Yashwant Sinha
-
బహీ ఖాతా తరహా పౌచ్‌లో బడ్జెట్ ట్యాబ్
న్యూఢిల్లీ: కట్టలకొద్దీ బడ్జెట్ ప్రతులతో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టే సంస్కృతికి ఫుల్స్టాప్ పడి చాలా కాలమైంది. కాగితరహితమైన బడ్జెట్‌ను ఈసారీ విత్తమంత్రి నిర్మల విశిష్టమైన బహీ ఖాతా తరహాలో ఎరుపు రంగు పౌచ్‌లో ట్యాబ్‌ను తీసుకొచ్చారు. బ్రీఫ్‌కేస్ విధానాన్ని వదిలేసి గత మూడేళ్లుగా ఆమె ఇలాగే పౌచ్‌లోనే ట్యాబ్‌ను తీసుకొస్తున్నారు. బడ్జెట్ ప్రసంగం చేయడానికి పార్లమెంట్‌కు రావడానికి ముందు ఆమె కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయం బయట సహాయ మంత్రులు, శాఖ ఉన్నతాధికారులతో ట్యాబ్ పట్టుకుని గ్రూప్ ఫొటో దిగారు. 2020 లోనూ ఆమె బహీ ఖాతానే తెచ్చారు. 2021లో తొలిసారిగా పౌచ్‌లో ట్యాబ్‌ను పట్టుకొచ్చారు. అదే సంస్కృతిని ఈసారీ కొనసాగించారు. 2019లో సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌తో కలుపుకుంటే 2014 ఏడాది నుంచి మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 12వ బడ్జెట్ ఇది. నిర్మలకు ఇది ఆరో బడ్జెట్. దశాబ్దాలుగా బడ్జెట్‌ను సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశపెట్టేవారు. ఈ ఆనవాయితీకి వాజ్‌పేయీ చెల్లుచీటీ ఇచ్చారు. వాజ్‌పేయీ హయాంలో నాటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆనాటి నుంచి అదే సంస్కృతి కొనసాగుతోంది. బడ్జెట్ వివరాలను బ్రీఫ్‌కేస్‌కు బదులు బహీఖాతాలో తీసుకురావడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం స్పందించారు. ‘‘ఈ సంస్కృతి ఇలాగే కొనసాగుతోంది. భవిష్యత్తులో మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అయితే ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ఐప్యాడ్‌లోనే తీసుకొస్తారు’’అని వ్యాఖ్యానించారు. -
Draupadi Murmu: ద్రౌపది ముర్ముకు యశ్వంత్ సిన్హా శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ద్రౌపది ముర్ముకు.. ఆమె చేతిలో ఓడిపోయిన విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా శుభాకాంక్షలు తెలిపారు. భారత 15వ రాష్ట్రపతి ఎవరికీ భయపడకుండా, ఎలాంటి పక్షపాతం లేకుండా రాజ్యాంగానికి కట్టుబడి బాధ్యతలు నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. దేశ ప్రజలతో పాటు తాను కూడా ముర్ముకు అభినందనలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. I join my fellow citizens in congratulating Smt Droupadi Murmu on her victory in the Presidential Election 2022. India hopes that as the 15th President of the Republic she functions as the Custodian of the Constitution without fear or favour. pic.twitter.com/0gG3pdvTor — Yashwant Sinha (@YashwantSinha) July 21, 2022 రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము తిరుగులేని మెజార్టీతో గెలుపొందారు. విజయం అనంతరం ఆమెకు ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు, ఇతర రాజకీయ నాయకులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చదవండి: కొత్త చరిత్ర.. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము -
అత్యధిక మెజారిటీతో గెలిచిన రాష్ట్రపతి ఎవరో తెలుసా?
దేశానికి 15వ రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగుస్తుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నిర్వహించింది. 21న ఓట్ల లెక్కింపు జరిగింది. ద్రౌపది ముర్ము తన ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికలపై విహంగ వీక్షణం.. స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతిగా డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ సేవలు అందించారు. రెండు పర్యాయాలు రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి ఆయనే కావడం విశేషం. అంతేకాదు అత్యధిక మెజారిటీతో గెలిచిన రికార్డు కూడా ఆయన పేరిటే ఉంది. కాగా, 1950 జనవరి 26న రాజేంద్రప్రసాద్‌ను రాష్ట్రపతిగా ఎన్నికైనట్టు రాజ్యాంగం ధ్రువీకరించింది. కేంద్ర ఎన్నికల సంఘం 1952లో తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. స్వతంత్ర భారత మొట్ట మొదటి ఉప రాష్ట్రపతిగా పనిచేసిన ప్రముఖ తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్.. 1962లో రెండో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. జాకిర్ హుస్సేన్ 1967లో మూడవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దురదృష్టవశాత్తు పదవీలో ఉండగానే 1969, మే 3న ఆయన కన్నుమూశారు. జాకిర్ హుస్సేన్ మరణంతో 1969లో జరిగిన ఎన్నికల్లో వరాహగిరి వేంకటగిరి నాలుగో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచిన తొలి రాష్ట్రపతిగా ఆయన చరిత్ర కెక్కారు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్.. భారత ఐదో రాష్ట్రపతిగా పనిచేశారు. పదవిలో ఉండగానే 1977, ఫిబ్రవరి 11న మరణించారు. ఏకగ్రీవంగా రాష్ట్రపతి పదవిని దక్కించుకున్న ఘనత నీలం సంజీవరెడ్డికి దక్కింది. 1977 నాటి ఎన్నికల్లో పోటీలో ఉన్న 37 మందిలో సంజీవరెడ్డి నామినేషన్ మినహా మరెవరిదీ చెల్లకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జ్ఞానీ జైల్ సింగ్ 1982లో దేశానికి 7వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ప్రథమ పౌరుడిగా ఎన్నికైన ఏకైక సిక్కుగా ఆయన ఖ్యాతికెక్కారు. ఆర్. వెంకట్రామన్ దేశానికి 8వ రాష్ట్రపతిగా సేవలు అందించారు. ఆయన హయాంలోనే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల శకం ఆరంభమైంది. శంకర్‌దయాళ్ శర్మ 1992లో దేశానికి 9వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన ఉపరాష్ట్రపతిగానూ సేవలు అందించారు. దేశానికి తొలి దళిత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మొదటి ప్రెసిడెంట్‌గా గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. 1998 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి పదవిలో ఉండి ఓటు వేసిన మొదటి రాష్ట్రపతిగా ఖ్యాతికెక్కారు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్‌గా పేరుగాంచిన ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి 11వ రాష్ట్రపతిగా విశేష సేవలు అందించారు. ప్రజల రాష్ట్రపతిగా మెలిగిన ఆయన రాష్ట్రపతి కార్యాలయాన్ని సామాన్యులకు చేరువ చేశారు. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించిన తొలి మహిళ ప్రతిభా పాటిల్. అంతకుముందు ఆమె రాజస్థాన్ గవర్నర్‌గా పనిచేశారు. రాష్ట్రపతి పనిచేసిన కాలంలో ఆమె పలు రకాల విమర్శలు ఎదుర్కొన్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ప్రణబ్ ముఖర్జీ దేశానికి 13వ రాష్ట్రపతిగా 2012లో ఎన్నికయ్యారు. దేశ అత్యున్నత పురస్కారం పొందిన ఆరుగురు రాష్ట్రపతుల్లో ఆయన ఒకరు. ప్రణబ్ హయాంలోనే రాష్ట్రపతి భవన్ ట్విటర్ ఖాతా ప్రారంభమైంది. దేశానికి రెండో దళిత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. అంతకుముందు బిహార్ రాష్ట్రానికి గవర్నర్‌గా ఆయన పనిచేశారు. ఈ ఏడాది జూలై 24తో రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. (క్లిక్: భారత పౌరసత్వం వదులుకుంటున్న ప్రవాసులు!) -
రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
-
ద్రౌపది ముర్మును గుర్తు పట్టారా.. ఫొటోలో ఎక్కడున్నారో చెప్పండి చూద్దాం!
Draupadi Murmu.. కొద్ది గంటల్లో కాబోయే రాష్ట్రపతి ఎవరు అనేది తేలిపోనుంది. 15వ రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. కాగా, ఈ ఎన్నికల్లో ఎన్డీయే అనూహ్యంగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము(64)ను అభ్యర్థిగా నిలిపిన విషయం తెలిసిందే. దీంతో, ఆమె ఫ్యామిలీ వివరాలు, జీవన విధానంపై భారతీయలు ఆరా తీశారు. అయితే, తాజాగా ఆమె కాలేజ్ డేస్‌లో దిగిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ద్రౌపది ముర్ము స్వగ్రామం.. ఒరిస్సా మయూర్భంజ్లోని రాయంగ్పూర్లో ఉన్న తన ఇంట్లో ఆమె తన ఫ్యామిలీతో దిగిన ఫొటో నెటిజన్లు ఆకట్టుకుంటోంది. ద్రౌపది ముర్ము.. ఫొటోలో వెనుక వరుసలో కుడి నుండి మొదటిగా నిలబడి ఉన్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రపతి ఎన్నికల్లో విజయావకాశాలు ముర్ముకే ఎక్కువగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ క్రమంలో.. ముర్ము స్వగ్రామంలో మాత్రం పండుగ వాతావరణం నెలకొంది. ద్రౌపది ముర్ము విజయం ఖాయమని భావిస్తున్న రాయ్‌రంగ్‌పూర్ గ్రామ పెద్దలు 20వేలకు పైగా స్పెషల్ లడ్డూలు తయారు చేయించారు. అంతేకాదు.. కోయ డ్యాన్సులతో బాణాసంచాలతో సంబురాలకు సర్వం సిద్ధం చేశారు. -
Presidential Election 2022: ద్రౌపది ముర్ము ఘన విజయం
Presidential Election 2022 Result Live: అప్డేట్స్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. 07:50 మూడో రౌండ్లోనూ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆధిక్యంలో ఉన్నారు. మూడు రౌండ్లలో కలిపి ఆమె సగానికి పైగా ఓట్లు సాధించారు. ద్రౌపది ముర్ముకు 5,77,777 ఓట్ల విలువ యశ్వంత్ సిన్హాకు 2,61, 062 ఓట్ల విలువ పోలైంది. 05:30 రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము భారీ అధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్లోనూ ద్రౌపది ముర్ము ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్లో పది రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్లను లెక్కించారు. 1,138 ఓట్లు చెల్లుబాటు కాగా.. వాటి మొత్తం విలువ 1,49,575.. ఇందులో ద్రౌపది ముర్ముకు1,05,299 విలువగల 809 ఓట్లు. యశ్వంత్ సిన్హాకు 44,276 విలువ గల 329 ఓట్లు పడ్డాయి. ద్రౌపది ముర్ముకు పోలైన ఓట్లు చూస్తుంటే అంచనాలకు మించి మెజార్జీతో గెలిచే అవకాశం కనిపిస్తోంది.. 75 శాతానికిపైగా ఓట్లు సాధించనున్నట్లు తెలుస్తోంది. రాత్రి 8 గంటల వరకు ఓట్ల లెక్కింపు కొనసాగే అవకాశం ఉంది 03: 00PM రాష్ట్రపతి ఎన్నికలో ఎంపీ ఓట్ల లెక్కింపు ముగిసింది. కాసేపట్లో ఎమ్మెల్యేల ఓట్లు లెక్కించనున్నారు. ద్రౌపది ముర్ముకు 62 శాతానికి పైగా ఓట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. 02: 50PM రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి రౌండ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో ద్రౌపది ముర్ము ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు 540 ఎంపీ ఓట్లు రాగా.. సిన్హాకు 208 ఎంపీ ఓట్లు పడ్డాయి. ఓటు విలువ ముర్ముకు 3,78,00 ఉండగా , యశ్వంత్ సిన్హాకు 1,45,600 గా ఉంది. చెల్లని ఎంపీ ఓట్లు 15గా తేలాయి. మొత్తం 4809 ఓటర్లలో 776 మంది ఎంపీలు, 4033 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సోమవారం జరిగిన ఎన్నికలో దాదాపు 99 శాతం మంది ఓటేశారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీపడిన విషయం తెలిసిందే. కాగా ముర్ముకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 1:50PM కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు 11:00AM రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం పార్లమెంట్ భవనంలో మొదలైన కౌంటింగ్ రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు దేశానికి 15వ రాష్ట్రపతి ఎవరవుతారో మరికొద్దిసేపట్లో తేలిపోనుంది. రాష్ట్రపతి ఎన్నికలో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్లమెంట్ హౌస్‌లోని 63వ నంబర్ గదిలో గురువారం ఉదయం 11 గంటలకు లెక్కింపు ప్రారంభం అయ్యింది. అన్ని రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను పార్లమెంట్ హౌస్‌లో లెక్కిస్తున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24న ముగియనుంది. నూతన రాష్ట్రపతి ఈ నెల 25న ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు యశ్వంత్ సిన్హా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ముర్ము విజయం సాధించడం లాంఛనమేనని రాజకీయ పండితులు తేల్చిచెబుతున్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ (ఫొటోలు)
-
రాష్ట్రపతి ఎన్నికలు.. ఢిల్లీలో ఓటేసిన కేంద్ర మంత్రులు, ఎంపీలు
-
సిన్హాకు బదులు ద్రౌపది ముర్ముకు ఓటేసిన సీతక్క..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. తెలంగాణలో ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఓటు వేసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.. ఓటింగ్‌లో భాగంగా తప్పిదం చేశారు. ప్రతిపక్షాల బలపరిచిన యశ్వంత్ సిన్హాకు కాకుండా ఎన్డీయే బలపరచిన ద్రౌపది ముర్ముకు ఆమె ఓటేశారు. కాగా, తాను పొరపాటున ముర్ముకు ఓటు వేసినట్టు అధికారులకు సీతక్క తెలిపారు. ఈ క్రమంలో మళ్లీ ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులను కోరింది. కాగా, నిబంధనల ప్రకారం మరోసారి అవకాశం ఇవ్వలేమని అధికారులు సీతక్కకు చెప్పారు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని సీతక్క తెలిపారు. అనంతరం సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఓటు వేయడంలో ఎలాంటి తప్పులు దొర్లలేదు. ఎన్నికల అధికారి ఇచ్చిన పెన్ ఇంక్ బ్యాలెట్ పేపర్ మీద పడింది. బ్యాలెట్ పేపర్‌పై ఇంక్ పడటంతో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాను. కొత్త బ్యాలెట్ పేపర్ ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇంక్ పడిన బ్యాలెట్ పేపర్‌నే బాక్స్‌లో వేశాను. నా ఆత్మ సాక్షిగా నేను వేయాల్సిన వారికే ఓటు వేశాను. ఓటు వేయడంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఓటు చెల్లుతుందా లేదా అనేది వాళ్ళకే తెలియాలి’’ అని అన్నారు. ఇది కూడా చదవండి: ఓటు హక్కు వినియోగించుకోనున్న కేసీఆర్ -
Presidential Elections 2022 In TS: ఓటేయని మంత్రి గంగుల
► తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 119 ఎమ్మెల్యేలలో 117 మంది ఓటేశారు. మంత్రి గంగుల కమలాకర్ రెడ్డి, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. . ఇప్పటి వరకు 116 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. ఈ నెల 21న ఎన్నిక ఫలితాలను ప్రకటిస్తారు. 25న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. ► రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్లు సైతం ఓటు వేశారు. ► రాష్టప్రతి ఎన్నికల్లో ఇప్పటి వరకు తెలంగాణ అసెంబ్లీలో 116 మంది ఎమ్మెల్యే లు తమ ఓటు వినియోగించుకున్నారు. ఇంకా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, గంగుల కమలాకర్, చెన్నమనేని రమేష్‌లు ఓటు వేయలేదు. కోవిడ్ కారణంగా సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఓటు వేయనున్నారు గంగుల కమలాకర్. ► రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అసెంబ్లీకి చేరుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటి వరకు మొత్తం 111 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► రాష్టప్రతి ఎన్నికలకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో ఇప్పటి వరకు 120 ఓట్లకు గాను 85 ఓట్లు పోలింగ్ పూర్తయింది. ► వరంగల్ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. హైదరాబాద్‌కు వస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీలో రాష్ట్రపతి ఎన్నికల ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. ఏరియల్ సర్వేకు వెళ్లకుండానే హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. ► ఏపీకి చెందిన కందుకూరు వైస్సార్సీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీదర్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ఓటు వేశారు. ► తెలంగాణ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి , మల్లారెడ్డి సహా పలువురు టిఆర్ఎస్ ఎమ్మెల్యే లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► తెలంగాణలో మొదటగా ఓటేసిన మంత్రి కేటీఆర్ ► రాష్ట్రపతి ఎన్నికలు 2022 పోలింగ్ కోసం తెలంగాణలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తెలంగాణ భవన్లో టీఆరెస్ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ ద్వారా అవగాహన కల్పించే బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీసుకున్నారు. తెలంగాణ భవన్ నుంచి ఒకేసారి ఎమ్మెల్యేలను తరలించేందుకు మూడు బస్సులను ఏర్పాటు చేశారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా టీఆరెస్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. పింక్ బ్యాలెట్ ఉండటంతో కన్ఫ్యూజ్ లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ► గంగుల కమలాకర్‌కు కరోనా పాజిటివ్ కావడంతో.. అందరి ఓటింగ్ అయ్యాక ఆఖరిలో ఆయన ఓటేస్తారు. ► రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కు సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తెలంగాణ కు సంబంధించిన ఎంపీలంతా పార్లమెంట్ లోనే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్యేలంతా తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పొలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ► తెలంగాణ కు సంబంధించిన 119 ఎమ్మెల్యే లతో పాటు ఏపీకి చెందిన కందుకూరు వైస్సార్సీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీదర్ రెడ్డి కూడా తెలంగాణ అసెంబ్లీ లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ► ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. భారత ప్రభుత్వం గుర్తించిన 22 అధికార భాషలలో ఏదైనా ఓక దానితో తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎంపీ లకు గ్రీన్ ,ఎమ్మెల్యే లకు పింక్ బ్యాలెట్ పత్రాలు ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ లో జరిగే రాష్టప్రతి ఎన్నికల్లో టిఆర్ఎస్ తరుపున ఎమ్మెల్యే లు ఆళ్ళ వెంకటేశ్వర్ రెడ్డి , హన్మంతు షిండే, కాంగ్రెస్ పోలింగ్ ఏజెంట్‌గా ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. బీజేపీ తరపున ఎమ్మెల్యే రఘునందన్ రావు పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించనున్నారు. -
ఏపీ: ఓటు హక్కు వినియోగించుకున్న 173 మంది ఎమ్మెల్యేలు
►రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ముగిసింది. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఏపీలో 173 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 151 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేలు బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ►రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎన్.వెంకట్ గౌడ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరితో కలుపుకొని ఇప్పటి వరకు మొత్తం 169 మంది శాసనసభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మంత్రి పినిపే విశ్వరూప్, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, ఎం.శంకర్ నారాయణ తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరితో కలుపుకొని ఇప్పటివరకు మొత్తం 167 మంది శాసనసభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొత్తం 175 మంది శాసన సభ్యుల్లో 161 మంది శాసనసభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంకా 14 మంది శాసన సభ్యులు ఓటు వేయాల్సి ఉంది. ► ఓటు వేసిన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ► ఓటు వేసిన పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా, హోం శాఖ మంత్రి తానేటి వనిత ► ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓటు వేశారు. ► ఏపీ అసెంబ్లీలో 174 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు వేయనున్నారు. ► ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, స్పీకర్ తమ్మినేని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు వేస్తారు. ► ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకి వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. ► టీడీపీ కూడా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకే మద్దతు తెలిపింది. 15వ రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం బ్యాలెట్ బ్యాక్సులను ఇప్పటికే రాష్ట్రాలకు తరలించింది. ఈ ఎన్నికల్లో 4,809 మంది ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు సోమవారం తమ ఓటు వేయనున్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో, రాష్ట్రాల్లో అసెంబ్లీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 21న పార్లమెంట్‌హౌస్‌లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నూతన రాష్ట్రపతి 25న ప్రమాణస్వీకారం చేస్తారు. -
ఈనెల 21 రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ అప్డేట్స్.. ► రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు ఓటేయగా.. రాష్ట్రాల అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల ఫలితాలు 21న విడుదల కానున్నాయి. జూలై 25న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ► పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలోని అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. West Bengal CM Mamata Banerjee arrives at the State Assembly in Kolkata to cast her vote for the #PresidentialElections pic.twitter.com/iEo8uweSLy — ANI (@ANI) July 18, 2022 ► పార్లమెంట్లో ఓటేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ Delhi | Union Minister & BJP MP Dharmendra Pradhan casts his vote in the Parliament for the Presidential polls pic.twitter.com/kZ3fW7Bl7M — ANI (@ANI) July 18, 2022 ►రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ Delhi | Congress MP Rahul Gandhi casts his vote for the Presidential elections pic.twitter.com/J9LE2hKmiQ — ANI (@ANI) July 18, 2022 ► ఢిల్లీ ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. Delhi | AAP MP Harbhajan Singh & BJP MP Gautam Gambhir cast their votes for the Presidential polls pic.twitter.com/BBicynFPZl — ANI (@ANI) July 18, 2022 ►రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలో పోలింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ శశి థరూర్, దిగ్విజయ్ సింగ్, మల్లికార్జున ఖర్గే పార్లమెంటులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. Delhi | Congress MPs Sonia Gandhi, Shashi Tharoor, and Mallikarjun Kharge cast their votes for the Presidential polls pic.twitter.com/7KoiIkOMGE — ANI (@ANI) July 18, 2022 ►ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ధన్కర్ అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన ఉపరాష్ట్రపతి అవుతాడని తనకు ఖచ్చితంగా తెలుసన్నారు. "I am certain that he will be an excellent and inspiring Vice President," PM Modi after accompanying NDA's VP candidate Jagdeep Dhankhar for nomination filing pic.twitter.com/HgODAiADxe — ANI (@ANI) July 18, 2022 ► ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేసిన ఎన్సీపీ ఎమ్మెల్యే. గుజరాత్‌కు చెందిన ఏకైక ఎన్సీపీ ఎమ్మెల్యే కంధాల్ ఎస్ జడేజా ద్రౌపది ముర్ముకు ఓటు వేశారు. Gujarat | NCP MLA Kandhal S Jadeja says he has voted for NDA's presidential candidate Droupadi Murmu pic.twitter.com/dorgGuOQqT — ANI (@ANI) July 18, 2022 ► రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, కాంగ్రెస్ ఎంపీ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్. Defence Minister Rajnath Singh, Union Law Minister Kiren Rijiju, Congress MP Randeep Singh Surjewala and Samajwadi Party MP Jaya Bachchan cast their votes for the Presidential polls in Delhi pic.twitter.com/ReE4IkCwRt — ANI (@ANI) July 18, 2022 ► రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ I've voted for the #PresidentialElections. We hope that NDA's candidate Droupadi Murmu will get maximum votes from our state: Assam CM Himanta Biswa Sarma pic.twitter.com/6R0M7VWAgu — ANI (@ANI) July 18, 2022 ►రాష్టపతి ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలో కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవీయ, హర్దీప్ సింగ్ పూరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరితోపాటు ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఢిల్లీలో ఓటేశారు. Union Ministers Mansukh Mandaviya, Hardeep Singh Puri, Samajwadi Party's Mulayam Singh Yadav and NCP chief Sharad Pawar cast their votes for the #PresidentialPolls in Delhi pic.twitter.com/awpERyDYvZ — ANI (@ANI) July 18, 2022 ►హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ చండీగఢ్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. Chandigarh | Haryana CM Manohar Lal Khattar casts his vote for Presidential elections pic.twitter.com/fKlRUxbwC9 — ANI (@ANI) July 18, 2022 ► కేరళ అసెంబ్లీలో ఓటు వేసిన ముఖ్యమంత్రి పినరయి విజయన్ Kerala Chief Minister Pinarayi Vijayan casts his vote for the Presidential election, at the State Assembly in Thiruvananthapuram. pic.twitter.com/7NxGRMIn81 — ANI (@ANI) July 18, 2022 ► పార్లమెంట్లో ఓటు వేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా Delhi | Union Home Minister Amit Shah cast his vote for the Presidential election, at Parliament. pic.twitter.com/BKINSA0WZy — ANI (@ANI) July 18, 2022 ► ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్కర్ #WATCH | Delhi: NDA's Vice Presidential candidate Jagdeep Dhankhar arrives at the Parliament Library Building. He will file his nomination today. pic.twitter.com/DC3wkaNURp — ANI (@ANI) July 18, 2022 ► ఓటు వేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ Delhi CM Arvind Kejriwal casts his vote for the Presidential election, at Delhi Assembly. pic.twitter.com/rikMFXanJ5 — ANI (@ANI) July 18, 2022 ► భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీల్ చేర్ వచ్చిన మన్మోహన్ పార్లమెంట్లో తన ఓటు వేశారు. Former Prime Minister of India and Congress MP Manmohan Singh, after casting his vote in the election being held for the post of President of India in Parliament pic.twitter.com/pm4Bihza1Z — ANI (@ANI) July 18, 2022 ► పార్లమెంట్లో ఓటు వేసిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ Delhi | Union Minister and BJP MP Anurag Thakur casts his vote in the election being held for the post of President of India, in Parliament pic.twitter.com/EGPLZBOGdZ — ANI (@ANI) July 18, 2022 ► ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రులు.. Odisha CM Naveen Patnaik votes in the 16th Presidential election, at the State Assembly in Bhubaneswar. pic.twitter.com/lvGxtuct9i — ANI (@ANI) July 18, 2022 Rajasthan CM Ashok Gehlot casts his vote for the Presidential election, at the State Assembly in Jaipur. pic.twitter.com/jqNsu5suYu — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 18, 2022 Madhya Pradesh CM Shivraj Singh Chouhan casts his vote for the Presidential election, at the State Assembly in Bhopal. pic.twitter.com/ssobmZ1ocm — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 18, 2022 Dehradun | Uttarakhand CM Pushkar Singh Dhami votes in the 16th Presidential election pic.twitter.com/B5yWLVjnjJ — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 18, 2022 ► ఓటు వేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ► యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. అసెంబ్లీలో ఓటు వేశారు. #WATCH Uttar Pradesh CM Yogi Adityanath casts vote to elect new President, in Lucknow#PresidentialElection pic.twitter.com/VDJ4WZIPp7 — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 18, 2022 ► భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. #WATCH Prime Minister Narendra Modi votes to elect new President, in Delhi#PresidentialElection pic.twitter.com/pm9fstL46T — ANI (@ANI) July 18, 2022 ► కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు సీఎం స్టాలిన్. ఆయన నేరుగా అసెంబ్లీకి వెళ్లి రాష్ట్రపతి ఎన్నిక కోసం ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH Tamil Nadu CM MK Stalin casts vote in 16th Presidential election, in Chennai pic.twitter.com/fmFb9sdw49 — ANI (@ANI) July 18, 2022 ► రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ మొదలైంది. సోమవారం ఉదయం 10 గంటలకు పోలింగ్‌ను ప్రారంభించారు. ఎంపీలు పార్లమెంట్లో, ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో ఓటు వేయడం మొదలుపెట్టారు. సాయంత్రం 5 గం. వరకు ఓటింగ్ జరగనుంది. ► సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరుగుతుంది. ఫలానా అభ్యర్థికే ఓటేయాలంటూ పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయలేవు. కాబట్టి క్రాస్ ఓటింగ్‌కు అవకాశముంటుంది. ► జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ లేనందున ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 నుంచి 700కు తగ్గింది. ఇక ఎమ్మెల్యేల ఓటు విలువలో 208తో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 176తో జార్ఖండ్, తమిళనాడు రెండోస్థానంలో, 175తో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉన్నాయి. సిక్కిం ఎమ్మెల్యేల ఓటు విలువ అతి తక్కువగా 7గా ఉంది. ► 1971 జనాభా లెక్కల ప్రకారం ఎమ్మెల్యేలు, ఎంపీల ఓటు విలువను నిర్ధారించారు. జనాభా, శాసనసభ స్థానాల ఆధారంగా ఎమ్మెల్యేల ఓటు విలువ ఉంది. ► గ్రీన్ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎంపీలు, పింక్ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ► ఏపీ, తెలంగాణకు చెందిన ఎంపీలు పార్లమెంట్లో ఓటు వేయనున్నారు. ► దేశ ప్రథమ పౌరుడు, 15వ రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం బ్యాలెట్ బ్యాక్సులను ఇప్పటికే రాష్ట్రాలకు తరలించింది. ఈ ఎన్నికల్లో 4,809 మంది ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు సోమవారం తమ ఓటు వేయనున్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో, రాష్ట్రాల్లో అసెంబ్లీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 21న పార్లమెంట్‌హౌస్‌లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నూతన రాష్ట్రపతి 25న ప్రమాణస్వీకారం చేస్తారు. -
Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నిక నేడే
న్యూఢిల్లీ: దేశ 15వ రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. 4,800 మందికి పైగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు సోమవారం ఓటు వేయనున్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో, రాష్ట్రాల్లో అసెంబ్లీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదింటి దాకా పోలింగ్ జరుగుతుంది. బ్యాలెట్ బాక్సులను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే రాష్ట్ర్రాలకు తరలించడంతో పాటు అన్ని ఏర్పాట్లూ చేసింది. 21న పార్లమెంట్‌హౌస్‌లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నూతన రాష్ట్రపతి 25న ప్రమాణస్వీకారం చేస్తారు. ఎన్డీఏ తరఫున గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, విపక్షాల నుంచి యశ్వంత్ సిన్హా బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏకంగా 60 శాతానికి పైగా ఓట్లు కూడగట్టుకున్న ముర్ము మూడింట రెండొంతుల మెజారిటీ సాధించేలా కన్పిస్తున్నారు. మొత్తం 10,86,431 ఓట్లలో ఆమెకు 6.67 లక్షల పై చిలుకు ఓట్లు ఇప్పటికే ఖాయమయ్యాయి. దాంతో సునాయాసంగా విజయం సాధించి రాష్ట్రపతి పదవికి ఎన్నికైన తొలి గిరిజన మహిళగా ముర్ము రికార్డు సృష్టించనున్నారు. అంతేగాక ప్రతిభా పాటిల్ తర్వాత ఈ అత్యున్నత పదవి చేపట్టనున్న రెండో మహిళ అవుతారు. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఎన్నికైన పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు ఉంటారు. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది. నామినేటెడ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులకు ఓటు హక్కుండదు. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరుగుతుంది. ఫలానా అభ్యర్థికే ఓటేయాలంటూ పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయలేవు. కాబట్టి క్రాస్ ఓటింగ్‌కు అవకాశముంటుంది. జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ లేనందున ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 నుంచి 700కు తగ్గింది. ఇక ఎమ్మెల్యేల ఓటు విలువలో 208తో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 176తో జార్ఖండ్, తమిళనాడు రెండోస్థానంలో, 175తో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉన్నాయి. సిక్కిం ఎమ్మెల్యేల ఓటు విలువ అతి తక్కువగా 7గా ఉంది. -
ద్రౌపది ముర్ముపై తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక విపక్షలా అభ్యర్థగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. కాగా, ఈ ఎన్నికలకు జూలై 18న ఓటింగ్ నిర్వహిస్తారు. జూలై 21న ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. ఇదిలా ఉండగా.. అధికార బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడంపై ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తేజస్వీ యాదవ్ ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి భవనంలో విగ్రహం ఉండాల్సిన అవసరం లేదు. ఎన్డీయే మద్దతున్న రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఇప్పటి వరకు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించలేదు. కనీసం అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత కూడా ఆమె మాట్లాడలేదు. అందుకే రాష్ట్రపతి భవన్లో ‘విగ్రహం’ అవసరం లేదంటూ ఆమెపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా మాత్రం మాట్లాడటం అందరూ చూసే ఉంటారని వ్యాఖ్యానించారు. కాగా, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తేజస్వీ యాదవ్ ఇప్పటికే.. మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఇక, ద్రౌపది ముర్ము ఎంపికపై ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ కుమార్ కూడా విమర్శలు చేశారు. #WATCH | You don't need a 'Murti' (statue) in Rashtrapati Bhawan...You must have heard Yashwant Sinha Ji speaking, but not Centre's Presidential candidate... not a single presser by her since her candidature was announced: Tejashwi Yadav, RJD (16.07) pic.twitter.com/VKn38nNi9r — ANI (@ANI) July 17, 2022 ఇది కూడా చదవండి: వ్యవ'సాయం'పై..అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు -
ద్రౌపది ముర్ము అంటే గౌరవమే, కానీ..
ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలకు మరో రెండు రోజులే మిగిలి ఉండడంతో.. మద్దతు విషయంలో పార్టీలన్నీ ఒక స్పష్టతకు వచ్చేస్తున్నాయి. దేశంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీగా రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. రెండు రాష్ట్రాల్లో కలిపి పది రాజ్యసభ ఎంపీలను కలిగి ఉంది. ఈ తరుణంలో ఆప్ మద్దతు ఎవరికనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. ఆమ్ ఆద్మీ పార్టీ తమ మద్దతు విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకే అని ప్రకటించింది. ఈ మేరకు ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ శనివారం ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము అంటే మా సభ్యులందరికీ ఒక గౌరవం ఉంది . కానీ, మా మద్దతు మాత్రం యశ్వంత్ సిన్హాగారికే అని.. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ భేటీ తర్వాత సంజయ్ సింగ్ ప్రకటించారు. AAP के राष्ट्रीय संयोजक व दिल्ली के मा.मुख्यमंत्री @ArvindKejriwal जी की अध्यक्षता में पार्टी PAC की बैठक हुई। PAC ने राष्ट्रपति चुनाव में विपक्ष के उम्मीदवार श्री यशवंत सिन्हा जी का समर्थन करने का निर्णय लिया है। हम श्रीमती द्रोपदी मुर्मू का भी सम्मान करते हैं। pic.twitter.com/ViZAUw82QS — Sanjay Singh AAP (@SanjayAzadSln) July 16, 2022 రాష్ట్రపతి ఎన్నిక జులై 18న జరుగుతుండగా.. 21వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నామినేషన్ సమయానికే ద్రౌపది ముర్ముకు 50 శాతం ఓటింగ్ దక్కింది. ఆపై బీజేపీ, వైఎస్సార్సీపీ, బీజేడీ, బీఎస్పీ, శిరోమణి అకాలీ దల్, శివసేన లాంటి పార్టీల మద్దతు తర్వాత ఇప్పటికే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి 60 శాతం దాటింది. మరోవైపు కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, టీఆర్ఎస్ తదితర పార్టీల మద్దతుతో బరిలో దిగనున్నారు యశ్వంత్ సిన్హా. -
బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. మోదీతో క్లోజ్‌గా సీఎం.. షాక్‌లో కాంగ్రెస్!
న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకే తమ మద్దతు అని సీఎం హేమంత్ సోరెన్ సారథ్యంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ప్రకటించడంపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. మిత్రపక్షం కాంగ్రెస్ యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించగా.. దానికి విరుద్ధంగా జేఎంఎం వ్యవహరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అంతేకాదు ఇటీవల జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌లో నూతన విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లారు. ఆ సమయంలో సీఎం హేమంత్ సోరెన్ ఆయనతో సన్నిహితంగా మెలిగారు. ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'కేంద్రం మద్దతు ఉంటే ఐదేళ్లతో జార్ఖండ్ పురోగతి సాధిస్తుంది. ఇది జార్ఖండ్ చరిత్రలో చారిత్రక రోజు. కేంద్రం, రాష్ట్రం మధ్య సహకారం ఉంటే అభివృద్ధి వేగంగా జరగడం సాధ్యమవుతుంది.' అని మోదీ వేదికపై ఉన్నప్పుడు సోరెన్ అన్నారు. అంతేకాదు మోదీ రావడానికి ఒక రోజు ముందే దేవ్‌ఘర్ వెళ్లి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. దీంతో జేఎంఎం బీజేపీతో జతకడుతుందని, కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుంటుందనే ప్రచారం జోరందుకుంది. అయితే జేఎంఎం నాయకులు మాత్రం అలాంటిదేం లేదని చెబుతున్నారు. ప్రోటోకాల్‌లో భాగంగానే ప్రధానితో సీఎం వేదికను పంచుకున్నారని పేర్కొన్నారు. ముర్ముకు ఘన స్వాగతం రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరుతూ ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము జులై 4న జార్ఖండ్ వెళ్లారు. ఆ రోజు సీఎం సోరెన్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. స్వతంత్ర భారతదేశంలో తొలిసారి ఓ ట్రైబల్ మహిళ రాష్ట్రపతి కాబోతున్నారని, అందుకే తమ పూర్తి మద్దతు ముర్ముకు ఉంటుందని జేఎంఎం ప్రకటించింది. దీంతో కాంగ్రెస్‌కు ఎటూ పాలుపోని పరిస్థితి నెలకొంది. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం యశ్వంత్ సిన్హా జులై 16న జార్ఖండ్‌కు వెళ్లనున్నారు. ఆ రోజు జేఎంఎం రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది. జార్ఖండ్‌లో ట్రైబల్ ఓటర్లే చాలా కీలకం. జేఎంఎం కూడా పూర్తిగా వారిపైనే ఆధారపడి ఉంది. అందుకే మిత్రపక్షం కాంగ్రెస్‌కు విరుద్ధంగా ట్రైబల్ మహిళ ద్రౌపది ముర్ముకు మద్దతుగా నిలుస్తోంది. 2019లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జేఎంఎం 30 సీట్లు, కాంగ్రెస్ 16 సీట్లు గెలుచుకుని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బీజేపీ 26 స్థానాలు కైవసం చేసుకుంది. మరో ఐదు చోట్ల ఇతరులు గెలుపొందారు. చదవండి: జాతీయ పార్టీలపై కోవిడ్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన విరాళాలు -
పార్టీ విధానాలు పాటించని వారిని గోడకేసి కొడతాం
సాక్షి, హైదరాబాద్: పార్టీ నిబంధనలు బేఖాతరు చేసినవారు, పార్టీ విధానాలను పాటించనివారు ఎంతటివారైనా గోడకేసి కొడతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను సీనియర్ నేత వి.హన్మంతరావు బేగంపేట విమానాశ్రయంలో కలిసిన విషయాన్ని మీడియా ప్రతినిధులు రేవంత్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెళ్లిన విషయం తనకు తెలియదని, అది ఆయన వ్యక్తిగతం కావచ్చని అన్నారు. అయితే, సిన్హాను కలవకూడదని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు సమాచారం ఇచ్చినట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్ ఐమాక్స్ చౌరస్తాలో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి కట్టిన టీఆర్ఎస్ జెండాలను తొలగించేందుకు వెళ్లిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి ఠాణాకు తరలించారు. ఆయనను పరామర్శించేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన రేవంత్ మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్ కంపెనీల నుంచి వచ్చిన కమీషన్ల సొమ్ముతో బీజేపీ రాష్ట్రంలో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తోందని ఆరోపించారు. పునర్విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకపోవడంపై మోదీని కేసీఆర్ ఏ రోజుకూడా ప్రశ్నించలేదని, దీనిపై ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన హామీలపై నిలదీయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీల చిల్లర పంచాయితీతో దృష్టి మరలుస్తున్నారని ఆరోపించారు. కేంద్రం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచితే కనీసం స్పందించడంలేదని, రాష్ట్రంలో తగ్గించే అవకాశం ఉన్నా పట్టించుకున్న పాపానపోలేదని ఘాటుగా విమర్శించారు. ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కట్టిన టీఆర్ఎస్ జెండాలను తొలగిస్తే మళ్లీ కట్టారని, ఇది చిల్లర రాజకీయం కాదా, సంస్కారం ఉందా అని ప్రశ్నించారు. వంటలు చేసే యాదమ్మ తెలంగాణను మోసం చేసిన మోదీతోపాటు బీజేపీ నేతలకు సలాక ఎర్రగా కాల్చివాతలు పెట్టాలని రేవంత్ కోరారు. కలవబోమని ముందే చెప్పాం రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న యశ్వంత్ సిన్హా టీఆర్ఎస్ను ముందుగా కలిస్తే, తాము కలిసేది లేదని ముందే చెప్పామని రేవంత్ స్పష్టం చేశారు. యశ్వంత్ సిన్హాకు పార్టీ ఆదేశాల ప్రకారం ఓటు వేస్తామని, కానీ కేసీఆర్‌ను కలిసిన ఎవరితోనూ తాము ఎట్టి పరిస్థితుల్లో కలిసే ప్రసక్తే లేదని వెల్లడించారు. -
కాంగ్రెస్‌లో కల్లోలం: వీహెచ్ వ్యవహారంపై రేవంత్‌రెడ్డి సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో గందరగోళం నెలకొంది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను కాంగ్రెస్ నేతలు కలవలేదు. కానీ టీపీసీసీ ఆదేశాలను పక్కనపెట్టి సిన్హాను వీహెచ్ కలిశారు. ఆయన వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: బీజేపీ సిద్ధమైతే.. అందుకు మేమూ రెడీ: మంత్రి తలసాని సిన్హాను కలవబోమని ముందే టీపీసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీని నిర్ణయాన్ని ఎవ్వరైనా పాటించాల్సిందేనని.. పార్టీ నిర్ణయం కాదని వ్యక్తిగతంగా మాట్లాడితే గోడకేసి కొడతామని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆ ఇంటిపై వాలిన కాకిని మా ఇంటిపై వాలనీయం’’ అంటూ ధ్వజమెత్తారు. మన ఇంటికి వచ్చినప్పుడే మనం కలవాలని రేవంత్‌రెడ్డి అన్నారు. -
ఇది రెండు భావజాలాల మధ్య పోరు
సాక్షి, హైదరాబాద్: ‘భారతదేశం పతనం బాటలో సాగుతోంది. ఈ పతనం మన కళ్లముందే జరుగుతోంది. ప్రస్తుతం జరిగే రాష్ట్రపతి ఎన్నిక రెండు భావజాలాల మధ్య జరిగే యుద్ధం. రాష్ట్రపతి ఎన్నికను పక్కన పెడితే దేశాన్ని నాశనం కానిద్దామా?’అని రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా ప్రశ్నించారు. సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నేతృత్వంలో శనివారం జరిగిన టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఘర్షణ వాతావరణంపైనే ప్రధానికి విశ్వాసం ‘ప్రధానిపై వ్యక్తిగత ద్వేషం లేదు. నామినేషన్ తర్వాత ఫోన్ చేసి, మెసేజ్ పంపినా నేటికీ స్పందన లేదు. ఇది దేశ ప్రధానికి గౌరవాన్ని ఇచ్చే సంప్రదాయం ఎంత మాత్రమూ కాదు. ఈ ఎన్నిక చాలా అసాధారణ పరిస్థితుల్లో జరుగుతోంది. ఆదివాసీ మహిళ పోటీ చేస్తున్న సందర్భంలో ఏకాభిప్రాయ సాధన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ముఖ్యమంత్రులు, విపక్ష నేతలతో మాట్లాడాల్సిన ప్రధాని అ దిశగా చొరవ తీసుకోవడం లేదు. ఎందుకంటే ప్రధానికి ఏకాభిప్రాయ సాధనకంటే ఘర్షణ వాతావరణంపైనే ఎక్కువ విశ్వాసం ఉంది. ఇతరులను అవమానించడం ఆయనకు అలవాటుగా మారింది. ఆయన డిక్షనరీలో ఏకాభిప్రాయమనే పదమే లేదు. దేశంలో రెండో పక్షంలో ఉన్నవారికి గౌరవం ఉండదా? అందుకే రాష్ట్రపతి ఎన్నిక ఇద్దరి వ్యక్తుల నడుమ కొట్లాట కాదు.. రెండు భావజాలాల నడుమ జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధాన్ని మీ సహకారంతో చేస్తున్నా. యుద్ధానికి వెళ్లినపుడు ఎంత పెద్ద కత్తి ఉంది, ఎంత పెద్ద సైన్యం ఉందనేది చూడకుండా మన వద్ద ఉన్న ఆయుధంతో పోరాడుతాం. మన దేశంలో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే నెలకొని ఉంది..’అని సిన్హా చెప్పారు. పోరాటం కొనసాగుతుంది.. ‘ఆల్ట్ న్యూస్ జుబేర్‌ను వైషమ్యాలు పెంచుతున్నారని జైలులో పెట్టారు. కానీ బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై చట్టబద్ధవిచారణేదీ మొదలవలేదు. దీనిపై ప్రధాని మౌనం పాటిస్తున్నారు. మన్ కీ బాత్ అంటూ ప్రసంగాలు చేసే ప్రధాని ఎనిమిదేళ్లలో ఒక్క మీడియా సమావేశంలోనూ మాట్లాడలేదు. అంటే ఒక్కడు మాట్లాడితే 140 కోట్ల భారతీయులు వినాలా? దీనికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం ప్రజా ఉద్యమంగా మారుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఫలితం ఏదైనా చింత లేదు. ఈ పోరాటం ఎన్నిక తర్వాత కూడా కొనసాగుతుంది..’అని తెలిపారు. తెలంగాణలో అద్భుతాలు ‘సీఎం కేసీఆర్‌తో కలిసి దేశవ్యాప్త పోరాటానికి సిద్ధం. ఎన్నికల తర్వాత మళ్లీ కేసీఆర్‌తో కలిసి మాట్లాడి పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలో చర్చిస్తాం. 14 ఏళ్ల పోరాటంతో తెలంగాణను సాధించి తెచ్చుకున్న రాష్ట్రంలో కేసీఆర్ తక్కువ సమయంలో అద్భుతాలు చేసి చూపించారు. కేవలం ఒక్కడిగానే పోరాడి కేసీఆర్ తెలంగాణ సాధించారు. దేశం నాశనం కాకుండా జరుగుతున్న పోరాటం హైదరాబాద్ నుంచే ప్రారంభమైంది. రాష్ట్రపతి భవన్లో అడుగుపెట్టాక రాజ్యాంగం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడటమే ప్రథమ కర్తవ్యంగా పనిచేస్తా. దేశంలో చర్చలు జరగకపోవడం దురదృష్టకరం. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న కాలంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినా ఎన్నడూ విపక్షాలు, రాజకీయ శత్రువుల అణచివేతకు ఈడీ వంటి సంస్థలను ఉపయోగించాలనే కనీస ఆలోచన కూడా రాలేదు. ప్రజాస్వామ్యాన్ని సురక్షితంగా ఉంచేందుకు రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కూడా పోరాడుతాం..’అని యశ్వంత్ సిన్హా స్పష్టం చేశారు. -
యశ్వంత్ గెలుస్తారనే ఆశాభావం ఉంది: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతిగా మంచి వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని, భారత రాజకీయాల్లో యశ్వంత్ సిన్హా గొప్ప వ్యక్తి అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. శనివారం జలవిహార్‌లో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. యశ్వంత్ సిన్హాకు తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం తరపున హైదరాబాద్‌కు స్వాగతం. భారత రాజకీయాల్లో యశ్వంత్‌సిన్హా గొప్ప వ్యక్తి. న్యాయవాదిగా ఆయన తన ప్రస్థానం మొదలుపెట్టి.. అధికారిగా ఆపై రాజకీయ వేత్తగా ఎదిగారు. అధికారిగా, రాజనీతిజ్ఞుడిగా తనను తాను నిరూపించుకున్నారు. తన పనితీరుతో అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉంది. అందుకే.. పార్లమెంటేరియన్లంతా ఆత్మ ప్రభోదానుసారం యశ్వంత్ సిన్హాకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు సీఎం కేసీఆర్. రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ లాంటి మంచి నేతను ఎన్నుకోవడం అదృష్టం. సమున్నత వ్యక్తిత్వం ఉన్న యశ్వంత్ సిన్హా గెలుస్తారనే నమ్మకం ఉంది. ఆయన గెలవాలని మనసారా కోరుకుంటున్నట్లు.. తద్వారా దేశ గౌరవం రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు. మోదీపై విసుర్లు ప్రధాని మోదీ రెండు రోజులపాటు హైదరాబాద్‌లో ఉండబోతున్నారు. రేపు ఆయన సభలో మా గురించి బాగా మాట్లాడబోతున్నారు. విపక్ష నేతలపై తప్పుడు ఆరోపణలు చేయబోతున్నారు. మోదీ తనను తాను అత్యంత మేధావిగా భావిస్తారు. ఎన్నికలప్పుడు తియ్యటి మాటలు మాట్లాడతారు. రేపు మోదీ తన ప్రసంగంతో నన్ను చీల్చి చెండాడబోతున్నారు. వ్యక్తిగతంగా ఆయనతో నాకు విబేధాలు లేవు. మీలో ప్రవహించే రక్తంలో కొంతైనా నిజాయితీ ఉంటే.. మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఇచ్చిన హామీ ఒక్కటైనా నెరవేరిందా? రైతులు, ఉగ్రవాదులు, వేర్పాటు వాదులుగా కనిపిస్తున్నారా?. రైతులను ఉగ్రవాదులు, ఖలీస్థానీలు అన్నారు. రైతు చట్టాలు సరైనవే అయినప్పుడు వెనక్కి ఎందుకు తీసుకున్నారు?. రైతుల ఆదాయం రెట్టింపు అన్నారు.. అది జరగలేదు. పెట్టుబడులు పెరిగిపోయాయి. దేశం ముందు మీరు(ప్రధాని మోదీని ఉద్దేశించి..) తలదించుకున్నారు. దేశ ప్రజలను తల దించుకునేలా చేశారు. మీ పాలనలో రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలు ఇలా.. ఏ వర్గం సంతోషంగా లేదు. ప్రభుత్వ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. శ్రీలంకకు వెళ్లినప్పుడు.. ప్రధానిలా కాకుండా సేల్స్‌మ్యాన్‌లా వ్యవహరించారు. మీరు దోషి కాకుంటే రేపటి సభలో సమాధానం ఇవ్వండి. మీ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. దేశం నుంచి పెద్ద కంపెనీలు వెళ్లిపోతున్నాయి. మేం మౌనంగా ఉండం.. పోరాటాలు చేస్తాం. ప్రసంగాలు కాదు.. మేం అడిగేవాటికి సమాధానం ఇవ్వాలని సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. -
హైదరాబాద్‌కు యశ్వంత్‌సిన్హా.. ర్యాలీలో సీఎం కేసీఆర్!
సాక్షి, హైదరాబాద్: దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు ఇవాళ నగరం వేదిక అయ్యింది. ఒకవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని మోదీ రాక నేపథ్యంలో.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సైతం నగరంలో పర్యటించి ప్రచారం చేయనున్నారు. సీఎం కేసీఆర్ సైతం ఈ ప్రచారంలో పాల్గొనడం విశేషం. శనివారం ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న యశ్వంత్‌సిన్హాకు ఘన స్వాగతం లభించింది. సీఎం కేసీఆర్, మంత్రులు స్వాగతం పలికారు. బేగంపేట నుంచి జలవిహార్ వరకు జరిగే ర్యాలీలో సిన్హాతో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో జలవిహార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాని మోదీ హైదరాబాద్‌కు గత ఆరునెలలో మూడు సార్లు వచ్చారు. ఏ సందర్భంలోనూ ప్రొటోకాల్ ప్రకారం.. సీఎం కేసీఆర్ ప్రధానికి ఆహ్వానం పలకలేదు. ఈ తరుణంలో.. యశ్వంత్ సిన్హాకు మద్ధతు ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆయన వెంట వందల మంది కార్యకర్తలతో కలిసి నిర్వహిస్తున్న బైక్ ర్యాలీలో పాల్గొంటుడడం, ప్రచారసభలో ప్రసంగిస్తుండడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు బీజేపీ ఫ్లెక్సీలు, పోస్టర్లకు దీటుగా నగరం మొత్తం టీఆర్ఎస్ సైతం పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించింది. దీనిపై రగడ నడుస్తోండగా.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సైతం టీఆర్ఎస్పై మండిపడ్డారు. Hyderabad | CM's son cannot become CM. BJP is getting stronger, they (TRS) are scared that their chair will go. They're misusing public money to advertise against us. KCR is indulging in digressed politics in Telangana: Union Minister, G Kishan Reddy pic.twitter.com/7zZjCDaNTl — ANI (@ANI) July 2, 2022 -
President election 2022: రాష్ట్రపతి బరిలో ముర్ము, సిన్హా
న్యూఢిల్లీ: ఈ నెల 18వ తేదీన జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల బరిలో అధికార ఎన్డీఏ, ప్రతిపక్షాల తరఫున నామినేషన్లు వేసిన ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హాలు బరిలో మిగిలారు. నామినేషన్ల పరిశీలన అనంతరం గురువారం రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ ఈ విషయం ప్రకటించారు. ఆఖరి రోజైన బుధవారం వరకు 94 మంది 115 నామినేషన్లు వేశారన్నారు. నిర్ణీత ప్రమాణాల మేరకు లేని కారణంగా వీటిలో 107 నామినేషన్లను తిరస్కరించామన్నారు. ముర్ము, సిన్హాలు దాఖలు చేసిన నాలుగేసి సెట్ల చొప్పున నామినేషన్ పత్రాలు నిర్దేశిత అన్ని వివరాలతో ఉన్నందున వీటిని ఆమోదించినట్లు వివరించారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈ నెల 2వ తేదీతో ముగుస్తుందని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత గెజిట్‌లో ప్రచురిస్తామన్నారు. ముర్ము, సిన్హాతోపాటుగా రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ వేసిన వారిలో పలువురు సామాన్యులు కూడా ఉన్నారు. ముంబై మురికి వాడ వాసి, తమిళనాడుకు చెందిన సామాజిక కార్యకర్త, ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్‌తోపాటు ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ తరఫున ఈసారి నామినేషన్లు పడ్డాయి. -
సిన్హాకు ఘన స్వాగతానికి టీఆర్ఎస్ సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దిగిన యశ్వంత్ సిన్హా ప్రచారంలో భాగంగా ఈ నెల 2న హైదరాబాద్‌కు వస్తున్నారు. సిన్హా అభ్యర్థిత్వానికి ఇప్పటికే మద్దతు ప్రకటించిన టీఆర్ఎస్ ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు గురువారం గ్రేటర్ పరిధిలోని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. సిన్హా ప్రచార కమిటీ సభ్యుడు, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డితో పాటు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈ భేటీలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మైనంపల్లి హన్మంతరావు, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి గద్వాల తదితరులు కూడా హాజ రయ్యారు. యశ్వంత్ సిన్హాకు స్వాగత సన్నాహాలు, ఆయనతో సమావేశానికి సంబంధించిన ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతను మంత్రి తలసానికి అప్పగించాలని నిర్ణయించారు. స్వాగతం పలకనున్న సీఎం కేసీఆర్ గతంలో ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేసిన రామ్‌నాథ్ కోవింద్‌కు స్వాగతం పలికిన రీతిలోనే యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నెల 2వ తేదీ ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకునే సిన్హాకు సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు స్వయంగా స్వాగతం పలుకుతారు. ఎయిర్‌పోర్టు నుంచి రాజ్‌భవన్ మీదుగా నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్ వరకు పది వేల బైక్‌లతో ర్యాలీ నిర్వహిస్తారు. జల విహార్‌లో జరిగే సమావేశానికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఓటు హక్కు లేకున్నా పార్టీ ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లను కూడా ఆహ్వానించారు. అక్కడే భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత సీఎం కేసీఆర్ ప్రసంగం, ఆ తర్వాత యశ్వంత్ సిన్హా ప్రసంగం ఉంటుంది. తన పర్యటనలో భాగంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలను కూడా సిన్హా కలిసే అవకాశమున్నట్లు సమాచారం. కాగా కేటీఆర్‌తో భేటీ అనంతరం మంత్రులు, ఇతర నేతలు జల విహార్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. -
జూలై 2న తెలంగాణకు యశ్వంత్ సిన్హా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా జూలై 2న రాష్ట్ర పర్యటనకు రానున్నారు. యశ్వంత్ అభ్యర్థిత్వానికి టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. 2న ఉదయం 11.30 గంటలకు నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకోనున్న యశ్వంత్ సిన్హా.. మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతి ఎన్నికలో ఓటర్లుగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఈ భేటీకి అధ్యక్షత వహిస్తారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో లంచ్ భేటీ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో కాకుండా మరోచోట ఉంటుందని సమాచారం. ఎక్కడ సమావేశమయ్యేది ఒకటి రెండు రోజుల్లో వెల్లడిస్తామని యశ్వంత్ సిన్హా ప్రచార కమిటీ సభ్యుడు, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా సిన్హాకు మద్దతునిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతోనూ ఆయన విడిగా భేటీ కానున్నారు. చదవండి: Presidential Elections 2022: ప్రాతినిధ్యమే రాజకీయంగా కీలకం -
సిన్హా ఇప్పుడు ముర్మును అని ఏమి లాభం?
ద్రౌపది ముర్ము 64 ఏండ్ల ఆదివాసీ విద్యాధికురాలు. రాష్ట్రపతి రేస్‌లో అకస్మాత్తుగా ఎన్డీయే అభ్యర్థిగా తెర మీదికి వచ్చారు. ఆమె పేరు ప్రకటించడమే ప్రతిపక్షాలను ఎందుకు అంతగా కలవరపరిచిందో ఆశ్చర్యం వేసింది. భారతీయ జనతా పార్టీ ఇటువంటి ప్రయోగాలు అనేకం చేసి రాటు తేలిపోయింది. 2014లో ప్రధానిగా రేసులో ఉన్న నరేంద్ర మోదీ తాను ఒక బీసీ బిడ్డననీ, రాజకీయ అణచివేత, అస్పృశ్యతను అనుభవించినవాడిననీ చెప్పుకున్నారు. తరాలుగా ప్రజాప్రతినిధులుగా ఎదిగే అవకాశాల్లో తీవ్ర అణచివేతనూ, అవకాశ లేమినీ అనుభవిస్తున్న ఒక పెద్ద వర్గం నరేంద్రమోదీని మోసిన ఫలితం అందరం కళ్ళతో చూసినం. ప్రతిపక్షాలు రాష్ట్రపతి స్వతంత్రత పెరగాలని... విస్తృత ప్రజా సంబంధాలు, దేశం శక్తిమంతం అయ్యే రాజ్యాంగ వ్యవస్థల కోసం నిలబడి, కలబడే వ్యక్తిని ముందే వెతికి ప్రకటిస్తే చర్చ ముర్ము చుట్టు కాకుండా మరోలా ఉండేది. రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో ఎక్కువ ఓట్లు తమకు ఉన్నప్పుడు విస్తృత ఆమోదంతో అభ్యర్థిని ముందే ప్రకటించడంతో పాటు మద్దతును కూడగడితే బాగుండేది. వాజ్‌పేయి గవర్నమెంట్లో మంత్రిగా పనిచేసిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్, బీజేపీతో సుదీర్ఘ అనుబంధం, ప్రయాణం ఉన్న యశ్వంత్ సిన్హా పేరును ప్రతిపక్షాలు ప్రకటించాయి. ద్రౌపది ముర్ము పేరు ప్రకటనతో మర్మం ఏదైనా ధర్మమేనేమో అనే సాఫ్ట్‌కార్నర్ అప్పుడే ఏర్పడడం మనం గమనిస్తున్నాం. ముర్మును బ్రాండింగ్ చేయడం మోదీ వెంటనే మొదలు పెట్టినారు. ఆదివాసీని ప్రకటించి ఏం లాభం...? ఆమె రబ్బర్ స్టాంప్ మాత్రమే కదా అన్నవాళ్లు వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అభ్యర్థి కావాలని ఎందుకు అంగలార్చారు? మాయావతి రాష్ట్రపతి కోసమే బీజేపీతో సఖ్యంగా ఉంటోందని ప్రచారం కొంత మంది ఎందుకు చేశారు? గోపాలకృష్ణ గాంధీని, శరద్‌పవార్‌ను అడిగినవాళ్లు మాయావతిని ఎందుకు అడగలేదు? ప్రధానమంత్రి కావాలని కోరుకున్న చమార్ ఆడబిడ్డ రాష్ట్రపతి అభ్యర్థిగా ఉంటే చర్చవేరే తీరుగా ఉండేది కదా? గత అనుభవం ప్రకారం ఏ గవర్నర్, రాష్ట్రపతి అభ్యర్థీ... తమ వర్గాల, లేదా వ్యవస్థల కోసం ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని నిలదీస్తారని ఎవరూ ఆశించడం లేదు. అది వర్తమానంలో ఒక విషాదం. ఆదివాసీలకు ముర్ము ఏంచేశారు? అని రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ప్రశ్నించడం గురువిందగింజ సామెతకు పదిరెట్లు అపహాస్యంగా ఉంటుంది. బీజేపీలో అన్ని పదవులూ అనుభవించి కొడుకుకు ప్రాతినిధ్యం కోసం బయటకు వచ్చి, తన పదవీ కాలంలో ఒక రాజ్యాంగ విలువ గురించీ, ఏ ఒక్క వ్యవస్థల పతనం, అమ్మకాల గురించీ మాట్లాడని సిన్హా ఇప్పుడు ముర్మును అని ఏమి లాభం? (క్లిక్: ఆదివాసీ రాష్ట్రపతి కావడానికి ఇన్నేళ్లా?) దేశ స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు జరుగుతున్నవేళ మునుపెన్నడూ లేనంత అణచివేత, దోపిడీ ఆదివాసీలపై కొనసాగుతోంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై మొదటి సాయుధ తిరుగుబాటు చేసిన సంతాల్ తెగ వారసురాలు ద్రౌపది ముర్ము... ఇప్పుడు ఆదివాసీల సమస్యలకు కనీసం పునఃసమీక్ష అవసరమని ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తుందని కూడా ఎవరూ ఆశించకున్నా... ఆమే ఒడిషాలోని మయూర్భంజ్ నుండి 280 కిలోమీటర్లు రోడ్డు వెంట భువనేవ్వర్ చేరినప్పుడు వెల్లివెరిసిన ఆనందాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రాతినిధ్యం కనీస సవ్య పొందికను కలిగి ఉండాలని అణగారిన వర్గాలు కోరుకుంటున్నాయని గుర్తించమంటున్నాం. భవిష్యత్తులో ఏ రాజకీయ పదవికైనా పోటీ వచ్చినప్పుడు ‘గేమ్ చేంజర్’ నిర్ణయాలు ఉంటాయని గమనించమంటున్నాం. - డా. చెరుకు సుధాకర్ వ్యాసకర్త తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు