 'గత ఏడాది కాలంగా పార్టీలో కనిపిస్తున్న నీరసమైన విధానమే తాజా ఓటమికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. తాజా ఓటమికి కారణాలు తెలుసుకోవడానికి సమగ్ర సమీక్ష జరుపాల్సిన అవసరముంది' అని అగ్రనేతలు పేర్కొన్నారు.