Surrogacy
-
సరోగసీ కోసం వచ్చి.. ఆపై పారిపోదామనుకొని..
గచ్చిబౌలి: పిల్లల్లేని జంటకు సరోగసీ (అద్దెగర్భం) ద్వారా బిడ్డను కని ఇచ్చే ఒప్పందంపై హైదరాబాద్ వచ్చిన ఓ యువతి ప్రమాదవశాత్తూ ఓ బహుళ అంతస్తుల భవనంలోని 9వ అంతస్తు నుంచి జారిపడి మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. నాలెడ్జ్ సిటీలోని మై హోం భూజ ఈ–బ్లాక్‌లోని 9వ అంతస్తు ఫ్లాట్ నంబర్ 901లో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన రాజేష్ బాబు (54), జయలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. వారికి సంతానం లేకపోవడంతో అద్దె గర్భం (సరోగసీ) ద్వారా సంతానం పొందాలనుకున్నారు. ఇందుకోసం రాజేష్ బాబు తన స్నేహితుడి ద్వారా శ్రీకాకుళానికి చెందిన సందీప్ అనే మధ్యవర్తిని సంప్రదించగా అతను ఒడిశాకు చెందిన సంజయ్ సింగ్‌ను సంప్రదించాడు. అందుకు సంజయ్ తన భార్య ఆశ్రిత సింగ్ (25)ను ఒప్పించాడు. దీంతో సరోగసీ ద్వారా సంతానం కలిగితే రూ. 10 లక్షలు అశ్రితకు ఇచ్చేందుకు రాజేష్‌బాబు దంపతులు ఒప్పందం కుదుర్చుకున్నారు. మరికొన్ని రోజుల్లో సరోగసీ ప్రక్రియ.. ఆశ్రిత తన భర్త సంజయ్‌తోపాటు నాలుగేళ్ల కొడుకుతో కలిసి అక్టోబర్ 24న మై హోం భూజకు వచ్చింది. అప్పటి నుంచి వాచ్‌మన్ గదిలో సంజయ్, అతని కుమారుడు ఉంటుండగా ఒక బెడ్రూమ్లో అశ్రిత ఉంటోంది. ఈలోగా సరోగసీకి చట్టపరమైన అనుమతి కోసం రాజేష్ బాబు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఇటీవల ఆశ్రితసింగ్ను కోర్టులో హాజరుపరిచారు. డిసెంబర్ మొదటి వారంలో కోర్టు అనుమతి రావాల్సి ఉంది. అనుమతి వచి్చన అనంతరం సరోగసీ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. బాల్కనీ నుంచి దిగేందుకు చీరలను వేలాడదీసి అయితే కొన్ని రోజులుగా ఆశ్రిత తనకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని చెబుతోంది. కానీ భర్త మాత్రం ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సోమవారం రాత్రి 12 గంటల సమయంలో భర్తకు ఫోన్ చేసిన ఆశ్రిత.. వేధింపులు తాను భరించలేనని.. చనిపోతానని చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే అన్నీ సర్దుకుంటాయని భర్త సర్దిజెప్పగా ఆశ్రిత ఫోన్ కట్ చేసింది. గంట తర్వాత ఆశ్రిత మూడు చీరలను ముడేసి బాల్కనీ నుంచి కిందకు వేలాడదీసింది. చీరలను పట్టుకొని కిందకు దిగి పారిపోవాలని భావించి దిగే ప్రయత్నంలో జారి కింద పడటంతో తీవ్ర గాయాలపై అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద సమయంలో రాజేష్ దంపతులు ఓ బెడ్రూమ్లో ఉండగా మరో బెడ్రూంలో తల్లి, కేర్‌టేకర్‌గా పనిచేసే శ్రీనివాస్ కిచెన్‌లో నిద్రిస్తున్నాడు. సరోగసీకి అంగీకరించిన ఆశ్రిత మనసు మార్చుకుందా లేక రాజేష్ బాబు నుంచి వేధింపులు ఎదురయ్యాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
సరోగసీ టూరిజం నేరం
సరోగసీపై చట్టాన్ని ఇటలీ విస్తృతం చేసింది. సరోగసీ టూరిజాన్ని నేరంగా పరిగణిస్తూ చట్టం చేసింది. బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ ప్రతిపాదించిన బిల్లును సెనేట్ 58–84 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఈ చట్టం 2004 నుంచే ఇటలీలో అమలులో ఉన్న సరోగసీ నిషేధాన్ని యునైటెడ్ స్టేట్స్, కెనడా వంటి దేశాలకు వెళ్లేవారికి వర్తింపజేస్తుంది. దీనిని ఉల్లంఘించిన వారికి ఒక మిలియన్ డాలర్ల వరకు జరిమానా, రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే సరోగసీ ద్వారా జని్మంచిన పిల్లలను ఇప్పటికే దేశంలో నమోదు చేసుకున్న తల్లిదండ్రులను ఈ చట్టం ప్రభావితం చేయబోదు. అయితే తమ పిల్లలు పాఠశాలలో చేరి్పంచే సమయంలో సమస్యల పాలవుతామని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సెనేట్ నిర్ణయాన్ని ప్రధానమంత్రి జార్జియా మెలోని స్వాగతించారు. కాగా, కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ సెనేట్ దగ్గర కొందరు నిరసన ప్రదర్శనలు చేశారు. ఎల్జీబీటీక్యూ జంటలను తల్లిదండ్రులుగా మారకుండా చేసే ఈ చట్టాలు మధ్యయుగాల నాటివని విమర్శించారు. మెలోనీ 2022లో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అత్యంత సాంప్రదాయిక సామాజిక ఎజెండాను అనుసరిస్తున్నారని మండిపడ్డారు. స్వలింగ సంఘాలను చట్టబద్ధం చేసిన చివరి యురోపియన్ దేశాల్లో ఇటలీ ఒకటి. ఇటాలియన్ కేథలిక్ చర్చి ఒత్తిడితో స్వలింగ వివాహాలకు మాత్రం ఇంకా చట్టబద్ధత ఇవ్వలేదు. పోప్ ఫ్రాన్సిస్ సరోగసీపై ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రపంచ నిషేధానికి పిలుపునిచ్చారు. పిల్లలు దేవుడు ఇచ్చే బహుమతి అని, వాణిజ్య ఒప్పందం కాదని నొక్కి చెప్పారు. ఎల్జీబీటీక్యూ వ్యక్తులను చర్చికి స్వాగతిస్తూ ఫ్రాన్సిస్ చర్చి విధానాలను మార్చారు. అబార్షన్, సరోగసీలను మాత్రం బలంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ కొత్త చట్టం రాజకీయంగా మెలోనికి సవాలుగా మారవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కేంద్రం గుడ్ న్యూస్ : ఇకపై వారికీ ప్రసూతి సెలవు
కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. సరోగసీ ద్వారా సంతానం పొందే కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులు పొందవచ్చు. ఈ మేరకు కేంద్రం 50 ఏళ్ల నాటి నిబంధనకు సవరణలు ప్రకటించింది. చైల్డ్ కేర్ లీవ్‌తో అద్దె గర్భం ద్వారా బిడ్డలను పొందే తల్లిదండ్రులకు హక్కు కల్పిస్తూ కేంద్రం సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (లీవ్) రూల్స్, 1972ని సవరించింది.అద్దెగర్భం (సరోగసీ) ద్వారా పిల్లలు పుడితే మహిళా ప్రభుత్వ ఉద్యోగులు 180 రోజుల ప్రసూతి సెలవులు తీసుకోవచ్చు. అలాగే సరోగసీ ద్వారా జన్మించిన పిల్లల విషయంలో,ఇద్దరు కంటే తక్కువ జీవించి ఉన్న పిల్లలను కలిగి ఉన్నపురుష ప్రభుత్వ ఉద్యోగి కూడా బిడ్డ ప్రసవించిన తేదీ నుండి 6 నెలల వ్యవధిలో 15 రోజుల పితృత్వ సెలవు తీసుకోవచ్చు. కాగా సరోగసీ ద్వారా బిడ్డ పుడితే మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలనే నిబంధనలు ఇప్పటి వరకు లేవు. -
కొడుకు కల సాకారం కోసం...ఒక టీవీ నటి సాహసం, వైరల్ స్టోరీ
అమ్మ ఎపుడైనా అమ్మే. అమ్మకు ప్రత్యామ్నాయం లేదు. మాతృత్వపువిలువ, కన్నపేగు మమకారం తెలుసు. అందుకే కేన్సర్‌తో చనిపోయిన కొడుకుకల సాకారం కోసం పెద్ద సాహసానికి పూనుకుంది. 68 ఏళ్ల వయసులో ఒక టీవీ స్టార్ కొడుకు వీర్యంతో వారసురాలికి జన్మనిచ్చిన ఘటన సంచలనంగా మారింది. సహజంగా పిల్లలకు కనే అవకాశం లేనపుడో, మరేకారణాల రీత్యానో సరోగసీని ఆశ్రయిస్తుంటారు. కానీ కొడుకు కోసం సరోగసీని ఎందుచుకుంది స్పెయిన్ దేశానికి చెందిన టీవీ నటి అనా బ్రెగాన్. ఈమెకు అలెస్ లెక్వియో అనే కొడుకు ఉండేవాడు. అయితే దురదృష్టవశాత్తూ కేన్సర్‌తో 27 ఏళ్లకే కన్నుమూశాడు. అయితే మరణానికి ముందు అలెస్‌కు తండ్రి కావాలన్న కోరిక బలంగా ఉండేది. అందుకే తన స్పెర్మ్‌ను భ్రద (ఫ్రీజ్) పర్చుకున్నాడు. ముందస్తు ప్రమాదాన్ని ఊహించాడో ఏమో, విధి ఫలితమో గానీ కొన్నాళ్లకు కేన్సర్ బారిన పడ్డాడు. తన కల నెరవేరకుండానే చనిపోయాడు. అయితే తండ్రి కావాలన్న ఆశతో అఎస్ లెక్వియో తన వీర్యాన్ని భద్రపర్చిన విషయం ఇంట్లో లభించిన రశీదు ఆధారంగా అనా ఓబ్రెగాన్ తెలుసుకుంది. అంతే తల్లి మనసు తన కొడుకు కలసాకారం కోసం ఆరాటపడింది. దీనికి సంబంధించిన 2023లో వైద్యులను సంప్రదించింది. అన్ని పరీక్షల అనంతరం సరోగసికీ ఓబ్రెగాన్ శరీరం సహకరిస్తుందని వెల్లడించారు. దీంతో ప్రాణాలకు తెగించి మరీ కొడుకు వీర్య కణాలతో గర్భం దాల్చి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపాయికి అనిత అని పేరుపెట్టుకుంది. ఫస్ట్ బర్త్‌డే సందర్భంగా ఈ విషయాలను స్వయంగా అనా ఇన్‌స్టాలో ఫోటోలతో సహా షేర్ చేసింది. “అనితా, నీకు ఏడాది నిండింది. అగాధమైన చీకటిలో మునిగిపోయి, విపరీతమైన బాధతో ఛిద్రమైపోయిన నా హృదయాన్ని కాంతితో నింపేశాయ్... నీ చిరునవ్వు, ముద్దు ముద్దుమాటలు, నీ బుడిబుడి అడుగులు ఇవి చాలు నాకు.. మీ నాన్న నన్ను ఎంత ప్రేమతో చూసాడో అదే ప్రేమతో నన్ను చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఇప్పటివరకూ ఎవరూ నన్ను అలా చూడలేదు. ” అని పోస్ట్ చేసింది. ఇది నెటిజనుల చేత కంటతడిపెట్టిస్తోంది. View this post on Instagram A post shared by Ana_Obregon Oficial (@ana_obregon_oficial) -
సరోగసి ద్వారా బిడ్డను కంటే క్యాన్సర్ వస్తుందా? డాక్టర్లు ఏమంటారంటే..
నేను కెరీర్ ఓరియెంటెడ్. సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలనుకుంటున్నాను. దానివల్ల బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడం కుదరదు కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందా? – రంజనీ ప్రసాద్, పుణె సరోగసీ ద్వారా పిల్లల కోసం ప్లాన్ చేసినా కొంతమంది.. మందుల ద్వారా బ్రెస్ట్ ఫీడ్‌కి ట్రై చేయవచ్చు. దాన్ని లాక్టేషన్ ఇండక్షన్ అంటారు. సరోగసీ బేబీ డెలివరీ టైమ్ కన్నా ముందు నుంచే మీరు బ్రెస్ట్ ఫీడ్ ట్రై చేయడానికి ప్రిపరేషన్ చేసుకోవాలి. అందరికీ ఇది సక్సెస్ కాకపోవచ్చు. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ప్రయోజనాలు అందరికీ తెలిసినవే. ఏడాది వరకు బ్రెస్ట్ ఫీడింగ్తో నాలుగు నుంచి అయిదు శాతం వరకు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది హార్మోన్స్, జన్యుపరమైన, జీవనశైలి మీద ఆధారపడి పెరుగుతుంది. 5 నుంచి 10 శాతం జన్యుపరమైన కారణాలుంటాయి. బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వనందువల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కొంచెం మాత్రమే మారుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి.. అంటే అధిక బరువు లేకుండా, సరైన బీఎమ్ఐ ఉండేలా క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ .. పోషకాహరం తీసుకుంటూ ఉంటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. హైరిస్క్ జన్యుపరమైన కారణాలు ఉన్నవారిలో అంటే బీఆర్సీఏ (ఆఖఇఅ) జీన్ పాజిటివ్ అని స్క్రీనింగ్‌లో తేలినవారిలో ప్రాఫిలాక్టిక్ సర్జరీల ద్వారా ఆ రిస్క్‌ను తగ్గించవచ్చు. బ్రెస్ట్స్ అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ ద్వారా తొలిదశలోనే క్యాన్సర్ మార్పులను కనిపెట్టవచ్చు. ఈ రోజుల్లో సరోగసీతో పిల్లల్ని కన్నా కొన్ని మందుల ద్వారా బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చేలా బిడ్డ.. తల్లి స్పర్శ పొందేలా చూస్తున్నాం. -డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్,హైదరాబాద్ -
14 సార్లు ప్రయత్నించా.. కానీ స్టార్ హీరో వల్లే తల్లినయ్యా: బుల్లితెర నటి
కాశ్మీర షా బాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆమె హిందీతో పాటు తెలుగు, తమిళ్, భోజపురి మరాఠీ సినిమాల్లో నటించింది. ఆమె బిగ్ బాస్ 1, నాచ్ బలియే 3, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 4 షోస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. అయితే 2003లో బ్రాడ్ లిట్టర్మాన్ను పెళ్లాడిన భామ నాలుగేళ్లకే విడిపోయింది. ఆ తర్వాత 2013లో ప్రముఖ నటుడు, టీవీ హోస్ట్ కృష్ణ అభిషేక్‌ను పెళ్లి చేసుకుంది. బాలీవుడ్లో కశ్మీరా షా, కృష్ణ అభిషేక్ జంట మంచి గుర్తింపు తెచ్చుకుంది. కపిల్ శర్మ షోలో ఈ జంట చాలా సార్లు సందడి చేసిన సంగతి తెలిసందే. (ఇది చదవండి: లేటు వయసులో నటుడి పెళ్లి.. మళ్లీ హనీమూన్ కూడానా?) అయితే పెళ్లయ్యాక పిల్లల కోసం చాలా సార్లు ప్రయత్నించారు ఈ జంట. గర్భం దాల్చడానికి ఏకంగా 14 సార్లు ప్రయత్నినా వారి ప్రయత్నాలు ఫలించలేదట. ఐవీఎఫ్ ద్వారా తల్లి అయ్యేందుకు ప్రయత్నించినప్పటికీ సక్సెస్ కాలేదట. కానీ ఓ స్టార్ హీరో సలహాతోనే తాము తల్లిదండ్రులైనట్లు తెలిపింది. పిల్లల కోసం ఈ జంట పడిన కష్టాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది బాలీవుడ్ భామ. అయితే ఈ జంటకు ఇంతలోనే సల్మాన్ ఖాన్ మంచి సలహా ఇచ్చాడట. అదే వారి జీవితాలను శాశ్వతంగా మార్చేసింది. కశ్మీరా షా సరోగసీ ద్వారా బిడ్డను ప్లాన్ చేయమని సూచించాడు సల్మాన్ ఖాన్. అతని సలహాతోనే దాదాపు పెళ్లయిన నాలుగేళ్లకు కాశ్మీరా, కృష్ణ సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. అయితే కశ్మీరా గ్లామర్ కోసమే సరోగసీని ఎంచుకుందని కొందరు ట్రోల్స్ కూడా చేశారు. అయితే అలాంటిదేమీ లేదని.. అవన్నీ రూమర్స్ మాత్రమేనని కొట్టి కశ్మీరా షా కొట్టిపారేసింది. ఏదైమైనా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సలహాతో కృష్ణ, కాశ్మీర షా ఇంట్లో సందడి నెలకొంది. (ఇది చదవండి: ఆ నలుగురు స్టార్ హీరోయిన్స్.. సినిమాలే కాదు.. ఆ రంగంలోనూ తగ్గేదేలే! ) View this post on Instagram A post shared by Kashmera Shah (@kashmera1) -
తిరుపతి ఎస్వీ గోశాలలో ‘సరోగసి’ దూడ జననం
తిరుపతి రూరల్: దేశంలో తొలిసారిగా పిండమార్పిడి (సరోగసి) పద్ధతిలో ఒంగోలు ఆవుకు సాహివాల్ దూడ జన్మించినట్లు టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం తిరుపతిలోని ఎస్వీ గోశాలలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి సూచనలతో టీటీడీ, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం సంయుక్తంగా దేశవాళీ గోజాతులను అభివృద్ధి చేయాలని గత ఏడాది ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా టీటీడీ పరిధిలోని తిరుపతి ఎస్వీ గో సంరక్షణశాలలో మేలుజాతి ఆవుల అండాలు సేకరించి, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలోని ఐవీఎఫ్ ల్యాబ్‌లో కృత్రిమంగా పిండాలను అభివృద్ధి చేశారని చెప్పారు. వీటిని టీటీడీ గోశాలలోని ఆవులలో ప్రవేశపెట్టి దేశంలోనే తొలిసారిగా విజయం సాధించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో శనివారం రాత్రి ఒంగోలు ఆవుకు జన్మించిన సాహివాల్ దూడకు పద్మావతి అని నామకరణం చేసినట్లు చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ధూపదీప నైవేద్యాలకు, నిత్య కైంకర్యాలకు అవసరమైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి కోసం దాతలు ఇప్పటికే 200 దేశీయ గోవులను దాతలు సమకూర్చా రని, మరో 300 గోవులను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఐదేళ్లలో 324 సాహివాల్ గోజాతి దూడల ఉత్పత్తి ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ పద్మనాభరెడ్డి మాట్లాడుతూ సరోగసి పద్ధతిలో రానున్న ఐదేళ్లలో 324 మేలు రకమైన సాహివాల్ గోజాతి దూడలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దీన్లోభాగంగా పిండమార్పిడి చేసిన ఆవుల్లో ఇప్పటివరకు 11 గర్భం దాల్చినట్లు చెప్పారు. ఒక ఆవు శనివారం రాత్రి సాహివాల్ పెయ్యదూడకు జన్మనిచ్చిందన్నారు. రానున్న రోజుల్లో మరో పది సాహివాల్ దూడలు జన్మించనున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఈవో సదా భార్గవి, గో సంరక్షణ ట్రస్ట్ సభ్యులు రామ్సునీల్రెడ్డి, గో సంరక్షణశాల డైరెక్టర్ హరినాథరెడ్డి, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం డీన్ వీరబ్రహ్మయ్య, వెంకట్‌నాయుడు పాల్గొన్నారు. -
Health: సరోగసీకి ఎలాంటి వారు తమ గర్భాన్ని అద్దెకు ఇవ్వొచ్చు?
సరోగసీకి ఎలాంటి వారు తమ గర్భాన్ని అద్దెకు ఇవ్వొచ్చు?అంటే దానికి ఉండాల్సిన ఆరోగ్య లక్షణాలు ఏమిటి? – కొండపల్లి వాసవి, నందిగామ సరోగసీ అంటే అద్దెకు గర్భాన్ని తీసుకోవడం. ఎవరికైనా గర్భధారణ కష్టమైనప్పుడు గర్భకోశం బిడ్డని మొయ్యలేదని తేలినప్పుడు వాళ్ల అండం.. స్పెర్మ్ టెస్ట్ ట్యూబ్‌లో ఫలదీకరణం చెంది పిండంగా మారాక దాన్ని ఇంకొకరి గర్భంలో ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఇంప్లాంట్ చేసి.. వారు డెలివరీ తరువాత బయోలాజికల్ పేరెంట్స్‌కి తిరిగి ఇచ్చేయడం.. ఇదన్న మాట ఆ ప్రక్రియ. మన దేశంలో అయితే కమర్షియల్ సరోగసీకి అనుమతి లేదు. ఎలాంటి డబ్బు ఆశ లేకుండా కేవలం స్వచ్ఛందంగా ఈ పని చేయాలి. ఇండియన్ సరోగసీ యాక్ట్ ప్రకారం పెళ్లయిన దంపతులు ఏవైనా అనారోగ్య సమస్యల వల్ల ప్రెగ్నెన్సీని క్యారీ చేయలేకపోతే.. ఒకసారి మాత్రమే సరోగేట్ ప్రెగ్నెన్సీని మోయాలి. ఐవీఎఫ్‌కి 3 అటెంప్ట్స్ మాత్రమే ప్రయత్నించాలి. శారీరకంగా.. మానసికంగా ఆరోగ్యంగా.. దృఢంగా ఉండాలి. వైద్య ఖర్చులు మాత్రమే తీసుకోవాలి. గోప్యతను పాటించాలి. సరోగసీ కోసం రిజిస్టర్ అయిన సంతానసాఫల్య కేంద్రంలో మాత్రమే ఈ ప్రక్రియను చేయాలి. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
నా బిడ్డ బతుకుతుందనుకోలేదు.. సరోగసి సీక్రెట్స్ వివరించిన ప్రియాంక చోప్రా
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తొలిసారిగా తన కూతురు మాల్తీ జననం గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఓ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సరోగసి విధానం ద్వారా బిడ్డను ఎందుకు కనాల్సి వచ్చిందో వివరిస్తూ ఎమోషనల్ అయ్యింది. ''మాల్తీ పుట్టినప్పుడు నేను ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నాను. ఆమె నా చేయికంటే చాలా చిన్నగా ఉంది. దీంతో కొన్నిరోజుల పాటు ఆమెను ఇంటెన్సివ్ కేర్ విభాగంలో డాక్టర్ల పర్యవేక్షనలో ఉంచాం. ఇంక్యుబేటర్‌లో కూతురిని చూస్తూ నేను, నిక్ చాలా మదనపడ్డాం. ఆ సమయంలోఘెంతో మంది డాక్టర్లు, నర్సులను కలిశాను. నిజానికి వాళ్లు దేవుని ప్రతిరూపాలు.. సాక్షాత్తు దేవుడిలానే పిల్లలకు ప్రాణాలు పోస్తున్నారు. నా కూతురు బతికి బయటపడుతుందని కూడా అనుకోలేదు. నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అందుకే సరోగసిని ఎంచుకున్నాం. కానీ నేనేదో అందం తగ్గుతుందని సరోగసిని ఎంచుకున్నానని మాట్లాడినప్పుడు చాలా బాధనపించింది. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ తాలూకు ప్రభావం నా బిడ్డపై పడకూడదని నిర్ణయించుకున్నా. అందుకే తన ఫోటోలు కూడా రివీల్ చేయడం లేదు. ఇక సరోగసీ అంద ఈజీ కాదు. దీనికోసం సుమారు ఆరునెలల పాటు నేను, నా భర్త చాలా వెతికాం. చివరకి ఓ దయగల మహిళ సరోగసికి ఒప్పుకుంది. అందుకే నా కూతురికి నాతో పాటు ఆమె పేరు కూడా కలిసి వచ్చేలా పేరు పెట్టుకున్నాం'' అంటూ చెప్పుకొచ్చింది. కాగా గతేడాది జనవరిలో నిక్-ప్రియాంక దంపతులు పేరెంట్స్‌గా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. -
అలాంటి వారే సెలబ్రెటీల లైఫ్ గురించి మాట్లాడుకుంటారు: నటి అసహనం
నటి వరలక్ష్మి శరత్ కుమార్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విలక్షణ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సినిమాల్లో విలనిజంతో మెప్పిస్తోంది. తెనాలి రామకృష్ణ బీఏ, బీఎల్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె రవితేజ క్రాక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నాంది, చేజింగ్ వంటి చిత్రాల్లో నటించి లేడీ విలన్‌గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా పాన్ ఇండియా చిత్రం యశోదలో నటించింది. సమంత లీడ్ రోల్‌తో తెరకెక్కిన ఈచిత్రంలో ఆమె ఓ కీ రోల్ పోషించింది. ఈ చిత్రం నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చదవండి: విశ్వక్ సేన్, అర్జున్ వివాదంపై తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సరోగసి నేపథ్యంలో యశోద సినిమాను రూపొందించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం దేశంలో సరోగసి అంశం హాట్‌టాపిక్ మారింది, దీనిపై మీ స్పందన ఏంటని అడగ్గా.. ‘సరోగసీ అనేది కాంప్లికేటెడ్ అంశం కాదు. కొంతమంది యాక్టర్స్ సరోగసీని ఆశ్రయించడం వల్ల దీనిపై చర్చ నడుస్తోంది. పిల్లలు లేని చాలా మందికి సరోగసీ ద్వారా పిల్లలు పొందే అవకాశం కలుగుతోంది. ఈ కథలో సరోగసీ ఒక టాపిక్ అంతే! అందులో మంచి చెడుల గురించి చెప్పడం లేదు. ఇది ఫిక్షనల్ స్టోరీ’ అని పేర్కొంది. చదవండి: కోలుకుంటున్న ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే ఇటీవల లేడీ సూపర్ నయనతార సరోగసిని ఆశ్రయించడంపై పలువురి నుంచి అభ్యంతరాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలబ్రెటీలు వ్యక్తిగత జీవితాన్ని చర్చనీయాంశం చేయడంపై మీ అభిప్రాయం చెప్పాలని యాంకర్ వరలక్ష్మిని కోరారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. పని పాట లేని వాళ్లే పక్కవారి లైఫ్ గురించి మాట్లాడుకుంటారు. ప్రస్తుతం సెలబ్రెటీల జీవితంలో సరోగసి గురించి మాట్లాడుకుంటున్నారు. అందరు తమ జీవితాలకు సంబంధించిన విషయాలను పక్కన పెట్టి పక్కవారి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పని పాట లేనివాళ్లే ఇలా చేస్తారు. వాళ్లకు ఏం పని ఉండదమో అందుకే పక్కవాళ్ల గురించి ఆలోచిస్తుంటారు’ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేసింది. -
పిల్లలు కావాలా?.. సక్సెస్ రేటు కోసం సంతాన సాఫల్య కేంద్రాల అడ్డదారులు
ఉన్నత చదువులు.. ఉపాధి అవకాశాలు.. ఆలస్యపు పెళ్లిళ్లు.. ఆ తర్వాత భర్త నైట్ షిఫ్ట్‌లో పని చేస్తే.. భార్య పగలు విధులు నిర్వహించడం వెరసీ.. యువ దంపతుల్లో సంతానలేమి సమస్యకు కారణమవుతోంది. దీంతో పిల్లల కోసం సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. దంపతుల్లో ఉన్న ఈ బలహీనతను వైద్యులు సొమ్ము చేసుకుంటున్నారు. వీర్యకణాల సేకరణ.. అండాల అభివృద్ధి పేరుతో అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందుకు ఒంటరి పేద మహిళల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. గ్రేటర్ పరిధిలో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. సాక్షి, హైదరాబాద్: ఐటీ, అనుబంధ సంస్థలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు గ్రేటర్ శివారు జిల్లాలు కేంద్ర బిందువుగా మారాయి. ముఖ్యంగా ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్స్ పరిధిలోని మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, నానక్‌రాంగూడ, హైటెక్ సిటీ, శేర్లింగంపల్లి, కోకాపేట్, నార్సింగి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ప్రపంచ దిగ్గజ కంపెనీలు గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్ సహా కీలక ఐటీ అనుంబంధ సంస్థలన్నీ ఇక్కడి నుంచే కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. వీటిలో ప్రత్యక్షంగా ఏడు లక్షల మంది యువత.. పరోక్షంగా మరో పది లక్షల మంది ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. వీరిలో మెజారిటీ ఉద్యోగులు 35 ఏళ్లలోపు వారే. వీరంతా ఉన్నత చదువులు, ఉపాధి వేటలో పడి వివాహాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. రేడియేషన్ ఎఫెక్ట్.. మూడు పదుల వయసు దాటిన తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. మారిన జీవన శైలికి తోడు ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యం, మాంసాహారాలను అధికంగా తీసుకోవడం, రాత్రి వేళల్లో ఎక్కువ సేపు మేల్కొని ఉండటం, శరీరానికి సరైన వ్యాయామం కూడా లేకపోవడంతో హార్మోన్ల సమతుల్యతలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాదు.. రోజంతా ఒడిలనే ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లు పెట్టుకుని కూర్చొవడం వల్ల వాటి నుంచి వెలువడే రేడియేషన్‌తో యువతీ యువకుల్లో అండాలు, వీర్యకణాలు దెబ్బతింటున్నాయి. యుక్త వయస్కుల్లో ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఒకవేళ ఉన్నా.. వాటి నాణ్యత అంతంతే. ఫలితంగా ఆయా దంపతుల్లో సంతానలేమి సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లల కోసం వీరంతా సమీపంలోని సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. గైనకాలజిస్టులు వీరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సరోగసీ విధానంపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఇన్ విట్రో ఫెర్టిలేజేషన్ (ఐవీఎ‹ఫ్) ఇంట్రా యుటిరైన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ)వంటి పద్ధతులను సూచిస్తున్నారు. మహిళల ఆరోగ్యంతో చెలగాటం.. గ్రేటర్ పరిధిలో సుమారు 200 ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నట్లు అంచనా. వీటిలో ఎక్కువగా కూకట్పల్లి, మియాపూర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, సోమాజిగూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, మాదాపూర్, శేర్లింగంపల్లి, మియాపూర్, నార్సింగి, గచ్చిబౌలి, శంషాబాద్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మణికొండ, కోకాపేట్, నార్సింగి, పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. వీటిలో పలు ఫెర్టిలిటీ సెంటర్లు సక్సెస్ రేటు కోసం అడ్డదారులు తొక్కుతున్నాయి. పిల్లలు కావాలనే ఆశతో వచి్చన యువ దంపతుల్లో ఉన్న బలహీనతను వీరు క్యాష్ చేసుకుంటున్నాయి. ప్రభుత్వం సరోగసీ విధానంపై కఠినమైన ఆంక్షలు విధించడంతో ఐవీఎఫ్, ఐయూఐ పేరుతో కొత్త దందాకు తెరతీశాయి. చికిత్స చేసినా పిల్లలు పుట్టేందుకు అవకాశం లేని దంపతులకు ఎలాగైనా పిల్లలను కలిగించి, ఫెర్టిలిటీ సెంటర్‌కు, చికిత్స చేసిన వైద్యులకు మార్కెట్లో మంచి గుర్తింపు తీసుకురావాలని భావిస్తున్నారు. చాలా వరకు మందులతోనే మంచి రిజల్ట్ వస్తుంది. మందులు వాడినా ప్రయోజనం లేని దంపతులకు దాతల నుంచి సేకరించిన అండాలు, వీర్య కణాలను ఆశ చూపుతున్నారు. ఇందుకు ఏ తోడూ లేని ఒంటరి పేద మహిళలను ఎంచుకుని వారికి మాయమాటలు చెబుతున్నారు. వైద్య పరీక్షలు, అండాలు, వీర్యకణాల వృద్ధి పేరుతో మోతాదుకు మించి ఇంజక్షన్లు ఇచ్చి వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. తీరా అనారోగ్య సమస్యలు తలెత్తిన తర్వాత గుట్టుగా అక్కడి నుంచి జారుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ జిల్లా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫెర్టిలిటీ సెంటర్లో వెలుగు చూసిన ఘటనే ఇందుకు నిదర్శనం. -
‘మనవరాలి’కి జన్మనిచ్చిన 56 ఏళ్ల మహిళ
వాషింగ్టన్: మనవరాలికి నానమ్మ జన్మనివ్వటమేంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే, సరోగసి పున్యమా అని ఇలాంటి వింత సంఘటనలు ఇటీవల సాధ్యమవుతున్నాయి. 56 ఏళ్ల ఓ మహిళ తన కొడుకు, కోడలి బిడ్డకు సరోగసి ద్వారా జన్మనిచ్చింది. ఈ సంఘటన అమెరికాలోని ఉతాహ్ ప్రాంతంలో జరిగింది. తన కోడలికి గర్భాశయాన్ని తొలగించిన క్రమంలో ఈ సరోగసి పద్ధతికి తానే అంగీకరించారని, ఆ దంపతులు మరో అవకాశం లేకుండా పోయిందని ద పీపుల్స్ మీడియా పేర్కొంది. ఉతాహ్ ప్రాంతానికి చెందిన జెఫ్ హాక్ అనే వ్యక్తి భార్య కాంబ్రియాకు గర్భాశయం తొలగించారు. ఈ క్రమంలో సరోగసి ద్వారా వారి బిడ్డను కనివ్వడనికి అతడి 56 ఏళ్ల తల్లి నాన్సీ హాక్ ఆఫర్ చేసింది. అయితే, అది సాధ్యం కాదని మొదట వాదించాడు జెఫ్ హాక్. అయితే, వైద్యులు చేసి చూపించారు. జెఫ్ హాక్ తల్లి తన మనవరాలికి జన్మనిచ్చింది. మరోవైపు.. ఆ పాప జెప్ హాక్, కాంబ్రియాల ఐదో సంతానం కావటం గమనార్హం. ఇది ఒక గొప్ప సందర్భమని, ఎంత మంది తన తల్లి జన్మనివటాన్ని చూస్తారని పేర్కొన్నాడు జెఫ్ హాక్. బిడ్డకు జన్మనిచ్చిన క్రమంలో నాన్సీ హాక్ భావోద్వేగానికి గురయ్యారని, అయితే ఆ పాపను తనతో పాటు ఇంటికి తీసుకెళ్లలేకపోయారని ద పీపుల్స్ పేర్కొంది. నానమ్మ గుర్తుగా పాపకు హన్నా అని నామకరణం చేశారు జెఫ్ హాక్, కాండ్రియా. తన తల్లి ఓరోజు అర్ధరాత్రి నిద్రలేచి తన పేరు హన్నాగా చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు జెఫ్ హాక్. డెలివరీకి ముందే, ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేయకముందే కడుపులో ఉంది పాపేనని చేప్పారు నాన్సీ. ఒక మహిళ తన మనవరాలిని మోయడం అనేది అసాధారణమైన విషయమని డాక్టర్ రస్సెల్ ఫౌల్స్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Cambria Hauck (@cambriairene) ఇదీ చదవండి: విలాసవంతమైన ఇంట్లో 43 ఏళ్లపాటు పనిమనిషిగా.. బిడ్డ వల్లే ఇప్పుడు ఏకంగా ఓనర్! -
నయన్ దంపతుల సరోగసి.. ఊహించిందే జరిగింది..!
నయనతార దంపతుల వివాదంపై చర్చ అంతా ఇంతా కాదు. పెళ్లైన నాలుగు నెలలకే ఈ జంట కవల పిల్లలకు జన్మనివ్వడం హాట్‌టాపిక్‌గా మారింది.సరోగసి విధానంలో నిబంధనలు పాటించలేదంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మంగళవారం విచారణ పూర్తయింది. (చదవండి: నయన్ దంపతుల సరోగసిపై ప్రభుత్వం ఏం తేల్చనుంది?) తాజాగా తమిళనాడు ప్రభుత్వానికి విచారణ కమిటీ తన నివేదికను సమర్పించింది. నయనతార దంపతుల సరోగసి చట్టబద్ధమేనని తేల్చింది. 2021 నవంబర్లోనే సరోగసికి అగ్రిమెంట్ జరిగిందని కమిటీ తన నివేదికలో వెల్లడించింది. దీంతో నయన్ దంపతుల సరోగసి వివాదానికి తెరపడనుంది. -
నయన్ దంపతుల సరోగసిపై ప్రభుత్వం ఏం తేల్చనుంది?
స్టార్ హీరోయిన్ నయనతార దంపతుల సరోగసి వివాదంపై తమిళనాడు ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ పూర్తి చేసింది. రేపు(బుధవారం) తమిళనాడు సర్కారుకు కమిటీ సభ్యులు నివేదిక అందించనున్నారు. కాగా లేడీ సూపర్‌స్టార్ నయనతారదంపతుల సరోగసి వివాదం పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. పెళ్లైన నాలుగు నెలలకే ఈ జంట కవల పిల్లలకు జన్మనివ్వడం హాట్‌టాపిక్‌గా మారింది. సరోగసి విధానంలో నిబంధనలు పాటించలేదంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మంగళరం ఈ విచారణ పూర్తయింది. ఈ క్రమంలో నయన్ దంపతలు కమిటీకి అపిడవిట్ పంపారు. తమకు ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ అయ్యిందని తెలిపారు. గతేడాది డిసెంబర్లోనే సరోగసి కోసం దరఖాస్తు చేసుకున్నామని, ఇందులో నిబంధనలు అతిక్రమించలేదని పేర్కొన్నారు. ఈ వివాదంపై విచారణ పూర్తిచేసిన కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందిచనున్న నేపథ్యంలో నివేదికలో ఏం ఉండనున్నదనే దానిపై సస్పెన్స్ నెలకొంది. -
నయన్ దంపతుల దీపావళి సర్ప్రైజ్.. కవల పిల్లలతో కలిసి..!
ఇటీవలే ఎక్కువగా వార్తల్లో నిలిచిన జంట ఎవరంటే ఠక్కున గుర్తిచ్చేది నయన్-విఘ్నేశ్ శివన్. ఎందుకంటే ఈ దంపతులకు ఇటీవలే కవలలు జన్మించడంతో హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీనిపై తమిళనాడు ప్రభుత్వానికి వివరాలు సమర్పించడంతో వివాదం సద్దుమణిగింది. ట్విన్స్ జన్మించిన ఆనందంలో ఉన్న ఈ జంట తాజాగా దీపావళికి కవల పిల్లలతో కలిసి శుభాకాంక్షలు తెలిపింది. పిల్లలను ఎత్తుకుని ఉన్న ఓ వీడియోను విఘ్నేశ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అయితే పిల్లల ముఖాలను ఎక్కడా చూపించలేదు. సంప్రదాయ దుస్తులు ధరించిన నయన్ దంపతులు అందరికీ దివాళి విషెస్ తెలుపుతూ చాలా సంతోషంగా కనిపించారు. మొదటిసారి తల్లిదండ్రులైన సందర్భంగా ఎంతో ఆనందంగా ఫ్యాన్స్‌కు దివాళీ విషెస్ తెలిపారు. విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చాడు. 'మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అన్ని సందర్భాల్లోనూ మీరంతా సంతోషంగా ఉండాలి. మీ జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిపై పోరాడండి. ప్రేమ మాత్రమే ఈ జీవితాన్ని ఆనందంగా మారుస్తుంది. ప్రేమలో విశ్వాసం, మంచితనం ఎల్లప్పుడూ ఉండాలి.' అంటూ పోస్ట్ చేశారు. చాలా సంవత్సరాల పాటు ప్రేమించుకున్న ఈ జంట జూన్ 9, 2022న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
అది మన ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుంది: విఘ్నేశ్ శివన్
ఇటీవల నయనతార దంపతులు సరోగసి వివాదం తెలిసిందే. ప్రస్తుతానికి ఆ జంట ప్రభుత్వానికి వివరణ ఇవ్వడంతో సమసిపోయింది. అయితే తాజాగా విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టా స్టోరీస్ షేర్ చేశాడు. అవీ కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రేస్టేషన్లో ఉన్న రోజుల గురించి స్టోరీలో ప్రస్తావించారు. మనం చూసే విధానం బాగుంటే ప్రతి దానిలో మంచి కనిపిస్తుందన్న సందేశంతో కోట్స్ షేర్ చేశారు. గతంలో ఓ నిర్మాత షేర్ చేసిన ఇన్‌స్టా కోట్స్‌ను సోషల్ మీడియాలో విఘ్నేశ్ పోస్ట్ చేశారు. విఘ్నేష్ ఇన్‌స్టా స్టోరీలో 'మనకు మంచి రోజులు ఉన్నాయి. కానీ ఫ్రస్టేషన్ ఉన్న రోజులు కూడా కొన్నిసార్లు మనకు మంచిదే. ప్రతిదానిలో మంచిని చూసేందుకు ప్రయత్నిచండి. అందుకు ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకోండి. మీ జీవితంలో ఆనందం అనేది మన ఆలోచనలపైనే అధారపడి ఉంటుంది.' అని కోట్స్‌లో రాసి ఉంది. ఆ రెండు పోస్టులు ఇటీవల నయనతార కవలలకు జన్మనివ్వడంతో వచ్చిన వివాదాన్ని ఉద్దేశించే చేసినట్లు అభిమానులు భావిస్తున్నారు. -
ఇకనైనా నోళ్లు మూస్తారా...చిన్మయి వైరల్ ఫోటోలు
చెన్నై: సరోగసీ ఒక విలాసవంతమైన వ్యాపారంగా మారిపోతున్న వైనం, సరోగసీ వివాదం, సోషల్ మీడియాలో ఆమెపై వస్తున్న వేధింపుల నేపథ్యంలో గాయని చిన్మయి శ్రీపాద బేబీ బంప్‌తో ఒక సెల్ఫీని ఇన్‌స్టాలో షేర్ చేశారు. తద్వారా అద్దెగర్భం ద్వారా పిల్లల్ని కన్నారన్న పుకార్లకు చెక్ చెప్పారు. అంతేకాదు ఇద్దరు బిడ్డలకు పాలిస్తున్న ఫోటోను కూడా చిన్మయి షేర్ చేశారు. దీంతోపాటు తన అభిపప్రాయాలతో ఒక వీడియోను కూడా పంచుకున్నారు. ట్విన్స్‌కు పాలు పట్టడంలోని ఇబ్బందులు, బ్యాక్‌పెయిన్, షోల్టర్స్ పెయిన్ గురించి కూడా ఆమె చెప్పకనే చెప్పారు. దీంతో నిజంగా మీరు రియల్ శివగామి అంటున్నారు ఫ్యాన్స్. (Dhanteras 2022: బంగారు, వెండిపై ఫోన్‌పే క్యాష్ బ్యాక్ ఆఫర్) ‘ఓన్లీ సెల్ఫీ’ అటూ ప్రెగ్నెన్సీ సమయంలో తీసిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నోళ్లు మూత పడ్డాయి. నిజంగా ఇది 'ఐకానిక్' పిక్ అంటూ ఫ్యాన్స్ కమెంట్ చేస్తున్నారు. “సరోగసీ అంటూ కారు కూతలు కూసిన వాళ్లంతా ఇకనైనా నోరు మూయండి” అని మరొకరు వ్యాఖ్యానించారు. చిన్మయి శ్రీపాద, నటుడు, నిర్మాత రాహుల్ రవీంద్రన్ దంపతులు ఈ ఏడాది జూన్‌లో ద్రిప్తా, శర్వాస్ అనే కవలలకు జన్మనిచ్చారు. వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు సరోగసీ విధానం ద్వారా పిల్లల్ని కనడం సాధారణంగా మారిపోయింది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొందరు మహిళలు అద్దె తల్లులుగా మారుతున్నారనీ, కుటుంబ అవసరాల కోసం, డబ్బు సంపాదన కోసం సరోగేట్‌గా మారుతున్నారనేది ఒక వాదన. ఇందుకు పరిస్థితులను బట్టి కనీసం రూ.15 లక్షల నుంచి 30 లక్షల వరకు లేదా అంతకు మించి డబ్బు వసూలు చేస్తారట. అయితే దీనిపై నియంత్రణ లేకపోవడంతో భారత్ లో సరోగసీ దుర్వినియోగం అవుతుందన్న వాదనలు ఉన్నాయి. దీంతో భారత ప్రభుత్వం 2019లో సరోగసీని నిషేధించి, నియమ నిబంధనలను కఠినతరం చేసింది. (Motorola Edge 30 Ultra: కొత్త వేరియంట్, 200 ఎంపీ కెమెరా, భారీ లాంచింగ్ ఆఫర్) అద్దెగర్భం ద్వారా పిల్లల్ని కనడం(సరోగసీ) అనేది వ్యాపారంగా మారిపోయిందనే ఆరోపణల నేపథ్యంలో ఇటీవల సినీ నటులు నయన్, విఘ్నేష్ దంపతులు సరోగసి ద్వారా పిల్లల్ని కనడం పెద్ద చర్చకు దారి తీసింది. దీనిపై ప్రభుత్వం కూడా స్పందించిన వివరణ కోరింది. అయితే ఆరేళ్ల క్రితమే తమ పెళ్లిన రిజిస్టర్ చేసుకున్నామని నయన్ దంపతులు ప్రకటించారు. ఇంతకుముందు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ తో కలిసి సరోగసీ ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చారు. వీరే కాదు, నటుడు షారుఖ్ ఖాన్ దంపతులు, శిల్పాశెట్టి దంపతులతోపాటు, తెలుగు నటి మంచు లక్ష్మి దంపతులు సైతం సరోగసీ విధానంలో పిల్లలకు జన్మనిచ్చారు.(Diwali Gifts: గిఫ్ట్స్, బోనస్‌లు అందుకున్నారా? మరి ట్యాక్స్ ఎంతో తెలుసా? ) View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) > View this post on Instagram View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
ఇదేం కక్కుర్తి, అమ్మకానికి.. అమ్మతనం!
మాతృత్వం.. అడవారి జీవితంలో ఓ మధుర జ్ఞాపకం. అయితే జన్యుపరమైన కారణాలతోనో.. శారీరక లోపంతోనో ఆ భాగ్యానికి నోచుకోని వారికి అద్దెగర్భం ద్వారా పరోక్షంగా తల్లయ్యే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. కానీ కాసుల కోసం వెంపర్లాడే కొన్ని ప్రభుత్వ ఆస్పత్రులు అమ్మతనాన్ని కూడా అమ్మకానికి పెట్టేస్తున్నాయి. ఈ అక్రమ వ్యవహారం తాజాగా రాజధాని నగరంలో బట్టబయలైంది. సాక్షి, చెన్నై: అద్దె తల్లుల వ్యవహారం మరోమారు చెన్నైలో వెలుగు చూసింది. చూలైమేడులో కొన్నిచోట్ల ప్రత్యేక గదుల్లో అద్దె తల్లులను ఉంచి ఓ ఆసుపత్రి యాజమాన్యం చికిత్స అందిస్తుండడం బయట పడింది. దీనిపై ఆరోగ్యశాఖ సోమవారం విచారణకు ఆదేశించింది. వివరాలు.. ప్రముఖ సినీ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతుల సరోగసీ వివాదం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో చెన్నైలో మరోమారు అద్దె తల్లుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. చూలైమేడులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి అద్దె తల్లుల ద్వారా సరోగసీ విధానంలో పిల్లలను విక్రయిస్తోందనే ఆరోపణలు వెల్లవెత్తాయి. అదే సమయంలో మీడియాకు అద్దె తల్లి ఇచ్చిన సమాచారంతో అక్రమాలకు పాల్పడుతున్న ఆస్పత్రి బండారం బట్టబయలైంది. పేదరికమే పెట్టుబడిగా.. చూలైమేడు పరిసరాల్లో అద్దెకు అనేక ఇళ్లను తీసుకుని మరీ సంబంధిత ప్రైవేటు ఆసుపత్రి సరోగసీకి చికిత్స అందిస్తుండడం వెలుగులోకి వచ్చింది. ఈక్రమంలో ప్రత్యేక గదులకే ఈ అద్దె తల్లులను పరిమితం చేయడం గమనార్హం. అలాగే, కొన్ని ఇళ్లలో ఉన్న పేద యువతుల వద్ద అండాలను సైతం సేకరిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు వెల్లడైంది. అద్దె తల్లుల్లో ఆంధ్రా, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాలకు చెందిన వారే కాదు, బంగ్లాదేశ్, నైజీరియా వంటి దేశాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు తెలిసింది. అద్దెతల్లులు ఉన్న చోటకే వెళ్లి వైద్యులు పరిశోధించడం, చికిత్సలు నిర్వహించడం జరుగుతోంది. ఈ అద్దె తల్లులు అందరూ పేదరికంలో నలుగుతున్నారని, వీరిలో కొందరికి వివాహాలకు కూడా కాలేదని వెల్లడైంది. తమ ఆర్థిక పరిస్థితి మెరుగు కోసం అద్దె తల్లులుగా వచ్చిన వారిని ఆస్పత్రి యాజమాన్యం వేదిస్తున్నట్లు, వీరు ఇస్తున్న మందులు తమపై భవిష్యత్‌లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళన కలుగుతోందని 25 ఏళ్ల బాధితారులు మీడియాకు సమాచారం ఇచ్చింది. దీనిపై ఆరోగ్యశాఖ వెంటనే స్పందించింది. ఈ వ్యవహారంపై సోమవారం సమగ్ర విచారణకు ఆదేశించింది. వైద్యశాఖ అధికారులు విశ్వనాథన్, కృష్ణన్ నేతృత్వంలో నలుగురు అధికారులతో కూడిన కమిటీని దర్యాప్తు కోసం నియమించింది. చదవండి: వీధి కుక్క దాడిలో పసికందు మృతి.. పేగులు బయటకు తీయటంతో..! -
ఇది ఊహించలేదు.. ప్రభుత్వానికి నయన్ దంపతుల బిగ్ ట్విస్ట్!
నటి నయనతార సరోగసి పద్ధతి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. నయనతార ఈ వ్యవహారంలో నిబంధనలను పాటించారా? లేదా? అన్న విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది. కారణం సరోగసి విధానంతో అద్దె తల్లి ద్వారా పిల్లలను కనడం అన్న అంశంపై ఈ ఏడాది జనవరిలోనే నిషేధం విధించారు. అలాంటిది గత జూన్ నెలలో నయనతార దర్శ కుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకున్నారు. నాలుగు నెలల్లోనే నయనతార ఈ జంట సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు కావడం వివాదంగా మారింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం సైతం నయన్ దంపతులను వివరణ కోరింది. (చదవండి: నయనతార-విగ్నేశ్ సరోగసి వివాదంలో కీలక మలుపు) నివేదికలో బిగ్ ట్విస్ట్..: అయితే తాజాగా నయన్ దంపతులు తమిళనాడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. అందులో ప్రభుత్వానికి బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ జంట 6 ఏళ్ల క్రితమే చట్టబద్ధంగా రిజిష్టర్ వివాహం చేసుకున్నట్లు అఫిడవిట్లో వెల్లడించినట్లు సమాచారం. తమిళనాడు ఆరోగ్య శాఖకు సమర్పించిన అఫిడవిట్లో ఈ విషయాన్ని తెలిపింది. వివాహానికి సంబంధించిన పత్రాలన్నింటినీ అఫిడవిట్‌తో పాటు అధికారులకు సమర్పించినట్లు తెలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘించలేదు: సరోగసీ (నియంత్రణ) చట్టం 2021 ప్రకారం పెళ్లైన జంట ఐదు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలు దాటాక మాత్రమే సరోగసీని ఎంచుకోవడానికి అర్హులు. అద్దె తల్లి దంపతులకు దగ్గరి బంధువు అయి ఉండాలని కూడా చట్టం చెబుతోంది. అలాగే సరోగేట్ మదర్ యూఏఈకి చెందిన నయనతార బంధువే అని అఫిడవిట్లో పేర్కొన్నారు. కవలలు జన్మించిన చెన్నై ఆసుపత్రికి కూడా అధికారులు ఇండెంట్ పెట్టారు. తాము ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదని.. అన్ని నియమాలను పాటించామని నయన్ దంపతులు అఫిడవిట్లో పేర్కొన్నారు. -
నయన్ సరోగసీ వివాదం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం?
లేడీ సూపర్‌స్టార్ నయనతారకు సరోగసీ వివాదంపై తమిళనాడు ప్రభుత్వం ఆమెకు షాకిచ్చింది. ఇటీవల పెళ్లి పీటలు ఎక్కిన నయనతార-విఘ్నేశ్ శివన్‌లు 5 నెలలు తిరక్కుండానే కవలకు తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. దీంతో వారు సరోగసీ(అద్దె గర్భం) ద్వారానే తల్లిదండ్రులు అయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించింది. దీంతో ప్రస్తుతం నయన్ సరోగసీ అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా తమిళనాడు ప్రభుత్వం నయన్ దంపతులకు షాకిచ్చింది. చదవండి: సైలెంట్‌గా పెళ్లి చేసుకోబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ! వరుడు అతడేనా? దీనిపై విచారణ జరిపేందుకు తమిళనాడు ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నయన్ సరోగసీపై సమగ్ర విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కాగా వారు తల్లిదండ్రులు కావడంపై ప్రభుత్వానికి వివరణ ఇవ్వాల్సి ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యన్ మీడియాతో పేర్కొన్నారు. అయినప్పటికీ దీనిపై ఇప్పటి వరకు నయన్ దంపతులు స్పందించకపోవడం గమనార్హం. చదవండి: నేనేమి పెద్ద అందగత్తెను కాదు..: జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు -
నయనతార-విగ్నేశ్ సరోగసి వివాదంలో కీలక మలుపు
తమిళసినిమా: నటి నయనతార సరోగసి పద్ధతి ద్వారా కవలపిల్లలకు తల్లి అయిన వి షయం తెలిసిందే. అయితే ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నయనతార ఈ వ్యవహారంలో నిబంధనలను పాటించారా? లేదా? అన్న విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది. కారణం సరోగసి విధానంతో అద్దె తల్లి ద్వారా పిల్లలను కనడం అన్న అంశంపై ఈ ఏడాది జనవరిలోనే నిషేధం విధించారు. అలాంటిది గత జూన్ నెలలో నయనతార దర్శ కుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకున్నారు. నాలుగు నెలల్లోనే నయనతార ఈ జంట సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు కావడం వివాదంగా మారింది. సరోగసి పద్ధతి ద్వారా పిల్లలను కనడానికి కొన్ని చట్టపరమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని నటి కస్తరి లేవనెత్తారు. సరోగసి ద్వారా తల్లిదండ్రులు కావాలనుకుంటే వారికి పెళ్లి జరిగి కనీసం మూడేళ్లు పూర్తవ్వాలి. అలాగే తల్లికి పిల్లలు పుట్టే అర్హత లేకపోవడమో, లేక ఆమెకి ఇష్టం లేకపోవడమో వంటి తగిన ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. అయితే నటి నయనతార ఈ విషయంలో విధి, విధానాలను మీరినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో నటి నయనతారను వివరణ కోరుతామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణియన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై కూడా పెద్ద చర్చే జరుగుతోంది. ఈ వ్యవహారంలో న్యాయనిపుణులు కూడా నయనతారకు అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ వ్యాఖ్యలు చేస్తున్నారు. పిల్లలను పొందడానికి నయనతార, విఘ్నేష్ శివన్ ముందుగానే చట్టబద్ధంగా నమోదు చేసుకున్నారని, కాబట్టి వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం లేదని కొందరు న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. వీరి సంగతి ఇలా ఉంటే వీరికి అద్దె తల్లి ద్వారా కవల పిల్లలు జన్మించారు. చెన్నైలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ వైద్యుడు నయనతారకు అద్దె తల్లి ద్వారా పిల్లలకు తల్లి కావచ్చని సలహా ఇచ్చినట్లు సమాచా రం. దీంతో వైద్యాధికారులు ఆస్పత్రి సిబ్బంది, వైద్యులపై చర్యలు తీసుకునే విషయమై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో అనే ఆసక్తి నెలకొంది -
సెలబ్రిటీ సరొగసీ రచ్చ!
సినీ ప్రముఖుల ప్రతి అంశమూ ఆసక్తికరమే, అనేకసార్లు సంచలనమే. నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ దంపతులు తల్లితండ్రులైన వార్త అభిమానుల్లో ఆసక్తితో పాటు అనేక చర్చలకూ దారి తీసింది. పెళ్ళయిన 4నెలలకే తల్లితండ్రులైన ఈ దంపతులు బాహాటంగా ప్రకటించకున్నా, సరొగసీ (అద్దె గర్భం) ద్వారానే మగ కవలల్ని కన్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. అద్దె గర్భం ప్రక్రియ ఓ వ్యాపారంగా సాగడాన్ని అడ్డుకొనేందుకు కేంద్రం నిరుడు తెచ్చిన చట్టాలు ఉల్లంఘనకు గురయ్యాయని కొందరి అనుమానం. నయన కవలపిల్లల వ్యవహారంలో చట్ట ఉల్లంఘనలు జరిగిందీ, లేనిదీ రాష్ట్ర వైద్యసేవల డైరెక్టరేట్ ద్వారా విచారణ జరుపుతామంటూ తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించడంతో కథ మరో మలుపు తిరిగింది. నయనతార దంపతులేమీ అధికారికంగా వివరణ ఇవ్వకపోవడంతో, వ్యక్తిగత వ్యవహారం కాస్తా సెలబ్రిటీ సరొగసీ రచ్చగా మారింది. సరొగసీపై 2021 డిసెంబర్లో భారత పార్లమెంట్ రెండు చట్టాలను ఆమోదించింది. అవి – సరొగసీ (నియంత్రణ) చట్టం, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్టీ) నియంత్రణ చట్టం. మొదటి చట్టం దేశంలో సరొగసీ ప్రక్రియ, ఆచరణకు సంబంధించినది. రెండోది ఏఆర్టీ క్లినిక్‌లనూ, బ్యాంకు లనూ పర్యవేక్షించడానికీ, నియంత్రించడానికీ ఉద్దేశించినది. పిల్లలు లేనివాళ్ళు, నిర్ణీత వయస్కులు, అద్దెగర్భమే దిక్కయిన ఆరోగ్యపరిస్థితుల్లోని వారే ఈ చట్టాల కింద సరొగసీకి అర్హులు. గుజరాత్‌లోని ఆనంద్ సహా పలు ప్రాంతాలు అద్దెగర్భాల వ్యాపారానికి అడ్డా కావడంతో, అలాంటి అక్రమాలను ఈ చట్టాలు దేశంలో నిషేధించాయి. సరొగసీతో సంతానం పొందాలనుకొనే దంపతులకు సాయపడే అద్దె తల్లి వారికి రక్తసంబంధీకురాలై ఉండాలనీ పేర్కొన్నాయి. ఈ ఉద్దేశాలన్నీ మంచివే అయినా... సరొగసీ ద్వారా తండ్రి కావాలనుకున్న ఒంటరి మగాడి పట్ల, అలాగే ఒక బిడ్డ ఉన్నప్పటికీ అద్దెగర్భంతో కుటుంబాన్ని విస్తరించుకోవాలనుకొనే వివాహిత స్త్రీ పట్ల ఈ చట్టాలు దుర్విచక్షణతో ఉన్నాయనేది విమర్శ. దీనిపై ఢిల్లీ హైకోర్ట్‌లో ఓ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. అలాగే, ఈ చట్టాల్లోని కొన్ని అంశాలను సవాలు చేస్తూ ఓ డాక్టర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీమ్ కోర్ట్ విచారిస్తోంది. నయన, శివన్ 2022 జూన్‌లో చెన్నైలో పెళ్ళి చేసుకొన్నారు. నాలుగు నెలలకే సంతానం కలగడం, నటనలో బిజీగా ఉన్న నయన గర్భవతిగా ఉన్న సూచనలేవీ బయట కనిపించకపోవడం, ఆంతరంగిక వర్గాల కథనం అది అద్దెగర్భమనే అనడంతో ఇంత చర్చా మొదలైంది. నటి కస్తూరి సహా కొందరు ప్రముఖులు, నెటిజన్లు కమర్షియల్ సరొగసీ నిషేధమంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసరికి ఇంటికథ రచ్చకెక్కింది. నిజానికి, సంతానం కోసం సెలబ్రిటీలు సరొగసీని ఆశ్రయించడం మన దేశంలోనూ కొత్తేమీ కాదు. హీరో షారుఖ్ ఖాన్ 2013 మేలో తన మూడో బిడ్డ అబ్రామ్ కోసం సరోగసీని ఆశ్రయించినప్పటి నుంచి చర్చ రేగింది. ధనికులు తప్పుడు కారణాలతో అద్దెతల్లుల్ని పెట్టుకుంటున్నారనే వివాదం మొదలైంది. నటి మంచు లక్ష్మి, 2017 మార్చిలో నిర్మాత కరణ్ జోహార్ దాకా పలువురు బిడ్డల కోసం సరొగసీనే ఆశ్రయించారు. సినిమా సహా గ్లామర్ ప్రపంచంలో ఉన్నవారు తమ వృత్తి అవసరాల రీత్యా అద్దె తల్లుల్ని అరువు తెచ్చుకోవడం జరుగుతూనే ఉంది. నైతిక చర్చలు పక్కనపెడితే, అందులో న్యాయ విరుద్ధమేమీ లేదు. పెళ్ళికాక ముందే ఏడేళ్ళుగా 2015 నుంచి నయన, శివన్ రిలేషన్షిప్లో ఉన్నారు. సహ జీవనం సైతం చట్టబద్ధమని కోర్టులే తేల్చాయి. కాబట్టి, పెళ్ళయి అయిదేళ్ళయితేనే సరొగసీకి అర్హులనే చట్ట నిబంధనను వారు ఉల్లంఘించారనే వాదన నిలుస్తుందా? అలాగే, కొత్త సరొగసీ చట్టాలు ఈ ఏడాది జనవరి 25 నుంచి అమలులోకి వచ్చాయి. అప్పటికే అద్దె తల్లులుగా ఉన్నవారి క్షేమం కోసం పది నెలల గర్భధారణ కాలమూ ఇచ్చాయి. దాని ప్రకారం చూస్తే జనవరికి ముందే నయన దంపతులు సరొగసీని ఎంచుకొని ఉంటే, అదీ చట్టవిరుద్ధం అనలేం. కాబట్టి వారి సరొగసీ చట్టవిరుద్ధమనే వాదన చివరకు నిలబడకపోవచ్చు. విచారణలో వివరాలు బయటకొచ్చేదాకా, నయన దంపతులు పెదవి విప్పేదాకా జరిగిందేమిటో తెలియదు. తొందరపడి తీర్పులు చెప్పడమూ భావ్యం కాదు. నిజానికి, సరొగసీ దోపిడీని అరికట్టడానికి పెట్టిన చట్టాలు సైతం పేదలైన వేలాది అద్దెతల్లుల్ని మరింత దోపిడీకి గురి చేస్తున్నాయనే వాదన ఉంది. నయనతారతో పాటు వేలాది కేసుల్లో ఒకవేళ చట్ట ఉల్లంఘనలు జరిగాయనుకున్నా, ప్రతి కేసులో విచారణ అయ్యేపనీ కాదు. వైవాహిక అత్యాచారం సహా అనేకవాటిని నేరంగా తీర్మానించడానికి నిరాకరిస్తున్న మనం ఒక మహిళ తన బతుకుతెరువు కోసం తన దేహాన్ని వాణిజ్య సరొగసీకి వాడి, మరో స్త్రీకి సాయం చేస్తే తప్పేమిటనే వాదనకు జవాబు లేదు. సమాజంలో పెళ్ళికీ, మాతృత్వానికీ ఇచ్చిన అతి ప్రాధాన్యమూ సరొగసీపై చర్చోపచర్చలకు కారణమవుతోంది. అద్దె గర్భంతో బిడ్డను కంటే ఆ స్త్రీ ‘మంచి తల్లి’ కాదంటారా? అలాంటి తప్పుడు మూస ఆలోచన నుంచి మనం బయటపడేదెప్పుడు? నటి ప్రియాంకాచోప్రా, నిక్ జోన్స్ దంపతులు ఆ మధ్య సరొగసీతో సంతానం పొందినప్పుడూ వారిని అనరాని మాటలన్నారు. ఒక మహిళ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుని, తన హక్కును వినియో గించుకుంటే... ‘ఆడవాళ్ళంటే ఇలానే ఉండాలి, ఇలాగే అమ్మతనం పొందా’లంటూ పితృస్వామ్య భావజాలంతో ఒత్తిడి చేయడానికి ఎవరికి ఏం హక్కుంది? ఈ సెలబ్రిటీ సరొగసీ రచ్చతో చర్చకు వచ్చిన అనేక అంశాలను సావధానంగా ఆలోచించాల్సిందే! సమాజం సమాధానం చెప్పాల్సిందే! -
సరోగసీ వివాదం.. ఇన్‌డైరెక్ట్‌గా స్పందించిన నయన్ దంపతులు!
సౌత్ స్టార్ కపుల్ నయనతార-విఘ్నేశ్ శివన్ తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. వారికి ఇద్దరు కవలలు జన్మించారంటూ విఘ్నేశ్ శివన్ ఆదివారం(అక్టోబర్ 9న) సోషల్ మీడియా వేదికగ ప్రకటించాడు. ఈ సందర్భంగా నయన్-విఘ్నేశ్ చిన్నారుల పాదాలను ముద్దాడుతున్న ఫొటోలను షేర్ చేశాడు. దీంతో ఈ జంటకు సినీ సెలబ్రెటీలు, ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుంటే మరోవైపు విమర్శలు కూడా వస్తున్నాయి. వీరు తల్లిదండ్రులు అయిన వ్యవహరంపై ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. పెళ్లయిన 5 నెలలకే పిల్లలు జన్మించడంతో ఈ జంట సరోగసీని మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సరోగసీ ద్వారానే నయన్ తల్లయిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంతవరకు నయన్ దంపతులు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ క్రమంలో వారు భారత చట్టాన్ని ఉల్లంఘించారంటూ నెటిజన్లు, సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. అంతేకాదు ఈ వ్యవహరంపై తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించిన సంగతి తెలిసిందే. సరోగసీపై నయనతార-విఘ్నేశ్ శివన్‌లు ప్రభుత్వానికి వివరాలు అందజేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణియన్ పేర్కొన్నారు. ఈ వివాదంపై ఇప్పటి వరకు నయన్-విఘ్నేశ్‌లు స్పందించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో నయనతార భర్త విఘ్నేశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కోట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి. ‘అన్ని విషయాలు సరైన సమయంలో మీకు తెలుస్తాయి. అప్పటివరకు ఓపిక పట్టండి. ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండండి’ అంటూ ఇన్‌స్టాలో స్టోరి షేర్ చేశాడు. మీ గురించి ఆలోచిస్తూ మీ మంచి కోరే వ్యక్తుల పట్ల మీరు శ్రద్ద చూపించండి. అలాంటి వారే మీ వాళ్లు’ అంటూ మరో కోటేషన్ షేర్ చేశాడు. ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ పోస్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సరోగసీ వివాదంపై నయన్ దంపతులు ఇన్‌డైరెక్ట్‌గా స్పందించారని, వారిపై విమర్శలు చేస్తున్న వారికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తల్లిదండ్రులైన మరుసటి రోజే నయన్ దంపతులకు షాక్! టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నటి భాగ్యశ్రీ కూతురు, బెల్లంకొండ హీరోతో జోడి -
నయనతార చేసిన తప్పేంటి ...? జైలు శిక్ష తప్పదా ...?
-
నయన్-విఘ్నేశ్ చట్టాన్ని అతిక్రమిస్తే.. శిక్షేంటో తెలుసా?
నయనతార కవలలకు జన్మనినిచ్చిని విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే అదే ఇప్పుడు వివాదంగా మారింది. పిల్లలు ఏ విధంగా పుట్టారన్న దానిపై నయన్ దంపతులు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో వివాదం కొనసాగుతోంది. దీంతో సరోగసి ద్వారానే పిల్లలు జన్మించినట్లు అందరూ భావిస్తున్నారు. మరి మనదేశంలో సరోగసికి ఉన్న నిబంధనలేంటి? మన దేశంలో చట్టం ఏం చెబుతోంది? ఒకసారి పరిశీలిద్దాం. మనదేశంలో సరోగసి చట్టం ప్రకారం పెళ్లయిన ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యాక పిల్లలు పుట్టకపోతే ఈ పద్ధతిని ఎంచుకోవచ్చు. ఒకవేళ చట్టంలోని నిబంధనలు అతిక్రమించినట్లు రుజువైతే పదేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశముంది. అయితే నయన్-విఘ్నేశ్ దంపతులు దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కేవలం సోషల్ మీడియాలో కవలలు పుట్టిన విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం పిల్లలు ఎలా జన్మించారో వివరణ ఇవ్వాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. -
చిక్కుల్లో నయన్ దంపతులు, సరోగసీపై స్పందించిన ప్రభుత్వం
తల్లిదండ్రులైన మరుసటి రోజే సౌత్ స్టార్ కపుల్ నయనతార-విఘ్నేశ్ శివన్ దంపతులకు షాక్ తగిలింది. ఈ ఏడాది జూన్ 9న పెళ్లి పీటలు ఎక్కిన నయన్-విఘ్నేశ్‌లు ఐదు నెలల తిరక్కుండానే తల్లిదండ్రులు అయ్యారు. తాము కవలలకు తల్లిదండ్రులమయ్యామంటూ నయన్ భర్త, దర్శకుడు విఘ్నేశ్ సోషల్ మీడియా వేదికగా ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: నయన్‌ను టార్గెట్ చేసిన నటి, నెట్టింట దుమారం రేపుతున్న ట్వీట్ ఈ సందర్భంగా వారిద్దరు చిన్నారుల పాదాలను ముద్దాడుతున్న ఫొటోలను షేర్ చేస్తూ మురిసిపోయాడు విఘ్నేశ్. దీంతో సరోగసి(అద్దే గర్భం ద్వారా పిల్లలను కనడం) ద్వారానే నయన్-విఘ్నేశ్ తల్లిదండ్రులు అయ్యారనే వాదన వినిపిస్తోంది. ఈ తరుణంలో సీనియర్ నటి కస్తూరి సరోగసి ద్వారా నయన్ తల్లి కావడంపై పరోక్షంగా స్పందించింది. సరోగసీని దేశంలో నిషేధించారని, ఈ ఏడాది దీనిపై ఉత్తర్వులు కూడా వచ్చాయంటూ ఆమె ట్వీట్ చేసింది. దీంతో ఆమె ట్వీట్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. చదవండి: వివాదంలో నాగచైతన్య మూవీ! చిత్ర బృందంపై గ్రామస్తుల దాడి? నటి కస్తూరితోపాటు చాలామంది అదే అనుమానం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నయన్ దంపతులు వ్యవహరించారంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్‌కు తెరలేపారు. ఇవన్నీ చూస్తుంటే.. నయన్ దంపతులు వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారు తల్లిదండ్రులు అయిన తీరుపై తాజాగా తమిళనాడు ప్రభుత్వం స్పందిందించింది. ఈ మేరకు సరోగసీపై నయనతార-విఘ్నేశ్ శివన్‌లు ప్రభుత్వానికి వివరాలు అందజేయాలని ఆదేశించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణియన్ పేర్కొన్నారు. అంతేకాదు సరోగసీ ప్రక్రియ సక్రమంగా జరిగిందా? లేదా? అన్న దానిపై కూడా నయన్ దంపతులను ఆరా తీస్తామని ఆయన తెలిపారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
నయనతార కవలల పేర్లు తెలుసా.. వాటి అర్థాలు ఇవే..!
కోలీవుడ్ జంట నయనతార, విఘ్నేశ్ శివన్ సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా పలువురు తారలు శుభాకాంక్షలు తెలిపారు. నయనతార ఇద్దరు మగ పిల్లలకు(ట్విన్స్) పేర్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె భర్త విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ జంట కవల పిల్లలకు తమిళంలో ఉయిర్, ఉలగం అనే పేర్లను పెట్టారు. చాలామంది అభిమానులు వారి పేర్ల వెనుక ఉన్న అర్థాలపై ఆరా తీశారు. ఉయిర్, ఉలగం రెండూ తమిళ పదాలు కావడంతో ఫ్యాన్స్ తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. అయితే తమిళంలో ఉయిర్ అంటే జీవితం అనే అర్థం వస్తుంది. మరోవైపు ఉలగం అంటే ప్రపంచమని అర్థం వచ్చేలా పేర్లు పెట్టినట్లు తెలుస్తోంది. కొత్తగా తల్లిదండ్రులైన కోలీవుడ్ జంటకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేష్ పోస్ట్‌పై విక్కీ కౌశల్, అర్జున్ కపూర్ వంటి బాలీవుడ్ స్టార్లు స్పందించారు. టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 'నయన్, విక్కీకి అభినందనలు. పేరెంట్ క్లబ్‌కు స్వాగతం. జీవితంలో అత్యుత్తమ దశ. మీ ఇద్దరు పిల్లలకు నా ఆశీర్వాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. ఆరేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన నయన్-విక్కీలు జూన్ 9న తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. -
నయన్‌ను టార్గెట్ చేసిన నటి, నెట్టింట దుమారం రేపుతున్న ట్వీట్
సీనియర్ నటి కస్తూరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ అంతా ఇంత కాదు. వివాస్పద ట్వీట్స్ చేస్తూ తరచూ ఆమె వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఆమె మరోసారి సంచలన ట్వీట్ చేసి వార్తల్లోకెక్కింది. భారతదేశంలో సరోగసిని బ్యాన్ చేశారంటూ ఆమె చేసిన ట్వీట్స్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా నిలిచింది. ‘ఇండియాలో సరోగసీపై నిషేధం విధించారు. వైద్యపరంగా అనివార్య కారణాల కోసం తప్ప.. సరోగసీని ప్రోత్సాహించకూడదు. ఈ చట్టం జనవరి 2022 నుంచి అమల్లోకి వచ్చింది. చదవండి: మనోజ్ సెకండ్ మ్యారేజ్‌పై మంచు లక్ష్మి షాకింగ్ రియాక్షన్ దీని గురించి మనం రాబోయే రోజుల్లో చాలా వినబోతున్నాం’ అంటూ కస్తూరి ఆమె తన ట్వీట్లో రాసుకొచ్చింది. అయితే లేడీ సూపర్ స్టార్ నయనతార తల్లయిన విషయం ప్రకటించిన అనంతరం కాసేపటికే ఆమె ఈ ట్వీట్ చేయడం గమనార్హం. జూన్ 9న ప్రియుడి విఘ్నేశ్ శివన్‌తో ఏడడుగులు వేసిన నయన్ ఆదివారం(అక్టోబర్ 9న) కవలకు తల్లయినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె సరోగసి ద్వారా కవలకు జన్మనిచ్చిందని అందరు భావిస్తున్నారు. ఈ క్రమంలో నటి కస్తూరి సరోగసిపై ట్వీట్ చేయడంతో ఆమె నయన్‌ను టార్గెట్ చేసిందని అందరు అభిప్రాయపడుతున్నారు. చదవండి: ఈ దీపావళికి థియేటర్లో సందడి చేయబోతున్న చిత్రాలివే దీంతో నయన్ ఫ్యాన్స్ కస్తూరిపై మండిపడుతున్నారు. ‘ఇప్పుటి రోజుల్లో లా(Law)ని ఎవరు ఫాలో అవుతున్నారు?’, ‘ఎవరి జీవితం వారిది.. మీకేందుకు, మీ పని మీరు చూసుకోండి’, ‘ఇప్పుడు ఈ ట్వీట్ చేసి ఎవరిని భయపెడుతున్నారు.. ఎదుటి వాళ్లు సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నారా?’ అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఈ విమర్శలకు సైతం ఆమె స్పందిస్తూ ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. నా పని నన్ను చూసుకో అని చెప్పిన వారందకి ఇదే నా సమాధానం. ‘లాయర్‌గా పట్టా పొందిన ఓ వ్యక్తిగా చట్టపరమైన అంశాలను విశ్లేషించే హాక్కు ఉంటుంది’ అంటూ ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చింది. Surrogacy is banned in India except for medically inevitable reasons. This is the law from Jan 2022. We are going to be hearing a lot about this for next several days. — Kasturi Shankar (@KasthuriShankar) October 9, 2022 -
స్వదేశీ సాహివాల్‌కు అద్దె గర్భంతో కొత్త ఊపిరి
శ్రీగిరి విజయ్‌కుమార్ రెడ్డి: చేను, చెలకల్లో మళ్లీ స్వదేశీ గోజాతుల అంబారావాల సవ్వడి పెరిగిపోనుంది. అంతరించిపోతున్న అరుదైన దేశీ పశుసంపద సంరక్షణ బాధ్యతను తీసుకున్నవారితో పాటు, తాజాగా కేంద్రప్రభుత్వం చేపట్టిన ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’ కొత్త చరిత్రను తెరమీదకు తెస్తోంది. నూటికి నూరుశాతం సాహివాల్ జన్యు లక్షణాలు కలిగిన కోడె వీర్యాన్ని, ఆవు నుండి తీసిన అండాలను జగిత్యాల ప్రభుత్వ వెటర్నరీ కాలేజీ ప్రయోగశాలలో ఫలదీకరణ చేసి ఆవుల గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా సాహివాల్ దూడలకు ఇటీవలే ఊపిరి పోశారు. కోస్నూరుపల్లె మూల మోహన్‌రెడ్డి, సింగారావుపేట బద్దం రాజశేఖరరెడ్డికి చెందిన ఆవులకు రెండు నెలల క్రితం పుట్టిన లేగదూడలు పూర్తి సాహివాల్ జన్యు లక్షణాలతో ఆరోగ్యంగా ఎదుగుతున్నాయి. గడిచిన ఆర్నెల్లలో వెటర్నరీ కళాశాల వైద్యులు ఈ విధంగా 172 అండాలు ఫలదీకరణ చేసి అందులో వంద వరకు ఆవుల గర్భంలో అమర్చారు. దీంతో వచ్చే రెండు మూడు నెలల్లో ఒక్క జగిత్యాల జిల్లాలోనే వందకు పైగా దేశీ సాహివాల్ దూడలు జన్మించనుండటం పశుసంపద రక్షణకు సంబంధించి గొప్ప మలుపు కానుంది. ఈ పద్ధతి (ఐవీఎఫ్)లో కాకుండా కృత్రిమ గర్భధారణ చేస్తే పూర్తి జన్యులక్షణాలతో దూడలు పుట్టేందుకు పదితరాలు (ముప్పై నుండి నలభై సంవత్సరాలు) సమయం తీసుకునే అవకాశం ఉండగా తాజా అద్దెగర్భ ప్రయోగం తొలి దశలోనే విజయవంతం కావడం స్వదేశీ పశు సంపద అభివృద్ధిపై ఆశలు రేకెత్తిస్తోంది. యాభై స్వదేశీ జాతుల్లో..ప్రస్తుతం పదే! ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ పరిధిలోని బ్యూరో ఆఫ్ యానిమల్ జెనిటిక్ రీసోర్సెస్ (బీఏజీఆర్) దేశంలో 50 స్వదేశీ గోవు జాతులను గుర్తించగా, అందులో మెజారిటీ జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. 2012–19 మధ్య కాలంలో స్వదేశీ గోవులు 8.94 శాతం అంతరించాయి. ఈ నేపథ్యంలో రైతులు, ప్రభుత్వ సంస్థల సంరక్షణ చర్యలతో.. ప్రస్తుతం ఒంగోలు, పుంగనూరు (ఆంధ్రప్రదేశ్), పొడతురుపు (తెలంగాణ), గిర్ (రాజస్తాన్), సాహివాల్ (పంజాబ్, రాజస్తాన్), తార్పార్కర్ (రాజస్తాన్), డివోని (కర్ణాటక, మహారాష్ట్ర), వేచూర్, కాసరగోడ్ (కేరళ), కాంక్రేజ్ (గుజరాత్, రాజస్తాన్) గోవు జాతులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిమిత సంఖ్యలో ఉన్నాయి. గోకుల్ మిషన్‌తో సంరక్షణ చర్యలు ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం కూడా స్వదేశీ జాతుల సంరక్షణ, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ‘గోకుల్ మిషన్’ను ప్రకటించింది. 2021 మొదలుకుని 2026 వరకు రాష్ట్రీయ పశుధాన్ వికాస్ యోజనను అమలు చేస్తోంది. అందులో భాగంగానే జగిత్యాల వెటర్నరీ కళాశాలలో రూ.5.26 కోట్లతో ఓ ల్యాబొరేటరీ ఏర్పాటు చేసి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పద్ధతిలో సాహివాల్ గోవుల సంరక్షణను ప్రారంభించింది. తెలంగాణ బ్రాండ్‌గా.. పొడతురుపు ‘పొడతురుపు’గోవులకు ఇటీవలే కేంద్రం తెలంగాణ బ్రాండ్‌గా గుర్తింపునిచ్చింది. నాగర్‌కర్నూల్ జిల్లాతో పాటు నల్లమల అటవీప్రాంతంలో ప్రస్తుతం ఇవి 15 వేల వరకు ఉన్నట్టు తేల్చారు. కొండల్లోనూ ఆహారం సంపాదిస్తాయి. క్రూర జంతువుల నుండి కాపాడుకుంటాయి. ఈ ఆవు పాలల్లో ఔషధ గుణాలుంటాయి. రోజంతా శ్రమించే గుణం ‘పొడతురుపు’సొంతం. జన్యుపరమైన గుర్తింపు రావటంతో ఈ జాతిని సంరక్షించే బాధ్యతను అధికార యంత్రాంగం చేపట్టింది. అంతటా చేపట్టాలి వెటర్నరీ కాలేజీలో ప్రయోగం విజయవంతం కావటం స్వదేశీ గోమిత్రుల్లో సంతోషం నింపుతోంది. అయితే సాంకేతిక కారణాల దృష్ట్యా జగిత్యాలకు 30 నుండి 40 కి.మీ దూరంలో ఉండే ప్రాంతాల్లోనే ఈ విధంగా చేసేందుకు అవకాశం ఉన్న దృష్ట్యా, ఈ పరిజ్ఞానం విస్తరణను వీలైనంత త్వరగా చేపట్టాలని ఇప్పటికే సొంతంగా స్వదేశీ గోజాతులను సంరక్షిస్తున్న రైతులు డిమాండ్ చేస్తున్నారు. (క్లిక్ చేయండి: వైఎస్సార్ రెండిస్తే.. నేను నలభై చేసిన) సేవ్ స్వదేశీ ఆవు దేశీ గోవులను యుద్ధ ప్రాతిపదికన సంరక్షించాలంటూ అల్లోల దివ్యారెడ్డి ఇటీవల సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తన పిల్లలకు స్వచ్చమైన పాలను అందించేందుకు ఆమె పడిన తపన.. స్వదేశీ గో సంరక్షణ వైపు అడుగులు వేయించింది. సంగారెడ్డిలో వంద గోవులతో (గిర్) ప్రారంభమైన దివ్యారెడ్డి ఫామ్ ప్రస్తుతం 250 ఆవులు, కోడెలతో నిండిపోయింది. చాలాకాలంగా పశు సంవర్థక శాఖల ఆధ్వర్యంలో స్వదేశీ ఆవులను విదేశీ బ్రీడ్‌తో కృత్రిమ గర్భధారణ చేస్తుండటంతో స్వదేశీ ఆవు జాతులు అంతరించి పోయాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం దేశంలో 26 శాతం హైబ్రిడ్ , మరో 56 శాతం క్రాస్‌బ్రీడ్ గోవులున్నాయని వివరించారు. వీటి స్థానంలో స్వదేశీ జాతుల అభివృద్ధి కోసం తాను ఓ అడుగు ముందుకు వేశానని దివ్యారెడ్డి చెప్పారు. (క్లిక్ చేయండి: అందుకే ఆవు... ఆరాధ్యదైవం అయింది) -
Andhra Pradesh: సరోగసి చట్టం అమలుకు ప్రత్యేక బోర్డు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సరోగసీ చట్టం–2021, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ చట్టం–2021 అమలుకు ప్రభుత్వం ప్రత్యేక బోర్డు, రాష్ట్ర, జిల్లా అథారిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. బోర్డుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి చైర్‌పర్సన్‌గా, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. వివిధ విభాగాల కమిషనర్లు, డైరెక్టర్లు, నిపుణులు సభ్యులుగా ఉంటారు. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధలను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర అథారిటీకి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్/డైరెక్టర్ చైర్మన్‌గా, అడిషనల్ డైరెక్టర్ (ఎంసీహెచ్) వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ముగ్గురు సభ్యులు కూడా ఉంటారు. జిల్లా స్థాయిల్లో అథారిటీకి కలెక్టర్ చైర్మన్‌గా, డీఎంహెచ్‌వో వైస్ చైర్మన్‌గా ఉంటారు. మరో ముగ్గురు సభ్యులు ఉంటారు. సరోగసి, కృత్రిమ గర్భధారణ పేరుతో జరుగుతున్న వ్యాపార ధోరణిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఈ చట్టాలను తెచ్చింది. -
కన్నతల్లి కర్కశం: ఐదేళ్లుగా కూతురిని హింసించి మరీ..
ఛీ.. ఛీ.. ఈ భూమ్మీద ఏ మహిళ కూడా ఇంతటి ఘోరానికి పాల్పడి ఉండదేమో!. కూతురు యుక్త వయసుకు రాగానే.. దుర్మార్గానికి తెర తీసింది ఇక్కడో కన్నతల్లి. కూతురిపై ప్రియుడితో అత్యాచారం చేయించడమే కాదు.. బలవంతంగా కూతురి నుంచి అండ సేకరణ చేపట్టి దొడ్డిదారిలో సరోగసీ(అద్దె గర్భం) కోసం అమ్మేసుకుంది. ఒకటికాదు.. రెండుకాదు.. ఐదేళ్లుగా ఈ ఘోరం జరుగుతూ వస్తోంది. తమిళనాడు ఈ రోడ్లో కన్నతల్లి చేసిన అక్రమ నిర్భంధ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓ కన్నతల్లి తన కూతురి నుంచి బలవంతంగా అండ సేకరణ చేపట్టి.. అక్రమ సరోగసీ కోసం ఆస్పత్రులకు అమ్మేసుకుంది. పైగా ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతూ.. అతనితో కూతురిపైనే అత్యాచారం చేయిస్తూ వచ్చింది. తమిళనాడు ఈ రోడ్లో జరిగిన ఈ ఘోరంపై హైలెవల్ దర్యాప్తు కొనసాగుతోంది. మెడికల్ అండ్ రూరల్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టోరేట్ అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. జాయింట్ డైరెక్టర్ విశ్వనాథన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం.. సోమవారం స్టేట్ హోంలో ఉన్న బాధితురాలిని పరామర్శించి మూడు గంటలపాటు ప్రశ్నించారు. ఈ రోడ్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాలోని ఆస్పత్రుల్లో ఈ ఇల్లీగల్ సరోగసీ వ్యవహారం నడిచినట్లు అధికారులు నిర్దారణకు వచ్చారు. ఈ రోడ్‌కు చెందిన నిందితురాలు(33).. భర్తకు దూరంగా ఉంటోంది. బిడ్డను తనతో పాటే పెంచుకుంటోంది. ఈ క్రమంలో మరో వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. కూతురు యుక్తవయస్సుకు రాగానే.. తన ప్రియుడి ద్వారానే అత్యాచారం చేయించింది. గత ఐదేళ్లుగా.. బాధితురాలిపై అత్యాచార పర్వం కొనసాగుతోంది. బాధితురాలి నుంచి అండాలను బలవంతంగా సేకరించి.. ఆస్పత్రులకు అమ్మేసుకుంటూ ఆ తల్లి, ఆమె ప్రియుడు, మధ్యవర్తి.. డబ్బులను పంచుకుంటూ వస్తున్నారు. అంతేకాదు.. కూతురి వయసును ఆధార్‌కార్డులో మార్పించేసి మరీ ఈ దందాకు పాల్పడుతూ వస్తున్నారు. జూన్ 1వ తేదీన వేధింపులు భరించలేక బాధితురాలు ఇంటి నుంచి పరారైంది. సేలంలోని తన స్కూల్ స్నేహితురాలి ఇంట్లో తలదాచుకుని.. బంధువుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో యాక్ట్, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలి తల్లి, ఆమె ప్రియుడు, మధ్యవర్తి, ఆధార్‌ను మార్పిడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. అంతేకాదు అక్రమ సరోగసీకి పాల్పడిన ఆస్పత్రులపై, వైద్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది తమిళనాడు ప్రభుత్వ వైద్య శాఖ. -
ప్రియాంక చోప్రా గారాల పట్టి పేరు ఏంటో తెలుసా?
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా-నిక్ జోనస్ దంపతులు ఇటీవల సరోగసీ ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. 2018, డిసెంబర్లో వివాహం చేసుకున్న ఈ జంట.. మూడేళ్ల తర్వాత ఈ ఏడాది జనవరిలో సరోగసి ద్వారా తల్లిదండ్రులైయ్యారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బిడ్డకు సంబంధించిన ఫోటోలను కానీ, పేరుని కానీ బయటకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. తాజాగా ప్రియాంక, నిక్‌లు తమ బిడ్డకు పేరు పెట్టినట్లు తెలుస్తోంది. తమ గారాల పట్టికి ‘మాల్టీ మేరీ చోప్రా జోనస్’అని నామకరణం చేశారట. మాల్టీ అంటే సంస్కృతంలో సువాసన కలిగిన పువ్వు అని అర్థం. అంతేకాకుండా ప్రియాంక తల్లి మధుమాల్టీ నుంచి మాల్టీ అని తీసుకున్నారట. ఇక మేరీ అంటే నక్షత్రం అని అర్థం. అలాగే జోనస్ తల్లి పేరు కూడా కలుస్తుంది. ఇక చివరిగా తన పేరు, భర్త పేరు వచ్చేలా చోప్రా జోనస్ పెట్టారట. బర్త్ సర్టిఫికేట్ ప్రకారం ప్రియాంక కూతురు అమెరికాలోని శాండియాగోలో 2022, జనవరి 15న ఉదయం 8 గంటలకు జన్మించినట్లు ఉంది. ఇక ప్రియాంక సినిమాల విషయానికొస్తే.. ఒకప్పుడు బాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన ఈ భామ.. ఇటీవల హాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. టీవలే హాలీవుడ్ యాక్షన్ సినిమా ఫ్రాంచైజీలో ఒకటైన 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్'తో అలరించింది. ప్రస్తుతం 'సిటాడెల్' అనే అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్‌లో నటిస్తోంది. (చదవండి: బిడ్డ పుట్టాక కాజల్ ఫస్ట్ పోస్ట్, ఇదేమీ ఆకర్షణీయంగా ఉండదంటూ!) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1131264712.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘సరోగసీ’ యే ముద్దు అన్న సెలబ్రిటీలు..లిస్ట్ పెద్దదే!
సాక్షి, హైదరాబాద్: గర్భం వద్దు.. సరోగసీ ముద్దు అంటున్న సెలబ్రిటీల సంఖ్య ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతోంది. తాజాగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సరోగసీ ద్వారా బిడ్డను కన్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో సరోగసీ విధానం మరోసారి చర్చనీయాంశమైంది. టెక్నాలజీ పుణ్యమా అని హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు సరోగసీకి జై కొడుతున్నారు. ఆమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, శిల్పా శెట్టి, సన్నీ లియోన్, కరణ్ జోహార్ ఇప్పుడు ప్రియాంక చోప్రా దాకా సరోగసీని ఎంచుకుంటున్నారు. పెళ్లి అయిన ఏడాదికో, రెండేళ్లకో దంపతులు తమకు పుట్టబోయే బిడ్డల గురించి కలలు కనడం సర్వ సాధారణం. తమకు ప్రతిరూపాలుగా పుట్టిన బిడ్డలని చూసి మురిసిపోతారు. ఈ సైకిల్ తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది. అయితే వివిధ కారణాల రీత్యా ఏళ్లతరబడి ఎదురు చూసినా సంతానం కలగని వారు గతంలో ఎడాప్షన్ అనే ఆప్షన్‌ను ఎంచుకునేవారు. కానీ తమ రక్తం పంచుకుని పుట్టలేదనే ఒక సెంటిమెంట్ వారిని వెంటాడేది. ఈ క్రమంలో ఆధునిక టెక్నాలజీ నేపథ్యంలో వచ్చిన నయా ట్రెండే సరోగసీ. ముఖ్యంగా కరియర్‌కు బ్రేక్ ఇవ్వడం ఇష్టంలేని హీరోయిన్లు, గర్భం దాల్చిన తరువాత వచ్చే మార్పులకు భయపడి, మరోవైపు వయసు పెరగడం వల్ల బిడ్డలు ఆరోగ్యంగా ఉండరేమో అనే ఆందోళన తదితర కారణాల రీత్యా సరోగసి వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే కొంతమంది పురుష సెలబ్రిటీలు కూడా ఈ విధానం ద్వారా సింగిల్ పేరెంట్‌గా అవతరిస్తున్నారు. ఇలా సరోగసీ ద్వారా బిడ్డల్ని కన్నవారిలో ఆమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, శిల్పా శెట్టి, సన్నీ లియోన్, కరణ్ జోహార్ తాజాగా ప్రియాంక చోప్రా నిలిచారు. ఇక టాలీవుడ్లో లక్ష్మి మంచు తొలి సరోగసి మదర్‌గా నిలిచి ఒక పాపకు తల్లి అయిన సంగతి తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఈ విధానం బాగా పాపులర్ అయింది. ఆరోగ్యపరంగా తల్లి తండ్రులు కాలేని దంపతులు, జన్యుపరమైన సమస్యలతో తల్లి కాలేని మహిళలు, వివిధ సామాజిక కారణాలరీత్యా సరోగసీ పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. సరోగసి అంటే ఒక విధంగా చెప్పాలంటే మహిళ గర్భాన్ని అద్దెకు తీసుకుని తద్వారా సంతానాన్ని పొందడం. ఇందుకు గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళలకు డబ్బులు చెల్లిస్తారు. దీనికయ్యే ఖర్చుకూడా తక్కువేమీ కాదు. అయితే అమ్మలు, అమ్మమ్మలు, ఇతర సమీప బంధువుల ద్వారా కూడా బిడ్డల్ని కంటున్నప్పటికి.. ఇలాంటి సంఘటనలు చాలా అరుదు. సరోగసీని ద్వారా తమ కుటుంబాల్లోకి బిడ్డల్ని ఆహ్వానిస్తున్న ప్రముఖుల జాబితా చాలా పెద్దదే. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి 2020లో సరోగసీ ద్వారా రెండవ బిడ్డగా సమీషా అనే పాపకు జన్మనిచ్చింది. సొట్టబుగ్గల సుందరి ప్రీతీజింటా కూడా ఈ ప్రక్రియలోనే కవల పిల్లల్ని తమ జీవితంలో ఆహ్వనించింది. 2021, నవంబరులో ప్రీతి జింటా జీన్ గూడెనఫ్ దంపతులు ఈ విషయాన్ని ఇన్‌స్టాలో వెల్లడించారు. జై, గియా అంటూ తమ పిల్లల పేర్లను కూడా ప్రపంచానికి పరిచయం చేశారు. టెలివిజన్ నిర్మాత, బాలాజీ టెలిఫిల్మ్స్ అధినేత ఏక్తా కపూర్ జనవరి 2019లో సరోగసీ ద్వారా తన కుమారుడిని స్వాగతించారు. అంతేకాదు ముందు చూపుగా 36 ఏళ్ల వయసులో తన అండాన్ని భద్రపర్చుకోవడం విశేషం. 2008 ఫిబ్రవరిలో ఫరా ఖాన్, శిరీష్ కుందర్ ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కన్నారు. అంతుకుమందు ఆమె సోదరుడు తుషార్ జూన్ 2016లో సరోగసీ ద్వారా తన మగబిడ్డను కని సింగిల్ పేరెంట్‌గా అవతరించాడు. మార్చి 2017లో, దర్శక-నిర్మాత కరణ్ జోహార్ సరోగసీ ద్వారా కవలలకు తండ్రి అయ్యానని ప్రకటించుకున్నాడు 2013లో బాలీవుడ్స్టార్ హీరో షారూఖ్ ఖాన్ అభిరామ్‌కు జన్మనిచ్చింది కూడా సరోగసీ ద్వారానే. అలాగే ఇటీవలికాలంలో విడాకులు తీసుకున్న ఆమీర్ ఖాన్ కిరణ్ రావ్ 2011లో సరోగసీ ద్వారా ఆజాద్ రావ్ ఖాన్‌కు జన్మనిచ్చారు. ఇక నటి సన్నీ లియోన్ కూడా సరోగసీ ద్వారా మరో ఇద్దరు పిల్లలకు తల్లి అని గర్వంగా ప్రకటించింది. మే 2018లో నటుడు శ్రేయాస్ తల్పాడే, దీప్తి సరోగసీ ద్వారా ఆద్య అనే పాపకు జన్మనించ్చారు. నటి లిసా రే , జాసన్ దేహ్ని జూన్ 2018లో అద్దె గర్భం ద్వారా సూఫీ, సోలీల్ అనే కవలలకు తల్లిదండ్రులయ్యారు. -
మొదటిసారి తల్లైన ప్రియాంక చోప్రా
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తల్లైంది. సరోగసి ద్వారా ప్రియాంక- నిక్ జోనస్ దంపతులు ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 'సరోగసీ ద్వారా మాకు బిడ్డ పుట్టింది. ఈ ఆనందకరమైన సమయాన్ని మా కుటుంబంతో కలిసి ఆస్వాదించాలనుకుంటున్నాం. దయచేసి మా గోప్యతకు భంగం కలిగించకండి. ధన్యవాదాలు..' అని రాసుకొచ్చింది. ఈ విషయం తెలిసిన సెలబ్రిటీలు, అభిమానులు ప్రియాంక దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా నిక్, ప్రియాంక 2018 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. రాజస్తాన్‌లోని ఉమైద్ భవన్ రాజభవనంలో మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరిగాయి. క్రిస్టియన్ పద్ధతిలో ఓసారి, హిందూ సంప్రదాయంలో మరోసారి వీరి పెళ్లి జరిపించారు. సరోగసి ద్వారా తల్లైన హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
సరోగసి ద్వారా ప్రీతి జింటాకు కవలలు
ముంబై: ప్రేమంటే ఇదేరా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నటి ప్రీతి జింటా అద్దె గర్భం (సరోగసి) ద్వారా తల్లయింది. ఆమెకు కవల పిల్లలు.. ఒక కుమారుడు, కుమార్తె జన్మించారు. ఈ శుభవార్తని ప్రీతి జింటా గురువారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. అమెరికాకు చెందిన ఆర్థిక నిపుణుడు జెనె గుడెనఫ్‌ను 2016లో పెళ్లిచేసుకున్న ప్రీతి జింటా అప్పట్నుంచి వెండితెరకి దూరమయ్యారు. అమెరికాలో లాస్ఏంజెల్స్లో ఉంటున్న 46 ఏళ్ల వయసున్న ప్రీతి ఇప్పుడు తల్లయిన సంబరంలో ఉన్నారు. సరోగసి ద్వారా తల్లినయ్యే అపురూపమైన ఈ ప్రయాణంలో తమకు తోడ్పాటునందించిన డాక్టర్లు, నర్సులు, మెడికల్ సిబ్బంది, అద్దె గర్భాన్ని మోసిన మహిళకి ప్రీతి ధన్యవాదాలు తెలిపారు. తన పిల్లలకి జై, జియా అని పేర్లు పెట్టినట్టు ఆ ట్వీట్లో వెల్లడించారు. ‘‘నేను, నా భర్త ఆనందంలో తలమునకలై ఉన్నాము. ఇద్దరు పిల్లలు ఒడిలోకి వచ్చిన ఈ సంబరంలో మా హృదయాలు ఎంతో ప్రేమతో నిండిపోయి ఉన్నాయి. వైద్య సిబ్బందిపై అపారమైన కృతజ్ఞత ఉంది. పిల్లలతో కొత్త ప్రయాణంపై ఎంతో ఉద్వేగంగా ఉంది’’ అని ప్రీతి ఆ ట్వీట్లో పేర్కొన్నారు. బాలీవుడ్లో బిడ్డల్ని కనడానికి సరోగసి విధానాన్ని ఎంచుకోవడం కొత్తకాదు. గతంలో కరణ్ జోహార్, షారూక్ ఖాన్, ఏక్తాకపూర్, అమీర్‌ఖాన్ వంటి వారు సరోగసి ద్వారా తల్లిదండ్రులయ్యారు. -
ప్రియుడిని నమ్మి అద్దె గర్భానికి ఒప్పుకుంది.. చివర్లో కథ అడ్డం తిరిగింది
ముంబై: ప్రియుడి మాట విని సరోగసికి ఒప్పుకుంది ఓ యువతి. అయితే అనుకోకుండా కథ అడ్డం తిరగడంతో చిక్కుల్లో పడింది. చివరకు పోలీసుల రంగప్రవేశంతో ఆ యువతి ఉచ్చులోంచి క్షేమంగా బయటపడింది. ఈ ఘటన మహరాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని మలద్‌కు చెందిన 22 ఏళ్ల యువతి ఉద్యోగ అన్వేషణ నిమిత్తం ముంబైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెకు నేవీ ముంబైలో ఓ డయోగ్నస్టిక్ సెంటర్లో చేరింది. కొన్ని రోజుల తరువాత అక్కడ పని చేస్తున్న వ్యక్తితో ఆ యువతికి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. అయితే అనుకోకుండా వారు పని చేస్తున్న డయోగ్నస్టిక్ సెంటర్ మూసివేయడంతో ఆమెకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీన్నే ఆసరాగా చేసుకున్న ఆమె ప్రియుడు సరోగసికి ఆమెను ప్రోత్సహించాడు. అలా చేస్తే రూ. 4-5 లక్షల డబ్బు వస్తుందని నమ్మబలికాడు. అందుకు అంగీకరించిన ఆమెను హైదరాబాద్‌కు పంపాడు. ఈ క్రమంలో వారు టోకన్ అడ్వాన్స్ కింద కొంత సోమ్మును కూడా తీసుకున్నారు. ఆగస్టు నెలలో ఆ యువతికి సరోగసి పరీక్షలు చేసిన వైద్యులు అందుకు ఆమె పనికి రాదని తెలిపారు. దీంతో ఆమె ఆశలు అడియాశలయ్యాయి. వారి దగ్గర తీసుకున్న టోకన్ డబ్బు కట్టలేకపోయింది. ఆమె ద్వారా డబ్బు పరంగా తనకెటువంటి లాభం లేదని గ్రహించిన ప్రియుడు అక్కడినుంచి జంప్ అయ్యాడు. ఏం చేయాలో తెలియక ఆ యువతి సెప్టెంబర్ 28న తన తల్లికి ఫోన్ చేసింది. తల్లి సదరు యువతిని పోలీసుల దగ్గరకు వెళ్లమని చెప్పింది. అనంతరం యువతి తల్లి తన కూతురు కనిపించటం లేదని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు హైదరబాద్‌లో ఉన్న యువతి ముంబైకి తీసుకువచ్చారు. విచారణలో ఆమె జరిగిందంతా పోలీసులకు చెప్పింది. ప్రియుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: వివాహేతర సంబంధం: మందలించిన భర్త.. ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ వేసిన భార్య.. -
వీటికి కూడా ఈఎంఐ ఉందా?
-
ఏంటీ.. వీటికి కూడా ఈఎంఐ ఉందా?
సాక్షి, వెబ్‌డెస్క్: ఈక్వెటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్.. అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఈఎంఐ అంటే అందరికీ ఇట్టే అర్థమవుతుంది. మనం పెద్ద వస్తువులు ఏం కొనాలన్నా ఇప్పుడు ఈఎంఐ అందుబాటులో ఉంది. ఇంట్లో వినియోగించే టీవీ, వాషింగ్ మిషన్ నుంచి ప్రయాణానికి వాడే వాహనాల వరకు ఈఎంఐతో కొనుక్కోవచ్చు. అంతేకాదు చదువులు, పెళ్లిళ్లు వంటి కుటుంబ అవసరాలకు కూడా ఈఎంఐ అక్కరకొస్తోంది. తాజాగా ఐవీఎఫ్, సరోగసీకి కూడా ఈఎంఐ రుణాలు దొరుకుతున్నాయి. సంతానలేమితో బాధ పడుతున్న దంపతులకు ఈఎంఐ ఎలా వరంగా మారుతుందో ఈ వీడియో చూసి తెలుసుకోండి. -
విడాకులైన ఐదేళ్లకు బిడ్డా!.. ఎవరితో కన్నావ్?
సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై జనాలకు.. ముఖ్యంగా ఫ్యాన్స్‌కు ఎక్కడా లేని ఆసక్తి. అయితే సంక్లిష్టమైన అంశాల జోలికి పోయినప్పుడు.. వాళ్లను వివాదాల్లోకి లాగడం తరచూ చూస్తుంటాం. అక్వామ్యాన్ ఫేమ్ హాలీవుడ్ నటి అంబర్ హెర్డ్ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఐదేళ్ల కిందట నటుడు జానీ డెప్ నుంచి విడాకులు తీసుకున్న అంబర్.. ఆ తర్వాత ఏడాదిపాటు టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌తో డేటింగ్ చేసింది. ఆ బ్రేకప్ తర్వాత నుంచి సోలోగానే ఉంటున్న అంబర్.. సరోగసీ ద్వారా ఆమె బిడ్డను కనడం హాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్‌లో తాను సరోగసీ ద్వారా బిడ్డను కన్నానని, ఆ బిడ్డ పేరు ఉనగ్ పైగె హెర్డ్ అని తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించుకుంది అంబర్ హెర్డ్. ఒళ్లో బిడ్డను పడుకోబెట్టుకున్న ఫొటోను ఆమె షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఆమెకు అభినందనలు తెలిపారు. అయితే.. ఆమె పోస్ట్‌ను పూర్తిగా చదవకుండా.. అర్థం చేసుకోని కొందరు.. ఆమె క్యారెక్టర్‌ను తప్పుబడుతూ కామెంట్లు చేశాడు. ‘ఎవరితో ఆ బిడ్డను కన్నావ్.. సిగ్గు లేదా?’ అంటూ విరుచుకుపడ్డారు. రహస్యంగా బిడ్డను కన్నావా? ఈసారి ఎవరి జీవితాన్ని నాశనం చేస్తావ్? అంటూ తీవ్ర విమర్శలు చేశారు. పనిలో పనిగా ఆమె మీద గుస్సాగా ఉన్న జానీ డెప్ ఫ్యాన్స్.. ఈ వ్యవహారాన్ని మరింత ముదిరేలా చేశారు. అయితే ఆ విమర్శలకు ఆమె శాంతంగానే స్పందిస్తూ.. ఘాటు రిప్లై ఇచ్చింది. ‘నాలుగేళ్ల క్రితమే బిడ్డను కనాలనుకున్నా. ఇప్పటికీ నా కల నెరవేరింది. అయినా నా వ్యక్తిగత జీవితం నా ఇష్టం. నేను ఎవరితో బిడ్డను కంటే మీకేం నొప్పి. సరోగసీ అనేది మీలాంటి వాళ్లకు అర్థం కానీ విషయం. అది అర్థమై ఉంటే మీరు మూర్ఖంగా ఎందుకు మాట్లాడతారు’ అని ఓ మీడియా ఛానెల్ ద్వారా విమర్శకులకు బదులిచ్చింది 35 ఏళ్ల అంబర్ లారా హెర్డ్. కాగా, హాలీవుడ్లో టైరా బ్యాంక్స్, జెమ్మీ ఫాలోన్, సారా జెస్సికా పార్కర్, ఎల్టోన్ జాన్.. ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు సరోగసీ ద్వారా బిడ్డల్ని కన్నారు. బాలీవుడ్, అంతెందుకు టాలీవుడ్‌లోనూ సరోగసీ ద్వారా బిడ్డల్ని కన్నవాళ్లు ఉన్నారు. వైవాహిక బంధం, కాపురాలపై అయిష్టత ఉన్న వాళ్లు ఎక్కువగా సరోగసీని ఆశ్రయిస్తుంటారు. View this post on Instagram A post shared by Amber Heard (@amberheard) చదవండి: సినిమాటోగ్రఫీ చట్టం సవరణలపై నిరసనలు -
చిన్ని తండ్రీ నిన్ను చూడక...
వివాహమైన 15 సంవత్సరాలుగా సంతానం కావాలన్న ఆ దంపతుల కలను సరోగసీ సఫలం చేసింది. వీరు అర్జెంటీనాలో ఉంటే, వారి బిడ్డ ఉక్రెయిన్‌లో కన్ను తెరిచాడు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా విమాన సర్వీసులు ఆగిపోవడంతో బిడ్డను చూసుకోవాలన్న వారి ఆశలు అడియాసలయ్యాయి. ఫ్లావియా, జోస్ పెరెజ్లకు వివాహమై 15 సంవత్సరాలు అయ్యింది. ఎలాగైనా తాను తల్లి కావాలని, తన బిడ్డతో అమ్మా అనిపించుకోవాలని ఉవ్విళ్లూరింది ఫ్లావియా. ఎన్ని అనుకుంటే మాత్రం ఏం ప్రయోజనం. వారికి నేరుగా పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు చెప్పటంతో, సరోగసీ కోసం ప్రయత్నించారు ఈ దంపతులు. చిట్టచివరగా వారి కల ఉక్రెయిన్‌లో నెరవేరే అవకాశం దొరికింది. మ్యాప్‌లో ఉక్రేన్ ఎంత దూరంలో ఉందో చూశారు. తామున్న ప్రదేశం బ్యునాస్ ఏర్స్ నుంచి 12,800 కి.మీ. అమ్మానాన్న అని పిలిపించుకోవడానికి అది పెద్ద దూరమనిపించలేదు వారికి. వెంటనే రెక్కలు కట్టుకుని ఉక్రెయిన్‌లో వాలిపోయారు. నాలుగు నెలలు ఉక్రెయిన్‌లోనే ఉండి, తమ లక్ష్యానికి బీజం వేసి వచ్చారు. వారి కల ఫలించింది. ‘‘మా ఇంటి దీపం ఉక్రెయిన్‌లో తల్లి గర్భంలో క్షేమంగా పెరుగుతున్నట్లు తెలిసిన మరుక్షణం మాకు చందమామ అందినంత ఆనందం కలిగింది. పిల్లవాడు భూమి మీద పడ్డ వెంటనే చూడాలనుకుని ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నాం. ఇంతలోనే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేయటం ప్రారంభమైంది. మార్చి 30న ఉదయాన్నే ఉద్యోగానికి వెళుతున్న సమయంలో, ‘‘మీ కల నెరవేరింది. . మీకు మగపిల్లవాడు పుట్టాడు.’’ అని వచ్చిన మెసేజ్ చదువుతూ, ఆనందంలో మునిగిపోయాం’’ అని చెప్పారు ఆ దంపతులు. చిట్టి చిట్టి ఎర్రటి చేతులతో, బుగ్గసొట్టలతో, కేరింతలు కొడుతూ ఉన్న ఆ పిల్లవాడి ఫొటో వాట్సాప్‌లో చూసుకుని పొంగిపోయారు. వాడికి ‘మాన్యుయెల్’ అని దూరం నుంచే పేరు పెట్టేశారు. కాని బిడ్డ పుట్టగానే పొత్తిళ్లలోకి తీసుకుని, గుండెలకు హత్తుకుందామన్న వారి కల మాత్రం నెరవేరలేదు. ప్రపంచంలోని మిగతా దేశాలలాగే ఉక్రెయిన్‌లో కూడా లాక్డౌన్ అమలులో ఉండటంతో, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ‘ఎంతోకాలంగా ఎదురుచూసిన మా కళ్లకు ఇంకా ఎదురుచూపులే మిగిలాయి. అసలు ఎప్పటికైనా మా బిడ్డను కళ్లతో చూసుకోగలమా అనే బాధ మొదలైంది. మమ్మల్ని మేమే సముదాయించుకున్నాం’’ అంటున్న ఈ దంపతులు ఆరోగ్యశాఖలో పనిచేస్తున్నారు. ఫ్లావిడా సోషల్ వర్కర్, జోస్ మెడికల్ డాక్టర్. అది కూడా కోవిడ్ 19 రోగులకు సేవలు చేసే విభాగంలో ఉన్నారు. అందువల్ల ఆయనకు సెలవులు కూడా లేవు. పదిహేను సంవత్సరాల తరవాత తల్లిదండ్రులైన ఈ దంపతులు తమ బిడ్డను గుండెలకు హత్తుకునే రోజు కోసం మరెన్నాళ్లు నిరీక్షించాలో. -
సరోగసీకి ఇంకా సమస్యలే
ఎట్టకేలకు సరోగసీ (అద్దె గర్భం) బిల్లుపై సెలెక్ట్ కమిటీ సిఫార్సులు పెద్దల సభ ముందుకొచ్చాయి. బిల్లుకు ఏర్పడిన అవరోధాలు తొలగి అది పార్లమెంటు ఆమోదం పొందాలని సంతాన లేమితో బాధపడుతూ, సరోగసీ కోసం ఎన్నో జంటలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఎప్పుడో 2008లో బిల్లు పని ప్రారంభం కాగా, చట్టాల రూపకల్పనలో రివాజుగా సాగే జాప్యాన్ని దాటడానికి ఇంతకాలం పట్టింది. దీనిపై ఇంకా సభలో చర్చ జరగాల్సివుంది. బిల్లును అధ్యయనం చేసిన సెలెక్ట్ కమిటీ 15 సూచనలు చేసింది. ఇందులో అద్దె గర్భానికి అంగీకరించే మహిళ, దంపతులకు సమీప బంధువై ఉండాలన్న నిబంధన తొలగించమని చేసిన సూచన కూడా ఉంది. అలాగే మరో కీలకమైన సూచన కూడా చేసింది. వివాహమైన దగ్గర నుంచి అయిదేళ్లపాటు ఎదురుచూశాకే అద్దె గర్భం ప్రత్యా మ్నాయాన్ని దంపతులు ఎంచుకోవాలన్న నిబంధన కూడా సరికాదని కమిటీ అభిప్రాయపడింది. సంతానం అవసరమని భావించే దంపతులు సంతానలేమి ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలన్న నిబంధనను కమిటీ వ్యతిరేకించింది. దీనికి బదులు వైద్యపరంగా వారిని అద్దె గర్భం ద్వారా ‘సంతానం కోరుకునే జంట’గా పరిగణిస్తే సరిపోతుందని తెలిపింది. ‘సంతానం కోరుకునే జంట’ గా ఎవరిని పరిగణించాలన్న విషయమై బిల్లులోని నిబంధనను మార్చాలని కమిటీ సూచించింది. వివాహమైన జంట మాత్రమే సరోగసీకి అర్హులన్న నిబంధన బదులు 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయసుగల మహిళలు వారు విడాకులు తీసుకున్నవారైనా, భర్తను కోల్పోయినవారైనా ఎంచుకునేలా మార్పు చేయాలని సూచించింది. అయితే ఒంటరి పురుషులు, ఒంటరి మహిళలు, సహజీవనం చేస్తున్న జంటలు, స్వలింగసంపర్కులకు బిల్లులో ఉన్న అనర్హత కొనసాగాలని పేర్కొంది. ఈ కేటగిరీలోని వారికి ఇప్పటికే దత్తత చట్టాల ప్రకారం ఎవరినైనా దత్తత తీసుకునే అవకాశం ఉంది. అటువంటప్పుడు సరోగసీలో బిడ్డను పొందే హక్కును వారికి నిరాకరించడంలో హేతుబద్ధత కనబడదు. సరోగసీ సాంకేతికత మొదలయ్యాక మన దేశంలో అది విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది. 2000 సంవత్సరంనాటికి మన దేశాన్ని అందరూ ‘క్రాడిల్ ఆఫ్ ద వరల్డ్’(ప్రపంచ ఊయల) అనేవిధంగా అది వ్యాపించింది. పేదరికం ఉన్నచోట ఏమైనా చేయొచ్చునన్న అభిప్రాయం సంపన్నుల్లో ఉండటం దీనికి కారణం. ఈ అంశాన్ని మొదట ప్రభుత్వం గుర్తించలేదు. మహిళా ఉద్యమకారులు, ఆరోగ్య రంగ కార్యకర్తలు గమనించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. అయినా మరో ఎనిమిదేళ్లకుగానీ బిల్లు రూపొందించే ప్రక్రియ మొదలుకాలేదు. ఆ తర్వాతైనా ఆ పని చకచకా పూర్తికాలేదు. చివరకు బిల్లు తయారైనా అది కేంద్ర మంత్రివర్గం ముందుకు కూడా పోలేదు. ఈలోగా యూపీఏ పాలన ముగిసి, ఎన్డీఏ అధికారంలోకొచ్చింది. అనంతరం 2016లో కేంద్ర మంత్రివర్గం ముందుకు ఈ బిల్లు వచ్చింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉండే పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా ఈ బిల్లును అధ్యయనం చేసి అనేక సవరణలు సూచించింది. ఆ సవరణల్లో చాలావాటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదన్న విమర్శలు వస్తున్న తరుణంలోనే అది లోక్‌సభ ముందు కెళ్లింది. తీవ్ర గందరగోళం మధ్య పెద్దగా చర్చ లేకుండానే ఆమోదం పొందింది. బిల్లు సమగ్రంగా లేదని, సరోగసీకి ఇందులో ఎన్నో పరిమితులు విధించారని రాజ్యసభలో విమర్శలు వచ్చిన నేప థ్యంలో దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించారు. రెండేళ్ల అనంతరం ఇప్పుడు ఆ కమిటీ సిఫా ర్సులు రాజ్యసభ ముందుకొచ్చాయి. బిల్లు త్వరగా చట్టంగా మారితే నిరుపేద అమాయక మహిళ లకు ఇప్పుడెదురవుతున్న అనేకానేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అయితే ఈ క్రమంలో అసలు సరోగసీ కోరుకునే జంటలకు చట్టం సమస్యాత్మకంగా మారకూడదు. ఈ బిల్లుపై మొదటినుంచీ మహిళా సంఘాలనుంచీ, ఆరోగ్యరంగ కార్యకర్తల నుంచి ఎదుర వుతున్న మౌలిక అభ్యంతరాల గురించి సెలెక్ట్ కమిటీ సరిగా పట్టించుకోలేదనే చెప్పాలి. ఉదాహ రణకు సరోగసీ అనేది ‘నిస్వార్థమైనది’గా ఉండాలని బిల్లు నిర్దేశిస్తోంది. బిడ్డను కని ఇచ్చే మహిళకు అవసరమైన వైద్య ఖర్చులకూ, బీమా సౌకర్యం కల్పించడానికి సొమ్ము ఇవ్వాలి తప్ప ఇతరత్రా డబ్బిస్తే అది వాణిజ్యపరమైన సరోగసీ అవుతుందని బిల్లు చెబుతోంది. నిజానికి అన్యులైతే చట్టవిరుద్ధంగా డబ్బు ప్రమేయంతో సరోగసీ సాగుతుందని అనుమానించి, సన్నిహిత బంధువులైన మహిళలు మాత్రమే సరోగసీకి అర్హులని బిల్లులో నిబంధన పెట్టారు. సెలెక్ట్ కమిటీ దీన్ని తొల గించాలని సూచించడం మంచిదే అయినా... ఎవరికోసమో బిడ్డను కని ఇవ్వడానికి ఒప్పుకుని, అందుకోసం తొమ్మిదినెలలపాటు ఎన్నో సమస్యలు ఎదుర్కొనడానికి సిద్ధపడే మహిళ ఆ పని నిస్వార్థంగా చేయాలన్న నిబంధన సరికాదు. దీన్ని కూడా కమిటీ వ్యతిరేకించి ఉంటే బాగుండేది. భారత్‌లో సంతానం లేని జంటల కోసం ఎంతో పెద్ద మనసుతో, త్యాగబుద్ధితో సరోగసీకి సిద్ధపడే మహిళలుంటారన్న భుజకీర్తులకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. డబ్బు లావాదేవీలు మాత్రం చట్టం కన్నుగప్పి సాగుతూనే ఉంటాయి. ఇందులో ఉండే సమస్యేమంటే... తొలుత అంతా మాట్లాడుకుని, ఆ తర్వాత మహిళకు సొమ్ము ఎగ్గొట్టిన పక్షంలో ఆ నిస్సహాయురాలికి చట్టం అండ దండలుండవు. పైగా ఫిర్యాదు చేస్తే ఆమె కూడా చట్టప్రకారం నిందితురాలవుతుంది. కనుక మౌనంగా ఉండిపోవాల్సివస్తుంది. అయితే సరోగసీకి సిద్ధపడే మహిళకు వైద్య ఖర్చులు, బీమా సౌకర్యంతోపాటు పౌష్టికాహార అవసరాలు, గర్భిణిగా ధరించాల్సినవి సమకూర్చుకోవడానికయ్యే ఖర్చుల్ని కూడా ఇవ్వాలన్న నిబంధన కూడా పెట్టాలని కమిటీ సూచించింది. బీమా సౌకర్యం ఇప్పుడున్న 16 నెలలనుంచి, 36 నెలలకు పొడిగించాలన్నది. ఏదేమైనా సరోగసీ బిల్లు రూపకల్పనలో మహిళా కార్యకర్తలు, ఆరోగ్య రంగ కార్యకర్తల అభిప్రాయాలకు చోటిచ్చివుంటే బాగుండేది. -
పెళ్లికాకుండానే తల్లైన ఏక్తాకపూర్..
క్వీన్ ఆఫ్ హిందీ టెలివిజన్‌గా పేరుపొందిన ఏక్తా కపూర్(43) పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు తల్లి అయ్యారు. ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్, ఎమోషనల్ స్టోరీస్ ఇలా వైవిధ్యమైన కథలతో సీరియళ్లను నిర్మిస్తోన్న బాలాజీ టెలీఫిల్మ్స్ అధినేత్రి ఏక్తా కపూర్ జనవరి 27న సరోగసి (అద్దె గర్భం) ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రముఖ నటుడు జితేంద్రకు ఏక్తా కపూర్ కుమార్తె అనే విషయం తెలిసిందే. సరోగసి ద్వారా జితేంద్ర కుటుంబం ఓ బిడ్డకు జన్మను ప్రసాదించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఏక్తా కపూర్ సోదరుడు, నటుడు తుషార్ కపూర్ కూడా సరోగసి ద్వారా ఓ బిడ్డకు తండ్రి అయ్యారు. బడే అచ్చే లగ్తీ హై, కుమ్ కుమ్ భాగ్య, కుండలి భాగ్య, యే మోహబ్బతేన్, కసమ్,తెరే ప్యార్ కి, క్యూంకీ సాస్ బీ కబీ బహు థి సీరియల్స్‌తో ఏక్తా కపూర్ బడా నిర్మాతగా పేరొందారు. ఇక పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి ప్రొడ్యుసర్‌గా నిలదొక్కుకున్నారు. ఆమె నిర్మించిన విద్యాబాలన్ ‘ది డర్టీ పిక్చర్’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కేవలం రూ. 10 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం వంద కోట్లను వసూలు చేసింది. అనంతరం రాగిణి ఎమ్మెమ్మెస్, వీర్ దే వెడ్డిండ్,హాఫ్ గర్ల్ ఫ్రెండ్ తదితర చిత్రాలను సైతం నిర్మించారు ఏక్తాకపూర్. -
విజయవాడలో సరోగసి వివాదం
-
కవలలకు జన్మనిచ్చిన హీరోయిన్!!
‘ఈ క్షణం ఎన్నో భావోద్వేగాలు నన్ను చుట్టుముట్టాయి. పాలు పట్టడం, డైపర్లు మార్చడం, వాళ్లతో ఆడుకోవడం.. ఓ గాడ్.. ఇలా ఒక్కటేమిటి ప్రస్తుతం నాకోసం ఎన్నో పనులు ఎదురుచూస్తున్నాయి. వారిద్దరిని ముంబైకి తీసుకువచ్చే రోజు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానంటూ’ మోడల్, బాలీవుడ్ హీరోయిన్ లీసా రే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. క్యాన్సర్ నుంచి కోలుకున్న రెండేళ్ల తర్వాత(2012) తన చిరకాల మిత్రుడు జాసన్ డేహ్నిని పెళ్లాడారు లీసా. తన వైవాహిక జీవితం ఎన్నో సంతోషాలతో కొనసాగుతోందని.. తన కూతుళ్ల రాకతో అది పరిపూర్ణమైందని భావోద్వేగానికి లోనయ్యారు. అవును లీసా రే ప్రస్తుతం ఇద్దరు ఆడపిల్లలకు తల్లి. అది కూడా కవలలు. జార్జియాలో జన్మించిన తన కవలలు ఇండియాకు రాగానే మనకు పరిచయం చేస్తారట. అదేంటి లీసా రే ఎప్పుడు గర్భం దాల్చారు.. ఆమె పిల్లలు జార్జియాలో జన్మించడమేంటని ఆశ్చర్యపోకండి. అసలు విషయమేమిటంటే.. సరోగసి ద్వారా ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చారు లీసా రే. ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్న లీసా.. తన జీవితంలో ఏదీ ప్రణాళిక ప్రకారం జరగలేదని, అయితే తన భర్త కూతుళ్ల రూపంలో తనకు గొప్ప సర్ప్రైజ్ ఇచ్చారంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని జీవితంలో నిలదొక్కుకున్నానని, క్యాన్సర్ బారిన పడినప్పటి నుంచి, తల్లిగా మారడం దాకా తన ప్రయాణంలో ఎదురైన అనుభవాలను ప్రతీ ఒక్కరికి తెలియజేస్తానన్నారు. ‘రోగాల బారిన పడినంత మాత్రాన.. జీవితం కోల్పోయినట్లు కాదు.. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. వైద్యరంగంలో వచ్చిన మార్పుల వల్ల నేడు అన్నీ సాధ్యమే. అందుకు నేనే ఉదాహరణ. కాబట్టి ఎప్పుడూ నిరాశ చెందవద్దంటూ’ స్ఫూర్తి నింపారు. -
సాక్షి టీవీతో మాట్లాడిన సరోగసి బాధితురాలు
-
విజయవాడలో సరోగసి రాకెట్ గుట్టు రట్టు
-
సరోగసి చేస్తున్నఆస్పత్రులపై చర్యలు తీసుకోండి
-
మలుపులు తిరుగుతున్న విశాఖ అద్దె గర్భం వివాదం
-
బాధితురాలిని పరామర్శించిన కె రాములు
సాక్షి, అక్కయ్యపాలెం (విశాఖ ఉత్తర) : నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో అనుమతి లేకుండా సరోగసి పేరిట అద్దె గర్భాల అక్రమ వ్యాపారం సంచలనం రేపుతోంది. మధ్యవర్తుల చేతుల్లో మోసపోయిన మహిళ ఫిర్యాదుతో ఈసంఘటన వెలుగుచూసింది. తమకు న్యాయం చేయాలంటూ బాధితురాలు నాగలక్ష్మి, మహిళా సంఘాలతో కలసి బుధవారం ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు కె రాములు బాధితురాలిని పరామర్శించారు. జరిగిన ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై కేజీహెచ్ సూపరిటెండెంట్ డాక్టర్ అర్జునను ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ బాధితురాలి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న పద్మజ ఆస్పత్రిపై జిల్లా కలెక్టర్ విచారణ వేయాలని, బాధ్యులైన డాక్టర్లపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని రాములు డిమాండ్ చేశారు. సరోగసి వివాదంపై ఐదుగురు సీనియర్ వైద్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. అందులో దళిత వైద్యుడు సభ్యుడిగా ఉండాలని అన్నారు. బాధితురాలుకి ప్రభుత్వం తక్షణమే ఎనిమిది లక్షల సాయం అందించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి ముగ్గురు పిల్లలకు డిగ్రీ వరకూ సాంఘీక సంక్షేమ శాఖ ఉచిత విద్య అందించాలని అన్నారు. దర్యాప్తుకు సహకరించని అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. -
మరోసారి తెరపైకి సరోగసి వివాదం
-
చనిపోయిన నాలుగేళ్లకు బిడ్డకు జన్మనిచ్చారు..
బీజింగ్ : సాంకేతికత అభివృద్ధి చెందిన తర్వాత అసాధ్యాలన్నీ సుసాధ్యాలైపోతున్నాయి. వైద్య రంగంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన దంపతులు గతేడాది డిసెంబర్ 9న మగశిశువుకు జన్మనిచ్చారు. పిల్లలు లేని దంపతుల పాలిట వరంలా మారిన సరోగసీ విధానం వల్ల ఇది సుసాధ్యమైంది. దీంతో మృతుల తల్లిదండ్రులు మనవడిని పొందగలిగారు. 2013లో చనిపోయిన దంపతుల శిశువుకు సరోగసి ద్వారా ఓ మహిళ జన్మనిచ్చిందని చైనా మీడియా పేర్కొంది. బాబు నానమ్మా తాతయ్యలు అతడికి ‘టయాంటిన్’ అనే ముద్దు పేరు పెట్టారని స్థానిక మీడియాలో వార్తలు ప్రచురితం అవుతున్నాయి. పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది.. సరోగసీ ద్వారా పిల్లల్ని కనడం చైనాలో చట్టవిరుద్ధం. ప్రమాదంలో మరణించిన దంపతుల తల్లిదండ్రులు తమ పిల్లల ప్రతిరూపాన్ని చూడాలని భావించారు. సరోగసీ కోసం వారు లావోస్‌కు చెందిన ఒక మహిళను ఆశ్రయించారు. కానీ ఆ పక్రియ అంతా పూర్తి కావడానికి చట్టపరంగా అనేక చిక్కులు ఏర్పడ్డాయి. సరోగసీ ద్వారా విదేశంలో జన్మించిన పిల్లలు చైనా పౌరులుగా గుర్తింపబడాలంటే డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. పిల్లాడి తల్లి లేదా తండ్రి చైనా పౌరులై ఉంటేనే అతడికి పౌరసత్వం లభిస్తుంది. ఇందుకోసం ఆ సరోగసీ మదర్ని టూరిస్ట్ వీసా మీద చైనాలోని గవాంగూ సిటీలో ఉన్న ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడే ఆమె శిశువుకు జన్మనిచ్చింది. 15 రోజులపాటు ఆస్పత్రిలో ఉన్న పిల్లాడికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడి నానమ్మ తాతయ్యలకు అప్పగించారు. పెద్దయ్యాకే అతడికి నిజం చెప్తాం.. ‘ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి మనవడిని పొందాము. తన పుట్టుక గురించి ఇప్పుడే నిజం చెప్పాలనుకోవడం లేదు. అతను పెరిగి పెద్ద వాడయ్యేంతవరకు తల్లిదండ్రులు విదేశాల్లో ఉన్నారని చెప్తామంటూ’ పిల్లాడి తాతయ్య మీడియాకు వెల్లడించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో సరోగసీని చట్టబద్ధం చేయాలంటూ చైనీయులు వాదిస్తున్నారు. -
జపాన్ కుబేరుడికి భారీ ఊరట
బ్యాంకాక్: బేబీ ఫ్యాక్టరీ కేసులో జపాన్ కుబేరుడికి థాయ్‌లాండ్ కోర్టులో భారీ ఊరట లభించింది. చిన్నారుల అక్రమ వ్యాపారం చేస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త మిట్సుటోకి షింగెటా (28)కి తీపి కబరు వచ్చింది. 13 మంది సర్రొగేట్ చిన్నారుల ఆలనా పాలనా చూసుకునేందుకు అనుమతినిస్తూ థాయ్ కోర్టు తీర్పు వెల్లడించింది. వివరాల్లోకెళ్తే.. జపాన్ కు చెందిన మిట్సుటోకి షింగెటా కుబేరుడు. ఎన్నో వ్యాపార సంస్థల్లో భాగస్వామిగా ఉన్నారు. ఆయనకు వివాహం కాలేదు. అయితే 2014లో బ్యాంకాక్‌లో ఆయనకు చెందిన ఓ అపార్ట్మెంట్లో 13 మంది ఏడాదిలోపు వయసున్న చిన్నారులను పోలీసులు గుర్తించారు. పసివాళ్లను అక్రమ రవాణా చేయడం, చిన్నారులతో ఏదో వ్యాపారం చేస్తున్నారని థాయ్‌లాండ్ పోలీసులు భావించారు. దీంతో ఆ పసివాళ్ల ఆలనాపాలనను ప్రభుత్వం చూసుకునేలా చేశారు. వ్యాపారవేత్త మిట్సుటోకి షింగెటాపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దాదాపు నాలుగేళ్ల అనంతరం ఈ కేసు చివరి విచారణ అనంతరం స్థానిక కోర్టు.. 13 మంది చిన్నారుల ఆలనాపాలనను సరోగేట్ ఫాదర్ మిట్సుటోకి చూసుకోవచ్చునని తీర్పు వచ్చింది. పోలీసులు చిన్నారులను గుర్తించేసమయానికి ఆ పసివాళ్లు ఆరోగ్యంగా ఉన్నారని, వారి ఆలనా పాలనా చూసేందుకు ఏడుగురు మహిళలు ఉన్నారని పోలీసులు కోర్టుకు తెలిపారు. నిందితుడిగా ఉన్న మిట్సుటోకి జపాన్‌కు చెందిన వ్యాపార దిగ్గజమని తమకు అప్పట్లో తెలియదని, ఆయన 9 మంది థాయ్‌లాండ్ మహిళల సాయంతో సరోగసి (అద్దె గర్భం) పద్ధతిలో పిల్లల కోసం చూడగా.. 13 మంది జన్మించారని వివరించారు. అయితే అక్రమంగా సరోగసిని పాటిస్తూ సరోగేట్ మదర్స్ డబ్బులు తీసుకుంటున్నారని, అనంతరం పుట్టిన పిల్లల్ని విదేశాలకు అధిక మొత్తాలకు విక్రయిస్తున్నట్లు తాము భావించినట్లు కోర్టులో పోలీసులు చెప్పారు. ఈ కేసు విచారణ జరుగుతున్నంత కాలం నెలకోసారి చిన్నారుల నానమ్మ(మిట్సుటోకి తల్లి) పసివాళ్లను చూసేందుకు జపాన్ నుంచి వచ్చి వెళ్లేవారు. దాంతోపాటుగా ఆ చిన్నారులకు ఇంగ్లీష్, జపనీస్ భాషలు నేర్పేందుకు ట్యూషన్ టీచర్లను సరోగేట్ ఫాదర్ మిట్సుటోకి నియమించారు. వ్యాపారి మిట్సుటోకికి మొత్తం 17 మంది సంతానం, కాగా వీరంతా సరోగసి పద్ధతిలో జన్మించారు. అయితే నలుగురు సంతానంలో ఇద్దరు భారత మహిళల నుంచి పుట్టిన సంతానం. అయితే బ్యాంకాక్‌లో పోలీసుల ఆకస్మిక దాడులకు ముందే నలుగురు చిన్నారుల్ని జపాన్‌లో విక్రయించిన కొత్త ఇంట్లో మిట్సుటోకి సంరక్షణలో ఉన్నారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత థాయ్ కోర్టు వ్యాపారి మిట్సుటోకి నిర్దోషి అని తేలుస్తూ బ్యాంకాక్ రైడ్‌లో దొరికిన 13 మంది చిన్నారులను సరోగేట్ ఫాదర్‌కు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. 2015లో సరోగసిపై థాయ్‌లాండ్ చట్టాన్ని తీసుకొచ్చి కొన్ని ఆంక్షలు విధించిన విషయం విదితమే. -
చనిపోయిన వ్యక్తి వీర్యంతో కవలలు!
పుణె : చనిపోయిన కూమారుని వీర్యంతో సరోగసి పద్దతి ద్వారా వారసులను పొందారు మహారాష్ట్రాలోని ఓ తల్లి. అమ్మతనానికి నోచుకోని ఎందరో తల్లులు ఆధునిక వైద్య పద్దతుల ద్వారా పిల్లలను కంటున్న విషయం తెలిసిందే. అయితే ఇలా చనిపోయిన వారి వీర్యంతో పిల్లలను కనడం ఇదే తొలిసారి కావచ్చు. తన కొడుకు మరణాన్ని తట్టుకోలేని ఓ తల్లి ఇదే పద్దతిలో వారుసులను పొందారు. పుణెకు చెందిన 27 ఏళ్ల ప్రథమేష్ పాటిల్ పైచదవుల కోసం జర్మనీ వెళ్లాడు. 2013లో ఏదో ఆరోగ్య సమస్యతో పరీక్షలు చేయించుకుంటే తనకు బ్రేయిన్ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. వైద్యులు కీమోథెరపీ చికిత్సను అందించాలన్నారు. ఈ చికిత్స కారణంగా సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్న డాక్టర్లు అతడి అనుమతితో వీర్యం శాంపిళ్లను తీసి భద్రపరిచారు. తొలుత తగ్గినట్లు కనిపించిన క్యాన్సర్ ఒక్కసారిగా తిరగబెట్టింది దీంతో ప్రథమేష్ 2016లో మరణించాడు. అప్పటికి అతనికింకా పెళ్లి కూడా కాలేదు. కొడుకంటే అతని తల్లి రాజ్ శ్రీ పాటిల్‌కు విపరీతమైన ప్రేమ. కొడుకు మరణాన్ని తట్టుకోలేకపోయింది. ఎలాగైనా తన కొడుకు తిరిగి పొందాలనుకుంది. ఈ తరుణంలో వీర్యం దాచిన విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే పుణెలోని సహ్యాద్రి ఆసుపత్రి వైద్యులను సంప్రదించి ఈ విషయం తెలియజేసింది. ఆమె సాయంతో జర్మనీలో భద్రపరిచిన వీర్యాన్ని తెప్పిచ్చిన వైద్యులు ప్రథమేశ్ కుటుంబ సభ్యులలోని ఓ మహిళ నుంచి అండాలు సేకరించి, వాటితో నాలుగు పిండాలను రూపొందించారు. వీటిని తన గర్భంలో ఉంచుకోవటానికి ప్రథమేశ్ తల్లి రాజ్ శ్రీ(49) ముందుకొచ్చినప్పటికి ఆమె శరీరం అనుకూలించదని వైద్యులు పేర్కొన్నారు. దీంతో రాజ్ శ్రీ సోదరి గర్భంలో రెండు పిండాలను గతేడాది మే నెలలో ప్రవేశపెట్టారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో గత సోమవారం ఇద్దరు మగ పిల్లలు(కవలలు) జన్మించారు. దీంతో ప్రథమేశ్ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇలాంటి పద్ధతిన పిల్లల్ని కనడం ఇదే మొదటిసారి కాదని, ఇప్పటివరకు రెండు, మూడు జరిగాయని ఇండియన్ సరోగసీ లా సెంటర్ వ్యవస్థాపకుడు హరిరామసుబ్రమణియన్ తెలిపారు. రాజ్ శ్రీ పాటిల్, ఆమె కూతురు ప్రిషా( పిల్లలు పట్టుకున్నవారు), ప్రథమేష్ ( ఫొటో,ఇన్ సెట్లో) -
నేను ఎవరి బిడ్డని!
-
పసిబిడ్డకు పాలిద్దామన్నా..
⇒ ఆంక్షల వలయంలో సరోగసీ బాధితురాలు ⇒ పుట్టిన బిడ్డను చూడటానికి కూడా అనుమతించని వైనం సరోగసీ (అద్దె గర్భం) అంశం ఇంకా ఓ కొలిక్కిరాలేదు. బాధిత మహిళ చుట్టూ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆమెను కలవడానికి, మాట్లాడటానికి వెళ్లిన ఆమె భర్తను సైతం నిర్దాక్షిణ్యంగా బయటకి గెంటివేస్తున్నారు. ప్రస్తు తం నీలోఫర్‌లో చికిత్స పొందుతున్న బిడ్డను చూసేందుకు కూడా బాధితురాలికి అనుమతినివ్వడం లేదు. అదే మంటే మాకు పైనుంచి ఆదేశాలున్నాయంటూ నిరాకరిస్తున్నారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో అయినవారెవరూ పక్కన లేక, ఒంటరిగా నరకం అనుభవిస్తోందా మహిళ. ఈ వివాదానికి తెరదించాల్సిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, పోలీసు యంత్రాంగం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే... బిడ్డతో పాటు బాధిత దంపతులు, సరోగసీ ద్వారా బిడ్డను కనాలని భావించిన మహిళకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని, రిపోర్టు వచ్చే వరకు బాధిత మహిళను ఆస్పత్రిలోనే ఉంచాలని డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. – సాక్షి, హైదరాబాద్ చిక్కులు రాకుండా పేరు మార్పు.. మహబూబ్‌నగర్ జిల్లా మద్దూర్ మండలం పొల్కంపల్లికి చెందిన బాధితురాలు హయత్‌నగర్‌లో నివాసముంటోంది. గుంటూరుకు చెందిన సుధారాణికి పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో సరోగసీ ద్వారా బిడ్డను కనాలని భావించి... బాధితురాలితో ఒప్పందం కుదుర్చుకుంది. జనన ధృవీకరణ పత్రంలో చిక్కులు రాకుండా బాధితురాలి పేరును సుధారాణిగా అన్ని రిపోర్టుల్లో పేర్కొన్నారు. అయితే ఏడో నెల స్కానింగ్‌లో పుట్టబోయేది ఆడ బిడ్డని తెలిసి సుధారాణి దంపతులు ముఖం చాటేశారు. ఇటీవల బాధితురాలికి నొప్పులు రావడంతో ఆమె భర్త పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అడ్మిషన్ సమయంలో తన భార్యపేరు చెప్పగా, అప్పటికే వెంట తెచ్చుకున్న పాత రిపోర్టులపై మరో పేరు ఉండటంతో వైద్యులు చేర్చుకునేందుకు నిరాకరించారు. దీంతో అసలు విషయం బయటికి వచ్చింది. ఆస్పత్రుల్లో తనిఖీలు.. సరోగసీ ద్వారా జన్మించిన బిడ్డ నిజనిర్ధారణకు అధికార యంత్రాంగం కదిలింది. సోమవారం ‘నేను ఎవరి బిడ్డని’శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన వార్తకు స్పందించిన హైదరాబాద్ జిల్లా వైద్యాధికారులు... బాధితురాలు చికిత్స చేయించుకున్న వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని జేజే ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ పద్మజ... ఆస్పత్రి నిర్వాహకురాలు డాక్టర్ జయంతిరెడ్డి నుంచి వివరాలు సేకరించారు. ఆస్పత్రిలో ఐవీఎఫ్ చెకప్ చేయించుకున్నానని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొందని, కానీ ఆమె చెప్పినట్టుగా ఇక్కడ ఐవీఎఫ్ జరగలేదని పద్మజ తెలిపారు. కంటికి రెప్పలా చూసుకొంటా అధిక మొత్తంలో డబ్బు వస్తుందని ఆశపడి సరోగసీకి అంగీకరించాను. కానీ ఆడ పిల్లని తెలియగానే నన్ను, నా కడుపులో పెరుగుతున్న బిడ్డను ఆ దంపతులు ఒంటరిగా వదిలేశారు. నన్ను మోసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. పుట్టిన బిడ్డకు.. నాకు జన్యుపరంగా సంబంధం లేకపోయినా పేగు తెంచుకుపుట్టింది కనుక తనను వదులుకోను. కంటికిరెప్పలా చూసుకుంటాను. – సరోగసీ బాధితురాలు ఆ పాపను ఎవరికీ ఇవ్వను నాకు తెలియకుండా డబ్బు ఆశ చూపి నా భార్య ను ఇబ్బందులకు గురిచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తా. ఆడ పిల్ల అయినప్పటికీ... పెంచి పోషించుకుంటాను. – బాధితురాలి భర్త మెరుగైన వైద్యం అందిస్తున్నాం... బాధితురాలికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. పాప అనారోగ్యంతో బాధపడుతుండటంతో చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆసుపత్రికి తరలించాం. తల్లి అనారోగ్యంగా ఉంది. ఆమె ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోంది. రికార్డులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి అందజేశాం. విచారణ జరుగుతోంది. – డాక్టర్ నాగమణి, సూపరింటెండెంట్, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి -
నేను ఎవరి బిడ్డని!
► మలుపు తిరిగిన సరోగసీ అమ్మ వివాదం ► ఆ బిడ్డ మా బిడ్డ కాదంటున్న గుంటూరు దంపతులు ► వారి బిడ్డనే మోశానంటున్న శిశువుకు జన్మనిచ్చిన తల్లి ► డీఎన్ఏ పరీక్షల ద్వారానే వివాదం తేల్చాల్సిన పరిస్థితి సాక్షి, హైదరాబాద్ అద్దె గర్భం(సరోగసీ) ద్వారా జన్మించిన ఆ శిశువు ఇప్పటి వరకు కన్నతల్లి మురిపాలకు నోచుకోలేదు. పేగు తెంచుకు పుట్టిన బిడ్డ ముఖాన్ని ఆ తల్లి చూడనేలేదు. అసలు తల్లిదండ్రులు ఎవరో తెలియకుండా పుట్టిన ఆ బిడ్డ ఓ అనాథలా నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే.. ‘సరోగసీ’ ద్వారా బిడ్డను కనాలనుకున్న తల్లిదండ్రులు, ఇందుకు పురమాయించిన వైద్యుల చేతిలో మోసపోయి నాలుగు రోజులుగా పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. సరోగసి ద్వారానే బిడ్డకు జన్మనిచ్చినట్లు బాధితురాలు చెపుతుంటే.. అసలు ఆ బిడ్డకు తమకూ ఎలాంటి సంబంధం లేదని గుంటూరుకు చెందిన దంపతులు చెపుతుండటంతో ఈ అంశం మరింత క్లిష్టంగా మారింది. దీంతో డీఎన్ఏ పరీక్షల ద్వారానే ఎవరి బిడ్డ అనేది తేల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, తన భార్య ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు బాధితురాలి భర్త లక్ష్మణ్ తెలిపారు. ఆ బిడ్డకు, మాకూ ఎలాంటి సబంధం లేదు: సుధారాణి, సరోగసీ ద్వారా బిడ్డ కావాలనుకున్న మహిళ పిల్లలపై ఉన్న మమకారంతో రాజ్‌భవన్ రోడ్డులోని ఓ ఇన్ఫెర్టిలిటీ సెంటర్‌కు వెళ్లాం. అక్కడ అనిత అనే మధ్యవర్తి ద్వారా బాధితురాలు పరిచయమైంది. అద్దె గర్భం ద్వారా శిశువుకు జన్మనిచ్చేందుకు అంగీకరించింది. ఆ మేరకు ఇరువురి మధ్యా ఒప్పందం కుదిరింది. రెగ్యులర్ చెకప్ కోసం ఎస్ఆర్ నగర్‌లోని జేజే ఆస్పత్రికి తీసుకెళ్లాం. సరోగసీ ప్రక్రియ ద్వారా ఆమె గర్భం దాల్చింది. అప్పటి నుంచి ఏడో నెల వరకు నెలవారీ వైద్య పరీక్షలు సహా కడుపులోని బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన పౌష్టికాహారం ఇలా అన్నీ మేమే సమకూర్చాం. ఏమైందో ఏమో ఏడో నెల తర్వాత బాధితురాలు అకస్మాత్తుగా ఫాలోఅప్ చికిత్సకు నిరాకరించింది. అనేకసార్లు ఫోన్ చేసినా ఆమె నుంచి కనీస స్పందన లేదు. నిజానికి బాధితురాలికి జన్మించిన బిడ్డకు మాకూ ఎలాంటి సంబంధం లేదు. పిల్లలు లేని లోటు తీర్చుకునేందుకు మానవతా ధృక్ఫథంతో మేమే ముందుకు వచ్చాం. బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేస్తే అసలు తల్లిదండ్రులు ఎవరో తెలుస్తుంది. ఒకవేళ ఆమెకు జన్మించిన బిడ్డ జన్యువు మా దంపతుల జన్యువుతో పోలి ఉంటే తీసుకెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ల బిడ్డనే మోసాను: వెంకటమ్మ, సరోగసీ ద్వారా శిశువుకు జన్మనిచ్చిన తల్లి నవమాసాలు మోసి కన్నబిడ్డ పుట్టుక గురించి ఏ తల్లీ అబద్ధం చెప్పదు. ఇప్పటికే ఒక బాబుకు జన్మనిచ్చి పెంచుతున్న తల్లిని నేను. నిజానికి పేదరికం వల్ల డబ్బుకు ఆశపడి ఈ ప్రక్రియకు అంగీకరించాను. తొలుత ఈ విషయం నా భర్తకు కూడా తెలియదు. ఏడో నెల తర్వాత గుంటూరు దంపతులు నన్ను జేజే ఆస్పత్రికి తీసుకెళ్లి స్కానింగ్ చేయించారు. స్కానింగ్ చేసిన డాక్టర్ కడుపులో పెరుగుతోంది ఆడబిడ్డ అని చెప్పింది. అప్పటి వరకు అన్నీ తామై వ్యవహరించిన ఆ దంపతులు ఆడబిడ్డ అని తెలిసి ముఖం చాటేశారు. అనేకసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. ఒకవేళ నాకు, నా భర్తకే ఈ బిడ్డ పుట్టి ఉంటే.. సాదుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. నన్ను మోసం చేసిన దంపతులు, వైద్యులపై చర్యలు తీసుకుని పుట్టిన బిడ్డకు న్యాయం చేయాలి. అలా నిర్థారించడం నేరం:డాక్టర్ రమేశ్‌రెడ్డి, డీఎంఈ కడుపులో పెరుగుతుంది ఆడో, మగో నిర్థారించడం చట్టరీత్యా నేరం. అలా చేసిన డయాగ్నోస్టిక్పైనే కాదు సంబంధిత వైద్యులపైనా కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవచ్చు. నిజానికి దేశంలో సరోగసీ విధానంపై స్పష్టమైన నిబంధనలు లేవు. కొంతమంది వైద్యులు దీన్ని అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ కేసును పోలీసులే తేల్చాలి. నేను ఐవీఎఫ్ చేయను: డాక్టర్ జయంతి, గైనకాలజిస్ట్, జేజే ఆస్పత్రి మా ఆస్పత్రిలో బేసిక్ ఇన్ఫెర్టిలిటీ చికిత్సలు, సాధారణ, సిజేరియన్ ప్రసవాలు, ఇతర గైనిక్ సంబంధిత చికిత్సలు తప్ప.. ఐవీఎఫ్, సరోగసీ వంటి చికిత్సలు లేవు. బాధితులు ఆరోపిస్తున్నట్లు మా ఆస్పత్రిలో ఎలాంటి లింగనిర్థారణ పరీక్షలు చేయలేదు. అసలు వారెవరో కూడా మాకు తెలియదు. పుట్టిన బిడ్డకు, ఆ ఘటనకు మాకు ఎలాంటి సంబంధం లేదు. -
అద్దె గర్భానికి అన్యాయం
దిక్కుతోచని స్థితిలో అనాథగా మారిన ‘సరోగసీ’ మహిళ ► హైదరాబాద్‌లో చట్టవిరుద్ధంగా సరోగసీ ప్రక్రియ చేసిన ఓ ప్రైవేటు ఆస్పత్రి ► పుట్టబోయేది ఆడపిల్ల అని నిర్దాక్షిణ్యంగా వదిలేసిన సదరు దంపతులు ► ఆ ఆస్పత్రి కూడా పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి సాక్షి, హైదరాబాద్ సరోగసీ (అద్దెగర్భం) ప్రక్రియ మరో అమాయక మహిళ పాలిట శాపంగా మారింది. గర్భంలో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలియడంతో ‘సరోగసీ’ దంపతులు ఆమెను నిర్దాక్షిణ్యంగా వదిలేశారు. పుట్టేబిడ్డకు, మాకు ఎలాంటి సంబంధం లేదంటూ అర్ధంతరంగా వెళ్లిపోయారు. సరోగసీ ప్రక్రియను చేసిన వైద్యులూ ఆమెను మోసం చేశారు. నెలలు నిండి దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఆమె హైదరాబాద్‌లోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో చేరింది. మూడు రోజుల కిందట పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. నా అన్నవారు లేక, పట్టించుకునే వారు లేక, అనారోగ్యంతో సతమతమవుతోంది. అయితే ఈ సరోగసీ, మోసం విషయం బయటపడకుండా ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం పేట్లబురుజు ఆస్పత్రిలో ఆమెను అత్యవసర విభాగంలో ఉంచి, అటువైపు ఎవరూ వెళ్లకుండా భద్రత ఏర్పాటు చేయడం గమనార్హం. వదిలేసి వెళ్లిపోయిన దంపతులు మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన ఓ మహిళ (24) భర్తతో విభేదాల కారణంగా కొంతకాలంగా భర్త నుంచి దూరంగా ఉంటోంది. ఆమెకు ఏడాది కింద ఓ మధ్యవర్తి ద్వారా గుంటూరు జిల్లాకు చెందిన దంపతులు పరిచయమయ్యారు. వారికి పిల్లలు లేకపోవడంతో.. సరోగసీ విధానంలో వారికి బిడ్డను కనిచ్చేందుకు అంగీకారం కుదిరింది. ఇందుకు మరో మహిళ మధ్యవర్తిగా వ్యవహరించింది. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రాంతంలో ఉన్న ఓ ఆస్పత్రిలో ‘సరోగసీ’ప్రక్రియను చేయించుకున్నారు. సుధారాణికి 8వ నెల వచ్చే వరకు అంతా బాగానే ఉంది. అయితే 9వ నెలలో స్కానింగ్ చేసినప్పుడు పుట్టబోయేది ఆడపిల్ల అని ఆ ఆస్పత్రి వైద్యులు చెప్పారు. దీంతో బిడ్డను పొందాలనుకున్న దంపతులు ‘సరోగసీ’మహిళను అర్ధంతరంగా వదిలేశారు. పుట్టబోయే బిడ్డకు తమకు సంబంధం లేదంటూ వెళ్లిపోయారు. సరోగసీ ప్రక్రియ చేసిన ప్రైవేటు ఆస్పత్రి ఆ మహిళను రానివ్వలేదు. పేట్లబురుజు ఆస్పత్రిలో అనాథలా.. ఆ మహిళకు ప్రసవ నొప్పులు రావడంతో సరోగసీకి మధ్యవర్తిగా వ్యవహరించిన మరో మహిళ ఆమెను హైదరాబాద్‌లోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రికి తీసుకొచ్చింది. ఈ నెల 20న మధ్యాహ్నం 12 గంటలకు ఆస్పత్రిలో చేర్చగా.. మధ్యాహ్నం 2.40 గంటలకు పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. పాప 2.9 కేజీల బరువుతో ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే తల్లి మాత్రం తీవ్ర రక్తహీనతతో బాధపడుతూ.. అనారోగ్యంతో ఉందని తెలిసింది. అయితే చట్టవిరుద్ధంగా ‘సరోగసీ’, మోసం విషయాలు బయటపడకుండా ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందులో భాగంగా తల్లీబిడ్డలను ప్రత్యేకంగా ఐసీయూలో ఉంచారని.. ఎవరూ అటువైపు వెళ్లకుండా భద్రత ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ‘సాక్షి’ప్రతినిధులు బాధిత మహిళను కలవడానికి బంధువులమంటూ వెళ్లినా సిబ్బంది అనుమతించలేదు. ఇలా బయటపడింది సుధారాణికి సాధారణ ప్రసవం జరిగి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నా కూడా.. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆ పాపను నర్సరీ విభాగానికి పంపారు. నర్సులు పాపను నర్సరీకి తీసుకెళ్లగా.. అక్కడి ఇన్చార్జి వైద్యురాలు బిడ్డను పరిశీలించి, ‘ఆరోగ్యంగానే ఉంది కదా.. ఎందుకు తెచ్చారు?’అని నిలదీశారు. పాప వివరాలన్నీ ఇవ్వాలని కోరగా.. నర్సులు పత్రాలన్నీ తెచ్చి ఇచ్చారు. వాటిని పరిశీలించిన వైద్యురాలు... ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సరోగసీ ద్వారా బాధిత మహిళ గర్భం దాల్చినట్లు గుర్తించారు. ఆరోగ్యంగా ఉన్న పాపను నర్సరీలో ఉంచాల్సిన అవసరం లేదని, తల్లివద్దే ఉంచాలని స్పష్టం చేశారు. దీంతో పాపను ఐసీయూకు మార్చారు. పాపకు ఏమైనా అయితే తీవ్ర సమస్యలు వస్తాయని.. తల్లీబిడ్డ డిశ్చార్జి అయ్యేవరకు కంటికి రెప్పలా కాపాడాలని సూపరింటెండెంట్ పీజీ వైద్యులకు సూచించినట్లు ఓ పీజీ విద్యార్థిని ‘సాక్షి’కి తెలిపారు. గుట్టుగా విచారణ పేట్లబురుజు ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగమణి బాధిత మహిళ అంశంపై జిల్లా వైద్యాధికారికి, చార్మినార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చార్మినార్ పోలీసులు, జిల్లా వైద్యాధికారి శుక్రవారమే పేట్లబురుజు ఆస్పత్రికి వచ్చి బాధితురాలితో మాట్లాడారు. కానీ ఈ విచారణ గుట్టుగా సాగడం గమనార్హం. కాగా బాధిత మహిళను ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశముందని సమాచారం. కేసును నీరుగార్చే యత్నం నిబంధనలకు విరుద్ధంగా సరోగసీ చేసి, ఇప్పుడు వదిలేసిన ఆస్పత్రి యాజమాన్యం, దంపతుల విషయం బయటపడకుండా ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకోసమే ఈ విషయంలో గోప్యత పాటిస్తున్నారని పేట్లబురుజు ఆస్పత్రి సిబ్బందే పేర్కొంటున్నారు. మీరైనా ఆ మహిళకు న్యాయం చేయాలని ‘సాక్షి’ప్రతినిధితో వారు వాపోవడం గమనార్హం. ప్రస్తుతం బాధిత మహిళకు సరోగసీలో మధ్యవర్తిగా వచ్చిన మహిళే సహాయకురాలిగా ఉందని.. ఆమె వెళ్లిపోతానంటే పోలీస్ కేసు పెడతామని బెదిరించడంతో ఉండిపోయిందని వారు తెలిపారు. -
ఆ ఆసుపత్రివన్నీ ఉల్లంఘనలే
♦ సరోగసీ ద్వారా పక్కా వ్యాపారం చేస్తోంది ♦ సాయికిరణ్ ఆసుపత్రిపై హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని సాయికిరణ్ హాస్పిటల్–కిరణ్ సంతాన సాఫల్య కేంద్రం పలు ఉల్లంఘనలకు పాల్పడిందని, సరోగసీ ద్వారా అది పక్కా వ్యాపారం చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. అల్ట్రాసౌండ్ స్కాన్స్, సంతాన సాఫల్యం కోసం అనుమతులు తీసుకుని సరోగసీ కేంద్రాలు నడుపుతోందని తెలిపింది. అంతేకాక ఈ ఆసుపత్రి శరణార్థి శిబిరాన్ని తలపిస్తోందని వివరించింది. ఆ ఆసుపత్రికి షోకాజ్ నోటీసు జారీ చేశామంది. ఈ కేంద్రంలో ఉన్న డాక్టర్ సమిత్శేఖర్ ఎంబీబీఎస్ వైద్యుడు మాత్రమేనని, ఎంబ్రోలజిస్ట్ సర్టిఫికేట్‌ను అతను చూపలేకపోయారని వివరించింది. అతనే మొత్తం సరోగసీ ప్రక్రియకు సంబంధించిన కార్యకలాపాలను పూర్తి చేస్తుంటారని వెల్లడించింది. గైనకాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, యూరాలజిస్ట్, క్లినికల్ ఎంబ్రోలజిస్ట్, ఇతర కౌన్సెలర్లు లేకుండా ఈ ఆసుపత్రిని నడిపిస్తున్నారని పేర్కొంది. ఆ తల్లుల పరిస్థితేమిటి? సాయికిరణ్ హాస్పిటల్– కిరణ్ సంతాన సాఫల్య కేంద్రంలో సరోగసీ వ్యాపారం చేస్తున్నారంటూ పోలీసులు ఇటీవల ఆసుపత్రిని సీజ్ చేసినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. అక్కడ ఉన్న సరోగసీ తల్లుల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్‌కుమార్ కెయిత్... తన ఆవేదనను లేఖ రూపంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్ ముందుంచారు. ఆయన ఆదేశాల మేరకు ఈ లేఖను రిజిస్ట్రీ పిల్‌గా మలిచింది. దీనిపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది బీఎస్ ప్రసాద్ ఈ వ్యవహారానికి సంబంధించిన నివేదికను ధర్మాసనం ముందుంచారు. ఈ నివేదికను పరిశీలించిన ధర్మాసనం.. సరోగసీ తల్లులు ఉన్న సాయికిరణ్ ఆసుపత్రిని సీజ్ చేశారా? అని ప్రశ్నించింది. లేదని ప్రసాద్ తెలిపారు. ఒకవేళ మూసివేయాలని నిర్ణయం తీసుకుంటేæ, వారి పరిస్థితి ఏమిటన్నదే తమ ఆందోళనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒకవేళ ఆసుపత్రి మూసివేసినా తల్లుల సంరక్షణకు తాము అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ప్రసాద్ తెలిపారు. ఇదే సమయంలో కొందరు సరోగసీ తల్లుల తరఫున, వారి గర్భంలో తమ బిడ్డలు ఉన్నారంటూ కొందరు దంపతులు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్లపై కూడా ధర్మాసనం విచారణ జరిపింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సాయికిరణ్ ఆసుపత్రితో పాటు ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశిస్తూ, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. నిపుణుల కమిటీ వేశాం... ఆసుపత్రిలో మొత్తం 48 మంది సరోగసీ తల్లులు ఉన్నారని, వారు తమ శాశ్వత చిరునామాలను తెలియచేసేందుకు నిరాకరించారని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 4 బెడ్ల సంతాన సాఫల్య కేంద్రం కోసం అనుమతి తీసుకుని, 50కి పైగా పడకల ఆసుపత్రి నిర్వహిస్తున్నారంది. సరోగసీ ఒప్పంద వివరాలు కూడా నమోదు చేయడం లేదంది. వీటిని బట్టి చూస్తే ఇక్కడ పిల్లల అక్రమ రవాణా జరుగుతుందేమోనన్న అనుమానం కలుగుతోందని తెలిపింది. హైకోర్టు ఆదేశాల మేరకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని, వారు సరోగసీ తల్లులు, సరోగసీ కోసం వేచిచూస్తున్న మొత్తం 47 మంది మహిళలను పరీక్షించారంది. -
సాయికిరణ్ ఆస్పత్రి లైసెన్స్ రద్దు
హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా సరోగసీ (అద్దె గర్భం) సేవలు అందిస్తున్న సాయికిరణ్ ఆస్పత్రి లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు డీఎమ్హెచ్వో వెల్లడించారు. ఇప్పటివరకూ 400 నుంచి 500 మందికి సరోగసి చేసినట్లు నిర్థారణ అయిందని, వాటికి సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా సాయికిరణ్ ఆస్పత్రి ప్రధాన గేటుకు నిర్వాహకులు తాళాలు వేశారు. ఆస్పత్రిలో పని చేస్తున్న వైద్యుల పేర్లు బయటకు రాకుండా జాగ్రత పడుతున్నారు. లోపల ఉన్నవారు బయటకు రాకుండా...బయటవారు లోనికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కనీసం ఆ చుట్టుపక్కల ఎవరూ కనిపించకుడా జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా శనివారం రాత్రి ఆస్పత్రిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించిన 48మంది గర్భిణుల పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఇంటికి వెళ్లలేక, ఆస్పత్రిలో ఉండలేక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇప్పటికే రికార్డులను సీజ్ చేశారు. రెండు రోజుల్లో ఆస్పత్రిని కూడా సీజ్ చేసే అవకాశం ఉండటంతో ... గర్భిణులు ఆరోగ్య పరిస్థితి, భవిష్యతులో వారికి అందించే వైద్య సేవలు, పుట్టిన పిల్లలను ఎవరికి అప్పగించాలి అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 14లోని ‘సాయికిరణ్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్’లో అక్రమ సెరోగసీలు జరుపుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. అక్కడ అద్దె గర్భాన్ని మోస్తోన్న 48 మంది మహిళలను పోలీసులు గుర్తించారు. వారిలో 16 మంది తెలుగు మహిళలే కావడం గమనార్హం. ఆయా గర్భాలకు సంబధించిన రికార్డుల్లో అవకతవకలున్నట్లు అధికారులు గుర్తించారు. -
హైదరాబాద్‌లో సంచలనం: ప్రఖ్యాత ఆస్పత్రి మూసివేత
- అక్రమ ‘సెరోగసీ’లపై సర్కారు ఉక్కుపాదం - సాయికిరణ్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్ సీజ్.. రికార్డుల స్వాధీనం - ఉలిక్కిపడ్డ వైద్యరంగం.. త్వరలోనే మరిన్ని దాడులు? హైదరాబాద్: అడ్డగోలుగా సెరోగసీ(అద్దెగర్భం) ఆపరేషన్లు నిర్వహిస్తోన్న ప్రముఖ ఆస్పత్రిపై ప్రభుత్వాధికారులు దాడిచేసి, సీజ్ చేసిన వ్యవహారం సంచలనంగా మారింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ‘సాయి కిరణ్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్’పై శనివారం సాయంత్రం టాస్క్‌ఫోర్స్ పోలీసులు, వైద్యారోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 14లోని ‘సాయికిరణ్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్’లో అక్రమ సెరోగసీలు జరుపుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడిచేశారు. అక్కడ అద్దె గర్భాన్ని మోస్తోన్న 48 మంది మహిళలను పోలీసులు గుర్తించారు. వారిలో 16 మంది తెలుగు మహిళలే కావడం గమనార్హం. ఆయా గర్భాలకు సంబధించిన రికార్డుల్లో అవకతవకలున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారాలు నడుస్తుండటంతో ఆస్పత్రిని సీజ్ చేశారు. వచ్చేది రూ.40 లక్షలు.. ఇచ్చేది రూ.3లక్షలు ‘సాయికిరణ్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్’ గతంలోనూ 70కిపైగా సెరోగసీ ఆపరేషన్లు నిర్వహించినట్లు టాస్క్‌ఫోర్స్-హెల్త్ డిపార్ట్మెంట్ సంయుక్త దాడిలో వెల్లడైంది. నేపాల్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన కస్టమర్లు పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించి బిడ్డలను పొందినట్లు తెలిసింది. సాయికిరణ్ ఆస్పత్రి నిర్వాహకులు.. ఒక్కో కస్టమర్ నుంచి రూ.40 లక్షల వరకూ వసూలు చేశారని సమాచారం. అదే సమయంలో అద్దె గర్భాన్ని మోసే మహిళలకు మాత్రం అతిస్వల్పంగా రూ.3 లక్షలు మాత్రమే ఇచ్చేవారని తెలిసింది. భారతదేశంలో బహుగా విస్తరిస్తోన్న సెరోగసీలపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు కొద్ది నెలల కిందటే స్పష్టమైన ఆదేశాలు వెలువరించింది. వాటి ప్రకారం రక్త సంబధీకులు, సమీప బంధువులు మాత్రమే అద్దెగర్భాన్ని మోసేందుకు అర్హులవుతారు. -
67 ఏళ్ల వయసులో బిడ్డను కంది!
తన కూతురి కోసం.. ఓ తల్లి ఎవరూ చేయని సాహసం చేసింది. 67 ఏళ్ల వయసులో సరొగేట్ తల్లిగా మారి.. ఓ ఆడబిడ్డను కంది. దాంతో ప్రపంచంలోనే అత్యంత పెద్దవయసులోని సరొగేట్ తల్లిగా ఆమె నిలిచింది. ఈ ఘటన గ్రీస్‌లో జరిగింది. ఏడున్నర నెలల గర్భం అనంతరం సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీశారు. ఆ బిడ్డ పుట్టినప్పుడు 1.2 కిలోల బరువుంది. ఇప్పుడు తనకు తల్లిలా కంటే అమ్మమ్మలాగే ఎక్కువ అనిపిస్తోందని అనస్టాసియా ఓంటు అనే ఆ వృద్ధురాలు చెప్పారు. ఈమె మధ్య గ్రీస్‌లోని లారిసా అనే గ్రామానికి చెందినవారు. గర్భం దాల్చిన సమయంలో తాను కొన్ని సమస్యలు ఎదుర్కొన్నానన్నారు. తన కూతురు సొంత బిడ్డను కనలేదని తెలిసినప్పుడు ఆమె గుండె పగిలేలా ఏడ్చిందని అనస్టాసియా అన్నారు. విషయం ఏమిటంటే.. ఆమె కూతురు కాన్స్టాంటినా (43) కేన్సర్ కారణంగా 2009లోనే మరణించింది. అంతకుముందు ఆమెకు ఏడుసార్లు గర్భం పోయింది. దాంతో.. ఆమె చనిపోవడానికి ముందు.. ఆమె బిడ్డకు తాను తల్లినవుతానని చెబితే ఏమాత్రం నమ్మలేకపోయిందని, కానీ తాను చాలా ధైర్యం చేసి ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అంతర్జాతీయ రికార్డులను బట్టి చూస్తే, ఇప్పటివరకు ఇంత పెద్ద వయసులో సరొగేట్ మదర్‌గా ఎవరూ లేరని ఆమెకు వైద్యం అందించిన డాక్టర్ పాంటోస్ తెలిపారు. ఇది ప్రత్యేకమైన కేసు కావడంతో కోర్టు కూడా అనుమతి తెలిపిందని, ఆ తర్వాత తాను ముందుకెళ్లానని ఆయన వివరించారు. -
సరొగసీ ద్వారా బిడ్డను కంటా: హీరోయిన్
ఇప్పటికే ఇద్దరు బిడ్డలున్న హీరోయిన్ కిమ్ కర్దాషియాన్.. ఈసారి సరొగసీ పద్ధతిలో మూడో బిడ్డను కనాలని భావిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించింది. ఇప్పుడు తాను సరొగసీ విధానాన్ని అవలంబించాలని కచ్చితంగా నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపింది. 'కీపింగ్ అప్ విత్ ద కర్దాషియాన్స్' అనే కొత్త ఎపిసోడ్ ప్రోమో విడుదల సందర్భంగా ఆమె ఈ విషయాన్ని చెప్పింది. అయితే.. కిమ్ నిర్ణయం విని ఆమె తల్లి క్రిస్ జెన్నర్ షాకయ్యారు. కిమ్ కర్దాషియాన్ (36)కు ఇప్పటికే భర్త కేన్ వెస్ట్‌తో కలిసి నార్త్ వెస్ట్ అనే కూతురు, సెయింట్ వెస్ట్ అనే కొడుకు ఉన్నారు. ఇప్పుడు మూడో బిడ్డను కనడానికి గర్భం దాల్చే ఓపిక లేదో ఏమోగానీ.. సరొగసీ విధానం అయితే మంచిదని ఆమె అనుకుంటోంది. -
సరోగసీ బిల్లుపై సూచనలకు సిద్ధం: నడ్డా
న్యూఢిల్లీ: కేంద్రం ఆమోదించిన సరోగసీ (అద్దెగర్భం) బిల్లు ముసాయిదాపై విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో అందులో సూచనలను చేర్చటానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం పేర్కొంది. పిల్లలను వదిలిపెట్టటం, మహిళలను దోపిడీ చేయడం వంటి కీలక అంశాలపై మరో మాటకు అవకాశమే లేదని తేల్చిచెప్పింది. పౌరులపై నైతిక విలువలను రుద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న విమర్శలను కేంద్ర ఆరోగ్యమంత్రి నడ్డా తిరస్కరించారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఇది ధర్మబద్ధతకు సంబంధించినదని ఈ రంగంలో సాంకేతిక పురోగతిని సరైన దృక్కోణంతో వినియోగించుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. -
సరోగసీ బిల్లు! ఆమిర్, షారుఖ్‌కు సుష్మా చురకలు
న్యూఢిల్లీ: పిల్లలు లేని దంపతులకు వైద్యశాస్త్రం అందించిన వరం అద్దె గర్భం (సరోగసీ) విధానం. అయితే, ఈ విధానాన్ని దుర్వినియోగం చేస్తూ పెద్ద ఎత్తున వ్యాపారం సాగుతున్న నేపథ్యంలో.. ఈ వ్యాపారాన్ని పూర్తిగా నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం సరోగసి చట్టాన్ని తీసుకువస్తున్నది. బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. సరోగసీ కోసం పిల్లలు లేని దంపతులు ఇతర మహిళల గర్భాలను అద్దెకు తీసుకోవడం కుదరదు. ఇందుకోసం వారు తమ బంధువులు, లేదా తెలిసిన వారి సహాయం మాత్రమే తీసుకొనే అవకాశం ఉంటుంది. 'వాణిజ్య సరోగసీపై పూర్తి నిషేధం ఉంటుంది. వైద్యపరంగా పిల్లలు పొందలేని దంపతులు తమ సన్నిహిత బంధువుల సాయం తీసుకొని సరోగసీ ద్వారా పిల్లల్ని పొందొచ్చు. దీనిని అల్ట్రుయిస్టిక్ సరోగసీ అంటారు' అని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ విలేకరులకు తెలిపారు. ఈ బిల్లుప్రకారం విదేశీయులు, ప్రవాస భారతీయులు, సింగల్ పెరెంట్, సహజీవనం చేసే దంపతులు, స్వలింగ సంపర్కులు సరోగసీ విధానం ద్వారా పిల్లలు పొందడానికి ఇకమీదట అనుమతించబోరు. 'ఓ జంట పెళ్లిచేసుకొని, కనీసం ఐదేళ్లు కలిసి జీవిస్తేనే' సరోగసీ విధానం అనుమతిస్తామని, వారికి ఇప్పటికే ఓ సంతానం ఉంటే ఇందుకు అనుమతించబోమని సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. సెలబ్రిటీలకు సుష్మా చురకలు! తాజాగా తీసుకొచ్చిన సరోగసి బిల్లులో సెలబ్రిటీలకు ఎలాంటి మినహాయింపు ఉండబోదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్లకు ఇద్దరేసి సంతానం ఉన్నా.. సరోగసి విధానం ద్వారా మరో బిడ్డను పొందిన సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్న మరో బాలీవుడ్ హీరో తుషార్ కపూర్ కూడా సరోగసీ విధానంలో బిడ్డను కన్నాడు. ఈ నేపథ్యంలో ఇలాంటి విధానాలను ఇకముందు అనుమతించబోమని కేంద్రం తాజా బిల్లుతో తేల్చిచెప్పింది. మీడియా సమావేశంలో ఈ సెలబ్రిటీల పేర్లను సుష్మా ప్రస్తావించకపోయినా.. వారికి పరోక్షంగా చురకలు అంటించారు. 'ఇద్దరేసి పిల్లలు ఉన్నప్పటికీ సెలబ్రిటీలు సరోగసీ ద్వారా మరో బిడ్డను కన్నారు. వాళ్ల భార్యలు పిల్లల్ని గర్భంలో మోసే బాధను పొందలేరు కనుక వేరే మహిళల మీద ఆ భారాన్ని మోపారు' అని సుష్మా పేర్కొన్నారు. అదేవిధంగా అద్దెగర్భాన్ని మోసినందుకు సన్నిహిత బంధువు అయిన మహిళకు వైద్యఖర్చులు మాత్రమే చెల్లించాలని, అంతేకానీ ఎక్కువమొత్తంలో ఆశ చూపకూడదని ఈ బిల్లు స్పష్టం చేస్తున్నది. -
పెళ్లి కాకుండానే తండ్రి అయిన హీరో!
‘గోల్మాల్’ సిరీస్ సినిమాలను చూసిన వారికి.. అందులో మూగసైగల అభినయంతో, చిత్రవిచిత్రమైన ధ్వనులతో ఆకట్టుకున్న తుషార్ కపూర్ గుర్తుండిపోతాడు. బాలీవుడ్లో లోప్రొఫైల్ మెయింటెన్ చేసే ఈ హీరో తాజాగా తండ్రి అయ్యాడు. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయిన తుషార్.. సరోగసీ (అద్దె కడుపు), ఐవీఎఫ్ విధానంలో తనకు కొడుకు పుట్టినట్టు తెలిపాడు. గతవారం పుట్టిన ఈ చిన్నారికి లక్ష్య అని పేరు పెట్టామని, ప్రస్తుతం ఇంటికి చేరిన లక్ష్య ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పాడు. ‘తండ్రి కావడం నాకెంతో ఆనందంగా ఉంది. తండ్రి అయ్యానన్న సంతోషం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లక్ష నా జీవితంలోకి రావడం మాటలకు అందని ఆనందాన్ని ఇస్తోంది. నా జీవితాన్ని ఎంతో ఆనందాయకంగా ఇది మార్చబోతోంది. దేవుడి అపారమైన దయ వల్ల, జస్లోక్ (ఆస్పత్రి) వైద్యసిబ్బంది అద్భుతమైన కృషి వల్ల ఇది సాధ్యమైంది. సింగల్ పెరెంట్ కు (భాగస్వామి లేకుండా పిల్లల్ని కనాలనుకునే వారికి) ఇది నిజంగా గొప్ప ప్రత్యామ్నాయం’ అని తుషార్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. బాలీవుడ్ లో తొలి సింగల్ పెరెంట్ గా తుషార్ నిలిచాడు. అలనాటి హీరో జితేంద్ర-శోభాకపూర్ కూడా తమకు మనవుడు పుట్టడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సరోగసీ, ఐవీఎఫ్ విధానం ద్వారా కొడుకును కనాలన్న తమ తనయుడు తుషార్ నిర్ణయాన్ని వారు స్వాగతించారు. తుషార్ ఎంతో బాధ్యతాయుతమైన, స్వతంత్ర దృక్పథం కలిగిన వ్యక్తి అని, అతడు ‘లక్ష్య’కు గొప్ప తండ్రి అవుతాడని చెప్పారు. -
మనవరాలికి జన్మనిచ్చిన అమ్మమ్మ...
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్ లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. కూతురి కోసం నవమాసాలు మోసి ఓ బిడ్డకు కని కూతురుకి కానుకగా ఇచ్చింది. చెప్పాలంటే చిన్నారి కెల్సీ మెక్ కిస్సాక్ చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే ఈ చిన్నారికి జన్మనిచ్చింది ఆమె తల్లి కాదు, అమ్మమ్మ. దాంతో కెల్సీకి అమ్మమ్మ ట్రెసీ థాంప్సన్ అమ్మ అయినట్లయింది. సాధారణంగా తాము అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య అవుతున్నారంటే వారి ఆనందానికి అవధులు ఉండవు. తన కూతురి నుంచి మనవరాలిని పొందితే ఆనందించాలని ఓ మహిళ భావించింది. కానీ, కూతురు కెల్లీ మెక్ కిస్సాక్కి కాస్త ఆనారోగ్య కారణాల వల్ల సంతానోత్పత్తి సమస్యలు తలెత్తాయి. కూతురుకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. కెల్లీ, ఆరోన్ దంపతులు చాలా ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. సరోగసి విధానమే వారికి ఉన్న చివరి మార్గమని వైద్యులు సూచించారు. ఈ పరిస్థితుల్లో పెద్ద మనసు చేసుకుని అద్దె గర్భానికి అంగీకరించింది. సరోగసి విధానం ద్వారా మనవరాలికి జన్మనిచ్చింది. ఈ జీవితంలో నాకు మా అమ్మ ట్రెసీ థాంప్సన్ చాలా పెద్ద బహుమతి ఇచ్చిందని కెల్లీ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. తనకు తల్లిని అయ్యే అవకాశం లేనిపక్షంలో తన బిడ్డలకు జన్మనివ్వాలని టీజేజ్లో ఉన్నప్పుడు కెల్లీ తన తల్లిని ఆటపట్టిస్తూ ఉండేది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగాలేనందున మా అమ్మ ఇచ్చిన మాట నేర్చుకుందని చెప్పుకొచ్చింది. బుధవారం ట్రేసీ మెక్ కిస్సాక్ మూడున్నర కిలోగ్రాముల ఆరోగ్యకరమైన చిన్నారికి జన్మనిచ్చింది. ఈ విషయాలను ఆ కుటుంబసభ్యులు మీడియాతో పంచుకున్నారు. అనారోగ్య సమస్యలతో పిల్లల్ని నేరుగా కనలేని తల్లిదండ్రులకు సరోగసి విధానం ద్వారా బిడ్డల్ని పొందడం ఉత్తమమని కెల్లీ, ఆరోన్ దంపతులు సహా చిన్నారికి జన్మనిచ్చిన ట్రెసీ థాంప్సన్ అంటున్నారు. -
అబద్ధపు గర్భం.. ఆరునెలల జీతం
సాక్షి, హైదరాబాద్: ‘‘సార్ డాక్టర్ గారూ.. నేను ప్రభుత్వ ఉద్యోగినిని. నేను విదేశాలకు వెళ్లాలి. కనీసం ఆరు నెలల సెలవు కావాలి. మీరు సహాయం చేయాలి’’ అని ప్రభుత్వ ఉద్యోగిని అడగ్గానే ‘‘ సరేనమ్మా, నీకు ప్రసూతి సెలవు వచ్చేలా పత్రాలు సృష్టిస్తాను. నాకు ఒక నెల జీతం ఇవ్వాలి’’ అని డాక్టర్లు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇలా కొంతమంది డాక్టర్లు, ఉద్యోగినులు కలసి ప్రభుత్వాన్ని మోసగిస్తున్నారు. గర్భిణులైన ఉద్యోగినులకు ప్రభుత్వం జీతంతో కూడిన ఆరు నెలల సెలవు మంజూరు చేస్తుంది. ఈ నిబంధనను ఆసరాగా తీసుకుని కొంతమంది ఉద్యోగినులు.. తాము గర్భిణులమంటూ డాక్టర్ల సాయంతో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ఆరు నెలలు సెలవులు ఎంజాయ్ చేయడంతో పాటు జీతాన్ని కూడా తీసుకుంటున్నారు. ఆ తర్వాత తమ గర్భం పోయిందనో, లేక బిడ్డ చనిపోయాడనో తప్పించుకుంటున్నారు. రాష్ట్రంలో ఇలా సెలవులు తీసుకున్నా వారు వందలాది మంది ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు ఎన్ఓసీ (నిరభ్యంతర పత్రం) కూడా తీసుకోకుండా విదేశాలకూ వెళ్లిరావడం ఆశ్చర్యపరుస్తోంది. శ్రీకాకుళం ఘటనపై విచారణ.. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఓ ఉపాధ్యాయురాలు గర్భిణి కాకుండానే మెటర్నిటీ సెలవుకు దరఖాస్తు చేసుకుని సెలవు తీసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆ జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. తనకు బిడ్డ పుట్టాడని, పుట్టిన తొమ్మిది రోజులకు చనిపోయాడని విచారణలో ఆ ఉద్యోగిని చెప్పింది. దీనిని శ్రీకాకుళం రిమ్స్‌కు చెందిన సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్థాయి వైద్యుడు ధ్రువీకరించారు. అయితే కలెక్టర్ విచారణలో ఆమెకు గర్భం అబద్ధమని, వైద్యుడు ఇచ్చిన నివేదిక కూడా తప్పు అని తేలింది. అంతేగాకుండా వైద్యుడిపైనా ఫిర్యాదులురావడంతో అతనిపైనా విచారణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. తీగలాగితే డొంకంతా కదిలింది. ఆ వైద్యుడికి ఆ ఉద్యోగిని భారీగా ముట్టజెప్పినట్లు తెలిసింది. ఇలాంటి కేసులు ఇంకా ఎన్నున్నాయో ఆరా తీయాలని కలెక్టర్ ఆదేశించారు. దీన్నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు ఆ వైద్యుడు నానా తంటాలు పడుతున్నారు. కేసునుంచి బయటపడేందుకు ఒక మంత్రి పేషీని ఆశ్రయించినట్టు తెలుస్తోంది. డబ్బులిస్తే.. ధ్రువపత్రాలు వైద్యులను ఆశ్రయిస్తే చాలు గర్భిణి కాకపోయినా సరే ధ్రువపత్రాలు సృష్టిస్తారు. నెలనెలా వైద్య పరీక్షలు చేయించుకున్నట్టు, మందులు వాడినట్టు కూడా రికార్డులు సృష్టిస్తారు. అయితే దీనికోసం ఉద్యోగినులు ఒక నెల వేతనం ఇవ్వాలి. ప్రసవం డేటు, బిడ్డ పుట్టిన వివరాలు అన్నీ అలా సృష్టించేస్తారు. ఆ పత్రాలన్నీ ప్రభుత్వానికి సమర్పిస్తే చాలు, ఆరునెలల సెలవులు ఎంజాయ్ చేస్తూ జీతం తీసుకోవచ్చు. ఒక నెల జీతమే కదా పోతే పోనీ అని చాలామంది వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి ఘటనలు బయటికి వస్తున్నా రాజకీయ ఒత్తిళ్లతో ఇలాంటి నకిలీ కేసులపై చర్యలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా నాలుగైదు వందల మంది ఇలాంటి సెలవులు తీసుకుంటున్నట్లు అంచనా. -
భారతీయ దంపతులకు మాత్రమే....
-
భారతీయ దంపతులకు మాత్రమే....
న్యూఢిల్లీ: సరోగసిని భారతీయ దంపతులకు మాత్రమే అనుమతిస్తామని, విదేశీయులకు అనుమతించబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు బుధవారం అఫిడవిట్ సమర్పించింది. 'కమర్షియల్ సరోగసిని ప్రభుత్వం అనుమతించబోదు. ఇండియాలో విదేశీయులకు సరోగసి సేవలు అందుబాటులో ఉండవు' అని అఫిడవిట్ లో కేంద్రం పేర్కొంది. కమర్షియల్ సరోగసి కోసం అండం దిగుమతి చేసుకోవడంపైనా నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. అయితే పరిశోధనల కోసం వినియోగించే వాటిపై ఆంక్షలు ఉండవని స్పష్టం చేసింది. అలాగే అద్దెగర్భం ద్వారా జన్మించిన వికలాంగ శిశువులను తీసుకునేందుకు నిరాకరించే దంపతులకు జరిమానా విధించాలని భావిస్తున్నట్టు సుప్రీంకోర్టుకు కేంద్ర సర్కారు తెలిపింది. సరోగసి విధానాన్ని వ్యాపార వస్తువుగా మార్చకుండా చేసేందుకు రూపొందించిన ముసాయిదాను రాష్ట్రాలను పంపినట్టు వెల్లడించింది. అద్దెగర్భం ద్వారా శిశువులకు జన్మనిచ్చిన మహిళల ప్రయోజనాలు కాపాడేందుకు, కమర్షియల్ సరోగసిని నియత్రించేందుకు సమగ్ర చట్టం తేవాల్సిన అవసరముందని కేంద్రం అభిప్రాయపడింది.కాగా, దీనిపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 24కు వాయిదా వేసింది. -
ఆ ‘అమ్మ’కు సెలవొద్దా?
ముంబై: అద్దె గర్భం (సరోగసీ) ద్వారా బిడ్డను కంటే ప్రసూతి సెలవుకు అర్హులు కారా? పిండాన్ని మోయనంత మాత్రాన పసిగుడ్డును సాకేందుకు అలాంటి అమ్మకు సెలవు అక్కర్లేదా? ఇవ్వకపోవడం న్యాయమా? ఎందుకొచ్చిందీ ప్రశ్న: సెంట్రల్ రైల్వేలో పనిచేస్తున్న ఓ నర్సుకు ఎదురైంది ఇలాంటి పరిస్థితి. 2004లో ఆమెకు పెళ్లయింది. 2007లో రెండుసార్లు ఐవీఎఫ్ చేయించుకుంటే... గర్భం దాల్చింది. అయితే 2008లో ఆరునెలల గర్భం పోయింది. మళ్లీ రాకపోవడంతో సరోగసీ ఉత్తమమని డాక్టర్లు ఆమెకు సూచించారు. దాంతో ఆమె (తాను గర్భం దాల్చే అవకాశం లేనపుడు తన అండాన్ని, భర్త వీర్యకణాలతో ఫలదీకరించి... పిండాన్ని అద్దె తల్లి గర్భంలో ప్రవేశపెడతారు. అద్దెతల్లి నవమాసాలు ఆ పిండాన్ని మోసి శిశువుకు జన్మనిస్తుంది) సరోగసీ ద్వారా బిడ్డకు కనేందుకు ఒకామెతో ఒప్పందం చేసుకుంది. ఇదిలా ఉండగా... గర్భం (అద్దె అమ్మ) దాల్చిన మూడునెలల నుంచే తనకు మెటర్నిటీ సెలవు (పూర్తిజీతంతో 180 రోజులు), శిశు సంరక్షణ సెలవు (పూర్తి జీతంతో 180) రోజులు ఇవ్వాలని సదరు నర్సు ఏడాది సెలవుకు దరఖాస్తు చేసుకోగా... రైల్వే నిరాకరించింది. కావాలంటే సెలవులో వెళ్లొచ్చని... అంతిమంగా రైల్వే బోర్డు నుంచి అనుమతి రాకపోతే ‘జీతం లేని సెలవు’ (లాస్ ఆఫ్ పే)గా పరిగణిస్తామని సెంట్రల్ రైల్వే సమాధానమిచ్చింది. ఉత్తరప్రత్యుత్తరాలు నడుస్తుండగానే ఆమెకు జనవరి 29న కవలలు జన్మించారు. ఇద్దరు బిడ్డల ఆలనాపాలనా చూసుకునేందుకు ఈ అమ్మకు సెలవు అక్కర్లేదా? ఏం చేసింది: సదరు నర్సు కోర్టుకెక్కింది. తనకు సెలవు ఇవ్వకపోవడం అన్యాయమని బాంబే హైకోర్టులో పిటిషన్ వేసింది. నాలుగు వారాల్లో స్పందించాలని బాంబే హైకోర్టు... కేంద్ర ప్రభుత్వం, రైల్వేకు నోటీసులు జారీచేసింది. చట్టాలను పునఃసమీక్షించాల్సిందే: ఇలాంటి ఉదంతాలెన్నో మన చట్టాలను పునఃసమీక్షించాల్సిన అవసరాలను నొక్కిచెబుతాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు చట్టాలను మార్చుకుంటే... ఇలా ఓ అమ్మ సెలవు కోసం సుదీర్ఘంగా పోరాడాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాదు. -
సరొగసీలోనూ.. అమ్మాయి వద్దు!!
వాళ్లు ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటారు. తమకు ఒక బిడ్డే ఉండటంతో సరొగసీ పద్ధతి ద్వారా మరోబిడ్డ కావాలనుకున్నారు. భారతదేశంలో అయితే చవగ్గా వీలవుతుందని భావించి.. ఇక్కడకు వచ్చారు. సరొగేట్ తల్లికి ఇద్దరు పండంటి బిడ్డలు పుట్టారు. వాళ్లలో ఒకళ్లు బాబు, మరొకళ్లు పాప. అయితే ఆస్ట్రేలియన్ జంట మాత్రం తమకు అమ్మాయి వద్దు, అబ్బాయి మాత్రమే కావాలని మంకుపట్టు పట్టారు. పిల్లలిద్దరినీ తీసుకెళ్లాలని భారతదేశంలో ఉన్న ఆస్ట్రేలియా రాయబార కార్యాలయం అధికారులు వాళ్లకు ఎంతగా చెప్పినా కూడా వినిపించుకోలేదు. కేవలం లింగ వివక్ష కారణంగానే ఆ జంట తమ సరొగేట్ పాపను భారతదేశంలో వదిలిపెట్టేసినట్లు ఆస్ట్రేలియన్ హై కమిషన్ ఆ దేశంలోని ఫ్యామిలీ కోర్టుకు తెలిపింది. పిల్లలిద్దరినీ స్వదేశానికి తీసుకెళ్లాలని చెప్పి.. కొన్నాళ్లు వీసా ఇవ్వడం కూడా ఆలస్యం చేసినా ఫలితం దక్కలేదు. ఆ జంటకు అప్పటికే ఒక బిడ్డ ఉంది. మరో బిడ్డ కావాలని సరొగసీ కోసం వచ్చారు. కానీ పుట్టిన ఇద్దరు పిల్లల్లో కేవలం మగ పిల్లాడిని మాత్రమే తీసుకుని వెళ్లిపోయారు. దీంతో ఇలాంటి కేసులపై గట్టి విచారణ జరిపించాలని ఆస్ట్రేలియాలోని ఫ్యామిలీ కోర్టు నిర్ణయించింది. అయితే ఆస్ట్రేలియన్ జంట మాత్రం.. తాము ఒక బిడ్డ సరిపోతుందని అనుకున్నామని, కానీ కవలలు పుట్టడంతో తమకు ఒకళ్లు చాలనుకుని మగ పిల్లాడిని తీసుకెళ్లామని అంటున్నారు. అప్పటికే తమకు ఒక పాప ఉండటంతో బాబును తీసుకెళ్లామన్నారు. -
పబ్లిక్ లైఫ్ ఓ సర్కస్..మీడియాపై షారుక్ మండిపాటు
ముంబై: సర్కస్ లాంటి ప్రజా జీవితంలో తన కుమారుడు అబ్ రామ్ భాగం కానివ్వనని బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం సర్రోగసి పద్దతి ద్వారా షారుక్ దంపతులకు అబ్ రామ్ జన్మించిన సంగతి తెలిసిందే. అబ్ రామ్ ను బయటకు తీసుకు వెళ్లడానికి తనకు ఇష్టం ఉండదు. ఓకవేళ తాను ఇంట్లోకి రావడానికి అనుమతిస్తే వచ్చి చూడండి అంటూ తీవ్రంగా స్పందించారు. ఫ్లాష్ లైట్ల కోసమే అబ్ రామ్ లేడని.. సర్కస్ లాంటి పబ్లిక్ జీవితంలో భాగస్వామిని చేయబోనని ఓ వార్తా ఏజెన్సికిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 34 వారాలకే పట్టిన తన కుమారుడు అనారోగ్యానికి గురై ఎక్కువ కాలం ఆస్పత్రిలోనే ఉన్నాడు. ఆసమయంలో కేరీర్ లో ఎప్పుడూ ఎదర్కోనంతగా అత్యంత క్లిష్టమైన పరిస్థితి, క్షణాల్ని ఎదుర్కొన్నాను. అనారోగ్యానికి గురైన పసిపిల్లాడి జీవితంతో మీడియా ఓ సమస్యగా చిత్రీకిరించింది. ఆ సంఘటనలు అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా.. అగౌరవపరిచాయని షారుక్ ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఓ సినీ నటుడ్ని కావాలంటే నాతో అమర్యాదగా ప్రవర్తించండి.. నాపిల్లలతో కాదు అంటూ షారుక్ ఘాటుగా స్పందించారు. ఒకవేళ నా కుమారుడు అబ్ రామ్ తో బయటకు రావాలనిపించినపుడు తప్పకుండా ప్రజా జీవితంలోకి తీసుకువస్తాను అని అన్నారు. -
సర్రోగసి ద్వారా తల్లైన మంచు లక్ష్మీ
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుమార్తె, సినీ తార లక్ష్మీ ప్రసన్న సర్రోగసి ద్వారా ఓ బిడ్డకు తల్లైంది. సర్రోగసి విధానం ద్వారా లక్ష్మి తల్లైనట్టు మోహన్ బాబు అధికారికంగా ట్విట్టర్ లో కూడా పేర్కొన్నారు. తన కూతురు తల్లి కావడం పట్ల మోహన్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. మంచు కుటుంబంలో పండుగ వాతావారణం నెలకొన్నట్టు తెలుస్తోంది. నా ప్రియమైన సోదరికి సర్రోగసి ద్వారా ఆడకూతురు పట్టింది. మామగా నాకు ప్రమోషన్ లభించింది అని మంచు మనోజ్ ట్విటర్ లో ట్వీట్ చేశారు. "రేపు మధ్నాహ్నం ఓ ముఖ్యమైన విషయాన్ని ప్రకటించబోతున్నా. నాకు, నా కుటుంబానికి అది చాలా ఆనందకరమైన వార్త'' అంటూ నిన్న (14.06.) డా. మోహన్ బాబు తన ట్విట్టర్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. సర్రోగసి అంటే అద్దె గర్బం ద్వారా పిల్లల్ని కనే విధానం. ఇటీవల బాలీవుడ్ లో షారుక్ దంపతులు సర్రోగసి విధానం ద్వారా బిడ్డను కన్నారు. God had been kind.@LakshmiManchu my darling daughter has been blessed with a Baby Girl. Through surrogacy. One of the best moment of my life — Mohan Babu M (@themohanbabu) June 15, 2014 God had been kind.@LakshmiManchu my darling sister has been blessed with a Baby Girl. Through surrogacy. Thank u god:) I'm Mama now -
మన్మోహన్ సింగ్ 'సర్రోగసి' ప్రధాని: యశ్వంత్ సిన్హా
మన్మోహన్ సింగ్ సర్రోగసి ప్రధాని అంటూ బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పదేళ్ల తన హయాంలో మన్మోహన్ సింగ్ ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేకపోవడం సర్రోగసికి ఉదాహరణ అని ఆయన అన్నారు. భారత్ ను సర్రోగసి పాలిస్తోందనడంలో వాస్తవం ఉంది అని సిన్హా అన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు భారత ప్రధానులందరూ లోకసభ సభ్యులైన తర్వాతే ప్రధాని పీఠం ఎక్కారని ఆయన తెలిపారు. ఇందిరాగాంధీ ప్రధాని బాధ్యతలు చేపట్టే సమయానికి రాజ్యసభ సభ్యులని.. అయితే ఆతర్వాత ఆమె లోకసభ ఎంపికయ్యారన్నారు. ప్రధాని మన్మోహన్ ఒక్కరే పదేళ్ల కాలం ప్రధాని పదవి చేపట్టి.. ఒక్క ఎలక్షన్ లో కూడా పోటి చేయని వ్యక్తిగా చరిత్రలో మిగిలారని ఎద్దేవా చేశారు. ప్రధాని మన్మోహన్ కు సర్రోగసి అనే పదాన్ని ఉపయోగించడం తప్పేమి కాదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ లో పాల్గొన్న యశ్వంత్ సిన్హా ప్రధానిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. -
షారుక్ ఖాన్ దంపతులకు బాంబే కోర్టు నోటీసులు
లింగ నిర్ధారణకు సంబంధించిన కేసులో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ లకు బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సర్రోగసీ ద్వారా బిడ్డను కనడానికి లింగ నిర్ఱారణ పరీక్షలు జరిపించారంటూ దాఖలు చేసిన పిటిషన్ కు వ్యతిరేకంగా మేజిస్ట్రేట్ తీర్పు నివ్వడాన్ని సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త కోర్టుకు దృష్టికి తీసుకువచ్చారు. తమ మూడవ బిడ్డ అబ్ రామ్ ను కనడానికి లింగ నిర్ఱారణ పరీక్షలు జరిపించారని వర్ష దేశ్ పాండే ఆరోపణలు చేశారు. కేసుపై విచారణ చేసి షారుక్ దంపతులకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) క్లీన్ చిట్ ఇచ్చింది. బీఎంసీ ఇచ్చిన పత్రాలను, సర్రోగసి ప్రాసెస్ ఆధారంగా కోర్టు తమ పిటిషన్ తిరస్కరించిందని దేశ్ పాండే తరపు న్యాయవాది తెలిపారు. తమ పిటిషన్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ముంబై కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో జస్టిస్ ఆర్ పీ సందర్ బల్దోట షారుక్, గౌరీ ఖాన్, జస్లోక్ హస్పిటల్ లకు నోటీసులు జారీ చేశారు. జనవరి 10 తేదిన కేసుపై విచారణను చేపట్టనున్నారు. -
అమ్మతనపు కమ్మదనానికి ‘వెల్కమ్ ఒబామా’
తారాగణం: ఊర్మిళ, రేచల్, ఎస్తాబన్, సంజీవ్... దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు నిర్మాతలు: భారతీ, కృష్ణ మాతృమూర్తులు రెండు రకాలు. కన్నతల్లి, పెంచిన తల్లి. ఇతిహాసాలు సైతం ఈ ఇద్దరు తల్లుల గురించే ప్రస్తావించాయి. అమ్మ అనే భావన... బిడ్డల మూలకణాలు, జీన్స్ వంటి సాంకేతిక అంశాలకు అతీతం. తన శరీరాన్ని చీల్చుకొని బయటకొచ్చిన బిడ్డ జాతి గురించి, మతం, జీన్స్ గురించి అమ్మ ఆలోచించదు. శాస్త్ర, సాంకేతిక పరంగా అమెరికా లాంటి దేశాలు ఎంతైనా అభివృద్ధి చెందనీ, మనిషి జన్మకు సంబంధించినంతవరకూ ఎన్ని దారులైనా వెతకనీ.. కానీ అమ్మ మాత్రం అమ్మే. నవ మాసాలూ మోసి, కని... తన రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డను సాకే తల్లికి ప్రత్యామ్నాయాన్ని మాత్రం ఎవరూ కనిపెట్టలేరు. శాస్త్రాలకు అందని మాయ అమ్మ. అందుకే ‘మాతృదేవోభవ’ అంది మన దేశం. ‘వెల్కమ్ ఒబామా’ సినిమాలో సింగీతం చెప్పింది అదే. సింగీతం శ్రీనివాసరావు నుంచి సినిమా వస్తుందంటే... కచ్చితంగా అందులో ఏదో కొత్తదనం ఉంటుందనేది ప్రేక్షకుల నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు సింగీతం. ఇప్పటివరకూ తెలుగు తెరపై రాని ఓ కొత్త ప్రయోగంతోనే మళ్లీ ప్రేక్షకులను పలకరించారు. ఆ ప్రయోగం ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే ముందు కథలోకెళదాం. లూసీ అనే విదేశీయురాలికి అద్దె గర్భం(సరోగసి) ద్వారా తన బిడ్డకు జన్మనిచ్చే ఓ అద్దె తల్లి అవసరం అవుతుంది. దాంతో ఇండియాలోని కొందరు దళారుల్ని ఆశ్రయిస్తుంది. వారి ద్వారానే యశోద గురించి తెలుసుకుంటుంది. యశోదకు డబ్బు చాలా అవసరం. తన పెంపుడు కూతురు ఆపరేషన్ నిమిత్తం ఆమెకు అర్జంట్‌గా లక్ష రూపాయిలు కావాలి. దాంతో తన గర్భం ద్వారా లూసీ బిడ్డకు జన్మనీయడానికి యశోద అంగీకరిస్తుంది. అన్నీ సక్రమంగా జరుగుతాయి. లూసీ దంపతుల బిడ్డ యశోద కడుపులో పడుతుంది. నెలలు నిండుతాయి. యశోదను మెడికల్ చెకప్‌కి తీసుకెళుతుంది లూసీ. యశోద కడుపులోని బిడ్డ వైకల్యంతో పుట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో షాక్‌కు గురవుతుంది. అలాంటి బిడ్డ తనకొద్దంటుంది. ప్రసవానంతరం బిడ్డను ఆనాథ శరణాలయంలో పడేయమని యశోదకు డబ్బు కూడా ఇవ్వబోతుంది. కానీ యశోద మాత్రం ఒప్పుకోదు. అందరూ ఉన్న తన బిడ్డ అనాథ ఎలా అవుతాడని లూసీని నిలదీస్తుంది. కానీ లూసీ మాత్రం ఆ బిడ్డ తనకొద్దంటూ అక్కడ్నుంచీ వెళ్లిపోతుంది. తీరా యశోదకు ఎలాంటి లోపం లేని చక్కని మగబిడ్డ పుడతాడు. ఆ తెల్లజాతి బిడ్డకు ‘కృష్ణ’ అని పేరు పెట్టుకొని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటుంది యశోద. కొన్నేళ్లు గడుస్తాయి. ఓ రోజు లూసీ మళ్లీ యశోద ముందు ప్రత్యక్షమవుతుంది. తన బిడ్డను తనకిచ్చేయమంటుంది. యశోద గుండె బద్దలైనంత పనవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది మిగిలిన కథ. అమ్మ గొప్పదనాన్ని చూపిస్తూ, అంతర్లీనంగా దేశం గొప్పతనాన్ని వివరిస్తూ నవ్యరీతిలో సింగీతం ఈ కథను నడిపించిన తీరు అభినందనీయం. భావోద్వేగాలు కూడా కథానుగుణంగా సాగాయి. కొన్ని సన్నివేశాల్లో అయితే... కళ్లు చెమర్చాయి. భారతమాతకు మరోరూపంలా యశోద పాత్రను, అమెరికాకు ప్రతిరూపంగా లూసీ పాత్రను మలిచారు సింగీతం. యశోద పాత్రలో మరాఠి నటి ఉర్మిళ చూపిన నటన అమోఘం. లూసీ క్యారెక్టర్లో రేచెల్(యూకే) ఫర్వాలేదనిపించింది. కృష్ణ పాత్రలో బాలనటుడు ఎస్తాబాన్ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంతో రచయితలు భువనచంద్ర, అనంత శ్రీరామ్, బలభద్రపాత్రుని రమణి నటులుగా మారారు. అసహజమైన వారి హావభావాలు ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్ష. తెల్లని కాగితంపై నల్లని మచ్చలా ఉంది వారి ఎపిసోడ్. సింగీతం స్క్రీన్‌ప్లే, సంగీతం రెండూ బావున్నాయి. దర్శన్ కెమెరా, రోహిణి మాటలు సినిమాకు అదనపు ఆకర్షణలు. భారతీకృష్ణ నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. హైబ్రిడ్ చిత్రాలు రాజ్యమేలుతున్న ప్రస్తుత సమయంలో వచ్చినఈ మంచి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఏ మేర ఆదరిస్తారో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ప్లస్: దర్శకత్వం, కథ, మాటలు, ఛాయా గ్రహణం, ఊర్మిళ నటన మైనస్: ముగ్గురు రచయితల ఎపిసోడ్ -
షారుక్ సర్రోగసి బేబి సూపర్: అమితాబ్
రంజాన్ పండుగ పురస్కరించుకుని మన్నత్ నివాసంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్న అమితాబ్ బచ్చన్ షారుక్ ఖాన్ సర్రోగసి బేబి అబ్ రామ్ ని కలిశాడు. మే 27న అబ్ రామ్ జన్మించిన సంగతి తెలిసిందే. అబ్ రామ్ ఆరోగ్యం సరిగా లేని కారణంగా మీడియాకు ఇతరులకు దూరంగా ఉంచారు. అబ్ రామ్ సూపర్. చాలా బాగున్నాడు. ముద్దొచ్చాడు అని ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఈద్ పార్టీకి బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. -
షారుఖ్‌పై ముంబై కోర్టులో ఫిర్యాదు
ముంబై: సరోగసీ (అద్దె గర్భం) ద్వారా ఇటీవల బిడ్డను పొందే క్రమంలో బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ దంపతులు గర్భస్త శిశువుకు లింగనిర్ధారణ పరీక్షలు జరిపించారని... అందువల్ల వారిపై చర్యలు తీసుకోవాలంటూ ముంబైలోని కోర్టులో ఫిర్యాదు నమోదైంది. లింగ నిర్ధారణ ఎంపిక నిషేధ చట్టం నిబంధనలను షారుఖ్ దంపతులు ఉల్లంఘించారని వర్షా దేశ్‌పాండే అనే న్యాయవాది కోర్టులో గురువారం ఈ ఫిర్యాదు చేశారు. తన ఆరోపణలపై బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడం వల్లే కోర్టును ఆశ్రయించినట్లు దేశ్‌పాండే పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపడతామని సెప్టెంబర్ 12న చేపడతామని కోర్టు తెలిపింది. దీనిపై స్పందన తెలపాలంటూ షారుఖ్ దంపతులతోపాటు మున్సిపల్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. -
‘అబ్రామ్’ మీడియాకు దూరంగా ఉండటమే మంచిది : షారుక్
‘ఈ రంజాన్ పండగ చాలా ప్రత్యేకమైనది’ అని ముంబైలోని తన నివాసం 'మన్నత్' లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ అన్నాడు. రంజాన్ పండగ రోజు తాను నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ విడుదలతోపాటు..ఓ అద్బుతమైన చిన్నారి అబ్రామ్ తమ కుటుంబంలోకి రావడం చాలా ఆనందంగా ఉంది అని అన్నాడు. ఇలాంటి ఆనందక్షణాలు తనకు మరింత ఉత్సాహాన్ని అందిస్తున్నాయని, గత తొమ్మిది రోజులుగా చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉండటం కారణంగా తాను సరిగా నిద్ర కూడా పోలేదని, అయినా తాను చాలా ఎనర్జిటిక్ ఉన్నానని అన్నారు. మే 27 తేదిన సర్రోగసి ద్వారా షారుఖ్ ఓ బిడ్డకు తండ్రి అయిన విషయం తెలిసిందే. సర్రోగసి వివాదం షారుక్‌ను ఇంకా వెంటాడుతున్నట్టే కనిపిస్తోంది. తన కుమారుడు అబ్రామ్ను మీడియా ప్రపంచానికి దూరంగా ఉంచాలని అనుకుంటున్నానని.. అంతకంటే ఎక్కువగా మాట్లాడదలచుకోలేదని అని అన్నాడు. ఇప్పటికే అబ్రామ్పై చాలామంది ఎక్కువగానే మాట్లాడారని, అయితే ఆ సమయంలో అసత్యాలు మాట్లాడుకోవడం కాస్తా బాధేసింది అని అన్నాడు. తన జీవితంలోకి ప్రవేశించిన చిన్నారిపై అవాస్తవాలు మాట్లాడటంతో మానసిక క్షోభ అనుభవించానన్నారు. తన కుమారుడు అబ్రామ్ గురించి కాని, ఆరోగ్యం గురించి కాని మాట్లాడటానికి నిరాకరించాడు.