Indian President Election 2022 In Telangana LIVE Updates & News - Sakshi
Sakshi News home page

Presidential Elections 2022 In TS: ఓటేయని మంత్రి గంగుల

Published Mon, Jul 18 2022 9:51 AM | Last Updated on Mon, Jul 18 2022 5:09 PM

Presidential Elections 2022 Telangana Polling updates - Sakshi

తెలంగాణ అసెంబ్లీ క‌మిటీ హాల్‌లో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక పోలింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా ముగిసింది. మొత్తం 119 ఎమ్మెల్యేలలో 117 మంది ఓటేశారు. మంత్రి గంగుల కమలాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. . ఇప్ప‌టి వ‌ర‌కు 116 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. ఈ నెల 21న ఎన్నిక ఫలితాలను ప్రకటిస్తారు. 25న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌లు సైతం ఓటు వేశారు. 

రాష్టప్రతి ఎన్నికల్లో ఇప్పటి వరకు తెలంగాణ అసెంబ్లీలో 116 మంది ఎమ్మెల్యే లు తమ ఓటు వినియోగించుకున్నారు. ఇంకా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, గంగుల కమలాకర్, చెన్నమనేని రమేష్‍లు ఓటు వేయలేదు. కోవిడ్ కారణంగా సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఓటు వేయనున్నారు గంగుల కమలాకర్.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అసెంబ్లీకి చేరుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఇప్పటి వరకు మొత్తం 111 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

► రాష్టప్రతి ఎన్నికలకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో ఇప్పటి వరకు 120 ఓట్లకు గాను 85 ఓట్లు పోలింగ్‌ పూర్తయింది. 

► వరంగల్‌ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌.. హైదరాబాద్‌కు వస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీలో రాష్ట్రపతి ఎన్నికల ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. ఏరియల్‌ సర్వేకు వెళ్లకుండానే హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు.

► ఏపీకి చెందిన కందుకూరు వైస్సార్‌సీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీదర్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ఓటు వేశారు. 

► తెలంగాణ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి , మల్లారెడ్డి సహా పలువురు టిఆర్ఎస్ ఎమ్మెల్యే లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

► తెలంగాణలో మొదటగా ఓటేసిన మంత్రి కేటీఆర్‌

► రాష్ట్రపతి ఎన్నికలు 2022  పోలింగ్‌ కోసం తెలంగాణలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తెలంగాణ భవన్‌లో టీఆరెస్ ఎమ్మెల్యేలకు మాక్‌ పోలింగ్‌ ద్వారా అవగాహన కల్పించే బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీసుకున్నారు.

తెలంగాణ భవన్ నుంచి ఒకేసారి ఎమ్మెల్యేలను తరలించేందుకు మూడు బస్సులను ఏర్పాటు చేశారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా టీఆరెస్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. పింక్ బ్యాలెట్ ఉండటంతో కన్ఫ్యూజ్ లేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చెప్తున్నారు.

గంగుల కమలాకర్‌కు కరోనా పాజిటివ్ కావడంతో.. అందరి ఓటింగ్‌ అయ్యాక ఆఖరిలో ఆయన ఓటేస్తారు. 

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కు సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తెలంగాణ కు సంబంధించిన ఎంపీలంతా పార్లమెంట్ లోనే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్యేలంతా  తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పొలింగ్ బూత్‌లో  తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 

తెలంగాణ కు సంబంధించిన 119 ఎమ్మెల్యే లతో పాటు ఏపీకి చెందిన కందుకూరు వైస్సార్‌సీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీదర్ రెడ్డి కూడా తెలంగాణ అసెంబ్లీ లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 

ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. భారత ప్రభుత్వం గుర్తించిన 22 అధికార భాషలలో ఏదైనా ఓక దానితో తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎంపీ లకు గ్రీన్ ,ఎమ్మెల్యే లకు పింక్ బ్యాలెట్ పత్రాలు ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ లో జరిగే రాష్టప్రతి ఎన్నికల్లో టిఆర్ఎస్ తరుపున ఎమ్మెల్యే లు ఆళ్ళ వెంకటేశ్వర్ రెడ్డి , హన్మంతు షిండే, కాంగ్రెస్ పోలింగ్ ఏజెంట్‌గా ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. బీజేపీ తరపున ఎమ్మెల్యే రఘునందన్ రావు పోలింగ్‌ ఏజెంట్లుగా వ్యవహరించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement