బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాభవం నేపథ్యంలో బీజేపీ తీరును తప్పబడుతూ ఆ పార్టీ అగ్రనేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు.
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాభవం నేపథ్యంలో బీజేపీ తీరును తప్పబడుతూ ఆ పార్టీ అగ్రనేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఢిల్లీ ఎన్నికల్లో దారుణ పరాభవం నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని బిహార్ ఫలితాలు చాటుతున్నాయని బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్ జోషి, శాంతకుమార్, యశ్వంత్ సిన్హా మంగళవారం రాత్రి ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.
బిహార్‌లో ఓటమికి ప్రతి ఒక్కరిది బాధ్యత అని చెప్పడం తప్పించుకోవడమే అవుతుందని, విజయం వస్తే క్రెడిట్ తీసుకోడానికి ముందుకొచ్చే వాళ్లే.. ఓటమి బాధ్యత నుంచి తప్పించుకోజూస్తున్నట్టు కనిపిస్తున్నదని ఈ ప్రకటనలో అగ్రనేతలు తీవ్రంగా మండిపడ్డారు. 'గత ఏడాది కాలంగా పార్టీలో కనిపిస్తున్న నీరసమైన విధానమే తాజా ఓటమికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. తాజా ఓటమికి కారణాలు తెలుసుకోవడానికి సమగ్ర సమీక్ష జరుపాల్సిన అవసరముంది' అని అగ్రనేతలు పేర్కొన్నారు.