
Draupadi Murmu.. కొద్ది గంటల్లో కాబోయే రాష్ట్రపతి ఎవరు అనేది తేలిపోనుంది. 15వ రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. కాగా, ఈ ఎన్నికల్లో ఎన్డీయే అనూహ్యంగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము(64)ను అభ్యర్థిగా నిలిపిన విషయం తెలిసిందే. దీంతో, ఆమె ఫ్యామిలీ వివరాలు, జీవన విధానంపై భారతీయలు ఆరా తీశారు.
అయితే, తాజాగా ఆమె కాలేజ్ డేస్‌లో దిగిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ద్రౌపది ముర్ము స్వగ్రామం.. ఒరిస్సా మయూర్‌భంజ్‌లోని రాయంగ్‌పూర్‌లో ఉన్న తన ఇంట్లో ఆమె తన ఫ్యామిలీతో దిగిన ఫొటో నెటిజన్లు ఆకట్టుకుంటోంది. ద్రౌపది ముర్ము.. ఫొటోలో వెనుక వరుసలో కుడి నుండి మొదటిగా నిలబడి ఉన్నారు.
ఇదిలా ఉండగా.. రాష్ట్రపతి ఎన్నికల్లో విజయావకాశాలు ముర్ముకే ఎక్కువగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ క్రమంలో.. ముర్ము స్వగ్రామంలో మాత్రం పండుగ వాతావరణం నెలకొంది. ద్రౌపది ముర్ము విజయం ఖాయమని భావిస్తున్న రాయ్‌రంగ్‌పూర్ గ్రామ పెద్దలు 20వేలకు పైగా స్పెషల్ లడ్డూలు తయారు చేయించారు. అంతేకాదు.. కోయ డ్యాన్సులతో బాణాసంచాలతో సంబురాలకు సర్వం సిద్ధం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment