మన్మోహన్ సింగ్ 'సర్రోగసి' ప్రధాని: యశ్వంత్ సిన్హా
మన్మోహన్ సింగ్ సర్రోగసి ప్రధాని అంటూ బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పదేళ్ల తన హయాంలో మన్మోహన్ సింగ్ ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేకపోవడం సర్రోగసికి ఉదాహరణ అని ఆయన అన్నారు. భారత్ ను సర్రోగసి పాలిస్తోందనడంలో వాస్తవం ఉంది అని సిన్హా అన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు భారత ప్రధానులందరూ లోకసభ సభ్యులైన తర్వాతే ప్రధాని పీఠం ఎక్కారని ఆయన తెలిపారు.
ఇందిరాగాంధీ ప్రధాని బాధ్యతలు చేపట్టే సమయానికి రాజ్యసభ సభ్యులని.. అయితే ఆతర్వాత ఆమె లోకసభ ఎంపికయ్యారన్నారు. ప్రధాని మన్మోహన్ ఒక్కరే పదేళ్ల కాలం ప్రధాని పదవి చేపట్టి.. ఒక్క ఎలక్షన్ లో కూడా పోటి చేయని వ్యక్తిగా చరిత్రలో మిగిలారని ఎద్దేవా చేశారు. ప్రధాని మన్మోహన్ కు సర్రోగసి అనే పదాన్ని ఉపయోగించడం తప్పేమి కాదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ లో పాల్గొన్న యశ్వంత్ సిన్హా ప్రధానిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.